cot
-
‘కొడంగల్’ లిఫ్టుపై మీమాంస
సాక్షి,హైదరాబాద్: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం టెండర్లకు కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీఓటీ) ఆమోదముద్ర లభించలేదు. పలు ఇంజనీరింగ్ శాఖల పనులకు సంబంధించిన టెండర్లపై శనివారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలోని సీఓటీ సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో నారాయణపేట–కొడంగల్ టెండర్లపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌తోపాటు నారాయణపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి రూ.4,350కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.టెండర్ల ఆమోదంపై నిర్ణయం తీసుకోని సీఓటీప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి గత నెల లో టెండర్లను ఆహ్వానించారు. ప్యాకేజీ–1 కింద రూ.1,134.62 కోట్ల అంచనాలతో టెండర్లను పిల వగా, 3.9% అధిక ధరను కోట్ చేసి రాఘవ–జ్యోతి జాయింట్ వెంచర్ ఎల్–1గా నిలిచింది. 4.85% అధిక ధరను కోట్ చేసి ఎల్–2గా మేఘా ఇంజనీ రింగ్ నిలిచింది. రూ.1,126.85 కోట్ల అంచనాలతో రెండో ప్యాకేజీ పనులకు టెండర్లను పిలవగా 3.95% అధిక ధరను కోట్ చేసి ఎల్–1గా మేఘా ఇంజనీరింగ్, 4.8% అధిక ధరను కోట్ చేసిన ఎల్–2గా రాఘవ కన్స్ట్రక్షన్స్ నిలిచాయి. ఈ టెండర్లను సీఓటీ ఆమోదించాల్సి ఉండగా, ఇప్పటికే పలుమార్లు సమావేశమైన సీఓటీ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. 21న జరిగే సమావేశంలోనైనా...ప్యాకేజీ–1 టెండర్ల విషయంలో సీఓటీలోని కొందరు చీఫ్ ఇంజనీర్లు కొన్ని అంశాలపై కొర్రీలు వేసినట్లు సమాచారం. ఈ నెల 21న జరగనున్న సీఓటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు రూ.360 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులకు సీఓటీ ఆమోదముద్ర వేసింది. రూ.14 కోట్లతో చేపట్టిన సదర్మట్ బరాజ్ విద్యుదీకరణ పనులకు సైతం అనుమతిచ్చింది. -
దాదాపు 40 ఏళ్ల తరువాత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అలా...
#RepublicDay2024- MurmuHorsebuggy for parade రిపబ్లిక్ డే 2024 వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే.. దాదాపు 40 సంవత్సరాల విరామం తర్వాత, రిపబ్లిక్ డే పరేడ్‌లో గుర్రపు బగ్గీ సంప్రదాయం మళ్లీ వచ్చింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ‘సాంప్రదాయ గుర్రపు బగ్గీ’ కర్తవ్య పథానికి చేరుకున్నారు.ప్రెసిడెంట్ ముర్ముతోపాటు ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఈ ప్రత్యేక వాహనంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకులకు హాజరయ్యారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ బగ్గీకి రాష్ట్రపతి అంగరక్షకుడు ఎస్కార్ట్ చేశారు. భారత సైన్యంలోని అత్యంత సీనియర్ రెజిమెంట్ రాష్ట్రపతి అంగరక్షకుడుగా ఉంటారు. అయితే భద్రతా కారణాల రీత్యా 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత రిపబ్లిక్ డే కార్యక్రమాలకు అధ్యక్షుడి బగ్గీని ఉపయోగించడం నిలిపివేశారు. అప్పటిక అధ్యక్షులు వారి ప్రయాణానికి లిమోసిన్‌లను ఉపయోగిస్తున్నారు. అంతకుముందు 2014లో, బీటింగ్ రిట్రీట్ వేడుకలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరు గుర్రాల బగ్గీని నడిపి ఈ సంప్రదాయాన్నిపునరుద్ధరించిన సంగతి తెలిసిందే. #WATCH | President Droupadi Murmu and French President Emmanuel Macron riding in a special presidential carriage escorted by the President's Bodyguard make their way to Kartavya Path pic.twitter.com/F4hOovJoua — ANI (@ANI) January 26, 2024 కాగా 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో నారీశక్తి థీమ్‌కు అనుగుణంగా 26 శకటాలు దేశంలో మహిళా సాధికారతను ప్రదర్శిస్తూ కర్తవ్య పథంలో కవాతు చేశాయి. అగే తొలి సారి మహిళా అధికారుల సారధ్యంలో త్రివిధ దళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 105 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు Mi-17 IV హెలికాప్టర్లు కర్తవ్య పథంలో హాజరైన ప్రేక్షకులపై పూల వర్షం కురిపించాయి. 100 మంది మహిళా కళాకారులు నారీ శక్తికి ప్రతీకగా వివిధ రకాల తాళ వాయిద్యాలను వాయిస్తూ ‘ఆవాహన్’ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకలకు గాను దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ అంతటా 70వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. -
మంచం కింద మొసలి.. మంచంపైన ఇంటి యజమాని.. తెల్లారి కళ్లు తెరవగానే..
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీలోని భీరా పోలీస్‌స్టేషన్ పరిధిలోగల ఫుట్హా గ్రామంలోని ఆ ఇంటిలోని వారంతా ఆ క్షణంలో వణికిపోయి, బయటకు పరుగులు తీశారు. ఆ ఇంటి బెడ్రూంలోని మంచం కింద రాత్రంతా ఒక భారీ మెసలి నక్కివుంది. ఉదయాన్నే అది వారి కంటపడింది. అంతే ఇంటిలోని వారందరికీ ఆ క్షణంలో ప్రాణాలు పోయినట్లు అనిపించింది. వెంటనేవారంతా బయటకు పరుగులు తీశారు. ఈ విషయం గ్రామంలోని వారందరికీ తెలియడంతో వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో ఈ సమాచారాన్ని ఎవరో అటవీశాఖ అధికారులకు చేరవేశారు. అయితే వారు వచ్చేలోగానే గ్రామస్తులంతా కలసి దానిని ఒక సంచీలో బంధించి నదిలో వదిలివేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో శారదా నదిలోకి వరదనీరు చేరింది. ఈ నేపధ్యంలోనే శారదా నది నుంచి కొట్టుకువచ్చిన ఒక మొసలి గ్రామానికి చెందిన లాలా రామ్ ఇంటిలోనికి ప్రవేశించింది. అది రాత్రంతా మంచం కిందే ఉంది. ఆ మంచం మీదనే ఇంటి యజమాని లాలా రామ్ పడుకున్నాడు. ఉదయం ఆయన కళ్లు తెరవగానే అతనికి భారీ ఆకారంలో ఉన్న మొసలి కనిపించింది. వెంటనే అతను భయంతో కేకలు వేయడం మొదలుపెట్టాడు. అతని అరుపులు విని అక్కడికి వచ్చిన ఇంటిలోని వారంతా భయంతో పరుగులు తీశారు. విషయం తెలియగానే గ్రామస్తులంతా లాలా రామ్ ఇంటికి చేరుకున్నారు. వారు దానిని ఒక సంచీలో బంధించి, తరువాత నదిలో విడిచిపెట్లారు. ఇది కూడా చదవండి: తాజ్‌మహల్‌ను తలదన్నేలా స్లమ్ టూరిజంనకు ఆదరణ.. మురికివాడలకు పర్యాటకుల క్యూ -
ఎంత కష్టమొచ్చింది.. పాము కాటుకు గురైన మహిళను మంచంపై అలా..!
రాయ్‌పూర్: దేశంలోని చాలా ప్రాంతాలకు నేటికీ సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటుకు గురైన ఓ మహిళను మంచంపై నడుములోతు నీటిలో మోసుకెళ్లిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. భారీ వర్షాల కారణంగా స్థానిక వాగు పొంగింది. దీంతో ఆరోగ్య సిబ్బంది గ్రామానికి చేరుకోలేని పరిస్థితి తలెత్తటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముంగేలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గిరిజన మహిళ పాము కాటుకు గురైంది. అయితే, భారీ వర్షాల కారణంగా వాగు పొంగి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో చేసేదేమి లేక ఎనిమిది మంది గ్రామస్థులు మహిళను మంచంపై నడుములోతు నీటిలోంచి మోసుకెళ్తూ పక్క గ్రామానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మహిళను మంచంపై తీసుకెళ్తుండగా అదే మంచంపై మరోమహిళ సైతం ఉన్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. ‘భారీ వర్షాల కారణంగా వాగు పొంగి పక్క గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ఆ గ్రామానికి చేరుకోలేకపోయారు. ఇది ప్రత్యేకమైన కేసు. వాగు పొంగటం వల్ల మహిళను మంచంపై మోసుకొచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలు, 10-12 కోట్ల రూపాయల బడ్జెట్ కారణంగా వంతెన నిర్మాణం ప్రతిపాదనకు ఆమోదంలో జాప్యం జరుగుతోంది.’ అని తెలిపారు ముంగేలి అదనపు కలెక్టర్ తీర్థరాజ్ అగర్వాల్. Chhattisgarh| Villagers carry tribal woman bitten by a snake on a cot across river to reach hospital in Mungeli district Area is little difficult to reach & a village that has health officials was cut off from there due to heavy rains: Teerthraj Agarwal, Mungeli Addl Collector pic.twitter.com/BXikfRxCCf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 19, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
కొడుకు టార్చర్ భరించలేక తల్లిదండ్రులు ఏం చేశారంటే....
