టైటిల్: ఏందిరా ఈ పంచాయితీ
నటీనటులు: భరత్, విషిక లక్ష‍్మణ్, కాశీ విశ్వనాథ్ తదితరులు
నిర్మాత: ఎమ్. ప్రదీప్ కుమార్
దర్శకుడు: గంగాధర.టి
సంగీతం: పెద్దపల్లి రోహిత్
విడుదల తేదీ: అక్టోబరు 06
(ఇదీ చదవండి: 'మామా మశ్చీంద్ర' సినిమా రివ్యూ)
కథేంటి?
రామాపురం అనే ఊరు. అభి (భరత్) అండ్ గ్యాంగ్.. అల్లరితోపాటు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ గడిపేస్తుంటారు. అభికి పోలీస్ అవ్వాలనేది కోరిక. ఓ సందర్భంలో అభి ఉంటున్న ఊరికి కాపలాదారుడు అవుతాడు. ఊరి పెద్ద (కాశీ విశ్వనాథ్) కూతురు యమున (విషిక)తో ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఓ కేసులో అభిని పోలీసులు అరెస్ట్ చేస్తారు? ఆ ఊర్లో జరిగిన హత్యలకు అభికి ఉన్న సంబంధం ఏంటి? యమున తండ్రినే అభి ఎందుకు చంపాలని అనుకున్నాడు? చివరకు అభి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది స్టోరీ.
ఎలా ఉందంటే?
సినిమాల్లో లవ్‌స్టోరీ అనేది సక్సెస్ ఫార్ములా. కొత్త దర్శకుడు గంగాధర అదే పాయింట్ పట్టుకున్నాడు. ప్రేమకథకి క్రైమ్, డ్రామా, సస్పెన్ లాంటి అంశాల్ని జోడించాడు. ప్రయోగాల జోలికి పోకుండా.. సింపుల్‌గా తీశాడు. ఫస్ట్ హాఫ్ అంతా సాఫీగా సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సీన్లు.. హీరోయిన్ దొంగతనం చేయడం.. దాన్ని రికవరి చేసినట్టుగా హీరో పోజులుకొట్టే సీన్లు బాగుంటాయి.
(ఇదీ చదవండి: 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ)
సెకండాఫ్ కాస్త నిదానంగా ప్రారంభైనప్పటికీ.. ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్‌లో ట్విస్టులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే అనిపిస్తుంది. చివరకు హీరో పంచాయితీ క్లియర్ అవుతుంది. ఈ మూవీలోని పాటలు వినసొంపుగా ఉంటాయి. డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ సహజంగా అనిపిస్తాయి. ఎడిటర్ బాగా చేశాడు. నిర్మాణ విలువులు మంచిగా ఉన్నాయి.
ఎవరెలా చేశారు?
అభి పాత్రలో భరత్ చక్కగా నటించాడు. తొలి సినిమానే అయినా డ్యాన్సులు, ఫైట్లు, ఎమోషనల్ సీన్లలో పాస్ అయిపోయాడు. విషిక అయితే యమున పాత్రలో బాగుంది. పల్లెటూరు అమ్మాయిలా అందంగా కనిపించింది. కాశీ విశ్వనాథ్ పాత్ర ఎమోషనల్‌గా సాగుతుంది. ఊర్లోని పెద్దగా సుధాకర్‌గా రవి వర్మ ఆకట్టుకుంటాడు. హీరో స్నేహితుల పాత్రలు అలరించాయి. మిగిలిన పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి.
(ఇదీ చదవండి: ‘రూల్స్ రంజన్’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment