Remedy
-
చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టకూడదంటే ఇలా చేయండి!
శీతాకాలంలో జుట్టు, ముఖం డ్రైగా మారి ఇబ్బంది పెడుతుండటమే గాక కొన్ని ఆహార పదార్థాలు కూడా గడ్డకట్టుకుపోయి వాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. ఈ కాలంలో ప్రతిది మైల్డ్‌గా ఉంటుంది. ఓ పట్టనా ఏది తొందరగా వేడెక్కదు. దీనికి తగ్గట్టు వాతావరణం అలానే ఉంటుంది. ఇలాంటప్పడూ కొన్ని చిట్టి చిట్కాలు ఫాలో అయితే ఈజీగా పరిష్కారం దొరుకుంతుంది. మనకు కూడా చాలా వెసులుబాటుగా ఉంటుంది. ఆ ఇంటి చిట్కాలేంటో చూసేద్దామా! తలకు పెట్టుకోవడానికి సరిపడా కొబ్బరిపాలలో కొన్నిచుక్కల నిమ్మరసం కలపాలి. ఈ పాలను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట తరువాత మైల్డ్‌షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు మూడుసార్లు కొబ్బరి పాలను ఇలా తలకు పట్టిస్తూ ఉంటే కురులకు మంచి పోషణ అంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జిడ్డుతత్వం గల కురులు ఉన్నవారికి ఈ కొబ్బరిపాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎండబెట్టిన కమలాతొక్కలను దోరగా వేయించి మెత్తటి పొడిలా చేయాలి. దీనిలో టీస్పూను పసుపు, రెండు టీస్పూన్ల శనగపిండి, కొద్దిగా నీళ్లుపోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసి ఆరనివ్వాలి. ఇరవై నిమిషాల తరువాత తడిచేతులతో రుద్ది కడిగేయాలి. మృతకణాలు, ట్యాన్ తొలగిపోయి ముఖం కాంతిమంతంగా మారుతుంది. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం మిలమిలలాడుతుంది. టేబుల్ స్పూను ఉసిరి నూనె లేదా బాదం నూనె తీసుకుని కొబ్బరి నూనెలో కలిపితే చలికాలంలో కొబ్బరినూనె గడ్డకట్టదు. ఉసిరి, బాదంలోని గుణాలు నూనెని గడ్డకట్టనివ్వవు. అందువల్ల వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కొబ్బరి నూనె గట్టిగా కాదు. మాయిశ్చరైజర్ లేదా లోషన్లో రెండు చుక్కల గ్లిజరిన్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులకు రాసుకోవాలి. ఈ మిశ్రమం చర్మానికి తేమనందించి చర్మం పొడిబారకుండా చేస్తుంది. (చదవండి: ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు! ఎలా చేస్తారంటే..) -
క్యారట్లు వాడిపోకుండా తాజాగా ఉండాలంటే..ఇలా చేయండి!
కొన్న రకాల కాయగూరలు నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉన్నా కూడా పాడైపోతుంటాయి. అలాగే పాల గిన్నెలు లేదా డబ్బాలు ఓ పట్టాన వాసన పోవు అలాంటప్పుడు సింపుల్‌గా ఉంటే చిట్కా ఏదైనా ఉంటే బావుండననిపిస్తుంది. అలాంటి వారికి కోసం ఈ హోం రెమిడ్స్. ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి. క్యారట్స్ ఎండిపోయినట్లు, వాడిపోయినట్లుగా ఉంటే ఒక గిన్నెలో వేసి, క్యారట్స్ మునిగేలా నీళ్లు పోయాలి. ఈ గిన్నెమీద మూతపెట్టి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. పన్నెండు గంటల తరువాత నీటిలో నుంచి క్యారట్స్ తీసి చూస్తే తాజాగా ఉంటాయి. ఇప్పుడు తొక్క తీసి చక్కగా వాడుకోవచ్చు. క్యారట్ మీద నల్లటి మచ్చలు ఏర్పడినప్పుడు కూడా ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. ఎంత కడిగినా పాల బాటిల్స్ వాసన వస్తుంటాయి. ఇలాంటప్పుడు పాల బాటిల్లో టేబుల్ స్పూను వంటసోడా, కొన్ని నీళ్లు పోసి రాత్రంతా ఉంచాలి. ఉదయం బాటిల్‌ను షేక్ చేసి కడిగితే పాల వాసన పోతుంది. ఇదే విధంగా పాల బాటిల్లో కొద్దిగా వెనిగర్ వేసి షేక్ చేసి పక్కన పెట్టాలి. ఆరు గంటల తరువాత వేడి నీటితో కడగాలి. పాల వాసన పోతుంది. 200 ఎమ్ఎల్ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసి కలపాలి. ఈ నీటిని కుండీల్లోని మొక్కల మట్టిపైన, ఆకులపైన చల్లాలి. ఈ నీరు కీటక నివారిణిగా పనిచేయడమేగాక, మొక్కలకు పునరుజ్జీవాన్ని ఇస్తుంది. (చదవండి: ఐస్‌వాటర్ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా!) -
రోజూ తలస్నానం చేస్తున్నారా?
చాలా మంది ఏదైనా చిట్కా చెప్పిన లేదా పెద్దలు ఇది మంచిదన్నా వెంటనే చేసేస్తుంటారు. ఇది అన్నివేళాల మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే ఆ చిట్కా మనకు పనిచేస్తుందో కూడా గమనించాలి. మన శరీరతత్వం, ఆరోగ్య పరిస్థితిని పరిగణలోని తీసుకునే ఆచరించాలి. లేదంటే తగ్గడం అటుంచి లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుంది జాగ్రత్త!. ఇంతకీ జుట్టుకి సంబంధించి చాలా రెమిడీలు వినేఉండుంటారు. అందులో చాలా మంది రోజు తలస్నానం చేస్తే మంచిదని పలువురు చెప్పారు. దీంతో చాలామంది ఆ మాట మీద నమ్మకంతో ఆచరించేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. మీదు పొడిజుట్టు, జిడ్డుగా ఉండే జుట్టు అనేదాని బట్టి ఆ రెమిడీని అనుసరించలి. ఇక్కడ జుట్టు తత్వాన్న అనుసరించే ఏ చిట్కానైనా ఫాలోకండి. చెప్పారు కదా అన్ని చేసేయొద్దు!. ఇంతకీ ఎలాంటి వారు రోజు తలస్నానం చేయడం మంచిది? ఎవరూ చేయకూడదో ? చూద్దాం! పదే జుట్టుజుట్టు కడితే.. పదేపదే జుట్టుని కడగడం వల్ల... జుట్టు పొడిగా మారిపోతుంది.అందువల్ల జుట్టు తత్వాన్ని బట్టి తలస్నానం చేయాలి. భరించలేనంత జిడ్డుకారుతుంటే రోజూ తలస్నానం చేయాలి. పని ప్రదేశంలో బాగా చెమటలు పడుతుంటే రోజూ తలస్నానం చేయాలి. అయితే షాంపుతో కాకుండా సాధారణ నీటితో తలను కడగాలి. ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తలస్నానం చేస్తే కురులు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి. మాడు నూనె కారుతుంటే తలస్నానం చేయడం మంచిది కాదు. తలలో సహజ సిద్ధ్దంగా విడుదలయ్యే నూనెలు జుట్టుకు చాలా ముఖ్యం. జిడ్డుగా ఉందని పదేపదే తలస్నానం చేస్తే మాడు పొడి బారి చుండ్రు, ఇతర సమస్యలు చుట్టు ముడతాయి. ఎలాంటివారు రోజు తలస్నానం చేయాలంటే.. పనిప్రదేశేల్లో ఎక్కువగా.. దుమ్ము దూళి ఉండేచోట పనిచేయక తప్పని ఉద్యోగులు ఏరోజు కారోజు ఆయిల్ పెట్టుకుని తలస్నానం చేయాలి అలాగే తలలో ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లు కూడా వైద్యుల సలహాల మేరకు ఆయింట్మెంట్స లేదా ఆయా ఆయిల్స అప్లై చేసి రోజంతా ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయాలి. తద్వారా త్వరగా ఇన్ఫెక్షన్ నుంచి బయటపడగలుగుతారు చుండ్రు ఎక్కువుగా ఉండి బయటకు వెళ్లిన వెంటనే జుట్టు మాసినట్టుగా అయిపోయేవాళ్లు కూడా ఈ చిట్కా ఫాలో అవ్వాల్సి ఉంటుంది విపరీతంగా తల్లో చెమట పట్టేవాళ్లు కూడా రోజు తలస్నానం చేయడమే మంచిది. కాబట్టి మీ జుట్టు తత్వాన్ని అనుసరించి రెమీడిని ఫాలో అయితే మంచిది. (చదవండి: బౌల్ మసాజ్‌తో మెరిసిపోండి! ఆరోగ్యం, అందం మీ సొంతం!) -
కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి.
కొందరిలో కాళ్లమీద పగుళ్లు చాలా లోతుగా ఏర్పడి నొప్పిని కలిగిస్తుంటాయి. మరీ ముఖ్యంగా మడమల మీద ఈ పగుళ్లు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. సాధారణంగా చాలామందిలో కాళ్ల పగుళ్లు చలికాలంలో వస్తుంటాయి. కానీ కొందరిలో మాత్రం వేసవిలోనూ కనిపిస్తుంటాయి. ►కాళ్ల పగుళ్లకు చాలా కారణాలు ఉండవచ్చు. ఎండాకాలంలో దేహానికి తగినంత నీరు అందని సందర్భాల్లో కూడా కాళ్లలో పగుళ్లు రావచ్చు. మరికొందరిలో... వారు వాడే సబ్బు సరిపడకపోవడం, తరచూ సబ్బునీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుంది. (బట్టలు ఉతికే మహిళల్లో డిటర్జెంట్ కలిసిన నీళ్లవల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది). ఇక ఆహారంలో పోషకాలు తగినన్ని అందని వారిలో కూడా ఈ సమస్య రావచ్చు. ►ఇక మరికొందరిలో డయాబెటిస్, థైరాయిడ్ లేదా ఒబేసిటీ లాంటి ఆరోగ్యసమస్యలు ఉన్న సందర్భాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే ఆ సమస్యలతో బాధపడుతున్నవారు తమకు ఏ కారణంగా కాళ్లపగుళ్లు వచ్చాయో నిర్ధారణ చేసుకోవడం కోసం వైద్యపరీక్షలు చేయించి, ముందుగా అసలు (అండర్లైయింగ్) సమస్యకు చికిత్స తీసుకోవాలి. చదవండి: ముందే గుర్తిస్తే... డయాబెటిస్‌ను నివారించవచ్చు ►ఇంకొందరిలో బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు కాళ్ల పగుళ్ల సమస్యకు కారణం కావచ్చు. అలాంటివారిలో కాళ్ల పగుళ్లు బాగా లోతుగా ఉండి, వాటినుంచి రక్తస్రావం జరుగుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే ఆ దశకు చేరాక కూడా వాటికి తగిన చికిత్స తీసుకోకపోతే అవి పగుళ్ల స్థాయి నుంచి పుండ్లుగా మారే అవకాశం ఉంది. ఇదేగానీ డయాబెటిస్ ఉన్నవారిలో జరిగితే సమస్య లు మరింత జటిలంగా మారే అవకాశం ఉంది. ►కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా చాలామందిలో కనిపించే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటివారు వీలైనంతగా మంచి నీటిని ఎక్కువగా తాగుతుండాలి. అలాగే ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం పొడిబట్టతో తడి లేకుండా తుడవాలి. ►మాయిశ్చరైజర్ ఉండే క్రీములను కాళ్లకు రాసుకొని రాత్రంతా సాక్సులను ధరించి నిద్రించడం లాంటి చిన్న చిన్న ఉపశమన చికిత్సలతోనే చాలామందిలో ఇవి తగ్గిపోతాయి. అలా తగ్గకపోతే అవి ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా వచ్చినవిగా పరిగణించి, అసలు సమస్య నిర్ధారణ, చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించాలి. చదవండి: Health Tips: విటమిన్ బి 12 లోపమా.. ఇవి తిన్నారంటే.. -
వర్షానికి కూలిన ఇళ్లు
పెద్దేముల్: వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోతున్నాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి పెద్దేముల్ మండల జైరాం తండాలో రూప్‌సింగ్‌నాయక్, కిషన్‌నాయక్‌కు చెందిన రెండు ఇళ్లతోపాటు పెద్దేముల్ గ్రామంలో ఓ ఇల్లు కూలిపోయాయని బాధితులు తెలిపారు. ఈ విషయాన్ని ఆయా గ్రామాల రెవెన్యూ కార్యదర్శులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. వర్షాలకు కులిన ఇళ్లకు ప్రభుత్వం పరిహారంతో పాటు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చుస్తానని ఓంలానాయక్‌తండా ఎంపీటీసీ సభ్యుడు గెమ్యానాయక్ తెలిపారు. -
ఆరోగ్యం-ఆయుర్వేదం 16th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 15th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 12th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 11th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 10th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 9th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 8th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 7th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 6th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 5th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 4th October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 3rd October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 2nd October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 1st October 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 30th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 28th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 27th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 26th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 25th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 24th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 23rd September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 21st September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 20th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 18th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 17th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 16th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 14th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 13th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 12th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 7th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 6th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 5th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 4th September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 3rd September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 2nd September 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 31st August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 30th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 29th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 28th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 27th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 26th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 24th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 23rd August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 22nd August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 21st August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 19th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 17th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 16th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 15th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 14th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 13th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 12th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 10th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 9th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 8th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 7th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 6th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 5th August 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 3rd August 2013
-
ఆరోగ్యం ఆయుర్వేదం 2nd August 2013
-
ఆరోగ్యం ఆయుర్వేదం 1st August 2013
-
ఆరోగ్యం ఆయుర్వేదం 31st July 2013
-
ఆరోగ్యం ఆయుర్వేదం 30th July 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 26th July 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 25th July 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 24th July 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 23rd july 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 22nd July 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 19th july 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 18th july2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 17th july2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 16th july2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 15th May 2013
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 13th july
-
ఆరోగ్యం-ఆయుర్వేదం 12th july 2013