పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో చెప్పాల్సిన పనిలేదు. అది శృతి మించేలా చెయ్యొద్దు. తల్లిదండ్రుల బాధ్యత వారికి భారంగా మారి స్వేచ్ఛను హరించేలా చేయకూడదు. పేరెంట్స్ ప్రవర్తనకు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయే పరిస్థితి తెచ్చుకుని దోషులుగా మిగిలిపోవద్దు. చైనాలో అలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు తప్పుదారి పట్టకూడదని తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో చేసిన పని ఆ అమ్మాయిని పోలీసులను ఆశ్రయించే పరిస్థితికి దారితీసింది.
అసలేం జరిగిందంటే..?.. 20 ఏళ్ల చైనా యువతి తన పేరెంట్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కంట్రోల్ చేయాలనే ధోరణి తారాస్థాయికి చేరిపోయిందని భరించలేనంటూ కన్నీళ్లు పెట్లుకుంది. అందువల్ల తనకు సాయం చేయాల్సిందిగా పోలీసులను కోరింది. సదరు బాధితురాలిని లీ అనే అమ్మాయిగా గుర్తించారు పోలీసులు. తన తల్లిదండ్రులు తన పట్ల మరింత ఘోరంగా ప్రవర్తిస్తున్నారని గత నెల జూలై 26నే గుర్తించానని అంటోంది. తన తప్పు చేసిన ప్రతిసారి తనఫోన్ నేలకేసి కొట్టి దారుణంగా తిట్టేవారిని చెప్పింది. అస్సలు ఇంత చిన్న పాటి తప్పలు కూడా వాళ్ల ఎలా కనిపెడుతున్నారో అర్థం కాలేదు.
ఆ తర్వాత తనకు తెలిసిందని.. తన బెడ్‌రూంలో స్పై కెమెరాను అమర్చి తన ప్రతి కదలికలను గమనిస్తున్నారని తెలిపింది. తన పేరెంట్స్ కంట్రోల్ పేరుతో తన స్వేచ్ఛను హరిస్తున్నారని, పైగా ఇది పీక్ స్థాయికి చేరిపోయిందంటూ వేదనగా చెప్పుకొచ్చింది. అందుకే ఇంట్లోంచి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చిచనట్లు పేర్కొంది. అంతేగాదు బతకడం కోసం పార్ట్ టైం జాబ్‌లు కూడా వెతుకున్నట్లు పోలీసులకు తెలిపింది. ఐతే ఇంట్లో తను కనిపించకపోవడంతో తన పేరెంట్స్ ఎక్కడ మిస్సింగ్ కేసు పెడతారన్న భయంతో ముందుగానే పోలీసులకు ఈ విషయం చెప్పి వెళ్లిపోవాలనుకున్నట్లు కన్నీటి పర్యంతమయ్యింది.
ఆమె గాథ విని పోలీసు అధికారి జాంగ్ చువాన్‌బిన్ లీని ఓదార్చే ప్రయత్నం చేశారు. అలాగే లీ పట్ల తల్లిందండ్రుల ప్రవర్తన సరైనది కాదని, సంరక్షణ తప్పు మార్గంలో ఉందని అన్నారు. వెంటనే ఆమె తల్లిందడ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. పిల్లలు వస్తువులు కారని, వాళ్లకు కాస్త స్పేస్ ఉండాలని చెప్పారు. ఇలా ఇంట్లోనే కెమెరాలతో నిఘా పెట్టి అభద్రతా భావానికి గురి చెయ్యకూడదన్నారు. ఈ ప్రవర్తన వారిని ఇంటినుంచి వెళ్లిపోయేలా చేయడమే గాక తప్పుడు మార్గంలో పయనించేందుకు కారణమవుతుంది కూడా అని గట్టిగా హెచ్చరించారు.
లీ తల్లిందండ్రులు కూడా వారి చేసిన తప్పిదం ఏంటో గ్రహించడమే గాక ఆ కెమెరాలను తీసేందుకు అంగీకరించారు. ఇక లీ కూడా తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు పలు రకాలుగా స్పదించారు. కనీసం జైలు కూడా ఇంతలా ఉండకదా అంటూ ఆ తల్లిదండ్రుల ప్రవర్తన పట్ల ఫైర్ అయ్యారు. పైగా ఇది చాటా భయంకరమైనదిగా పేర్కొంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: Nail Art: కాలేజ్‌కి కూడా వెళ్లలేదు.. కానీ ఏడాదికి ఏకంగా రూ. 5 కోట్లు..!)
Comments
Please login to add a commentAdd a comment