సాక్షి, నిడమనూరు (నల్గొండ జిల్లా): ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని నిడమనూరు ఎస్‌ఐ గోపాల్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. మద్యం తాగి బండి నడిపి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. రోడ్లపై కేక్ కటింగ్, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో డీజేలు, సౌండ్ సిస్టంలు వినియోగిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి బృందాలుగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. వైన్ షాప్‌లకు రాత్రి 12.00 గంటల వరకు.. బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1.00 గంట వరకు మాత్రమే ప్రభుత్వo అనుమతించింది. సమయపాలన పాటించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment