డైరెక్ట్‌గా ఓటీటీకి కీర్తి సురేశ్‌ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Keerthy Suresh Latest Raghu Thatha Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: ఓటీటీకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్‌ మూవీ.. డేట్ ఫిక్స్

Published Mon, Sep 9 2024 5:25 PM | Last Updated on Mon, Sep 9 2024 5:38 PM

Keerthy Suresh Latest Movie Raghu Thatha Streaming On This Ott

హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రఘుతాత. ఈ మూవీకి సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో టాలీవుడ్‌లో విడుదల కాలేదు.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రఘు తాత అందుబాటులోకి రానుంది. ఈ సినిమా హక్కులను జీ5 దక్కించుకోగా.. తెలుగు, త‌మిళం,మ‌ల‌యాళం, క‌న్న‌డ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ట్విటర్ వేదికగా పంచుకుంది.

ఆగష్టు 15న తమిళంలో విడుదలైన ఈ చిత్రం కోలివుడ్‌ ప్రేక్షకులను మెప్పించింది. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలతో ఫ్యామిలీ ఎంటర్‌టైయినర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో కీర్తి సురేశ్ హిందీకి వ్యతిరేకంగా పోరాడే మహిళ పాత్ర పోషించింది. మొదటి నుంచి హిందీ భాష‌ను వ్య‌తిరేకిస్తూ వ‌చ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాల‌ని ఎందుకు నిర్ణయం తీసుకుందో ఈ మూవీ చూస్తేనే తెలుస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement