#RepublicDay2024- MurmuHorsebuggy for parade రిపబ్లిక్ డే 2024 వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే.. దాదాపు 40 సంవత్సరాల విరామం తర్వాత, రిపబ్లిక్ డే పరేడ్‌లో గుర్రపు బగ్గీ సంప్రదాయం మళ్లీ వచ్చింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ‘సాంప్రదాయ గుర్రపు బగ్గీ’ కర్తవ్య పథానికి చేరుకున్నారు.ప్రెసిడెంట్ ముర్ముతోపాటు ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఈ ప్రత్యేక వాహనంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకులకు హాజరయ్యారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ బగ్గీకి రాష్ట్రపతి అంగరక్షకుడు ఎస్కార్ట్ చేశారు. భారత సైన్యంలోని అత్యంత సీనియర్ రెజిమెంట్ రాష్ట్రపతి అంగరక్షకుడుగా ఉంటారు. అయితే భద్రతా కారణాల రీత్యా 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత రిపబ్లిక్ డే కార్యక్రమాలకు అధ్యక్షుడి బగ్గీని ఉపయోగించడం నిలిపివేశారు. అప్పటిక అధ్యక్షులు వారి ప్రయాణానికి లిమోసిన్‌లను ఉపయోగిస్తున్నారు. అంతకుముందు 2014లో, బీటింగ్ రిట్రీట్ వేడుకలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరు గుర్రాల బగ్గీని నడిపి ఈ సంప్రదాయాన్నిపునరుద్ధరించిన సంగతి తెలిసిందే.
#WATCH | President Droupadi Murmu and French President Emmanuel Macron riding in a special presidential carriage escorted by the President's Bodyguard make their way to Kartavya Path pic.twitter.com/F4hOovJoua
— ANI (@ANI) January 26, 2024
కాగా 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో నారీశక్తి థీమ్‌కు అనుగుణంగా 26 శకటాలు దేశంలో మహిళా సాధికారతను ప్రదర్శిస్తూ కర్తవ్య పథంలో కవాతు చేశాయి. అగే తొలి సారి మహిళా అధికారుల సారధ్యంలో త్రివిధ దళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 105 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు Mi-17 IV హెలికాప్టర్లు కర్తవ్య పథంలో హాజరైన ప్రేక్షకులపై పూల వర్షం కురిపించాయి. 100 మంది మహిళా కళాకారులు నారీ శక్తికి ప్రతీకగా వివిధ రకాల తాళ వాయిద్యాలను వాయిస్తూ ‘ఆవాహన్’ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకలకు గాను దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ అంతటా 70వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment