సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాది 2025 వేళ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతీ ఒక్కరి జీవితంలోనూ శుభ సంతోషాలు నింపాలని, మంచి జరగాలని కోరుకుంటున్నట్టు కోరుకుంటున్నట్టు నాయకులు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా..
నవ వసంతంలో…
విశ్వ వేదిక పై…
విజయ గీతికగా…
తెలంగాణ…
స్థానం… ప్రస్థానం
ఉండాలని…
ప్రతి ఒక్కరి జీవితంలో…
ఈ నూతన సంవత్సరం…
శుభ సంతోషాలను నింపాలని…
మనసారా కోరుకుంటూ…
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నవ వసంతంలో…
విశ్వ వేదిక పై…
విజయ గీతికగా…
తెలంగాణ…
స్థానం… ప్రస్థానం
ఉండాలని…
ప్రతి ఒక్కరి జీవితంలో…
ఈ నూతన సంవత్సరం…
శుభ సంతోషాలను నింపాలని…
మనసారా కోరుకుంటూ…
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. #HappyNewYear2025 #HappyNewYear— Revanth Reddy (@revanth_anumula) January 1, 2025
నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేసీఆర్..‘2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని అన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment