విశాఖపట్నం: పంట గిట్టుబాటు ధర లేకపోవడంతో పాలుపోని అన్నదాత.. కష్టపడి పండించిన పైనాపిల్స్ ను ఇలా చెత్త బుట్టలకు పరిమితం చేస్తున్నారు.. ఈ సంఘటన విశాఖలోని పూర్ణామార్కెట్ పరిధిలోని పండ్ల మార్కెట్‌లో బుధవారం జరిగింది.
విచిత్రమైన విషయం ఎంటంటే రైతు దగ్గర కొనడానికి ముందుకురాని దళారులు.. ప్రజలు అవే పండ్లను రైతులు చెత్తకుప్పల్లో వేసి వెళ్లాక వాటిని సేకరించి అమ్ముతున్న వారి నుంచి కొనుగొలు చేస్తున్నారు. కొంత మంది చిన్న వ్యాపారులు ఇవే పండ్లను సేకరించి జ్యూస్ షాపులకు తరలించుకొని సొమ్ము చేసుకుంటున్నారు.