ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీలోని భీరా పోలీస్‌స్టేషన్ పరిధిలోగల ఫుట్హా గ్రామంలోని ఆ ఇంటిలోని వారంతా ఆ క్షణంలో వణికిపోయి, బయటకు పరుగులు తీశారు. ఆ ఇంటి బెడ్‌రూంలోని మంచం కింద రాత్రంతా ఒక భారీ మెసలి నక్కివుంది. ఉదయాన్నే అది వారి కంటపడింది. అంతే ఇంటిలోని వారందరికీ ఆ క్షణంలో ప్రాణాలు పోయినట్లు అనిపించింది. వెంటనేవారంతా బయటకు పరుగులు తీశారు.
ఈ విషయం గ్రామంలోని వారందరికీ తెలియడంతో వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో ఈ సమాచారాన్ని ఎవరో అటవీశాఖ అధికారులకు చేరవేశారు. అయితే వారు వచ్చేలోగానే గ్రామస్తులంతా కలసి దానిని ఒక సంచీలో బంధించి నదిలో వదిలివేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో శారదా నదిలోకి వరదనీరు చేరింది. ఈ నేపధ్యంలోనే శారదా నది నుంచి కొట్టుకువచ్చిన ఒక మొసలి గ్రామానికి చెందిన లాలా రామ్ ఇంటిలోనికి ప్రవేశించింది. అది రాత్రంతా మంచం కిందే ఉంది.
ఆ మంచం మీదనే ఇంటి యజమాని లాలా రామ్ పడుకున్నాడు. ఉదయం ఆయన కళ్లు తెరవగానే అతనికి భారీ ఆకారంలో ఉన్న మొసలి కనిపించింది. వెంటనే అతను భయంతో కేకలు వేయడం మొదలుపెట్టాడు. అతని అరుపులు విని అక్కడికి వచ్చిన ఇంటిలోని వారంతా భయంతో పరుగులు తీశారు. విషయం తెలియగానే గ్రామస్తులంతా లాలా రామ్ ఇంటికి చేరుకున్నారు. వారు దానిని ఒక సంచీలో బంధించి, తరువాత నదిలో విడిచిపెట్లారు.
ఇది కూడా చదవండి: తాజ్‌మహల్‌ను తలదన్నేలా స్లమ్ టూరిజంనకు ఆదరణ.. మురికివాడలకు పర్యాటకుల క్యూ
Comments
Please login to add a commentAdd a comment