పగిలితే అతికించలేం.. కానీ ధర మాత్రం రూ.200 కోట్లు! ఎవరు కొన్నారంటే?
పింగాణీ గిన్నె! పగిలితే అతికించలేం. కానీ రెండు పక్షులు, ఆఫ్రికాట్ చెట్టు పెయింటింగ్ ఉన్న పింగాణీ గిన్నె వేలం పాటలో అక్షరాల 25 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. అంటే భారత కరెన్సీలో రూ.200 కోట్లు
అమెరికాకు చెందిన పూరాతన వస్తువుల్ని వేలం నిర్వహించే ప్రముఖ సంస్థ సోథిబె 40 దేశాల్లో 80 ప్రాంతాల్లో కార్యకాపాలు నిర్వహిస్తుంది. అయితే ఈ కంపెనీ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో హాంకాంగ్‌లో ప్రత్యేకంగా ఓ వేలం పాట నిర్వహించింది.
ఆ ఆక్షన్‌లో చైనా రాజధాని బీజింగ్‌లో 18 శతాబ్ధంలో అంటే? 1722-35 మధ్య యోంగ్‌జింగ్ రాజు చనిపోయిన కొద్ది కాలానికి 'ఫలాంగ్‌కాయ్,' 'ఫారిన్ కలర్స్' అని పిలిచే సంప్రదాయంలో భాగంగా సిరామిక్స్‌తో ఈ పింగాణీ గిన్నెను తయారు చేశారు. గిన్నె మీద రెండు పక్షులు, ఆప్రికాట్ చెట్టు బొమ్మలు యోంగ్జెంగ్ వంశానికి చెందిన రాజు పద్యం నుంచి కొన్ని పదాలు ఉన్నాయి.
ఇలాంటివి రెండు గిన్నెలను తయారుచేయగా.. 19వ శతాబ్దం చివరలో షాంఘైకి చెందిన షిప్పింగ్ వ్యాపారి కెప్టెన్ చార్లెస్ ఓస్వాల్డ్ లిడ్డెల్ నుంచి వీటిని సేకరించినట్లు తెలుస్తోంది. 1929లో వీటిని 150 పౌండ్లకు వేర్వేరుగా విక్రయించారు. వీటిలో లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉందని సోథెబీస్ తెలిపింది. రెండో దానిని హాంకాంగ్‌లో తాజాగా వేలం వేశారు. ఈ గిన్నె దశాబ్దాలుగా అనేక మంది చేతులు మారింది. వీరిలో అమెరికాకు చెందిన బార్బరా హట్టన్ సైతం వేలం పాటలో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 8న వేసిన వేలంలో ఆ గిన్నెను వ్యాపారవేత్త, కలెక్టర్ అలిస్ చెంగ్ కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
View this post on Instagram
A post shared by Sotheby's (@sothebys)