Summer Drinks- Pineapple Keera Juice: పైనాపిల్, కీరా ముక్కల్లో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండు చర్మాన్ని పొడిబారనియకుండా కాపాడతాయి. విటమిన్ సి ప్రోటిన్‌తో కలిసి ముఖం మీద ముడతలు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సెబేసియస్ గ్రంథుల పనితీరు మెరుగుపడి, చర్మం తేమగా ఉంటుంది.
వీటిని కలిపి తయారు చేసిన జ్యూస్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీఇన్‌ఫ్లమేటరి విధులను నిర్వహిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది. తరచూ ఈ డ్రింక్ తాగడం వల్ల క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియంలు ఉండడం వల్ల రక్త పీడనం నియంత్రణలో ఉంటుంది.
పైనాపిల్ కీరా జ్యూస్ తయారీకి కావలసినవి:
►పైనాపిల్ ముక్కలు – ఒకటింబావు కప్పులు
►కీర దోసకాయ ముక్కలు – కప్పు
►యాపిల్ ముక్కలు – అరకప్పు
►తేనె – రెండు టేబుల్ స్పూన్లు
►నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు
►ఐస్ క్యూబ్స్ – ఎనిమిది.
పైనాపిల్ కీరా జ్యూస్ తయారీ:
►కీరా, యాపిల్ ముక్కలను తొక్కతీయకుండా తీసుకోవాలి.
►పైనాపిల్, కీరా, యాపిల్ ముక్కలను బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
►ఇవన్నీ మెత్తగా అయ్యాక జ్యూస్‌ను గ్లాసులో వడగట్టుకోవాలి.
►వడగట్టిన జ్యూస్‌లో నిమ్మరసం, తేనె వేసి కలపాలి. ∙
►చివరిగా ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి.
వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: యాపిల్, నేరేడు.. జ్యూస్ కలిపి తాగితే.. కలిగే లాభాలివే!
Comments
Please login to add a commentAdd a comment