రఘునాథపల్లి సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేస్తున్న సీఎండీ గోపాల్‌రావు
రఘునాథపల్లి: వ్యవసాయ మోటార్లకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు జనగామ జిల్లా రఘునాథపల్లి సబ్ డివిజన్ సెక్షన్ ఆఫీస్, ఈఆర్వో కార్యాలయం, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్రీఫేజ్ కరెంట్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండటంతో పొలాలకు నీరు పెట్టేందుకు రైతులు రాత్రివేళ పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ప్రధాన సంచికలో మంగళవారం ‘చేను తడవాలంటే జాగారమే’శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు.
వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా ఎలా జరుగుతుంది, ఏమైనా ఇబ్బందులున్నాయా.. 33/11 పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల తీరు తెన్నులు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన, వర్క్ కేటాయింపు రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. వినియోగదారులకు, రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ æఇంజనీర్ వేణుమాధవ్, డీఈ ఆపరేషన్ ఎంఎల్‌ఎన్ రెడ్డి, డీఈ ఐటీ అనిల్‌కుమార్, ఏడీఈ మనోహర్‌రెడ్డి, ఎస్‌ఏవో జయరాజ్, ఏఏవో హన్మంత్‌నాయక్, ఏఈ రాహుల్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment