టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌కు స్కోచ్‌ అవార్డులు  | TSNPDCL Won Two Scotch Order Of Merit Awards | Sakshi
Sakshi News home page

టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌కు స్కోచ్‌ అవార్డులు 

Published Sat, Jan 21 2023 2:06 AM | Last Updated on Sat, Jan 21 2023 2:06 AM

TSNPDCL Won Two Scotch Order Of Merit Awards - Sakshi

ఆన్‌లైన్‌లో అవార్డు స్వీకరిస్తున్న గోపాల్‌రావు   

హనుమకొండ: తెలంగాణ స్టేట్‌ నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌)కు రెండు ‘స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’అవార్డులు దక్కాయి. శుక్రవారం ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా 88వ స్కోచ్‌ సదస్సు జరిగింది.

ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్కోచ్‌ వైస్‌ చైర్మన్‌ గురుశరణ్‌ డంజల్‌ స్కాచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులను ప్రకటించారు. ఐఆర్‌డీఏ జీపీఆర్‌ఎస్‌ ఎనేబుల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్పాట్‌ బిల్లింగ్, డిస్ట్రిబ్యూటెడ్‌ సోలార్‌ ఎనర్జీ ఇన్‌ టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ అవార్డులు వచ్చాయి. ఆ సంస్థ సీఎండీ ఎ.గోపాల్‌రావు ఆన్‌లైన్‌లో అవార్డులు స్వీకరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement