అద్దంపై ప్రేమలేఖ! | Love letter on the mirror! | Sakshi
Sakshi News home page

అద్దంపై ప్రేమలేఖ!

Published Tue, Dec 15 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

అద్దంపై ప్రేమలేఖ!

అద్దంపై ప్రేమలేఖ!

ఆమె అతడిని పట్టించుకోలేదు. కానీ అతడు ఆమెను పట్టించుకున్నాడు. ఆమె తనకు కావాలనుకున్నాడు. అమె అంటే తనకు ఎందుకంత ఇష్టమో చెబుతూ ఆమె బెడ్ రూమ్ అద్దంపై రాశాడు. ఆమైనా చూస్తుందో లేదో అనుకున్నాడు. కానీ ఇప్పుడు దాన్ని ప్రపంచమంతా చూస్తున్నారు. దాంపత్యానికి అర్థం, బాంధవ్యానికి పరమార్థం చెప్పే అతని రాతల షేర్ వాల్యూ సోషల్ మీడియాలో చాలా పెరిగిపోయింది. లాస్ ఏంజెలెస్‌లోని టిమ్ మర్ఫీ భార్య... మోలీ మర్ఫీ డిప్రెషన్‌లో ఉంది. ఆమె తన డిప్రెషన్‌తో అతడిని చాలా బాధపెట్టింది.

అయినా ఆమె పరిస్థితిని అర్ధం చేసుకున్న టిమ్ ఆమెను బాగు చేసేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగానే ఆమెను తానెందుకు ప్రేమిస్తున్నాడో చెప్పే నోట్‌ను ఆమె అద్దంపై రాశాడు. ఆమె చూడదేమోననుకున్నాడు. కానీ మోలీ దాన్ని చూసింది. చలించింది. ఆమెలో మార్పు మొదలైంది. తన భర్త నోట్‌ను ఇమ్గుర్ అనే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన మూడు రోజుల్లోనే ఆరు లక్షల మంది చూశారు. ఇద్దరి మధ్య బాంధవ్యం ఇప్పుడు మరింత గట్టి పడింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement