శీతాకాలంలో జుట్టు, ముఖం డ్రైగా మారి ఇబ్బంది పెడుతుండటమే గాక కొన్ని ఆహార పదార్థాలు కూడా గడ్డకట్టుకుపోయి వాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. ఈ కాలంలో ప్రతిది మైల్డ్‌గా ఉంటుంది. ఓ పట్టనా ఏది తొందరగా వేడెక్కదు. దీనికి తగ్గట్టు వాతావరణం అలానే ఉంటుంది. ఇలాంటప్పడూ కొన్ని చిట్టి చిట్కాలు ఫాలో అయితే ఈజీగా పరిష్కారం దొరుకుంతుంది. మనకు కూడా చాలా వెసులుబాటుగా ఉంటుంది. ఆ ఇంటి చిట్కాలేంటో చూసేద్దామా!
- తలకు పెట్టుకోవడానికి సరిపడా కొబ్బరిపాలలో కొన్నిచుక్కల నిమ్మరసం కలపాలి. ఈ పాలను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట తరువాత మైల్డ్‌షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు మూడుసార్లు కొబ్బరి పాలను ఇలా తలకు పట్టిస్తూ ఉంటే కురులకు మంచి పోషణ అంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జిడ్డుతత్వం గల కురులు ఉన్నవారికి ఈ కొబ్బరిపాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
- ఎండబెట్టిన కమలాతొక్కలను దోరగా వేయించి మెత్తటి పొడిలా చేయాలి. దీనిలో టీస్పూను పసుపు, రెండు టీస్పూన్ల శనగపిండి, కొద్దిగా నీళ్లుపోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసి ఆరనివ్వాలి. ఇరవై నిమిషాల తరువాత తడిచేతులతో రుద్ది కడిగేయాలి. మృతకణాలు, ట్యాన్ తొలగిపోయి ముఖం కాంతిమంతంగా మారుతుంది. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం మిలమిలలాడుతుంది.
- టేబుల్ స్పూను ఉసిరి నూనె లేదా బాదం నూనె తీసుకుని కొబ్బరి నూనెలో కలిపితే చలికాలంలో కొబ్బరినూనె గడ్డకట్టదు. ఉసిరి, బాదంలోని గుణాలు నూనెని గడ్డకట్టనివ్వవు. అందువల్ల వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కొబ్బరి నూనె గట్టిగా కాదు.
- మాయిశ్చరైజర్ లేదా లోషన్‌లో రెండు చుక్కల గ్లిజరిన్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులకు రాసుకోవాలి. ఈ మిశ్రమం చర్మానికి తేమనందించి చర్మం పొడిబారకుండా చేస్తుంది.
(చదవండి: ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు! ఎలా చేస్తారంటే..)
Comments
Please login to add a commentAdd a comment