పాట్నా: బిహారలో సంపూర్ణ మధ్య నిషేధం విధిస్తూ 2016లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్‌లో లో గుజరాత్, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాలు మద్యపాన నిషేధం విధించగా.. నాలుగో రాష్ట్రంగా బిహార్ నిలిచింది. తాజాగా సీఎం నితీష్ కుమార్ మద్యపాన నిషేదంపై శుక్రవారం మధుబనిలో జరిగిన ఓ సభలోనూ ప్రసంగిస్తూ.. మహిళల డిమాండ్ మేరకే తాను మద్యపాన నిషేధంపై నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేశారు.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసరాగా చేసుకున్న రాష్ట్ర పోలీసులు కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల బీహార్ పోలీసుల బృందం పాట్నాలోని నవ వధువు గదిలోకి వెళ్లి మద్యం కోసం వెతికారు. ఆ సమయంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా రాష్ట్రంలో ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మరోసారి కొత్తగా పెళ్లైన వధువు గదిలోకి చొరబడి పోలీసులు దాడులు నిర్వహించారు. వైశాలి జిల్లా పోలీసులు హాజీపూర్ నగరంలోని హతసర్‌గంజ్ ప్రాంతంతో ఉన్న శీల దేవీ ఇంటిపై గురువారం రాత్రి సోదాలు నిర్వహించారు.
చదవండి: 18 ఏళ్లకు ఆడపిల్ల ప్రధానిని ఎన్నుకోగలిగితే... పెళ్లెందుకు చేసుకోకూడదు!
అయిదు రోజుల క్రితం తన కొడుకుతో వివాహం చేసుకున్న ఆమె కోడలు బెడ్‌రూమ్‌పై దాడి చేశారు. శీలా కుమారి కోడలు పూజా కుమారి తన బెడ్ రూమ్‌లో ఉండగా.. మహిళా పోలీసుల లేకుండానే పోలీసుల బృందం అక్కడికి వచ్చారు. తన గదిలోకి వెళ్లి ప్రతి చోట వెతికారు. బెడ్, అల్మారా, సూట్‌కేసులతో సహా రూమ్ అంతా సెర్చ్ చేశారు. తన గదిలో ఏం వెతుకుతున్నారని కోడలు పూజా పోలుసులను ప్రశ్నించగా.. సైలెంట్‌గా ఉండాలని పోలీసులు అసభ్యంగా మాట్లాడారు.
చదవండి: ఒక్క నెలలో కోటిమందికి పైగా.. ఎయిర్‌లైన్స్ చరిత్రలో మరో రికార్డు
ఈ విషయంపై పూజా మాట్లాడుతూ..గదిలో దాచిపెట్టిన మద్యం బాటిళ్ల కోసం వెతుకున్నారని పోలీసులు చెప్పినట్లు తెలిపింది. అయితే ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను తట్టుకోలేక ఆమె అత్త స్పృహ తప్పి పడిపోయినప్పటికీ పోలీసులు తమ సోదాలు కొనసాగించారని వెల్లడించింది. పోలీసుల దాడుల అనంతరం స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నామని తెలిపింది. తమ కుటుంబంలో ఎప్పుడూ మద్యం సేవించిన దాఖలాలు లేవని, అయినా పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేశారని వాపోయింది. ఇదిలా ఉండగా ఈ ఘటనపై స్పందించేందుకు వైశాలి ఎస్‌ఎస్పీ మనీష్ కుమార్ నిరాకరించారు.
చదవండి: జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్.. ఊపందుకున్న ఉద్యమం
Comments
Please login to add a commentAdd a comment