Bharath
-
సినిమాల్లోకి రావడం ఇంట్లో ఇష్టం లేదు.. మాస్క్ వేసుకొని తిరుగుతున్నా: డైరెక్టర్
‘నా ఫ్యామిలీలో ఎవరికి సినీ పరిశ్రమలోకి నేను వెళ్లడం ఇష్టంలేదు. నేను అమెరికా నుంచి వచ్చిన సంగతి కూడా తెలియదు. వాళ్లను బాధ పెట్టడం ఇష్టం లేక నేను నా పేరును విస్కీగా మార్చుకున్నాను. నా ఫేస్ కనిపించకుండా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాను’అన్నారు యంగ్ డైరెక్టర్ విస్కీ. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ది బర్త్‌డే బాయ్'. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ విస్కీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా జీవితంలో జరిగిన రియల్‌స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాను. ఈ కథలో 80 శాతం వాస్తవ సన్నివేశాలు, 20 శాతం ఫిక్షన్ ఉంటుంది. అయితే ఫిక్షన్ కూడా నా లైఫ్‌లో వేరే సందర్బంలో జరిగిన సన్నివేశాలు యాడ్ చేశాను.బర్త్‌డే బంప్స్ వల్ల ఒక స్నేహితుడు ఎలా చనిపోయాడు.. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఎంతో ఉత్కఠభరితంగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ అన్ని రకాల ఎమోషన్స్ ఫీలవుతారు’ అన్నారు.నిర్మాత భరత్ మాట్లాడుతూ ' కథే ఈ సినిమా చేయడానికి రీజన్, నేను దర్శకుడు ఇద్దరం యూఎస్‌లో వుండేవాళ్లం. ఒకసారి తన లైఫ్‌లో జరిగిన ఈ సంఘటన నాకు చెప్పి సినిమా తీద్దాం అన్నాడు. అతను ఈ రియల్ కథ చెప్పగానే నేను ప్రొడ్యూస్ చేయాలని అనిపించింది. ఈ కథన నేను ఎమోషన్‌గానే ఫీల్ అయి చేస్తున్నాను.. ఇందులో మేసేజ్ ఏమీ లేదు. జరిగిన సంఘటన చూపించి.. దీని వల్ల లైఫ్‌లు ఎలా పోయాయి అనేది చూపిస్తున్నాం’ అన్నారు. -
అనకాపల్లిలో ఎన్నికల జోరు
-
చీరలతో ఈసీ కి దొరికిపోయిన టీడీపీ నేత టీజీ భరత్
-
కుప్పంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం- భరత్
-
‘లంబసింగి’ మూవీ రివ్యూ
టైటిల్: లంబసింగి నటీనటులు: భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు. నిర్మాణ సంస్థ: కాన్సెప్ట్ ఫిలింస్ నిర్మాత: ఆనంద్.టి సినిమాటోగ్రఫీ: కె.బుజ్జి సంగీతం:ఆర్ఆర్.ధ్రువన్ విడుదల తేది: మార్చి 15, 2024 ‘లంబసింగి'కథేంటంటే.. వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. తొలి పోస్టింగ్ లంబసింగి అనే ఊరిలో పడుతుంది. అక్కడ నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఊర్లోకి వెళ్లిన తొలి రోజే హరిత(దివి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్న నక్సలైట్ కోనప్ప కూతురు. కోనప్పతో పాటు చాలా మంది నక్సలైట్లు లొంగిపోయి అదే ఊరిలో సాధారణ జీవితం గడుపుతుంటారు. పోలీసు శాఖే వారికి పునరావాసం కల్పిస్తుంది. హరిత ఆ ఊరి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ తండ్రికి తోడుగా ఉంటుంది. సంతకాల పేరుతో రోజు కోనప్ప ఇంటికి వెళ్తూ హరితను ఫాలో అవుతుంటాడు వీరబాబు. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఓ రోజు వీరబాబు ప్రపోజ్ చేస్తే హరిత రిజెక్ట్ చేస్తుంది. అదే బాధలో ఉండగా.. పోలీసు స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేస్తారు. ఆ దాడిలో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ తగులుతుంది. అదేంటి? అసలు హరిత ఎవరు? వీరబాబు ప్రేమను ఎందుకు నిరాకరించింది? ఆమె కోసం వీరబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకు హరిత ప్రేమను వీరబాబు పొందాడా లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. పోలీసు-నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే ‘లంబసింగి’. దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. కానీ తెరపై అంతే కొత్తగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ప్రారంభం స్లోగా అనిపిస్తుంది. హరిత, వీరబాబుల మధ్య పరిచయం పెరిగాక కథనంలో వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు డిఫరెంట్‌గా డిజైన్ చేశాడు ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. ఊహించని ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా చేశాడు. ఇక ద్వితియార్థం మాత్రం మొదటి నుండి ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు దర్శకుడు. ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడే టైం ఇవ్వడు. స్క్రీన్ ప్లేని చాలా పగడ్బందీగా డిజైన్ చేసుకున్నాడు. వీరబాబు, రాజు గారు పాత్రలతో చేయించిన కామెడీ అలరిస్తుంది. క్లైమాక్స్ చాలా ఎమోషన్స్‌గా ఉంటుంది. బరువైన హృదయంతో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. ఎవరెలా చేశారంటే.. వీరబాబు పాత్రలో భరత్ చక్కగా నటించాడు. క్లైమాక్స్ లో ఇతని ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంటాడు. అలాగే కామెడీతో అలరించాడు అని చెప్పాలి. హరిత అనే పాత్రలో దివి ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. తెరపై కొత్త దివిని చూస్తారు. క వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఆర్.ఆర్.ధృవన్ నేపథ్య సంగీతం..పాటలు సినిమాకు చాలా ప్లస్ అయింది. సినిమాలోని ప్రతి పాట ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
అనకాపల్లి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మాటలకు సీఎం జగన్ ఫిదా
-
మొక్కలతో 'భారత్ మాత' అని రాసి గిన్నిస్ రికార్డు!
మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో తడోబా ఫెస్టివల్ 2024 సందర్భంగా మహారాష్ట్ర అటవీ శాఖ వేలాది మొక్కలను ఉపయోగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. హిందీలో 'భారత్ మాత' అనే పదాన్ని రాసేందుకు దాదాపు 65,724 మొక్కలను ఉపయోగించి ఈ రికార్డును సొంతం చేసుకుంది అటవీ శాఖ. చంద్రాపూర్‌లో జరగనున్న మూడు రోజులు తడోబా ఉత్సవం సందర్భంగా అటవీ శాఖ ఈ వినూత్న ప్రయోగానికి నాంది పలికి తొలి ప్రయత్నంలోనే ప్రపంచ రికార్డును సాధించిందని గిన్నిస్ వరల్డ్ రికార్డు పరిశీలకుడు స్వప్నిల్ దాంగ్రికర్ తెలిపారు. అలాగే 'భారత్ మాత' అనే దేశభక్తి పదంలో మొక్కల అమరికను ప్రదర్శించిన చిత్రాలను అటవీ శాక మంత్రి తడోబా అంధారి టైగర్ రిజర్వ్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ..తడోభా ఫెస్టివల్ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ 'భారత్ మాత' అనే పదాన్ని సృష్టించింది. సుమారు 26 రకాల జాతులకు చెందిన 65,724 మొక్కలతో గిన్నిస్ రికార్డు నెలకొల్పింది అని పోస్ట్‌లో పేర్కొన్నారు. The Maharashtra Forest Department, Government of Maharashtra, India has achieved a remarkable feat while paying a tribute to the nation, at Chandrapur.#WWD2024#TadobaFestival#ConnectingPeopleAndPlanet#DigitalInnovation#WildlifeConservation#SaveTigerMission#SaveTheTiger pic.twitter.com/tK2oMY0T78 — Tadoba-Andhari Tiger Reserve (@mytadoba) March 3, 2024 అటవీ శాఖ చేసిన ఈ సాహసాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ ఎంతగానో ప్రశంసించారు. ఇలాంటి ప్రయత్నాలు సిబ్బందిలో మనోధైర్యాన్ని పెంచుతాయని అన్నారు. అలాగే ఈ మొక్కలు వృక్షాలుగా పెరిగిన తర్వాత, డ్రోన్ సహాయంతో ఏరియల్ ఫోటోగ్రఫీ చేసినప్పుడు 'భారత్ మాత' అని వ్రాసి ఉన్న మొక్కలను చూడొచ్చని ముంగంటివార్ చెప్పారు. ఇక తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ (TATR) వన్యప్రాణుల సంరక్షణ, స్థిరమైన పర్యాటకం. మహారాష్ట్ర వారసత్వాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ఈ తడోబా ఉత్సవాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తుంది. चंद्रपुरच्या ‘भारतमाता’ शब्दाची गिनेस बुक ऑफ वर्ल्ड रेकॉर्डमध्ये नोंद..!@narendramodi @GWR @mytadoba @MahaForest #TadobaFestival2024 #GuinnessWorldRecord #SMUpdate #Chandrapur #GreenBharatmata pic.twitter.com/6y2koiqeT0 — Sudhir Mungantiwar (@SMungantiwar) March 3, 2024 (చదవండి: కళ్లు చెదిరే అందంతో రంగులీనుతుంది ఆ ఎడారి..అడుగుపెట్టారో అంటే..!) -
‘దస్తగిరి వెనుక సునీత, ఆమె భర్త ఉన్నారు’
వైఎస్సార్ జిల్లా: మాజీ మంత్రి వైఎస్ వివేకాను హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడని భరత్ యాదవ్ తెలిపారు. వివేకా కేసులో జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది అని భరత్ యాదవ్ స్పష్టం చేశారు. కాగా, భరత్ యాదవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పుడు దస్తగిరి వైఎస్ కుటుంబంపై బురదజల్లుతున్నాడు. దస్తగిరి వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నారు?. ఇది వరకు.. ఇప్పుడు దస్తగిరి ఆర్థిక పరిస్దితి ఎంటీ?. సునీత ఇంట్లో పని మనిషి బీబీ అనే మహిళ ద్వారా దస్తగిరితో సునీత మాట్లాడుతుంది. డబ్బు కూడా అమె ద్వారానే దస్తగిరికి అందుతోంది. అందుకే సునీత మాట్లాడమన్నట్లు దస్తగిరి మాట్లాడుతున్నాడు. దస్తగిరికి ప్రాణహానీ ఉన్నప్పుడు.. వంట మనిషి బీబీ ద్వారా ప్రాణహానీ ఎందుకు ఉండదు. ఎన్నికల్లో పోటీ చేస్తాను అనేంత డబ్బు ఎలా వస్తుంది?. ఐస్ బండి నడిపే దస్తగిరికి ఇంత డబ్బు ఎలా వచ్చింది?. ఖచ్చితంగా దస్తగిరి వెనక సునీత, అమె భర్త రాజశేఖర్ ఉండి మాట్లాడిస్తున్నారు. వైఎస్ వివేకా రెండవ భార్యకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఆయన చంపించారు. వైఎస్ వివేకాను హత్య చేసింది దస్తగిరి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి. వైఎస్ వివేకా హత్య తర్వాత దస్తగిరి, సునీల్, ఎర్ర గంగిరెడ్డి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి నుంచి డబ్బు రావాలి అని ఎర్ర గంగిరెడ్డి చెప్పేవారు. జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది’ కీలక వ్యాఖ్యలు చేశారు. -
కుప్పం ప్రజల సాక్షిగా బాబుకు బుల్లెట్ దింపిన భరత్
-
సీఎం జగన్ పై ఎమ్మెల్సీ భరత్ అదిరిపోయే పాట దద్దరిల్లిన సభ
-
భువనేశ్వరి రెస్ట్ ఇస్తుందో లేదో కాని... చంద్రబాబుకి మేము ఎప్పుడో రెస్ట్ ఇచ్చేశాం ఎమ్మెల్సీ భరత్ కౌంటర్
-
కుప్పంలో చంద్రబాబా పోటీపై కుండబద్దలుకొట్టిన భువనేశ్వరి
-
యాత్ర 2 ఒక అద్భుతమైన ఘట్టం
-
గ్లోబల్ సౌత్ ఛాంపియన్ ఎవరు?
గ్లోబల్ సౌత్ అనే మాటను ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రిక 2023 సంవత్సరపు పదంగా ప్రకటించింది. గ్లోబల్ సౌత్ అంటే దక్షిణార్ధ భూగోళ దేశాలు అని స్థూలార్థం. ఇదే పరిగణిస్తే చైనా, ఇండియా రెండూ ఇందులోకి రావు. భౌగోళికత కన్నా... తక్కువ, మధ్యాదాయ దేశాల సమూహంగా దీన్ని చూస్తున్నారు. భారీ ఆర్థిక వ్యవస్థలు ఉన్నప్పటికీ చైనా, ఇండియా తమను ఎదుగుతున్న దేశాలుగానే భావిస్తున్నాయి. అలా గ్లోబల్ సౌత్ దేశాలకు నాయకత్వ స్థానం కోసం పోటీపడుతున్నాయి. గ్లోబల్ సౌత్ కొన్నిసార్లు చైనా, భారత్ మద్దతును అంగీకరించడానికి సిద్ధంగా ఉంటూనే... ఈ రెండు దేశాల్లో దేన్నయినా నిరపాయకరమైన నాయకుడిగా లేదా ఛాంపియన్‌గా చూస్తున్నదా అనేది చెప్పడం కష్టం. గత ఏడాది భారతదేశంలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ ఫర్ హ్యూమన్ సెంట్రిక్ డెవలప్మెంట్’ అనే వర్చువల్ సదస్సును నిర్వహించారు. భారతదేశం ‘గ్లోబల్ సౌత్’ వాణిగా ఉంటుందని ప్రకటించారు. 2023లో జీ20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్, ఈ సదస్సు ఎజెండాను వివరించడానికి తనకున్న ప్రత్యేక హక్కులో భాగంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్థిరమైన రుణాలు, ఆహార భద్రత, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, బహుపాక్షిక బ్యాంకు సంస్కరణలు, వాతావరణ ఫైనాన్ ్స వంటి ముఖ్యమైన సమస్యలను ముందుకు తెచ్చింది. గ్లోబల్ సౌత్ ఛాంపియన్ గా భారతదేశానికి ఉన్న స్థానం లేదా ప్రాముఖ్యత అనేది అభివృద్ధి, పాలన సమస్యలకు మాత్రమే పరి మితం కాలేదు. తన పాశ్చాత్య వ్యూహాత్మక భాగస్వాములైన అమె రికా, ఫ్రాన్స్లకూ, అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికీ మధ్య వార ధిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన పాత్రను పోషించాలనే స్పష్టమైన కోరిక భారత్‌కు ఉంది. పర్యవసానంగా, గ్లోబల్ సౌత్, దానిలో భారతదేశ పాత్ర రెండింటిపై చాలా శ్రద్ధ చూపడం జరిగింది. (గ్లోబల్ సౌత్ అనే పదబంధాన్ని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రిక 2023 సంవత్సరపు పదంగా ప్రకటించింది.) అయితే గ్లోబల్ సౌత్ అనే భావన కొత్తది కానట్లే, దానికి నాయకత్వం వహించాలనే ఆకాంక్ష కూడా భారత్‌కు కొత్తదేమీ కాదు. ఈ పాత్రను చేపట్టడానికి భారత్ చాలా కాలంగా చైనాతో పోటీపడుతోంది. గ్లోబల్ సౌత్‌లో ఎవరెవరు ఉన్నారు, ఇది ఎందుకు ఏర్పడింది అనేది కూడా ముఖ్యమైన అంశమే. గ్లోబల్ సౌత్ దేశాలు భారతదేశాన్ని లేదా చైనాను తమ వాణిగా స్వాగ తిస్తాయా అనేది కూడా బహిరంగ ప్రశ్నే. గ్లోబల్ సౌత్ అనే పదం ఒక భౌగోళిక మార్మిక విషయంగా ఉంటోంది. ఎందుకంటే ఉత్తర ఆఫ్రికాతో పాటు చైనా, భారత్ వంటి దేశాలు నిజానికి ఉత్తరార్ధ గోళానికి చెందుతాయి. తక్కువ లేదా మధ్య–ఆదాయ దేశాలుగా ప్రపంచ బ్యాంకు వర్గీకరించిన దేశాల సమూహంగా గ్లోబల్ సౌత్‌ను నేడు ఎక్కువగా అర్థం చేసుకుంటు న్నారు. దీని భౌగోళిక మూలాలను 1926లో ఇటాలియన్ మార్క్సిస్ట్ తత్వవేత్త ఆంటోనియో గ్రామ్సీ రాసిన ‘ద సదరన్ క్వశ్చన్’ వ్యాసంలో గుర్తించవచ్చు. దీనిలో ఆయన తక్కువ అభివృద్ధి చెందిన, దక్షిణ ప్రాంత ఆలోచనను మొదటిసారిగా లేవనెత్తారు. ఉత్తర ఇటలీ లోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంపన్న ప్రాంతాన్ని తక్కువ అభివృద్ధి చెందిన దక్షిణాదితో పోల్చారు. రెండోదాన్ని పూర్వం నుండి పెట్టుబడిదారులు వలసరాజ్యంగా మలిచారని గ్రామ్సీ నిర్ధారించారు. అంతర్జాతీయ సమాజాన్ని... ఆదాయం, భావజాలం రెండింటితో వేరు చేయబడిన భిన్న ప్రపంచాలుగా ఫ్రెంచ్ జనసంఖ్యాశాస్త్ర నిపు ణుడు ఆల్ఫ్రెడ్ సావీ 1952లో వర్గీకరించారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో గ్రామ్సీ నిర్ధారణలు మరింతగా ముందుకొచ్చాయి. మొదటి ప్రపంచంలో పెట్టుబడిదారీ పశ్చిమదేశాలు ఉన్నాయి. సోవి యట్ యూనియన్, దాని సోషలిస్టు మిత్రులు రెండవ ప్రపంచంలో ఉన్నాయి. కొత్తగా వలసపాలనకు దూరమై, ఎక్కువగా పేదరికంలో ఉన్న దేశాలు మూడవ ప్రపంచంగా ఉంటున్నాయి. అమెరికన్ వామ పక్ష నేత కార్ల్ ఓగ్లెస్బీ 1969లో ఈ మూడవ ప్రపంచాన్ని ‘గ్లోబల్ సౌత్’ అని పిలిచాడు. ‘గ్లోబల్ సౌత్‌పై ఉత్తరాది ఆధిపత్యం’ గురించి కలత చెందాడు. ఇండోనేషియాలోని బాండుంగ్‌లో 1955లో జరిగిన ఆసియా– ఆఫ్రికా కాన్ఫరెన్ ్స... తొలి గ్లోబల్ సౌత్ సమావేశాలలో ఒకటి. ఈ సదస్సుకు హాజరైన వాటిలో ఈ రోజు గ్లోబల్ సౌత్ అని భావించే దేశాలే కాకుండా సౌదీ అరేబియా, జోర్డాన్, టర్కీ వంటివి కూడా ఉన్నాయి. చాలావరకు కొత్తగా వలసపాలన నుంచి బయటపడిన ఈ దేశాలకు సదస్సు ఎజెండాలోని అతి ముఖ్యమైన అంశం... వలస వాదాన్ని, జాతి వివక్షను వ్యతిరేకించడమే. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఏ ఒక్క అగ్రరాజ్యం పక్షం వహించకుండా ఉండాలనే ఆలోచన కూడా బాండుంగ్ సదస్సులోనే పుట్టింది. చైనా, భారత్ రెండూ ఈ ప్రపంచానికి చెందినవి. దీనికి నాయ కత్వం వహించాలని ఈ రెండూ ఆకాంక్షించాయి. ఈ సదస్సులో చైనా ప్రధానమంత్రి చౌ ఎన్ లై, భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించారు. కొత్తగా వలసపాలన నుంచి బయటపడిన ప్రపంచానికి ఛాంపియన్లుగా నిలవగల తమ సామ ర్థ్యాన్ని ప్రదర్శించడానికి పోటీపడ్డారు. బాండుంగ్ సమావేశం తర్వాత, భారతదేశం అలీనోద్యమ (నామ్) ప్రముఖ వాణిగా ఆవిర్భవించింది. తరచుగా నైతిక ఆధిపత్య స్థానాన్ని తీసుకుంటూ వచ్చింది. చైనా అలీనోద్యమంలో సహాయక పాత్రను పోషిస్తూనే, మావో హయాంలో అనేక ఆఫ్రికన్ దేశాలకు విదేశీ సహాయాన్ని అందించడం ప్రారంభించింది. చైనా తరచుగా తన కంటే తలసరి స్థూల జాతీయోత్పత్తి (జీఎన్ పీ) ఎక్కువగా ఉన్న దేశాలకు కూడా సహాయం చేసింది. అయితే ప్రచ్ఛన్న యుద్ధానంతర ప్రపంచంలో వలసవాద వ్యతిరేకత, అలీనోద్యమం రెండూ... గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సాధా రణ లింకుగా తమ ప్రాముఖ్యత కోల్పోయాయి. చమురు సంపన్న దేశమైన సౌదీ అరేబియా వర్గంలోని కొన్ని దేశాలను ఇందులో చేర్చడం కూడా అసంబద్ధంగా కనిపించింది. కానీ నయా – సామ్రాజ్య వాదమని చెబుతున్న పాశ్చాత్య ఆధిపత్యాన్నీ, దాని జోక్యాన్నీ వ్యతి రేకించాలనే భావన మాత్రం ఒక సాధారణ సూత్రంగా కొనసాగింది. ఇది చైనా, భారత్ రెండింటినీ ఆకర్షిస్తూనే ఉంది. ఇప్పుడు భారీ ఆర్థిక వ్యవస్థలతో ఎదుగుతున్న శక్తులుగా వీటిని పరిగణిస్తున్నప్పటికీ, ఇప్పటికీ సహాయం అవసరమవుతున్న, పాశ్చాత్య జోక్యాన్ని వ్యతిరే కిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లాగే ఉన్నామనీ, అందువల్ల మిగిలిన గ్లోబల్ సౌత్ పట్ల ఆసక్తులు కలిగి ఉన్నామనీ భారత్, చైనా నొక్కి చెబుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సులభంగా రుణాలనూ, పెట్టుబడులనూ కల్పిస్తున్న చైనా... కఠిన మైన, ఏమాత్రం సానుభూతి లేని అమెరికన్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రదర్శించుకుంటోంది. మరోవైపున చైనా పెట్టుబడులు, ఫైనాన్సింగ్‌తో సరితూగలేని భారత్... గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను అర్థం చేసుకున్న దేశంగానూ, పశ్చిమ దేశాల, ముఖ్యంగా అమెరికా దగ్గర మన్నన ఉన్న దేశంగానూ తనను చూపుకుంటోంది. కానీ గ్లోబల్ సౌత్ కొన్నిసార్లు చైనా, భారత్ మద్దతును అంగీకరించడానికి సిద్ధంగా ఉంటూనే, ఈ రెండు దేశాల్లో దేన్నయినా నిరపాయకరమైన నాయకుడిగా లేదా ఛాంపియన్‌గా చూస్తోందా అనే విషయం స్పష్టం కావడం లేదు. ప్రపంచ రుణ సంక్షోభం పట్ల చైనా విముఖత, పశ్చిమ ఆఫ్రికాలో సహజ వనరులను అది దుర్విని యోగపర్చడం ఘర్షణను సృష్టించింది. మరోవైపున, భారత్‌తో వ్యవహరించడం కష్టమన్న భావన ఏర్పడింది. దీనికి ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలలో భారత్ అడ్డుకునే వాదం తోడ యింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రయోజనం కలిగించే అంశా లను, ఉదాహరణకు మత్స్య రాయితీల వంటి వాటిని వ్యతిరేకించి భారత్ కాస్త చెడ్డపేరు తెచ్చుకుంది. క్లుప్తంగా చెప్పాలంటే... చైనా, భారత్ దశాబ్దాలుగా గ్లోబల్ సౌత్‌లో ప్రముఖ పాత్ర పోషించాలని కోరుకుంటున్నాయి. ఆ ఆకాంక్షలు నెరవేరతాయో లేదో మాత్రం చూడాల్సి ఉంది. మంజరీ ఛటర్జీ మిల్లర్ వ్యాసకర్త సీనియర్ ఫెలో, కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్ ్స; అసోసియేట్ ప్రొఫెసర్, బోస్టన్ విశ్వవిద్యాలయం (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
'పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయితే'.. ఆసక్తి పెంచుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
భరత్, నవీన రెడ్డి జంటగా నటిస్తోన్న చిత్రం బీఫోర్ మ్యారేజ్'. ఈ చిత్రానికి శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హనుమ క్రియేషన్ బ్యానర్‌పై ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ ఫిలించాంబర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్నకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. 'గత ఏడాది చిన్న సినిమాల హవా నడిచింది. ఈ ఏడాది 'హనుమాన్' చిత్రం కొనసాగించిన ప్రభంజనం మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్టవ్వాలి. ట్రైలర్ చూస్తే యూత్‌కు మంచి మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 'పెళ్లికి ముందు తప్పు అనిపించని పొరపాటు.. లైఫ్‌లో ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని.. అదే విషయాన్ని వాస్తవానికి దగ్గరగా తెరకేక్కించాం. టీమ్‌లో ప్రతి ఒక్కరూ బాగా చేశారు సినిమా హిట్టవుతుందన్న నమ్మకం ఉంది.' అని అన్నారు. నిర్మాత జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 'చిన్న విషయమే కదా అని యువత పెడదోవ పడితే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించాం. సినిమాలో సింగర్ మంగ్లీ పాడిన పాట భారీ హిట్టవుతుంది. యువతీయువకులకు మంచి మెసెజ్ ఉంటుంది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు. ఈ చిత్రంలో అపూర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. పోస్టర్ చూడగానే యూత్‌కు మంచి సందేశాన్నిచ్చే చిత్రంలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బీఫోర్ మ్యారేజ్ అనే టైటిల్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. పెళ్లికి ముందే అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఈ సోసైటీ ఎలా చూస్తుందనే సామాజిక కోణంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. -
పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి
చెన్నై: భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. పాకిస్థాన్ క్రికెటర్ల సమక్షంలో అభిమానుల ప్రవర్తన ఎంత మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు. క్రీడలు దేశాన్ని ఐక్యమత్యం చేయడానికి ఉపయోగపడాలి కానీ.. ద్వేషం వ్యాప్తి చెందడానికి సాధనంగా వాడకూడదని చెప్పారు. శనివారం గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూంకు వస్తున్న క్రమంలో అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సోషల్ మీడియాలో అభిమానుల ప్రవర్తనపై భిన్నరకాల స్పందనలు వచ్చాయి. అభిమానుల అర్ధం లేని వ్యూహంగా కొందరు కామెంట్ పెట్టారు. మరో పది రోజుల్లో చెన్నైలో పాక్ క్రీడాకారులు రెండు మ్యాచ్‌లు అడటానికి వస్తారు. వారందరిని గౌరవంగా స్వాగతించండి అంటూ మరికొందరు స్పందించారు. చెన్నైలో పిచ్ వారికి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న గుజరాత్లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లోనే బాబార్ ఆజాంకు కోహ్లీ ఆరుదైన బహుమతి కూడా అందించాడు. తన సంతకం చేసిన జెర్సీని కానుకగా పంపించి సోదరభావాన్ని చాటుకున్నాడు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా మహ్మద్ షమీ బౌలింగ్ వేసే క్రమంలో అభిమానులు జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేయడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇదీ చదవండి: Udayanidhi Stalin: సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు -
విలేజ్ బ్యాక్ డ్రాప్లో ‘ఏందిరా ఈ పంచాయితీ’
గ్రామీణ నేపథ్యంలో వస్తున్న చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ లభిస్తోంది. బలగం లాంటి సినిమాలు ఆ నేపథ్యంలోనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఆ కోవలోనే ‘ఏందిరా ఈ పంచాయితీ’ అంటూ ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్లో తీసిన అందమైన ప్రేమ కథా చిత్రం రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది వరకు ఈ చిత్రం నుంచి విడుదలు చేసిన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్గా విడుదల చేసిన టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంది. సునీత పాడిన పాట అయితే అందరినీ కదిలించింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మీద వచ్చిన ఆ పాట అందరినీ మెప్పించింది. ఇలా ప్రతీ విషయంలో సినిమా మీద ఆసక్తిని పెంచేలా ప్రమోషన్స్ చేసింది యూనిట్.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదిని ప్రకటించారు. అక్టోబర్ 6న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
ఖలిస్థానీ గురుపత్వంత్ సింగ్ పన్నున్‌పై ఎన్ఐఏ సంచలన నివేదిక..
ఢిల్లీ: ఇటీవలి కాలంలో కెనడా-భారత్ మధ్య ఖలిస్థానీ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో కెనడాలో ఉంటున్న హిందువులను తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాలని హెచ్చరించిన ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) నివేదికలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్.. భారత్‌ను విజజింజే కుట్ర చేసినట్టు ఎన్ఐఏ పేర్కొంది. దేశ విభజనకు బిగ్ ప్లాన్.. వివరాల ప్రకారం.. ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు సంబంధించిన కొన్ని విషయాలను ఎన్ఐఏ వెల్లడించింది. ఇందులో భాగంగా అతడు భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించి, ఎన్నో దేశాలు ఏర్పాటు చేయాలని భారీ కుట్ర పన్నినట్టు ఓ నివేదిక తెలిపింది. భారతదేశ ఐక్యత, సమగ్రతను అతడు సవాల్ చేసినట్టు.. ఆడియో మెసేజ్‌ల ద్వారా అధికారులు గుర్తించారు. కశ్మీర్ ప్రజల కోసం ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని, వారి కోసం ఒక ముస్లిం దేశం సృష్టించాలని, దానికి ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దుస్తాన్’ అనే పేరు పెట్టాలని పన్నూన్ కుట్ర పట్టిన్నట్టు నివేదికలో వెల్లడించింది. Khalistani terrorist Pannun wants to divide India, create many countries: NIA report#NIA #KhalistaniTerrorist #GurpatwantSinghPannu pic.twitter.com/n66SETX3OS — Bnz English (@BnzEnglish) September 25, 2023 ఎన్ఐఏ సంచలన నివేదిక.. ఎన్ఐఏ రిపోర్టు ప్రకారం.. ఇండియా గేట్ వద్ద ఖలిస్తానీ జెండాను ఎగురవేసేవారికి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ 2.5 మిలియన్ల అమెరికా డాలర్ల బహుమతిని ఆఫర్ చేశాడు. 2021లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటలో భారత జెండాను ఎగురవేయకుండా ఆపిన పోలీసు సిబ్బందికి అతను ఒక మిలియన్ అమెరికా డాలర్లను కూడా ఆఫర్ చేసినట్లు నివేదికలో స్పష్టమైంది. పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలోని ప్రముఖ ప్రదేశాలలో ఖలిస్తానీ పోస్టర్లు, జెండాలను అమర్చడానికి అతను చాలాసార్లు ప్రయత్నించాడని పేర్కొంది. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదిలా ఉండగా.. కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ గురపత్వంత్ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే భారత్ అతడికి స్ట్రాంగ్ కౌంటర్చింది. పన్నూన్ వార్నింగ్ వీడియోను భారత్ తీవ్రంగా పరిగణించింది. అనంతరం.. అమృత్సర్ జిల్లా ఖాన్‌కోట్‌లో ఉన్న అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్‌లో ఉన్న ఇంటిని ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇప్పటి నుంచి అవి ప్రభుత్వపరం అయ్యాయని ప్రకటించింది. వాస్తవానికి 2020లోనే అతని పేరిట ఆస్తులను ఎటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూపుల ద్వారా గురపత్వంత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయ్యింది. మరోవైపు అతనిపై పంజాబ్‌లో 22 క్రిమినల్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు దేశద్రోహం కేసులూ ఉన్నాయి. ఇవి పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, అలాగే హర్యానా, ఉత్తరాఖండ్‌లలో నమోదయ్యాయి. Gurpatwant Singh Pannu is nothing more than a Drama Queen! He is openly threatening Hindu diaspora of India residing in Canada in a new video & yet the Canadian govt is silent, how can one not rule out the fact that the Canadian govt is not hand in glove with this Terrorist! pic.twitter.com/pNzvWdKZPR — Racheal (@2004Racheal) September 25, 2023 ఇది కూడా చదవండి: తమిళనాట ట్విస్ట్.. ఎన్డీఏకు అన్నాడీఎంకే గుడ్‌బై.. -
కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన
ఢిల్లీ: కెనడా-భారత్ మధ్య వివాదంతో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ తమ పిల్లల భద్రత ప్రమాదకరంగా మారిందని భయపడుతున్నారు. జాతీయత ఆధారంగా తమ పిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని కలత చెందుతున్నారు. కెనడాలో ఉన్న ఇండియన్ విద్యార్థులకు ఏదైనా హెల్ప్‌లైన్ క్రియేట్ చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ని పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జఖ్కర్ కోరారు. ఇండియన్ కాన్సులేట్‌ను సంప్రదించి ఏదైనా సహాయం పొందవచ్చని స్పష్టం చేశారు. సలహాలు, సూచనల కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నెంబర్‌ను కూడా రిలీజ్ చేశారు. Set up helpline for Indian students, NRIs in Canada: Punjab BJP chief urges Centre #India #Canada https://t.co/dT8lYAE9qm — IndiaToday (@IndiaToday) September 23, 2023 'నా కూతురు ఏడు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కారణంగా నా కూతురు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతోంది.' అని భల్విందర్ సింగ్ చెప్పారు. 'నా ఇద్దరు కూతుళ్లు కెనడాకు వెళ్లారు. కానీ భారత్-కెనడా ప్రభుత్వాల వివాదం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంపై త్వరగా ఏదైనా ఓ పరిష్కారానికి రావాలి' అని కుల్దీప్ కౌర్ కోరారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయ హిందువులపై హెచ్చరికలు కూడా జారీ చేశారు. కెనడా విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తమ పిల్లలు వివక్ష ఎదుర్కొంటున్నారని భారతీయ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..? -
భారత్ దేశం పేరు మార్పునకు రంగం సిద్ధమైందా..?
-
మోదీ మార్క్.. నగరాల పేర్ల నుంచి దేశం వరకు..
ఇండియా పేరు శాశ్వతంగా భారత్‌గా మార్చనున్నారా? నిజానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-1లో ఇప్పటికే ఇండియా దటీజ్ భారత్ అని రాసి ఉంది. ఇండియా అంటే భారత్ అని అర్థం. ఇండియా, భారత్ రెండు పేర్ల బదులుగా ఒకే పేరు తీసుకువచ్చే ఆలోచనలో మోదీ ప్రభుత్వం కనిపిస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. వలసవాద గుర్తులను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో పిలుపునిస్తూ వస్తున్నారు. మరుగున పడిఉన్న దేశ సంస్కృతిని మళ్లీ వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అదే క్రమంలో 75 ఏళ్లుగా ఇండియాగా పిలవబడుతున్న దేశానికి ఒకే పేరు శాశ్వతంగా ఉండేలా అడుగులు వేస్తున్నారు. జీ–20 సదస్సుకు తరలివస్తున్న ప్రపంచదేశాధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందుకు ఇన్విటేషన్ పంపారు. ఈ ఇన్విటేషన్ ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నగరాల పేర్లనుంచి.. దేశం పేరు మార్పు వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అనేక నగరాల పేర్లను మార్చారు. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, గుర్గావ్ను గురుగ్రామ్‌గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా మార్చారు. త్వరలోనే లక్నో పేరును కూడా లక్ష్మణ నగరిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఈ నగరాల పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతుండగానే, దేశం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. వలసవాద చిహ్నలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఇండియా పేరుకు చరమగీతం పాడాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి బీజేపీ, సంఘ్ పరివార్ నుంచి వస్తోంది. వేద కాలం నుంచే భారత్ పేరు.. భారత్‌పేరు రుగ్వేద కాలం నుంచి వస్తోంది. వేద తెగ భరతుల పేరు నుంచి భారత్ అనే పేరు ఉద్భవించిందని చెబుతుంటారు. రుగ్వేదంలోని ఆర్యవర్తన తెగలవారని కూడా చరిత్ర చెబుతోంది. మహాభారత కాలంలోని శకుంతల–దుష్యంతుడు కుమారుడి పేరు కూడా భరతుడే. అలాగే, భరతుడు పాలించిన ప్రాంతాన్ని భరత దేశంగా పిలుస్తుండేవారు. ఇలా ప్రాచీన కాలం నుంచి ఈ ప్రాంతానికి భారత్ అనే పేరు కొనసాగుతూ వస్తోంది. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలోని హతిగుంఫా శాసనంలో కూడా భారత్ ప్రస్తావన ఉంది. దీని ప్రకారం అయితే గంగా, మగదకు పశ్చిమాన ఉన్న భాగాన్నే భారత్‌గా శాసనాల్లో ఉంది. దక్షిణభారతం, దక్కన్ పీఠభూమి దీని నుంచి మినహాయించారు. గ్రీకుల కాలంలో ఇండియా పేరు ఇక ఇండియా పేరు గ్రీకుల కాలం నుంచి కొనసాగింది. సింధు నదిని ఇంగ్లీష్‌లో ఇండస్ రివర్‌గా పిలుస్తుంటారు. ఇండస్ రివర్‌కు అవతల ఉండేవారిని ఇండియా అని, ఇండియాన్స్ అనే పిలవడం మొదలుపెట్టారు. 17వ శతాబ్దంలోకి ఇది బాగా వాడుకలోకి వచ్చింది. లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ ఆ తర్వాత ఆంగ్లేయుల పాలనా ప్రభావంతో ఇండియా అనే పేరు స్థిరపడింది. ఇండియా పేరు ఎలా మారుస్తారంటే? రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ఉపయోగించి ఏవైనా సవరణలు చేయడానికి పూర్తి వెసులుబాటు ఉంది. స్వయంగా రాజ్యాంగ సభ ఈ అవకాశం కల్పించింది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకునే అధికారం ఉంది. అయితే, రాజ్యాంగంలో చేసే మార్పులకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్-1కి సవరణ ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుగానీ, తీర్మానం గానీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్టికల్-1 ప్రకారం ఈ ప్రాంతాన్ని ఇండియా, భారత్‌గా పిలుచుకునే అధికారం ఉంది. ఇండియా పేరును పూర్తిగా తొలగించి కేవలం భారత్ ఉండేలా బిల్లు పెట్టే అవకాశముంది. రాజ్యసభలో గట్టెక్కేనా? ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన మెజారిటీ ఎన్డీఎకు లోక్‌సభలో ఉన్నప్పటికీ, రాజ్యసభలో ఇది గట్టెక్కుతుందా అనేది అనుమానమే. ఎన్డీఏతో పాటు మిత్రపక్షాలు మద్దుతు ఇస్తే తప్ప బిల్లు పాసయ్యే అవకాశం లేదు. ఒక వేళ లోక్‌సభ, రాజ్యసభ రెండింటిని కలిపి సమావేశపరిచి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంది. ఒకవైపు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని డీఎంకే తీవ్రమైన వాదన వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ బిల్లు గనుక ప్రవేశపెడితే రణరంగంగా మారే అవకాశం ఉందనే అనుమానాలున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలన్నీ దీన్ని ఏకమొత్తంగా వ్యతిరేకిస్తాయా లేక ఎవరి దారిలో వారు నిర్ణయాలు తీసుకుంటారా? అన్నది తేలాలి. కొత్త పార్లమెంటులో నూతన చరిత్ర: ఇండియా టూ భారత్ నూతనంగా నిర్మించిన పార్లమెంటులో దేశం పేరు మార్చే రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త చరిత్రను సృష్టిస్తుందని అంటున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన అమృత్ కాల్లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా నుంచి రిపబ్లిక్ ఆఫ్ భారత్‌గా మారి నూతన చరిత్రకు నాంది పలుకుతుందనే వాదన వినిపిస్తోంది. ఇండియా పేరు మార్పు ద్వారా వలసవాద చిహ్నలు తొలగించిన ప్రధాని మోదీ తిరుగులేని ఖ్యాతి గడిస్తారని ఆయన మద్దతుదారులు నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా భారత్ వర్సెస్ ఇండియా కూటమికి మధ్య పోరాటానికి ఇదే భూమికగా ఉంటుందని అంటున్నారు. హిందుత్వ ఎజెండాపై రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ఎన్నికల సమయంలో ఇదొక తిరుగులేని ఆయుధంగా మారే అవకాశముందా? లేదా అన్నది కాలమే తేల్చాలి. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సుప్రీంకోర్టులో పిల్ -
Yendira Ee Panchaithi: ఆకట్టుకుంటున్న ‘ఏమో ఏమో..’ సాంగ్
భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచయితీ’. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీకి తెరకెక్కితున్న ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారుఇది వరకే ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్లింప్స్ సైతం నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ చేతుల మీదుగా ఏమో ఏమో అంటూ సాగే పాటను విడుదల చేశారు. పీఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం, సతీష్ మాసం విజువల్స్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలి, చూడాలనేట్టుగా చేశాయి. ఈ మెలోడీ పాట ఎంతో వినసొంపుగా ఉంది. ఈ పాటకు పీఆర్ సాహిత్యాన్ని అందించారు. పాటను రిలీజ్ చేసిన అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన ఈ పాట బాగుంది. కొత్త వాళ్లైనా చక్కగా నటించారు. హీరో హీరోయిన్ల జంట బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. -
ఆమెతో నాకు పోటీ కాదు.. అసూయ కూడా లేదు: వాణి
ప్రస్తుతం హీరోయిన్లు అభినయం కంటే అందం, అదృష్టాన్నే ఎక్కువగా నమ్ముకుని ఉన్నారనే వాదన ఉంది. ఇకపోతే అదృష్టం వారి చేతిలో ఉండదు కాబట్టి అందాలారబోత పైనే దృష్టి పెడుతున్నారు. నటి వాణి భోజన్ ఈ విషయంలో తక్కువేమీ కాదు. తాజాగా భరత్‌తో కలిసి రొమాన్స్ చేసిన చిత్రం 'లవ్'. ఇటీవల జరిగిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి అందాలను ఆరబోసే విధంగా దుస్తులు ధరించి వచ్చింది. దీంతో ఫొటోగ్రాఫర్ల దృష్టి అంతా ఆమె పైనే పడింది. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!) ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన వాణి భోజన్ ప్రస్తుతం రాధామోహన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నానని.. ఇందులో యోగి బాబు ముఖ్య పాత్రను పోషిస్తున్నారని చెప్పింది. అదే విధంగా నటుడు అధర్వకు జంటగా ఒక చిత్రం చేస్తున్నట్లు తెలిపింది. కాగా చాలా గ్యాప్ తరువాత తెలుగులో ఒక్క చిత్రంలో నటించినట్లు చెప్పింది. ఎలాంటి సినీ నేపధ్యం లేని తాను నటిగా ఇంత దూరం పయనించడం సాధనే అని పేర్కొంది. ఇకపై కూడా మంచి పాత్రలు ఎంపిక చేసుకుని నటిస్తాననీ, ఇప్పటి వరకు తన జర్నీ సంతోషంగానూ, సంతృప్తిగానూ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మీ మాదిరి గానే బుల్లితెర నుంచి వచ్చిన నటి ప్రియా భవానీ శంకర్‌ను మీకు పోటీగా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తాను అలా భావించడం లేదని చెప్పింది. ఆమె చాలా చిత్రాల్లో నటిస్తున్నారని, పెద్ద నటులతో జత కడుతున్నారని, ఒక స్నేహితురాలిగా తనకు సంతోషమేనని చెప్పింది. అంతే ఆమెతో తనకు పోటీ కానీ, అసూయ లేవని స్పష్టం చేసింది. నా దారిలో నేను వెళుతున్నట్లు ఇందులో ఒకరితో ఒకరిని పోల్చాల్సిన అవసరం లేదని వాణి భోజన్ తెలిపింది. కాగా.. టాలీవుడ్లో మీకు మాత్రమే చెప్తా సినిమాతో పరిచయమైంది కోలీవుడ్ భామ. భరత్, వాణీ భోజన్ జంటగా నటిస్తోన్న లవ్ చిత్రం మలయాళ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) -
అర్ధ సెంచరీ కొట్టిన హీరో భరత్!
తమిళంలో బాయ్స్, కాదల్ చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు భరత్. ఆ తర్వాత పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించి ఇప్పుడు అర్ధ సెంచరీ మైలురాయికి చేరుకున్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం లవ్. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన లవ్ చిత్రానికి ఇది తమిళ రీమేక్. వాణిభోజన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ఆర్పీ బాల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నటుడు వివేక్ ప్రసన్న రాధారవి జూనియర్ ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రానికి పీజీ ముత్తయ్య ఛాయాగ్రహణం, లోని రప్పీల్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఈనెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. పెళ్లయిన జంట మధ్య ప్రేమ, సంతోషం, కోపం, చిన్నచిన్న గొడవలు చివరికి ఎలాంటి పరిణామాలకు దారి తీశాయన్నదే ఈ చిత్ర కథ అని తెలిపారు. ఒక సంఘటనలో పొరపాటున భరత్ కారణంగా అతని భార్య హత్యకు గురవుతుందన్నారు. దానిని మార్చడానికి భరత్ తన స్నేహితులతో కలిసి ఏం చేశాడు? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో చిత్రం సాగుతుందని చెప్పారు. ఈ చిత్రం తనుకు చాలా ముఖ్యమైనదని నటుడు భరత్ పేర్కొన్నారు. కాగా మిరల్ చిత్రం తర్వాత భరత్‌తో కలిసి లవ్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని వాణిభోజన్ అన్నారు. View this post on Instagram A post shared by Bharath (@bharath_niwas) చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి -
కుప్పంలో వైఎస్సార్సీపీలోకి టీడీపీ కుటుంబాలు
చిత్తూరు: కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలంలోని బల్ల పంచాయతీకి చెందిన 15 టీడీపీ కుటుంబాలు ఆదివారం స్థానిక సర్పంచ్ విజయ్ థామస్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ విజలాపురం బాబురెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ భరత్ వారికి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన వారు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్, రెస్కో డైరెక్టర్ థామస్, మైనారిటీ నేతలు అల్లాభక్షు, షేక్ అహ్మద్, మాజీ సర్పంచ్ గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు. చదవండి: పేదల కల నెరవేరుస్తున్న సీఎం జగన్