కాక్‌టైల్.. మనసొక మధుకలశం..
మధుకలశం మదికాగా సుధగ్రోలుట తప్పుగాదు సతతము ఇలలో వ్యధ ఎందుకు వైనుతేయ! మధువంతటి మంచి మందు మహిలో గలదే? ‘మనసొక మధుకలశం..’ అన్నాడో సినీకవి. ‘పగిలే వరకే అది నిత్యసుందరం’ అని కూడా ‘సారా’ంశాన్ని చాటి చెప్పాడాయనే! నిజానికి, ఇంతోటి జీవిత సారాంశాన్ని ప్రవచించడానికి కవిపుంగవులే దిగిరానక్కర్లేదు. చేయిజారితే మధుకలశం, కాలుజారితే మనోభాండం పగలడం తథ్యమని ఏ దేవదాసును అడిగినా చెబుతాడు.
‘పగలగానే భళ్లుమనడం గాజు నైజము చూడుము.. పగిలినా అది రగిలినా సడి చేయలేనిది హృదయము’ అని కుమిలిపోయే డోసెరుగని భగ్నజీవులు లోకంలో చాలామందే ఉంటారు. వ్యథార్తులకు ఊరటనిచ్చే దివ్యౌషధం మధువే! సందేహం లేదు. అయితే, ప్రతి ఔషధానికీ తగిన మోతాదు ఉంటుంది. బాధల శీఘ్ర నివారణ కోసం మోతాదు మించితే ఇక అంతే సంగతులు. పరిమితులెరిగిన ‘బుడ్డి’మంతులకు ఈ సంగతి తెలుసు. ఏ వారాంతపు తీరిక వేళల్లోనో వారు ‘సీస’పద్యాలల్లుతారు. వారికిది ఫుర్సత్‌కా మామ్‌లా. వారందరి కోసం ఈవారం..
‘మధు’రోక్తి
విస్కీతో కలిపి తాగితే ధైర్యమే మంచి విటమిన్
-జారోడ్ కింజ్,
అమెరికన్ రచయిత
మిస్టిక్ మ్యూజిక్
షాంపేన్ : 120 మి.లీ.
ఐరిష్ విస్కీ : 30 మి.లీ.
యాపిల్ జ్యూస్ : 100 మి.లీ
గార్నిష్ : పుదీనా ఆకులు, పలచని యాపిల్ ముక్కలు
- వైన్‌తేయుడు