చాలా మంది ఏదైనా చిట్కా చెప్పిన లేదా పెద్దలు ఇది మంచిదన్నా వెంటనే చేసేస్తుంటారు. ఇది అన్నివేళాల మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే ఆ చిట్కా మనకు పనిచేస్తుందో కూడా గమనించాలి. మన శరీరతత్వం, ఆరోగ్య పరిస్థితిని పరిగణలోని తీసుకునే ఆచరించాలి. లేదంటే తగ్గడం అటుంచి లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుంది జాగ్రత్త!. ఇంతకీ జుట్టుకి సంబంధించి చాలా రెమిడీలు వినేఉండుంటారు. అందులో చాలా మంది రోజు తలస్నానం చేస్తే మంచిదని పలువురు చెప్పారు. దీంతో చాలామంది ఆ మాట మీద నమ్మకంతో ఆచరించేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. మీదు పొడిజుట్టు, జిడ్డుగా ఉండే జుట్టు అనేదాని బట్టి ఆ రెమిడీని అనుసరించలి. ఇక్కడ జుట్టు తత్వాన్న అనుసరించే ఏ చిట్కానైనా ఫాలోకండి. చెప్పారు కదా అన్ని చేసేయొద్దు!. ఇంతకీ ఎలాంటి వారు రోజు తలస్నానం చేయడం మంచిది? ఎవరూ చేయకూడదో ? చూద్దాం!
పదే జుట్టుజుట్టు కడితే..
- పదేపదే జుట్టుని కడగడం వల్ల... జుట్టు పొడిగా మారిపోతుంది.అందువల్ల జుట్టు తత్వాన్ని బట్టి తలస్నానం చేయాలి.
- భరించలేనంత జిడ్డుకారుతుంటే రోజూ తలస్నానం చేయాలి.
- పని ప్రదేశంలో బాగా చెమటలు పడుతుంటే రోజూ తలస్నానం చేయాలి.
- అయితే షాంపుతో కాకుండా సాధారణ నీటితో తలను కడగాలి.
- ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తలస్నానం చేస్తే కురులు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి.
- మాడు నూనె కారుతుంటే తలస్నానం చేయడం మంచిది కాదు. తలలో సహజ సిద్ధ్దంగా విడుదలయ్యే నూనెలు జుట్టుకు చాలా ముఖ్యం.
- జిడ్డుగా ఉందని పదేపదే తలస్నానం చేస్తే మాడు పొడి బారి చుండ్రు, ఇతర సమస్యలు చుట్టు ముడతాయి.
ఎలాంటివారు రోజు తలస్నానం చేయాలంటే..
- పనిప్రదేశేల్లో ఎక్కువగా.. దుమ్ము దూళి ఉండేచోట పనిచేయక తప్పని ఉద్యోగులు ఏరోజు కారోజు ఆయిల్ పెట్టుకుని తలస్నానం చేయాలి
- అలాగే తలలో ఇన్ఫెక్షన్‌లు ఉన్నవాళ్లు కూడా వైద్యుల సలహాల మేరకు ఆయింట్‌మెంట్స లేదా ఆయా ఆయిల్స అప్లై చేసి రోజంతా ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయాలి. తద్వారా త్వరగా ఇన్ఫెక్షన్ నుంచి బయటపడగలుగుతారు
- చుండ్రు ఎక్కువుగా ఉండి బయటకు వెళ్లిన వెంటనే జుట్టు మాసినట్టుగా అయిపోయేవాళ్లు కూడా ఈ చిట్కా ఫాలో అవ్వాల్సి ఉంటుంది
- విపరీతంగా తల్లో చెమట పట్టేవాళ్లు కూడా రోజు తలస్నానం చేయడమే మంచిది. కాబట్టి మీ జుట్టు తత్వాన్ని అనుసరించి రెమీడిని ఫాలో అయితే మంచిది.
(చదవండి: బౌల్ మసాజ్‌తో మెరిసిపోండి! ఆరోగ్యం, అందం మీ సొంతం!)
Comments
Please login to add a commentAdd a comment