ఒక్కో వ్యక్తికి ఒక్కో ఇష్టం ఉంటుంది. ఫుడ్‌కి సంబంధించినంత వరకు ఒక్కోక్కళ్లకి ఒక్కో విధమైన టేస్ట్ ఉంటుంది. దాన్నే అమితంగా ఇష్టపడటం జగుతుంది. కానీ మరి ఘోరంగా అది లేకపోతే బతకడమే కష్టం అన్నట్లు ఉండం. పరిస్థితుల రీత్యా ఎడ్జెస్ట్‌మెంట్ కూడా చేసుకుంటాం. లేదంటా లైఫ్ సాఫీగా జరగదు..బ్రేక్‌లు మాదిరిగా ఆగిపోతూ నత్తనడకలా ఉంటుంది. మనకు మనకే మన లైఫ్ కష్టంగా అర్థంకాని విధంగా ఉంటుంది. అది ఏ విషయంలోనేనాసరే!. కానీ ఇక్కడొక వ్యక్తి ఇష్టం మాములుగా లేదు! వింటే షాక్ అవ్వుతారు.
వివరాల్లోకెళ్తే..అమెరికాలోని కాన్వాస్‌కు చెందిన టైలర్ అనే వ్యక్తి ఓ స్ట్రేంజ్ అడిక్ట్. ఏంటిది? డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వంటివి అని అనుకోకండి. ఎందుకంటే? అవేమీ కావు. చెప్పాలంటే తనకు ఎంతో ఇష్టమైన ఆహారానికి బానిసగా మారాడు. ఆ ఫుడ్ లేకుండా మనోడికి ఆ రోజు స్టార్ట్ అవ్వలేనంతగా. టైలర్‌కి ఆ ఫుడ్ అంటే..అలాంటి ఇలాంటి ఇష్టం కాదు. ఇంతకీ.. టైలర్‌కి నచ్చిన ఫుడ్ ఏంటంటే.. :"ట్యూనా ఫిష్". ఇదంటా టైలర్‌కి చాలా పిచ్చి.
ఎంతలా అంటే వారానికి ఐదు క్యాన్‌లు హాంఫట్ చేసేంత పిచ్చి ఇష్టం. ప్రతి రోజు దాని వాసన చూడకుండా ఉండలేడట. అందుకని ఆ ట్యూనా ఫిష్ క్యాన్‌లను కూడా ఎప్పుడూ వెంటే జేబులో పెట్టుకుని తిరుగుతాడట. అందరూ చక్కగా రోజుని మంచి కాఫీతోనో లేదా గ్రీన్ టీ తోనో డే స్టార్ట్ చేస్తే టైలర్ మాత్రం ఈ ఫిష్ క్యాన్‌తో స్టార్ట్ చేస్తాడు. ఈ మేరకు టైలర్ అమ్మ మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి టైలర్‌కి ట్యూనా ఫిష్ అంటే ఇష్టం అని తెలుసు. కానీ మరి ఇంతలా అడిక్ట్ అవుతాడని ఊహించలేదు.
చిన్నతనంలో ఈస్టర్‌కి పిల్లలంతా బుట్టలో చాక్లెట్లు వేసుకుంటే ఇతను మాత్రం ఆ ట్యూనా ఫిష్ క్యాన్‌లు బుట్టలో పెట్టుకునేవాడు. వాడికి ఆ ఫిష్ అంటే ఇష్టం కదా! అలా పెట్టుకున్నాడని లైట్ తీసుకున్నా. కానీ అదే తప్పవుతుందని ఊహించలేదని వాపోయింది టైలర్ తల్లి. ప్రస్తుతం టైలర్ రోజు ఆ చేప వాసన చూడకుండా ఉండలేడు. అది తినకపోతే ఏం చేయలేను అన్నంత స్టేజ్‌లో ఆ ట్యూనా ఫిష్‌కి అడిక్ట్ అయ్యాడు. వామ్మో ఇలాంటి స్ట్రేంజ్ అడిక్షిన్‌లు కూడా ఉంటాయా! అనిపిస్తుంది కదా!.
(చదవండి: అయ్ బాబోయ్.. ఐఏ! రేకెత్తిస్తున్న భయాలు..భయం గుప్పెట్లో యువత)
Comments
Please login to add a commentAdd a comment