Gopal Rao
-
పద్మశ్రీ యడ్ల గోపాలరావుకు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు
-
త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఎలా జరుగుతోంది?
రఘునాథపల్లి: వ్యవసాయ మోటార్లకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు జనగామ జిల్లా రఘునాథపల్లి సబ్ డివిజన్ సెక్షన్ ఆఫీస్, ఈఆర్వో కార్యాలయం, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్రీఫేజ్ కరెంట్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండటంతో పొలాలకు నీరు పెట్టేందుకు రైతులు రాత్రివేళ పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ప్రధాన సంచికలో మంగళవారం ‘చేను తడవాలంటే జాగారమే’శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా ఎలా జరుగుతుంది, ఏమైనా ఇబ్బందులున్నాయా.. 33/11 పవర్ ట్రాన్స్ఫార్మర్ల తీరు తెన్నులు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన, వర్క్ కేటాయింపు రిజిస్టర్లను తనిఖీ చేశారు. వినియోగదారులకు, రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ æఇంజనీర్ వేణుమాధవ్, డీఈ ఆపరేషన్ ఎంఎల్ఎన్ రెడ్డి, డీఈ ఐటీ అనిల్‌కుమార్, ఏడీఈ మనోహర్‌రెడ్డి, ఎస్‌ఏవో జయరాజ్, ఏఏవో హన్మంత్‌నాయక్, ఏఈ రాహుల్ తదితరులున్నారు. -
వాయిదాల్లో ఏసీడీ సేకరణ
హనుమకొండ: అదనపు వినియోగాధారిత డిపాజిట్(ఏసీడీ)ను వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి(ఎన్పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీఎస్ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏసీడీ విధింపుపై ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. విద్యుత్ సర్వీస్ తీసుకున్నప్పటి కంటే అదనంగా లోడ్ పెరిగినప్పుడు ఆ మేరకు ఏసీడీ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏసీడీపై ప్రతి ఏడాది మే నెలలో వడ్డీ చెల్లిస్తూ బిల్లులు సర్దుబాటు చేస్తామని, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల మేరకే ఏసీడీ విధిస్తున్నామన్నారు. ఇది విద్యుత్ పంపిణీ సంస్థలు, పాలకమండలి సొంత నిర్ణయం కాదని స్పష్టం చేశారు. వినియోగదారులు వరుసగా రెండు నెలలు బిల్లు చెల్లించనప్పుడు మూడో నెల నోటీసు ఇచ్చి డిపాజిట్ నుంచి సంస్థకు రావాల్సిన బకాయిలు తీసుకుని సర్వీస్ రద్దు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో వినియోగదారులు వినియోగిస్తున్న యూనిట్లకు ఎంత బిల్లు వస్తుందో ఏడాదికి సగటున లెక్కించి రెండు నెలల బిల్లు మొత్తాన్ని ఏసీడీగా సేకరిస్తున్నామని, ఈ ఏసీడీని ఇంటి యజమాని చెల్లించాలన్నారు. అద్దెదారులు, ఇంటి యజమాని పరస్పర అవగాహనకు వచ్చి ఏడీసీని అద్దెదారులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, తలసరి వినియోగంలోనూ ముందున్నామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డైరెక్టర్లు బి.వెంకటేశ్వర్రావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, వి.తిరుపతిరెడ్డి, సీజీఎం మధుసూదన్ పాల్గొన్నారు. -
టీఎస్ ఎన్పీడీసీఎల్కు స్కోచ్ అవార్డులు
హనుమకొండ: తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్ ఎన్పీడీసీఎల్)కు రెండు ‘స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’అవార్డులు దక్కాయి. శుక్రవారం ఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా 88వ స్కోచ్ సదస్సు జరిగింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కోచ్ వైస్ చైర్మన్ గురుశరణ్ డంజల్ స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులను ప్రకటించారు. ఐఆర్డీఏ జీపీఆర్ఎస్ ఎనేబుల్డ్ ఇంటిగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్, డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ ఎనర్జీ ఇన్ టీఎస్ ఎన్పీడీసీఎల్ అవార్డులు వచ్చాయి. ఆ సంస్థ సీఎండీ ఎ.గోపాల్‌రావు ఆన్లైన్లో అవార్డులు స్వీకరించారు. -
విద్యుత్ కనెక్షన్‌పై ఏసీడీ.. ఇంటి యజమానే చెల్లించాలి
హన్మకొండ: ఇంటి యజమానులు విద్యుత్ కనెక్షన్ తీసుకున్న సమయంలో తక్కువ లోడ్‌తో కనెక్షన్ తీసుకుంటారని, ఆనంతరం అవసరాలు పెరగడంతో లోడ్ పెరుగుతుందని, పెరిగిన లోడ్‌పై రెండు నెలల డిపాజిట్‌ను ఏసీడీ (అదనపు వినియోగ డిపాజిట్) రూపంలో విధిస్తున్నట్లు టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డిపాజిట్‌కు విద్యుత్ సంస్థ ఏడాదికి ఒకసారి వడ్డీ చెల్లిస్తుందన్నారు. డిపాజిట్ రూపంలో ఉంటున్నందున, దీనిని కిరాయిదారుడు కాకుండా ఇంటి యాజమాని చెల్లించడం సబబుగా ఉంటుందన్నారు. ఇంటి యజమానికి విద్యుత్ అవసరం తీరి కనెక్షన్ తొలగించుకునే సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. చాలామంది వినియోగదారులు ఏసీడీని కిరాయిదారుడు చెల్లించాలా? లేదా ఇంటి యజమాని చెల్లించాలా? అని సందేహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈమేరకు స్పష్టంచేశారు. వినియోగదారులకు ఇంకా సందేహాలుంటే విద్యుత్ రెవెన్యూ కార్యాలయం, బిల్లులు చెల్లించే కౌంటర్ వద్ద నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. -
ఎన్పీడీసీఎల్లో నోటిఫికేషన్ జారీచేయలేదు
హనుమకొండ: టీఎస్ ఎన్పీడీసీఎల్లో ఎలాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలేదని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.గోపాల్‌రావు స్పష్టం చేశారు. ఆన్లైన్ వెబ్సైట్లో 157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు వస్తున్న ప్రకటన, ప్రచురణతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లు, కొన్ని పత్రికల్లో 157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రకటనలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి కథనాలను నమ్మవద్దని, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్‌కు చెందిన వెబ్సైట్లో చూసుకుని వాస్తవాలు నిర్ధారించుకోవాలని గోపాల్‌రావు సూచించారు. సంస్థ ఉద్యోగాల భర్తీ చేపడితే అధికారికంగా పత్రికలు, చానళ్లలో నోటిఫికేషన్ ఇస్తుందన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని నమ్మవద్దని కోరారు. చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు 157 యూనిట్లను ఆడిట్ చేయాలని ఎన్పీడీసీఎల్ వెబ్సైట్లో పొందుపరిస్తే.. దీన్ని కొన్ని వెబ్సైట్లు, పత్రికలు 157 పోస్టులుగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని, నిరుద్యోగులు దీన్ని గమనించాలని సూచించారు. -
శ్మశానానికి రూ.6 కోట్ల భూమి విరాళం
భీమారం (వరంగల్): గజం స్థలం కోసం సొంతవాళ్లతో ఘర్షణ పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా రూ.6 కోట్ల విలువైన భూమిని దానం చేసి తన ఉదారతను చాటుకున్నారు. వరంగల్ నగరం పరిధిలోని గుండ్లసింగారానికి చెందిన గంగు గోపాల్రావుకు స్థానికంగా కొంత వ్యవసాయ భూమి ఉంది. గ్రామానికి శ్మశాన వాటిక లేకపోవడాన్ని గమనించి తనకున్న భూమిలోనుంచి మూడెకరాలను దానికి ఇవ్వాలని నిర్ణయించాడు. అక్కడ ఎకరం బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ మేరకు టీఆర్ఎస్ జిల్లా నేత అల్వాల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీ దయాకర్‌ను కలిసి తన నిర్ణయాన్ని వివరించాడు. ఈ మేరకు శనివారం ఎంపీలు దయాకర్, బండా ప్రకాశ్ చేతుల మీదుగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంత్‌కు పత్రాలు అందజేశారు. గోపాల్‌రావు దానమిచ్చిన మూడెకరాలలో మోడల్ శ్మశానవాటిక నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పెద్దమనసు చాటుకున్న గోపాల్‌రావును కలెక్టర్ అభినందించారు. -
