సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి హిట్ టాక్ లభించింది. తాజాగా చిత్రబృందం సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు.
సుధీర్ బాబు మాట్లాడుతూ..'సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాం. ప్రేక్షకులు అందరూ సెకండాఫ్‌లో 30 నిమిషాలు ఎక్సలెంట్ అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది సినిమాను సూపర్బ్ అంటూ పోస్టులు చేశారు. ఆడియన్స్ చాలా థాంక్స్. నేను అయితే రెగ్యులర్ సినిమాలు చేయను. ఇప్పటి వరకు చేసినవి అన్నీ డిఫరెంట్ సినిమాలే. ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్ సినిమా.' అని అన్నారు.
దర్శకుడు మహేష్ మాట్లాడుతూ..'క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. హీరో సుధీర్ బాబు గారు ధైర్యంగా ఆ రోల్ చేశారు. నేను ఎప్పటికీ గర్వపడే సినిమా. తెలుగులో ఇటువంటి సినిమా చేయడం తొలిసారి. భరత్ మా సినిమాలో నటించినందుకు థాంక్స్. సుధీర్ బాబుకు హ్యాట్సాఫ్. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనే తపన ఆయనదే.' అని అన్నారు.
భరత్ మాట్లాడుతూ..'తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి కొన్నేళ్లు టైమ్ తీసుకున్నా. మంచి సినిమా చేశా. కంటెంట్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. కమర్షియల్ వ్యాల్యూస్‌తో తీశాం. మహేష్ కెరీర్‌లో ఇదొక మంచి సినిమా. సుధీర్ బాబు కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది.' అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ మాట్లాడుతూ..'సినిమాకు లభిస్తున్న స్పందనతో సంతోషంగా ఉన్నాం. కొత్తగా చేయడం నాకు చాలా ఇష్టం. 'పలాస' తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రమిది. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ ముగ్గురు హీరోలు అద్భుతంగా నటించారు. సినిమాలో హీరోయిన్ లేదనే ఫీలింగ్ ఎవరికీ ఉండదు. రెస్పాన్స్ బాగుంది.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment