Head bath
-
రోజూ తలస్నానం చేస్తున్నారా?
చాలా మంది ఏదైనా చిట్కా చెప్పిన లేదా పెద్దలు ఇది మంచిదన్నా వెంటనే చేసేస్తుంటారు. ఇది అన్నివేళాల మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే ఆ చిట్కా మనకు పనిచేస్తుందో కూడా గమనించాలి. మన శరీరతత్వం, ఆరోగ్య పరిస్థితిని పరిగణలోని తీసుకునే ఆచరించాలి. లేదంటే తగ్గడం అటుంచి లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుంది జాగ్రత్త!. ఇంతకీ జుట్టుకి సంబంధించి చాలా రెమిడీలు వినేఉండుంటారు. అందులో చాలా మంది రోజు తలస్నానం చేస్తే మంచిదని పలువురు చెప్పారు. దీంతో చాలామంది ఆ మాట మీద నమ్మకంతో ఆచరించేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. మీదు పొడిజుట్టు, జిడ్డుగా ఉండే జుట్టు అనేదాని బట్టి ఆ రెమిడీని అనుసరించలి. ఇక్కడ జుట్టు తత్వాన్న అనుసరించే ఏ చిట్కానైనా ఫాలోకండి. చెప్పారు కదా అన్ని చేసేయొద్దు!. ఇంతకీ ఎలాంటి వారు రోజు తలస్నానం చేయడం మంచిది? ఎవరూ చేయకూడదో ? చూద్దాం! పదే జుట్టుజుట్టు కడితే.. పదేపదే జుట్టుని కడగడం వల్ల... జుట్టు పొడిగా మారిపోతుంది.అందువల్ల జుట్టు తత్వాన్ని బట్టి తలస్నానం చేయాలి. భరించలేనంత జిడ్డుకారుతుంటే రోజూ తలస్నానం చేయాలి. పని ప్రదేశంలో బాగా చెమటలు పడుతుంటే రోజూ తలస్నానం చేయాలి. అయితే షాంపుతో కాకుండా సాధారణ నీటితో తలను కడగాలి. ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తలస్నానం చేస్తే కురులు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి. మాడు నూనె కారుతుంటే తలస్నానం చేయడం మంచిది కాదు. తలలో సహజ సిద్ధ్దంగా విడుదలయ్యే నూనెలు జుట్టుకు చాలా ముఖ్యం. జిడ్డుగా ఉందని పదేపదే తలస్నానం చేస్తే మాడు పొడి బారి చుండ్రు, ఇతర సమస్యలు చుట్టు ముడతాయి. ఎలాంటివారు రోజు తలస్నానం చేయాలంటే.. పనిప్రదేశేల్లో ఎక్కువగా.. దుమ్ము దూళి ఉండేచోట పనిచేయక తప్పని ఉద్యోగులు ఏరోజు కారోజు ఆయిల్ పెట్టుకుని తలస్నానం చేయాలి అలాగే తలలో ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లు కూడా వైద్యుల సలహాల మేరకు ఆయింట్మెంట్స లేదా ఆయా ఆయిల్స అప్లై చేసి రోజంతా ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయాలి. తద్వారా త్వరగా ఇన్ఫెక్షన్ నుంచి బయటపడగలుగుతారు చుండ్రు ఎక్కువుగా ఉండి బయటకు వెళ్లిన వెంటనే జుట్టు మాసినట్టుగా అయిపోయేవాళ్లు కూడా ఈ చిట్కా ఫాలో అవ్వాల్సి ఉంటుంది విపరీతంగా తల్లో చెమట పట్టేవాళ్లు కూడా రోజు తలస్నానం చేయడమే మంచిది. కాబట్టి మీ జుట్టు తత్వాన్ని అనుసరించి రెమీడిని ఫాలో అయితే మంచిది. (చదవండి: బౌల్ మసాజ్‌తో మెరిసిపోండి! ఆరోగ్యం, అందం మీ సొంతం!) -
Hair Care: రోజూ తలస్నానం చేస్తున్నారా? కీర దోస జ్యూస్‌తో లాభాలివే!
కొందరు వారంలో అన్ని రోజులూ తలస్నానం చేస్తారు, ఇంకొంత మంది వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేస్తారు. అయితే వాస్తవానికి వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఇంకో విషయం, అందరి జుట్టు ఒకేలా ఉండదు. కొందరికి వెంట్రుకలు పలుచగా ఉంటే మరికొందరికి ఒత్తుగా ఉంటాయి, కొందరి జుట్టు పట్టులాగా జారిపోయేలా ఉంటే ఇంకొందరి జుట్టు రింగులు తిరిగి ఉంటుంది. కాబట్టి ముందుగా వారి జుట్టు స్వభావం ఎలాంటిదో తెలుసుకొని దానికనుగుణంగా తలస్నానం చేయాల్సి ఉంటుంది. లేకపోతే జుట్టు రాలిపోవటం, నిర్జీవంగా మారడం, చుండ్రు రావటం లాంటి సమస్యలు అనవసరంగా కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. కురుల దృఢత్వానికి కీరదోస కీర దోసకాయను తొక్కతీసి సన్నగా తురిమి జ్యూస్ తియ్యాలి. జ్యూస్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్లవరకు పట్టించి మర్ధన చేయాలి. గంట తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి. కీరా జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ కే జుట్టురాలడాన్ని తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. విటమిన్ ఏ సెబమ్ ఉత్పత్తిని పెంచి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. పొటాషియం, జింక్, మ్యాంగనీస్, పాంతోనిక్ యాసిడ్స్ కురులను దృఢంగా మారుస్తాయి. చదవండి: Black Sesame- Dandruff Control: నల్ల నువ్వుల ప్రయోజనాలు.. చుండ్రుకు చెక్! ఒత్తైన జుట్టు ఇంకా.. Amla Tea Benefits: ఉసిరి టీ తయారీ ఇలా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు! -
Hair Care: ముఖం జిడ్డుకారుతుందని పదేపదే షాంపుతో తలస్నానం చేస్తే!
సరైన పోషణ, తగినంత శ్రద్ధ లేకపోతే జుట్టు పొడిబారి ఎండుగడ్డిలా బరకగా మారడమేగాక, చివర్లు చిట్లిపోయి మరింత నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇలా కనిపించగానే వెంటనే చిట్లిన వెంట్రుకలను కత్తెరతో కత్తిరించేస్తుంటారు. చివర్లు తీసేసినప్పటికీ కొద్దిరోజుల్లో సమస్య మొదటికే వస్తుంది. చీటికి మాటికి జుట్టు కత్తిరించే ముందు ఈ చిట్కాలను పాటించి చూడండి జుట్టు పొడిబారడం, చిట్లడం కూడా తగ్గుతుంది. ఇలా చేయండి.. ►పదేపదే వెంట్రుకలు చిట్లిపోతుంటే గోరు వెచ్చని నూనెతో కుదుళ్ల నుంచి చివర్ల వరకు మర్దన చేయాలి. ►వారానికి కనీసం రెండు సార్లు మర్దన తప్పనిసరిగా చేయాలి. ►జుట్టుని ఆరబెట్టడానికి, స్ట్రెయిటనింగ్, రింగులుగా మార్చుకోవడానికి హెయిర్ డ్రయ్యర్‌ను తరచూ వినియోగించకూడదు. ►పదేపదే హెయిర్ డ్రయ్యర్ వాడడం వల్ల జుట్టు పొడిబారిపోయి, చిట్లిపోతుంది. తరచూ షాంపుతో తలస్నానం వద్దు! ►ముఖం జిడ్డుకారుతుందని పదేపదే షాంపుతో తలస్నానం చేస్తే.. మాడు నుంచి సహజసిద్ధంగా విడుదలయ్యే తైలాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ►ఈ తైలాల విడుదల తగ్గితే వెంట్రుకలు పొడిబారి, చిట్లిపోతాయి. ►ఎప్పుడు తలస్నానం చేయాలనుకున్నా ముందుగా తలకు నూనె పట్టించి అరగంట తరువాతే తలస్నానం చేయాలి. గోరువెచ్చని నీటితోనే! ►మరీ ఎక్కువ వేడి... లేదా మరీ చల్లగా ఉన్న నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి. ►తలస్నానం చేసిన తరువాతే హెయిర్ కండీషనర్ రాసుకోవాలి. ►అప్పుడే వెంట్రుకలకు మంచి పోషణ అంది మెరుపుని సంతరించుకుంటాయి. ►కండీషనర్‌ను చివర్లకు పట్టించడం ద్వారా జుట్టుకు మంచి పోషణ అందుతుంది. చదవండి: Hair Care Tips: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! Beauty Tips: బీట్రూట్ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే.. -
‘ఉస్సెన్ బోల్ట్ కూడా నన్ను పట్టుకోలేడు’
కింగ్ కోబ్రా పేరు వింటేనే కాళ్లల్లో వణుకు, గుండెల్లో దడ వచ్చేస్తాయి. దాన్ని దగ్గర నుంచి చూడటం అంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవడం లాంటిదే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సర్పం కింగ్ కోబ్రా. దాని పేరు తలుచుకోవడానికే మనం వణికిపోతుంటే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా దానికి తలస్నానం చేయిస్తున్నాడు. వినడానికి ఏ మాత్రం నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం పచ్చి నిజం. వివరాలు.. కేరళకు చెందిన వావా సురేష్ అని వ్యక్తి పాములను పట్టడంలో, వాటిని పరిరక్షిచడంలో నిపుణులు. ఈ నేపథ్యంలో సురేష్ కింగ్ కోబ్రాకు తల స్నానం చేయించాడు. ఓ బకెట్లో నీళ్లు తెచ్చి కింగ కోబ్రా తల మీద పోస్తాడు. ఆ పాము నీళ్లు పోసిన వ్యక్తిని ఏమి అనకుండా, ఎలాంటి భావాలు పలికించకుండా కామ్‌గా ఉంటుంది. అలా రెండు బక్కెట్ల నీటిని పోసి కింగ్ కోబ్రాకు తలస్నానం చేయిస్తాడు సురేష్. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Summer time.. And who doesn’t like a nice head bath🙏 Can be dangerous. Please don’t try. pic.twitter.com/ACJpJCPCUq — Susanta Nanda IFS (@susantananda3) May 24, 2020 ‘వేసవి కాలం.. తలస్నానం ఎవరికి ఇష్టం ఉండదు. అయితే ఇలాంటివి చాలా ప్రమాదం. ఇంటి దగ్గర ప్రయత్నించకండి’ అంటూ ఈ వీడియోను ట్వీట్ చేశారు సుశాంత నంద. దాదాపు 51 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 70 వేల మంది పైగా వీక్షించారు. ‘నిజంగా అతడి ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే.. ఈ వీడియో చూసి నేను పరిగెట్టడం మొదలు పెట్టాను. ఉస్సెన్ బోల్ట్ సైతం నన్ను పట్టుకోలేడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. భూమి పైన ఉన్న పొడవైన విషపు పాముల జాతి. నేషనల్ జీయోగగ్రాఫిక్ వారు చెప్పిన దాని ప్రకారం ఈ పాము నిలబడటమే కాక తన కళ్లతో పూర్తిగా ఎదిగిన ఓ మనిషిని చూడగలదు. దీని ఒక్క కాటులో వెలువడే విషంతో 20 మందిని ఒక్కసారే చంపవచ్చు. -
ఇలా తలస్నానం చేయండి!
నూనెతో మర్దన: గోరువెచ్చని కొబ్బరినూనె లేదా నువ్వులనూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను మాడుకు, కుదుళ్లకు పట్టించి మర్దన చేయాలి. తర్వాత జుట్టుకంతా నూనె రాయాలి. ఆవిరితో మెరుగు: టర్కీ టవల్‌ను వెచ్చని నీటిలో ముంచి, పిండి, తలకు చుట్టాలి. దీంతో రక్తప్రసరణ మెరుగై కుదుళ్లు చురుకు అవుతాయి. ఈ విధంగా నెలకు ఒకసారైనా జుట్టుకు ఆవిరిపట్టాలి. దీని వల్ల వెంట్రుకల రాలడం సమస్య తగ్గుతుంది. ఆరబెట్టేదిలా: జుట్టు తడిలేకుండా త్వరగా ఆరాలని డ్రయ్యర్‌ని ఉపయోగించవద్దు. మెత్తటి కాటన్ లేదా టర్కీ టవల్ని ఉపయోగించడమే మంచి మార్గం. తలకు టవల్ చుట్టి కాసేపు వదిలేయాలి. తడిని టవల్ పీల్చుకుని, జుట్టు పొడిగా అవుతుంది. ►జుట్టు మెరవాలని హెయిర్ స్ప్రేలు వాడకూడదు. వీటి వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోయి, మరింత పొడిబారుతాయి. వెంట్రుకలు చిట్లే సమస్య కూడా పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి. బ్యూటిప్స్ -
చుండ్రు నివారణకు
►వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని ఈ నూనెను తలకు పట్టించి వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత రసాయనాల గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ►చిన్న అల్లం ముక్కను సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గుతుంది.. ►ఆపిల్ సైడర్ వెనిగర్‌లో అరటిపండు గుజ్జును బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి పది నిమిషాల తర్వాత వెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ►కప్పు నీళ్లలో 2–3 టేబుల్ స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ►బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చుండ్రు నివారణకు ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి. ►కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపైన దురద వంటి చర్మ సమస్యలనూ నివారిస్తుంది. వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తుంది. -
రోజూ తలస్నానం మంచిదేనా?
నేను ఒక క్రీడాకారుణ్ణి. నాకు మాడుపైన విపరీతంగా చెమట పడుతుంటుంది. దాంతో నేను రోజూ తలస్నానం చేస్తుంటాను. ఇలా రోజూ తలస్నానం చేయడం మంచిదేనా? అలా చేస్తే జుట్టు ఎక్కువగా రాలుతుందా?– వినయ్, మెదక్ మాడుపై చెమట పట్టినప్పుడు తలస్నానం చేయడం మంచిదే. అలా చేయకపోతేనే సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు బాగా చెమట పట్టినా తలస్నానం చేయనందువల్ల మాడుపై దురద, చుండ్రు (డాండ్రఫ్), జుట్టురాలడం వంటి సమస్యలు వస్తాయి. అయితే మీరిలా రోజూ తలస్నానం చేసే సమయంలో వాడే షాంపూలాంటి ఉత్పాదనల్లో కఠినమైన రసాయనాలు (హార్ష్ కెమికల్స్) ఉంటే కూడా కొన్ని సమస్యలు రావచ్చు. ఇక మీరు రోజూ తలస్నానం చేసేందుకు ఉప్పునీరు వాడుతున్నా కూడా జుట్టు రాలే సమస్య ఉత్పన్నం కావచ్చు. కాబట్టి మీరొకసారి డాక్టర్‌ను కలిసి, మీకు అనువైన షాంపూ ఎంపిక లాంటి జాగ్రత్తలను తెలుసుకోండి. పాప పెదవులపై దురద...ఎందుకిలా? మా పాప వయసు ఎనిమిదేళ్లు. ఆమె పెదవుల మీద, ఆ చుట్టూర ఉన్న భాగమంతా బాగా దురదగా ఉంటోందని చెబుతోంది. తన పెదవులు తరచూ పగిలినట్లుగా కనిపిస్తుంటాయి. మా పాపకు ఉన్న సమస్య ఏమిటి?– అమృత, వరంగల్ మీ పాపకు పెదవుల దగ్గర అలర్జీ రావడం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. ఈ పరిణామానికి అనేక అంశాలు కారణమవుతాయి. ముఖ్యంగా మీ పాపకు తరచూ పెదవులను నాలుకతో తడి చేసుకునే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మాన్పించాల్సి ఉంటుంది. అంతేకాదు... కొన్నిసార్లు పెదవులపై వాడే ఉత్పాదనలు కూడా అలర్జీకి కారణమవుతాయి. ఉదాహరణకు లిప్‌బామ్, పేస్ట్ లాంటివి. మీరు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, పాపకు అలా జరగడానికి నిర్దిష్టమైన కారణం ఏమిటో తెలుసుకోవాలి. కారణాన్ని బట్టి చికిత్స ఇవ్వవచ్చు.డాక్టర్ సుభాషిణి జయం,కన్సల్టెంట్ మెడికల్ కాస్మటాలజిస్ట్,ఎన్ఛాంట్ మెడికల్ కాస్మటాలజీ క్లినిక్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్ -
మంచి నిద్రకు... తలార స్నానం!
రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టడం లేదా? అటు ఇటు పొర్లిపొర్లి అలసిపోతున్నారా? ఈ చికాకులేవీ లేకుండా హాయిగా నిద్రపోవాలనుకుంటున్నారా? పడుకునేందుకు సుమారు 90 నిమిషాల ముందు అంటే గంటన్నర ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే.. మీ సమస్య తీరినట్లే అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు. ఇదేదో ఆషామాషీగా చెప్పేసిన విషయం ఏమీ కాదండోయ్! ఇప్పటికే జరిగిన దాదాపు 5322 అధ్యయనాలను పునఃపరిశీలించి, సమాచారాన్ని విశ్లేషించి మరీ నిగ్గుతేల్చిన విషయం. అంతేకాదు. స్నానం చేసేందుకు వాడే నీటి ఉష్ణోగ్రత 40 నుంచి 43 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు నడుం వాల్చిన కొద్ది సమయంలోనే నిద్రలోకి జారుకుంటారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. పడుకునేందుకు గంట, రెండు గంటల ముందు శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా తగ్గుతుందని ఆ సమయంలో నులివెచ్చటి నీటితో స్నానం చేస్తే రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి సుఖ నిద్రకు సాయపడుతుందని వీరు అంటున్నారు. శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులకు అనుగుణంగా ఉష్ణోగ్రతను మార్చుకునే పరుపులను తయారు చేయడం ద్వారా రాత్రంతా దీర్ఘనిద్రలో ఉండేలా చేసేందుకు ప్రస్తుతం తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. స్లీప్ మెడిసిన్ రివ్యూ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. -
వేసవిలో కేశాల ఆరోగ్యం కోసం...
కేశాలను క్రమంగా కత్తిరించండి వేసవిలో సాధారణంగా జుట్టు పొడిగా నిర్జీవంగా తయారు అవుతుంది, ఈ సమయంలో జుట్టు చివరలను కత్తిరించండి. చూడటానికి అందంగా కనపడటానికి, కేశాలను పావు అంగుళం కత్తిరించండి. ఫలితంగా కేశాలు ఆరోగ్యకరంగా కనిపిస్తాయి. పెరుగుదల కూడా మెరుగుపడుతుంది రెండురోజులకోసారి తలస్నానం వేసవిలో తలపైన చెమట ఎక్కువగా రావటం వలన తలపైన ఉండే చర్మం దుమ్ము ధూళితో నిండిపోయి, చికాకుగా అనిపిస్తుంది. దాంతో చాలామంది తలను రోజు శుభ్రపరుస్తుంటారు. ఇలా రోజూ తలస్నానం చేయడం వల్ల తల పైన ఉండే చర్మం సహజ నూనెలను కోల్పోయి జుట్టు కూడా నిర్జీవంగా కనిపిస్తుంది. అందువల్ల రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయడం మంచిది. కండిషనింగ్ కేశాలకు తరచు షాంపూలను వాడటం వలన ‘రీహైడ్రేషన్’కు గురవకుండా ‘ప్రోటీన్’లతో కూడిన కండిషనర్లను వాడటం మంచిది. అలాగని ఎక్కువ ప్రోటీన్లు ఉన్న కండిషనర్లను వాడరాదు. ఇలా వాడటం వలన కేశాలు పొలుసులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి వారానికి ఒకసారి మంచి కండిషనర్ ఉన్న షాంపూలను వాడటం మంచిది. ఎక్కువగా దువ్వకండి ఎక్కువగా దువ్వటం వలన కేశాలు పాడయ్యే అవకాశం ఉంది. వేసవిలో ఉండే వేడికి తలపైన ఉండే చర్మం తేమని కోల్పోతుంది. దీనికితోడు బాగా దువ్వటం వలన కురులు పెళుసుబారి చిట్లిపోవడం లేదా ఊడిపోవడం జరుగుతుంది. తల స్నానం చేసిన వెంటనే ఫైబర్’తో తయారు చేసిన దువ్వెనలను వాడడం మరింత హానికరం. కాబట్టి వీలయినంత వరకు చెక్కదువ్వెనతో... అదీ కూడా జుట్టు బాగా ఆరిన తర్వాత దువ్వడం మంచిది. మీ కేశాలను కడగటానికి సమయం లేదు కదా అని అశ్రద్ధ చూపకండి, వెంట్రుకల మూలాలు, తలపైన చర్మంలో ఉండే దుమ్ము, నూనెల వలన దురదలు కలుగుతాయి, కొన్ని సమయాల్లో కేశాలు బలహీనంగా మారి వెంట్రుకలు ఉడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి వారానికి మూడు లేదా కనీసం రెండుసార్లు తలస్నానం చేయడం మంచిది. నిమ్మరసం వాడండి ఒకోసారి అనుకోకుండా ఎండలో ఎక్కువసేపు ఉండవలసి వస్తుంది. అలాంటప్పుడు కేశాలకు కొద్దిగా నిమ్మరసం రాయడం మంచిది. -
నిగనిగలకు కాఫీ
కాఫీ తాగడమే కాదు వెంట్రుకలకు పట్టిస్తే నిగనిగలాడతాయి. అర కప్పు కాఫీ గింజలతో చేసిన డికాషన్ తీసుకోవాలి. చల్లారిన డికాషన్‌ని దూది ఉండతో ముంచి, తల వెంట్రుకలు ఒక్కో పాయ తీసుకుంటూ మాడుకు పట్టేలా అద్దాలి. ఇలా పూర్తిగా డికాషన్‌ని పట్టించి, అరగంట వదిలేసి చల్లని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల వెంటుక కుదుళ్లకు బలం వస్తుంది. త్వరగా పెరుగుతాయి.షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కాఫీ డికాషన్‌ను వెంట్రుకలకు పట్టించాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి, తర్వాత కడిగేయాలి. ఇది వెంట్రుకలకు మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతంది. వెంట్రుకలు చిట్లడం, రాలడం కూడా తగ్గిపోతుంది. పావు కప్పు కాఫీ గింజలను, హెయిర్ ఆయిల్‌ను కలిపి సన్నని మంట మరిగించాలి. ఓ 8 గంటలపాటు ఆ గింజలను నూనెలో అలాగే ఉంచాలి. తర్వాత వడకట్టుకోవాలి. ఈ నూనెను ఒక జార్లో పోసి భద్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు కాఫీ నూనెను జుట్టుకు, మాడుకు పట్టేలా రాసి, మర్దనా చేయాలి. దీనివల్ల వెంట్రుకలు రాలడం అనే సమస్య తగ్గుతుంది. పెరుగుదలా బాగుంటుంది. మీరు కండిషనర్‌లో టేబుల్ స్పూన్ కాఫీగింజల పొడిన కలిపి, తలస్నానం చేసిన తర్వాత రాసి 5–10 నిమిషాలు ఆరనిచ్చి, శుభ్రపరుచుకోండి. దీనివల్ల వెంట్రుకల నిగనిగలు పెరుగుతాయి. -
అతిగా తలస్నానం చేసినా జుట్టుకు ముప్పే!
తమ జుట్టు చాలా శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో కొందరు రోజుకు రెండుసార్లు కూడా తలస్నానం చేస్తుంటారు. నిజానికి ఇలా అతిగా తలస్నానం చేయడం కేశాలకు నష్టం చేకూర్చి, జుట్టును పలచబారుస్తుంది. దీనికి కారణాలను తెలుసుకుందాం. కేశాలు మొలిచే చోట ఒక సెంటీమీటరులో నాలుగో వంతు భాగం డిర్మస్ అనే చర్మపు పొర కింద కూరుకుపోయి ఉంటుంది. ఈ భాగాన్ని ఫాలికిల్ అంటారు. అంటే ఈ ఫాలికిల్స్ అన్నీ కేశపు కుదురులో కూరుకుపోయి ఉంటాయన్నమాట. ఆ రోమపు కుదురులోని వెంట్రుక బయటకు వచ్చేచోట స్కాల్ప్‌పై మురికి, బ్యాక్టీరియా చేరుతూ ఉంటాయి. వాటిని తప్పక శుభ్రం చేసుకోవాల్సిందే. అయితే అలా శుభ్రం చేసుకునేందుకు మాటిమాటికీ తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలో ఉండే ప్రొటీన్ బాండ్స్ వదులైపోతుంటాయి. అంతేగాక జుట్టును శుభ్రపరచడానికి వాడే షాంపూ... ఆ జుట్టులోని తేమను లాగేస్తుంది. అందుకే అతిగా షాంపూ వాడేవారి జుట్టు పీచులా మారిపోయి ఉంటుంది. ఇక కొందరు షాంపూతో తలస్నానం చేయగానే జుట్టును కుప్పలా ముడివేసుకుంటారు. దాంతో జుట్టు కాస్త తడిగా ఉన్నప్పుడు అలా ముడేయడం వల్ల అది చిక్కుపడిపోతుంది. అలా చిక్కుపడ్డదాన్ని దువ్వుతున్నప్పుడు వెంట్రుక మూలంలో నొప్పి కలగడం చాలామందికి అనుభవమే. ఇలా తరచూ స్నానం వల్ల జుట్టులోని ప్రొటీన్ బాండ్స్ వదులై జుట్టు బలహీనం కావడం, అధికంగా తలస్నానం చేయడం వల్ల షాంపూ ప్రభావంతో జుట్టు పీచులా మారడం, చిక్కుముడులను దువ్వుతున్నప్పుడు జుట్టు కుదుళ్లలో నొప్పి వస్తున్నా అదేపనిగా దువ్వడం వంటి అన్ని చర్యలతో జుట్టు రాలడం చాలా సాధారణం. అందుకే అతిగా చేసే తలస్నానం కూడా జుట్టును నష్టపరుస్తుంది. జుట్టు ఆరోగ్యకరంగా ఉండాలంటే మైల్డ్ షాంపూతో కేవలం వారానికి రెండుసార్లు తలస్నానం చేయడం మేలు. -
బ్యూటిప్స్
తలస్నానం చేయడానికి ముందు జుట్టును వెడల్పు పళ్లున్న దువ్వెనతో చక్కగా చిక్కులు వదిలే వరకు దువ్వాలి. తలను గోరువెచ్చటి నీటితో తడపాలి. షాంపూను చిన్న కప్పులోకి తీసుకుని గోరువెచ్చటి నీటితో కలపాలి. ఒక వంతు షాంపూకి అంతే మోతాదులో నీటిని కలపాలి. షాంపూ నీటిలో సమంగా కలిసిన తర్వాత జుట్టుకు పట్టించాలి. ∙షాంపూ పట్టించిన తర్వాత జుట్టు కుదుళ్లను, మాడును మసాజ్ చేస్తున్నట్లు వేళ్లతో వలయాకారంగా రుద్దాలి. తర్వాత జుట్టు చివర్ల వరకు రెండు చేతులతో మృదువుగా రుద్దాలి. చన్నీరు లేదా గోరువెచ్చటి నీటితో తలను శుభ్రం చేయాలి. అలాగే రెండవ దఫా కూడా చేయాలి. అయితే రెండవ సారి పావు వంతు షాంపూ మాత్రమే తీసుకోవాలి. నీటిని ఎక్కువగా కలిపి ఉపయోగించాలి. ∙తలకు, జుట్టుకు పట్టిన షాంపూ పూర్తిగా వదిలిన తర్వాత తలకు మెత్తటి టవల్‌ను చుట్టాలి. ∙జుట్టు మరీ బిరుసుగా ఉంటే కండిషనర్ అప్లయ్ చేయవచ్చు. కండిషనర్ జుట్టు కుదుళ్లకు అంటకూడదు. మాడుకు తగలకుండా జుట్టుకు మాత్రమే పట్టించాలి.