keera
-
Hair Care: రోజూ తలస్నానం చేస్తున్నారా? కీర దోస జ్యూస్‌తో లాభాలివే!
కొందరు వారంలో అన్ని రోజులూ తలస్నానం చేస్తారు, ఇంకొంత మంది వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేస్తారు. అయితే వాస్తవానికి వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఇంకో విషయం, అందరి జుట్టు ఒకేలా ఉండదు. కొందరికి వెంట్రుకలు పలుచగా ఉంటే మరికొందరికి ఒత్తుగా ఉంటాయి, కొందరి జుట్టు పట్టులాగా జారిపోయేలా ఉంటే ఇంకొందరి జుట్టు రింగులు తిరిగి ఉంటుంది. కాబట్టి ముందుగా వారి జుట్టు స్వభావం ఎలాంటిదో తెలుసుకొని దానికనుగుణంగా తలస్నానం చేయాల్సి ఉంటుంది. లేకపోతే జుట్టు రాలిపోవటం, నిర్జీవంగా మారడం, చుండ్రు రావటం లాంటి సమస్యలు అనవసరంగా కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. కురుల దృఢత్వానికి కీరదోస కీర దోసకాయను తొక్కతీసి సన్నగా తురిమి జ్యూస్ తియ్యాలి. జ్యూస్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్లవరకు పట్టించి మర్ధన చేయాలి. గంట తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి. కీరా జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ కే జుట్టురాలడాన్ని తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. విటమిన్ ఏ సెబమ్ ఉత్పత్తిని పెంచి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. పొటాషియం, జింక్, మ్యాంగనీస్, పాంతోనిక్ యాసిడ్స్ కురులను దృఢంగా మారుస్తాయి. చదవండి: Black Sesame- Dandruff Control: నల్ల నువ్వుల ప్రయోజనాలు.. చుండ్రుకు చెక్! ఒత్తైన జుట్టు ఇంకా.. Amla Tea Benefits: ఉసిరి టీ తయారీ ఇలా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు! -
Recipe: పెరుగు, కీరా.. ఫహాడీ రైతా.. అరగంట ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేసుకుంటే!
పెరుగు, కీరా కలగలసిన ఫహాడి రైతా తయారీ విధానం తెలుసా? ఫహాడి రైతా తయారీకి కావల్సినవి ►పెరుగు – రెండు కప్పులు ►కీరా – ఒకటి ►ఆవాలు – టీస్పూను ►పచ్చిమిర్చి – రెండు ►ఆవ నూనె – పావు కప్పు ►కొత్తిమీర – గుప్పెడు ►కారం – టీస్పూను ►పసుపు – అరటీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా. తయారీ... ►తొక్క, గింజలు తీసిన కీరాను సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ►పెరుగును పెద్దగిన్నెలో వేసి కవ్వంతో చిలకాలి. ►తరువాత పావు కప్పు నీళ్లుపోసి కలపాలి. ►ఇప్పుడు ఆవాలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి ►దంచిన మిశ్రమం, కీరా తరుగుని చిలికిన పెరుగులో వేయాలి. ►పసుపు, కారం కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ►దీనిని అరగంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టి తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Recipe: ఉత్తరాఖండ్ వంటకం ఆలుకీ గుట్కే తయారీ ఇలా! Indonesian Chicken Satay Recipe: ఇవన్నీ కలిపి బోన్‌లెస్ చికెన్ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే! -
Beauty Tips: ముఖం మీది రంధ్రాలు మాయం చేసే.. మెంతి ప్యాక్!
మెంతి.. ఆరోగ్య లాభాలు మాత్రమే కాదు.. అందాన్ని ఇనుమడింపజేసే గుణాలు కూడా దీని సొంతం. ఈ మెంతి ప్యాక్ ట్రై చేశారంటే ముఖం మీది రంధ్రాలు మాయం కావడం ఖాయం. ఇలా చేయండి 👉🏾రాత్రంతా నానబెట్టుకున్న టీస్పూను మెంతులను, నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేయాలి. 👉🏾దీనికి ఆరు వేపాకులు, రెండు కీరదోసకాయ ముక్కలు జోడించి పేస్టుచేయాలి. 👉🏾ఈ పేస్టులో టీస్పూను ముల్తానీ మట్టి, అరటీస్పూను నిమ్మరసం వేసి చక్కగా కలుపుకోవాలి. 👉🏾ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. 👉🏾తరువాత చేతులని తడిచేసుకుని ఐదు నిమిషాలపాటు మర్దనచేసి చల్లటి నీటితో కడిగేయాలి. 👉🏾వారానికి ఒకసారి క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం మీద కనిపిస్తోన్న రంధ్రాలు, డార్క్ సర్కిల్స్, మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి. 👉🏾ముఖ చర్మం బిగుతుగా మారి, మృదువైన నిగారింపుని సంతరించుకుంటుంది. 👉🏾మెంతుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు ముఖచర్మానికి తేమనందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. చదవండి👉🏾 Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం! Beauty Tips: ముడతలు, బ్లాక్ హెడ్స్‌కు చెక్.. ఈ డివైజ్ ధర రూ. 2,830 -
Health: పైనాపిల్ కీరా జ్యూస్ తాగుతున్నారా.. దీనిలోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల!
Summer Drinks- Pineapple Keera Juice: పైనాపిల్, కీరా ముక్కల్లో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండు చర్మాన్ని పొడిబారనియకుండా కాపాడతాయి. విటమిన్ సి ప్రోటిన్‌తో కలిసి ముఖం మీద ముడతలు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సెబేసియస్ గ్రంథుల పనితీరు మెరుగుపడి, చర్మం తేమగా ఉంటుంది. వీటిని కలిపి తయారు చేసిన జ్యూస్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీఇన్ఫ్లమేటరి విధులను నిర్వహిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది. తరచూ ఈ డ్రింక్ తాగడం వల్ల క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియంలు ఉండడం వల్ల రక్త పీడనం నియంత్రణలో ఉంటుంది. పైనాపిల్ కీరా జ్యూస్ తయారీకి కావలసినవి: ►పైనాపిల్ ముక్కలు – ఒకటింబావు కప్పులు ►కీర దోసకాయ ముక్కలు – కప్పు ►యాపిల్ ముక్కలు – అరకప్పు ►తేనె – రెండు టేబుల్ స్పూన్లు ►నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు ►ఐస్ క్యూబ్స్ – ఎనిమిది. పైనాపిల్ కీరా జ్యూస్ తయారీ: ►కీరా, యాపిల్ ముక్కలను తొక్కతీయకుండా తీసుకోవాలి. ►పైనాపిల్, కీరా, యాపిల్ ముక్కలను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ మెత్తగా అయ్యాక జ్యూస్‌ను గ్లాసులో వడగట్టుకోవాలి. ►వడగట్టిన జ్యూస్‌లో నిమ్మరసం, తేనె వేసి కలపాలి. ∙ ►చివరిగా ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: యాపిల్, నేరేడు.. జ్యూస్ కలిపి తాగితే.. కలిగే లాభాలివే! -
కూత్తాన్ కోసం రమ్యానంబీశన్ పాట
తమిళసినిమా: నటి రమ్యానంబీశన్‌లో మంచి గాయని ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆమె పాడిన పైపైపై కలచీపై అనే పాట ఇప్పటికీ వాడ వాడలా మారుమోగుతోంది. తాజాగా కూత్తాన్ చిత్రం కోసం మరోసారి తన గళం విప్పింది. నీలగిరీస్ డ్రీమ్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఆ చిత్రానికి నవదర్శకుడు ఏఎల్.వెంకీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది ఒక నృత్యదర్శకుడి ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న విభిన్న కథా చిత్రం అని చెప్పారు. ఇందులో రాజ్‌కుమార్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్లుగా శ్రీజిత, కీర, సన నటిస్తున్నారని తెలిపారు. విలన్‌గా ప్రభుదేవా సోదరుడు నాగేంద్రప్రసాద్ నటిస్తున్నారని చెప్పారు. బాలాజీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో వివేక్ రాసిన ఓడు ఓడు కాదల్ కాడు మిరండీ అనే పాటను నటి రమ్యనంబీశన్తో పాడిస్తే బాగుంటుందని భావించామన్నారు. ఈమె చాలా చక్కగా పాడారని చెప్పారు. -
కీర.. లాభాలు జరజర
– కొత్త పంట వైపు మెట్ట రైతుల చూపు – తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందుతున్న వైనం – విదేశాలకు ఎగుమతులు జంగారెడ్డిగూడెం : మెట్ట ప్రాంత రైతులు కొత్త కొత్త పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతంలో పండని పంటలు వేసి పలువురు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేగాక తక్కువ కాలంలో అధిక ఆదాయం కూడా సాధిస్తున్నారు. మెట్టప్రాంతంలోని లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది రైతులు జర్కిన్స్ (కీర దోస) పంట పండిస్తున్నారు. దీంతో అధిక లాభాలు సాగిస్తున్నారు. సుమారు 100 మందికి పైగా రైతులు మెట్టమండలాల్లో దీనిని సేద్యం చేస్తున్నారు. ఎకరానికి 10 వేల విత్తనాలు నాటడం ద్వారా సేద్యం కొనసాగిస్తున్నారు. జర్కిన్స్ విత్తనాలను ఓ ప్రై వేట్ కంపెనీ సరఫరా చేస్తోంది. ఎకరానికి అన్ని ఖర్చులు కలుపుకుని సుమారు రూ. 45 వేలు ఖర్చవుతుండగా పంటపై లక్ష రూపాయల వరకు ఆదాయం లభిస్తోంది. పంట దిగుబడి 30 రోజుల నుంచి 60 రోజుల వరకు వస్తుంది. పండిన పంటను జహీరాబాద్‌కు చెందిన గ్లోబల్ గ్రీన్ కంపెనీ తన ప్రతినిధుల ద్వారా కొనుగోలు చేస్తోంది. విదేశాలకు ఎగుమతి జర్కిన్స్ కాయలను ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, కెనడా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జర్కిన్స్ కాయలు గ్రేడ్‌ను బట్టి కంపెనీ ధర ఇస్తుంది. 18.5 ఎంఎం సైజు ఉన్న కాయను ఒకటో రకం గ్రేడ్‌గా గుర్తించి టన్నుకు రూ.18 వేలు చెల్లిస్తోంది. 25 ఎంఎం సైజుగా ఉన్న కాయ టన్నుకు రూ.11 వేలు, 33 ఎంఎం సైజు ఉన్నlకాయకు టన్నుకు రూ.4 వేలు చెల్లిస్తోంది. ఈ రకం కీరదోస పచ్చివి తినేందుకు, సలాడ్, సూప్ , చట్నీ, పచ్చళ్లు చేసుకునేందుకు ఉపయోగిస్తారు. వైద్యపరంగా కూడా ఇవి ఎంతో మేలైనవని వైద్యులు చెబుతున్నారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు పంట వేసుకునేందుకు అనుకూలమైన రోజులు. కేవలం 60 రోజుల్లో ఎకరానికి సుమారు రూ.50 వేల వరకు ఆదాయం లభిస్తుందని రైతులు చెబుతున్నారు. కీరదోస వల్ల గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు నియంత్రణ, క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనిలో పోలేట్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ తదితర పదార్థాలు అధికంగా ఉంటాయి. రైతులు ఈ పంట వేసేందుకు ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తూ సబ్సిడీలు ఇస్తోంది. స్థానికంగా పంట అంతా ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతుంది. సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు దీంతో రైతులకు మంచి ధర కూడా లభిస్తోంది. ఏటా మనదేశం నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కీరదోస పంట ఎగుమతి అవుతోంది. దీనిపై దేశానికి రూ.1,000 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. దీంతో ఈ ప్రాంత రైతులు కూడా జర్కిన్స్ వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇసుకతో కూడిన మట్టినేలలు, 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ పంట బాగా పండుతుంది. పాదుల రూపంలో ఎదిగే ఈ పంటకు కర్రలను పాతి దానిపైకి ఎగబాకిస్తారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటి ఖర్చుతో ఈ పంట పండుతుంది. మంచి ఆదాయం జర్కిన్స్ పంట ద్వారా మంచి ఆదాయం వస్తుంది. 30 రోజుల నుంచే దిగుబడి మొదలవుతుంది. ఇలా నిత్యం 60 రోజుల వరకు పంట వస్తూనే ఉంటుంది. ఎకరానికి రూ.40 నుంచి రూ.45 వేలు ఖర్చవుతుంది. ఆదాయం రూ.లక్ష వరకు వస్తుంది. తక్కువ రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది. ఎక్కువమంది వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించవచ్చు. – ఘంటా రాఘవేంద్రరావు, రైతు, మఠంగూడెం సబ్సిడీ ఇస్తున్నాం జర్కిన్స్ పంట (కీర దోస) వేసే రైతులకు ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీ ఇస్తున్నాం. పాదులు పైకి ఎగబాకేలా ఏర్పాటు చేసుకునేందుకు కర్రలు, ఇనుప వైర్లు ఏర్పాటుకు ఎకరానికి రూ. 8 వేలు సబ్సిడీ ఇస్తున్నాం. ఈ పంట మంచి ఆదాయాన్ని ఇస్తుంది. దీంతో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ప్రై వేట్ కంపెనీలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. – అడపా దుర్గేష్, ఏడీ, ఉద్యాన శాఖ, జంగారెడ్డిగూడెం