addict
-
మద్యపాన వ్యసనానికి చెక్‌పెట్టే సరికొత్త చికిత్స విధానం!
మద్యపాన వ్యసనం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపింది. బంధాలను ముక్కలు చేసి ఎవర్నీ ఎవరికీ కాకుండా చేసి జీవితాలను కాలరాస్తోంది. అలాంటి మహమ్మారిలాంటి ఈ మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు సమర్థవంతమైన చికిత్స విధానాలు ఇప్పటివరకు అందుబాటుల్లో లేవు. డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి కదా! అని అంటారేమో. మందు బాబులు అక్కడ ఇచ్చే కౌన్సిలింగ్‌కి, జీవనశైలికి దాని అడిక్షన్ నుంచి బయటపడినట్లు అనిపిస్తారు అంతే. కళ్ల ముందు చుక్క కనిపించిందంటే మళ్లీ కథ మాములే. కొందరే ఆయా సెంటర్ల నుంచి మెరుగై మళ్లీ దాని జోలికి వెళ్లకుండా ఉండేందుకు యత్నిస్తారు. ఇది కూడా అంత ప్రభావంతమయ్యింది కాదు. దీని పరిష్కారం కోసం ఎన్నాళ్లుగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా అధ్యయనాల్లో దీనికి ప్రభావంతమైన జన్యు చికిత్స విధానాన్ని కనుగొన్నారు. అదేంటంటే..ఈ ఆల్కాహాల్ యూజ్ డిజార్డర్(ఏయూడీ) ఓ పట్టాన వదిలించుకోలేని జబ్బు అని చెప్పొచ్చు. దీని కోసం శాస్త్రవేత్తలు చేసిని పరిశోధన కొంతవరకు పురోగతినే చూపించింది. ఈ మద్యపానానికి బానిసలుగా మారిన వాళ్ల బ్రెయిన్‌పై పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఎందుకు మందువైపు నుంచి వాళ్లను వాళ్లు మరల్చుకోలేకపోవడానికి కారణం ఏంటా? అనే దిశగా పరిశోధనలు చేయగా..మెదడులో ఉండే కమ్యేనికేషన్ వ్యవస్థకు సంబంధించిన మొసోలింబిక్ డోపమేన్ సిగ్నలింగ్ లోతుగా ఉన్నట్లు గురించారు. ఇది మద్యం సేవిస్తే కలిగి మంచి అనుభూతిని న్యూరోట్రాన్సిమీటర్కు ఎలా ప్రశారం చేస్తుందో నిర్థారించారు. ఈ వ్యవస్థ పనితీరులో ప్రధానమైనది గ్లియల్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్(జీడీఎన్‌ఎఫ్) అనే ప్రోటీన్. అల్కహాల్ తాగకుండా ఉండేందుకు యత్నిస్తున్న ఏయూడీ రోగుల మెదుడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ) జీడీఎన్ఎఫ్స్థాయిలు పడిపోతాయని పరిశోధనలో తేలింది. దీని కోసం జన్యు చికిత్స ఉపయోగించి వీటీఏలో జీడీఎన్‌ఎఫ్ స్థాయిలను భర్తీ చేస్తే డోపమేన్ సిగ్నలింగ్‌ను బలోపేతం అవుతుందా? అనే దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఆ అధ్యయనంలో తక్కువ మోతాదులో మద్యపానం సేవిస్తే డోపమైన్ సిగ్నలింగ్ విడుదల బాగానే ఉంది. దీర్ఘకాలికంగా తాగితే మాత్రం మెదడును డీసెన్సిటైజ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత కాలక్రమేణ తక్కువ డోపమైన్‌ను విడుదల చేస్తుందని అన్నారు. ఈ వ్యసనంతో బాధపడుతున్నవారికి నిగ్రహంగా ఉందామనే సమయంలో వచ్చే అసౌకర్యం, చికాకుని తట్టుకోలే మళ్లీ తాగడం ప్రారంభిస్తుంటారని అన్నారు. ఇక్కడ తాగాలనిపించేలా మెదడు సిగ్నలింగ్ ఇచ్చే డోపమేన్ వ్యవస్థకే జన్యు చికిత్స చేస్తే సమస్యను అధిగమించవచ్చు అనేది శాస్త్రవేతల ఆలోచన. అందుకోసమని కొన్ని కోతులపై ఈ పరిశోధన చేశారు. దాదాపు 21 రోజుల పాటు కోతులకు మద్యపానం, నీరు వాటికి నచ్చినంత తాగేలా స్వేచ్ఛగా వదిలేశారు. కొద్దిరోజులకే అవి అధికంగా మధ్యపానానికి అడిక్ట్ అవ్వడం చూశారు. ఆ తర్వాత ఆ కోతులకు జీడీఎన్‌ఎఫ్ జన్యు చికిత్సను అందించారు. దీంతో అవి మద్యపానానికి బదులు నీటిని తాగడానికి ప్రయత్నించడం మొదలు పెట్టాయి. తెలియకుండానే మద్యపానాన్ని పక్కనపెట్టడం జరిగింది. వాటి రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ తక్కువుగా ఉండటాన్ని కూడా గుర్తించారు. ఆల్కహాల్ యూస్ డిజార్డర్‌తో బాధపడుతున్నవారికి ఈ చికిత్స గొప్ప పరిష్కార మార్గం అని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారని, వారికి ఈ చికిత్స విధానం అద్భుత ప్రయోజనాలను ఇవ్వగలదని అన్నారు. అయితే ప్రభావవంతంగా పనిచేస్తున్న ఈ జన్యు చికిత్స మానువులకు ఎంతవరకు సురక్షితం అనేదాని గురించి ట్రయల్స్ నిర్వహించి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. (చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడకల్లో 'ఇడ్లీ లొల్లి'..దీని మూలం ఎక్కడిదంటే..) -
ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!
ఒక్కో వ్యక్తికి ఒక్కో ఇష్టం ఉంటుంది. ఫుడ్‌కి సంబంధించినంత వరకు ఒక్కోక్కళ్లకి ఒక్కో విధమైన టేస్ట్ ఉంటుంది. దాన్నే అమితంగా ఇష్టపడటం జగుతుంది. కానీ మరి ఘోరంగా అది లేకపోతే బతకడమే కష్టం అన్నట్లు ఉండం. పరిస్థితుల రీత్యా ఎడ్జెస్ట్‌మెంట్ కూడా చేసుకుంటాం. లేదంటా లైఫ్ సాఫీగా జరగదు..బ్రేక్‌లు మాదిరిగా ఆగిపోతూ నత్తనడకలా ఉంటుంది. మనకు మనకే మన లైఫ్ కష్టంగా అర్థంకాని విధంగా ఉంటుంది. అది ఏ విషయంలోనేనాసరే!. కానీ ఇక్కడొక వ్యక్తి ఇష్టం మాములుగా లేదు! వింటే షాక్ అవ్వుతారు. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని కాన్వాస్‌కు చెందిన టైలర్ అనే వ్యక్తి ఓ స్ట్రేంజ్ అడిక్ట్. ఏంటిది? డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వంటివి అని అనుకోకండి. ఎందుకంటే? అవేమీ కావు. చెప్పాలంటే తనకు ఎంతో ఇష్టమైన ఆహారానికి బానిసగా మారాడు. ఆ ఫుడ్ లేకుండా మనోడికి ఆ రోజు స్టార్ట్ అవ్వలేనంతగా. టైలర్‌కి ఆ ఫుడ్ అంటే..అలాంటి ఇలాంటి ఇష్టం కాదు. ఇంతకీ.. టైలర్‌కి నచ్చిన ఫుడ్ ఏంటంటే.. :"ట్యూనా ఫిష్". ఇదంటా టైలర్‌కి చాలా పిచ్చి. ఎంతలా అంటే వారానికి ఐదు క్యాన్లు హాంఫట్ చేసేంత పిచ్చి ఇష్టం. ప్రతి రోజు దాని వాసన చూడకుండా ఉండలేడట. అందుకని ఆ ట్యూనా ఫిష్ క్యాన్లను కూడా ఎప్పుడూ వెంటే జేబులో పెట్టుకుని తిరుగుతాడట. అందరూ చక్కగా రోజుని మంచి కాఫీతోనో లేదా గ్రీన్ టీ తోనో డే స్టార్ట్ చేస్తే టైలర్ మాత్రం ఈ ఫిష్ క్యాన్‌తో స్టార్ట్ చేస్తాడు. ఈ మేరకు టైలర్ అమ్మ మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి టైలర్‌కి ట్యూనా ఫిష్ అంటే ఇష్టం అని తెలుసు. కానీ మరి ఇంతలా అడిక్ట్ అవుతాడని ఊహించలేదు. చిన్నతనంలో ఈస్టర్కి పిల్లలంతా బుట్టలో చాక్లెట్లు వేసుకుంటే ఇతను మాత్రం ఆ ట్యూనా ఫిష్ క్యాన్లు బుట్టలో పెట్టుకునేవాడు. వాడికి ఆ ఫిష్ అంటే ఇష్టం కదా! అలా పెట్టుకున్నాడని లైట్ తీసుకున్నా. కానీ అదే తప్పవుతుందని ఊహించలేదని వాపోయింది టైలర్ తల్లి. ప్రస్తుతం టైలర్ రోజు ఆ చేప వాసన చూడకుండా ఉండలేడు. అది తినకపోతే ఏం చేయలేను అన్నంత స్టేజ్‌లో ఆ ట్యూనా ఫిష్కి అడిక్ట్ అయ్యాడు. వామ్మో ఇలాంటి స్ట్రేంజ్ అడిక్షిన్లు కూడా ఉంటాయా! అనిపిస్తుంది కదా!. (చదవండి: అయ్ బాబోయ్.. ఐఏ! రేకెత్తిస్తున్న భయాలు..భయం గుప్పెట్లో యువత) -
కొడుకు టార్చర్ భరించలేక తల్లిదండ్రులు ఏం చేశారంటే....
చెడు వ్యసనాలకు బానిసైతే తల్లిదండ్రులు పడే బాధ అంతఇంత కాదు. చేతికందిన కొడుకు కాస్త బాధ్యతయుతంగా వ్యవహరించకపోగా...వ్యసనాలకు బానిసై వేధిస్తుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు చేయడంతో తల్లిదండ్రులు విసిగి వేసారి ఏం చేశారంటే... వివరాల్లోకెళ్తే...పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడు రోజువారీ కూలీగా పనిచేసేవాడు. ఈ క్రమంలో అతను డ్రగ్స్‌కి బానిసయ్యాడు. సుమారు రూ. 800 విలువైన డ్రగ్స్ తీసుకునేవాడు. అందుకోసం ఇంట్లోనే దొంగతనం చేయడం లేదా వస్తువులను అమ్మేయడం వంటి పనులు చేసేవాడు. డబ్బులు దొరక్కపోతే తల్లిదండ్రులపై దాడికి కూడా దిగేవాడు. దీంతో విసిగి వేసారిపోయిన తల్లిదండ్రులు ఆ యువకుడ్ని ఇనుప గొలుసులతో మంచానికి కట్టి బంధించారు. పైగా వాళ్లు ఏ వస్తువు అతని కంటికి కనపడకుండా దాచడం లేదా జాగ్రత్తగా ప్రతిదానికి తాళం వేయడం వంటివి చేసేవారు. ఈ విధంగా ఆ యువకుడు ఎనిమిది రోజుల నుంచి బధింపబడే ఉన్నాడు. ఈ మేరకు ఆ తల్లిదండ్రులు మాట్లాడుతూ...మా గ్రామంలో చాలా సునాయాసంగా డ్రగ్స్ దొరకడమే కాకుండా యాథేచ్ఛగా విక్రయిస్తుంటారని వాపోయారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ డ్రగ్స్‌ను అరికట్టాలని కోరుతున్నామని అన్నారు. వాస్తవానికి పంజాబ్‌లో కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడతుండటం అక్కడ సర్వసాధారణం. (చదవండి: తలుపులు ఆలస్యంగా తెరిచిందని....భార్యను చంపి సూట్ కేసులో పెట్టి...) -
‘సన్’ స్ట్రోక్స్! ఆన్లైన్ క్లాస్‌ల పేరిట గేమ్‌లకు బానిసగా...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని యువకుల తల్లిదండ్రులకు ఇటీవల ‘సన్’ స్ట్రోక్స్ ఎక్కువగా తగులుతున్నాయి. ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటు పడుతున్న యువత వాటిలో గెలవడానికి బానిసలుగా మారిపోతున్నాయి. దీనికోసం ఆయా కంపెనీల ట్రాప్‌లో పడి యూసీ పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి తల్లిదండ్రుల క్రెడిట్, డెబిట్ కార్డులు వారికి తెలియకుండా వాడేస్తున్నారు. అంబర్‌పేట ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఫ్రీఫైర్ గేమ్ కోసం తన తల్లి, తాతల బ్యాంకు ఖాతాల్లోని రూ.36 లక్షలు వాడిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం కంపెనీల వ్యవహారం.. కోవిడ్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి. దీంతో దాదాపు ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్‌లు వచ్చి చేరాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న విద్యార్థులు వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దీనిప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. పాయింట్లతో బలపడతావంటూ... ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్‌లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. దీంతో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన యువతలో కలిగిస్తారు. ఆపై అసలు కథ మొదలెట్టి.. కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ మెలికపెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్న యువత తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్‌లో పడిపోతున్నారు. అలా తమ తల్లిదండ్రుల కార్డులు తీసుకుని వారికి తెలియకుండా పేమెంట్లు చేస్తున్నారు. యువత అనునిత్యం రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చు చేసేస్తోంది. నేరగాళ్ల పనిగా భావిస్తున్న తల్లిదండ్రులు.. ఇలా అనునిత్యం తమకు తెలియకుండా కార్డులు, ఖాతాల నుంచి చిన్న మొత్తాలు పోతుండటాన్ని తల్లిదండ్రులు తక్షణం గుర్తించలేకపోతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇవి పెద్ద మొత్తాలుగా మారిన తర్వాత తెలుసుకుంటున్నారు. ఆ పని చేసింది సైబర్ నేరగాళ్లుగా భావించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. యువకులే డబ్బు పెట్టి ఆడుతున్నారు యువకులతో పాటు యువతులూ ఇలాంటి గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. పిల్లలు ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలు కాకుండా చూసుకోవాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: అరువుపై ఎరువులు ఇవ్వం) -
మద్యానికి బానిసైన భర్త... భార్య ఇద్దరు పిల్లలను నీటిలో ముంచి...
ఇబ్రహీంపట్నం రూరల్: ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలితీసుకున్నాయి. కుటుంబ యజమాని భార్య, ఇద్దరు పిల్లలను చెరువులో ముంచి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ కథనం ప్రకారం.. హైదరాబాద్ సంతోష్‌నగర్‌కు చెందిన మహమ్మద్ ఖుద్దూస్ (37), ఫాతిమా (27) దంపతులకు మెహక్‌బేగం (9), ఫిర్దోస్ బేగం (6) సంతానం. వీరు అదే ప్రాంతంలోని సలావుద్దీన్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఖుద్దూస్ బడంగ్పేట్లో వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ప్రమాదానికి గురై నడుం నొప్పితో బాధపడుతున్న ఖుద్దూస్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో సాఫీగా సాగుతున్న సంసారంలో కలతలు మొదలయ్యాయి. పైగా ఆర్థిక ఇబ్బందులు తోడవంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. రెండు రోజుల క్రితం బావమరిది హమీద్‌ను రూ.10 వేలు అప్పు ఇప్పించాలని ఖుద్దూస్ అడగగా.. రెండు మూడు రోజుల తర్వాత చూద్దామని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన ఖుద్దూస్.. భార్యను,ఇద్దరు పిల్లలను షాహీనగర్‌కు వెళదామని చెప్పి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మల్లాపూర్ చౌరస్తా నుంచి నేరుగా వెళ్లకుండా వాహనాన్ని కుర్మల్‌గూడ వైపు దారి మళ్లించాడు. రాత్రి 10.30 గంటల సమయంలో కుర్మల్‌గూడ అంతిరెడ్డి చెరువు వద్ద ద్విచక్ర వాహనం నిలిపాడు. ముందుగా పిల్లలు, భార్యను చెరువులో ముంచి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలను చెరువులో ముంచుతుండగా.. అరుపులు వినిపించడంతో గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో ఖుద్దూస్, చిన్న కూతురు ఫిర్దోస్ బేగం మృతదేహాలను వెలికితీసి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మంగళవారం ఉదయం భార్య ఫాతిమా బేగం, మెహక్‌బేగం మృతదేహాలను బయటికి తీశారు. ఖుద్దూస్ బావమరిది హమీద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: ఫేస్బుక్ లవ్.. లవర్ కోసం నదిలో ఈది భారత్‌లోకి వచ్చాక.. షాకింగ్ ట్విస్ట్) -
తెర పై స్మొ ‘కింగ్స్’
రాజేంద్రనగర్‌కు చెందిన ఓ టీనేజర్ ఒకటి తర్వాత ఒకటిగా ప్యాకెట్ సిగిరెట్లు హాంఫట్ చేశాడు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. కేజీఎఫ్ సినిమాలో హీరోను చూసి ఆ కుర్రాడు ఫాలో అయ్యాడనేది తర్వాత తెలిసిన సంగతి. అయితే ఈ తరహాలో టీనేజర్లపై సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం తీవ్రమవుతోందని, మరింత తీవ్రంగా మారనుందని గతంలోనే నగరం వేదికగా నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. ఈ నేపధ్యంలో టీనేజర్ల భవిష్యత్తు ‘పొగ’చూరిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షి , హైదరాబాద్: మాస్ మీడియా మరియు ఇంటర్నెట్లోని సెలబ్రిటీల విజువల్స్‌కు ప్రభావితమైన యువకులు మద్యపానంతో పాటు ధూమపానానికి అలవాటు పడుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ సోషల్ సైంటిస్ట్ (డిప్యూటీ డైరెక్టర్) మేకం మహేశ్వర్ గతంలో నిర్వహించిన అధ్యయనం దీన్ని నిర్ధారించింది. ‘టీనేజర్స్ డైట్ మరియు హెల్త్–రిలేటెడ్ బిహేవియర్‌పై మాస్ మీడియా ప్రభావం’ అనే అంశంపై చేసిన సర్వేలో 15 శాతం మంది అబ్బాయిలు సెలబ్రిటీలను అనుకరించడానికే తాము సిగరెట్ తాగామని స్పష్టం చేశారు. సినిమాతో పాటు వెబ్‌సిరీస్ తదితర సోషల్ మీడియా సెలబ్రిటీలు సైతం వీరిని ప్రభావితం చేశారని తేలింది. మిగతా వయసుల వారితో పోలిస్తే టీనేజర్లపై స్మోకింగ్ సీన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఆన్లైన్ లోకం..అవగాహనే శరణ్యం.. ప్రపంచం అంతా ఆన్లైన్ మీదే నడిచే రోజులు వచ్చేస్తున్న పరిస్థితుల్లో పిల్లల్ని స్మోకింగ్ సీన్స్‌కి దూరంగా ఉంచడం అంత సులభ సాధ్యం కాదు. అయినా ఆ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ధూమపానం వల్ల కలిగే అనర్ధాలను తరచుగా వారికి వివరించి చెబుతూ ఉండాలని వైద్యులు, మానసిక చికిత్స నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని నియంత్రించడం, వారి అలవాట్లపై ఓ కన్నేసి ఉంచాలని అంటున్నారు. టీనేజీకి...చాలా ప్రమాదకరం గతంలో టీనేజర్స్ స్మోకింగ్‌కు ఇంట్లో తండ్రో, తాతో, అన్నో.. ప్రభావం కారణమయ్యేది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రభావం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూపిస్తున్నాయి. సిగరెట్లలలో వందల కొద్దీ హానికారక పదార్ధాలు ఉంటాయి. చిన్నవయసులో అలవాటు పడితే అది ఎదుగుదల హార్మోన్లపైనా చెడు ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. ఆస్తమా, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మా పిల్లలకు ఆ అలవాటు కాదులే అనే ధీమాకి పోకుండా...స్మోకింగ్‌ను పిల్లలకు దూరంగా ఉంచడానికి వారిలో ముందస్తుగానే అవగాహన పెంచడం అవసరం. –డా.రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి (చదవండి: తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది అభ్యర్థులకు ఉత్తమ ర్యాంకులు) -
ధన్యకరమైన విశ్వాసి దానియేలు
దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నిగో అనే నలుగురు యూదు యువకుల విశ్వాసాన్ని ప్రస్తావిస్తూ, వాళ్ళు ‘సింహాల నోళ్లు మూశారు, అగ్ని బలాన్ని చల్లార్చారు... బలహీనులైనా బలపర్చబడ్డారు’ అని బైబిల్ పేర్కొంది (హెబ్రీ 11:33.34). విశ్వాసం బలహీనుల్ని కూడా మహా బలులను చేస్తుంది. దానియేలు యుక్తవయసులో యెరూషలేము నుండి బబులోను చెరకు బానిసగా వచ్చాడు. కానీ బబులోను చక్రవర్తి దర్యావేషు అతని విశేష ప్రతిభను గుర్తించి, అక్కడి 120 మంది ఉన్నతాధికారులపైన నియమించబడిన ముగ్గురు అత్యున్నతాధికారుల్లో ముఖ్యుడుగా అంటే ప్రధానమంత్రిగా దానియేలును నియమించాడు (దాని6:1,2). ఒక యూదు బానిసకు అన్యదేశంలో దేవుడిచ్చిన అరుదైన ఆధిక్యత, గుర్తింపు ఇది. అయితే దానియేలును ఓర్వలేకపోయిన ఆ 122 మంది అధికారులు కుట్రతో ముప్పై రోజుల పాటు దేశంలో రాజును తప్ప మరెవరినీ ఆశ్రయించకూడదన్న శాసనాన్ని తెచ్చారు. దానియేలు మాత్రం తన గది కిటికీలు తెరిచి మరీ ఆ ముప్పై రోజులూ తన దేవునికి ప్రార్థించగా, అధికారుల వత్తిడి మేరకు చక్రవర్తి ఆకలితో నకనకలాడుతున్న సింహాలున్న గుహలో అతన్ని వెయ్యగా, దేవుడు అద్భుతంగా సింహాల నోళ్లు మూసివేసి అతన్ని సజీవంగా కాపాడాడు. పిదప కుట్రదారులైన అధికారులనందరినీ చక్రవర్తి అదే గుహలో వేయగా సింహాలు వారిని తినేశాయి. దానియేలు బబులోను చక్రవర్తికి విధేయుడే. కాని అతని అత్యున్నతమైన, అంతిమమైన విధేయత మాత్రం చక్రవర్తికి పైగా ఉన్న దేవునికే!! విశ్వాసాన్ని ప్రసంగాల్లో, మాటల్లో, సిద్ధాంతాల్లో ఒలకబోస్తే ప్రయోజనం లేదు. క్రైస్తవం మాటల్లో కాదు, చేతల్లో, ఆచరణలో రుజువయ్యే విశ్వాస పథం. పాత నిబంధనలోని 39 పుస్తకాల్లోనూ దైవజనులు ఎన్నెన్నో గొప్ప విశ్వాసకార్యాలు చేశారు. కాని మొత్తం పాతనిబంధనలో ‘విశ్వాసం’ అనే మాట కేవలం రెండే రెండు సార్లు వాడారు. కాని వారి మహాకార్యాలను వివరించే హెబ్రీ 11 వ అధ్యాయంలోనే, ‘విశ్వాసం’ అనే పదాన్ని పరిశుద్ధాత్ముడు 40 వచనాల్లో 24 సార్లకు పైగా వాడాడు. విశ్వాసమనే మాటే వాడకుండా, అంతటి మహా విశ్వాసాన్ని ఆచరణలో చూపిన పాత నిబంధన కాలపు విశ్వాస వీరుల ముందు, పొద్దున్నుండి సాయంత్రం దాకా విశ్వాసం పైనే ప్రసంగాలు చేస్తూ, విశ్వాసులమని పిలిపించుకొంటూ, విశ్వాసాన్ని ఆచరణలో మాత్రం అణువంతైనా చూపలేని నేతి బీరకాయల్లాంటి మనమెక్కడ నిలుస్తాం?? సింహాల గుహలో పడ్డాక దానియేలును రక్షించే బదులు, అసలు సింహాల గుహలో పడకుండా దేవుడతణ్ణి రక్షించలేడా? అని ప్రశ్నించొచ్చు. తప్పకుండా రక్షించగలడు, కాని సీసాలోని మాత్ర శరీరంలోకి వెళ్లి రుగ్మతను పారదోలితేనే కదా దానికి విలువ? ఆచరణలో రుజువు కాని విశ్వాసానికి ఆవగింజంత కూడా విలువ లేదు. విశ్వాసాన్ని ఆచరణలో చూపలేని పిరికివాళ్ళకు, వాళ్ళెంతటివారైనా, పరలోకంలోకి ప్రవేశం లేదు.క్రీస్తు ఆచరించి బోధించిన విశ్వాసం, ప్రబోధాలు, నీతిమాటలు, సూక్తులకు అతీతమైనది. అంతటి మహత్తరమైన విశ్వాసానికి డబ్బు రూపాన్ని, లోక సంబంధమైన ఆస్తులు, విలాసాల రూపాన్నివ్వడం భ్రష్టత్వం!! సమాజంలో ఎంత ఉన్నతస్థాయి ఉంటే, ఎంత డబ్బుంటే వాళ్ళు అంత గొప్ప పరిచారకులు, విశ్వాసులనడం దౌర్భాగ్యపు వక్రీకరణ, అది కేవలం అవకాశవాదం, ఆత్మీయావగాహనా లోపం. చైనా దేశాన్నంతా సువార్తమయం చేసిన హడ్సన్ టేలర్ ఒకానొక సమయంలో పస్తులుంటూ, ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ‘నా జేబులో 25 పైసలే ఉన్నాయి, కాని నా గుండెలో మాత్రం దేవుడిచ్చిన బోలెడు వాగ్దానాలున్నాయి’ అంటూ భార్యకు రాసిన ఉత్తరం ఇప్పటికీ లండన్ మ్యూజియంలో ఉంది. ఆ విశ్వాసంతోనే చైనాలో టేలర్ చేసిన మహా కార్యాలు దేవుని జీవగ్రంథంలో శాశ్వతంగా లిఖించబడి ఉన్నాయి. నా వద్ద 25 పైసలే ఉన్నాయంటూ ప్రకటించిన హడ్సన్ టేలర్ కోట్లలో తేలియాడుతున్న ఈనాటి మెగా సేవకులు, సెలెబ్రిటీ ప్రబోధకులతో పోల్చితే నిరుపేదవాడే!! అయితే కేవలం విశ్వాసంతో దేవుని వాగ్దానాలు నమ్మి చైనా నిండా సువార్తను నింపిన హడ్సన్ ముందు ఈ పరిచారకులు, ప్రబోధకులవి కుప్పిగంతులే, చిరిగిన మురికి వస్త్రాలే!!! – రెవ.డా.టి .ఎ.ప్రభుకిరణ్ సంపాదకులు: ఆకాశధాన్యం email:prabhukirant@gmail.com -
బాని'సెల్'
సాధారణ ఫోన్ వాడుతున్న ఓ గృహిణికితన భర్త స్మార్ట్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె నిద్ర మేల్కొని అందులోనే సీరియళ్లు, సినిమాలు చూస్తోంది. ఆ ప్రభావం ఆమె జీవనశైలిపై పడింది. నిద్ర లేకపోవడంతో పిల్లలను కోపగించుకోవడం.. చిన్న పాటి విషయానికే భర్తతో గొడవ పడటం తరుచూ జరుగుతోంది. విశాఖపట్నం :ఓ ప్రవేటు సంస్థలో పని చేసే ఉద్యోగి కౌషిక్‌కు చేయి నొప్పిరావడంతో మొదట టాబెట్లు వాడారు. తగ్గక పోగా మెడ, వెన్నునొప్పి కూడా తీవ్రమైంది. వెంటనే ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లిపరీక్షలు చేయించగా రిపోర్టులు అన్నీ నార్మల్‌గానే వచ్చాయి. డాక్టర్ అన్ని వివరాలు తెలుసుకుని మొబైల్‌ను అధిక సమయం వినియోగించడంతోనే నొప్పికి కారణమని చెప్పారు. ఆ తర్వాత ఆ ఉద్యోగి వారం రోజుల పాటు మొబైల్‌ను చాలా తక్కువగా ఉపయోగించడంతో నొప్పి తీవ్రత తగ్గింది.నరేంద్ర, పావని ప్రభుత్వ ఉద్యోగులు. వీరి కుమారుడుశ్రీను ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల క్లాస్లోబోర్డుపై టీచర్ రాసే అక్షరాలు కనిపిచడం లేదనితల్లిదండ్రులకు చెప్పడంతో కంటి వైద్యుడికి చూపించారు. సైట్ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరీక్షలో తేలింది.తరచూ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతుండటంతోనే చూపు తగ్గినట్లు డాక్టర్ చెప్పారు. ముక్కు.. నోరు శ్వాస మీద ధ్యాసనే ఉండటం లేదు.నోరు.. కుటుంబీకులు, మిత్రులు పక్కనే ఉన్నా స్మార్ట్ ఫోన్‌కు బానిసైన వారు నోరు తెరవడమే మానేశారు. అన్నం తినేటప్పుడు కనీసం ఏదీ రుచిగా ఉందా అనే స్పృహ కూడా ఉండటం లేదు. చెవులు రింగుమని.. వినికిడి సన్నబడి నిరంతరం హెడ్ఫోన్లు పెట్టుకొనిపాటలు వినడం,సినిమాలు చూడడంతో వినికిడిసమస్యలు తలెత్తుతాయి. హెడ్ ఫోన్లలో శబ్ధతరంగాలునేగరుగా అతి పలుచని కర్ణభేరికి చేరుతుండడంతో వినికిడి సమస్యలువస్తాయి. వినికిడి శక్తి సాధారణంగా60–65 డెసిబుల్స్ మధ్య ఉంటేఆరోగ్యం. అయితే హెడ్ఫోన్లతో వినికిడి శక్తి 85 డెసిబుల్స్‌కు చేరుతుండడంతో చెముడు వస్తోంది. వెన్నునొప్పి సమస్యలు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న సమయంలో వెన్నుముకపై ఒత్తిడి పెరుగుతోంది. తల బరువు 4.5 కిలోల నుంచి 5.5 కిలోల బరువు ఉంటుంది. తలను ముందుకు వచ్చి స్మార్ట్‌ఫోన్ చూస్తున్న సమయంలో మెడపై భారం పెరుగుతుంది. 30 డిగ్రీల కోణంలో మెడవంచినపుపడు వెన్నుముకపై సుమారు 1.6 కిలోలభార పడుతుందని సర్వే చెప్పింది. దీర్ఘకాలం పాటుఈ స్థాయి భారం పడడం కొనసాగితే వెన్నుపూసలోనడుము నొప్పి సమస్యలు ఎదురయ్యే సమస్యలుఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకురెండు గంటలపాటు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించేవారికి ఈ ముప్పు అధికంగా ఉంటుంది. ప్రమాదాలకు మొబెల్ స్మార్ట్ ఫోన్లతో అప్పుడప్పుడు మృత్యుగంట మోగుతోంది. స్మార్ట్ ఫోన్లను చూస్తూ డ్రైవింగ్ చేసేవారికారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రైవింగ్ చేసే సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడుతూ,సెల్ఫీలు తీసుకుంటూ కొందరుప్రాణాలు కోల్పోతున్నారు. కళ్లు.. నిద్రలేవగానే మొదట టైం కోసం సెల్ అందుకుంటారు. తర్వాతవాట్సప్లో గుడ్ మా ర్నింగ్ అంటూచాటింగ్ మొదలై.. ఫేస్ బుక్‌లో లైక్‌లు, షేరింగ్‌లు.. గేమ్స్.. ఇలా గంటల తరబడి సెల్ చూస్తుండటంతో చూపు మందగిస్తోంది. చెవులు.. స్మార్ట్ ఫోన్ మాయలో పడిన వారికి పక్కనొళ్లు పిలిస్తే కూడా వినపడం లేదు. చూపు మందగిస్తోంది స్మార్ట్‌ఫోన్ విడుదలచేసే బ్లూ వయోలెట్కాంతి కంటి చూపునకు కీలకమైన రెటీనాపై ప్రభావం పడుతుంది. దీంతో కుంటిచూపు క్రమంగా క్షిణించి కళ్లు ఎరువుఎక్కడం, పొడిబారండం వంటివాటితో కంటిచూపు మందగించేప్రమాదం కూడా ఉందని నేత్రవైద్యులు చెబుతున్నారు. చర్మం.. 3జీ, 4జీ పుణ్యమా అంటూఇంటర్నెట్ స్పీడ్ ఎంత పెరిగిందో సెల్బానిసలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నారు. గంటల తరబడి కదలకుండా సెల్ ఫోన్ ఉపయోగించడంతో చర్మం మొద్దుబారి అనేక రుగ్మతలకు దారిస్తోంది. ఇలా.. స్మార్ట్ ఫోన్ మనిషి ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతోంది. స్లో పాయిజన్ గా మారిప్రజల ఆయుష్సు తగ్గిస్తోంది. ఆరోగ్యంతో పాటుమానవ సంబంధాలను దెబ్బతీస్తోంది. జిల్లాలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. వీరిలో గంటల తరబడి వాటిని వినియోగిస్తూ సెల్ బానిసలుగా మారిపోయారు.పక్కన ఏమి జరుగుతోందో కూడా చూడడం లేదు.పది మందిలో ఉన్న ఒంటరిగానే ఉంటున్నారు.మొబైల్ అతి వినియోగంతో అనార్థలే ఎక్కువని,చివరకు మానవ సంబంధాలపైన కూడా ప్రభా వాన్ని చూపుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవల ప్రకటించడంతో ఆందోళన మొదలైంది.ఎక్కువసేపు ఫోన్లలో మాట్లాడడం, చాటిం గ్ చేసేవారిలో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ప్రకటించింది. ఈ తరుణంలోఅవసరం మేరకు మొబైళ్లను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వినియోగదారుల్లో మార్పు రాకపోతేతీవ్ర పరిణామాలు ఎదర్కోవల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యువత..హల్‘సెల్’ ⇔ సెల్ ఫోన్ తోఎంతటి ఉపయోగాలుఉన్నాయో.. అంత కంటే అనర్థాలు ఎక్కువని ఇటీవల కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. స్మార్ట్ను అధికంగా వినియోగిస్తున్న వారిలోయువతే ఎక్కువగా ఉంటోంది. దీంతో ఆప్రభావం యువత హల్‘సెల్’ చేస్తోంది. ⇔ నేటి యువకులు నలుగురిలో ఉన్న సమయంలో కూడా సెల్కేప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులతో మాట్లా డుతున్నప్పుడే సెల్‌ఫోనే ప్రపంచమవుతోంది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ల.. ఇలా సామాజిక మాధ్యమాల్లో వచ్చే విషయాలపై దృష్టి సారిస్తున్నారే కానీ..పక్కన ఏమి జరుగుతుందో పట్టించుకోవడం లేదు. ⇔ చదువు, కుటుంబం కంటే అధిక సమయం సెల్కే కేటాయిస్తుండటం ఆశ్చర్యం కలిగించే అంశం. ⇔ నలుగురితో మాట్లాడేందుకు కూడా ఇష్టపడం లేదు. ఒంటరి జీవితానికి అలవాటుపడుతున్నారు. దీంతో చర్చలు లేకపోవడం విషయ పరిజ్ఞానం తగ్గిపోతోంది. ⇔ స్మార్ట్ ఫోన్ లో అధికంగా అనవసరవిషయాలు, గేమ్స్‌కే అధిక సమయంకేటాయిస్తున్నారు.. బంధువులు ఇంటికొస్తే కూడా వారితో మాట్లడకుండాసెల్ ఫోన్ చూస్తూ అదే జీవితం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ⇔ బాత్ రూమ్‌కు వెళ్తూ కూడా మొబైల్‌ను వెంట తీసుకెళ్లేఘనులూ ఉన్నారు. సెల్ఫోన్లకు బానిసలవుతున్నాం.. ఉదయం లేస్తే సెల్‌ఫోన్..పడుకుంటే సెల్‌ఫోన్..నిరంతర జీవితం ఫోన్‌పైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా యువత సెల్ఫోన్లకు బానిసలమైపోయాం. దీని కారణంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా..తగు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం. రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు సెల్ఫోన్లు దూరంగా పెట్టాలని వైద్యులు సూచిస్తున్నా అది సాధ్యం కావడం లేదు. సోషల్ మీడియాతోనే తామంతా ఎక్కువగా గడుపుతున్నాం. స్నేహితులకు ఫోన్, మెసేజ్‌లు, పోటీపరీక్షలకు పరీక్షలో ఉదయం చదువుకోవడానికి అలారం పెట్టుకునేది సెల్ఫోన్లోనే..అనారోగ్య భారీన పడతామని తెలిసినా వాడక తప్పడం లేదు. –ఈ. శివకుమార్, డిగ్రీ ఫైనల్ఇయర్,కృష్ణా కళాశాల -
పబ్జీగేమ్ వద్దంటేనే ఆత్మహత్యకు పాల్పడే స్థాయికి..
సోమాజిగూడ: వాస్తవికానికి దూరంగా.. ఇంటర్నెట్ గేమింగ్‌కు దగ్గరగా యువతరం వెళ్తున్నట్లు మానసిక వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే దానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు సైతం ఇంటర్నెట్ గేమింగ్‌కు అలవాటు పడుతున్నారు. అందుకు బాధ్యత వహించాల్సింది కూడా తల్లితండ్రులే అంటున్నారు వైద్య నిపుణులు. 10 సంవత్సరాల క్రితం ఇటు వంటి వ్యాధులతో తమ వద్దకు వచ్చిన వారు లేరని, అసలు తాము చదివిన చదువుకు ఇప్పుడొస్తోన్న వ్యాధులకు అసలు పొంతన ఉండటం లేదంటున్నారు. నగరాల్లోని పిల్లల తల్లితండ్రులు క్షణం తీరిక లేని జీవితాలు గడుపుతున్నారు. చిన్నారి మారాం చేస్తే ఆడుకో అంటూ సెల్ఫోన్లను చేతికి అందిస్తున్నారు. సెల్ ఫోనే ప్రపంచంగా వారికి తల్లితండ్రులే అలవాటు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పిల్లలకు మరో ధ్యాస ఉండటంలేదు. వారు యుక్త వయసుకు వచ్చినా... మదిలో అవే ఆలోచనలు మెదలడంతో ఎప్పుడూ ఫోన్లతో గడపం, చాటింగ్ చేయడం, ఇంటర్నెట్ గేమింగ్.. అదే ప్రపంచంగా వారు భావిస్తున్నారని నిమ్స్ ఆసుపత్రిలోని మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ జి.పద్మజ అభిప్రాయం వ్యక్తంచేశారు. పబ్జీగేమ్... పబ్జీగేమ్ వద్దంటేనే పిల్ల్లలు ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి వచ్చారంటే అందులో తల్లిదండ్రుల తప్పిదం కూడా ఉందంటున్నారు మానిసిక వైద్య నిపుణులు. అపార్ట్మెంట్ కల్చర్‌కు అలవాటుపడిన నగరవాసులు పిల్లల్ని స్కూలుకు పంపి చేతులు దులుపుకుంటున్నారు. డబ్బాల్లాంటి ఇరుకు గదుల్లో చదువు సాగుతూ వాస్తవిక పరిస్థితులకు పిల్లలను దూరం చేస్తున్నారు. చదువు, మార్కులు తప్ప.. బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు నేర్పాలనే విషయాన్నే మరిచిపోతున్నారు. ఇయర్ ఫోన్ మాట్లాడుతూ రైలు ఢీకొని మృతి నగరంలోని ఎమ్మెస్ మక్తాలో నివసించే ఓ యువతి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాకింగ్‌కు వెళ్లింది. నడక పూర్తి అయిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో రైలు పట్టాలు దాటాల్సి ఉంది. పట్టాలు దాటే సమయంలో అటుగా వచ్చే రైలును ఆమె గుర్తించలేదు. వెనుక నుంచి వచ్చిన రైలు ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. నడిచినా.. ప్రయాణం చేసినా.. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పక్కనున్నవారిని కనీసం గమనించడంలేదు. కాస్త ఆగి అటు.. ఇటు.. చూసినా ఆమె ప్రాణాలు దక్కేవి. రైలు పట్టాలు వద్ద సెల్ఫీ.. ప్రస్తుతం సెల్ఫీ అన్నది అందరికీ పట్టిన పెద్ద జాడ్యంలా మారింది. చిన్నా.. పెద్దా తేడా లేకుండా సెల్ఫీల కోసం ఆరాటపడుతున్నారు. ఇటీవల కాలంలో ఓ యువకుడు రైలు పట్టాల సమీపంలో నడిచే రైలుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డాడు. దీనినే సెల్ఫీ టేకింగ్ ఎడిక్షన్ డిజార్డర్ అంటారని వైద్యులు చెబుతున్నారు. పులితో సెల్ఫీ.. పులితో సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో లైకుల కోసం ఎగబడిన ఓ యువకుడు ఆపులికి ఆహారంగా మారిన ఘటన అందరికీ తెలిసిందే. ఇలా ంటి ఘటనలు నిత్యం అనేకం జరుగుతున్నా.. వారిలో మార్పు రాకపోగా... ఇంకా పెడదారి పడుతున్నారు. దీనికి కారణం ఇంటర్నెట్.. పిల్లల గేమ్స్‌పై దృష్టిపెట్టాలి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యాధులు అధికం అతున్నాయి. ఇంటర్నెట్ విస్తరించిన అనంతరం మంచితోపాటు చెడూ పెరిగింది. మంచిని వదిలి యువతరం చెడును ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహ భావంగా ఉండాలి. వారు ఎంచుకున్న మార్గం.. అనుసరిస్తున్న పద్ధతులను సున్నితంగా వివరించాలి. ఈ గేమ్స్ అన్నీ కల్పితమని, వాస్తవిక క్రీడలు ఎన్నో ఉన్నాయని, వాటిని పరిచయం చేయాలి. సూళ్లలో అధ్యాపకులు విద్యార్థులకు తగిన సూచనలు ఇవ్వాలి. పాఠశాల నుంచి వచ్చిన బిడ్డ ఏమిచేస్తున్నాడు.. అనే విషయాన్ని తెలుసుకోవాలి. – డాక్టర్ పద్మజ -
మాటకు బానిస
పాదుషా గారు తన తలపై నుంచి కిరీటాన్ని ఒక్క క్షణం పాటు కూడా తొలగించే వారు కాదు. మంత్రులు, సన్నిహితులు పాదుషా గారిని కాసేపు కిరీటం తీసి ఉపశమనం పొందండి అని చెప్పినా ససేమిరా అనేవారు. ఒకరోజు పాదుషా గారికి అత్యంత సన్నిహితుడైన మంత్రి ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు పాదుషాగారిని గుచ్చిగుచ్చి అడగడం మొదలెట్టాడు. పాదుషా గారు ఎంతగా దాటవేయాలనుకున్నా కుదరలేదు. చివరికి ఒక షరతుతో తన రహస్యాన్ని చెప్పారు. ‘‘నా తలపై ఒక కొమ్ము మొలిచింది అందుకే నేను ఎప్పుడూ కిరీటం తీయడానికి ఇష్టపడను’’ అని చెప్పారు. ఈ సంగతి మూడో మనిషికి చెప్పకూడదనే షరతుతో మంత్రిగారి ముందు బట్టబయలు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే రాజ్యమంతా ఈ విషయం దావానలంలా పాకింది. అది తెలిసి పాదుషా గారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెంటనే ఫలానా మంత్రిని హాజరుపరచాలని హుకుం జారీచేశారు. తన షరతును ఉల్లంఘించినందుకు శిక్షించేందుకు పాదుషాగారు ఒరలోనుంచి కత్తిని తీసి మంత్రిపై ఒక్క వేటు వేయబోయారు. అంతలోనే మంత్రి ఆ కత్తిని అడ్డుకుని ‘‘మీరు పాదుషా అయి ఉండి కూడా మీ వ్యక్తిగత రహస్యాన్ని గుట్టుగా ఉంచలేకపోయారు. మరి మేమెలా ఈ రహస్యాన్ని గుట్టుగా ఉంచగలుగుతామనుకున్నారు? నన్నెలా శిక్షించదలిచారో మీకూ అంతే శిక్ష పడాలి.’’ అని అన్నాడు. పాదుషాగారు ఆలోచనలో పడ్డారు. మాట, విల్లునుంచి వదిలిన బాణం తిరిగి రాలేవు. అంతరంగంలో ఉన్నంతవరకూ మాటలు మన బానిసలవుతాయి. అవి బయటికి రాగానే వాటికి మనం బానిసలవ్వాల్సి ఉంటుందన్నది ఇందులోని నీతి. – ముహమ్మద్ ముజాహిద్ -
యువతను శాసిస్తున్న స్మార్ట్ ఫోన్
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత పరిస్తితులను స్మార్ట్ ఫోన్ మాత్రం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఉంటుంది . అదృష్టమో దురదృష్టమో కాని స్మార్ట్ ఫోన్ నేడు మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైంది . చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, అందలమెక్కేసినట్లుగా చెలరేగిపోతోంది నేటి యువత. ఒక యువత అనే కాదు, స్మార్ట్ ఫోన్లకు దాదాపుగా ప్రతి ఒక్కరూ బానిసలుగా మారిపోతున్నారు. సిటీల నుండి ప్రారంభమైన స్మార్ట్ ఫోన్ల వాడకం ప్రస్తుతం ప్రతి గ్రామానికి పాకి వ్యక్తులను తనకు బానిసలుగా మార్చుకుంది. అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి అంతర్జాలానికి బానిసలుగా మారే ప్రమాదకరం ఏర్పడింది. సోషల్ మీడియా వ్యసనానికి బానిసలయ్యాక యువకులు త్వరగా డిప్రెషన్‌కి లోనవుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్‌లకు అలవాటైపోయిన యువకులు ఒక్కరోజు ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే తల్లడిల్లి పోతున్నారు. చిన్న పిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ పడగానే పిల్లవాడి ఏడుపు ఆపేస్తున్నాడంటే ఆలోచించండి. సి.సి.ఈ. విద్యా విధానంతో కూడా ప్రాజెక్టుల పేరుతో పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ విని యోగం పెరుగుతోంది. బాలలకు ఆలోచన గుణం మందగించడం, ప్రతి దానికి గూగుల్‌పై ఆధారపడటం మామూలై పోయింది. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతూ మన ఆరోగ్య విషయాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నాం. తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు లభించడంతో ప్రతీ ఒక్కరూ వాటిని క్షణాల్లో కొనేస్తున్నారు. చదువుకునే వయసులో పుస్తకాల పురుగులు కావాల్సిన పిల్లలు.. సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పాఠశాలలు, కళాశాలలు వదిలిన తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలు.. బ్యాగులను ఓ మూలన పడేసి.. స్మార్ట్ ఫోన్లలో మునిగితేలుతున్నారు. ఏ ఫ్రెండ్ ఏం పోస్టు చేశాడు? తను పెట్టిన ఫోటోకు ఎంతమంది లైక్స్ కొట్టారు? ఎంతమంది షేర్ చేశారు? ఏం కామెంట్స్ రాశారు? అని స్మార్ట్ ఫోన్లను పట్టుకుని వెతుకుతున్నారు. చివరకు తిండిని కూడా మరిచిపోతున్నారు. నిద్ర కూడా సరిగా పోకుండా అనారోగ్యానికి గురవుతున్నారడంలో సందేహం లేదు. స్మార్ట్ ఫోన్ పడకగదిలోకి ప్రవేశించింది, దాంపత్యజీవితాలలో చిచ్చులు, గొడవలు ప్రారంభమయ్యింది. అప్పడి వరకు ఆనందంగా గడిపిన జీవితం సెల్ ఫోన్ ప్రవేశంతో దు:ఖ సాగరంలోకి నెట్టి వేసింది. తన జీవిత భాగస్వామితో సన్నిహితంగా మెలగడానికి సమయం దొరకడం లేదు. నిద్ర కూడా కరువవుతోంది. తల్లిదండ్రులు వారి పిల్లల కంటే స్మార్ట్ ఫోన్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఒక నిదర్శనం. స్మార్ట్ ఫోన్‌తో సరదాగా గడిపే సమయంలో నాలుగో వంతు కూడా పిల్లలతో గడపడానికి కేటాయించడం లేదు. పరస్పరం కలుసుకుని, ముఖాముఖి సంభాషించుకోవడం అనేది జరుగడం లేదు. దీనితో అనురాగం, ఆప్యాయతలు, అభిమానం, ప్రేమల విలువల తెలియడం లేదు. యువతలో స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ ఫోటోలు తీయడం పిచ్చిగా మారింది. ఎక్కడ పడితే సెల్ఫీలు దిగడం మామూలైపోయింది. ఆన్ లైన్లో, ఫోన్ చాటింగ్‌లలో గడిపే యువత నిద్రించే సమయం బాగా తగ్గిపోయింది. నిద్రలేమి వలన డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది.స్మార్ట్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోయిన యువత తమ స్నేహితులతో, బంధువులతో, సన్నిహితులతో కాలం గడిపే సమయమే తగ్గిపోతోంది. ఫలి తంగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తీవ్రమైన వ్యాకులత, నిస్పృహ, ఒంటరితనానికి లోనౌతోంది యువత. జీవితాలలోను, ఉద్యోగాలలో కూడా భద్రత తక్కువ, చికాకులు ఎక్కువ. చిన్నపాటి సమస్యల పట్ల కూడా సంయమనం పాటించే గుణం యువకులలో కనిపించడం లేదు. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి : వ్యాసకర్త కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ 97039 35321 -
బతికొచ్చింది
హైదరాబాద్.. శంషాబాద్ ఎయిర్పోర్ట్.. ఇంటర్నేషనల్ అరైవల్స్. గుంపులు గుంపులుగా జనం.. ట్రాలీలు ట్రాలీలుగా లగేజ్‌తో బయటకు వస్తున్నారు. వాళ్లలో ఓ నడివయసు స్త్రీ కూడా ఉంది. ఆకుపచ్చ రంగు సల్వార్ కమీజ్‌తో బేలగా ట్రాలీని తోసుకుంటూ వచ్చింది. ఆ మొహంలో అలసట కనిపిస్తోంది. ఇంతలో ఆమెను చేరుకోవాల్సిన వాళ్లు చేరుకున్నారు. అక్కున చేర్చుకున్నారు. నీళ్ల సీసా అందివ్వగానే ఒక్క గుక్కన ఆ నీళ్లను తాగేసింది. ఆ ఒక్క గుక్కతో.. గొంతు దప్పికే కాదు, సొంతగడ్డను చేరాలనే పద్మ ఏడేళ్ల దాహమూ తీరినట్టయింది. ‘‘టిఫిన్ ఏం తింటారు?’’ అంటే.. ‘‘మనసు, కడుపు నిండినట్టయింది. ఏమొద్దు’’ అంది కళ్లనిండా నీళ్లతో. ‘‘కాస్త ఎంగిలి పడండి’’ అని బలవంతం చేస్తే.. ‘‘ఏడేళ్ల నుంచి ఇడ్లీ తినలేదు. అది ఇప్పించండి’’ అంది మొహమాటంగా. ఎప్పుడో.. బిడ్డకు ఏడేళ్ల వయసున్నప్పుడు బతుకుతెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లింది పద్మ. దాదాపు ఏడేళ్లు ‘చెర’లో ఉంది. బిడ్డను గుండెకు హత్తుకొని తనివి తీరా ఏడ్వాలి. అదే ఇప్పుడు ఆమె తొందర. నాలుగు రాళ్ల కోసం ఎడారికి బల్ల పద్మ పాండే స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం, బల్లపేట. ఒక్కతే కూతురు. పెయింటర్ అయిన శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఓ కూతురు పుట్టింది. శ్రీనివాస్‌కు ఊళ్లో పెద్దగా పనిలేదు. ‘దుబాయ్‌లో పని ఉంది. రూపాయల్లో కంటే దీరమ్స్‌లో బాగా సంపాదించొచ్చు’ అని బల్లపేటలో అప్పటికే గల్ఫ్‌లో ఉంటున్నవాళ్లు చెప్పారు. అతడికి ఆశ కలిగింది. దుబాయ్ వెళ్లాడు. అలాగే పద్మ. అంతకుముందే ఆ ఊరి నుంచి డొమెస్టిక్ వర్కర్స్‌గా (పనిమనుషులుగా) ఎడారిబాట పట్టిన వాళ్లు అక్కడ సంపాదన బాగా ఉంటుందని ఆమెకు చెప్పారు. భూమి కొనుక్కుందాం.. ఇల్లు కట్టుకుందాం.. బిడ్డను బాగా చదివిద్దాం.. అనుకున్నారు పద్మ, శ్రీనివాస్‌లు. భార్యను బెహ్రెయిన్ వెళ్లమని చెప్పాడు భర్త. వెళ్లి రెండేళ్లు ఉండి వచ్చింది. కొంచెం సంపాదించుకుంది. ఓ ఆర్నెల్లకు దుబాయ్‌కి అవకాశం వస్తే దుబాయ్‌కీ వెళ్లింది. కాని బెహ్రెయిన్లా లేదు.. అక్కడ తను ఉంటున్న షేక్ ఇంట్లో పరిస్థితి. హింసపెట్టేవాళ్లు. ఉండలేక ఇండియా వచ్చేసింది. మళ్లీ ఆర్నెల్లకి కువైట్‌కు వెళ్లే చాన్స్ దొరికింది. వెళ్లింది. వేధింపులు సాధింపులే జీతం! కువైట్‌లో ఓ బాబా (షేక్) ఇంట్లో పనిమనిషిగా కొలువు. బాబా చాలా మంచివాడు. ఏడాదిన్నర పాటు జీతం బాగానే ఇచ్చాడు. బాగా చూసుకునేవాడు కూడా. కాని కాలం అలా సాగలేదు. బాబా చనిపోయాడు. పద్మ పరిస్థితి తలకిందులైంది. నిజానికి ఆమెకు రెండేళ్లే ఆ ఇంట్లో వర్క్ పర్మిట్ వీసా ఉంది. బాబా చనిపోయేనాటికి రెండేళ్లు పూర్తికావొచ్చాయి. ఆమెను తిరిగి ఇండియాకు పంపించేయాలి. అయితే బాబా భార్య అలా చేయలేదు. పద్మను పంపించకపోగా ఆమెను వేధించడం మొదలుపెట్టింది. జీతం ఇవ్వడం మానేసింది. రోజుకు ఒక్కపూటే తిండి. ఇండియా నుంచి తనవాళ్లు ఫోన్ చేసినా.. తనకు ఫోన్ చేయాలనిపించినా ఫోన్ ఇచ్చేది కాదు. యజమాను రాలు ఇంకో పెళ్లి చేసుకుంది. ఆమె పెట్టే టార్చర్‌కు కొత్తగా వచ్చిన షేక్, యజమానురాలి కొడుకూ తోడయ్యారు. కొట్టేవాళ్లు. తిట్టేవాళ్లు. ఇంట్లోంచి బయటకు వెళ్లనీయకుండా కాపలా కాసేవారు. కూరలు కోసే చాకును వేడి చేసి ఒంటి మీద వాతలు పెట్టేవాళ్లు. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా అయిదేళ్లు గడిపింది. కూతురుని, భర్తను, తన తల్లిదండ్రులు, అత్తమామలను తలచుకుంటూ ఏడ్చేది. పద్మ మీద బెంగతో వాళ్ల నాన్న మంచం పట్టి కన్నుమూశాడు. ఈ విషయమూ ఆమెకు తెలియదు. తాళం చెవి బతికించింది! ఓ రోజు బట్టలు ఆరేసి వచ్చిన పద్మకు టీపాయ్ మీద బయటి గుమ్మం తాళంచెవి పడేసి తన గదిలోకి వెళ్తున్న యజమానురాలి కూతురు కనిపించింది. ఆ అమ్మాయి గది తలుపేసుకోగానే.. చివికిపోయిన నాలుగు జతల దుస్తులను తన బ్యాగ్‌లో కుక్కేసుకొని ఆ తాళంచెవితో గుమ్మం తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది. అప్పటికే ఒంటినిండా గాయాలతో, నీరసంగా ఉంది. ఏ దారో తెలియదు. ఎక్కడికి చేరుకోవాలో అంతకన్నా తెలియదు. పరిగెత్తి పరిగెత్తి అలసి సొమ్మసిల్లిపోయింది ఒకచోట. దారినపోయే వాళ్లు తట్టిలేపి పలకరించారు. అక్కడికి వచ్చిన ఓ కువైట్ మహిళ ఆమె గురించి తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులకు తన వివరాలు.. యజమాని వేధింపులు అన్నీ చెప్పింది. వాళ్లు కంప్లయింట్ రాసుకున్నారు. తన వాళ్ల నంబర్ ఇచ్చింది. మాట్లాడారు. పద్మను చికిత్స కోసం హాస్పిటల్‌కు పంపారు. ఆ తర్వాత అక్కడున్న ప్రవాసీ భారతీయ సామాజిక కార్యకర్తల సహాయమూ పద్మకు అందింది. వాళ్లందరి సహకారంతోనే చివరికి ఇలా ఇండియాకు వచ్చింది. తన వాళ్లను కలుసుకుంది. దూరపు ఎడారి ఎండమావులతో భ్రమింప చేస్తుంది. కాసుల పంట పండుతుందని ఆశ పుట్టిస్తుంది. వెళితే ఒయాసిస్సు జాడా కూడా కనపడనివ్వక దాహంతో గొంతు పిడుచకట్టుకు పోయేలా తిప్పుతుంది. ఉన్న సొమ్ము ఏజెంట్ చేతిలో పెట్టి సొమ్మసిల్లి ఇల్లు చేరుతారు. కొండంత పేరుకుపోయిన అప్పుల భయంతో మళ్లీ పాత భ్రమతో ఇంకో ఎడారి దేశం పయనం అవుతారు. ఇది నిరంతర ప్రక్రియ. గల్ఫ్ గల్లా గలగలలు వలస బాట పొమ్మని పోరుతుంటాయి. మంచిదే. కానీ ఆచితూచి.. మంచిచెడులు ఆలోచించి.. అన్నీ తెలుసుకుని వెళితేనే లాభమూ.. క్షేమమూ! మళ్లీ ఇక ఏ దేశానికీ పోను! నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. నా మీద బెంగతో మానాన్న చనిపోయాడు. చివరిచూపు కాదు కదా, చివరి మాట మాట్లాడే భాగ్యానిక్కూడా నేను నోచుకోలేదు. ఏడేళ్లు బందిఖానాలో ఉన్నా. నా పని నచ్చకపోతే నన్ను పంపించేయండి అని మొత్తుకున్నా. అయినా పంపలేదు. జీతం ఇవ్వలేదు. నా వాళ్లకు దూరమయ్యా. ఆరోగ్యం పాడైంది. ఇక ఎప్పుడూ ఏ దేశానికీ వెళ్లను. నా కూతురు, అమ్మ, మా అత్తమామలు, నా భర్త.. ఇదే నాలోకం. వాళ్లను చూసుకుంటూ ఉంటా. పనిమనుషులుగా గల్ఫ్‌కి వెళ్లేవాళ్లు ముందే ఆ చట్టాలు, ఆ పద్ధతులు, ఆ భాష పట్ల అవగాహన కల్పించుకోవాలి. అన్నీ తెలుసుకునే వెళ్లాలి. – బల్ల పద్మ పాండే – సరస్వతి ర -
మీకు గుడ్ మార్నింగ్..ఫోన్‌కు బ్యాడ్ మార్నింగ్!
గుడ్‌మార్నింగ్.. శుభోదయం.. సుప్రభాత్.. కాలే వణక్కం.. ఏ భాషలో చెబితేనేం..ఉదయాన్నే ఫోన్లలో పలకరించే ఈ గుడ్‌మార్నింగ్ మెసేజ్‌లే.. మన ఫోన్‌కు బ్యాడ్మార్నింగ్గా మారుతున్నాయట. ఎలాగంటే.. లో స్టోరేజ్ స్పేస్’.. మనం ఎన్నిసార్లు ఈ మెసేజ్ చూసుంటాం. దీనికంతటికీ కారణం.. ఆ గుడ్‌మార్నింగే!! మన దేశంలోని ప్రతి మూడు స్మార్ట్ఫోన్లలో ఒక ఫోన్ ఈ పరిస్థితి ఎదుర్కొంటోందని డేటా స్టోరేజీ సంస్థ వెస్ట్రన్ డిజిటల్ కార్పొరేషన్ తేల్చింది. అదే అమెరికాలో ప్రతి పది ఫోన్లలో ఒకదాని పరిస్థితి ఇలా ఉంది. పైగా.. ఈ శుభోదయం సందేశాన్ని మామూలుగా కాకుండా.. ఒక మంచి ఫొటో, పెయింటింగ్, ఒక ప్రముఖుడి కొటేషనో, మరికొన్ని కొత్త పద్ధతులను అనుసరిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని గూగుల్ పరిశోధనలోనూ వెల్లడైంది. ఈ మెసేజ్‌లు సూర్యోదయానికి ముందు మొదలై పొద్దున 8 గంటలకు పీక్కు చేరుకుంటున్నాయి. ఫేస్బుక్ సంస్థకు చెందిన వాట్సాప్ మెసేజింగ్ సర్వీస్‌ను దేశంలో 20 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. తమ కాంటాక్ట్ లిస్ట్ లోని వారందరికీ ఒకేసారి గుడ్‌మార్నింగ్ మెసేజ్‌ను పంపించేందుకు వీలు గా ఈ సంస్థ ఒక కొత్త స్టేటస్ మెసేజ్‌ను జోడించింది. అంతే.. ఒకేసారి వం దల మందికి మెసేజ్‌లు వెళ్లిపోతున్నాయి. మొన్నటికి మొన్న.. ఇంటర్నెట్ జామ్ అయిపోతుందా అన్న స్థాయిలో పీక్కు చేరింది. న్యూఇయర్ సందర్భంగా 2 వేల కోట్లకు పైగా నూతన సంవత్సర సందేశాలు పంపించారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదో రికార్డుగా భావిస్తున్నారు. పరిష్కారం ఇదిగో.. ఈ మెసేజింగ్ సమస్యకు పరిష్కారాన్ని కూడా గూగుల్ కనుక్కుంది. ‘ఫైల్స్గో’ అనే కొత్త యాప్ ద్వారా ఆయా ఫైల్స్‌ను తొలగించేందుకు, గుడ్‌మార్నింగ్ సందేశాలను డిలీట్ చేసేందుకు ఒక ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆర్టిఫీ షియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ మెసేజ్‌లను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గత డిసెంబర్లో ఢిల్లీలో ఈ యాప్‌ను గూగుల్ ఆవిష్కరించింది. -
కుమార్తె మృతి తట్టుకోలేక తండ్రి బలవన్మరణం
చిలకలగూడ: కుమార్తె మృతితో మనస్తాపానికి గురైన తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. పార్శిగుట్ట సంజీవపురానికి చెందిన పి.బాలకృష్ణ (30), లలిత దంపతులకు కుమార్తెలు పవిత్ర (9), ప్రత్యుష (8) సంతానం. అస్వస్థతలో గతనెల 12న చిన్న కుమార్తె పవిత్ర మృతి చెందింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలకృష్ణ అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 13న లలిత కుమార్తెను తీసుకుని రాంనగర్లో ఉండే సోదరి ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె 14వ తేదీ ఉదయం తన ఇంటికి వచ్చేసరికి తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా బాలకృష్ణ చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఊరేసుకొని మృతి చెంది ఉన్నాడు. భార్య ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. కుమార్తె చనిపోవడంతో మనస్తాపానికి గురై బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. -
తోకచుక్క
అమ్మ ముద్ద.. నాన్న ముద్దలా... ఈ అమ్మాయికి తాత చుక్క, అవ్వ చుక్క అలవాటైంది! తెలివైన అమ్మాయి. బ్రైట్ స్టార్. ఏం చెప్పినా ఇట్టే చేసేస్తుంది. రెండు సీసాల కల్లు తెమ్మన్నా... రయ్యిన వెళ్లి రివ్వున వస్తుంది. అలా.. వస్తూ వస్తూ.. తెస్తూ తెస్తూ.. కల్లుకు బానిస అయింది. చాలా విచిత్రంగా ఉంది కదూ! ఈ వార్త చదువుతూ మేమూ అలాగే అనుకున్నాం. కానీ, మీకు చెప్పకపోతే మన ఇళ్లల్లో కూడా అనర్థం జరుగుతుందేమోనన్న భయం కలిగింది. అందుకే ఈ కథనం.మన పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం.పాసివ్ స్మోకింగ్ వల్ల పిల్లల ఆరోగ్యంపాడవుతుందని తెలుసు. మన ప్రవర్తన వల్ల కూడా పిల్లలపై.. దుష్ర్పభావం పడుతుందని తెలుసుకోవాలి. మనం ఇచ్చే స్వేచ్ఛను పిల్లలు ఎలా వాడుకుంటున్నారో తెలుసుకోకపోవడం కూడా కరెక్ట్ కాదు. మన పిల్లలకు మనం అన్నీ ఇస్తాం.. రైజింగ్ స్టార్లు కావాలని. తోకచుక్కలు కావాలని కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా... పరిగిమండలం.. గొల్లపల్లి. ఓ అమ్మాయి.. వీధుల్లో పరిగెడుతోంది. స్కూటర్.. బైక్.. ఆటో.. ఏది వెళ్తున్నా దానికి అడ్డంగా వెళ్లి వాటిని ఆపుతోంది. ‘అన్నా... ఆకలి.. ఒక పాతిక రూపాయలివ్వవా?’ అంటూ చేయి చాస్తోంది. ‘లేవ్’ అని సమాధానమొస్తే.. పాతికనుంచి క్రమంగా అయిదు రూపాయల వరకు తగ్గించుకొని కాళ్లావేళ్లా పడుతోంది. మొత్తానికి ఎంతో కొంత డబ్బు తీసుకోందే వాళ్లను కదలనివ్వడంలేదు. అలా ఆ డబ్బు కొంత పోగవగానే హిందుపురం బస్ ఎక్కింది. అక్కడ బస్టాండ్‌లో దిగి, దగ్గర్లో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లింది. చవకబారు మందు కొనుక్కొని బాటిల్ మూత తీసి మంచినీళ్లు తాగినట్లు గటగటా తాగేసి సీసాను అవతల పారేసి తూలుతూ తూగుతూ మళ్లీ ఇంకో వాహనం ఆపడానికి పరిగెత్తింది. రోడ్డు మీద ఈ అమ్మాయిని చూసి ఆమె గురించి వాకబుచేసి ఓ ఆటోను మాట్లాడి అందులో కూర్చోబెట్టి గొల్లపల్లికి పంపించారు అక్కడివారు. అలా ఇంటికొచ్చిన పిల్లను ఆమె తల్లిదండ్రులు ఇనుపసంకెళ్లతో బంధించి ఇంటికి తాళం వేసి పనుల్లోకి వెళ్లిపోయారు! ఇది తరచు జరిగే తంతు. ఆ అమ్మాయి పేరు అమరావతి. వయసు పధ్నాలుగేళ్లు! ఆ పిల్ల ఇలా ఎందుకైంది? అని వాళ్ల నాన్న నాగరాజును అడిగితే తన ఆవేదనను కన్నీటితో వెళ్లగక్కాడు. అమరావతి.. ఆ తల్లిదండ్రులకు ఏకైక బిడ్డ. తండ్రి పేరు నాగరాజు. నిరుపేద. ఆయన, ఆయన భార్య కూలి చేస్తే కానీ ఆ కుటుంబానికి తిండి దొరకదు. కూలికి వెళ్లాలంటే అమరావతిని ఒంటరిగా వదిలివెళ్లలేని పరిస్థితి. అందుకే అలా ఇనుపసంకెళ్లతో ఇంట్లో బంధించి పనికి వెళ్తారు. వాళ్లు అటు వెళ్లగానే ఇటు ఈ అమ్మాయి పెద్ద పెద్ద అరుపులు, కేకలతో చుట్టుపక్కలవాళ్ల దృష్టి ఆ ఇంటిమీదకు మళ్లేలా చేస్తుంది. దగ్గరకు వచ్చిన వాళ్లతో బాత్రూమ్కు వెళ్లాలనో లేక కడుపునొప్పనో .. ఇంకోటనో.. ఇంకోటనో సాకులు చెప్పి మొత్తానికి వాళ్లు ఆ సంకెళ్లు విప్పేలా చేస్తుంది. విప్పగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా రివ్వున రోడ్డుమీదకు పరిగెత్తి.. వస్తున్న వాహనాలను అడ్డగించి వారిని డబ్బులు అడగడం మొదలుపెడ్తుంది. ‘ఏంచేయాలో.. ఈ పిల్ల చేత తాగుడు ఎలా మాన్పించాలో.. ఎలా కట్టడిచేయాలో అర్థంకావట్లేదు’ అంటూ బాధపడ్డాడు నాగరాజు. ఎలా అలవాటైంది? ముందునుంచీ నాగరాజు దంపతులకు కూలే ఆధారం. అందుకే తమ చంటిబిడ్డను తన తల్లిదండ్రుల దగ్గర పెట్టాడు నాగరాజు. అక్కడే పెరిగింది. అవ్వ, తాతయ్యలకు మద్యం అలవాటు. అమరావతికి కొంచెం ఊహరాగానే ఆ పిల్లచేతే మద్యం తెప్పించుకోవడం మొదలుపెట్టారు. అలా అవ్వ, తాతలకు మద్యం తెస్తూ తెస్తూ ఒకరోజు తనకూ మద్యం రుచి చూడాలనిపించింది. దొంగచాటుగా సీసా మూత తీసి గుక్కెడు మందు తాగింది. ఆ తాగడం క్రమంగా అలవాటుగా మారింది. ఆ అలవాటు వ్యసనమైంది. పధ్నాలుగేళ్లు వచ్చేసరికి ఇదిగో అలా తయారైంది అమరావతి. అంతకుముందు... మద్యానికి పూర్తిగా బానిసకాక ముందు అమరావతి చక్కగా స్కూల్‌కి వెళ్లేది. ఎనిమిదవ తరగతి వరకు చదివింది. చురుకైన విద్యార్థి కాకపోయినా... ఓ మోస్తరుగా ఉండేది. ప్రతిరోజూ దినపత్రికలు చదివేది. ఇంటికి వచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించేది. చక్కగా పలకరించేది. ఇప్పుడు? పరిస్థితి పూర్తిగా భిన్నం! ఇంటికి వచ్చిన వాళ్లను కూడా డబ్బులు అడుగుతోంది. మందుతోపాటు పాన్, వక్కపొడి, పొగాకు కూడా అలవాటైంది. ఓ వైపు మందు, ఇంకో వైపు ఇవి తింటూ మత్తులో తూలుతూ ఉంటుంది. అమరావతి చేత తాగుడు మాన్పించడానికి నాగరాజు దంపతులు చేయని ప్రయత్నంలేదు. చివరకు నాగరాజు తమ్ముడు అమరావతిని బెంగుళూరులోని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించాడు. అక్కడికి వెళ్లాక ఓ రెండు రోజులుగా ఆ అమ్మాయి తాగకుండా ... మామూలుగా ఉండడంతో జబ్బులేదని నిర్ధారించి ఇంటికి పంపించేశారు. కానీ వచ్చాక పరిస్థితి మళ్లీ ఎప్పటిలాగే ఉంది. - రాజేశ్, సాక్షి, హిందూపురం అర్బన్ మామూలు మనిషిని చేస్తే అదే పదివేలు మాకున్నదే ఒక్కతే కూతురు. కూలీ చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి మాది. అమరావతికి మంచి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేని వాళ్లం. పిల్లనేమో రోజురోజుకి మందుకోసం పిచ్చిదానిలా అవుతోంది. ఏం చేయాలో తెలియట్లేదు. దాతలు. అధికారులు మా మీద దయుంచి మా పిల్లకు వైద్యంతోపాటు చదువుచెప్పించి కాపాడాలని కోరుతున్నాం. మా బిడ్డను ఈ ఊరికి దూరంగా ఉన్న హాస్టల్లో ఉంచి విద్యాబుద్ధులు నేర్పించే వాళ్లొస్తే అంతకన్నా మాకు కావల్సిందేముంది? వాళ్లకు జన్మజన్మలకు రుణపడి ఉంటాం. ఇప్పటికే చేయిదాటి పోయింది.. ఇట్లాగే వదిలేస్తే పిల్ల జీవితం ఏమైపోతుందో అనే బెంగతోనే సగం చచ్చిపోతున్నాం! - నాగరాజు, అమరావతి తండ్రి బిహార్‌ను ఆదర్శంగా తీసుకోవాలి మద్యం ప్రవాహం ఆగితే ఎన్ని జీవితాలు.. ఇంకెన్ని కుటుంబాలు బాగుపడ్తాయో అన్నదానికి బిహార్‌లో జరుగుతున్న ఆరోగ్యకరమైన మార్పే మంచి ఉదాహరణ! మద్యం మత్తులో ఇల్లు, వాకిలి, భార్యాపిల్లల్ని వదిలివెళ్లిన ఓ భర్త.. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఆ మత్తు వదిలించుకొని భార్యాపిల్లల్ని గుర్తుకు తెచ్చుకొని దాదాపు మళ్లీ ఇంటికి చేరాడు. కుటుంబ సభ్యులకు సంభ్రమాశ్చర్యాలను పంచాడు! ఇది మద్య నిషేధం వల్ల కలిగిన శుభపరిణామం! ప్రస్తుతం బిహార్ ప్రజలు ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తుంటే.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మద్యంమాయలో తమ జీవితాలనే కాదు పిల్లల జీవితాలనూ నాశనం చేస్తున్నారు! దీనికి ఉదాహరణ.. అనంతపూర్జిల్లాలోని ఈ సంఘటనే! అమరావతి అనే ఈ అమ్మాయి దుస్థితికి కారణమైన ఆమె అవ్వ, తాతలు పశ్చాత్తాప పడ్డారో లేదో తెలియదు కాని ప్రభుత్వాలు మాత్రం ఆలోచనలో పడాలి. ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించే బాధ్యతను తీసుకోవాలి! -
రౌడీ ఆట
ఆదర్శం ప్రఖ్యాత అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ విన్సెంట్ లాంబార్డీ ఫుట్‌బాల్ ఆటను జీవితంతో పోలుస్తాడు. ‘ఫుట్‌బాల్ ఆట జీవితంలాంటిది. దానికి జీవితంలాగే... పట్టుదల, త్యాగం, అంకితభావం కావాలి’ అంటాడు. అవన్నీ అఖిలేష్లో ఉన్నాయి. అందుకే అతని జీవితం చీకటి నుంచి వెలుగు దారి వైపు మళ్లింది. చిన్నప్పుడు బడికి వెళ్లి చదువుకోవడం కంటే నాగపూర్ వీధుల్లో జులాయిగా తిరగడం ఇష్టం అఖిలేష్‌కు. తాను ఉండే అజాని మురికివాడలో కొందరు పిల్లలు సిగరెట్లు తాగడం, జూదం ఆడడం లాంటివి చేసేవారు. వారిని అబ్బురంగా చూసేవాడు అఖిలేష్. వారితో స్నేహం చేసి అన్ని దురలవాట్లనూ నేర్చుకున్నాడు. దాంతో ఆరవ తరగతిలోనే చదువు అటకెక్కింది. అఖిలేష్ తండ్రి నాగపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్యూన్‌గా పని చేసేవాడు. కొడుకుని గొప్పవాణ్ని చేయాలని ఎంతో ఆరాటపడేవాడు. కానీ ఎన్ని మంచి మాటలు చెప్పినా అఖిలేష్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆశ వదులుకున్నాడు. ఆయన ఫీలింగ్సని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు అఖిలేష్. రౌడీ షీటర్లతో కలిసి తిరిగి తానూ రౌడీషీటర్ అయ్యాడు. పోలీసుల హిట్ లిస్ట్‌లో తన పేరు చేరేంతగా నేరాలు చేశాడు. ఒకటీ రెండూ కాదు... నలభైకి పైగా కేసుల్లో అతడు నిందితుడు! ఆ నేరాల పరంపర అలానే కొనసాగి ఉంటే, అఖిలేష్ ఈపాటికి ఏ జైలులోనో ఉండేవాడు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అతని జీవితంలోకి విజయ్ బోర్సే వచ్చాడు. విజయ్ ఫుట్‌బాల్ ఆటగాడు. మాంచి ఒడ్డూ పొడవుతో హీరోలా ఉండేవాడు. దాంతో అజాని మురికివాడ యువత అతణ్ని ఆరాధించేవారు. హుందాగా, ఓ పోలిస్ ఆఫీసర్లా కనిపించే అతనంటే భయంలాంటి భక్తిని కనబర్చేవారు. ఒకరోజు విజయ్ అఖిలేష్‌ను, అతని స్నేహితులను పిలిచి... ‘‘రోజూ నాతో పాటు ఫుట్‌బాల్ ఆడండి. రోజుకు అయిదు రూపాయలిస్తాను. మీకు నచ్చదని తెలుసు. వారం రోజులు ఆడి చూడండి. తరువాత మీ ఇష్టం’’ అన్నాడు. ‘‘భయ్యా, అయిదు రూపాయలు కాదు, ఒక్క రూపాయి ఇచ్చినా ఆడతాం’’ అన్నాడు అఖిలేష్. కుర్రాళ్లంతా కూడా అదే అన్నారు. వాళ్లు అలా అంటారని విజయ్‌కి తెలుసు. అందుకే ఆ ప్రపోజల్ పెట్టాడు. అతని ప్లాన్ ఫలించింది. రెండు వారాల్లో కుర్రాళ్లంతా ఫుట్‌బాల్ ఆటకు అలవాటు పడిపోయారు. ఇంకా చెప్పాలంటే అడిక్ట్ అయిపోయారు. ఏ రోజైనా విజయ్ నేను ఆట ఆడలేను అంటే వాళ్లు ఒప్పుకునేవారు కాదు. అతన్ని బతిమాలి ఒక్క మ్యాచ్ అయినా ఆడేవారు. రోజులు గడిచాయి. అందరూ ఫుట్ బాల్లో మునిగి తేలుతున్నారు. ఎవ్వరికీ తాగుడు, జూదం, చిల్లర వేషాలు, కొట్లాటలు... ఏవీ గుర్తుకు రావడం లేదు. అఖిలేష్‌కి అయితే ఫుట్‌బాలే ప్రపంచమై పోయింది. అది అతణ్ని నేరాల నుంచి పూర్తిగా దూరం చేసింది. కానీ అతడి గతం మాత్రం అంత త్వరగా వదల్లేదు. ఒకరోజు ఏదో పాత కేసులో అతన్ని అరెస్ట్ చేయడా నికి పోలీసులు వచ్చారు. పారిపోయి శ్మశానంలో తల దాచుకున్నాడు అఖిలేష్. అప్పుడే అతనిలో ఆలోచన మొదలైంది. ‘‘ఎందుకిలా భయపడి పారిపోవడం, వల్లకాట్లో ఎన్నాళ్లని దాక్కోవడం, ఇక ఇలాంటి జీవితం వద్దు’’ అనకున్నాడు. వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. తాను మారానని, ఇక ఏ నేరం చేయనని జడ్జి ముందు ప్రమాణం చేశాడు. షరతులతో బెయిల్ వచ్చింది. అంతే... నాటి నుంచీ అఖిలేష్ ప్రవర్తన మారిపోయింది. విజయ్ ఆర్గనైజేషన్ అయిన ‘స్లమ్ సాకర్’లో చేరి, విరివిగా ఫుట్‌బాల్ ఆడడం ప్రారంభిం చాడు. జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగాడు. చివరికి 2009లో అతడికి అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ఆడే అవకాశం వచ్చింది. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోనే లేదు. అయితే తన గతాన్ని మర్చిపోలేదు అఖిలేష్. విజయ్ తన జీవితాన్ని బాగు చేసినట్టు, తాను కూడా కొందరి జీవితాలను తీర్చిదిద్దాలని నిర్ణయించు కున్నాడు. ‘లివింగ్ హోప్’ అనే సంస్థను స్థాపించాడు. మురికివాడల్లో ఉండే ఆణిముత్యాలను వెలికి తీస్తున్నాడు. అలాగే రెడ్‌లైట్ ఏరియాల్లో మగ్గే పిల్లలను సైతం అక్కడ్నుంచి తప్పిస్తున్నాడు. వాళ్లందరికీ ఉచితంగా ఫుల్బాల్ నేర్పిస్తూ, వారికి అందమైన భవితను అందించాలని తపిస్తున్నాడు. ‘‘ఆ పిల్లల్లో ఏ ఒక్కరు అంతర్జాతీయ స్థాయికి చేరినా నా జీవితం ధన్యమైనట్టే’’ అని సత్యమేవ జయతే షోలో ఎమోషనల్‌గా చెప్పాడు అఖిలేష్. అలాంటి ఆదర్శనీయమైన గురువు ఉంటే... అది సాధ్యం కాకుండా ఉంటుందా! -
గుడుంబాకు బానిసై వ్యక్తి మృతి
కరీంనగర్: సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన గోపిశెట్టి చందు(35) అనే వ్యక్తి శనివారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం గుడుంబాకు బానిసై అతిగా సేవిస్తూ అనారోగ్యం బారిన పడడంతో కరీంనగర్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు తెలిపారు. గుడుంబాను అరికట్టకుంటే గ్రామంలో మరింత మంది చనిపోయే ప్రమాదం ఉందని సర్పంచ్ పసెడ్ల స్వరూప తెలిపారు. వెంటనే ఎక్సైజ్ అధికారులు, పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు చేసి గుడుంబాను అరికట్టాలని కోరారు. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
దమ్ మారో దమ్: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ దాసోహం