కొడుకు టార్చర్‌ భరించలేక తల్లిదండ్రులు ఏం చేశారంటే.... | A Man Seen Chained To A Cot In His Parents | Sakshi
Sakshi News home page

కొడుకు టార్చర్‌ భరించలేక తల్లిదండ్రులు ఏం చేశారంటే.... ఇనుప గొలుసులతో బంధించి

Published Sun, Jul 3 2022 10:16 AM | Last Updated on Sun, Jul 3 2022 10:34 AM

A Man Seen Chained To A Cot In His Parents - Sakshi

చెడు వ్యసనాలకు బానిసైతే తల్లిదండ్రులు పడే బాధ అంతఇంత కాదు. చేతికందిన కొడుకు కాస్త బాధ్యతయుతంగా వ్యవహరించకపోగా...వ్యసనాలకు బానిసై వేధిస్తుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు చేయడంతో తల్లిదం‍డ్రులు విసిగి వేసారి ఏం చేశారంటే...

వివరాల్లోకెళ్తే...పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడు రోజువారీ కూలీగా పనిచేసేవాడు. ఈ క్రమంలో అతను డ్రగ్స్‌కి బానిసయ్యాడు. సుమారు రూ. 800 విలువైన డ్రగ్స్‌ తీసుకునేవాడు. అందుకోసం ఇంట్లోనే దొంగతనం చేయడం లేదా వస్తువులను అమ్మేయడం వంటి పనులు చేసేవాడు. డబ్బులు దొరక్కపోతే తల్లిదండ్రులపై దాడికి కూడా దిగేవాడు. దీంతో విసిగి వేసారిపోయిన తల్లిదండ్రులు ఆ యువకుడ్ని ఇనుప గొలుసులతో మంచానికి కట్టి బంధించారు.

పైగా వాళ్లు ఏ వస్తువు అతని కంటికి కనపడకుండా దాచడం లేదా జాగ్రత్తగా ప్రతిదానికి తాళం వేయడం వంటివి చేసేవారు. ఈ విధంగా ఆ యువకుడు ఎనిమిది రోజుల నుంచి బధింపబడే ఉన్నాడు. ఈ మేరకు ఆ తల్లిదండ్రులు మాట్లాడుతూ...మా గ్రామంలో చాలా సునాయాసంగా డ్రగ్స్‌ దొరకడమే కాకుండా యాథేచ్ఛగా విక్రయిస్తుంటారని వాపోయారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ డ్రగ్స్‌ను అరికట్టాలని కోరుతున్నామని అన్నారు. వాస్తవానికి పంజాబ్‌లో కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడతుండటం అక్కడ సర్వసాధారణం.

(చదవండి: తలుపులు ఆలస్యంగా తెరిచిందని....భార్యను చంపి సూట్‌ కేసులో పెట్టి...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement