జర్మనీలోని బడ్జెట్ సూపర్‌మార్కెట్ చెయిన్ లిడ్ల్‌కు చెందిన ది క్వీన్ మార్గోట్ బ్లెండ్ స్కాచ్ విస్కీ ప్రపంచంలోనే బెస్ట్ విస్కీగా నిలిచిందంటూ వార్తలు నిజంకాదని నిర్వాహకులు ప్రకటించారు. ఉత్తమమైన వాటిల్లో ఒకటి మాత్రమే నిలిచిందని స్పష్టం చేశారు. 12 ఏళ్ల బెస్ట్ బ్లెండెడ్ స్కాచ్‌విస్కీగా మాత్రమే 40మంది నిపుణులు నిర్ధార్ధించారని పేర్కొంది. ప్రపంచంలోనే నెంబర్ 1 విస్కీ అనేది ఫేక్ న్యూస్ అని ఇప్పటివరకు ఒక రౌండ్ మాత్రమే పూర్తి అయిందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ పోటీకి సంబంధించినవ వివరాలను http://bit.ly/WhiskyLiveLondon2019 లో తెలుసుకోవచ్చని ఫోర్బ్స్ వివరించింది. ఈ పోటిలో తుది ఫలితాలను మార్చి 28, 2019న లండన్‌లో వెల్లడించనున్నామని వివరణ ఇచ్చింది.
వరల్డ్ విస్కీస్ వార్షిక అవార్డులు కార్యక్రమంలో భాగంగా ఈ విస్కీ అవార్డును ఎంపిక చేస్తారు..ఈ పోటీలో అంతర్జాతీయంగా పేరొందిన, మంచి గుర్తింపు సాధించిన డ్రింక్స్‌ను ఉంచుతారు. వీటిని రుచి చూసిన నిపుణులు అత్యుత్తమంగా నిలిచిన దానికి ప్రపంచంలో బెస్ట్ విస్కీ అవార్డును ప్రకటిస్తారు.
కాగా జర్మన్‌కు చెందిన లిడ్ల్ స్కాచ్ విస్కీ ప్రపంచంలో బెస్ట్ విస్కీగా నిలిచిందంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేశాయి. దాదాపు 40 మంది అంతర్జాతీయ నిపుణులు ఈ విస్కీని రుచిచూసి ఈ విషయాన్ని తేల్చారంటూ పలు మీడియాలు సంస్థలు కథనాలు ప్రచురించాయి.
Comments
Please login to add a commentAdd a comment