మీకు గుడ్‌ మార్నింగ్‌..ఫోన్‌కు బ్యాడ్‌ మార్నింగ్‌! | good morning to you..bad morning to phone | Sakshi
Sakshi News home page

మీకు గుడ్‌ మార్నింగ్‌..ఫోన్‌కు బ్యాడ్‌ మార్నింగ్‌!

Published Wed, Jan 24 2018 2:36 AM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM

good morning to you..bad morning to phone - Sakshi

గుడ్‌మార్నింగ్‌.. శుభోదయం..

సుప్రభాత్‌.. కాలే వణక్కం..

ఏ భాషలో చెబితేనేం..ఉదయాన్నే ఫోన్లలో పలకరించే ఈ గుడ్‌మార్నింగ్‌ మెసేజ్‌లే.. మన ఫోన్‌కు బ్యాడ్‌మార్నింగ్‌గా మారుతున్నాయట. ఎలాగంటే.. లో స్టోరేజ్‌ స్పేస్‌’.. మనం ఎన్నిసార్లు ఈ మెసేజ్‌ చూసుంటాం. దీనికంతటికీ కారణం.. ఆ గుడ్‌మార్నింగే!! మన దేశంలోని ప్రతి మూడు స్మార్ట్‌ఫోన్లలో ఒక ఫోన్‌ ఈ పరిస్థితి ఎదుర్కొంటోందని డేటా స్టోరేజీ సంస్థ వెస్ట్రన్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ తేల్చింది. అదే అమెరికాలో ప్రతి పది ఫోన్లలో ఒకదాని పరిస్థితి ఇలా ఉంది. పైగా.. ఈ శుభోదయం సందేశాన్ని మామూలుగా కాకుండా.. ఒక మంచి ఫొటో, పెయింటింగ్, ఒక ప్రముఖుడి కొటేషనో, మరికొన్ని కొత్త పద్ధతులను అనుసరిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని గూగుల్‌ పరిశోధనలోనూ వెల్లడైంది. 

ఈ మెసేజ్‌లు సూర్యోదయానికి ముందు మొదలై పొద్దున 8 గంటలకు పీక్‌కు చేరుకుంటున్నాయి. ఫేస్‌బుక్‌ సంస్థకు చెందిన వాట్సాప్‌ మెసేజింగ్‌ సర్వీస్‌ను దేశంలో 20 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. తమ కాంటాక్ట్‌ లిస్ట్‌ లోని వారందరికీ ఒకేసారి గుడ్‌మార్నింగ్‌ మెసేజ్‌ను పంపించేందుకు వీలు గా ఈ సంస్థ ఒక కొత్త స్టేటస్‌ మెసేజ్‌ను జోడించింది. అంతే.. ఒకేసారి వం దల మందికి మెసేజ్‌లు వెళ్లిపోతున్నాయి. మొన్నటికి మొన్న.. ఇంటర్నెట్‌ జామ్‌ అయిపోతుందా అన్న స్థాయిలో పీక్‌కు చేరింది. న్యూఇయర్‌ సందర్భంగా 2 వేల కోట్లకు పైగా నూతన సంవత్సర సందేశాలు పంపించారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదో రికార్డుగా భావిస్తున్నారు.  

పరిష్కారం ఇదిగో..

ఈ మెసేజింగ్‌ సమస్యకు పరిష్కారాన్ని కూడా గూగుల్‌ కనుక్కుంది. ‘ఫైల్స్‌గో’ అనే కొత్త యాప్‌ ద్వారా ఆయా ఫైల్స్‌ను తొలగించేందుకు, గుడ్‌మార్నింగ్‌ సందేశాలను డిలీట్‌ చేసేందుకు ఒక ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆర్టిఫీ షియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఈ మెసేజ్‌లను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గత డిసెంబర్‌లో ఢిల్లీలో 
ఈ యాప్‌ను గూగుల్‌ 
ఆవిష్కరించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement