Yendira Ee Panchayithi Movie
-
'ఏందిరా ఈ పంచాయితీ' సినిమా రివ్యూ
టైటిల్: ఏందిరా ఈ పంచాయితీ నటీనటులు: భరత్, విషిక లక్ష్మణ్, కాశీ విశ్వనాథ్ తదితరులు నిర్మాత: ఎమ్. ప్రదీప్ కుమార్ దర్శకుడు: గంగాధర.టి సంగీతం: పెద్దపల్లి రోహిత్ విడుదల తేదీ: అక్టోబరు 06 (ఇదీ చదవండి: 'మామా మశ్చీంద్ర' సినిమా రివ్యూ) కథేంటి? రామాపురం అనే ఊరు. అభి (భరత్) అండ్ గ్యాంగ్.. అల్లరితోపాటు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ గడిపేస్తుంటారు. అభికి పోలీస్ అవ్వాలనేది కోరిక. ఓ సందర్భంలో అభి ఉంటున్న ఊరికి కాపలాదారుడు అవుతాడు. ఊరి పెద్ద (కాశీ విశ్వనాథ్) కూతురు యమున (విషిక)తో ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఓ కేసులో అభిని పోలీసులు అరెస్ట్ చేస్తారు? ఆ ఊర్లో జరిగిన హత్యలకు అభికి ఉన్న సంబంధం ఏంటి? యమున తండ్రినే అభి ఎందుకు చంపాలని అనుకున్నాడు? చివరకు అభి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది స్టోరీ. ఎలా ఉందంటే? సినిమాల్లో లవ్‌స్టోరీ అనేది సక్సెస్ ఫార్ములా. కొత్త దర్శకుడు గంగాధర అదే పాయింట్ పట్టుకున్నాడు. ప్రేమకథకి క్రైమ్, డ్రామా, సస్పెన్ లాంటి అంశాల్ని జోడించాడు. ప్రయోగాల జోలికి పోకుండా.. సింపుల్‌గా తీశాడు. ఫస్ట్ హాఫ్ అంతా సాఫీగా సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సీన్లు.. హీరోయిన్ దొంగతనం చేయడం.. దాన్ని రికవరి చేసినట్టుగా హీరో పోజులుకొట్టే సీన్లు బాగుంటాయి. (ఇదీ చదవండి: 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ) సెకండాఫ్ కాస్త నిదానంగా ప్రారంభైనప్పటికీ.. ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్‌లో ట్విస్టులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే అనిపిస్తుంది. చివరకు హీరో పంచాయితీ క్లియర్ అవుతుంది. ఈ మూవీలోని పాటలు వినసొంపుగా ఉంటాయి. డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ సహజంగా అనిపిస్తాయి. ఎడిటర్ బాగా చేశాడు. నిర్మాణ విలువులు మంచిగా ఉన్నాయి. ఎవరెలా చేశారు? అభి పాత్రలో భరత్ చక్కగా నటించాడు. తొలి సినిమానే అయినా డ్యాన్సులు, ఫైట్లు, ఎమోషనల్ సీన్లలో పాస్ అయిపోయాడు. విషిక అయితే యమున పాత్రలో బాగుంది. పల్లెటూరు అమ్మాయిలా అందంగా కనిపించింది. కాశీ విశ్వనాథ్ పాత్ర ఎమోషనల్‌గా సాగుతుంది. ఊర్లోని పెద్దగా సుధాకర్‌గా రవి వర్మ ఆకట్టుకుంటాడు. హీరో స్నేహితుల పాత్రలు అలరించాయి. మిగిలిన పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి. (ఇదీ చదవండి: ‘రూల్స్ రంజన్’ మూవీ రివ్యూ) -
'ఏందిరా ఈ పంచాయితీ' సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కి రెడీ
గ్రామీణ నేపథ్యంలో తీసిన లవ్ స్టోరీ సినిమా 'ఏందిరా ఈ పంచాయితీ'. భరత్, విషికా లక్ష్మణ్ జంటగా నటించారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించారు. ఈ మూవీతో గంగాధర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకుంటుండగా, తాజాగా సెన్సార్ పూర్తయింది. (ఇదీ చదవండి: హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!) ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది.అలానే అక్టోబర్ 6న అంటే ఈ శుక్రవారం థియేటర్లలో 'ఏందిరా ఈ పంచాయితీ' విడుదల కాబోతోంది. ఇందులో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీపై దారుణమైన కామెంట్స్.. గంటకు రూ.5 వేలు అంటూ!) -
విలేజ్ బ్యాక్ డ్రాప్లో ‘ఏందిరా ఈ పంచాయితీ’
గ్రామీణ నేపథ్యంలో వస్తున్న చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ లభిస్తోంది. బలగం లాంటి సినిమాలు ఆ నేపథ్యంలోనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఆ కోవలోనే ‘ఏందిరా ఈ పంచాయితీ’ అంటూ ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్లో తీసిన అందమైన ప్రేమ కథా చిత్రం రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది వరకు ఈ చిత్రం నుంచి విడుదలు చేసిన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్గా విడుదల చేసిన టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంది. సునీత పాడిన పాట అయితే అందరినీ కదిలించింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మీద వచ్చిన ఆ పాట అందరినీ మెప్పించింది. ఇలా ప్రతీ విషయంలో సినిమా మీద ఆసక్తిని పెంచేలా ప్రమోషన్స్ చేసింది యూనిట్.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదిని ప్రకటించారు. అక్టోబర్ 6న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
Yendira Ee Panchaithi: ఆకట్టుకుంటున్న ‘ఏమో ఏమో..’ సాంగ్
భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచయితీ’. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీకి తెరకెక్కితున్న ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారుఇది వరకే ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్లింప్స్ సైతం నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ చేతుల మీదుగా ఏమో ఏమో అంటూ సాగే పాటను విడుదల చేశారు. పీఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం, సతీష్ మాసం విజువల్స్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలి, చూడాలనేట్టుగా చేశాయి. ఈ మెలోడీ పాట ఎంతో వినసొంపుగా ఉంది. ఈ పాటకు పీఆర్ సాహిత్యాన్ని అందించారు. పాటను రిలీజ్ చేసిన అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన ఈ పాట బాగుంది. కొత్త వాళ్లైనా చక్కగా నటించారు. హీరో హీరోయిన్ల జంట బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.