ఆమెతో నాకు పోటీ కాదు.. అసూయ కూడా లేదు: వాణి | Kollywood Actress Vani Bhojan Acts In Tollywood Movie With Bharath | Sakshi
Sakshi News home page

Vani Bhojan: ఆమెతో పోటీ పడడం లేదు.. కానీ సంతోషమే: వాణి

Published Sun, Jul 16 2023 9:07 AM | Last Updated on Sun, Jul 16 2023 11:17 AM

Kollywood Actress Vani Bhojan Acts In Tollywood Movie With Bharath - Sakshi

ప్రస్తుతం హీరోయిన్లు అభినయం కంటే అందం, అదృష్టాన్నే ఎక్కువగా నమ్ముకుని ఉన్నారనే వాదన ఉంది. ఇకపోతే అదృష్టం వారి చేతిలో ఉండదు కాబట్టి అందాలారబోత పైనే దృష్టి పెడుతున్నారు. నటి వాణి భోజన్‌ ఈ విషయంలో తక్కువేమీ కాదు.  తాజాగా భరత్‌తో కలిసి రొమాన్స్‌ చేసిన చిత్రం 'లవ్‌'. ఇటీవల జరిగిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి అందాలను ఆరబోసే విధంగా దుస్తులు ధరించి వచ్చింది. దీంతో ఫొటోగ్రాఫర్ల దృష్టి అంతా ఆమె పైనే పడింది. 

(ఇది చదవండి: స్టార్‌ హీరోయిన్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!)

ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన వాణి భోజన్‌ ప్రస్తుతం రాధామోహన్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నానని.. ఇందులో యోగి బాబు ముఖ్య పాత్రను పోషిస్తున్నారని చెప్పింది. అదే విధంగా నటుడు అధర్వకు జంటగా ఒక చిత్రం చేస్తున్నట్లు తెలిపింది. 

కాగా చాలా గ్యాప్‌ తరువాత తెలుగులో ఒక్క చిత్రంలో నటించినట్లు చెప్పింది. ఎలాంటి సినీ నేపధ్యం లేని తాను నటిగా ఇంత దూరం పయనించడం సాధనే అని పేర్కొంది. ఇకపై కూడా మంచి పాత్రలు ఎంపిక చేసుకుని నటిస్తాననీ, ఇప్పటి వరకు తన జర్నీ సంతోషంగానూ, సంతృప్తిగానూ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మీ మాదిరి గానే బుల్లితెర నుంచి వచ్చిన నటి ప్రియా భవానీ శంకర్‌ను మీకు పోటీగా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తాను అలా భావించడం లేదని చెప్పింది. ఆమె చాలా చిత్రాల్లో నటిస్తున్నారని, పెద్ద నటులతో జత కడుతున్నారని, ఒక స్నేహితురాలిగా తనకు సంతోషమేనని చెప్పింది. అంతే ఆమెతో తనకు పోటీ కానీ, అసూయ లేవని స్పష్టం చేసింది. నా దారిలో నేను వెళుతున్నట్లు ఇందులో ఒకరితో ఒకరిని పోల్చాల్సిన అవసరం లేదని వాణి భోజన్‌ తెలిపింది. కాగా.. టాలీవుడ్‌లో మీకు మాత్రమే చెప్తా సినిమాతో పరిచయమైంది కోలీవుడ్ భామ. భరత్, వాణీ భోజన్ జంటగా నటిస్తోన్న లవ్ చిత్రం మలయాళ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. 

(ఇది చదవండి: జబర్దస్త్‌ అవినాష్‌ తల్లికి గుండెపోటు! స్టంట్స్‌ వేసిన వైద్యులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement