Coconut oil
-
కొబ్బరి నూనె.. హెయిర్ ఆయిలా? వంటనూనా?
కొబ్బరి నూనె ఎందుకు వాడతారు? తలకు పెట్టుకుంటారు, కేరళలో వంటల్లో కూడా వినియోగిస్తారు. అయితే మరి కొబ్బరినూనె.. హెయిర్ ఆయిలా లేక వంటలనూనా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే రెండింటికీ వాడతారు. మనదేశంలో హెయిర్ ఆయిల్గానే అధికంగా కొబ్బరి నూనె వాడతారు. కాళ్లు, చేతులతో పాటు శరీరాన్ని మర్దన చేయడానికి కూడా కొబ్బరినూనె ఉపయోగిస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? దశాబ్దన్నర కాలం నుంచి కొబ్బరినూనెపై జరుగుతున్న ‘పన్ను’ వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ముగింపు పలికింది. ఎక్సైజ్ శాఖ, తయారీదారుల మధ్య సుదీర్ఘ న్యాయ వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు బుధవారం నాడు తీర్పు చెప్పింది.ఏమిటా వివాదం?చిన్నచిన్న సీసాల్లో విక్రయించే కొబ్బరి నూనెను ఎడిబుల్ ఆయిల్ (తినదగిన నూనె)గా వర్గీకరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో తయారీదారులు, వినియోగదారులకు ఊరట లభించనుంది. కొకొనట్ ఆయిల్‌పై ‘పన్ను’ వివాదం 2009లో ప్రారంభమైంది. మనం కొనే ప్రతి వస్తువుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు విధిస్తుంటాయి. అలాగే రెడీమేడ్ కొబ్బరినూనె అమ్మకాలపై కూడా పన్ను ఉంది. జీఎస్టీ అమల్లోకి రాకముందు సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్ (సెట్ యాక్ట్) 1985 ప్రకారం ఎడిబుల్ ఆయిల్ కేటగిరీ కింద కొబ్బరినూనెపై 8 శాతం ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. సెట్ యాక్ట్‌కు 2005లో కేంద్రం సవరణ చేసింది. దీని ప్రకారం 2009, జూన్‌లో కొబ్బరినూనెను కేశసంరక్షణ ఉత్పత్తిగా పేర్కొంటూ సుంకాన్ని 16 శాతానికి పెంచింది.అయితే 2009లో సర్క్యులర్ జారీ చేయడానికి ముందే, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు 2007లో మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు పలు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హెయిర్ ఆయిల్ ఉత్పత్తిగా వర్గీకరిస్తూ కొబ్బరి నూనెపై అధిక పన్ను రేటు విధించాలని నోటీసుల్లో ప్రతిపాదించారు. మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కొబ్బరి నూనెను 5 మిల్లీలీటర్ల నుంచి 2 లీటర్ల వరకు ప్యాకెట్లలో విక్రయిస్తుంటుంది. పన్ను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ చెన్నైలోని కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(సెస్టాట్)ను మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. సెస్టాట్ తీర్పును సుప్రీంకోర్టులో సేలం సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ సవాల్ చేశారు.ఎటూ తేల్చని ద్విసభ్య ధర్మాసనంకొబ్బరి నూనెను హెయిర్ ఆయిల్ విభాగంలో చేర్చాలా, వంటనూనెగా పరిగణించాలా అనే దానిపై 2018లో జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ప్యాకేజీ పరిమాణంతో సంబంధం లేకుండా కొబ్బరి నూనెను తినదగిన నూనెగా వర్గీకరించాలని జస్టిస్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. కొబ్బరి నూనెను హెయిర్ ఆయిల్గా పరిగణించాలని జస్టిస్ భానుమతి పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్లింది.15 ఏళ్ల న్యాయవివాదం15 ఏళ్ల సుదీర్ఘ న్యాయ వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్ ఆర్. మహదేవన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. కొబ్బరి నూనెను చిన్న బాటిళ్లలో ప్యాక్ చేసి విక్రయిస్తే ఎడిబుల్ ఆయిల్గా పరిగణించాలని స్పష్టం చేసింది. అయితే వంటనూనె, హెయిర్ ఆయిల్ మధ్య తేడా స్పష్టంగా తెలిసేలా ఏదైనా చేయాలని ధర్మాసం సూచించింది. తినదగిన నూనెగా విక్రయించబడే కొబ్బరి నూనె తప్పనిసరిగా 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టానికి అనుగుణంగా ఉండాలని ఆదేశించింది.చదవండి: అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్రూ. 740 కోట్లు పెండింగ్రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం.. ఈ వ్యవహారంలో వడ్డీ, జరిమానాలు కాకుండా పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ. 740 కోట్లు రావాల్సి ఉంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కేసులు పెండింగ్‌లో ఉండడంతో కొకొనట్ ఆయిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ ప్రకారం చూసుకుంటే ఎడిబుల్ ఆయిల్‌పై 5 శాతం, హెయిర్ ఆయిల్‌పై 18 శాతం పన్ను ఉంది. స్వల్ప పరిమాణంలో విక్రయించే కొబ్బరినూనెను ఎడిబుల్ ఆయిల్ జాబితాలో చేర్చడం వల్ల పన్నుల భారంతో పాటు ధర కూడా తగ్గుతుంది. ఫలితంగా తయారీదారుడితో పాటు వినియోగదారుడికి ఊరట లభిస్తుంది. -
Beauty Tips: చర్మం కాంతివంతంగా మెరిసేలా.. ఈ బ్యూటీ టిప్స్!
దగదగా మెరిసే ముఖానికై చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మన ఇంట్లోనే ఉన్న పసుపు, కొబ్బరిపాలు, రోజ్‌వాటర్‌తో ముఖం కాంతివంతంగా మెరిసేలా చేయవచ్చని మీకు తెలుసా! అయితే ఇలా ప్రయత్నించి చూడండి..ఇలా చేయండి..టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్ పీల్ పౌడర్, కప్పు రోజ్‌వాటర్, టీస్పూను కొబ్బరిపాలు, ఆరు చుక్కల నిమ్మనూనెను తీసుకుని ఒక బౌల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌క్యూబ్స్ ట్రేలోపోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఈ క్యూబ్‌లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి.ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్‌క్యూబ్స్‌తో ఇరవై నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేయాలి.ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగి తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్‌ను రాసుకోవాలి.ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకు΄ోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్, ట్యాన్పోయి ముఖం ప్రకాశవంతంగా... తాజాగా కనిపిస్తుంది.చర్మం జిడ్డు కారడం నియంత్రణలో ఉండడమేగాక, దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి.పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య ఛాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. -
చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టకూడదంటే ఇలా చేయండి!
శీతాకాలంలో జుట్టు, ముఖం డ్రైగా మారి ఇబ్బంది పెడుతుండటమే గాక కొన్ని ఆహార పదార్థాలు కూడా గడ్డకట్టుకుపోయి వాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటాయి. ఈ కాలంలో ప్రతిది మైల్డ్‌గా ఉంటుంది. ఓ పట్టనా ఏది తొందరగా వేడెక్కదు. దీనికి తగ్గట్టు వాతావరణం అలానే ఉంటుంది. ఇలాంటప్పడూ కొన్ని చిట్టి చిట్కాలు ఫాలో అయితే ఈజీగా పరిష్కారం దొరుకుంతుంది. మనకు కూడా చాలా వెసులుబాటుగా ఉంటుంది. ఆ ఇంటి చిట్కాలేంటో చూసేద్దామా! తలకు పెట్టుకోవడానికి సరిపడా కొబ్బరిపాలలో కొన్నిచుక్కల నిమ్మరసం కలపాలి. ఈ పాలను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట తరువాత మైల్డ్‌షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు మూడుసార్లు కొబ్బరి పాలను ఇలా తలకు పట్టిస్తూ ఉంటే కురులకు మంచి పోషణ అంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జిడ్డుతత్వం గల కురులు ఉన్నవారికి ఈ కొబ్బరిపాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎండబెట్టిన కమలాతొక్కలను దోరగా వేయించి మెత్తటి పొడిలా చేయాలి. దీనిలో టీస్పూను పసుపు, రెండు టీస్పూన్ల శనగపిండి, కొద్దిగా నీళ్లుపోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసి ఆరనివ్వాలి. ఇరవై నిమిషాల తరువాత తడిచేతులతో రుద్ది కడిగేయాలి. మృతకణాలు, ట్యాన్ తొలగిపోయి ముఖం కాంతిమంతంగా మారుతుంది. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం మిలమిలలాడుతుంది. టేబుల్ స్పూను ఉసిరి నూనె లేదా బాదం నూనె తీసుకుని కొబ్బరి నూనెలో కలిపితే చలికాలంలో కొబ్బరినూనె గడ్డకట్టదు. ఉసిరి, బాదంలోని గుణాలు నూనెని గడ్డకట్టనివ్వవు. అందువల్ల వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కొబ్బరి నూనె గట్టిగా కాదు. మాయిశ్చరైజర్ లేదా లోషన్లో రెండు చుక్కల గ్లిజరిన్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులకు రాసుకోవాలి. ఈ మిశ్రమం చర్మానికి తేమనందించి చర్మం పొడిబారకుండా చేస్తుంది. (చదవండి: ఆత్రేయపురం పూతరేకులను తలపించే ఇరానీ పుతరేకు! ఎలా చేస్తారంటే..) -
కొబ్బరి నూనెలో ఇవి కలిపి ముఖానికి రాసుకుంటే.. ముఖం వెలిగిపోతుంది
సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ ►కొబ్బరినూనె మంచి సౌందర్య సాధనంగా పనిచేస్తుంది. సెలబ్రెటీలు చాలామంది తమ చర్మాన్ని అందంగా... ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొబ్బరినూనెను విరివిగా వాడుతుంటారు. కొబ్బరినూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పొడి చర్మానికి ఔషధంలా పనిచేస్తాయి. కొబ్బరినూనె చర్మానికి సహజసిద్ధమెన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ► టీ స్పూను కొబ్బరినూనెలో అర టీస్పూను పెరుగు, టీస్పూను ఓట్స్ పొడి వేసి మెత్తని పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరాక గుండ్రంగా మర్దన చేస్తూ గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖచర్మానికి తేమ అంది ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ► రెండు టీస్పూన్ల కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం, టీ స్పూను వంటసోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కు, గడ్డం, నుదురు వంటి బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పట్టించి పది నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడమేగాక, చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. ఫలితంగా చర్మరంధ్రాల్లో పేరుకున్న అధిక జిడ్డు, దుమ్మూ ధూళీ పోయి చర్మం చక్కని నిగారింపుని సంతరించుకుంటుంది. ► ముఖం మీద నల్లమచ్చలు, కంటిచుట్టూ ఏర్పడిన నల్లని వలయాలపై కొబ్బరినూనెతో క్రమం తప్పకుండా మర్దన చేస్తుంటే .. మచ్చలు తగ్గుముఖం పడతాయి. -
నేషనల్ క్రష్ రష్మిక అందం కోసం ఏం చేస్తుందో తెలుసా?
హీరోయిన్ రష్మికా మందన్నా అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్‌గా మారి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ కావడంతో రష్మిక దశ తిరిగింది. ఈ సినిమా సక్సెస్‌తో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారిపోయింది.సౌత్, నార్త్ ఇలా అన్ని భాషల్లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది. చదవండి: డబుల్ చిన్తో పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? ఇలా చేస్తే అందంగా, నాజుగ్గా.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న రష్మికకు యూత్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప-2 సినిమాతో పాటు, బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో చేతినిండా అవకాశాలతో బిజీగా గడిపేస్తుంది. కాస్త తీరిక దొరికనప్పుడు మాత్రం స్కిన్‌కేర్, హెయిర్ కేర్ గురించి ప్రత్యేక శ్రద్ద వహిస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ. గోరు వెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దనా చేసుకుంటే చాలు. ఏ మాయిశ్చరైజర్, హెయిర్ కండీషనర్ అవసరం లేకుండానే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. వీలు దొరికినప్పుడల్లా నేను ఇదే చేస్తా. ఇది మా అమ్మ, అమ్మమ్మ చెప్పిన చిట్కా! చదవండి: రోజూ హెల్మెట్ వాడుతున్నారా? బాక్టీరియా, క్రిములు.. – రష్మిక మందన్నా -
పచ్చి కొబ్బరితో పాలు, ఆయిల్.. రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే..
జంతువుల పాలతో తయారైన ఉత్పత్తుల కన్నా మొక్కల ద్వారా తయారయ్యే పాలు (ప్లాంట్ బేస్డ్ మిల్క్) ఆరోగ్యదాయకమైనవే కాకుండా పర్యావరణహితమైనవి కూడా అన్న అవగాహన అంతకంతకూ ప్రాచుర్యం పొందుతున్నది. ఈ కోవలోనిదే కొబ్బరి పాల ఉత్పత్తి. పచ్చి కొబ్బరి పాలతో తయారయ్యే వర్జిన్ నూనె, యోగర్ట్ (పెరుగు) వంటి ఉత్పత్తులకు ఐరోపా తదితర సంపన్న దేశాల్లో ఇప్పటికే మంచి గిరాకీ ఉంది. కొబ్బరి పాల ఉత్పత్తుల మార్కెట్ ఈ ఏడాది 84 కోట్ల డాలర్లకు చేరనుంది. వచ్చే ఆరేళ్లలో 105 కోట్ల డాలర్లు దాటుతుందని ‘గ్లోబ్ న్యూస్‌వైర్’ అంచనా. మన దేశంలోనూ (ముఖ్యంగా కేరళ, తమిళనాడుల్లో) వాణిజ్య స్థాయిలో కొబ్బరి పాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ నేపధ్యంలో డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తొలి కొబ్బరి పాలు, వర్జిన్ కొబ్బరి నూనె ఉత్పత్తి యూనిట్ ప్రారంభం కావటం ఆహ్వానించదగిన పరిణామం. రాష్ట్రంలో కొబ్బరి అధికంగా పండించే కోనసీమలోనూ కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. కేవలం కాయర్ (కొబ్బరి పీచు) ఆధారిత పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేస్తూ కొబ్బరి పాలను, దాని నుంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారీ తొలి పరిశ్రమను నెలకొల్పారు అభ్యుదయ రైతు గుత్తుల ధర్మరాజు(39). డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన ధర్మరాజు ఎంటెక్ చదువుకున్నారు. 13 ఏళ్లపాటు చమురు, సహజవాయువు రంగంలో ఇంజినీర్‌గా సేవలందించారు. రెండేళ్ల క్రితం ముమ్మిడివరంలో ఆయన రూ. 1.5 కోట్ల పెట్టుబడితో ‘కోనసీమ ఆగ్రోస్’ పేరుతో పరిశ్రమను నెలకొల్పారు. ‘వెల్విష్’ పేరు మీద వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి పాలను ఉత్పత్తి చేస్తున్నారు. కొబ్బరి పాలు, వర్జిన్ కోకోనట్ ఆయిల్‌తో పాటు పాలు తీసిన కొబ్బరి పిండిని విక్రయిస్తున్నారు. ముమ్మిడివరంతోపాటు అమలాపురం, రాజమహేంద్రవరాల్లో సొంతంగానే ప్రత్యేక దుకాణాలు తెరిచి కొబ్బరి పాలు, వర్జిన్ ఆయిల్‌లకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ రిటైల్‌గా అమ్ముతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో వెల్కం డ్రింకుగా కొబ్బరి పాలను అందించే ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారాయన. రోజుకు 250 లీటర్ల కొబ్బరి పాల ఉత్పత్తి పచ్చి కొబ్బరి ముక్కలతోపాటు కొద్దిగా నీరు కలిపి మిక్సీ పట్టి కొబ్బరి పాలను తయారు చేసి కొబ్బరి అన్నం తదితర వంటలు చేస్తుండటం మనకు తెలిసిందే. పచ్చి కొబ్బరి పాల నుంచి శుద్ధమైన, ఆరోగ్యదాయకమైన పారిశ్రామిక పద్ధతుల్లో తయారు చేస్తారు. దీన్నే వర్జిన్ కోకోనట్ ఆయిల్గా పిలుస్తారు. పక్వానికి వచ్చిన కొబ్బరి కాయను పగల గొట్టి, చిప్పల నుంచి కొబ్బరిని వేరు చేస్తారు. కొబ్బరికి అడుగున ఉన్న ముక్కుపొడుం రంగు పలుచని పొరను తీసి వేసి గ్రైండర్ల ద్వారా కొబ్బరి పాలను తయారు చేస్తారు. పది కేజీల (సుమారు 28) కొబ్బరి కాయల నుంచి 1.5 లీటర్ల పాలు.. ఆ పాల నుంచి ఒక లీటరు వర్జిన్ నూనెను ఉత్పత్తి చేస్తున్నట్లు ధర్మరాజు చెప్పారు. ఆయన నెలకొల్పిన పరిశ్రమకు రోజుకు 5 వేల కొబ్బరికాయల నుంచి పాలను, నూనెను తయారు చేసే సామర్థ్యం ఉంది. మార్కెట్ అవసరం మేరకు ప్రస్తుతం రోజుకు 3 వేల కాయలతో 250 లీటర్ల పాలు తీస్తారు. పాల నుంచి 125–150 లీటర్ల వర్జిన్ కొబ్బరి నూనె వస్తుంది. కొబ్బరి పాలలో 60% నూనె, 40% నీరు ఉంటాయి. ఈ పాలను సెంట్రీఫ్యూగర్స్లో వేసి వేగంగా (18.800 ఆర్పీఎం) తిప్పినప్పుడు నూనె, నీరు వేరవుతాయి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇలా ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో ఎటువంటి రసాయనాలూ వాడరు. చిక్కటి కొబ్బరి పాలు లీటరు రూ.250లకు విక్రయిస్తున్నారు. ఈ పాలను నేరుగా తాగకూడదు. 3 రెట్లు నీరు కలిపి తాగాలి. 1:3 నీరు కలిపిన కొబ్బరి పాలు లీటరు రూ.100కు, గ్లాస్ రూ.30కు అమ్ముతున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కేజీ అమ్మకం ధర రూ.450. ఇది రెండేళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఉప ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. 3 వేల కాయల కొబ్బరి నుంచి పాలు తీసిన తర్వాత 75 కిలోల లోఫాట్ కొబ్బరి పొడి వస్తుంది. దీని ధర కిలో రూ. 125–150. కొబ్బరి చిప్పలు కూడా వృథా కావు. వీటితో తయారయ్యే యాక్టివేటెడ్ కార్బన్‌కు కూడా మంచి ధర వస్తుందన్నారు ధర్మరాజు. – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి అమలాపురం. పాల వినియోగం ఇలా ► కొబ్బరి పాలను సాధారణ పాలు వినియోగించినట్టే వాడుకోవచ్చు. టీ, కాఫీలతోపాటు పాయసం, మిఠాయిలు తయారు చేసుకోవచ్చు. విదేశాల్లో ఐస్‌క్రీమ్‌ల, సౌందర్య సాధనాల తయారీలో కూడా కొబ్బరి పాల వినియోగం ఎక్కువ. ► కొబ్బరి పాలను నీరు కలపకుండా నేరుగా తీసుకోకూడదు. దీనిలో 60 శాతం ఆయిల్ ఉంటుంది. మిగిలిన 35 శాతం నీరు. 1:3 పాళ్లలో నీరు కలిపి వాడుకోవాలి. ఒక గాసు కొబ్బరి పాలలో మూడు గ్లాసుల నీరు, కొంత పంచదార కలిపి రిటైల్ ఔట్లెట్లో అమ్ముతున్నారు. పుష్కలంగా పోషకాలు ► కొబ్బరి పాలల్లో పుష్కలంగా పీచు, పిండి పదార్థాలతో పాటు.. విటమి¯Œ –సీ, ఇ, బి1, బి3, బి4, బి6లతోపాటు ఇనుము, సెలీనియం, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాసియం, జింక్, సోడియం ఉన్నాయి. ∙కొబ్బరి పాలు వీర్యపుష్ఠిని కలిగిస్తాయి. అలసటను నివరించి శరీరానికి బలం చేకూరుస్తాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేయడంతోపాటు గుండె జబ్బులను నివారిస్తాయి. ∙రక్తహీనతను నివారించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చంటి పిల్లలకు తల్లి పాలు చాలకపోతే కొబ్బరి పాలు తాపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆదరణ పెరుగుతోంది కొబ్బరి పాలకు ప్రజాదరణ పెరుగుతోంది. రిటైల్ అమ్మకాలు పెరగడంతోపాటు శుభ కార్యక్రమాలకు వెల్కం డ్రింక్‌గా కూడా అమ్మకాలు పెరిగాయి. ముమ్మిడివరం, అమలాపురం, రాజమహేంద్రవరాల్లో రిటైల్ ఔట్లెట్లు ఏర్పాటు చేశాం. వాకర్లు ఎక్కువగా సేవిస్తున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ పసిపిల్లలకు మసాజ్ చేయడానికి చాలా అనువైనది. దీన్ని రోజుకు రెండు స్పూన్లు తీసుకుంటే.. మహిళల్లో హార్మోన్ అసమతుల్యత ఉపశమిస్తున్నట్లు మా వినియోగదారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బేబీ మసాజ్ అయిల్‌గా కోకోనట్ వర్జిన్ ఆయిల్‌కు మంచి మార్కెట్ ఉంది. ఒడిదొడుకులున్నప్పటికీ మంచి భవిష్యుత్తు ఉన్న రంగం ఇది. – గుత్తుల ధర్మరాజు (85559 44844), కొబ్బరి పాల ఉత్పత్తిదారు, ముమ్మిడివరం, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కొబ్బరి పాలు.. కొత్త ట్రెండ్.. పశువులలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల ప్రభావం వాటి పాల మీద ఉంటుంది. ఇది స్వల్పమోతాదే కావచ్చు. అలాగే, పశువుల పొదుగు పిండడం ద్వారా పాలను సేకరించడం ఒక విధంగా వాటిని హింసించడమేనని భావించే వారి సంఖ్య కూడా పెరిగింది. వీరు మొక్కల నుంచి వచ్చే పాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొబ్బరి పాలు వీరికి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇదొక కొత్త ట్రెండ్. కొబ్బరి తెగుళ్ల ప్రభావం పాల మీద ఉండదు. కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మేలు. కానీ, ఏదైనా మితంగా తీసుకోవాలి. – డాక్టర్ బి.శ్రీనివాసులు, అధిపతి, డా.వై.ఎస్.ఆర్. ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట. ∙కోనసీమ ఆగ్రోస్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వర్జిన్ కోకోనట్ ఆయిల్ -
Beauty: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం
Eye Care- Beauty Tips In Telugu: కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని భావాలను కళ్లు వ్యక్తపరుస్తాయి. అలాంటి కళ్లకు సంబంధించిన సంరక్షణ తీసుకుంటే కలువల్లాంటి కళ్లు మీసొంతం అవుతాయి ఇలా... ఒత్తైన కనుబొమ్మలు ►పడుకోబోయే ముందు రోజ్ వాటర్‌లో కాటన్ని ముంచి, కళ్ల చుట్టూ శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి పోయి కళ్లు తేజోవంతమవుతాయి. ►రాత్రి కనుబొమలకు, కను రెప్పలకు ఆముదం పట్టించి, తెల్లవారి కడిగేస్తే కనుబొమలు, రెప్పలు ఒత్తుగా అవుతాయి. ముడతలు మాయం ►కళ్ల చుట్టూ తేనెతో మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కళ్లచుట్టూ ఉన్న ముడతలు మటుమాయం అవుతాయి. నల్లని వలయాలు తగ్గుముఖం ►పచ్చిపాలలో కాటన్ ముంచి, కళ్లచుట్టూ సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి. ►కీరా జ్యూస్‌లో, రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి, 30 నిమిషాల తరువాత కడిగేయాలి. ►టొమాటో జ్యూస్‌లో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి అర గంట తరువాత కడిగెయ్యాలి. ►కొబ్బరినూనెతో కళ్ల చుట్టూ సుతిమెత్తగా మర్దనా చేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే కళ్లకి అలసటతగ్గడమే కాకుండా నల్లటి వలయాలు కూడా నయం అవుతాయి. చదవండి: Menthi Podi: షుగర్ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే.. Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్‌లో ఈ సమస్యలు.. -
అందం అంటే మేని మెరుపు ఒక్కటే కాదు.. ఎవర్గ్రీన్ బ్యూటీ చెప్పిన చిట్కాలివే!
Beauty Tips- Rekha: అలనాటి బాలీవుడ్ హీరోయిన్ రేఖ ఏడు పదుల వయసుకు చేరువవుతున్నా అందంతో మెరిసిపోతూ ఎవర్గ్రీన్ బ్యూటీ అనిపించుకుంటున్నారు. ఫంక్షన్ ఎక్కడైనా.. పార్టీ ఏదైనా తనదైన స్టైల్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారామె. నిండైన చీరకట్టుతో అందానికి మారుపేరులా అనిపించే రేఖ.. కురుల ఆరోగ్యం గురించి తన తల్లి చెప్పిన చిట్కాల గురించి అభిమానులతో పంచుకున్నారు. అవును.. అతివల సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేయడంలో నల్లని, ఒత్తైన కురులది కూడా కీలక పాత్రే! ఆ కురులకు సంబంధించి రేఖ చెప్పిన టిప్స్ ఆమె మాటల్లోనే.. ‘‘అందం అంటే మేని మెరుపు ఒక్కటే కాదు కదా.. కురుల ఆరోగ్యం కూడా! దానికి నేను నమ్ముకున్నది హోమ్ రెమిడీస్‌నే. వారంలో రెండుమూడు సార్లు తలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటాను. చాలా తరచుగా పెరుగు, తేనె, గుడ్డులోని తెల్లసొనను కలిపి జుట్టుకు ప్యాక్‌గా వేసుకుంటాను. స్ట్రెయిటెనర్స్, కర్లర్స్, హెయిర్ డ్రయర్లు అస్సలు వాడను. వాటివలన జుట్టు సహజత్వం దెబ్బతింటుంది’’ అని రేఖ పేర్కొన్నారు. చదవండి: Shirley Setia: బ్లూ సారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్! చీర ధర ఎంతంటే Health Tips: రోజూ స్కిప్పింగ్ చేసే అలవాటుందా? ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరిగి.. -
Hair Care: ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టించారంటే!
Hair Care And Beauty Tips In Telugu: జుట్టు రాలడం తగ్గాలంటే ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి. బాదం నూనెతో వీటిని కలిపి కురులకు పట్టిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయ రసంలో.. మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకుని సన్నగా తురిమి రసం తియ్యాలి. ఈ రసాన్ని రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనెలో వేసి కలిపి, కుదుళ్ల నుంచి చివర్లవరకు పట్టించి ఇరవై నిమిషాలపాటు మర్దన చేయాలి. నలభై నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. ఉసిరిపొడితో.. బాదం నూనెలో ఉసిరిపొడి లేదా రెండు టీస్పూన్ల తాజా నిమ్మరసం వేసి కలిపి జుట్టుకు పట్టించాలి. మర్దనచేసి అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈవిధంగా చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. కురులకు పోషణ అంది నల్లగా నిగనిగలాడుతూ పెరుగుతాయి. ఆవనూనె వల్ల.. ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది జుట్టు బాగా పెరగడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు, చుండ్రు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఆవాలను మోతాదుకు మించి ఒకేసారిగా ఎక్కువగా వాడితే టాక్సిక్ కారణంగా ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొటిమలను తగ్గించుకోవాలంటే.. కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ నూనెను వడగట్టి రాత్రి నిద్ర పోవడానికి ముందు నీటితో ఈ నూనెను కలిపి ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చదవండి: Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా.. Hair Care Tips: జుట్టు రాలడం.. చుండ్రు సమస్య వేధిస్తోందా? కొబ్బరి నూనె, ఆముదం కలిపి.. -
Beauty Tips: దాల్చిన చెక్క, పప్పు, పాలు, పంచదార.. బ్లాక్‌హెడ్స్‌కు చెక్!
How To Get Rid of Blackheads: ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ బ్లాక్‌హెడ్స్ వస్తూనే ఉంటాయి. వీటివల్ల ముఖం డల్‌గా, కళావిహీనంగా కనిపిస్తుంది. వీటిని తీయించుకోవడం ఖర్చుతో కూడుకున్నదేగాక, సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో ఉండే దాల్చిన చెక్క, నిమ్మకాయ, పప్పు, పాలు, పంచదార, కొబ్బరి నూనె, ఉప్పుతో సులభంగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం... కొల్లాజెన్ విడుదలలో.. ►చర్మంలో అతిముఖ్యమైన ప్రోటిన్ కొల్లాజెన్ విడుదలను మెరుగుపరచడంలో దాల్చిన చెక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మం మీద ఏర్పడే రంధ్రాలను దాల్చిని తగ్గిస్తుంది. నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంమీద రంధ్రాలను లోతుగా శుభ్రం చేస్తాయి. ►అందువల్ల అరచెక్క నిమ్మరసంలో టీస్పూను దాల్చిన చెక్కపొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు మర్దనా చేయాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి. ఎర్రకందిపప్పు ఉంటే.. ►పాలు చర్మానికి పోషణ అందిస్తే పప్పు దినుసులు బ్లాక్‌హెడ్స్‌ను వేళ్లతోసహా పీకేస్తాయి. ఎర్రకందిపప్పుని ఒక టేబుల్ స్పూను తీసుకుని నాలుగు గంటలపాటు నానబెట్టాలి. నానినపప్పులో నీటిని తీసేసి రెండు స్పూన్ల పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పప్పులోని యాంటిఆక్సిడెంట్స్ చర్మానికి అందుతాయి. మర్దనతో బ్లాక్ హెడ్స్ పోతాయి. సున్నిత చర్మతత్వం కలిగిన వారికి ఈ స్క్రబ్ చక్కగా పనిచేస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది ►స్పూను పంచదారలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. పంచదార లోతుగా శుభ్రంచేసి మూసుకుపోయిన రంధ్రాలను తెరవడంతోపాటు, మృతకణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, మృదువుగా మారుస్తాయి. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది! అరచెక్క నిమ్మరసంలో అరటీస్పూను సాల్ట్‌వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ఈ స్క్రబ్ వదులుగా ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడంతోపాటు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి చర్మం కాంతిమంతంగా మెరిసేలా చేస్తుంది. చదవండి: Radhika Madan: నా చర్మ సౌందర్య రహస్యం ఇదే.. వారానికోసారి ఇలా చేశారంటే.. -
Beauty Tips: కొబ్బరి నూనె.. కాఫీ పొడి.. ముఖం మెరిసిపోతుంది!
అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని కోరుకుంటారు అమ్మాయిలు. కొన్నిసార్లు మచ్చలు, మృతకణాల కారణంగా ముఖారవిందం దెబ్బతింటుంది. అలాంటి సమయాల్లో బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తారు. ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. ఇలాంటి అవసరం లేకుండా ఇంట్లోనే చక్కగా మెరిపించే ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు. టీస్పూను కాఫీ పొడిలో టీస్పూను కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కడిగిన ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు మర్దన చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. టీస్పూను కాఫీ పొడిలో టీస్పూను కొబ్బరి నూనె, టీస్పూను పసుపు, టీస్పూను పెరుగు వేసి పేస్టులా కలుపుకోవాలి. ముఖానికి ఈ పేస్టుని అప్లై చేసి పదిహేను నిమిషాలపాటు ఆరనిచ్చి కడిగేయాలి. ఈ రెండు స్టెప్పులను వారానికి రెండుసార్లు చేయడం వల్ల మృత కణాలు, మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. చదవండి: Influencers: పేరుకు పేరు.. చెప్పుకోదగ్గ ఆదాయం.. మీరూ అవుతారా ఇన్ఫ్లుయెన్సర్! -
మల్లెపూలు.. ప్రయోజనాలు బోలెడు!
మల్లెపూలు మానసిక ఆహ్లాదాన్నిస్తాయని అందరికీ తెలిసిందే, అయితే ఈ పూలను ఔషధాలుగా కూడా వాడుకోవచ్చునని కొందరికే తెలుసు. ఔషధాలుగా ఎలా వాడచ్చో చూద్దాం. ► తాజా మల్లెలను మెత్తగా నూరి.. తడిబట్ట పై చుట్టి, కళ్లమీద పెట్టుకుంటే.. కళ్లలో నీళ్లు కారడం, తడి ఆరిపోవడం, కళ్లు మూసినా, తెరిచినా చికాకు కలగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ► మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని.. ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుంది. ► తలనొప్పి... తలంతా పట్టేసినట్లు అనిపించడం వంటి సమస్యలకు మల్లెపూలతో తలకు వాసెనకట్టు కడితే.. మంచి ఉపశమనంగా ఉంటుంది. మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా.. తలనొప్పిని తగ్గిస్తుంది. ► కళ్లమంటలు, నొప్పులు తగ్గడానికి మల్లెల కషాయాన్ని వాడవచ్చు. పూలు, ఆకులతో కషాయం కాచాలి. ఈ కషాయాన్ని వడగట్టి చల్లార్చి.. రెండువంతుల కషాయంలో ఒక వంతు నువ్వులనూనె, ఒకవంతు కొబ్బరినూనె, ఒక స్పూను బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. ► మానసిక వ్యాకులత, డిప్రెషన్, అతి కోపం, మానసిక చంచలత్వం.. వీటన్నిటినీ శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉంది. చక్కటి సువాసన వెదజల్లే గుప్పెడు పూలను తల దిండు పక్కనే పెట్టుకుని నిద్రించాలి. లేదంటే దీర్ఘ శ్వాసతో సువాసనను పీల్చాలి. ఇలా రోజుకు పదిసార్లు చేస్తే.. మంచి నిద్ర పడుతుంది. మనసు స్థిమితంగా మారుతుంది, ► మధుమేహులకు మల్లెపూలతో చేసిన ఛాయ్ తాగితే మంచిది. రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించే గుణం మల్లెలకు ఉంది. ► కొబ్బరినూనెలో గుప్పెడు మల్లెపూలను వేసి ఒకరోజంతా నానబెట్టాలి. ఆ తరువాత కాచి వడగట్టాలి. చల్లారాక తలకు మర్దన చేసుకుంటే.. జుట్టు కుదుళ్లకు పోషకాలు అందుతాయి. మాంసాహారం తింటున్నారా? ఆ తర్వాత ఇవి తినండి... -
అభిమానులకు అనుష్క ఆయుర్వేద చిట్కా..
ముంబై: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మెరుగైన ఆరోగ్యం కోసం బాలీవుడ్ సెలబ్రెటీలు అనేక చిట్కాలను అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ అద్భుత ఆయుర్వేద చిట్కాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయిల్ పూలింగ్ ద్వరా దంత సమస్యలను నివారించడంతో పాటు నోటిలో ప్రవేశించే చెడు బ్యాక్టేరియా, వైరస్లు రాకుండా అడ్డుకుంటుందని తెలిపారు. కాగా దంత సమస్యలు, టాక్సిన్స్‌లను నివారించేందుకు ఆయిల్ పూలంగ్ ఎంతో ఉపయోగపడుతుందని అనుష్క పేర్కొన్నారు. తాను ఆయిల్ పూలంగ్ చిట్కాను పాటిస్తానని, మెరుగైన ఆరోగ్యం కోసం అభిమానులు పాటించాలని సూచించారు. ప్రతి మనిషి నోటిలో 700 రకాల బ్యాక్టేరియాలు జీవిస్తాయి. అందులో ఎప్పటికీ 350 యాక్టివ్‌గా ఉంటాయని ఇటీవల ఓ అధ్యయనం తెలిపింది. ఆయిల్ పూలింగ్ ఉపయోగాలు కొబ్బరి నూనె ఉపయోగాలు మనందరికి తెలిసిందే. కాగా ఆయిల్ పూలింగ్ ప్రక్రియలో కొబ్బరి నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కొబ్బరి నూనెను నోట్లో 20 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి. నోట్లో విడుదలయ్యే టాక్సిన్స్‌ను (విషపదార్థాలను) ఎదుర్కొనేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం టాక్సిన్స్ మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థలో యాసిడ్ సమస్యను నివారించేందుకు ఆయిల్ పూలింగ్ ఉపయోగపడుతుంది. మరోవైపు వ్యాధికారకాలను ఎదుర్కోవడంలో కొబ్బరి నూనె సమర్థవంతంగా పనిచేస్తుందని, గుండె, మెదడు పనితీరును మెరుగుపర్చే గుణం కొబ్బరి నూనెలో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సంపూర్ణ ఆరోగ్యానికి ఆయిల్ పూలింగ్, ప్రాచీన వైద్య విధానం ఎంతో ఉపయోగమని, దీర్ఘకాల తలనొప్పి, ఆస్తమా, మధుమేహం(డయాబెటిస్) లాంటి వ్యాధులను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు -
ఇలా తలస్నానం చేయండి!
