ఆద్యంతం ఆసక్తికరంగా ‘హంట్‌’ట్రైలర్‌ | Hunt Movie Trailer Unveiled by Prabhas | Sakshi
Sakshi News home page

Hunt : ఆద్యంతం ఆసక్తికరంగా ‘హంట్‌’ట్రైలర్‌

Jan 18 2023 3:15 PM | Updated on Jan 18 2023 3:15 PM

Hunt Movie Trailer Unveiled by Prabhas - Sakshi

సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ  సినిమా ట్రైలర్ పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు. 
ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. ‘ఏ కేసును అయితే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో... అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి’ అని శ్రీకాంత్ చెప్పే డైలాగుతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. టీజర్‌లో కూడా ఆయన ఈ మాట చెప్పారు. ఆ కేసు ఏమిటన్నది ట్రైలర్‌లో చూపించారు. పట్టపగలు ఓ అసిస్టెంట్ కమిషనర్ హత్యకు గురవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో హీరోకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? ఏం చేశారు? అనేది ఆసక్తికరం. 

ఈ చిత్రంలో మెమరీ లాస్ అయిన అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ పాత్రలో సుధీర్ బాబు నటించారు. మెమరీ లాస్‌కు ముందు జరిగిన ఘటనలు, వ్యక్తులు గుర్తు లేకపోవడంతో అర్జున్ కొత్తగా కేసును ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రోజుకు ఒక కొత్త అనుమానితుడి పేరు వస్తుంది. దానికి తోడు 18 రోజుల్లో కేసును పరిష్కరించాలని టార్గెట్. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? థ్రిల్లింగ్ జర్నీగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement