
లండన్: అవున్నిజమే. మెకాలన్ బ్రాండ్‌కు చెందిన ప్రీమియం స్కాచ్ బాటిల్ ఒకటి ఏకంగా రూ.22.5 కోట్లు పలికింది! శనివారం సోత్‌బే వేలంలో ఇది అక్షరాలా అంత మొత్తానికి అమ్ముడైంది! దాంతో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన విస్కీగా కొత్త రికార్డు సృష్టించింది.
దీని ప్రత్యేకతలే ఇంతటి ధరకు కారణమయ్యాయి. ఈ సింగిల్ మాల్ట్ విస్కీ 1926 నాటిది. మెకాలన్ కంపెనీ ఇలాంటి 40 బాటిళ్లను మాత్రమే తయారు చేసింది. వాటిని ఏకంగా 60 ఏళ్ల పాటు డార్క్ ఓక్‌వుడ్ పెట్టెల్లో నిల్వ చేసి ఉంచి 1986లో బయటికి తీశారట. కొన్నింటిని మెకాలన్ తన వీఐపీ కస్టమర్లకు విక్రయించిందట.
Comments
Please login to add a commentAdd a comment