కుమారుడి బర్త్‌ డే.. వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరో | Tollywood Hero Sudheer Babu Special Wihses To His Son Maanas Birthday | Sakshi
Sakshi News home page

Sudheer Babu : కుమారుడి పుట్టిన రోజు.. సుధీర్ బాబు స్పెషల్ విషెస్

Nov 22 2024 4:42 PM | Updated on Nov 22 2024 6:04 PM

Tollywood Hero Sudheer Babu Special Wihses To His Son Maanas Birthday

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇటీవలే మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తండ్రి, కుమారుల కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్ణ జోడీగా హీరోయిన్‌గా నటించింది. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా సుధీర్ బాబు తన కుమారుడి బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఆయన కుమారుడు చరిత్ మానస్ కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఈ రోజు నాకు ప్రత్యేకమంటూ కుమారుడిపై ప్రేమను చాటుకున్నారు. చరిత్ మానస్ పుట్టినరోజు వేడుకలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా, సోదరి మంజుల కూడా సందడి చేశారు.

కాగా.. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి కుమార్తె ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని బర్త్‌ డే వేడుకల్లో సుధీర్ బాబు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement