Yendira Ee Panchaithi: ఆకట్టుకుంటున్న ‘ఏమో ఏమో..’ సాంగ్‌ | 'Yemo Yemo' Song Out From Yendira Ee Panchayithi Movie - Sakshi
Sakshi News home page

Yendira Ee Panchaithi: ఆకట్టుకుంటున్న ‘ఏమో ఏమో..’ సాంగ్‌

Published Sat, Sep 2 2023 12:07 PM | Last Updated on Sat, Sep 2 2023 12:15 PM

Yemo Yemo Song Out From Yendira Ee Panchaithi - Sakshi

భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచయితీ’. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ లవ్‌స్టోరీకి తెరకెక్కితున్న ఈ చిత్రంతో  గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారుఇది వరకే ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్లింప్స్ సైతం నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ చేతుల మీదుగా ఏమో ఏమో అంటూ సాగే పాటను విడుదల చేశారు. 

పీఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం,  సతీష్ మాసం విజువల్స్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలి, చూడాలనేట్టుగా చేశాయి. ఈ మెలోడీ పాట ఎంతో వినసొంపుగా ఉంది. ఈ పాటకు పీఆర్ సాహిత్యాన్ని అందించారు. పాటను రిలీజ్ చేసిన అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన ఈ పాట బాగుంది. కొత్త వాళ్లైనా చక్కగా నటించారు. హీరో హీరోయిన్ల జంట బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement