
కోలీవుడ్ హీరో జయం రవి తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణం ఒక సింగర్ అని టాక్ వినిపిస్తోంది. తాము విడిపోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ఒక లేఖను కూడా జయం రవి విడుదల చేశారు. ఇదే విషయంపై ఆయన సతీమణి ఆర్తి కూడా తీవ్రమైణ ఆరోపణలు చేశారు. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఒక సింగర్ అని నెట్టింట వార్తలు వస్తున్నాయి. జయం రవితో బెంగళూరుకు చెందిన కెనిషా ఫ్రాన్సిస్ డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: జయం రవి, ఆర్తి విడిపోవడానికి కారణం ఆ సింగరేనా..?)
అయితే తనపై వస్తున్న ఆరోపణలపై సింగర్ కెనీషా స్పందించింది. జయం రవికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తెలిపింది. మా మధ్య ఉన్నది కేవలం బిజినెస్‌కు సంబంధించిన రిలేషన్ మాత్రమే అని అన్నారు. నాకు బిజినెస్‌లో ఆయన సపోర్ట్ చేస్తున్నారు అంతే.. జయం రవి నాకు మంచి మిత్రుడని తెలిపింది. మీరంతా అనుకుంటున్నట్లు వారి విడాకులకు కారణం నేను కాదని తేల్చి చెప్పింది. తనపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాగొద్దంటూ సింగర్ కెనీషా కోరింది.
Comments
Please login to add a commentAdd a comment