Mint leaves
-
ఉదయాన్నే నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటున్నారా? వేసవిలో ఇలా చేస్తే..
ఎండాకాలం కాసేపు బయటికి వెళితే చాలు ముఖచర్మం కమిలిపోతుంది. విపరీతంగా చెమటలు పోస్తాయి. నీరసం, నిస్త్రాణ కలుగుతాయి. కాసేపు పని చేస్తే చాలు శరీరం అలసిపోయి, సొమ్మసిల్లినట్లు అవుతుంది. బయటికి వెళ్లేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఎండల్లోనూ అందంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అవేమిటో చూద్దాం... పుదీనా, నిమ్మరసం- తేనెతో ►మంచి నీటిని మించిన ఔషధం లేదు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడేది మంచినీరు మాత్రమే. కాబట్టి ఇప్పటినుంచీ దాహం వేసినా వేయకపోయినా వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం అలవాటుగా మార్చుకోండి. ►గుప్పెడు పుదీనా ఆకులను తాగే నీటిలో వేసుకుంటే... శరీరం చల్లగా ఉంటుంది. ఈ కాలంలో పుదీనా టీని ఎంచుకుంటే మరీ మంచిది. ఎండ ప్రభావాన్ని కొంతవరకూ తట్టుకోగలుగుతారు. ►నిమ్మరసం వేసవికి ఔషధం లాంటిది. ఉదయాన్నే గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. పెరుగు తీసుకుంటే ఉప్పు, కొద్దిగా మసాలాలు జోడించి పెరుగు చిలికి చేసే మజ్జిగ శరీరంలో వేడిని చల్లారుస్తుంది. డీహైడ్రేషన్ ను నివారిస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ల భరితం. వేసవి తాపంతో పోరాడటానికి మజ్జిగ ఒక మంచి ఆప్షన్. దీనిలో క్యాలరీలు తక్కువ. కాల్షియం, పొటాషియంతో పాటు ప్రొటీన్ కూడా దీని నుంచి దొరుకుతుంది. అసిడిటీని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా పెరుగు తీసుకోవడం కూడా మంచిదే. కొత్తిమీర రసంతో ►గసగసాలను ఎక్కువగా ఆహారపదార్థాల్లో వాడాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు, వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ►కొత్తిమీరను ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొత్తిమీర రసం లేదా వంటకాల్లో దీన్ని వాడినా... శరీరంలోని అధిక ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. సీజనల్ పండ్లు తినడం వల్ల ►వేసవిలో ఆయిల్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఇంటి వంటలలో కూడా నూనె వాడకం తగ్గించాలి. ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. ►అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ వంటివి తీసుకుంటే మేలు. ►కర్బూజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజలు వంటి సీజనల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ►వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. ►రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. చర్మ సంరక్షణ ముఖ్యం ►వేసవిలో సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవడం వల్ల చర్మానికి సమస్యలు తగ్గుతాయి. ఈ సన్ స్క్రీన్ లోషన్‌ని బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్ లోషన్ వాడటం వల్ల చర్మ సమస్యలు ఉండవు. అలాగే చర్మానికి రక్షణ ఉంటుంది. ►ఎండల్లో బయటకు వెళ్ళినప్పుడు చర్మాన్ని కవర్ చేసుకోవడం అవసరం. కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు గొడుగుని తీసుకువెళ్లడం మర్చిపోకండి. అలానే ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్‌ని ధరించడం, తలకు పెద్ద టోపీ పెట్టుకోవడం పైగా ఎలాంటి సమస్యలూ రావు. చదవండి: ఇరవై మందార పూలు.. మెంతులు.. పచ్చకర్పూరం! ఇలా చేస్తే ఒత్తైన కురులు -
Beauty Tips: మొటిమలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఇలా చేస్తే సరి!
పుదీనా ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని ముఖంపై ఉన్న మొటిమలపై రాయాలి. పూర్తిగా ఆరాక నీటితో కడిగేయాలి. ఈ పేస్టు చర్మంపై పేరుకు పోయిన జిడ్డుని తొలగించి, మొటిమలు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. గుప్పెడు పుదీనా ఆకులకు కొద్దిగా తేనె, రోజ్‌వాటర్ జోడించి పేస్టులా నూరాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డులేకుండా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. -
Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఇలా చేస్తే
మొటిమల సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి. ►పదిహేను పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. ►దీనిలో రెండు టీస్పూన్ల ఓట్స్, రెండు టీస్పూన్ల కీరా రసం, టీస్పూను తేనె వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూతలా వేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల మొటిమలు పోతాయి. తేనెతో పాటు.. పుదీనా ఆకుల పేస్టులో తేనె, రోజ్‌వాటర్ వేసి కలిపాలి. మొటిమలపైన పూతలా వేసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి. ఇలా కూడా! కొన్ని పుదీనా, కొన్ని తులసి ఆకులు తీసుకొని బాగా పిండాలి. ఒక నిమ్మకాయ తీసుకుని ఈ రసంలో పిండాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూయాలి. ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి. చర్మం గరుకుగా ఉంటే.. ముఖంపై చర్మం గరుకుగా అనిపిస్తోందా? అలాంటప్పుడు.. క్యాబేజీని ఉడికించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుంది. గుంతలు పోవాలంటే.. మొటిమలు తగ్గిన తర్వాత కూడా వాటికి సంబంధించిన గుంతలు అలాగే ఉంటాయి చాలా మందికి. ఈ సమస్య నుంచి బయపడాలంటే.. ఉడకపెట్టిన బంగాళదుంప గుజ్జును ఓ వారం పాటు రాత్రుళ్లు నిద్రపోయే ముందు ముఖానికి రాస్తే సరి! చదవండి: Hair Fall Control: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా! Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే! -
ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ చూసేవాళ్లు! ఇవి ట్రై చేస్తే..
Tips To Relax Eyes- Stress Relief: ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ లేదా మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల కళ్లు ఒత్తిడికి గురై అలసిపోతుంటాయి. ఇలాంటి కళ్ల ఒత్తిడిని తగ్గించి ఉపశాంతిని కలిగించే మాస్క్‌లను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... రోజ్‌వాటర్‌తో.. ►రోజ్‌వాటర్‌లో కాటన్ ముక్కను కాసేపు నానబెట్టాలి. తరువాత కాటన్‌ను రెండుకళ్లపై మొత్తం కప్పి ఉంచి, పదిహేను నిమిషాలు తరువాత తీసేయాలి. ఒకసారి ఇలా చేసిన తరువాత కాటన్‌ను రిఫ్రిజిరేటర్లో పెట్టి మరోసారి కూడా వాడుకోవచ్చు. నల్లని వలయాలు సైతం తగ్గుముఖం ►టీ బ్యాగ్‌లను చల్లటి నీటిలో నానబెట్టాలి. తరువాత టీ బ్యాగ్‌లను నీటి నుంచి బయటకు తీసి, టీబ్యాగ్లో అధికంగా ఉన్న నీటిని పిండి కళ్లమీద పెట్టుకుని పదినిమిషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు ఒత్తిడి తగ్గడంతోపాటు, కంటిచుట్టూ ఏర్పడిన నల్లని వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. బంగాళదుంప, పుదీనా పుదీనాతో.. ►బంగాళదుంప, పుదీనా ముఖాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ►అదేవిధంగా కళ్ల ఒత్తిడిని తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. ►పుదీనా రసం, బంగాళ దుంప రసాన్ని సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి పదినిమిషాలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ►మిశ్రమం చల్లబడిన తరువాత .. కాటన్ బాల్‌ను ముంచి కళ్లమీద పెట్టుకుని ఐదు నిమిషాలు ఉంచుకోవాలి. ►కళ్ల ఒత్తిడి తగ్గడంతోపాటు, కళ్లచుట్టూ ఏర్పడిన ముడతలు తగ్గుముఖం పడతాయి. ►వీటిలో ఏ ఒక్కటి పాటించినా కళ్లకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చదవండి: Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. Mental Health: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? ఆ మూడింటిపై నియంత్రణ లేకపోతే! అంతే ఇక.. -
Beauty Tips: మొటిమలు, జిడ్డుకు చెక్ పెట్టేయండిలా!
ముఖంపై మొటిమలు, జిడ్డు సమస్య వేధిస్తోందా? అయితే, పుదీనా ఆకులతో సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి! ►పుదీనా ఆకులను ఎండబెట్టి పొడిచేయాలి. ►ఈ పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ వేసి పేస్టులా కలపాలి. ►ఈ పేస్టుని ముఖంపై అసహ్యంగా కనిపిస్తోన్న మొటిమలపై రాయాలి. ►పూర్తిగా ఆరాక నీటితో కడిగేయాలి. ►ఈ పేస్టుని రోజూ అప్లై చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగించి, మొటిమలు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. ►క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. అదే విధంగా.... ►గుప్పెడు పుదీనా ఆకులకు కొద్దిగా తేనె, రోజ్‌వాటర్ జోడించి పేస్టులా నూరాలి. ►ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డులేకుండా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. చదవండి: Detoxification: నోటి దుర్వాసన, చెమట నుంచి చెడు వాసన.. శరీరంలోని విషాలు తొలగించుకోండిలా! ఇవి తింటే మాత్రం.. -
ఔషధాల ఖజానా పుదీనా
పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క. చికిత్సా విధానాల్లో దీనిని జీర్ణ సంబంధ వ్యాధులకి ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకులు, దాల్చిన చెక్క కలిపి నూరి, ప్రతి రోజూ, 2–3 చెంచాలు సేవిస్తూ వుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా ఆకులు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషాయాన్ని సేవిస్తే, జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతీమంట, కడుపులో మంట, మూత్ర సంబంధ వ్యాధులు సమసిపోతాయి. గర్భిణులు చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి, చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారాలు తగ్గుతాయి. అలాగే నిద్రలేమికి, మానసిక వత్తిడికి, నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి, మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది. మంచి నిద్ర పడుతుంది. పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆ రసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే, తలనొప్పి తగ్గిపోయి, చల్లదనాన్నిస్తుంది. చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్కి తాజా పుదీనా ఆకులు కొన్ని రసం తీసి దూదిని ఆ రసంలో ముంచి, ముక్కులోనూ, చెవిలోనూ డ్రాప్స్‌గా వేసుకుంటే వీటి సమస్య తక్ష ణం పరిష్కారమవుతుంది. పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి, అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతినిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి, దంత వ్యాధులు కుండా అరికడుతుంది. అంతేకాక నోటి దుర్వాసనని కూడా అరికడుతుంది. ఇక శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి, తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు. చిన్న పిల్లలు కడుపునొప్పి, ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదు ఆరుచుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది. పుదీనా ఆకులను టీతో కలిపి తాగితే రుచిగా ఉండడమే కాక కంఠస్వరం బాగుంటుంది. గాయకులు, డబ్బింగ్ చెప్పేవారు పుదీనా రసం తాగితే కంఠస్వరం మృదువుగా మధురంగా తయారవుతుంది. ఇవే కాక, ఆహార పదార్ధాల తయారీలో, కాస్మోటిక్స కంపెనీల్లో, బబుల్ గమ్స్ తయారీలో, మందుల్లో, మరి కొన్ని ఉత్పత్తులో ఈ పుదీనా వాడకం ఎంతో ఉంది. -
Recipe: గోధుమ పిండి, మినప్పప్పుతో రుచికరమైన గ్రీన్ దోసెలు!
చిన్నా, పెద్దా ఇష్టంగా తినే అల్పాహారం దోసెలు.. రొటీన్‌గా కాకుండా ఈసారి ఇలా గ్రీన్ దోసెలు చేసుకుని తినండి. వైరైటీకి వెరైటీ.. రుచికి రుచి. గ్రీన్ దోసెలు చేయడానికి కావలసినవి: ►కొత్తిమీర, పుదీనా, కరివేపాకు గుజ్జు – పావు కప్పు ►గోధుమ పిండి – 3 టేబుల్ స్పూన్లు ►మినపపప్పు – ముప్పావు కప్పు (4 గంటల పాటు నానబెట్టుకోవాలి) ►మెంతులు – అర టీ స్పూన్ (4 గంటల పాటు నానబెట్టుకోవాలి) ►ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని ►నూనె – సరిపడా గ్రీన్ దోసెలు- తయారీ: ►ముందుగా మినపప్పును, మెంతుల్ని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ► ఒక గిన్నెలోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని.. అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. ►అందులో గోధుమ పిండి, తగినంత ఉప్పు, తగినన్నీ నీళ్లు పోసుకుని.. ఉండలు కట్టకుండా దోసెల పిండిలా బాగా కలుపుకోవాలి. ►తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పెనం వేడి చేసుకుని.. కొద్దిగా నూనె వేసుకుని దోసెలు వేసుకోవాలి. ►అభిరుచిని బట్టి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వంటివి దోసె మీద వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ►వేడివేడిగా ఉన్నప్పుడే నచ్చిన చట్నీతో లేదా సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి. చదవండి👉🏾Sorakaya Juice: సొరకాయ జ్యూస్ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే! చదవండి👉🏾Chicken Keema Pakoda: రుచికరమైన చికెన్ కీమా పకోడా ఇలా ఇంట్లోనే ఈజీగా! -
Summer Drinks: పైన్ మ్యాంగో జ్యూస్.. పైనాపిల్లోని మాంగనీస్ వల్ల..
Summer Drinks- Pine Mango Juice: వేసవికాలంలో బయటకు వెళ్లేముందు పైన్ మ్యాంగో జ్యూస్ తాగితే దాహం వేయదు. దీనిలో విటమిన్లు, ఖనిజ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మామిడి పండులోని బీటా కెరోటిన్, విటమిన్ సి, ఐరన్, పొటాషియం రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీనిలోని పోషకాలు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక పైనాపిల్లోని మాంగనీస్, జింక్, బీ 6, సీ విటమిన్ శరీరానికి శక్తిని అందిస్తాయి. జింక్ ఫాస్పరస్, క్యాల్షియం, క్లోరిన్, ఐరన్, విటమిన్ ‘కే’లు కండరాల ఎదుగుదల, రోగనిరోధక వ్యస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఈ సమ్మర్ డ్రింక్ తయారీ విధానం తెలుసుకుందామా! పైన్ మ్యాంగో జ్యూస్ తయారీకి కావలసినవి: ►మామిడిపండు ముక్కలు – రెండు కప్పులు ►పైనాపిల్ ముక్కలు – కప్పు ►పంచదార – రెండు టీస్పూన్లు ►నిమ్మరసం – అరటీస్పూను ►ఐస్ ముక్కలు – అరకప్పు ►పుదీనా తరుగు – టీస్పూను. పైన్ మ్యాంగో జ్యూస్ తయారీ విధానం: ►మామిడి, పైనాపిల్ ముక్కలు, పంచదార, పుదీనా, నిమ్మరసం, ఐస్ ముక్కలు, రెండు కప్పుల నీళ్లను బ్లెండర్లో వేసి గ్రైండ్ చేయాలి. ►మెత్తగా గ్రైండ్ చేసిన జ్యూస్ మిశ్రమాన్ని వెంటనే సర్వ్ చేసుకుంటే చల్లగా ఎంతో రుచిగా ఉంటుంది. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
Hair Care: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల
Hair Care Tips In Telugu: జుట్టు పొడవుగా... ఒత్తుగా పెరగడంలో క్షారం ఉన్న ఆహార పదార్థాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆల్కలైన్ లేదా క్షారం శరీర పీహెచ్ స్థాయులను సమతులంగా ఉంచి జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా చేసి, శరీరానికి పోషకాలను అందిస్తుంది. ఫలితంగా కురులకు పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ ఆహార పదార్థాలు తింటే మేలు ►తెల్లగా ఉన్న బ్రెడ్ కంటే బ్రౌన్బ్రెడ్ను తినాలి. ►తెల్లగా ఉండే పిండి కాకుండా రాగి, జొన్న, సజ్జ, బార్లీ పిండిలను కలిపి రొట్టె చేసుకుని తినాలి. ►దోసకాయ, పాలకూర, బ్రకోలి, కాకరకాయ, బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ కే, ఫోలేట్లు పుష్కలంగా ఉంటాయి. ►తులసి ఆకులు, బెల్లంతో చేసిన టీ, తులసి, పుదీనా, సొరకాయలను కలిపి చేసిన జ్యూస్ కూడా జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. ►వాల్‌నట్స్‌లోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు పెరుగుదలకు దోహద పడుతుంది. ►వాల్నట్స్ తినలేనివారు కనీసం వాల్నట్స్ ఆయిల్‌ను జుట్టుకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. ►బొప్పాయి హెయిర్ మాస్క్ కూడా కేశాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. చదవండి👉🏾Mango Health Benefits: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇందులోని క్వార్సెటిన్ వల్ల.. -
దాహార్తిని ఇట్టే తీర్చే మసాలా ఛాస్.. రుచికి రుచి.. ఇంకా
Summer Drink- Masala Chaas: ఎండాకాలంలో మసాలా చాస్ మంచి రిఫ్రెషింగ్ డ్రింక్‌గా పనిచేస్తుంది. శరీరాన్ని చల్లబరిచి వేడిచేయకుండా చూస్తుంది. కేలరీలు తక్కువగా ఉండి, మంచి రుచితో దాహార్తిని ఇట్టే తీరుస్తుంది. మసాలా చాస్ కావలసిన పదార్థాలు: పెరుగు – కప్పు, పచ్చిమిర్చి – ఒకటి, అల్లం – చిన్నముక్క, పుదీనా ఆకులు – నాలుగు, కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ, నెయ్యి – టీస్పూను, జీలకర్ర – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడినంత. తయారీ: పెరుగుని బ్లెండర్లో వేయాలి. దీనిలోనే పచ్చిమిర్చి, అల్లం, పుదీనా ఆకులను ముక్కలుగా తరిగి వేయాలి తరువాత కొద్దిగా కరివేపాకు, ఇంగువ, సగం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మూడు కప్పులు నీళ్లుపోసి మరోసారి గ్రైండ్ చేయాలి. బాణలిలో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తరువాత జీలకర్ర, రెండు కరివేపాకు రెబ్బలు వేసి దోరగా వేయించి గ్రైండ్ చేసిన మజ్జిగను వేయాలి. దీనిలో రెండు మూడు ఐస్‌ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి: Health Tips: పాలకూర, టీ, చేపలు.. ఇంకా.. వీటితో బ్రెయిన్ పవర్ పెంచుకోవచ్చు! -
Health Tips: ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే..
ఏదైనా మితంగా తినడమే ఉత్తమం. రుచిగా ఉంది కదా అనో, ఇష్టం అనో– పులిహోర ఎక్కువగా తింటే కడుపు బరువుగా ఉన్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు పులిహోర తిన్న వెంటనే – గోరు వెచ్చని నీరు ఒక గ్లాసుడు తాగేస్తే – తొందరగా జీర్ణం అవుతుంది. వేడి కూడ చేయదు. ►ఇక పుదీనారసం ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. ఎండకాలంలో రోజుకో గ్లాసు పుదీనారసం తాగితే శరీర ఉష్ణోగ్రత వాతావరణానికి అనుకూలంగా సమన్వయమవుతుంది. పిల్లలకు పుదీనా రసాన్ని తాగించడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ►పైత్యం, ఆ కారణంగా తలతిప్పటం వంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను మెత్తగా నూరి, ఆ పేస్ట్‌ను నీటిలో కలిపి తాగాలి. ఇలా రెండు రోజుల పాటు రోజుకు రెండుసార్లు చేయాలి. ►పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో యాపిల్ పండు తింటే తలనొప్పి తొందరగా తలెత్తదు. ►ప్రతి రోజూ రెండుసార్లు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. ఏదైనా తిన్న ప్రతీసారీ ఆహారం తాలుకా అవశేషాలు నోట్లో మిగలకుండా మంచి నీటితో పుక్కిలించాలి. ►రోజు ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక్కొక్కటి నాలుగైదు చొప్పున తులసి, వేప ఆకులను, ఐదారు మిరియాలను వేసి మరిగించి తాగాలి. (హై బీపీతో బాధపడుతున్న వాళ్లు మినహాయించాలి). చదవండి: Ugadi 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సర (2022 – 23) రాశిఫలాలు -
హెల్దీ బాత్
ఐదు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయం అందులో వందగ్రాముల తాజా పుదీనా ఆకులు వేసి మెత్తగా పేస్టు చేయాలి. పేస్టు చేయడానికి అవసరమైనంత గోరువెచ్చటి నీటిని వేయవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి ఆరిన తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం నునుపుదనం, మెరుపు సంతరిచుకోవడంతోపాటు చర్మవ్యాధులను దూరం చేస్తుంది. ►స్నానం చేయడానికి పావుగంట ముందుగా మజ్జిగలో దూదిని ముంచి ఒంటికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మసౌందర్యంతో పాటు దేహ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఎండకు వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ►తరచు స్కిన్ ఇన్ఫెక్షన్లు బాధిస్తుంటే ఒక లీటరు నీటిలో వేపాకులను వేసి మరిగించి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ►ఒక బకెట్ నీటిలో మూడు స్పూన్ల తేనె కలుపుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా, నునుపుగా మారుతుంది. ►ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ కాలంలో చెమటతో దుర్వాసన వస్తుంటుంది. స్నానం చేసే నీటిలో ఒక టీ స్పూన్ పన్నీరు కలుపుకుంటే రోజంతా తాజాగా ఉంటుంది. -
తేనెతో ముడతల నివారణ...
