Pineapple
-
పైనాపిల్ : ఆ సమస్యలుంటే తినకపోవడమే మేలు!
ప్రస్తుతం చాలామంది ఆరోగ్య స్ప్రుహతో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటున్నారు. వాటిలో పైనాపిల్ కూడా ఒకటి. అయితే పైనాపిల్ పండులో విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాపర్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు.అయితే ఈ పైనాపిల్ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పండులో ఉండే తీపి, పిలుపు రుచి కారణంగా చాలామంది తినేందుకు ఇష్టపడతుంటారు. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. ఈ పైనాపిల్‌లో ఉన్న బ్రోమోలైన్ ఎంజైమ్ జీర్ణ క్రియను మెరుగ్గా ఉంచుతుందిఇన్ని ప్రయోజనాలు ఉన్నా..దీనిలో సహజ చక్కెరలు, కేలరీలు అధికం. అలాగే ఈ పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందువల్ల వాళ్లు ఈ పండు తీసుకోకపోవడమే మంచిది. అలాగే కడుపులో అల్సర్, అసిడిటీ సమస్య ఉన్నవారికి ఇది మరింత సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి సమయంలో పైనాపిల్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అలాగే కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు విటమిన్స్ సీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ తినాలనుకున్నా ఈ పండుని మితంగా తీసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. (చదవండి: సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..) -
పైనాపిల్ మంచిదని తినేస్తున్నారా?
పైనాపిల్ అంటే అందరూ ఇష్టంగా తినరు. ఎందుకంటే అది తినంగానే నోటిలో ఏదో దురదగా అనిపిస్తుంది. కాస్త పులుపు, తీపి కలయికతో కూడిన ఒక విధమైన రుచితో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి మూడు దేశాలు ప్రముఖంగా ఈ పండుని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని సలాడ్లు, కాక్ టెయిల్ లేదా డిజార్ట్ల రూపంలో చాలామంది తీసుకంటుంటారు. అయితే ఈ పండుని తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధులకు చెక్‌పెట్టడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అలానే అతిగా తింటే అంతే స్థాయిలో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. పైనాపిల్ తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమయ్యింది. ఇది అందించే ప్రయోజనాలను చూసి నిపుణులే ఆశ్చర్యపోయారు. పైగా బరువువ తగ్గాలనే వారికి ఈ పండు గొప్ప వరమని చెబుతున్నారు. అదేసయంలో దీన్ని అధికంగా తీసుకుంటే జరిగే పరిణామాలను కూడా సవివరంగా వెల్లడించారు. అవేంటంటే..? కలిగే ప్రయోజనాలు.. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను ప్రభావితం చేసే ప్రత్యేక పోషకం బ్రోమెలైన్ ఉంది. ఇది కొలెస్ట్రాల్ ఫలకాలను విచ్ఛిన్నం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీని కాండంలో ఉండే ప్రోటీన్ జీర్ణ ఎంజైమ్‌ని ప్రోత్సహించి చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ప్రతిరోజూ పైనాపిల్ తింటే హైపర్ కొలెస్టెరోలేమియా స్థాయిలు, లిపోప్రోటీన్(ఎల్డీఎల్) వంటి చెడుకొలస్ట్రాల్లకు చెక్ పెడుతుంది. రోజు దీని ఆహారంగా తీసుకునేవారికి బరువు అదుపులో ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇందులో ఉండే ఫైబర్, పోటాషియం, విటమిన్ సీ కంటెంట్లు గుండె ఆరోగ్యానికి మంచివి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. విటమిన్ సీ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కేన్సర్, ఆర్థరైటిస్, గుండె జబ్బుల వంటి వ్యాధుల బారిన పడకుండా నియంత్రిస్తుంది. అతిగా తీసుకుంటే తలెత్తే పరిణామాలు.. వికారం, విరేచలు లేదా గుండెల్లో మంట వంటి వాటికి దారితీస్తుంది ఇందులో ఉండే బ్రోమెలైన్ అధిక రక్తస్రావం లేదా చర్మంపై దద్దుర్లు వచ్చే అవకావం ఉంది. అలాగే రక్తం గడ్డకట్టాన్ని ప్రభావితం చేస్తుంది. పైనాపిల్ జ్యూస్‌గా తీసుకునేవారు పోటాషియం స్థాయిల విషయంలో జాగురకతతో ఉండాలి. ఎందుకంటే ఇది మూత్ర పిండాల సమస్య ఉన్నవారికి మరింత సమస్యత్మకంగా మారిపోతుంది. అదనంగా ఉండే పోటాషియంను బయటకు పంపడంలో మూత్రపిండాలు విఫలమై లేనిపోని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అలెర్జీ దద్దర్లు, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, ముఖం, నాలుకు, గొంతు నొప్పి, పెదవుల వాపు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది తదితర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంత మంచిది మితంగా తీసుకోకపోతే అంత ప్రమాదం. అందువల్ల వాటిని మీ రోజూవారి ఆహారంలో ఎంతమేర తినడం బెటర్ అనేది న్యూట్రిషియన్లు లేదా వైద్యులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం ఇవ్వడం జరిగింది. మీ ఆహారంలో భాగం చేసుకోవాలనుకుంటే మాత్రం నిపుణులు లేదా ప్రముఖ డైటీషియన్లను సంప్రదించి తీసుకోవడం మంచిది. (చదవండి: అట్లాంటిక్ డైట్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
Health Tips: షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు అస్సలు మంచివి కావు! వీటిని తింటే..
సాధారణంగా పండ్లు ఎవరికైనా మంచిదే. ఎందుకంటే పండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నోరకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సలహానిస్తుంటారు. కానీ మధుమేహుల ఆరోగ్యానికి కొన్నిరకాల పండ్లు బొత్తిగా మంచివి కావు. ముఖ్యంగా చక్కెర శాతం ఎక్కువగా ఉండేవి. వీటికి దూరంగా ఉండండి! ఈ పండ్లు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. పైనాపిల్, సీతాఫలం, అరటి, సపోటా, మామిడి పండ్లలో అధికమొత్తంలో చక్కెర ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. ఇవి దోరగా ఉన్నపుడు తినొచ్చు! జామ, బొప్పాయి, అరటి వంటి వాటిని బాగా పండినవాటికంటే దోరగా ఉన్నవి మంచిది. ఇవి ఎలా తిన్నా ఓకే! నేరేడు పళ్లు, కివీ పండ్లు ఎలా తిన్నా చెరుపు చేయవు. అయితే తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. అలాగే క్యారట్, బీట్రూట్లలోనూ, ఇతర దుంప కూరలలోనూ బీట్రూట్తో పోల్చితే మధుమేహులకు క్యారట్లే మంచిదని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? -
Health: పైనాపిల్ కీరా జ్యూస్ తాగుతున్నారా.. దీనిలోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల!
Summer Drinks- Pineapple Keera Juice: పైనాపిల్, కీరా ముక్కల్లో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండు చర్మాన్ని పొడిబారనియకుండా కాపాడతాయి. విటమిన్ సి ప్రోటిన్‌తో కలిసి ముఖం మీద ముడతలు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సెబేసియస్ గ్రంథుల పనితీరు మెరుగుపడి, చర్మం తేమగా ఉంటుంది. వీటిని కలిపి తయారు చేసిన జ్యూస్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీఇన్ఫ్లమేటరి విధులను నిర్వహిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది. తరచూ ఈ డ్రింక్ తాగడం వల్ల క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియంలు ఉండడం వల్ల రక్త పీడనం నియంత్రణలో ఉంటుంది. పైనాపిల్ కీరా జ్యూస్ తయారీకి కావలసినవి: ►పైనాపిల్ ముక్కలు – ఒకటింబావు కప్పులు ►కీర దోసకాయ ముక్కలు – కప్పు ►యాపిల్ ముక్కలు – అరకప్పు ►తేనె – రెండు టేబుల్ స్పూన్లు ►నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు ►ఐస్ క్యూబ్స్ – ఎనిమిది. పైనాపిల్ కీరా జ్యూస్ తయారీ: ►కీరా, యాపిల్ ముక్కలను తొక్కతీయకుండా తీసుకోవాలి. ►పైనాపిల్, కీరా, యాపిల్ ముక్కలను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ మెత్తగా అయ్యాక జ్యూస్‌ను గ్లాసులో వడగట్టుకోవాలి. ►వడగట్టిన జ్యూస్‌లో నిమ్మరసం, తేనె వేసి కలపాలి. ∙ ►చివరిగా ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: యాపిల్, నేరేడు.. జ్యూస్ కలిపి తాగితే.. కలిగే లాభాలివే! -
Video: ఆరోగ్య లాభాలనిచ్చే పైనాపిల్.. తొక్క ఇలా ఈజీగా తీసేయండి!
పైనాపిల్.. ముఖ్యంగా జ్యూస్‌ను చాలా మంది ఇష్టపడతారు. రుచితో పాటు ఈ పండు కలిగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలే ఇందుకు కారణం. పైనాపిల్‌లో విటమిన్ బీ, సీతో పాటు పీచు పదార్థం పుష్కలం. శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు కూడా అందిస్తుంది. ఆహారం జీర్ణమవడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు బరువును తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి కాబట్టే స్మూతీలు, జ్యూస్, ఫ్రూట్సలాడ్.. ఇలా వివిధ రూపాల్లో పైనాపిల్ తీసుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంది కానీ.. ముళ్లు ముళ్లుగా ఉండే దీని తొక్క తీయాలంటేనే కాస్త కష్టం. అయితే, దీని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదని, సులభ పద్ధతిలో పైనాపిల్ తొక్క తీసే విధానాన్ని చూపిస్తానంటున్నారు సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీరు కూడా ఈజీగా పైనాపిల్ తొక్క ఒలిచేయండి! View this post on Instagram A post shared by Kunal Kapur (@chefkunal) చదవండి👇 Healthy Heart Tips: ఈ ఆహార పదార్థాలు తినడం అలవాటా.. అయితే ప్రమాదం పొంచిఉన్నట్లే! Healthy Heart Diet: 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! -
పైనాపిల్ – బత్తాయి.. పోషకాల జ్యూస్!
కావలసినవి: బత్తాయిలు – మూడు, పైనాపిల్ ముక్కలు – కప్పు, పంచదార – టేబుల్ స్పూను, ఐస్‌క్యూబ్స్ – ఐదు. తయారీ విధానం: ►బత్తాయిలను రెండు ముక్కలుగా కట్ చేసి జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ►పైనాపిల్ ముక్కలు, పంచదారను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ► పైనాపిల్ ముక్కలు గ్రైండ్ అయ్యాక బత్తాయి జ్యూస్‌ను వేసి మరోసారి గ్రైండ్ చేసి వడగట్టాలి. ► వడగట్టిన జ్యూస్‌ను గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. పైనాపిల్-బత్తాయి జ్యూస్ పోషకాల విలువలు.. ►పైనాపిల్, బత్తాయిలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ►పుల్లగా, తియ్యగా ఉండే ఈ జ్యూస్ దాహం తీరుస్తుంది. ► జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేయడమేగాక, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ► డీటాక్సింగ్ ఏజెంట్‌గా పనిచేసి ఒత్తిడి, కాలుష్య ప్రభావాలను తగ్గిస్తుంది. ►వర్క్అవుట్లు చేసేవారికి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. ►దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను రానివ్వవు. ►చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ► జుట్టుకి పోషకాలనందించి వెంట్రుకలు చిట్లకుండా చేస్తుంది. -
Summer Drinks: పైన్ మ్యాంగో జ్యూస్.. పైనాపిల్లోని మాంగనీస్ వల్ల..
Summer Drinks- Pine Mango Juice: వేసవికాలంలో బయటకు వెళ్లేముందు పైన్ మ్యాంగో జ్యూస్ తాగితే దాహం వేయదు. దీనిలో విటమిన్లు, ఖనిజ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మామిడి పండులోని బీటా కెరోటిన్, విటమిన్ సి, ఐరన్, పొటాషియం రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీనిలోని పోషకాలు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక పైనాపిల్లోని మాంగనీస్, జింక్, బీ 6, సీ విటమిన్ శరీరానికి శక్తిని అందిస్తాయి. జింక్ ఫాస్పరస్, క్యాల్షియం, క్లోరిన్, ఐరన్, విటమిన్ ‘కే’లు కండరాల ఎదుగుదల, రోగనిరోధక వ్యస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఈ సమ్మర్ డ్రింక్ తయారీ విధానం తెలుసుకుందామా! పైన్ మ్యాంగో జ్యూస్ తయారీకి కావలసినవి: ►మామిడిపండు ముక్కలు – రెండు కప్పులు ►పైనాపిల్ ముక్కలు – కప్పు ►పంచదార – రెండు టీస్పూన్లు ►నిమ్మరసం – అరటీస్పూను ►ఐస్ ముక్కలు – అరకప్పు ►పుదీనా తరుగు – టీస్పూను. పైన్ మ్యాంగో జ్యూస్ తయారీ విధానం: ►మామిడి, పైనాపిల్ ముక్కలు, పంచదార, పుదీనా, నిమ్మరసం, ఐస్ ముక్కలు, రెండు కప్పుల నీళ్లను బ్లెండర్లో వేసి గ్రైండ్ చేయాలి. ►మెత్తగా గ్రైండ్ చేసిన జ్యూస్ మిశ్రమాన్ని వెంటనే సర్వ్ చేసుకుంటే చల్లగా ఎంతో రుచిగా ఉంటుంది. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
పైనాపిల్ కేక్ ఇంట్లోనే ఇలా ఎంచక్కా తయారు చేసుకోండి!
పైనా‘పిల్’ను తింటే వేరుగా ఏ ‘పిల్’ తీసుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది చమత్కరిస్తూ ఉంటారు. దీనిని ఆరోగ్యాల ఆవాస కేంద్రం అని కూడా చెబుతుంటారు. పైనాపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అయితే, ఎప్పుడూ రొటీన్‌గా పైనాపిల్ ముక్కలు తినడం, జ్యూస్ తాగడం వంటివి కాకుండా ఇలా ఎంచక్కా కేక్ చేసుకుని తినండి! పైనాపిల్ కేక్ కావలసినవి: బ్రౌన్ సుగర్ పౌడర్ – 150 గ్రాములు అన్ సాల్టెడ్ బటర్ – 175 గ్రాములు, పైనాపిల్ స్లైస్, చెర్రీస్ – 20 చొప్పున మైదాపిండి – ఒకటిన్నర కప్పులు, బేకింగ్ పౌడర్ – ఒకటిన్నర టీ స్పూన్లు ఉప్పు – పావు టీ స్పూన్, పంచదార పొడి – అర కప్పు, గుడ్లు – 2 వెనీలా ఎక్స్ట్రాక్ట్ – 1 టీ స్పూన్, సోర్ క్రీమ్, పాలు, పైనాపిల్ జ్యూస్ – పావు కప్పు చొప్పున తయారీ: ముందుగా ఒక బౌల్లో 60 గ్రాముల కరిగించిన బటర్ వేసుకుని.. అందులో 100 గ్రాముల బ్రౌన్ సుగర్ పౌడర్ వేసుకుని బాగా కలిపాలి. ఆ మిశ్రమాన్ని గుండ్రటి షేప్‌లో ఉండే కేక్ బౌల్లో అర అంగుళం మందంలో విస్తరించాలి. దానిపైన గుండ్రటి పైనాపిల్ స్లైస్, చెర్రీతో డెకరేట్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం పెద్ద బౌల్ తీసుకుని మైదాపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి. ఈలోపు మరో బౌల్లో మిగిలిన బటర్, బ్రౌన్ సుగర్, పంచదార పొడి వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో క్రీమ్‌లా చేసుకోవాలి. అందులో గుడ్లు పగలగొట్టి వేసుకుని మరింత మెత్తటి క్రీమ్‌లా చేసుకోవాలి. మధ్యమధ్యలో మైదా–బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకుంటూ.. సోర్ క్రీమ్, పాలు, పైనాపిల్ జ్యూస్ కొద్దికొద్దిగా వేసుకుంటూ హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రిజ్‌లో పెట్టుకున్న కేక్ మేకర్ బౌల్ తీసుకుని దాని నిండుగా ఈ మిశ్రమాన్ని వేసుకుని సమాంతరంగా చేసుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత నచ్చిన విధంగా కలర్‌పుల్ క్రీమ్స్‌తో డెకరేట్ చేసుకోవచ్చు. -
‘బాబోయ్ మందు’.. పైనాపిల్ బీర్‌కు ఫుల్గిరాకీ
‘హమ్ మందు నహీతో బతుకు నయ్ సక్తాహై’.. లాక్డౌన్ టైంలో చాలామంది మందు బాబులు వెల్లడించిన అభిప్రాయం ఇదే. అంతెందుకు ఫస్ట్ వేవ్ టైంలో మందు దొరక్క.. శానిటైజర్లు, ఇంట్లోనే మందు ప్రయోగాలతో ఘోరంగా దెబ్బతిన్నవాళ్లూ లేకపోలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో మందు బాబులకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో ఇంట్లోనే బీర్లు తయారు చేసుకుంటున్నారు. దీంతో పైనాపిల్ ధరలకు రెక్కలొచ్చాయి. సౌతాఫ్రికాలో లాక్డౌన్ 4 లెవల్లో భాగంగా 14 రోజులపాటు లిక్కర్ షాపులు మూతపడ్డాయి. దీంతో పైనాపిల్ పండ్ల ద్వారా ఇంట్లోనే బీర్లు తయారు చేసుకుంటున్నారు మందుబాబులు. ఈ ప్రభావంతో పైనాపిల్ పండ్ల ధరలు 74 శాతం పెరిగాయి. లాక్డౌన్-మందు దొరకని పరిస్థితుల నేపథ్యంలోనే పైనాపిల్‌కు ఒక్కసారిగా డిమాండ్ సౌతాఫ్రికా అగ్రిమార్క్ ట్రెండ్స్(ఏఎంటీ) గురువారం వెల్లడించింది. అయితే జూన్ చివరి వారం నుంచే లిక్కర్‌పై ఆంక్షలను అమలు చేస్తోంది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. దీంతో అప్పటి నుంచే పైనాపిల్ ధరలు స్వల్ఫంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా 14 రోజుల నిషేధం నేపథ్యంలో.. ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. ఒకవేళ లాక్డౌన్ కొనసాగితే మాత్రం పైనాపిల్ ధరలు ఊహించని రేంజ్‌కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. -
పైనాపిల్ పండ్ల కింద గంజాయి బస్తాలు
మంగళగిరి: పైనాపిల్ పండ్ల మాటున లారీలో భారీగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం రాత్రి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కాజ టోల్గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ వి.భూషణం సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో పైనాపిల్ పండ్ల కింద గంజాయి బస్తాలను దాచి తరలిస్తున్న లారీ పట్టుబడిందన్నారు. మొత్తం 23 బస్తాల్లోని 1,020 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, లారీ డ్రైవర్ వంగలపూడి శ్రీనివాసరావును, ఎత్తుల నూకరాజు అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. విచారణలో వీరిద్దరూ తమకు గంజాయి విక్రయించేవారితో కానీ, కొనుగోలు చేసే వారితో కానీ సంబంధం లేదని వెల్లడించారని, పూర్తిస్థాయిలో విచారణ చేసి సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు శ్రీనివాస్‌రెడ్డి, ఏడుకొండలు, విజయ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
Lockdown: కష్టాలు.. ట్రక్ డ్రైవర్‌గా మారిన నటి
షూటింగ్‌లు కలిసి రాలేదు. లాక్డౌన్లో పని లేదు. కార్తీకకు యాక్టింగ్‌తో పాటు డ్రైవింగ్ వచ్చు. ఉన్న డబ్బుతో ఒక ట్రక్ కొనింది. కూరగాయలు, పండ్లు తిప్పే బండ్లకు లాక్డౌన్ నియమాలు వర్తించవు. ఇక కార్తీక ఫుల్ బిజీ అయ్యింది. పైనాపిల్స్ చీప్‌గా దొరికే చోటు నుంచి రేటు పలికే చోటుకు, కొబ్బరిబోండాలు సలీసుగా దొరికే చోటు నుంచి పిరిమిగా ఉండే చోటుకు సరఫరా చేస్తూ స్టార్ డ్రైవర్‌గా నవ్వులు చిందిస్తోంది. ఒక కేరళ నటి స్ఫూర్తి ఇది. అర్ధరాత్రి. కేరళలోని మలప్పురం చెక్‌పోస్ట్ దగ్గర అటుగా వచ్చిన ట్రక్‌ను పోలీసులు ఆపారు. ‘బండిలో ఏముంది?’ డ్రైవర్‌ను అడిగారు. ‘పైనాపిల్స్’ అనే సమాధానం వినిపించింది. పోలీసులు ఆశ్చర్యపోయారు. కారణం డ్రైవింగ్ సీట్లో ఉన్నది మహిళా డ్రైవర్. జీన్స్ ప్యాంట్, షర్ట్ వేసుకుని, పైన ఖాకీ షర్ట్ వేసుకుని, టోపీ పెట్టుకుని ఉంది. ‘ఏమైంది సార్. పండ్ల బండ్లకు ప్రాబ్లం లేదు కదా. తొందరగా వదలండి. నాకు ఆలస్యమైపోతోంది’ అందా డ్రైవర్. పోలీసులు లోడ్ చెక్ చేశాక చిరునవ్వుతో ఆ బండిని వదిలారు. చిరునవ్వుతో డ్రైవర్ కూడా కదిలింది. ఆ డ్రైవర్ పేరు కార్తీక. మలయాళంలో చిన్నపాటి నటి. ∙∙ ‘చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. దాంతో పాటు డ్రైవింగ్ కూడా. రెండూ నేర్చుకున్నాను. పెద్ద లారీలు కూడా నడుపుతాను. కొన్ని సినిమాలలో యాక్ట్ చేశాను. కాని నాకంటూ గుర్తింపు రాలేదు. నా భర్త గల్ఫ్‌లో పని చేస్తాడు. నాకు 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఈ లాక్డౌన్లో ఏ పనీ లేకుండా ఉండటం సరి కాదనుకున్నాను. వెంటనే ఒక ట్రక్ కొన్నాను. నిజానికి లారీ కొందామనుకున్నాను. అంత డబ్బు లేదు. ట్రక్‌తో మొదలెట్టాను’ అంటుంది కార్తీక. కేరళలో కన్నూరుకు చెందిన కార్తీక బతుకు దేవులాటలో అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలోని వాజక్కులంకు షిఫ్ట్ అయ్యింది. ‘ఇక్కడ పైనాపిల్స్ చీప్. కన్నూరులో కాస్ట్లీ. ఒక వెయ్యి కిలోల పైనాపిల్స్ తీసుకుని ఐదారుగంటలు ప్రయాణించి కన్నూరుకు తీసుకెళ్లాను. లాభం వచ్చింది. అలాగే వాజక్కులం నుంచి కొబ్బరిబోండాలు కొని ఎర్నాకులంకు సరఫరా చేస్తుంటాను. నేను కిరాయికి వెళతాను. అలాగే స్వయంగా సరుకు తీసుకెళ్లి అమ్ముతాను. బాగుంది ఇప్పుడు’ అంటుంది కార్తీక. ఖాకీ షర్ట్ ధరించి, తల మీద టోపీ పెట్టుకుని ట్రక్ నడిపే కార్తీకను పెద్దగా ఎవరూ గమనించరు. షాపుల వాళ్లు గమనించినా గౌరవం ఇస్తున్నారు. అర్ధరాత్రిళ్లు, అపరాత్రుళ్లు కూడా ఆమె నిర్భయంగా హైవే మీద దూసుకెళుతూ ఉంటుంది. బతుకు స్పీడ్‌బ్రేకర్ వేసినప్పుడు కూడా జీవితం స్టీరింగ్‌ను ఎలా ఒడిసి పట్టాలో కార్తీక ఇలా మనకు చెబుతోంది. -
బాయ్‌ఫ్రెండ్ కోసం వంట చేసిన శ్రుతీహాసన్.. పాపం
గత కొద్ది రోజులుగా హీరోయిన్ శ్రుతీ హాసన్, డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటికి తగ్గట్టుగానే శ్రుతీ, శంతనుతో కలిసి డేట్‌కు వెళ్లడం.. సోషల్ మీడియాలో ఒకరి గురించి ఒకరు పోస్టులు పెడుతూ.. తమ లవ్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రపంచానికి వెల్లడించడం వంటివి చేస్నుత్నారు. ఈ క్రమంలో తాజాగా శ్రుతీ హాసన్ బాయ్‌ఫ్రెండ్ కోసం స్వయంగా వంట చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక బాయ్‌ఫ్రెండ్ కోసం శ్రుతి హాసన్ పైనాపిల్‌తో ఓ ప్రత్యేక వంటకాన్ని తయారు చేయాలని భావించింది. కానీ వంట చేసే సమయంలో ఏమరపాటుగా ఉండటంతో అవి కాస్త మాడిపోయాయి. ఇక శ్రుతీ చేసిన వంట చూసి ఆమె బాయ్‌ఫ్రెండ్ ‘‘ఇది వెస్టెడ్ పైనాపిలా లేక రోస్టెడ్ పైనాపిలా’’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. శంతను హజారికా గువహతికి చెందిన వ్యక్తి. అతను రాపర్, ఇలస్ట్రేటర్, డూడుల్ ఆర్టిస్ట్. త్వరలో విడుదల కానున్న మ్యూజిక్ వీడియో కోసం శ్రుతి హాసన్‌తో కలిసి పని చేసినట్లు ఇటీవల ఇంటర్వ్యూలో శంతను వెల్లడించాడు. అంతేకాక కొద్ది రోజుల క్రితం శ్రుతి హాసన్, శంతను హజారికా చెన్నైని సందర్శించారు. అక్కడ ఆమె స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారు. ఈ జంట శ్రుతి తండ్రి కమల్ హాసన్‌ను కూడా అతని ఇంట్లో కలుసుకున్నారు. చదవండి: మళ్లీ ప్రేమలో శృతి.. అతడే బాయ్‌ఫ్రెండ్! -
ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబ్
కొచ్చీ: మనుషుల్లోని క్రూరత్వానికి అద్దం పట్టే సంఘటన కేరళలో జరిగింది. టపాకాయల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్‌ను తినిపించడంతో గర్భంతో ఉన్న ఓ ఏనుగు మృతి చెందింది. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కులోని వెల్లియార్ నది వద్ద మే 27వ తేదీన జరిగిన ఈ దారుణం పట్ల తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని దుండగుడు ఇచ్చిన పైనాపిల్ ఏనుగు గొంతులో పేలిపోయింది. అడవుల్లో ఏనుగులను వేటాడే ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని మోహన్ కృష్ణన్ అనే అటవీ అధికారి వెలుగులోకి తీసుకొచ్చారు. గర్భిణి ఏనుగు మరణించిన తీరును, ఫొటోలను ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ఏనుగు తల నీటిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. మూగ జీవాన్ని రాక్షసంగా చంపేసిన దుండగుడిని గుర్తించి, అదుపులోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. -
పనస విత్తనాల పొడితో చాక్లెట్ వాసనలు
మనం పనస తొనలు తింటాం. పిక్కలు పారబోస్తాం! చిత్రమైన విషయమేమిటంటే.. ఈ పనస పిక్కలు చాలా బలవర్ధకమైనవి. బ్రెజిల్ శాస్త్రవేత్తలు తాజాగా ఏం చెబుతున్నారంటే... పనస పిక్కల పొడితో చాక్లెట్ రంగానికి ఎంతో మేలు జరుగుతుందీ అని! అదెలా అని ఆశ్చర్యపోవద్దు. చాక్లెట్ తయారీకి కోకా కాయల అవసరముంటుందని మీకు తెలుసు కదా.. డిమాండ్ పెరిగిపోతున్న కొద్దీ ఈ కోకా గింజల ధరలు పెరిగిపోతున్నాయని ఫెర్నాండా పాపా స్పాడ అనే శాస్త్రవేత్త తెలిపారు. 50 నుంచి 75 శాతం పనస గింజల పొడి.. పాలు, కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీ వాసన, రుచిలో మామూలు కాఫీకి ఏమాత్రం తీసిపోదని ఆయన చెప్పారు. సాధారణంగా ఈ రకమైన కాఫీకి కోకా గింజలను వాడుతూంటారు. అంతర్జాతీయ కోకా సంస్థ లెక్కల ప్రకారం గత ఏడాది దాదాపు 456 కోట్ల టన్నుల కోకా గింజలను వాడుకున్నారు. డిమాండ్ కూడా ఏటికేడాదీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కోకా గింజలకు ప్రత్యామ్నాయాలను గుర్తించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా పనస గింజలను వేయించి పొడి చేస్తే అది కోకా గింజల మాదిరిగానే పనిచేస్తాయని గుర్తించడం విశేషం. -
మీఠా బంధన్
ఇదిగోండి బుజ్జి బుజ్జి మిఠాయిలు. కొరకక్కర్లేదు. నాలుక మీద పెడితే చాలు... అయినా ఈ రోజుల్లో మిఠాయి పెద్దదైతే ముఖాలు చిన్నవవుతున్నాయి... కేలరీలు గట్రా ఎక్కువని!అందుకే ఈ రాఖీకి చిన్న చిట్టి చిన్నారి చ్వీట్లు చిన్నారి జిలేబి కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; సెనగ పిండి – ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూను; బేకింగ్ సోడా – చిటికెడు; పుల్ల పెరుగు – 3 టేబుల్ స్పూన్లు; మిఠాయి రంగు – చిటికెడు (నీళ్లలో కలిపి కరిగించాలి); నీళ్లు – అర కప్పు + 3 టేబుల్ స్పూన్లు; నూనె లేదా నెయ్యి – డీప్ ఫ్రైకి సరిపడా పాకం కోసం: పంచదార – ఒక కప్పు; నీళ్లు – అర కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; నిమ్మ రసం – అర టీ స్పూను. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, సెనగ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ∙ఏలకుల పొడి, పుల్ల పెరుగు జత చేసి మరోమారు కలపాలి ∙మిఠాయి రంగు కలిపిన నీళ్లు జత చేసి మూత పెట్టాలి ∙(పిండి మరీ పల్చగా ఉండకూడదు. అవసరాన్ని బట్టి మాత్రమే నీళ్లు కలుపుకోవాలి) ∙మిశ్రమాన్ని ఒక రోజు నాననివ్వాలి ∙మరుసటి రోజు మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలిపి, అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో పంచదార, నీళ్లు వేసి ఉడికించాలి ∙తీగ పాకం వచ్చిన తరవాత ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, నిమ్మ రసం వేసి కలిపి దింపేయాలి ∙జిలేబి మిశ్రమాన్ని జిలేబి వేసే సీసాలో పోసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక జిలేబి సీసాలోని మిశ్రమాన్ని నూనెలో జిలేబి ఆకారం వచ్చేలా తిప్పుకోవాలి ∙రెండువైపులా దోరగా వేయించిన తరవాత పంచదార పాకంలో వేసి సుమారు రెండు గంటల తరవాత ప్లేటులో అందించాలి. చమ్ చమ్ ఇన్ డాలర్ కావలసినవి: పాలు – ఒక లీటరు; నిమ్మ రసం – 2 టేబుల్‌స్పూన్లు; పంచదార – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – 4 కప్పులు; ఏలకుల పొడి – పావు టీ స్పూను. స్టఫింగ్ కోసం: పచ్చి కోవా – పావు కప్పు (సన్నగా తురమాలి); పంచదార పొడి – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు రేకలు – 5 (పావు టీ స్పూను పాలలో నానబెట్టాలి); ఏలకుల పొడి – చిటికెడు; పిస్తాచూ తరుగు – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి మంట బాగా తగ్గించి నిమ్మ రసం వేస్తూ కలపాలి ∙పాలు విరిగి నీళ్లు, పాల ముద్ద విడివడతాయి ∙స్టౌ మీద నుంచి దింపేసి, చల్లారాక పల్చటి వస్త్రంలో వేసి, నీరు పూర్తిగా పిండేసి, ఆ వస్త్రానిన గట్టిగా మూట కట్టి, సుమారు గంట సేపు మూట మీద బరువు ఉంచాలి ∙ఇలా చేయడం వల్ల నీరు పూర్తిగా పోతుంది ∙నీరు పోయిన తరవాత ఆ ముద్దను ఒక ప్లేటులోకి తీసుకుని, చేతితో పొడిపొడిగా విడదీయాలి ∙పాల విరుగును చేతితో బాగా కలుపుతూ ముద్ద చేయాలి ∙కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని మనకు కావలసిన ఆకారంలో గుండ్రంగా లేదా పొడవుగా ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙వెడల్పాటి పాత్రలో ఒకటిన్నర కప్పుల పంచదార, నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, సన్న మంట మీద కొద్దిగా మరిగించాలి ∙తయారుచేసి ఉంచుకున్న ఉండలను ఒక్కొక్కటిగా పాకంలో వేసి మూత పెట్టాలి ∙సుమారు పది నిమిషాల తరవాత మూత తీసి చమ్చమ్లను చెక్క స్పూనుతో వెనక్కు తిప్పి మూత పెట్టాలి ∙మరో పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙పావు టీ స్పూను ఏలకుల పొడి జత చేసి చల్లారనివ్వాలి ∙కుంకుమ పువ్వుతో అలంకరించాలి. స్టఫింగ్ తయారీ: ∙ఒక పాత్రలో పావు కప్పు పచ్చి కోవా, టీ స్పూను పంచదార పొడి, చిటికెడు ఏలకుల పొడి, పాలలో కలిపిన కుంకుమ పువ్వు వేసి ఒక స్పూనుతో బాగా కలపాలి చమ్చమ్లలో అదనంగా ఉన్న పంచదార పాకాన్ని తీసేయాలి ∙ఒక్కో చమ్చమ్ను చేతిలోకి తీసుకుని చాకుతో మధ్యకి కట్ చేయాలి ∙ఒక టీ స్పూను స్టఫింగ్ మిశ్రమాన్ని అందులో ఉంచి, కొబ్బరి తురుమును పైన చల్లాలి పిస్తాచూ తరుగును సిద్ధంగా ఉన్న చమ్చమ్ల పైన చల్లి, చేతితో మృదువుగా అదమాలి ∙కావాలనుకుంటే నీళ్లలో కలిపిన కుంకుమపువ్వుతో గార్నిష్ చేసుకోవచ్చు. పైనాపిల్ బర్ఫీ కావలసినవి: పైనాపిల్ స్లయిసులు – 4; పాలు – ఒక లీటరు; నెయ్యి – కొద్దిగా; పెరుగు – అర టీ స్పూను; పంచదార – ఒక కప్పు; నిమ్మ ఉప్పు – రెండు చిటికెలు; పైనాపిల్ ఎసెన్స్ – నాలుగు చుక్కలు. తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో పాలు పోసి, స్టౌ మీద ఉంచి వేడి చేసి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక అందులో పెరుగు వేయాలి ∙ఈ మిశ్రమాన్ని స్టౌ మీద ఉంచి చిక్కపడేవరకు ఆపకుండా కలుపుతుండాలి ∙మిశ్రమం సగానికి తగ్గిన తరవాత పంచదార జత చేయాలి నిమ్మ ఉప్పు కూడా వేసి బాగా కలపాలి మిశ్రమం బాగా గట్టిపడేవరకు ఉడికించాలి ∙పైనాపిల్ ఎసెన్స్ వేసి బాగా కలిపి, నెయ్యి రాసిన పాత్రలో సగం మిశ్రమం పోయాలి తరిగి ఉంచుకున్న పైనాపిల్ స్లయిసెస్‌ను మిశ్రమం మీద ఉంచి, మిగిలిన సగం మిశ్రమం ఆ పైన వేయాలి ∙మిశ్రమాన్ని సమానంగా పరిచి చల్లారనివ్వాలి కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. లౌకీ కలాకండ్ కావలసినవి:సొరకాయ – ఒకటి (తొక్క తీసి సన్నగా తురమాలి); పంచదార – అర కప్పు; కోవా – పావు కిలో; బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూను; బాదం + పిస్తాచూ తరుగు – కొద్దిగా; కుంకుమపువ్వు – పావు టీ స్పూను; మిఠాయి రంగు – పావు టీ స్పూను (కొద్దిగా నీళ్లలో కలపాలి); ఏలకుల పొడి – అర టీ స్పూను తయారీ: ∙ఒక పాత్రలో సొరకాయ తురుము, నీళ్లలో కలిపిన మిఠాయి రంగు వేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙కొద్దిగా చల్లారాక నీరు పిండి తీసేసి, అర కప్పు పంచదార జత చేసి పక్కన ఉంచాలి ∙పెద్ద పాత్రలో పాలు పోసి స్టౌ మీద సుమారు పది నిమిషాల సేపు మరిగించాక, బొంబాయి రవ్వ వేసి కలిపి దింపేయాలి ∙పెద్ద బాణలిలో సొరకాయ మిశ్రమం వేసి ఆపకుండా కలుపుతుండాలి ∙కుంకుమ పువ్వు, ఏలకుల పొడి, పాలు జత చేసి బాగా కలపాలి ∙వెడల్పాటి పళ్లానికి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న కలాకండ్ మిశ్రమం పోసి సమానంగా పరవాలి ∙బాదం తరుగు, పిస్తాచూ తరుగుతో అలంకరించి, ఫ్రిజ్‌లో ఉంచాలి ∙గంట సేపయ్యాక బయటకు తీసి కావలసిన ఆకారంలో కట్ చేయాలి. ఖీర్ కదమ్ కావలసినవి పచ్చి కోవా – ఒక కిలో; పాలు – 2 లీటర్లు; కుంకుమ పువ్వు – కొద్దిగా; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; పంచదార – ఒక కిలో; పంచదార పొడి – 4 టీ స్పూన్లు; కొబ్బరి తురుము – తగినంత; మిఠాయి రంగు – 4 చుక్కలు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; నీళ్లు – తగినన్ని తయారీ: ∙మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచాలి ∙పాలు పోసి మరిగించాక, నిమ్మ రసం వేసి కలపాలి ∙పాలు విరిగాక ఒక వస్త్రంలో కట్టి, నీళ్లు పిండేసి పనీర్ తయారు చేసుకోవాలి ∙చిన్న చిన్న ఉండలుగా రసగుల్లాలను చేసుకుని పక్కన ఉంచాలి ∙మరొక పాత్రను స్టౌ మీద ఉంచి నీళ్లు, పంచదార వేసి తీగ పాకం వచ్చేవరకు ఉడికించాలి ∙కుంకుమ పువ్వు, మిఠాయి రంగు వేసి కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న రసగుల్లాలను పంచదార పాకంలో వేసి సుమారు గంటసేపు ఉంచాలి ∙స్టౌ మీద ఒక నాన్‌స్టిక్ పాన్‌లో కోవా వేసి కొద్దిగా రంగు మారేవరకు కలపాలి ∙కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేయాలి. చిట్టి కాజా కావలసినవి మైదా పిండి – ఒక కప్పు; బేకింగ్ సోడా – చిటికెడు; ఉప్పు – చిటికెడు; నెయ్యి – పావు కప్పు + 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; బియ్యప్పిండి – కొద్దిగా; పంచదార పాకం కోసం; పంచదార – 2 కప్పులు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, ¯ð య్యి వేసి ఉండలు లేకుండా కలపాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి, గంట సేపు పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో పంచదార, నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు ఉడికించి దింపేయాలి ∙వేరొక పాత్రలో బియ్యప్పిండి, నెయ్యి వేసి ముద్దలా చేసి పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండిని ఉండలుగా చేసి, ఒక్కో ఉండ తీసుకుని చపాతీల మాదిరిగా అన్నిటినీ ఒత్తుకోవాలి ∙బియ్యప్పిండి ముద్దను ఒక చపాతీ మీద పూసి ఆ పైన మరో చపాతీ ఉంచి దాని మీద మళ్లీ బియ్యప్పిండి ముద్ద పూయాలి ∙ఈ విధంగా ఐదు చపాతీలను ఒకదాని మీద ఒకటి ఉంచాక, రోల్ చేయాలి ∙అంగుళం మందంలో ముక్కలుగా కట్ చేసి, మధ్య భాగంలో కొద్దిగా ఒత్తాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, కాజాలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙తయారుచేసి ఉంచుకున్న పాకంలో వేసి రెండు మూడు గంటలయ్యాక బయటకు తీసి ప్లేట్లో అందించాలి. గవ్వలు కావలసినవి: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; మైదా పిండి – 2 కప్పులు; నూనె – డీప్ ఫ్రైకి తగినంత; ఉప్పు – చిటికెడు; బెల్లం తరుగు/పంచదార – ఒక కప్పు; నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ఒకపాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి బాగా కలపాలి.నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙గవ్వలు తయారుచేసుకునే బల్ల మీద ఒక్కో ఉండను గవ్వ మాదిరిగా ఒత్తి పక్కన పెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న గవ్వలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం తరుగు/పంచదార వేసి స్టౌ మీద ఉంచి తీగపాకం వచ్చేవరకు ఉడికించాలి ∙తయారుచేసిన గవ్వలను బెల్లం పాకంలో వేసి చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. స్వీట్ సమోసా కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; నానబెట్టిన సెనగ పప్పు – అర కప్పు; పంచదార పొడి/బెల్లం తరుగు – అర కప్పు; కరిగించిన నెయ్యి – పావు కప్పు; జీడిపప్పులు – 2 టేబుల్ స్పూన్లు (ముక్కలు చేయాలి); కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పులు – 10 (నీళ్లలో నానబెట్టి, తొక్క తీసి ముక్కలు చేసుకోవాలి); ఏలకుల పొడి – టీ స్పూను; నెయ్యి లేదా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి పూరీ పిండిలా కలిపి, సుమారు అర గంట సేపు మూత పెట్టి పక్కన ఉంచాలి ∙సెనగపప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించి దింపేయాలి చల్లారాకి నీరు ఒంపేసి సెనగ పప్పును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక మెత్తగా చేసిన సెనగ పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙నెయ్యి వేరుపడుతున్నట్లుగా అనిపించాక కిందకు దింపి చల్లారాక డ్రై ఫ్రూట్స్ ముక్కలు, బెల్లం తరుగు/పంచదార పొడి, ఏలకుల పొడి జత చేసి బాగా కలిపి, వేరొక పాత్రలోకి తీసి, పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి దీర్ఘచతురస్రాకారంలో సన్నగా పొడవుగా ఒత్తుకుని, సమోసా ఆకారం వచ్చేలా మడతలు వేయాలి ∙ఒక టీ çస్పూను స్టఫింగ్ మిశ్రమం అందులో ఉంచి అంచులు మూసేయాలి (అంచులను నీటితో తడి చేస్తే గట్టిగా అతుకుతుంది ∙ఇలా అన్నీ తయారుచేసుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙కొద్దిగా చల్లారాక అందించాలి. రాఖీ మిఠాయిలను ఇలా అందంగా అలంకరించండి... రక్షాబంధన్‌ను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకోగానే, రకరకాల మిఠాయిలు తయారుచేసి, పండుగను అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకుంటారు. ఈ మిఠాయిలను చేసినవి చేసినట్లుగా కాకుండా, వాటిని అందంగా అలంకరిస్తే, మిఠాయిలు రుచిగానే కాకుండా, కనువిందు కూడా చేస్తాయి. ∙మోతీచూర్ లడ్డూ వంటి వాటిని బాదం, జీడిపప్పు, పిస్తా తరుగులతో అలంకరించాలి. ∙లడ్డూలను ప్లేట్లో ఉంచాక, చుట్టూ గులాబి రేకలు వేస్తే కంటికి ఇంపుగా ఉంటుంది. ∙గులాబ్‌జామ్, రసగుల్ల వంటివాటిని కొబ్బరి తురుముతో గార్నిష్ చేయాలి. ∙వంటకం పూర్తి చేసి, ప్లేట్లో అందించేటప్పుడు గార్నిషింగ్ చేస్తే తాజాగా ఉంటుంది. ∙రాఖీ పండుగ ప్రతిబింబించేలా మీరు తయారుచేసే స్వీట్లను రాఖీ ఆకారంలో తయారుచేస్తే, మిఠాయిలోనే పండుగ కనిపిస్తుంది. ∙బర్ఫీ, పేడా వంటి వాటి మీద రాఖీ డిజైన్ చేసి, చుట్టూ పంచదార పాకంతో డిజైన్ చేశాక, కొబ్బరి తురుమును చల్లి, చివరగా ఒక చెర్రీ ఉంచితే, నోటికి విందు చేసే రాఖీ తయారయినట్లే. – డా. బి. స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్) -
పిల్స్‌ని దూరంగా ఉంచే పిల్
పైనా‘పిల్’ను తినేవారు వేరుగా ఏ ‘పిల్’ తీసుకోనక్కర్లేదని కొందరు చమత్కరిస్తుంటారు. అందుకే దీన్ని ఆరోగ్యాల ఆవాస కేంద్రంగా పిలుస్తారు. ఇందులో విటమిన్–సి పాళ్లు చాలా ఎక్కువ. దాంతో ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించే రోగనిరోధక శక్తి సమకూరుతుంది. పైనాపిల్‌తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని. పైనాపిల్‌లో పీచుపదార్థాలు చాలా ఎక్కువ. దాంతో ఇది జీర్ణవ్యవస్థకు చేసే మేలు ఇంతా అంతా కాదు. మలబద్ధకాన్ని నివారిస్తుంది. నీళ్ల విరేచనాల్ని (డయేరియాను) అరికడుతుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులకు ఇదొక స్వాభావిక చికిత్స. పైనాపిల్లోని ‘బ్రొమిలైన్’ అనే ఎంజైమ్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. అందుకే ఏవైనా గాయాలైనప్పుడు పైనాపిల్‌ను తినిపిస్తే.. నొప్పి, వాపు, మంట (ఇన్ఫ్లమేషన్) వెంటనే తగ్గిపోతాయి. గాయాలు త్వరగా మానుతాయి. క్యాల్షియమ్ పుష్కలంగా ఉన్నందున ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడానికి పైనాపిల్ బాగా ఉపకరిస్తుంది. ఆర్థరైటిస్ వంటి అనేక జబ్బుల్లో వచ్చే నొప్పి, మంట వంటి లక్షణాలనూ ఇది సమర్థంగా అరికడుతుంది. ఇందులోని విటమిన్–సి ఒక శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దాంతో పాటు విటమిన్–ఏ, ఫ్లేవనాయిడ్స్ వంటివి అన్నీ కలిసి చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ఇందులో విటమిన్–ఏ కూడా పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని తీసుకునేవారిలో కంటి చూపు బాగుంటుంది. అంతేకాదు కంటికి సంబంధించిన అనేక వ్యాధులు కూడా నివారితమవుతాయి. ఇందులోని విటమిన్–సి, బ్రొమిలైన్ల సంయుక్త ప్రభావం వల్ల శ్వాసవ్యవస్థకు సంబంధించిన చాలా జబ్బుల నివారణ జరుగుతుంది. వాయునాళాల్లో మ్యూకస్ అతిగా పెరగడాన్ని అదుపు చేస్తుంది. కళ్లె/కఫాన్ని తగ్గిస్తుంది. ఆస్తమాను అరికడుతుంది. ఇందులోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణం కూడా ఆస్తమాను అదుపు చేయడానికి తోడ్పడుతుంది. నాపిల్ పండు దీర్ఘకాలం యౌవనంగా ఉండేందుకు తోడ్పడుతుంది. చర్మం ఏజింగ్ ప్రక్రియకు గురికాకుండా కాపాడుతుంది. ముడుతలను నివారిస్తుంది. చర్మాన్ని బిగుతుగా ఉంచేందుకు అవసరమైన కొలాజెన్‌ను సమకూర్చి, వయసు పెరిగినా చర్మాన్ని బిగువుగానే ఉండేలా చేస్తుంది. పైనాపిల్‌లో పొటాషియమ్ పుష్కలంగా ఉండటం వల్ల అధిక రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తనాళాలలో రక్తం సాఫీగా ప్రవహించడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా కూడా హైబీపీ అనర్థాలను తగ్గిస్తుంది. మూత్రపిండాల్లోని రాళ్లను సహజసిద్ధంగా తొలగిస్తుంది. -
హెర్బల్ బ్యూటీ
ఒక టేబుల్ స్పూను పైనాపిల్ రసంలో అంతే మోతాదులో క్యారెట్ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో కాని దూదితో కాని ముఖానికి, మెడకు పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా తరచుగా చేస్తుంటే ముఖం తాజాగా, నూతన కాంతులతో మెరుస్తుంది.పెరుగు, వెన్న, మీగడ సహజసిద్ధమైన క్లెన్సర్లు. వీటిని రోజూ కాని, తరచుగా కాని వాడుతుంటే చర్మం నిగనిగలాడుతుంది. స్నానం చేయడానికి కనీసం అరగంట ముందు పట్టిస్తుంటే వీటిలోని సుగుణాలు చర్మానికి బాగా పడతాయి. స్నానం పూర్తయ్యాక బాదం నూనె రాసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ఇది చక్కని మాయిశ్చరైజర్ కాబట్టి శీతకాలంలో ప్రతిరోజూ రాసుకుంటే మంచిది.తేనె, పెరుగు సహజమైన బ్లీచింగ్ ఏజెంట్స్. ఇవి కెమికల్ బ్లీచ్ కారణంగా వచ్చే సైడ్‌ఎఫెక్ట్స్‌ను నిరోధిస్తా్తయి. రోజూ వాడుతున్నట్లయితే క్రమంగా చర్మం చాయ మెరుగు పడుతుంది. పదిహేను రోజులకొకసారి ఆలివ్ ఆయిల్లో చక్కెర కలిపి ఒంటికి రాసి సున్నితంగా మర్దన చేయాలి. దీనివల్ల మృతకణాలు తొలగిపోతాయి. ఇది మంచి మాయిశ్చరైజర్ కూడా. -
బ్యూటిప్స్
ఒక టేబుల్ స్పూను పైనాపిల్ రసంలో అంతే మోతాదులో క్యారెట్ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో కాని దూదితో కాని ముఖానికి, మెడకు పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా తరచుగా చేస్తుంటే ముఖం తాజాగా, నూతన కాంతులతో మెరుస్తుంది. పెరుగు, వెన్న, మీగడ సహజసిద్ధమైన క్లెన్సర్లు. వీటిని రోజూ కాని, తరచుగా కాని వాడుతుంటే చర్మం నిగనిగలాడుతుంది. స్నానం చేయడానికి కనీసం అరగంట ముందు పట్టిస్తుంటే వీటిలోని సుగుణాలు చర్మానికి బాగా పడతాయి. స్నానం పూర్తయ్యాక బాదం నూనె రాసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ఇది చక్కని మాయిశ్చరైజర్ కాబట్టి శీతకాలంలో ప్రతిరోజూ రాసుకుంటే మంచిది. తేనె, పెరుగు సహజమైన బ్లీచింగ్ ఏజెంట్స్. ఇవి కెమికల్ బ్లీచ్ కారణంగా వచ్చే సైడ్‌ఎఫెక్ట్స్‌ను నిరోధిస్తా్తయి. రోజూ వాడుతున్నట్లయితే క్రమంగా చర్మం చాయ మెరుగు పడుతుంది. పదిహేను రోజులకొకసారి ఆలివ్ ఆయిల్లో చక్కెర కలిపి ఒంటికి రాసి సున్నితంగా మర్దన చేయాలి. దీనివల్ల మృతకణాలు తొలగిపోవడంతోపాటు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి పాలు, పైనాపిల్ రసం సమపాళ్లలో తీసుకుని రెండింటినీ కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత లేదా ఆరిన తర్వాత ముఖాన్ని చన్నీటితో కడగాలి. ఈ ప్యాక్‌ను తరచుగా వేస్తుంటే చర్మం తెల్లగా మారుతుంది. -
లారీల కొద్ది పైనాపిల్స్ చెత్తకుండీల పరం..
విశాఖపట్నం: పంట గిట్టుబాటు ధర లేకపోవడంతో పాలుపోని అన్నదాత.. కష్టపడి పండించిన పైనాపిల్స్ ను ఇలా చెత్త బుట్టలకు పరిమితం చేస్తున్నారు.. ఈ సంఘటన విశాఖలోని పూర్ణామార్కెట్ పరిధిలోని పండ్ల మార్కెట్లో బుధవారం జరిగింది. విచిత్రమైన విషయం ఎంటంటే రైతు దగ్గర కొనడానికి ముందుకురాని దళారులు.. ప్రజలు అవే పండ్లను రైతులు చెత్తకుప్పల్లో వేసి వెళ్లాక వాటిని సేకరించి అమ్ముతున్న వారి నుంచి కొనుగొలు చేస్తున్నారు. కొంత మంది చిన్న వ్యాపారులు ఇవే పండ్లను సేకరించి జ్యూస్ షాపులకు తరలించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. -
Taste డిఫరెంట్
బర్గర్లు... పిజ్జాలు. కాదంటే నూడిల్స్... పానీపూరీలు... జంక్ ఫుడ్‌కు ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు. అప్పుడప్పుడూ అయితే ఓకే... కానీ తిండి మానేసి వాటినే లాగించేస్తున్నారు. స్కూల్‌కు లంచ్ బాక్స్ ఇచ్చినా... చిరు తిళ్లతో సరిపెట్టేసుకుంటున్నారు. శరీరానికి శక్తినిచ్చి... ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లు బాక్స్‌లో ఎన్ని పెట్టినా... వెంట తీసుకెళతారే గానీ తినేవారెంతమంది! మరి వారిని జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంచడమెలా..! స్నాక్స్‌ను ఫ్రూట్స్‌తో రీప్లేస్ చేసేదెలా! పిల్లల సైకాలజీ ప్రకారం వాళ్లకు అన్నీ కొత్తగా, డిఫరెంట్‌గా, వెరైటీగా ఉండాలి. అంతకు మించి ఆకర్షణీయంగా కనిపించాలి అంటారు సెలబ్రిటీ చెఫ్ రుచికాశర్మ. అలాంటి చిన్నారుల కోసం ఇంట్లో సులువుగా చేసుకొనేలా ఆమె ఓ కొత్త కాన్సెప్ట్‌తో మెనూ రెడీ చేశారు. ఓ లుక్కేద్దాం రండి... స్టార్ హోటల్‌కు వెళ్లామనుకోండి... ఎప్పుడూ తినే ఫుడ్డే. కాకపోతే ప్లేట్లో కాస్త విభిన్నంగా డెకరేట్ చేసి సర్వ్ చేస్తారు. టేస్ట్ ఎలా ఉన్నా... చూడగానే ఓ పట్టు పట్టేయాలనిపిస్తుంది. అలాగే... పిల్లల మనస్తత్వం కూడా. వారు ఎక్కువగా ఇష్టపడే చాక్లెట్‌ను పండ్లకు మిక్స్ చేసి... దానికింత డెకరేషన్ చేస్తే ఠక్కున అక్కడ వాలిపోతారు. లాలీపాప్‌లా: రకరకాల పండ్లను ముక్కలుగా కోసి, చాక్లెట్ క్రీమ్‌లో డిప్ చేయాలి. దానికి లాలీపాప్‌లా టూత్ పిక్ గుచ్చి ఓ అరగంట ఫ్రిజ్‌లో పెట్టి పిల్లల చేతికందిస్తే... లొట్టలేసుకుంటూ తింటారు. కబాబ్ టైప్: అరటి పండు, పైనాపిల్, యాపిల్ ముక్కలు, చెర్రీస్ వంటివి కబాబ్‌లా ఓ పుల్లకు గుచ్చి తేనెలో గానీ, షుగర్ సిరప్‌లో గానీ డిప్ చేస్తే... చిన్నారుల నోరూరిపోతుంది. డ్రైఫ్రూట్స్‌తో: రోజూ ఒకటే వెరైటీ చేస్తే ఎవరికైనా బోరు కొడుతుంది. సో.. ఎప్పటికప్పుడు కాస్త విభిన్నంగా ప్రయత్నించాలి. అందుకే అప్పుడప్పుడూ పండ్లకు చాక్లెట్ క్రీమ్ డిప్‌తో పాటు వాటిపై డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేస్తే... చూడగానే తినేయాలనిపిస్తుంది. ఫ్రూట్ బైట్: వేడి వేడి బజ్జీల మధ్యలో పండ్ల ముక్కలు పెట్టి ఫ్రూట్ బైట్లా చేయొచ్చు. అలాగే శాండ్‌విచ్‌లా బ్రెడ్ ముక్కల మధ్యలో ఫ్రూట్ స్లైసెస్ ఉంచి, జాం పూసి కలర్ఫుల్గా మారిస్తే... రుచికి రుచీ ఉంటుంది. చూడ్డానికి ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. కుకీస్‌తో: పండ్ల ముక్కలను కుకీస్ మధ్యలో పేర్చి, షుగర్ సిరప్ లేదంటే చాక్లెట్ క్రీమ్‌లో డిప్ చేయాలి. డీప్ ఫ్రిజ్‌లో పెట్టి కాసేపటి తరువాత తింటే... అబ్బో ఆ టేస్టే వేరు. వీటన్నింటికీ సీజనల్ ఫ్రూట్స్‌ను వాడితే మరింత రుచిగా ఉంటాయి. - శిరీష చల్లపల్లి