యడ్ల గోపాలరావుకు పద్మశ్రీ అవార్డు
-
నిరంతర విద్యుత్‌పై అనుమానాలొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా దిగ్విజయంగా కొనసాగుతోందని, ఇక ముందు కూడా సరఫరా కొనసాగిస్తామని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్‌రావు పేర్కొన్నారు. రైతుల విద్యుదవసరాలకు అనుగుణంగా, డిమాండ్ ఎంతకు చేరినా సరఫరాకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై అనుమానాలు అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతర కరెంట్ సరఫరాకు శనివారం నాటికి 50 రోజులు నిండిన నేపథ్యంలో రఘుమారెడ్డి, గోపాల్‌రావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగానికి మేలు చేయాలన్న సంకల్పంతోనే నిరంతర విద్యుత్‌ను అమలు చేస్తున్నామని, దీనిపై కేంద్రం నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయని చెప్పారు. కేంద్ర నిబంధనల మేరకు ఏ జిల్లాలో ఎన్ని పంపుసెట్లు ఉన్నాయి, వాటికి ఎంత కరెంట్ అవసరమన్న లెక్కలు తీసి... మొత్తంగా కనీసం 5 శాతం సోలార్ వినియోగం ఉండేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇప్పటికే దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 3,200 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి జరుగుతోందని తెలిపారు. 10 వేల మెగావాట్లు దాటిన డిమాండ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా విద్యుత్ వినియోగం 10 వేల మెగావాట్లు దాటిందని రఘుమారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 7.44కి రాష్ట్ర విద్యుత్ వినియోగం 10,002 మెగావాట్లుగా నమోదైంద న్నారు. వేసవి డిమాండ్ 10,600 మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని, డిమాండ్ 11,500 మెగావాట్లకు చేరినా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం నిరంతర విద్యుత్, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాల దృష్ట్యా.. డిస్కమ్‌లు మునిగిపోతున్నాయనే ప్రచారం వాస్తవ విరుద్ధమని రఘుమా రెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న విద్యుత్ కోతలను, పవర్ హాలిడేలను తొలగించామని.. ప్రభుత్వం డిస్కమ్‌లకు పూర్తిస్థాయిలో సహకరిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఏడాది రూ.4,777 కోట్ల మేర సబ్సిడీగా ఇచ్చిందని, మరో రూ.2,498 కోట్లను పెట్టుబడిగా పెట్టిందని, నష్టాల దృష్ట్యా రూ.310 కోట్లను అదనంగా ఇచ్చిందని తెలిపారు. రైతులు జాగ్రత్తగా నీటిని వాడాలి రాష్ట్రంలో 23 లక్షల పంపుసెట్లు ఉండగా.. దాదాపు సగం చోట్ల ఆటోస్టార్టర్లను తొలగించారని, మిగతావారు కూడా తొలగించాలని రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు. అవసరమైన నీటికన్నా అధికంగా వాడితే పంటలకు కూడా నష్టమేనని, జాగ్రత్తగా వాడాలని సూచించారు. 24 గంటల కరెంట్ వద్దని వివిధ చోట్ల నుంచి 10 తీర్మానాలు వచ్చాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
ఆగిరిపల్లి పంచాయతీలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలి మాదల గోపాల్ రావు(60), సునీత(25) అనే ఇద్దరు మృతిచెందారు. ఉతికిన బట్టలను ఇనుప వైరుపై ఆరేస్తుండగా కరెంటు షాక్ తగలడంతో సునీత గిజగిజ కొట్టుకుంటుంది. ఇది చూసిన గోపాల్‌రావు ఆమె రక్షించబోయి పట్టుకోబోవడంతో ఆయనకు కూడా షాక్ కొట్టింది. కరెంటు షాక్‌తో ఇద్దరూ ఊగుతుండటంతో గమనించిన స్థానికులు కర్రతో కొట్టారు. అప్పటికే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గోపాల్ రావు గొంతులో ప్రాణం ఉందేమోనని ఆశతో ఆయనను విజయవాడకు తరలించారు. కానీ ప్రాణం పోయిందనుకుని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి ఆగిరిపల్లి తీసుకువచ్చారు.