నూనెతో మర్దన: గోరువెచ్చని కొబ్బరినూనె లేదా నువ్వులనూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను మాడుకు, కుదుళ్లకు పట్టించి మర్దన చేయాలి. తర్వాత జుట్టుకంతా నూనె రాయాలి. ఆవిరితో మెరుగు: టర్కీ టవల్‌ను వెచ్చని నీటిలో ముంచి, పిండి, తలకు చుట్టాలి. దీంతో రక్తప్రసరణ మెరుగై కుదుళ్లు చురుకు అవుతాయి. ఈ విధంగా నెలకు ఒకసారైనా జుట్టుకు ఆవిరిపట్టాలి. దీని వల్ల వెంట్రుకల రాలడం సమస్య తగ్గుతుంది. ఆరబెట్టేదిలా: జుట్టు తడిలేకుండా త్వరగా ఆరాలని డ్రయ్యర్‌ని ఉపయోగించవద్దు. మెత్తటి కాటన్ లేదా టర్కీ టవల్ని ఉపయోగించడమే మంచి మార్గం. తలకు టవల్ చుట్టి కాసేపు వదిలేయాలి. తడిని టవల్ పీల్చుకుని, జుట్టు పొడిగా అవుతుంది. ►జుట్టు మెరవాలని హెయిర్ స్ప్రేలు వాడకూడదు. వీటి వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోయి, మరింత పొడిబారుతాయి. వెంట్రుకలు చిట్లే సమస్య కూడా పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి. బ్యూటిప్స్ -
ముఖ కాంతికి పెరుగు, క్యారెట్
సౌందర్య ఉత్పత్తులలో రసాయనాలు, రోజువారీ జీవనశైలిలో ఎదుర్కొనే కాలుష్యం వల్ల ముఖ కాంతి తగ్గుతుంది. సహజమైన మెరుపుతో పాటు ముఖానికి నునుపుదనాన్ని తీసుకువచ్చే మేలైన ఫేస్ ప్యాక్స్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ►కొబ్బరినూనె, తేనె కలిపి ముఖానికి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పొడి చర్మం గలవారు రోజూ రాత్రి పడుకునేముందు ఈ విధంగా చేస్తుంటే చర్మం మృదువు, కాంతిమంతంగా తయారవుతుంది. ►రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు, టీ స్పూన్ కీరా రసం కలిపి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది ఈ ప్యాక్. ►టీ స్పూన్ గోధుమపిండిలో పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి వేళ్లతో మృదువుగా రుద్దాలి.æపాలు చర్మానికి బాగా ఇంకాయనిపించాక చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం కోల్పోయిన చర్మానికి ఈ ప్యాక్ వల్ల మంచి కాంతి లభిస్తుంది. ►రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో టీ స్పూన్ తేనె, రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. మృదువుగా రబ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది. ►రెండు టేబుల్స్పూన్ల టొమాటో జ్యూస్, టేబుల్ స్పూన్ ఓట్స్ అరకప్పు పెరుగులో కలపాలి. మిశ్రమం గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మెరుపు పెరుగుతుంది. -
కనుబొమలకు ఆముదం
కనుబొమ్మలు సరైన ఆకృతిలోనే కాదు దళసరిగా ఉండేలా షేప్ చేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. బాలీవుడ్– టాలీవుడ్ అనే తేడా లేకుండా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. కొంతమందికి కనుబొమలు ఒత్తుగా ఉంటాయి. లేదంటే ఖరీదైన కనుబొమ్మల కిట్‌ను కొనుగోలు చేసుకుని ఉపయోగిస్తారు. అలా చేయలేని వారు కూడా కనుబొమలు ఒత్తుగా పెరిగేలా ఇంట్లోనే ఒక సీరమ్‌ను తయారుచేసుకొని వాడుకోవచ్చు. ►2 టేబుల్ స్పూన్ల ఆముదం ►టీ స్పూన్ కొబ్బరి నూనె ►3–4 చుక్కల లావెండర్ ఆయిల్. ►చిన్న బాటిల్లో ఆముదం, కొబ్బరినూనె, లావెండర్ ఆయిల్ వేసి బాగా కలపాలి ►మస్కారా బ్రష్‌తో ఆ ఆయిల్‌ను అద్దుకుంటూ కనురెప్పలకు ఉపయోగించాలి ►టూత్‌పిక్‌తో ఆయిల్‌ను అద్దుకుంటూ జాగ్రత్తగా కనుబొమ్మల వెంట్రుకలకు వాడాలి. ఈ ఆయిల్‌ను రోజుకు రెండు సార్లు వాడుకోవచ్చు. ఆముదంలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, కొబ్బరినూనె, లావెండర్ ఆయిల్‌లోని విటమిన్లు, ప్రొటీన్లు వెంట్రుకల వృద్ధికి తోడ్పడతాయి. -
జుట్టుకు ఉసిరి నూనె
ఎండకాలంలో వేడి, దుమ్ముకు శిరోజాల ఆరోగ్యం, అందం దెబ్బ తింటుంది. వెంట్రుక కుదుళ్లకు సరైన పోషణ లభించి, నిగనిగలను కాపాడుకోవాలంటే... ►కొబ్బరి నూనె – ఉసిరి నూనె సమపాళ్లలో తీసుకొని, మాడుకు పట్టేలా రాసుకోవాలి. వారంలో రెండు సార్లయినా ఈ నూనెను తలకు పట్టించి,. మరుసటి రోజు పొద్దున తలస్నానం చేయాలి. ►పచ్చికొబ్బరిని మెత్తగా రుబ్బి, పాలు పిండి తీయాలి. ఈ పాలను వెంట్రుక కుదుళ్లకు పట్టేలా మాడుకు, జుట్టు మొత్తానికి పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేస్తుంటే వెంట్రుకల మృదుత్వం దెబ్బతినకుండా ఉంటుంది. ►తేనెలో ఆలివ్ ఆయిల్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారైనా ఈ విధంగా చేస్తే వెంట్రుకల సహజసిద్ధమైన నూనెలు కోల్పోకుండా ఉంటాయి. రసాయనాల గాఢత తగ్గి వెంట్రుకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ►మాడు ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తుంది చుండ్రు. చుండ్రును నియంత్రణలో ఉంచుకోవడానికి ఇంటి చిక్సితలు పాటిస్తూనే చర్మవైద్యులు చెప్పే సూచనలు పాటించాలి. ►పిండి పదార్థాలతో పాటు పీచు ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు.. వంటి పోషకాహారాన్ని సమంగా తీసుకోవాలి. ►వేసవిలో 2–3 లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలటం సమస్య తగ్గుతుంది. -
సిగనిగలు
వైట్ హెయిర్ రావడానికి అనేక కారణాలు. అయితే ఈ సమస్యను నేచురల్ పద్ధతిలో శాశ్వతంగా నివారించుకోవచ్చట. అది కూడా మన వంటగదిలో చౌకగా లభించే వస్తువులతోనే. అందుకోసం ఈ టిప్స్ ఫాలో అయితే సరి... గోధుమలు: తెల్లజుట్టును నివారించడంలో గోధుమలు బెస్ట్ నేచురల్ క్యూర్. గోధుమపిండితో అల్లం మిక్స్ చేసి దానికి ఒక స్పూన్ తేనె కలిపి తలకు పట్టించాలి. ఒక వారంలో మార్పును గమనించండి. కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేయాలి. ఇది తెల్ల జుట్టుకు మసాజ్ థెరపీలా పని చేసి తెల్ల జుట్టును నివారిస్తుంది. ఆమ్లా: ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన ఉసిరికాయ ముక్కల్ని కొబ్బరి నూనెలో కలపాలి. ఇప్పుడు నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. మెంతులు: తెల్లజుట్టును నివారించే మరో సహజమైన ఇంటి చిట్కా – మెంతులు. గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఈ నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగించండి. -
తెల్లజుట్టు సమస్యా.. ఇలా చేయండి!
ఒక వ్యక్తి అందాన్ని ఇనుమడిపంజేసేది శిరోజాలే అంటారు. ఇక ఆడవాళ్లైతే శిరోజాలనే తమ అందానికి గుర్తుగా భావిస్తానరడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటిది ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు రాలడం అనే సమస్య అందరినీ వేధిస్తోంది. అంతేకాదు జుట్టు తక్కువగా ఉన్నా సరే బాగుంటే చాలు అనుకునే వారు తెల్లజుట్టు రావడంతో మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి కాస్త విముక్తి పొందవచ్చు. బ్లాక్ టీ తెల్లజుట్టు నివారణలో బ్లాక్ టీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు బ్లాక్ టీ తీసుకుని(పాలు కలపకుండా) దానిలో ఒక టీ స్పూన్ ఉప్పు కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్లకు చేరేలా మర్దనా చేసి.. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. సేజ్ ఆకులు ఎండిన సేజ్(జాజికాయ) ఆకులను తీసుకుని మరుగుతున్న నీటిలో కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత రెండు గంటల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. అనంతరం దీనికి నాలుగైదు చుక్కల గ్లిజరిన్ కలపాలి. తద్వారా జుట్టు పోషణకు అవసరమైన విటమిన్-ఇ అందుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మర్దనా చేయాలి. ఇలా చేయడం ద్వారా సహజ పద్ధతిలోనే నల్లని జుట్టు పొందవచ్చు. హెన్నా తెల్ల జట్టు సమస్య నుంచి బయటపడేందుకు దాదాపుగా అందరూ పాటించే చిట్కా ఇది. మార్కెట్లో దొరికే నాణ్యమైన హెన్నా పౌడర్ తీసుకుని.. దానికి పెరుగు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు పదిహేను నిమిషాల పాటు నీటిలో మరగబెట్టాలి. 12 నుంచి 15 గంటల పాటు ఒక నానబెట్టిన తర్వాత.. జుట్టుకు పట్టించి మూడు గంటల పాటు అలాగే ఉంచాలి. అనంతరం షాంపూతో కడిగేస్తే సరి. అయితే రాత్రి మొత్తం నానబెట్టి తెల్లవారి హెన్నా పెట్టుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ తలస్నానం చేసే ఇబ్బంది ఉండదు. ఉసిరి నల్లని శిరోజాలు పెంపొందించడంలో ఉసిరిది ప్రధాన పాత్ర. ఎండిన ఉసిరి కాయలను నీళ్లలో నానబెట్టాలి. ఒక రోజంతా నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఉసిరిని నానబెట్టిన నీళ్లలో హెన్నా పౌడర్, గ్రైండ్ చేసిన ఉసిరి మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత దీనికి ఐదు చెంచాల నిమ్మకాయ రసం, కాఫీ, పచ్చి గుడ్డు తెల్లని సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడిగేసి.. షాంపూ అప్లై చేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె, అల్లం కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కలను వేడి చేసి కాసేపు మరగబెట్టాలి. ఒక రాత్రంతా ఈ మిశ్రమాన్ని నానబెట్టి... దీనికి కాసింత తేనె కలిపి జుట్టుకు పట్టించి మర్దనా చేయాలి. మెరుగైన ఫలితం కోసం ఉసిరితో పాటు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. -
నాసిరకం కొబ్బరి నూనెకు బ్రాండ్ కలరింగ్
కుత్బుల్లాపూర్: నాసిరకం కొబ్బరి నూనెను బ్రాండెడ్‌గా ఆకర్షిణీయంగా ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. కుత్బుల్లాపూర్ పరిధి జీడిమెట్ల డివిజన్ సుచిత్ర రోడ్డులోని జీన్స్ ఫ్యాక్టరీ గల్లీలో వివేక్ ఇండస్ట్రీస్ భవనం మొదటి అంతస్తులో తతంగం జరుగుతోంది. సుభాష్ అలియాస్ బవర్లాల్ అనే వ్యక్తి ఎనిమిది మంది పనివాళ్లతో నకిలీ కొబ్బరి నూనెను ప్రముఖ బ్రాండ్ ‘పారాష్యూట్’ డబ్బాల్లో ప్యాక్ చేసి మార్కెట్లో వివిధ దుకాణాల్లో విక్రయిస్తు వస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ (రంగారెడ్డి యూనిట్) ఎస్పీ ముత్యంరెడ్డి ఆదేశాలతో శుక్రవారం సీఐ రాజు నేతృత్వంలో సిబ్బంది అడ్డాపై దాడులు నిర్వహించారు. అక్కడే ప్రింటింగ్.. అక్కడే ప్యాకింగ్ పారాష్యూట్ బ్రాండ్‌తో నకిలీ నూనెను ప్యాకింగ్ చేస్తున్న స్థావరంపై విజిలెన్స్ అధికారుల దాడులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులకు నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి. సదరు ముఠా 15 కేజీల డబ్బాల్లో నాసిరకం కొబ్బరి నూనెను వివిధ మార్కెట్ల నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. అక్కడే మరో గదిలో ఏకంగా రెండు ప్రింటింగ్ యూనిట్లపై పారాష్యూట్ బ్రాండ్ లేబుళ్లను ముద్రిస్తున్నారు. పారాష్యూట్ బాటిళ్ల వంటి ప్లాస్టిక్ సీసాల్లో కల్తీ నూనెను నింపి ఆ లేబుళ్లు అతికించి సీల్ చేస్తున్నారు. సేకరించిన కొబ్బరి నూనెను పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పోసి హ్యాండ్‌పంప్ ద్వారా ఫిల్టర్ చేసి డబ్బాల్లో నింపుతున్నారు. అక్కడ జరుగుతున్న తతంగంతో అధికారులు కూడా కొద్దిగా తికమక పడ్డారు. దీంతో వారు పారాష్యూట్ ఆయిల్ ఏరియా సేల్స్ మేనేజర్లు రాజేష్, జగన్నాథరెడ్డిని అక్కడికి రప్పించి పరిశీలించాల్సిందిగా కోరారు. సదరు కంపెనీ ప్రతినిధులు ఇది నకిలీ ప్యాకింగ్ అని, దీనికి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. దాదాపు 100 వరకు 15 కేజీల డబ్బాలు, వేల సంఖ్యలో నకిలీ పారాష్యూట్ డబ్బాలు, అదే సంఖ్యలో లేబుళ్లను అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ మొత్తం దాదాపు రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పీసీలు అక్రమ్, జైపాల్‌రెడ్డి, ప్రతాప్ ఈ దాడుల్లో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పేట్ బషీరాబాద్ ఎస్సై పరశురామ్ అధికారుల ఆదేశంతో సరుకును, నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నెలకు రెండు రోజులు మాత్రమే.. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రధాన నిందితుడు సుభాష్ అలియాస్ బవర్లాల్ వివేక్ ఇండస్ట్రీస్ భవన యజమాని వివేక్ గుప్తా వద్ద నెలకు రూ.25 వేల అద్దెతో సదరు ప్రాంగణాన్ని తీసుకుని ఈ తతంగాన్ని నడుపుతున్నాడు. అయితే, ఈ నకిలీ ఆయిల్ ప్యాకింగ్ తతంగం నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే జరుగుతుందని భవన యజమాని వివేక్ తెలపడం ఆసక్తికరమైన అంశం. అసలు అద్దె తీసుకునే వ్యక్తి వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప ఆ భవనంలో ఏం జరుగుతుందో తెలుసుకోక పోవడంతో ఇప్పుడు వివేక్ కూడా చిక్కుల్లో పడ్డాడు. తక్కువ ధరకు బ్రాండెడ్ ఆయిల్ వస్తుందని వినియోగదారులు, ఎక్కువ అద్దె వస్తుందని భవన యజమానులు ఈ రకంగా మోసపోవద్దని విజిలెన్స్ అధికారులు సూచిస్తున్నారు. -
మేలైన కాంతి
చలికాలంలో చర్మం పొడిబారి, కళ తప్పి కనిపిస్తుంది. మృతకణాలు పెరుగుతాయి కాబట్టి వీటిని సరిగా శుభ్రం చేయకపోతే రంగు కాస్త తగ్గినట్టు కనిపిస్తారు. ఈ సమస్యకు పరిష్కారంగా..ఉదయం స్నానం చేయడానికి ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి అరగంటసేపు ఆగాలి. తర్వాత మరీ వేడిగా అలాగని చల్లగా కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. స్నానానికి సబ్బు ఉపయోగించేవారు క్రీమీగా ఉండేవాటిని చలికాలానికి ప్రత్యేకం అనేవాటిని ఎంచుకోవాలి. లేదంటే సొంతంగా తయారుచేసుకున్న సున్నిపిండిని వాడాలి.బాదంపప్పుల నూనె, అవిసెగింజల నూనె వంటివి మేనిపైకే కాదు లోపల కూడా కావాలి. అందుకని శరీరానికి మేలు చేసే బాదంపప్పులు, అవిసెగింజలు.. రోజూ కొన్ని తినాలి.ఈ కాలం ఉసిరికాయలు లభిస్తాయి. వీటిలో విటమిన్–సి సమృద్ధిగా లభిస్తుంది. ఏదో విధంగా రోజూ ఒక ఉసిరికాయ అయినా తినాలి. పొడిరూపంలోనూ ఉసిరిని తయారుచేసి, నిల్వచేసుకొని, కషాయం చేసుకొని సేవించవచ్చు. దీనివల్ల చర్మంలోపలి మలినాలు కూడా శుద్ధమవుతాయి.పెదవులపై చర్మం పొడిబారడం, పగుళ్లు బారి నలుపుగా అవడం వంటివి ఈ కాలంలో సహజంగా జరుగుతుంటాయి. రాత్రి పడుకునేముందు నెయ్యిని పెదవులపై రాసి, మృదువుగా మర్దన చేయాలి. పగలు కూడా రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారం సమస్య రాదు.చలికి చాలా మంది మంచినీళ్లు తాగడం బాగా తగ్గిస్తారు. దీని వల్ల కూడా చర్మం పొడిబారడం, ముడతలు పడటం జరుగుతుంటుంది. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగేలా శ్రద్ధ పెట్టాలి. ఈ జాగ్రత్తలు చర్మకాంతినే కాదు ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి. -
కొబ్బరినూనె కొవ్వులతో కీటకాలు పరార్!
కొబ్బరి నూనె నుంచి తీసిన కొన్ని పదార్థాలు కీటకాలను నాశనం చేయడంలో మెరుగ్గా పనిచేస్తాయని అమెరికా వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కీటకాలతో వచ్చే సమస్యలను అరికట్టేందుకు దాదాపు 60 ఏళ్లుగా డీట్ అనే కృత్రిమ రసాయనాన్ని వాడుతూండగా.. సహజసిద్ధమైన వాటి కోసం ఇటీవలే అన్వేషణ మొదలైంది. ఈ నేపథ్యంలో అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేపట్టారు. వీటి ప్రకారం కొబ్బరి నుంచి సేకరించిన కొన్ని రకాల కొవ్వు పదార్థాలు నల్లులతోపాటు, దోమలు, ఈగల నుంచి రక్షణ కల్పించడంలో కృత్రిమ రసాయనాల కంటే మెరుగైనవని తెలిసింది. మరీ ముఖ్యంగా దోమల విషయంలో ఈ పదార్థాలు ఎక్కువ ప్రభావశీలంగా కనిపించాయని, ల్యాబొరేటరీ పరిశోధనల్లో ఈ కొవ్వులు కొన్నిరకాల కీటకాల నుంచి రెండు వారాలపాటు రక్షణ కల్పించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జున్ వీ ఝూ అంటున్నారు. కొబ్బరి నూనె నేరుగా కీటకాలను పారదోలదని స్పష్టం చేసిన జున్ వీ ఝూ ఇందులోని లారిక్, క్యాప్రిక్, క్యాప్రిలిక్ యాసిడ్లు, వీటి తాలూకు మిథైల్ ఈస్టర్లు ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ రకమైన కొవ్వుల ఆధారంగా కొత్తరకం మందులు తయారు చేయడం వల్ల జికా వంటి అనేక వ్యాధులను నియంత్రించ వచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
కొబ్బరినూనె ఓ షాకింగ్ రిపోర్ట్!
కొబ్బరినూనె తాగితే అధిక బరువునుంచి విముక్తి కలుగుతుందని, మధుమేహం తగ్గుతుందని, థైరాయిడ్ సమస్య పోతుందనే మాట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే తాజాగా ఓ షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. కొవ్వు తగ్గకపోగా కొబ్బరి నూనె సేవిస్త కొలెస్ట్రాల్ స్థాయిపెరుగుతుందని తాజా రిపోర్ట్ నివేదించింది. కొబ్బరినూనె శుద్ధవిషమని హార్వర్డ్ ప్రొఫెసర్, ఎపిడమాలజిస్ట్ కారిన్ మిషెల్స్ హెచ్చరిస్తున్నారు. అతి చెత్త ఆహారాలలో కొబ్బరి నూనె ఒకటి అని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆప్ ఫ్రీబుర్గ్‌లో ఇటీవల ఆమె కోకోనట్ ఆయిల్ ఇతర పోషక లోపాలు అనే శీర్షికతో ప్రసంగం చేశారు. కొబ్బరినూనెలో ఉండే గాఢమైన కొవ్వు ప్రమాదకరమైన ఎల్డీఎల్ పరిణామాన్ని పెంచుతుందని ప్రొఫెసర్ మిషెల్ హెచ్చరించారు. అయితే సమతుల ఆహారంలో కొబ్బరినూనెను కొద్ది మోతాదులో తీసుకుంటే ఫరవాలేదని, శ్రుతిమించితే హృద్రోగాలు తప్పవని బ్రిటీష్ నూట్రిషన్ ఫౌండేషన్ వెల్లడించింది.. కొబ్బరినూనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మేలు ఏమిటో ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదని తెలిపింది. వెన్నతో పోలిస్తే కొబ్బరినూనెలో మూడురెట్లు , 86శాతం ఎక్కువ ఫాట్ వుటుందని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ సీనియర్ డైటీషన్ విక్టోరియా టేలర్ చెప్పారు. -
కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్: కాటేదాన్‌లోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడు గంటల పాటు మంటలు ఎగిసిపడి షేడ్ మొత్తం దగ్ధమైంది. పక్కనే ఉన్న పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ప్రజలు తీవ్రంగా కష్టపడ్డారు. ఇంత జరిగిన నిర్వాహకులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోగా సమాచారం సైతం అందించలేదు. స్థానికులు, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ పారిశ్రామికవాడలో షాలీమార్ కొబ్బరినూనె పరిశ్రమ కొనసాగుతుంది. ఇందులో నూనె తయారీ, ప్యాకింగ్ చేస్తారు. శనివారం రాత్రి విధులు ముగించుకున్న కార్మికులు ఇళ్లకు వెళ్లారు. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. మంటలు ఉధృతం కావడంతో సెక్యూరిటీ గార్డులు విషయాన్ని కంపెనీ యజమానికి తెలిపారు. అప్పటికే పరిశ్రమలోని నాలుగువైపుల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. నిమిషాల వ్యవధిలో దట్టమైన పొగలతో ప్యాకింగ్‌కు సిద్ధంగా ఉన్న కొబ్బరినూనె డబ్బాలు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తి నష్టం కోట్లల్లో ఉంటుందని కార్మికులు తెలుపుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే పరిశ్రమ పైకప్పు కుప్పకూలింది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని దీంతో కేసు నమోదు చేయలేదని మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర జగదీశ్వర్ తెలిపారు. ఆదివారం కావడంతో... ఈ పరిశ్రమలో కొబ్బరినూనె తయారీ, ప్యాకింగ్‌తో పాటు పసుపు, కారం, గరం మసాలా తది తర నిత్యవసర వస్తువుల ప్యాకింగ్‌ను నిర్వహి స్తున్నారు. ఇందులో 800 మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఆదివారం ఉదయం ప్రమాదం జరగడంతో ఎవరు లేరని దీని కారణంగా పెను ప్రమాదం తప్పిందని కార్మికులు వెల్లడించారు. రెండు గంటలు ఉక్కిరిబిక్కిరి... ఉదయం రెండు గంటల పాటు దట్టమైన పొగలతో కాటేదాన్ పరిశ్రమ చుట్టుపక్కల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు పొగ కమ్మేసింది. ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న ప్రతిసారి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానికంగా వాహనాలు వెళ్ళేందుకు రహదారులు పెద్దగా లేకపోవడం, రహదారి నుంచి పరిశ్రమ లోపలికి ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు అగ్నిమాపక యంత్రంలో నీటిని తిరిగి తీసుకురావడానికి బుద్వేల్ లేదా బహదూర్‌పురా వాటర్‌బిడ్‌ల వద్దకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. -
బుగ్గిపాలైన కొబ్బరి నూనె గోదాం
సాక్షి, హైదరాబాద్: నగర శివారు మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నప్రమాదం జరిగింది. కొబ్బనినూనే డబ్బాలను నిల్వ ఉంచిన ఓ గోదాంలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేయత్నం చేశారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని ఇతర కంపెనీలను మూసివేయించారు. ఈ ఘటనలో ఎవరికైనా గాయాలైంది లేనిదీ తెలియాల్సిఉంది.