చెడు వ్యసనాలకు బానిసైతే తల్లిదండ్రులు పడే బాధ అంతఇంత కాదు. చేతికందిన కొడుకు కాస్త బాధ్యతయుతంగా వ్యవహరించకపోగా...వ్యసనాలకు బానిసై వేధిస్తుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు చేయడంతో తల్లిదండ్రులు విసిగి వేసారి ఏం చేశారంటే... వివరాల్లోకెళ్తే...పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడు రోజువారీ కూలీగా పనిచేసేవాడు. ఈ క్రమంలో అతను డ్రగ్స్‌కి బానిసయ్యాడు. సుమారు రూ. 800 విలువైన డ్రగ్స్ తీసుకునేవాడు. అందుకోసం ఇంట్లోనే దొంగతనం చేయడం లేదా వస్తువులను అమ్మేయడం వంటి పనులు చేసేవాడు. డబ్బులు దొరక్కపోతే తల్లిదండ్రులపై దాడికి కూడా దిగేవాడు. దీంతో విసిగి వేసారిపోయిన తల్లిదండ్రులు ఆ యువకుడ్ని ఇనుప గొలుసులతో మంచానికి కట్టి బంధించారు. పైగా వాళ్లు ఏ వస్తువు అతని కంటికి కనపడకుండా దాచడం లేదా జాగ్రత్తగా ప్రతిదానికి తాళం వేయడం వంటివి చేసేవారు. ఈ విధంగా ఆ యువకుడు ఎనిమిది రోజుల నుంచి బధింపబడే ఉన్నాడు. ఈ మేరకు ఆ తల్లిదండ్రులు మాట్లాడుతూ...మా గ్రామంలో చాలా సునాయాసంగా డ్రగ్స్ దొరకడమే కాకుండా యాథేచ్ఛగా విక్రయిస్తుంటారని వాపోయారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ డ్రగ్స్‌ను అరికట్టాలని కోరుతున్నామని అన్నారు. వాస్తవానికి పంజాబ్‌లో కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడతుండటం అక్కడ సర్వసాధారణం. (చదవండి: తలుపులు ఆలస్యంగా తెరిచిందని....భార్యను చంపి సూట్ కేసులో పెట్టి...) -
మంచం మీద ప్రేమ పెళ్లి: కారణం ఏంటంటే?.
సాక్షి, అనంతపురం : కూతురి ప్రేమను హర్షించని ఆ పెద్దలు ప్రేమ పెళ్లికి ససేమీరా అన్నారు. ఓసారి అబ్బాయిని రౌండ్ చేసి చావ చితక్కొట్టారు. ఇక అంతా అయిపోయింది, ఆ ప్రేమ పక్షులు విడిపోవాల్సిందే అనుకున్న జనాలకు షాక్ ఇస్తూ అమ్మాయి తరపు వారు కూతురి ప్రేమ పెళ్లికి పచ్చ జెండా ఊపేశారు. మొదట కాదన్న వాళ్లే మంచంపై కూర్చున్న అబ్బాయి కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. ఈ వింత సంఘటన అనంతపురం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. పామిడి మండలం పీ కొండాపురం గ్రామానికి చెందిన జగదీష్ ఇంటి ఎదురుగా ఉండే శ్రీలక్ష్మిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. కానీ, అమ్మాయి తరపువారు ఇందుకు ఒప్పుకోలేదు. అంతే కాదు, మరో పెళ్లికి ఏర్పాట్లు చూశారు. కానీ అమ్మాయిని అమితంగా ఇష్టపడిన జగదీష్ ఆ పెళ్లి జరక్కుండా అడ్డుపడ్డాడు. దీంతో శ్రీలక్ష్మి తరపు వారికి కోపం వచ్చింది. ( మనోజ్ 'ఖజానా' చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ) ఒక దుర్ముహూర్తం చూసుకుని జగదీష్‌పై దాడి చేశారు. దాడిలో గాయపడిన జగదీష్ ఆసుపత్రిపాలయ్యాడు. వ్యవహారం పోలీసు కేసు దాకా వెళ్లింది. దీంతో పెద్ద మనుషులు జోక్యం చేసుకున్నారు. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారని నచ్చజెప్పారు. దీంతో రెండు కుటుంబాలు శాంతించి పెళ్లికి ఒప్పుకున్నాయి. గాయాలపాలైన జగదీష్ లేవలేని పరిస్థితిలో ఉన్నందుకు మంచం మీదే పెళ్లి తంతు పూర్తి చేశారు. -
మంచాన పడ్డ తల్లిని బ్యాంకుకు లాక్కెళ్తూ..
ఒడిశా: తన తల్లి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన నగదు తీసుకునేందుకు మంచాన పడ్డ తల్లిని ఓ మహిళ బ్యాంకు వరకు లాక్కెళ్లింది. ఈ విషాద ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నౌపారా జిల్లాకు బార్గావున్‌కు చెందిన పుంజీమతి దేవి తల్లి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం రూ.1500 జమ చేసింది. ఈ మొత్తాన్ని తీసుకునేందుకు సదరు మహిళ జూన్ 9న ఉత్కల్ గ్రామీణ బ్యాంకుకు వెళ్లింది. అయితే ఖాతాదారు ఉంటేనే డబ్బులు ఇస్తామని బ్యాంకు మేనేజర్ అజిత్ ప్రధాన్ తేల్చి చెప్పాడు. (హృదయ విదారకం : స్నేహితుడికి గుర్తుగా) దీంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితిలో మంచాన పడ్డ వందేళ్ల వయసున్న తల్లిని బ్యాంకు వరకూ లాక్కుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మధుస్మిత సాహో స్పందిస్తూ... "బ్యాంకు మొత్తాన్ని ఒకరే నిర్వహిస్తున్నారు. అందువల్ల అదే రోజు ఆమె ఇంటికి వెళ్లడం బ్యాంకు మేనేజర్‌కు కుదరలేదు. కాబట్టి తర్వాతి రోజు బ్యాంకు సదరు మహిళ ఇంటికి వస్తానని భరోసా ఇచ్చాడు. కానీ ఆమె వినిపించుకోకుండా తల్లిని మంచంలో వేసి లాక్కుని వెళ్లింది" అని తెలిపారు. ఎట్టకేలకు ఆమె డబ్బులు విత్‌డ్రా చేసుకుందని తెలిసింది. (3 లక్షల జన్‌ధన్ ఖాతాల నుంచి డబ్బులు వెనక్కి) -
మంచమే అంబులెన్స్
జయపురం : ప్రతి వారికి అందుబాటులో వైద్యసౌకర్యం. ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యాలయం. సమితులకు కనెక్టివిటీ రోడ్లు. గర్భిణులకు పురిటి నొప్పులు వస్తే ఫోన్ చేసిన వెంటనే 102 అంబులెన్స్ కుయ్‌కుయ్ మంటూ వచ్చి ఆస్పత్రిలో చేర్చుతుంది. ఈ మాటలు ఎంతో కాలంగా ప్రజలు వింటూనే ఉన్నారు. ప్రభుత్వం ఇలా ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ అవిభక్త కొరాపుట్ జిల్లాలో గర్భిణులు పడుతున్న పాట్లు మాత్రం వర్ణనాతీతం. చాలా సందర్భాల్లో రోగులు, గర్భిణులను డోలీలలోనూ, మంచాలపైనా, సైకిళ్ల పైన తీసుకువెళ్తూ నదులు, కొండలు దాటిస్తూ ఆస్పత్రికి వెళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అటుంటి సంఘటనే బొరిగుమ్మ సమితి రణస్పూర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం తాండవించింది. పంచాయతీలోని రాణిగడ గ్రామ నివాసి మిశ్రా ముదులి భార్య మోతి ముదులి(19) గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించిన తరువాత ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఆశా వర్కర్ రుకుణ సూచించింది. రాణిగుడ కొండపై ఉన్న ఈ గ్రామానికి రహదారి లేదు. దీంతో ఆమె బంధువులు మోతి ముదులిని మంచంపై కూర్చుండ బెట్టి మోసుకుంటూ బొరిగుమ్మ ఆస్పత్రికి బయలుదేరారు. మూడు కొండలు దాటుతూ మూడు కిలోమీటర్లు మోసుకుని బి.