ముంబై: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మెరుగైన ఆరోగ్యం కోసం బాలీవుడ్ సెలబ్రెటీలు అనేక చిట్కాలను అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ అద్భుత ఆయుర్వేద చిట్కాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయిల్ పూలింగ్ ద్వరా దంత సమస్యలను నివారించడంతో పాటు నోటిలో ప్రవేశించే చెడు బ్యాక్టేరియా, వైరస్‌లు రాకుండా అడ్డుకుంటుందని తెలిపారు. కాగా దంత సమస్యలు, టాక్సిన్స్‌లను నివారించేందుకు ఆయిల్ పూలంగ్ ఎంతో ఉపయోగపడుతుందని అనుష్క పేర్కొన్నారు. తాను ఆయిల్ పూలంగ్ చిట్కాను పాటిస్తానని, మెరుగైన ఆరోగ్యం కోసం అభిమానులు పాటించాలని సూచించారు. ప్రతి మనిషి నోటిలో 700 రకాల బ్యాక్టేరియాలు జీవిస్తాయి. అందులో ఎప్పటికీ 350 యాక్టివ్‌గా ఉంటాయని ఇటీవల ఓ అధ్యయనం తెలిపింది.
ఆయిల్ పూలింగ్ ఉపయోగాలు
కొబ్బరి నూనె ఉపయోగాలు మనందరికి తెలిసిందే. కాగా ఆయిల్ పూలింగ్ ప్రక్రియలో కొబ్బరి నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కొబ్బరి నూనెను నోట్లో 20 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి. నోట్లో విడుదలయ్యే టాక్సిన్స్‌ను (విషపదార్థాలను) ఎదుర్కొనేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం టాక్సిన్స్ మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థలో యాసిడ్ సమస్యను నివారించేందుకు ఆయిల్ పూలింగ్ ఉపయోగపడుతుంది.
మరోవైపు వ్యాధికారకాలను ఎదుర్కోవడంలో కొబ్బరి నూనె సమర్థవంతంగా పనిచేస్తుందని, గుండె, మెదడు పనితీరును మెరుగుపర్చే గుణం కొబ్బరి నూనెలో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సంపూర్ణ ఆరోగ్యానికి ఆయిల్ పూలింగ్, ప్రాచీన వైద్య విధానం ఎంతో ఉపయోగమని, దీర్ఘకాల తలనొప్పి, ఆస్తమా, మధుమేహం(డయాబెటిస్) లాంటి వ్యాధులను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment