రంగారెడ్డి: బడంగ్‌పేట మేయర్ శ్రీమతి చిగిరింత పారిజాత కొత్త సంవత్సర వేడుకల్లో సందడి చేశారు. మంగళవారం సాయంత్రం ఆల్మాస్‌గూడలో బోయపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. మేయర్ పారిజాత సమక్షంలో జరిగిన వేడుకల్లో అసోషియేషన్ సభ్యులు హుషారుగా గడిపారు.
పలువురికి సన్మానాలు చేసి ఆమె బహుమతులు అందజేశారు. అలాగే కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని ఆమె అన్నారు. మరోవైపు కార్పొరేటర్ సాంరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటిదాకా చేసిన సేవల్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు ఎ. జనార్ధన్, ప్రధాన కార్యదర్శి పి.కవిత, కోశాధికారి సీహెచ్ వినోబా చారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment