కొందరు వారంలో అన్ని రోజులూ తలస్నానం చేస్తారు, ఇంకొంత మంది వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేస్తారు. అయితే వాస్తవానికి వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి అనేది చాలా మందికి తెలియదు.
ఇంకో విషయం, అందరి జుట్టు ఒకేలా ఉండదు. కొందరికి వెంట్రుకలు పలుచగా ఉంటే మరికొందరికి ఒత్తుగా ఉంటాయి, కొందరి జుట్టు పట్టులాగా జారిపోయేలా ఉంటే ఇంకొందరి జుట్టు రింగులు తిరిగి ఉంటుంది. కాబట్టి ముందుగా వారి జుట్టు స్వభావం ఎలాంటిదో తెలుసుకొని దానికనుగుణంగా తలస్నానం చేయాల్సి ఉంటుంది. లేకపోతే జుట్టు రాలిపోవటం, నిర్జీవంగా మారడం, చుండ్రు రావటం లాంటి సమస్యలు అనవసరంగా కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.
కురుల దృఢత్వానికి కీరదోస
కీర దోసకాయను తొక్కతీసి సన్నగా తురిమి జ్యూస్ తియ్యాలి. జ్యూస్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్లవరకు పట్టించి మర్ధన చేయాలి. గంట తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి. కీరా జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ కే జుట్టురాలడాన్ని తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. విటమిన్ ఏ సెబమ్ ఉత్పత్తిని పెంచి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. పొటాషియం, జింక్, మ్యాంగనీస్, పాంతోనిక్ యాసిడ్స్ కురులను దృఢంగా మారుస్తాయి.
చదవండి: Black Sesame- Dandruff Control: నల్ల నువ్వుల ప్రయోజనాలు.. చుండ్రుకు చెక్! ఒత్తైన జుట్టు ఇంకా..
Amla Tea Benefits: ఉసిరి టీ తయారీ ఇలా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
Comments
Please login to add a commentAdd a comment