scotch
-
Macallan: విస్కీ బాటిల్ రూ. 22.5 కోట్లు!
లండన్: అవున్నిజమే. మెకాలన్ బ్రాండ్‌కు చెందిన ప్రీమియం స్కాచ్ బాటిల్ ఒకటి ఏకంగా రూ.22.5 కోట్లు పలికింది! శనివారం సోత్బే వేలంలో ఇది అక్షరాలా అంత మొత్తానికి అమ్ముడైంది! దాంతో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన విస్కీగా కొత్త రికార్డు సృష్టించింది. దీని ప్రత్యేకతలే ఇంతటి ధరకు కారణమయ్యాయి. ఈ సింగిల్ మాల్ట్ విస్కీ 1926 నాటిది. మెకాలన్ కంపెనీ ఇలాంటి 40 బాటిళ్లను మాత్రమే తయారు చేసింది. వాటిని ఏకంగా 60 ఏళ్ల పాటు డార్క్ ఓక్వుడ్ పెట్టెల్లో నిల్వ చేసి ఉంచి 1986లో బయటికి తీశారట. కొన్నింటిని మెకాలన్ తన వీఐపీ కస్టమర్లకు విక్రయించిందట. -
ఆ విస్కీ దిగుమతుల్లో ఫ్రాన్స్‌ను దాటేసిన భారత్.. మరీ అంతలా తాగుతున్నారా..?
ఖరీదైన ఫారిన్ మద్యం స్కాచ్ విస్కీ దిగుమతుల్లో భారత్.. ఫ్రాన్స్‌ను దాటేసింది. 2021తో పోల్చుకుంటే 2022లో ఈ విస్కీ దిగుమతులు ఏకంగా 60 శాతం పెరిగాయి. స్కాట్‌ల్యాండ్‌కు చెందిన స్కాచ్ విస్కీ అసోసియేషన్ లెక్కల ప్రకారం.. భారత్ 2021లో 205 మిలియన్ల 70సీఎల్ (700 ఎంఎల్) బాటిళ్ల విస్కీని దిగుమతి చేసుకుంటే 2022లో 219 మిలియన్ల బాటిళ్లను దిగుమతి చేసుకుంది. ఈ లెక్కన భారత్ స్కాచ్ మార్కెట్ పదేళ్లలో 200 శాతం వృద్ధి చెందింది. మరోవైపు రెండంకెల వృద్ధి ఉన్నప్పటికీ ఇండియన్ విస్కీ మార్కెట్లో స్కాచ్ విస్కీ వాటా కేవలం రెండు శాతమే. యూకే-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా భారత్‌లో తమ మార్కెట్‌ను మరింత విస్తరించునేందుకు స్కాట్‌ల్యాండ్ విస్కీ కంపెనీలకు వీలు కలిగిందని స్కాచ్ విస్కీ అసోసియేషన్ పేర్కొంది. రానున్న ఐదేళ్లలో 1 బిలియన్ బ్రిటిష్ పౌండ్ల మేర వృద్ధి ఉంటుందని అభిప్రాయపడింది. 2021లో భారత్‌కు స్కాచ్ ఎగుమతుల విలువ 282 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు. తైవాన్, సింగపూర్, ఫ్రాన్స్‌ల తర్వాత ఇది అయిదో స్థానం. 2022లోనూ యూరోపియన్ యూనియన్ను ఆసియా పసిఫిక్ రీజియన్ అధిగమించి అతిపెద్ద ప్రాంతీయ మార్కెట్‌గా అవతరించింది. కోవిడ్ అనంతరం భారత్ సహా తైవాన్, సింగపూర్, చైనాలకు స్కాచ్ ఎగుమతుల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. (ఇదీ చదవండి: లైసెన్స్ లేకుండా అమ్ముతారా..? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు నోటీసులు!) -
టీఎస్ ఎన్పీడీసీఎల్కు స్కోచ్ అవార్డులు
హనుమకొండ: తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్ ఎన్పీడీసీఎల్)కు రెండు ‘స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’అవార్డులు దక్కాయి. శుక్రవారం ఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా 88వ స్కోచ్ సదస్సు జరిగింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కోచ్ వైస్ చైర్మన్ గురుశరణ్ డంజల్ స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులను ప్రకటించారు. ఐఆర్డీఏ జీపీఆర్ఎస్ ఎనేబుల్డ్ ఇంటిగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్, డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ ఎనర్జీ ఇన్ టీఎస్ ఎన్పీడీసీఎల్ అవార్డులు వచ్చాయి. ఆ సంస్థ సీఎండీ ఎ.గోపాల్‌రావు ఆన్లైన్లో అవార్డులు స్వీకరించారు. -
The Intrepid: బాప్రే.. మనిషి ఎత్తులో భారీ విస్కీ బాటిల్!
రికార్డుల కోసం రకరకాల ప్రయత్నాలు సాగుతుంటాయి. అలాంటిదే ఇది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు భారీ విస్కీ బాటిల్‌ను తయారు చేసింది మాకల్లన్ కంపెనీ. 32 సంవత్సరాల కింద తయారుచేసిన ఈ బాటిల్ సామర్థ్యం 311 లీటర్లు. త్వరలోనే ఈ స్కాచ్ విస్కీ బాటిల్ వేలానికి రాబోతోంది. స్కాట్‌ల్యాండ్‌కు చెందిన మాకల్లన్ కంపెనీ ఈ భారీ స్కాచ్ విస్కీ బాటిల్‌ను తయారు చేసింది. ది ఇంట్రెపిడ్గా గుర్తింపు పొందిన ఈ బాటిల్ ఐదు అడుగుల 11 అంగులాల పొడవు ఉంది. అంటే సగటు మనిషి ఎత్తు(5.5 ఫీట్స్) కంటే ఎక్కువే!. ఈ కంపెనీ ఇదే పేరుతో తయారు చేసే 444 రెగ్యులర్ బాటిల్స్ కలిస్తే ఎంతో.. ఈ బాహుబలి విస్కీ బాటిల్ అంత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. స్కాట్‌ల్యాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌కు చెందిన ప్రముఖ ఆక్షన్ హౌజ్.. లైఆన్ అండ్ టర్న్‌బుల్ ఈ వేలంపాటను మే 25వ తేదీన నిర్వహించనుంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఒక విస్కీబాటిల్ అత్యధికంగా 1.9 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు పద్నాలుగున్నర కోట్ల రూపాయల పైమాటే) అమ్ముడుపోయింది. ఈ రికార్డును ది ఇంట్రెపిడ్ బద్ధలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. కిందటి ఏడాది గిన్నిస్ బుక్‌లో ఇంట్రెపిడ్కు చోటు దక్కింది. ఇప్పుడు వేలం ద్వారా మరో రికార్డుకు సిద్ధం అవుతున్నారు. వేలంపాటలో ప్రారంభ ధరనే 1.3 మిలియన్ పౌండ్లుగా అనుకుంటున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తంలో.. 25 శాతాన్ని మేరీ క్యూరీ చారిటీకి ఇవ్వాలని భావిస్తున్నారు. నిజానికి ఈ బాటిల్‌ను రికార్డుల కోసం పదిలపర్చాలని సదరు కంపెనీ అనుకుంది. కానీ, ఒక మంచి పనికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు వేలానికి ముందుకు వచ్చింది. చదవండి: అక్కడేం లేదు.. అయినా నాలుగు కోట్లు! -
స్కోచ్ అవార్డుల్లో తెలంగాణ హవా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక స్కోచ్ సంస్థ అందజేసే అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. రాష్ట్రంలోని పలు పురపాలక శాఖ, సంఘాలకు వివిధ విభాగాల్లో అవార్డుల పంట పండింది. రెండు రోజు శుక్రవారం న్యూఢిల్లీ లో జరిగిన స్కోచ్ అవార్డుల కార్యక్రమంలో తెలంగాణకు ఏకంగా 23 అవార్డులు దక్కాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, శక్తి పునరుత్పాదకత, వాణిజ్య పన్ను విభాగం, పురపాలక శాఖలకు మెరిట్ ఆప్ ఆర్ఢర్ అవార్డులు దక్కాయి. ఇందులో సిద్దిపేట మున్సిపాలిటి-6, జీహెచ్ఎంసీ-3, ఇతర విభాగాల్లో 6 దక్కించుకోగా, మరో 8 మంది గ్రామీణ యువ పారిశ్రామికవేత్తలు ఈ అవార్డులు అందుకున్నారు. -
స్కాచ్, టెకీలా.. దేశమంతటా గోవా ఫెనీ!
మెక్సికన్ టెకీలా, స్కాచ్ కూడా ఒకప్పుడు దేశీ నాటుసారాలాంటివే.. కానీ అంతర్జాతీయంగా ప్రచారం చేయడంతో ఇప్పుడు అవి టాప్ బ్రాండ్ మద్యంలా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. అదేరీతిలో గోవాలో ఫేమస్ అయిన నాటుసారాను దేశమంతటా అమ్మాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గోవాకు వెళ్లే మద్యం ప్రియులు అక్కడి నాటు బట్టీసారాను రుచి చూడకుండా ఉండలేరు. 'ఫెనీ' పెరిట పిలిచే ఈ సారాను సేవించేందుకు ఇప్పుడు గోవాకు దాకా రావాల్సిన అవసరం లేదు. దేశమంతటా అందుబాటులోకి తెస్తామంటోంది గోవా ప్రభుత్వం. ఇందుకోసం గోవా ఎక్సైజ్ డ్యూటీ చట్టంలో సవరణలు తీసుకొస్తున్నది. స్కాచ్, టెకీల తరహాలో ఫెనీకు కూడా అంతర్జాతీయ స్థాయి డ్రింక్‌గా పేరు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గోవా ఎక్సైజ్ కమిషనర్ మినినో డిసౌజా తెలిపారు. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం దామన్‌లో మినహా దేశమంతటా సారా అమ్మకాలపై నిషేధం ఉందని, ఈ నేపథ్యంలో 'హెరిటెజ్ స్పిరిట్' (సాంస్కృతిక సారా)గా అంతర్జాతీయ మద్యం స్థాయిలో దీనిని తీసుకొస్తున్నామని, ఒకప్పుడు దేశీయ మద్యాలైన టెకిలా, స్కాచ్ స్థాయిలో ఫెనీ ఉంటుందని ఆయన వివరించారు. జూలై జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్సైజ్ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశమంతటా ఫెనీ అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్ లభించనుంది.