బ్యూటిప్స్ టీ స్పూన్ తేనెలో టీ స్పూన్ పాల మీగడ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా 30 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. టేబుల్ స్పూన్ టొమాటో గుజ్జులో టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా అప్లై చేసుకుంటే మేనిఛాయ మెరుగవుతుంది. పుదీనా ఆకులు మెత్తగా పేస్ట్ చేసి దాంట్లో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా 15 రోజులపాటు చేస్తే మంచిఫలితం ఉంటుంది.టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్, టీ స్పూన్ తేనె తగినన్ని పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించి మృదువుగా మర్దన చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. -
కాక్టైల్.. మనసొక మధుకలశం..
మధుకలశం మదికాగా సుధగ్రోలుట తప్పుగాదు సతతము ఇలలో వ్యధ ఎందుకు వైనుతేయ! మధువంతటి మంచి మందు మహిలో గలదే? ‘మనసొక మధుకలశం..’ అన్నాడో సినీకవి. ‘పగిలే వరకే అది నిత్యసుందరం’ అని కూడా ‘సారా’ంశాన్ని చాటి చెప్పాడాయనే! నిజానికి, ఇంతోటి జీవిత సారాంశాన్ని ప్రవచించడానికి కవిపుంగవులే దిగిరానక్కర్లేదు. చేయిజారితే మధుకలశం, కాలుజారితే మనోభాండం పగలడం తథ్యమని ఏ దేవదాసును అడిగినా చెబుతాడు. ‘పగలగానే భళ్లుమనడం గాజు నైజము చూడుము.. పగిలినా అది రగిలినా సడి చేయలేనిది హృదయము’ అని కుమిలిపోయే డోసెరుగని భగ్నజీవులు లోకంలో చాలామందే ఉంటారు. వ్యథార్తులకు ఊరటనిచ్చే దివ్యౌషధం మధువే! సందేహం లేదు. అయితే, ప్రతి ఔషధానికీ తగిన మోతాదు ఉంటుంది. బాధల శీఘ్ర నివారణ కోసం మోతాదు మించితే ఇక అంతే సంగతులు. పరిమితులెరిగిన ‘బుడ్డి’మంతులకు ఈ సంగతి తెలుసు. ఏ వారాంతపు తీరిక వేళల్లోనో వారు ‘సీస’పద్యాలల్లుతారు. వారికిది ఫుర్సత్కా మామ్లా. వారందరి కోసం ఈవారం.. ‘మధు’రోక్తి విస్కీతో కలిపి తాగితే ధైర్యమే మంచి విటమిన్ -జారోడ్ కింజ్, అమెరికన్ రచయిత మిస్టిక్ మ్యూజిక్ షాంపేన్ : 120 మి.లీ. ఐరిష్ విస్కీ : 30 మి.లీ. యాపిల్ జ్యూస్ : 100 మి.లీ గార్నిష్ : పుదీనా ఆకులు, పలచని యాపిల్ ముక్కలు - వైన్‌తేయుడు