whisky
-
విస్కీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు
-
సినిమాల్లోకి రావడం ఇంట్లో ఇష్టం లేదు.. మాస్క్ వేసుకొని తిరుగుతున్నా: డైరెక్టర్
‘నా ఫ్యామిలీలో ఎవరికి సినీ పరిశ్రమలోకి నేను వెళ్లడం ఇష్టంలేదు. నేను అమెరికా నుంచి వచ్చిన సంగతి కూడా తెలియదు. వాళ్లను బాధ పెట్టడం ఇష్టం లేక నేను నా పేరును విస్కీగా మార్చుకున్నాను. నా ఫేస్ కనిపించకుండా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాను’అన్నారు యంగ్ డైరెక్టర్ విస్కీ. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ది బర్త్‌డే బాయ్'. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ విస్కీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా జీవితంలో జరిగిన రియల్‌స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాను. ఈ కథలో 80 శాతం వాస్తవ సన్నివేశాలు, 20 శాతం ఫిక్షన్ ఉంటుంది. అయితే ఫిక్షన్ కూడా నా లైఫ్‌లో వేరే సందర్బంలో జరిగిన సన్నివేశాలు యాడ్ చేశాను.బర్త్‌డే బంప్స్ వల్ల ఒక స్నేహితుడు ఎలా చనిపోయాడు.. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఎంతో ఉత్కఠభరితంగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ అన్ని రకాల ఎమోషన్స్ ఫీలవుతారు’ అన్నారు.నిర్మాత భరత్ మాట్లాడుతూ ' కథే ఈ సినిమా చేయడానికి రీజన్, నేను దర్శకుడు ఇద్దరం యూఎస్‌లో వుండేవాళ్లం. ఒకసారి తన లైఫ్‌లో జరిగిన ఈ సంఘటన నాకు చెప్పి సినిమా తీద్దాం అన్నాడు. అతను ఈ రియల్ కథ చెప్పగానే నేను ప్రొడ్యూస్ చేయాలని అనిపించింది. ఈ కథన నేను ఎమోషన్‌గానే ఫీల్ అయి చేస్తున్నాను.. ఇందులో మేసేజ్ ఏమీ లేదు. జరిగిన సంఘటన చూపించి.. దీని వల్ల లైఫ్‌లు ఎలా పోయాయి అనేది చూపిస్తున్నాం’ అన్నారు. -
పేరు వినగానే బిత్తరపోయిన యాంకర్
-
ఈ రియల్ ఇన్సిడెంట్ ని తీయడానికి రీజన్ ఏంటి..?
-
Macallan: విస్కీ బాటిల్ రూ. 22.5 కోట్లు!
లండన్: అవున్నిజమే. మెకాలన్ బ్రాండ్‌కు చెందిన ప్రీమియం స్కాచ్ బాటిల్ ఒకటి ఏకంగా రూ.22.5 కోట్లు పలికింది! శనివారం సోత్బే వేలంలో ఇది అక్షరాలా అంత మొత్తానికి అమ్ముడైంది! దాంతో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన విస్కీగా కొత్త రికార్డు సృష్టించింది. దీని ప్రత్యేకతలే ఇంతటి ధరకు కారణమయ్యాయి. ఈ సింగిల్ మాల్ట్ విస్కీ 1926 నాటిది. మెకాలన్ కంపెనీ ఇలాంటి 40 బాటిళ్లను మాత్రమే తయారు చేసింది. వాటిని ఏకంగా 60 ఏళ్ల పాటు డార్క్ ఓక్వుడ్ పెట్టెల్లో నిల్వ చేసి ఉంచి 1986లో బయటికి తీశారట. కొన్నింటిని మెకాలన్ తన వీఐపీ కస్టమర్లకు విక్రయించిందట. -
Whiskies of the World Awards 2023: భారతీయ విస్కీ.. ప్రపంచంలో అత్యుత్తమం
న్యూఢిల్లీ: భారతదేశంలో మధువు తయారీ ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది. పురాణాల్లోనూ సురాపానం ప్రస్తావన ఉంది. తాజాగా భారత విస్కీ ప్రపంచంలోనే ఉత్తమ మద్యంగా గుర్తింపు సాధించింది. 2023వ సంవత్సరానికి గాను విస్కీస్ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్స్‌లో ‘ఇంద్రి సింగిల్ మాల్ట్ ఇండియన్ విస్కీ–లిమిటెడ్ దివాళీ కలెక్టర్స్ ఎడిషన్–2023’కి ప్రపంచంలో బెస్ట్ విస్కీగా ‘డబుల్ గోల్డ్, బెస్క్ ఇన్ షో’ అవార్డు లభించింది. ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఎంతగానో పేరుప్రఖ్యాతులు పొందిన విస్కీలు పోటీపడ్డాయి. స్కాచ్, బార్బన్, కెనడియన్, ఆ్రస్టేలియన్, బ్రిటిష్ సింగిల్ మాల్ట్ విస్కీలను వెనక్కి నెట్టి భారతీయ సింగిల్ మాల్ట్ విస్కీ అరుదైన ఘనత దక్కించుకుంది. ఇంద్రి విస్కీని పికాడిల్లీ డిస్టిల్లరీస్ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. రాజస్తాన్‌లోని ప్రత్యేకంగా పండించే బార్లీ, యమునా నది నీటితో ఈ విస్కీని తయారు చేస్తున్నారు. -
రష్యన్లకు ఇండియన్ కిక్కు.. అక్కడ మన ‘ఆఫీసర్స్ ఛాయిస్’!
ఇండియన్ మద్యం కంపెనీ రష్యన్ మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన విస్కీల్లో మూడోదైన ఆఫీసర్ ఛాయిస్‌ను తయారు చేసే అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ (ఏబీడీ) రష్యన్ మార్కెట్లోకి ప్రవేశించబోతోందని వ్యాపార దినపత్రిక కొమ్మర్సంట్ పేర్కొంది. రష్యన్ వోడ్కా తయారీ కంపెనీ ఆల్కహాల్ సైబీరియన్ గ్రూప్ (ఏఎస్జీ) తమ రెండు ఏబీడీ బ్రాండ్లకు పంపిణీదారుగా మాత్రమే ఉంటుందని అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ ప్రకటించింది. ఏబీడీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు మద్యం ఎగుమతి చేస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఆదాయం 765 మిలియన్ డాలర్లు దాటింది. కొమ్మర్సంట్ కథనం ప్రకారం... ప్రస్తుతం రష్యాలో కొన్ని వెస్ట్రన్ బ్రాండ్లు నిష్క్రమించిన తర్వాత ఖాళీగా ఉన్న మార్కెట్ వాటాను అందుకోవాలని ఏబీడీ కంపెనీ చూస్తోంది. రష్యాలో ఏబీడీ ఉత్పత్తుల డెలివరీలు ఫిబ్రవరిలోనే ప్రారంభమైనప్పటికీ అమ్మకాల పరిమాణం ఏ మేరకు ఉందన్నది ఇంకా తెలియదు. కంపెనీ ఒప్పందం అక్టోబర్ 2025 వరకు ఉంటుందని తెలిసింది. రష్యాలో ఆఫీసర్స్ ఛాయిస్ బ్లూ విస్కీ 750 ఎంల్ బాటిల్ ధర 1,000 నుంచి 1,200 రూబిల్స్ (రూ.1100 నుంచి రూ.1300) ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే స్టెర్లింగ్ రిజర్వ్ ధర 1,100 నుంచి 1,500 రూబిల్స్ ( రూ.1200 నుంచి రూ.1600) ఉంటుంది. చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి -
ఆ విస్కీ దిగుమతుల్లో ఫ్రాన్స్‌ను దాటేసిన భారత్.. మరీ అంతలా తాగుతున్నారా..?
ఖరీదైన ఫారిన్ మద్యం స్కాచ్ విస్కీ దిగుమతుల్లో భారత్.. ఫ్రాన్స్‌ను దాటేసింది. 2021తో పోల్చుకుంటే 2022లో ఈ విస్కీ దిగుమతులు ఏకంగా 60 శాతం పెరిగాయి. స్కాట్‌ల్యాండ్‌కు చెందిన స్కాచ్ విస్కీ అసోసియేషన్ లెక్కల ప్రకారం.. భారత్ 2021లో 205 మిలియన్ల 70సీఎల్ (700 ఎంఎల్) బాటిళ్ల విస్కీని దిగుమతి చేసుకుంటే 2022లో 219 మిలియన్ల బాటిళ్లను దిగుమతి చేసుకుంది. ఈ లెక్కన భారత్ స్కాచ్ మార్కెట్ పదేళ్లలో 200 శాతం వృద్ధి చెందింది. మరోవైపు రెండంకెల వృద్ధి ఉన్నప్పటికీ ఇండియన్ విస్కీ మార్కెట్లో స్కాచ్ విస్కీ వాటా కేవలం రెండు శాతమే. యూకే-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా భారత్‌లో తమ మార్కెట్‌ను మరింత విస్తరించునేందుకు స్కాట్‌ల్యాండ్ విస్కీ కంపెనీలకు వీలు కలిగిందని స్కాచ్ విస్కీ అసోసియేషన్ పేర్కొంది. రానున్న ఐదేళ్లలో 1 బిలియన్ బ్రిటిష్ పౌండ్ల మేర వృద్ధి ఉంటుందని అభిప్రాయపడింది. 2021లో భారత్‌కు స్కాచ్ ఎగుమతుల విలువ 282 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు. తైవాన్, సింగపూర్, ఫ్రాన్స్‌ల తర్వాత ఇది అయిదో స్థానం. 2022లోనూ యూరోపియన్ యూనియన్ను ఆసియా పసిఫిక్ రీజియన్ అధిగమించి అతిపెద్ద ప్రాంతీయ మార్కెట్‌గా అవతరించింది. కోవిడ్ అనంతరం భారత్ సహా తైవాన్, సింగపూర్, చైనాలకు స్కాచ్ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. (ఇదీ చదవండి: లైసెన్స్ లేకుండా అమ్ముతారా..? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు నోటీసులు!) -
ఆరడుగుల ‘విస్కీ’
ఐదడుగుల 11 అంగుళాలు పొడవు... 32 ఏళ్ల వయసు... బాటిల్ చూపించి సినిమాలో హీరో ఎంట్రీలా ఈ ఇంట్రో ఏంటనుకుంటారా? ఆగండాగండి. అవి చిత్రంలో ఉన్న స్కాచ్ విస్కీ బాటిల్ పొడవు, వయసు. దీన్ని తయారు చేసింది స్కాట్లాండ్కు చెందిన మాకల్లన్ కంపెనీ. మందు సీసా అనగానే మనకు గుర్తొచ్చేవి హాఫ్, ఫుల్.. మహా అయితే లీటర్. కానీ ఇది అట్టాంటిట్టాంటిది కాదు. 444 ఫుల్బాటిల్స్తో సమానమైన 311 లీటర్ల మాంచీ టేస్టీ సింగిల్ మాల్ట్ స్కాచ్. అందుకే.. గతేడాదే గిన్నిస్ వరల్డ్ రికార్డులను బద్దలు కొట్టేసింది. మరి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడానికి కారణం? అంటే.. ఈ సీసాను మే 25న వేలం వేస్తున్నారు. పాతబడే కొద్దీ ఆల్కహాల్ టేస్ట్‌తోపాటు కాస్టు కూడా పెరుగుతుంది కదా! 32 ఏళ్లు పాతదైన ఈ స్కాచ్ వేలం ప్రారంభ ధరనే... 12 కోట్ల 47 లక్షల రూపాయలుగా నిర్ణయించింది ప్రముఖ వేలం కంపెనీ లైఆన్ అండ్ టర్నబుల్. వేలం ద్వారా వచ్చిన డబ్బులో 25 శాతాన్ని మేరీ క్యూరీ సంస్థకు చారిటీగా ఇవ్వాలనుకుంటోంది మాకల్లన్. ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడు పోయిన విస్కీ బాటిల్ ధర... 1.9 మిలియన్ డాలర్లు. అంటే... దాదాపు పద్నాలుగున్నర కోట్లు. ఈ పాత రికార్డును సైతం బద్దలు కొట్టే అవకాశముందీ ఆరడుగుల బాటిల్. -
వైరల్: నో బీర్, ఓన్లీ విస్కీ.. వైన్ షాప్‌లో మందేసిన కోతి
Monkey Alcohol Drinking Video: కోతులు చేసే చేష్టలు మామూలుగా ఉండవు. ఒక్కసారి గుంపులుగా జనావాసంలోకి చొరబడ్డాయంటే అవి చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఇంట్లోకి వచ్చాయంటే వస్తువులన్నీ చిందరవందర అవ్వాల్సిందే. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు ఓ కోతి ఏకంగా ఓ వైన్ షాప్‌లోకే దూరింది. అక్కడున్న బీర్, వైన్ బాటిళ్లను పక్కకు పెట్టి విస్కీ బాటిల్‌ను టార్గెట్ చేసింది. ఇంకేముంది హీరోలా విస్కీ బాటిల్‌ను చేతులోకి తీసుకొని దర్జాగా తాగేసింది. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాలో చోటుచేసుకుంది. బహమని బంజార్ గ్రామంలో ఓ మద్యం దుకాణం ఉంది. అక్కడికి కొన్ని రోజుల నుంచి ఓ కోతి తరుచుగా వస్తోంది. ఖాళీగా పడి ఉన్న మద్యం సీసాల్లో మిగిలిపోయిన మద్యం చుక్కలను తాగేది.అయితే, ఓ రోజు ఆ కోతి ఏకంగా వైన్ షాపులోకే ఎంటర్ అయ్యింది. మద్యం దుకాణంలోకి ప్రవేశించిన కోతి కాటన్ తెరిచి అందులోంచి వైన్ బాటిల్‌ను లాక్కుంది. తరువాత ఓ టెబుల్‌పై దర్జాగా కూర్చొని విస్కీ బాటిల్ మూతను నెమ్మదిగా తీసేందుకు ప్రయత్నిస్తుంది. చివరికి మూత ఒపెన్ అవ్వడంతో ప్రొఫెషనల్ మందుబాబులా గటాగటా తాగేసింది. అయితే కోతి షాప్‌లోకి చొరబడినప్పటికీ యాజమాని ఎలాంటి కంగారు పడలేదు. అతని పని తను చేసుకుంటూ ఉన్నాడు. మధ్యలో షాప్ యాజమాని కోతికి బిస్కెట్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నించగా వద్దని తిరస్కరించి బాటిల్ మొత్తం ఖాళీ చేసి కూర్చుంది. కాగా, కోతి మద్యం సేవించడాన్ని వైన్ షాప్‌కు వచ్చిన పలువురు వీడియో తీశారు. ఆ వీడియోనుఓ వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. కోతి విస్కీ తాగడంపై ఆశ్యర్యానికి గురవుతున్నారు. pic.twitter.com/RCUGLzzkcO — sudhanshu maheshwari (@smaheshwari523) July 14, 2021 -
నా విస్కీకి నాలుగేళ్లు : హీరోయిన్ అనుపమ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. తాజాగా తన విస్కీకు నాలుగేళ్లు పూర్తయ్యాయంటూ అనుపమ చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. విస్కీ అంటూ ఏదో మందు బ్రాండ్ అనుకునేరు..అనుపమ ఎంతో పప్రేమగా పెంచుకుంటున్న కుక్కపిల్ల పేరు. హీరోయిన్ అనుపమకు కుక్కలంటే విపరీతమైన ఇష్టమని ఆమెని ఫాలో అవుతున్న వాళ్లకి తెలిసిందే. పెట్స్‌పై ఎంతో పప్రేమ కురిపించే అనుపమ తన విస్కీ పుట్టినరోజును సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన కుక్కతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. గతేడాది చాలా కష్టంగా సాగింది. విస్కీ సోదరుడు టడ్డీ, రమ్లను కోల్పోయి ఎంతో బాధపడుతున్న మా జీవితాల్లో సంతోషం తీసుకొచ్చిన విస్కీకి కృతఙ్ఞతలు అంటూ కుక్కపిల్లపై ఎంతో పప్రేమ కురిపించింది. ఇక సినిమాలవ విషయానికి వస్తే అనుపమ చివరగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో రాక్షసుడు అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో 18 పేజీస్‌తో పాటు.. తమిళంలో తల్లిపొగతే అనే చిత్రంలో నటిస్తోంది ఈ భామ. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) చదవండి: సంజనతో బుమ్రా పెళ్లి.. హర్ట్ అయిన అనుపమ సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? -
వీస్కీ టేస్ట్ వెనుక ఏముందంటే?
విస్కీ బ్రాండ్లు పలురకాలు. వాటిలో ఒక్కొక్కరి ఒక్కొక్కటి ఇష్టం. ఎందుకంటే వాటి ఫ్లేవర్లు దానికి కారణం. అసలు విస్కీకి ఫ్లేవర్ ఎలా వస్తుంది. దానిని గుర్తించడానికి ఓరేగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డస్టిన్ హెర్బ్ నేతృత్వంలోని బృందం పలు అధ్యయనాలు చేసింది. వాటిల్లో తెలిసిందేమిటంటే.. విస్కీని తయారు చేయడానికి ఉపయోగించే బార్లీని పండించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఫ్లేవర్ మార్పులు సంభవిస్తాయని. ఈ కారణంగానే వైన్‌లాగా విస్కీలో కూడా రుచులు మారతాయని. అయితే విస్కీ రుచుల్లో తేడా కనుగొనడానికి వాతావరణ పరిస్థితులపై చేసిన ఈ అధ్యయనమే తొలిదని చెబుతున్నారు. ఈ విషయంపై డస్టిన్ మాట్లాడుతూ.. ‘‘వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి చాలా పెద్ద పరిశోధన అవసరం. దీనికి చాలా సమయం పడుతుంది. అలాగే అంకిత భావం కూడా అవసరం. బార్లీని పండించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల ప్రభావంతో విస్కీ రుచుల్లో తేడా వస్తుందని మా పరిశోధనల్లో తేలింది’’ అని చెప్పారు. ఎలా కనుగొన్నారు.? పరిశోధన బృందం ముందు బీర్లు తయారీకి ఉపయోగించే బార్లీ, వాటి ఫ్లేవర్లపై పరిశోధనలు చేశారు. బార్లీలో రకాలను బట్టి బీర్ల ఫ్లేవర్లలో గణనీయమైన మార్పులను గుర్తించారు. ఇదే సూత్రం విస్కీకి కూడా వర్తిస్తుందా అనే కోణంలో ఆలోచించారు. దీంతో ఐర్లాండ్‌లోని రెండు కమర్షియల్ బార్లీ వెరైటీలైన ఒలంపస్, లారియేట్లపై పరిశోధనలు ప్రారంభించారు. బన్క్లోడీ అనే తీర ప్రాంతంలో పండించే ఒక వెరైటీని, అతీ అనే మైదాన ప్రాంతంలో పండించే మరో వెరైటీని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉంటాయి. అలాగే మట్టిలో కూడా తేడా స్పష్టంగా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో వీటిని మాల్ట్లా మార్చారు. బార్లీ మాల్ట్ డిస్టిల్డ్ అయిన తర్వాత దానిని ‘న్యూ మేక్ స్పిరిట్’ అంటారు. ఈ స్పిరిట్‌ను మూడేళ్లు చెక్క పీపాలో ఉంచాక అది విస్కీగా మారుతుంది. వివిధ పరిశోధనల ద్వారా స్పిరిట్లోని ఫ్లేవర్లును వర్గీకరించారు. బార్లీ పండించిన ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు విస్కీ అరోమాకు కారణంగా గుర్తించారు. అతీలో పండించిన బార్లీ నుంచి తయారు చేసిన విస్కీకి తీయని, పుల్లని, తృణ ధాన్యాల వాసనతో కూడిన అరోమా రాగా, బన్క్లోడీలో పండించిన బార్లీ నుంచి తయారు చేసిన విస్కీకి ఎండు ఫలాల వాసనతో కూడిన అరోమా ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. విస్కీని వాసన చూసి ప్లేవర్లు చెప్పే నిపుణుల ప్రకారం సాధారణ ఫ్లేవర్లు ఇవీ వైనీ, ఫీన్టీ, సల్ఫరి, వుడీ, సిరియల్, ఫ్రూటీ ఫ్లోరల్, పీటీ -
విస్కీ గ్లాసుతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్
మందు తాగడం ఏం రంగంలో ఉన్నవారికైనా కామన్. కానీ సినిమా ఫీల్డ్‌లో నటులతో పాటు కొందరు నటీమణులు కూడా అప్పుడప్పుడు ఓ పెగ్గు వేస్తుంటారు. అయితే కొందరు దీన్ని సీక్రెట్‌గా ఉంచితే మరికొందరు మాత్రం అస్సలు మొహమాటపడకుండా అందరిముందే ఒప్పేసుకుంటారు. తాజాగా సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ మందుగ్లాసు పట్టుకున్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఈ బోల్డ్ బ్యూటీ తాగడం ఎప్పుడు మొదలు పెట్టిందబ్బా అని ఆమె అభిమానులు కొందరు ఆలోచనలో పడ్డారు. (చదవండి: యజమాని, పని మనిషి ప్రేమ కథ) అయితే అలాంటిదేమీ లేదు. ఆమె ముందు ఓ ప్రముఖ బ్రాండ్‌కు చెందిన విస్కీ బాటిల్ ఉండగా, దాన్ని గ్లాసులో ఒలికించి చేత పట్టుకుని సౌమ్యంగా నవ్వులు చిందిస్తోంది. అంటే ఆమె సదరు విస్కీ బ్రాండ్ యాడ్ కోసమే అలా చేసిందని సులువుగా స్పష్టమవుతోంది. తెలంగాణలో ఈ కొత్త బ్రాండు భలే బాగుందంటూ ప్రమోట్ చేసింది. కాగా తెలుగులో హీరోలు సందీప్ కిషన్, నిఖిల్ మందు బ్రాండ్లను ప్రమోట్ చేశారు కానీ ఓ హీరోయిన్ ఇలా ధైర్యం చేసి ముందుకు రావడం చాలా అరుదు. ఇక పాయల్ కెరీర్ విషయానికి వస్తే తొలి చిత్రం 'ఆర్ఎక్స్100' సక్సెత్తో ఎన్నో ఆఫర్లు ఆమె ఎదుట వాలాయి. దీంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఎన్నో సినిమాలు చేసుకుంటూ పోయిందే కానీ పెద్ద హిట్ మాత్రం అందుకోలేదు. దీంతో మళ్లీ తన మొదటి హీరో కార్తికేయతో కలిసి 'అనగనగా ఓ అతిథి'లో నటించగా. ఈ చిత్రం 'ఆహా'లో విడుదలకు సిద్ధమవుతోంది (చదవండి: నా కల నెరవేరింది: పాయల్ రాజ్‌పుత్) View this post on Instagram The all-new Smoother and Richer Royal Challenge Whisky now in Telangana❤️ Royal Challenge is an ideal amalgamation of Scotch and Indian Malts. Aged to perfection, the whisky’s rich and smooth taste is the perfect blend for celebrating any moment. #Spon #DrinkResponsibly #RoyalChallenge #AllNewRC #ChallengeAccepted @socialgoatindia A post shared by Payal Rajput (@rajputpaayal) on Nov 11, 2020 at 6:38am PST -
కరోనా వైరస్: విస్కీతో విరుగుడు!
బీజింగ్: చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ రోజు రోజుకూ ఖండాలు దాటుతోంది. దీని దెబ్బకు చైనాలోని ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే ఈ ప్రాణాంతక మహామ్మారిని తేనె, మద్యంతో అరికట్టవచ్చని ఓ బ్రిటీష్ ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. వివరాలు.. బ్రిటన్‌కు చెందిన కానర్ రీడ్ అనే వ్యక్తి చైనాలోని వుహాన్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ.. ‘రెండు నెలల క్రితం నేను తీవ్రమైన దగ్గు, జలుబుతో కూడిన ఫ్లూ, న్యుమోనియాతో బాధపడ్డాను. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా నా శరీరంలో చిన్న క్రిమి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. రెండు వారాలు పాటు ఆసుపత్రిలో ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇక నాకు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండటంతో బ్రీత్ అనలైజర్ కూడా పెట్టుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే డాక్టర్లు సూచించిన ఆంటీ బయాటిక్ మందులను సున్నితంగా తిరస్కరించానని.. సొంత వైద్యానికే మొగ్గు చూపానని తెలిపాడు. వ్యాధి నివారణలో భాగంగా.. ఒక గ్లాసు వెచ్చని విస్కీలో తేనె కలుపుకుని తాగే వాడినని, ఇలా క్రమంగా తీసుకోవడంతో తన ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని.. తనలో ఉన్న ఆ వైరస్కూడా చనిపోయిందని పేర్కొన్నాడు. ఇక తాను పూర్తిగా కోలుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నాడు. ఇలా విస్కీతో తాను ఆ వైరస్‌ను జయించానని పేర్కొన్నాడు. కాగా తనకు వచ్చి ఆ వ్యాధి లక్షణాలు, కరోనా వైరస్ లక్షణాల ఒకేలా ఉన్నాయని, ఒకవేళ నాకు సోకింది కరోనా వైరస్ అయ్యుంటే ఇలా విస్కీ, తేనెతో ఆరికట్టవచ్చు అని చెప్పుకొచ్చాడు. కాగా, మూడేళ్లుగా చైనాలో ఉంటున్నానని తెలిపిన కానర్.. ఎప్పుడూ జనసంద్రంగా ఉండే వుహాన్ కరోనా వల్ల ఒక్కసారిగా దెయ్యాల నగరంగా మారిందన్నాడు. ఇక్కడి ప్రజలు బయట కాలు పెట్టడానికే జంకుతున్నారని, ఇక ముసుగు లేకుండా బయటకు వస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలిపాడు. ఈ కరోనా వైరస్ వల్ల చైనాలో ఇప్పటికే 490కి పైగా మంది మృతి చెందగా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అయినట్లు సమాచారం. (చైనా వెళ్లినవారి వీసాలను రద్దు చేసిన భారత్) -
ఖరీదైన విస్కీ: ఓ ఫేక్ న్యూస్
జర్మనీలోని బడ్జెట్ సూపర్‌మార్కెట్ చెయిన్ లిడ్ల్కు చెందిన ది క్వీన్ మార్గోట్ బ్లెండ్ స్కాచ్ విస్కీ ప్రపంచంలోనే బెస్ట్ విస్కీగా నిలిచిందంటూ వార్తలు నిజంకాదని నిర్వాహకులు ప్రకటించారు. ఉత్తమమైన వాటిల్లో ఒకటి మాత్రమే నిలిచిందని స్పష్టం చేశారు. 12 ఏళ్ల బెస్ట్ బ్లెండెడ్ స్కాచ్విస్కీగా మాత్రమే 40మంది నిపుణులు నిర్ధార్ధించారని పేర్కొంది. ప్రపంచంలోనే నెంబర్ 1 విస్కీ అనేది ఫేక్ న్యూస్ అని ఇప్పటివరకు ఒక రౌండ్ మాత్రమే పూర్తి అయిందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ పోటీకి సంబంధించినవ వివరాలను http://bit.ly/WhiskyLiveLondon2019 లో తెలుసుకోవచ్చని ఫోర్బ్స్ వివరించింది. ఈ పోటిలో తుది ఫలితాలను మార్చి 28, 2019న లండన్‌లో వెల్లడించనున్నామని వివరణ ఇచ్చింది. వరల్డ్ విస్కీస్ వార్షిక అవార్డులు కార్యక్రమంలో భాగంగా ఈ విస్కీ అవార్డును ఎంపిక చేస్తారు..ఈ పోటీలో అంతర్జాతీయంగా పేరొందిన, మంచి గుర్తింపు సాధించిన డ్రింక్స్‌ను ఉంచుతారు. వీటిని రుచి చూసిన నిపుణులు అత్యుత్తమంగా నిలిచిన దానికి ప్రపంచంలో బెస్ట్ విస్కీ అవార్డును ప్రకటిస్తారు. కాగా జర్మన్‌కు చెందిన లిడ్ల్ స్కాచ్ విస్కీ ప్రపంచంలో బెస్ట్ విస్కీగా నిలిచిందంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేశాయి. దాదాపు 40 మంది అంతర్జాతీయ నిపుణులు ఈ విస్కీని రుచిచూసి ఈ విషయాన్ని తేల్చారంటూ పలు మీడియాలు సంస్థలు కథనాలు ప్రచురించాయి. -
'విస్కీ'తో కారు రయ్ రయ్..!
లండన్: త్వరలో విస్కీతో కారు రయ్ మంటూ పరుగులు తీయనుంది. విస్కీ తయారు చేసే క్రమంలో దానినుంచి విడుదలయ్యే వ్యర్థాల ద్వారా పర్యావరణ హితమైన బయో ఇంధనాన్ని ఉత్పిత్తి చేసి దానిని కార్లకు ఉపయోగించనున్నారు. స్కాట్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ముందడుగు వేశారు. ఇలా విస్కీతో ఫ్యూయెల్ తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే తొలిసారి. సాధరణంగా ప్రస్తుతం మనం కార్లలో వాడుతున్న డీజిల్, పెట్రోల్వంటి ఇంధనాల ద్వారా విడుదలయ్యే కాలుష్యం కన్నా ఈ రకమైన ఇంధనం ఉపయోగించిన కారు తక్కువ విడుదల చేస్తుంది. అంతేకాకుండా పర్యావరణానికి కలిగే నష్టం కూడా ఈ ఇంధనం ద్వారా 60శాతం తగ్గిపోతుంది. ఎడిన్బర్గ్ చెందిన ఓ విస్కీ తయారీ సంస్థకు ఇప్పటికే ఈ విధమైన ఇంధనం తయారు చేసేందుకు మొత్తం 11 మిలియన్లను విడుదల చేసినట్లు రోడ్డు రవాణాశాఖ మంత్రి ఆండ్రూ జాన్స్ తెలియజేశారు. -
కాక్టైల్.. మనసొక మధుకలశం..
మధుకలశం మదికాగా సుధగ్రోలుట తప్పుగాదు సతతము ఇలలో వ్యధ ఎందుకు వైనుతేయ! మధువంతటి మంచి మందు మహిలో గలదే? ‘మనసొక మధుకలశం..’ అన్నాడో సినీకవి. ‘పగిలే వరకే అది నిత్యసుందరం’ అని కూడా ‘సారా’ంశాన్ని చాటి చెప్పాడాయనే! నిజానికి, ఇంతోటి జీవిత సారాంశాన్ని ప్రవచించడానికి కవిపుంగవులే దిగిరానక్కర్లేదు. చేయిజారితే మధుకలశం, కాలుజారితే మనోభాండం పగలడం తథ్యమని ఏ దేవదాసును అడిగినా చెబుతాడు. ‘పగలగానే భళ్లుమనడం గాజు నైజము చూడుము.. పగిలినా అది రగిలినా సడి చేయలేనిది హృదయము’ అని కుమిలిపోయే డోసెరుగని భగ్నజీవులు లోకంలో చాలామందే ఉంటారు. వ్యథార్తులకు ఊరటనిచ్చే దివ్యౌషధం మధువే! సందేహం లేదు. అయితే, ప్రతి ఔషధానికీ తగిన మోతాదు ఉంటుంది. బాధల శీఘ్ర నివారణ కోసం మోతాదు మించితే ఇక అంతే సంగతులు. పరిమితులెరిగిన ‘బుడ్డి’మంతులకు ఈ సంగతి తెలుసు. ఏ వారాంతపు తీరిక వేళల్లోనో వారు ‘సీస’పద్యాలల్లుతారు. వారికిది ఫుర్సత్కా మామ్లా. వారందరి కోసం ఈవారం.. ‘మధు’రోక్తి విస్కీతో కలిపి తాగితే ధైర్యమే మంచి విటమిన్ -జారోడ్ కింజ్, అమెరికన్ రచయిత మిస్టిక్ మ్యూజిక్ షాంపేన్ : 120 మి.లీ. ఐరిష్ విస్కీ : 30 మి.లీ. యాపిల్ జ్యూస్ : 100 మి.లీ గార్నిష్ : పుదీనా ఆకులు, పలచని యాపిల్ ముక్కలు - వైన్‌తేయుడు