Sudheer Babu's Hunt Movie OTT Release Date and Platform - Sakshi
Sakshi News home page

అప్పుడే ఓటీటీలోకి ‘హంట్‌’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Published Tue, Jan 31 2023 12:26 PM | Last Updated on Tue, Jan 31 2023 12:56 PM

Hunt Movie May Be Streaming On OTT Amazon Prime Video - Sakshi

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  శ్రీకాంత్, భరత్‌ కీలకపాత్రలు చేశారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి రావడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా బజ్‌ ప్రకారం.. ఫిబ్రవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ఫ్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. కాగా,  ప్రతి చిత్రం దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ఆ మధ్య టాలీవుడ్‌ ఓ రూల్‌ పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ హంట్‌ చిత్రం మాత్రం రెండు వారాల తర్వాతే  ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement