Summer Drinks- Pine Mango Juice: వేసవికాలంలో బయటకు వెళ్లేముందు పైన్ మ్యాంగో జ్యూస్ తాగితే దాహం వేయదు. దీనిలో విటమిన్లు, ఖనిజ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మామిడి పండులోని బీటా కెరోటిన్, విటమిన్ సి, ఐరన్, పొటాషియం రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీనిలోని పోషకాలు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇక పైనాపిల్‌లోని మాంగనీస్, జింక్, బీ 6, సీ విటమిన్ శరీరానికి శక్తిని అందిస్తాయి. జింక్ ఫాస్పరస్, క్యాల్షియం, క్లోరిన్, ఐరన్, విటమిన్ ‘కే’లు కండరాల ఎదుగుదల, రోగనిరోధక వ్యస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఈ సమ్మర్ డ్రింక్ తయారీ విధానం తెలుసుకుందామా!
పైన్ మ్యాంగో జ్యూస్ తయారీకి కావలసినవి:
►మామిడిపండు ముక్కలు – రెండు కప్పులు
►పైనాపిల్ ముక్కలు – కప్పు
►పంచదార – రెండు టీస్పూన్లు
►నిమ్మరసం – అరటీస్పూను
►ఐస్ ముక్కలు – అరకప్పు
►పుదీనా తరుగు – టీస్పూను.
పైన్ మ్యాంగో జ్యూస్ తయారీ విధానం:
►మామిడి, పైనాపిల్ ముక్కలు, పంచదార, పుదీనా, నిమ్మరసం, ఐస్ ముక్కలు, రెండు కప్పుల నీళ్లను బ్లెండర్‌లో వేసి గ్రైండ్ చేయాలి.
►మెత్తగా గ్రైండ్ చేసిన జ్యూస్ మిశ్రమాన్ని వెంటనే సర్వ్ చేసుకుంటే చల్లగా ఎంతో రుచిగా ఉంటుంది.
చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి..
Comments
Please login to add a commentAdd a comment