సింగపూర్ చేరారు. అక్కడినుంచి ఆటోలో బొరిగుమ్మ కమ్యూనిటీ వైద్య కేంద్రానికి చేర్చారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు సరిపడా రక్తం ఇక్కడ లేదని, వెంటనే జయపురం సబ్‌డివిజన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో వెంటనే ఆమెను జయపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు అవసరమైన రక్తం సమకూర్చి వైద్యం చేసిన తరువాత ఆమె సృహలోకి వచ్చింది. దీంతో బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. సర్కారు కనికరించాలి ఇలాగే ™రాణిగుడ గ్రామంతో పాటు నాలుగైదు గ్రామాలు కొండలపై ఉన్నాయని, ఆ గ్రామాలకు రహదారులు వేయాలని ఎంతో కాలంగా అధికారులను కోరుతూ వస్తున్నామని అయినా ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోయారు. కొండలపై ఉన్నç గ్రామాలలో రోగులు, మహిళలు, గర్భిణులకు వైద్య సౌకర్యం కోసం డోలీకట్టో, మంచాలపైనో మోసుకుంటూ కొండలు దాటుతూ వెళ్లాల్సిందేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని వెంటనే తమ గ్రామాలకు రహదారులు వేయాలని కోరుతున్నారు. -
డాక్టరంటే అతడే..!
సాక్షి, మల్కన్‌గిరి (ఒడిశా): మానవత్వానికి పరీక్షగా ఒడిశా మారింది. మంచాల మీద గర్భవతులును, భుజాల మీద మృతదేహాలను మోసుకెళ్లడం ఈ ప్రాంతంలో అత్యంత సహజంగా మారింది. ఇక్కడి గిరిపుత్రులకు రహదారి వంటి కనీస మౌలిక సౌకర్యాలుకూడా అందుబాటులేవు అని చెప్పే మరో ఘటన ఇది. మల్కన్‌గిరి జిల్లాలోని సరిగెట గ్రామం. విద్య, వైద్యం, రహదారి వంటి కనీస సౌకర్యాలు కూడా లేని గ్రామం. ఆ గ్రమంలో ఒక గర్భిణికి నెలలు పూర్తయ్యాయి. సరిగెట గ్రామంలో వైద్య విధులు నిర్వహించేందుకు కొత్తగా చేరనిన వైద్యుడు ఆమెకు సుఖ ప్రసవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో.. తల్లీబిడ్డ ఇద్దరికి ప్రమాదం అని తెలిసి సమీపంలో ఉన్న పెద్దాసుపత్రికి ఆమెను తరిలించాని సూచించారు. అయితే రహదారి సౌకర్యం లేకపోవడంతో.. నెలలు నిండిన గర్భిణిని యువకుడైన వైద్యుడు, ఆమె భర్త, మంచంతో సహా 8 కిలోమీటర్లు మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రయాణంలో ఆమెకు విపరీతమైన రక్తస్రావం జరిగింది. అయితే ఆలస్యం చేయకుండా ఆమెను ఆసుపత్రికి తరిలించడంతో.. ముగ్గురు వైద్యులు కలిసి ఆమెకు ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
ఈ నులక మంచం ధర తెలిస్తే షాక్...
ఓ నులక మంచం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. నులక మంచం ఏంటీ వైరల్ అవడం ఏంటి అనుకుంటున్నారా? అవును, సాధారణంగా రాత్రివేళ ఆరుబయట వెన్నెల్లో నులక మంచం మీద పడుకుని ఓ కునుకు పడితే వచ్చే సుఖమే వేరు అంటారు పెద్దలు. ఈ మంచాలు ఇప్పుడంటే కనుమరుగై పోతున్నాయి కానీ, పాతకాలపు రోజుల్లో మాత్రం ఎక్కడ చూసినా అవే కనిపించేవి. ఉత్తరాదికి వెళ్తే రహదారులు పక్కన ఉండే దాబా(హోటల్లు) బయట మంచాల్లోనే ఆతిథ్యం ఇస్తాయి. ఇప్పుడు ఈ నాటు మంచాలకు ఆన్లైన్లో భారీ ధర పలుకుతోంది. ఒక్కో మంచం ఖరీదు దాదాపు రూ.55వేలు మాత్రమే.. ఆస్ట్రేలియాకు చెందిన డానియేల్ బ్లూర్ 2010లో భారత్ పర్యటనకు వచ్చాడు. అప్పుడు పంజాబ్‌లోని ఓమంచం ఆయన్ను విశేషంగా ఆకట్టుకుంది. స్నేహితుడి సహాయంతో మంచం అల్లికను నేర్చుకొన్నాడు. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లి మంచాలను తయారు చేసి అమ్మాకానికి పెట్టాడు. ధర చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఒక్కో మంచం ఖరీదు దాదాపు రూ. 55వేలు. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. నెట్‌జన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తున్నారు. 'ఇన్నిరోజులు అనవసరంగా పక్కన పెట్టేశామే' అని ఒకరు అంటే,, 'భారత్‌కు ఆదాయం రావడానికి భారత్‌లో ఉన్న ఈ మంచాలు అన్నింటిని అమ్మేస్తే సరి', 'దీనిపై కాపీ రైట్ తీసుకుంటాం' అంటూ సటైర్లు పేలుస్తున్నారు. -
మంచంపైకి దూసుకెళ్లిన కారు
- ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం పెంచికలపాడు (గూడూరు రూరల్): ఉపాధి పనులకు వెళ్లి వచ్చి..ఇంటి ముందు మంచం వేసుకొని సేదతీరుతున్న తండ్రి, కొడుకుపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రి మృతి చెందంగా కుమారునికి తీవ్ర గాయాలయ్యాయి. గూడూరు మండలం పెంచికలపాడులో బుధవారం.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కర్నూలు రోడ్డు పక్కన నివాసం ఉంటున్న చిన్న నాగన్న రోజు వారీగా ఉదయం కొడుకు తిరుమలేష్‌తో కలిసి ఉపాధి పనులకుÐð వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఎండ వేడిమికి తాళలేక ఇంటి ముందు మంచం వేసుకుని చిన్న నాగన్న (66), కుమారుడు తిరుమలేష్(35) సేదతీరుతున్నారు. అయితే కర్నూలు నుంచి కోడుమూరు వైపు అతి వేగంగా వస్తున్న ఏపీ 21 జెడ్ 0005 నెంబర్ గల మారుతి స్విఫ్ట్ కారు అదుపు తప్పి రోడ్డు పై నుంచి కిందకు దిగి మంచంపై కూర్చున్న చిన్న నాగన్న, తిరుమలేష్‌ను ఢీ కొట్టి ఇంటిలోకి దూసుకెళ్ళింది. ప్రమాదంలో చిన్న నాగన్న అక్కడికక్కడే మృతి చెందగా, తిరుమలేష్‌కు తీవ్ర గాయాల పాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న కె.నాగలాపురం ఎస్ఐ మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారు డ్రైవర్ అతి వేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, తీవ్రంగా గాయపడిన తిరుమలేష్‌ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టినట్లు ఎస్ఐ చెప్పారు. -
‘పాలమూరు’ అగ్రిమెంట్లకు సీఓటీ ఓకే
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీల అర్హతలకు కమిషనర్ ఆఫ్ టెండర్ (సీఓటీ) ఆమోదంతెలిపింది. పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు నిబంధనల మేర అన్ని అర్హతలున్న దృష్ట్యా, వారితో ఒప్పందాలకు ముందుకు వెళ్లవచ్చునని నిర్ణయించింది. అయితే అధికారికంగా మినిట్స్‌పై సీఓటీ అధికారులు సంతకాలు చేసి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు పంపాలి. అక్కడ ఆమోదం అనంతరం ఏజెన్సీలతో ఒప్పందాలు జరిగి పనులు ఆరంభమవుతాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 62 మండలాల 1,131 గ్రామాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టారు. దీని అంచనా వ్యయం రూ.35,200 కోట్లు. రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి రూ.29,924.78 కోట్ల పనులకు టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. వీటిని గత నెల 11న తెరవగా ప్రముఖ కంపెనీలు పనులు దక్కించుకున్నాయి.