‘నా ఫ్యామిలీలో ఎవరికి సినీ పరిశ్రమలోకి నేను వెళ్లడం ఇష్టంలేదు. నేను అమెరికా నుంచి వచ్చిన సంగతి కూడా తెలియదు. వాళ్లను బాధ పెట్టడం ఇష్టం లేక నేను నా పేరును విస్కీగా మార్చుకున్నాను. నా ఫేస్ కనిపించకుండా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాను’అన్నారు యంగ్ డైరెక్టర్ విస్కీ. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ది బర్త్‌డే బాయ్'. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ విస్కీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా జీవితంలో జరిగిన రియల్‌స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాను. ఈ కథలో 80 శాతం వాస్తవ సన్నివేశాలు, 20 శాతం ఫిక్షన్ ఉంటుంది. అయితే ఫిక్షన్ కూడా నా లైఫ్‌లో వేరే సందర్బంలో జరిగిన సన్నివేశాలు యాడ్ చేశాను.బర్త్‌డే బంప్స్ వల్ల ఒక స్నేహితుడు ఎలా చనిపోయాడు.. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఎంతో ఉత్కఠభరితంగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ అన్ని రకాల ఎమోషన్స్ ఫీలవుతారు’ అన్నారు.
నిర్మాత భరత్ మాట్లాడుతూ ' కథే ఈ సినిమా చేయడానికి రీజన్, నేను దర్శకుడు ఇద్దరం యూఎస్‌లో వుండేవాళ్లం. ఒకసారి తన లైఫ్‌లో జరిగిన ఈ సంఘటన నాకు చెప్పి సినిమా తీద్దాం అన్నాడు. అతను ఈ రియల్ కథ చెప్పగానే నేను ప్రొడ్యూస్ చేయాలని అనిపించింది. ఈ కథన నేను ఎమోషన్‌గానే ఫీల్ అయి చేస్తున్నాను.. ఇందులో మేసేజ్ ఏమీ లేదు. జరిగిన సంఘటన చూపించి.. దీని వల్ల లైఫ్‌లు ఎలా పోయాయి అనేది చూపిస్తున్నాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment