Uk House Worth Rs 3.7 Crore Up For Grabs For Just Rs 280 - Sakshi
Sakshi News home page

లక్కీ లాటరీలో మూడు కోట్ల ఇల్లు.. రూ. 280కే!!

Published Sat, Nov 5 2022 8:10 PM | Last Updated on Sat, Nov 5 2022 9:02 PM

Uk House Worth Rs 3.7 Crore Up For Grabs For Just Rs 280 - Sakshi

‘మంచి తరుణం మించిన దొరకదు..ఆలోచించిన ఆశా భంగం...రండి బాబు రండి..రూ.3.7కోట్ల ఖరీదైన ఇల్లును రూ.280కే అందిస్తాం’ అంటూ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇంతకీ ఆ ఖరీదైన ఇల్లు ఎక్కడ ఉంది? రూ.280కే.. రూ. 3 కోట్ల విలువైన ఆ ఇల్లును కొనుగోలు చేయొచ్చా? ఇంతకీ ఆ ఇంటి కథాకమామిషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇంటి ధర రూ.3.7 కోట్లు. అందులో మూడు స్టేర్లు. స్టైలిష్‌ ఫర్నీచర్‌. నాలుగు పెద్ద పెద్ద బెడ్రూంలు. తినేందుకు విశాలమైన కిచెన్‌లో డైనింగ్‌ ఏరియా. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సేదతీరేందుకు లివింగ్‌ రూమ్‌. పైగా ఇంటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. సాధారణంగా ఇటువంటి విలాసవంతమైన భవనంలో ఉండేందుకు నెల అద్దె సుమారు రూ.188,000 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ముగ్గురు అన్నదమ్ములు మాత్రం కొనుగోలు దారులకు కేవలం రూ.280కే ఇస్తామని ప్రకటించారు. 

ముగురు సోదరులు 
బ్రిటన్‌కు చెందిన డానియల్‌, జాన్సన్‌,ట్వెన్‌ఫోర్ ముగ్గురు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు కోవిడ్‌ -19 సమయంలో రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లోకి అడుగు పెట్టారు. బిజినెస్‌ ప్రారంభంలో వాళ్లకు తట్టిన ఓ చిన్న ఐడియా కోటీశ్వరుల్ని చేసింది. ఇప్పుడు అదే స్ట్రాటజీతో రూ. 280కే కోట్ల విలువైన బంగ్లాను అప్పనంగా ఇచ్చేస్తామని చెబుతున్నారు. అయితే ఇందుకోసం ఓ షరతు విధించారు. ఏంటా షరతు! 

ఐడియా..కనెక్టింగ్‌ పీపుల్‌  
ముగ్గురు సోదరులు ఈ ఖరీదైన ఇంటిని అమ్మేందుకు ఓ మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. రూ. 280తో లాటరీ కొంటే ఆ విల్లా మీ సొంతమయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కేంబ్రిడ్జ్ న్యూస్ ప్రకారం..ఇంటిని అమ్మేందుకు అవసరమైన స్టాంప్ డ్యూటీ, చట్టపరమైన రుసుము వంటి బదిలీ ఖర్చులను కవర్ చేయడానికి ట్వెన్‌ఫోర్ బ్రదర్స్‌ లాటరీ తరహాలో సుమారు 155,000 టిక్కెట్లను విక్రయించాల్సి ఉంటుంది. కానీ 155,000 టిక్కెట్లు అమ్ముడుపోకపోతే..లాటరీ తీసి అందులో గెలిచిన విజేతకు ఇంటికి బదులుగా లాటరీ మొత్తం నగదులో 70 శాతం అందిస్తారు. బావుంది కదా బిజినెస్. ట్రామ్‌వే పాత్ పేరుతో నిర్వహిస్తున్న ఈ బిజినెస్‌లో ఇప్పటి వరకు ఈ ముగ్గురు సోదరులు నష్టపోలేదు. 

ట్రామ్‌వే పాత్
ట్రామ్‌వే పాత్ వెబ్‌సైట్ ప్రకారం..బ్రిటన్‌ కెంట్‌లోని మెడ్‌వేలో ఉన్న ఈ అద్భుతమైన 4 బెడ్‌ రూమ్‌ల ఇల్లు చారిత్రాత్మక సంస్కృతి, కళలు సమృద్ధిగా ఉన్న ప్రాంతంలో ఉంది. లండన్ విక్టోరియా నుంచి  లండన్ సెయింట్ పాన్‌క్రాస్‌ల నాలుగు కిలోమీటర్ల దూరాన్ని గంటలోపు చేరుకునే ప్రయాణ సౌకర్యం ఉంది’ అని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement