ayurveda
-
బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి..
రక్తపోటు.. బ్లడ్‌ప్రెజర్.. దీనిని వాడుక బాషలో బీపీగా వ్యవహరిస్తుంటారు. దేశంలో ప్రతి నాల్గవ వ్యక్తి రక్తపోటుతో బాధపడుతున్నాడని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. అటు హైబీపీ, ఇటు లోబీపీ.. రెండూ ప్రమారకమైనవేనని వైద్యులు చెబుతుంటారు. రక్తపోటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అది పక్షవాతానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తుంటారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల జాతీయ ఆయుర్వేద సంస్థాన్ రక్తపోటుపోటుపై పరిశోధనలు నిర్వహించింది.జాతీయ ఆయుర్వేద సంస్థాన్(National Institute of Ayurveda) పదేళ్ల పరిశోధనల అనంతరం రక్తపోటు నియంత్రణకు ఔషధాన్ని తయారు చేసింది. దీనికి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించింది. ఈ ఔషధం ఎటువంటి దుష్ప్రభావాలను కలుగజేయదని ట్రయల్స్‌లో తేలిందని సంస్థాన్ పరిశోధనకులు తెలిపారు. ఈ ఔషధాన్ని తొమ్మిది రకాల వనమూలికలను కలిపి తయారు చేశారు. ఈ ఔషధం క్లినికల్ ట్రయల్ పూర్తయిందని, పేటెంట్ పొందిన తరువాత అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థాన్ హెచ్ఓడీ డాక్టర్ సుదీప్త రథ్ మాట్లాడుతూ తమ వైద్యుల బృందం రక్తపోటును అదుపులో ఉంచేందుకు ఆయుర్వేద గుళికలను రూపొందించిందని తెలిపారు. ఈ గుళికలు క్లినికల్ ట్రయల్స్ సమయంలో ప్రభావవంతంగా పనిచేశాయని, ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కనిపించలేదన్నారు. ఈ ఔషధానికి పేటెంట్(Patent) పొందిన వెంటనే, దానిలో ఉపయోగించిన మూలికలను బహిర్గతం చేస్తామన్నారు. కాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశ జనాభాలో అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు 22.6 శాతంగా ఉన్నారు. పురుషులలో ఈ రేటు మహిళల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలలో రక్తపోటు(blood pressure) ప్రభావం అధికంగా ఉంది. అధిక రక్తపోటు కారణంగా, ఛాతీ నొప్పి, తీవ్రమైన అనారోగ్యం, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: Anti Valentine week : నేటి నుంచి భగ్న ప్రేమికులు చేసే పనిదే.. -
ఆయుర్వేదంతో.. ఆరోగ్యమస్తు!
ఆయుర్వేదిక్ సంప్రదాయ వైద్య విధానాన్ని ప్రస్తుత కాలంలో కరోనా తరువాత నుంచి ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. ఆయుర్వేద ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్యలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఆస్పత్రులకు అధిక నిధులు కేటాయించి ఆధునికీకరణకు బాటలు వేశారు. - సాక్షి, అనకాపల్లి ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుపడుతున్న రోగులు ఎక్కువగా ఆయుర్వేదిక్ వైద్యం పట్ల ఆసక్తి చూపుతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నుంచే అనకాపల్లి జిల్లాలో కొరుప్రోలు, వేంపాడు, కన్నూరుపాలెంలలో ఆయుర్వేదిక్ డిస్పెన్సరీల ద్వారా వైద్యం అందించేవారు. తొలుత దాతల సహాయంతోనే ఈ ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నడిచేవి. దాతలు భూమిని సమకూర్చడంతో పెంకులతో భవనం నిర్మించి, అందులోనే వైద్య సేవలు ప్రారంభించారు. వైద్యునితోపాటు ఆరోగ్య సిబ్బందిని నియమించి సేవలందిస్తూ వచ్చారు. కాలక్రమంలో ఈ డిస్పెన్సరీ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో 2013లో ఎస్‌ఆర్‌హెచ్‌ఎం నిధులతో నూతన భవనాలను నిర్మించారు. జిల్లాలో ఆరు ఆస్పత్రులు అనకాపలి జిల్లాలో ఎన్టీఆర్ ఆసుపత్రిలో, ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు, నక్కపల్లి మండలం వేంపాడు, కశింకోట మండలం కన్నూరుపాలెం, నర్సీపట్నం, ఎం.కోడూరులో 6 ఆయుర్వేద ఆస్పత్రులు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేశారు. గత ఏడాది ఆగస్టులో ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు ఆయుర్వేద కేంద్రాన్ని స్పెషలిస్ట్ వెల్నెస్ అండ్ పంచకర్మ సెంటర్‌గా అప్ గ్రేడ్ చేశారు. వాటితో పాటుగా ఆరు ఆస్పత్రులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు కేటాయించారు. ఆరు వెల్నెస్ సెంటర్ల ఆధునికీకరణ జన ఆరోగ్య సమితి కమిటీని ఏర్పాటు చేసి ఆస్పత్రుల భవనాల ఆధునికీకరణ పనులు పూర్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఒక్కో ఆస్పత్రిని రూ.3.5 లక్షలతో ఆధునికీకరించారు. అదనపు సౌకర్యాలు కల్పిoచి ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలందిస్తున్నారు. కశింకోట మండలంలోని కన్నూరుపాలెం ఆస్పత్రిని ఆయుర్వేదిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోని ఆయుష్ విభాగంలో మౌలిక వసతులకు రూ.3.50 లక్షలు మంజూరు చేసింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆయుష్మాన్ భారత్ కింద ఆయుర్వేదిక్ ఆస్పత్రులను అభివృద్ధి చేసి, సేవల్ని విస్తృత పరచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే జిల్లాలోని వేంపాడు, కొరుప్రోలు, కన్నూరుపాలెం ఆయుర్వేదిక్ ఆస్పత్రుల అభివృద్ధికి మొత్తం రూ.10.5 లక్షలు వెచ్చిస్తున్నారు. ఎన్నికల సమయంలో నిలిచిన పనులు మూడు నెలలుగా తిరిగి కొనసాగాయి. పంచకర్మ నుంచి జలగ వైద్యం వరకూ... సగటున ఒక్కో ఆస్పత్రిలో నెలకు 900 నుంచి 1000 మంది వరకూ రోగులకు వైద్యసేవలందుతున్నాయి. జిల్లాలోని ఆరు ఆస్పత్రుల్లో 5 వేల నుంచి 6 వేల మందికి వైద్య సేవలందుతున్నాయి. ఆస్పత్రిలో పక్షవాతం, మోకాళ్లు, కీళ్ల నొప్పులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో పాటుగా పంచకర్మ చికిత్సలో అభ్యంగం, స్వేద కర్మ, పిండస్వేద కటివస్తి, జానువస్తి, గ్రీవ వస్తి, క్షారసూత్ర, అగ్రికర్మ, జలగ వైద్యంతో పాటుగా అనేక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ప్రస్తుతం రోజుకు 40 నుంచి 45 మంది వరకూ రోగులు వస్తున్నారు. పంచకర్మ థెరపీ..ఆయుర్వేద పంచకర్మ చికిత్స కోసం కేరళ, తమిళనాడు, కర్ణాటకకు ప్రత్యేకంగా థెరపీ వైద్యం కోసం వెళుతుంటారు. అదే తరహా కేరళ మెడికేటెడ్ ఆయిల్ ద్వారా వైద్యం అనకాపల్లి జిల్లాలో ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లల్లో కూడా అందిస్తున్నారు. పంచకర్మ థెరపీ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. నశ్య, వమన, విరేచన, వస్తి, రక్తమోక్షణ వంటి థెరపీల ద్వారా చికిత్సలు అందిస్తున్నారు.వమన సొరియాసిస్, రెస్పిరేటరీ వంటి దీర్ఘకాలిక సమస్యలకు అందించే ఆయుర్వేదిక్ వైద్యం. థెరఫిటిక్ మెడిసిన్ ఇచ్చి వాంతులు చేయించి తద్వార శ్వాశకోశ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా సహాయపడుతుంది.. విరేచన కడుపు ఉబ్బరం, అల్సర్ ఇతర దీర్ఘకాలిక సంబంధిత వ్యాధుల్లో కడుపులో విరేచన ద్వారా క్లీన్ చేయించి ఈ థెరపీ చేస్తారు. దీని ద్వారా కడుపు క్లీనింగ్ అయి లివర్, జీర్ణాశయం, కిడ్నీలు సక్రమంగా పనిచేసేలా థెరపీ చేస్తారు. వస్తి.. మగ,ఆడ వారిలో వెన్నుపూస, స్పైనల్ కార్డు వంటి సమస్యల్లో ఈ థెరపీ వాడతారు. మైక్రో ఛానల్ ద్వారా ఆయిల్ రాసి ఈ చికిత్స అందిస్తారు రక్త మోక్షణ... శరీరంపై వివిధ అవయవాలల్లో ధీర్ఘకాలికంగా పుండ్లుగా ఏర్పడి వాటి నుంచి రసి కారి కుళ్లిపోతే.. అక్కడ ఈ థెరపీ ద్వారా చెడు రక్తం తీసే చికిత్స ఇది. ఈ చికిత్స వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది. అవగాహన పెరిగింది.. జిల్లాలో ఆరు ఆయుర్వేదిక్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల ద్వారా వైద్యసేవల అందిస్తున్నాం. చదవండి: పిన్న వయసులోనే ప్రపంచం మెచ్చిన అద్భుత మేధావికేరళలో లభ్యమయ్యే మెడికేటెడ్ ఆయిల్‌తో థెరపీ వైద్యం అందుబాటులో ఉంది. ప్రతి ఆస్పత్రిలో ఇద్దరు థెరపిస్టుల ద్వారా వైద్యసేవలందిస్తున్నాం. ఆయుర్వేదిక్ వైద్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ఎక్కువగా ధీర్ఘకాలికంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులు వైద్యం కోసం వస్తున్నారు. పంచకర్మ థెరపీతో పాటు అదనంగా ఐఆర్ థెరపీ ద్వారా మోకాళ్ల నొప్పి వంటి సమస్యలకు వైద్య సేవలందిస్తున్నాం. ప్రజలకు ఆశాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఆస్పత్రి ఆవరణలో ఔషధ మొక్కలు, హెర్బల్ గార్డెన్ కూడా పెంచుతున్నాం. – కె.లావణ్య, ఆయుష్ విభాగం వైద్యాధికారి, జిల్లా ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ -
చికిత్స ఏదైతేనేం... సాంత్వనే ముఖ్యం!
కేన్సర్ వ్యాధిపై మరోసారి చర్చ మొదలైంది. అల్లోపతి పద్ధతులు మేలైనవా? లేక ప్రాచీన ఆయుర్వేదమే గట్టిదా అన్న ఈ చర్చకు ప్రముఖ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కారణమయ్యారు. సిద్ధూ భార్య, స్వయానా అల్లోపతి డాక్టర్ అయిన నవజోత్ కౌర్ సిద్ధూ ఆయుర్వేద పద్ధతు లను అవలంబించిన కారణంగానే కేన్సర్ నుంచి విముక్తు రాలినైనట్లు చెప్పడం ఒక రకంగా తేనెతుట్టెను కదిపి నట్లయింది. దేశంలోనే ప్రముఖ కేన్సర్ చికిత్సా కేంద్రం ‘టాటా మెమోరియల్ హాస్పిటల్’ ఇప్పటికే సిద్ధూ మాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనీ, శాస్త్రీయ పద్ధతుల్లో నిరూపణ అయిన చికిత్స పద్ధతులకే ప్రాధాన్య మివ్వాలనీ హెచ్చరించగా... తామేం చేశామో, ఎలా చేశామో వివరించేందుకు సిద్ధూ కూడా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండు వైద్యవిధానాల మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ వ్యాసం.పిండంతో మొదలై మరణించేంతవరకూ జరిగే కణ విభజన ప్రక్రియలో వచ్చే తేడా ఈ కేన్సర్ మహమ్మారికి కారణం. అదుపు తప్పి విచ్చలవిడిగా విభజితమయ్యే కణాలు కణితిగా ఏర్పడటం లేదా అవయవాల పనిని అడ్డుకునే స్థాయిలో మితిమీరి పెరిగిపోవడం జరుగుతూంటుంది. శతాబ్దాలుగా మనిషిని పట్టిపీడిస్తున్న ఈ వ్యాధికి అల్లోపతి సూచించే వైద్యం... శస్త్రచికిత్స, రేడియేషన్, కీమో థెరపీ! వ్యాధి ముదిరిన స్థాయిని బట్టి, ఏ అవయ వానికి సోకిందన్న అంశం ఆధారంగా ఈ మూడింటిని లేదా విడివిడిగా, రెండింటిని కలిపి వాడుతూంటారు. అయితే శస్త్రచికిత్స తరువాత కూడా కేన్సర్ మళ్లీ తిరగ బెట్టవచ్చు.రేడియేషన్, కీమోథెరపీలు శరీరాన్ని గుల్ల బార్చేంత బాధాకరమైన ప్రక్రియలు. అందుకే చాలామంది చెప్పేదేమిటంటే... కేన్సర్ వ్యాధితో కంటే దానికి చేసే చికిత్సతోనే ఎక్కువమంది మరణిస్తూంటారూ అని! కొన్ని దశాబ్దాలుగా పాటిస్తున్న ఈ మూడు రకాల ఆధునిక వైద్య పద్ధతులకు ఇటీవలి కాలంలో కొన్ని వినూత్నమైన చికిత్స పద్ధతులు వచ్చి చేరాయి. రోగ నిరోధక శక్తినే కేన్సర్ కణాలపై దాడి చేసేలా చేయడం (ఇమ్యూనో థెరపీ), కణితులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రాంతానికి మాత్రమే రేడియేషన్ అందించడం (ప్రిసిషన్ ఆంకాలజీ), తక్కువ డోసు కీమోథెరపీ మందులను ఎక్కువసార్లు ఇవ్వడం (భారత్‌లో ఆవిష్కృతమైన పద్ధతి) మునుపటి వాటి కంటే కొంత మెరుగైన ఫలితాలిస్తున్నాయి. అయితే ఈ రోజు వరకూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంచనా ఏమిటీ అంటే... కేన్సర్‌కు చికిత్స లేదు అని! కాకపోతే మరణాన్ని కొన్నేళ్లపాటు వాయిదా వేయడం మాత్రం సాధ్యమైంది. అది ఐదేళ్లా? (సర్వైవల్ రేట్) పదేళ్లా అన్న చర్చ వేరే!ప్రత్యామ్నాయ పద్ధతుల మాటేమిటి?వేల సంవత్సరాల మానవజాతి పయనంలో ఎంతో ప్రగతి సాధించినమాట నిజమే. కానీ ఇప్పటికీ కనీసం మనిషి తాను నివసిస్తున్న భూమిని పూర్తిగా అర్థం చేసుకో గలిగాడా? లేదనే చెప్పాలి. చేసుకోగలిగి ఉంటే... వాతా వరణ కాలుష్యం లాంటి సమస్యకైనా... కేన్సర్ లాంటి వ్యాధి చికిత్సకైనా ఎప్పుడో పరిష్కారాలు దొరికి ఉండేవి. దొరకలేదు కాబట్టే ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతులు, మందులు కనుక్కుంటున్నారు. వ్యాధులను జయించే దిశగా ప్రయాణిస్తు న్నారు. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్ర శేఖర్ మాటలను ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిఉంటుంది. సైన్స్... సత్యాన్వేషణకు జరిగే నిరంతర ప్రయాణమంటారాయన. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు ఈ ప్రయాణంలో ఎప్పటికప్పుడు మనం కొత్త మైలు రాళ్లను చేరుకుంటూ ఉంటామే తప్ప... అంతిమ సత్యాన్ని ఆవిష్కరించలేము అని మనం అర్థం చేసుకోవాలి.కేన్సర్ విషయానికే వద్దాం... అల్లోపతి విధానాల్లోని లోటుపాట్లను గుర్తించిన చాలామంది వైద్యులు ప్రత్యా మ్నాయ మార్గాలపై కూడా చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఆయుర్వేదం కూడా వీటిల్లో ఒకటి. కానీ... ఆయుర్వేదంలో ఉన్న చిక్కు గురించి ఐఐసీటీ మాజీ డైరెక్టర్ ఒకరి మాటలు వింటే సమస్య ఏమిటన్నదికొంత అవగతమవుతుంది. ఆయుర్వేదంలో ఉపయోగించే మొక్కల్లో కొన్ని వందలు, వేల రసాయనాలు ఉంటాయి. వాటిల్లో ఏ రసాయనం, లేదా కొన్ని రసాయనాల మిశ్రమం వ్యాధి చికిత్సలో ఉపయోగపడిందో తెలుసు కోవడం కష్టమని ఆయన చెబుతారు. నిజం కావచ్చు కానీ... పాటించే పద్ధతీ, ఏ రసాయనం ఉపయోగపడిందో కచ్చితంగా మనకు తెలియాల్సిన అవసరముందా? రోగికి మేలు జరిగితే చాలు కదా? పైగా ఆయుర్వేదాన్ని, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను కూడా శాస్త్రవేత్తలు అను మానపు దృష్టితోనే చూశారు. చాలా కొద్దిమంది అందు లోని సైన్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పాలి. అల్లోపతి వైద్యం ఫూల్ ప్రూఫా? కానేకాదు. ఒక మందు తయారయ్యేందుకు పది పన్నెండేళ్లు పట్టడం ఒక విషయమైతే... దాదాపు ప్రతి మందుతోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొన్ని కేన్సర్‌కూ కారణమవుతూండటం చెప్పు కోవాలి.అల్లోపతితోనే వినూత్నంగా...కేన్సర్ విషయంలో అల్లోపతి, ఆయుర్వేదాల మధ్య చర్చ ఒకపక్క ఇలా నడుస్తూండగానే... అమెరికాలో ఇంకో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. డా‘‘ ఇల్యెస్ బాగ్లీ, పియెరిక్ మార్టినెజ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఐవర్ మెక్టిన్, మెబెండజోల్, ఫెన్బెండజోల్ వంటి మాత్రలను కేన్సర్‌పై ప్రయోగించారు. ఈ మందులు మామూలుగా పేవుల్లోని హానికారక పరాన్నజీవులను నాశనం చేసేందుకు వాడుతూంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమి టంటే... ఐవర్ మెక్టిన్, మెబెండజోల్ మాత్రలతో కొంత మంది వైద్యులు అభివృద్ధి చేసిన చికిత్స పద్ధతి అద్భుతంగా పనిచేయడం. పైగా... శాస్త్రవేత్తలు కొందరు ఈ పద్ధతి, ఫలితాలను ధ్రువీకరించడం. ఫలితంగా ఈ పద్ధతి ‘జర్నల్ ఆఫ్ ఆర్థో మాలిక్యులర్ మెడిసిన్’లో ‘టార్గెటింగ్ ద మైటోకాండ్రియల్ స్టెమ్ సెల్ కనెక్షన్ ఇన్ కేన్సర్ ట్రీట్మెంట్’ పేరుతో ఈ ఏడాది సెప్టెంబరు 19న ప్రచురి తమైంది.ఇల్యెస్ బాగ్లీ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఆర్థో మాలిక్యులర్ మెడిసిన్ అధ్యక్షుడు. అల్జీరియా దేశస్థుడు. పియెరిక్ మార్టినెజ్ కేన్సర్ పరిశోధనల్లో బాగ్లీతో కలిసి పనిచేశారు. థైరాయిడ్ కేన్సర్‌తో పాటు నవ్‌జోత్ కౌర్ సిద్ధూను వేధించిన రొమ్ము కేన్సర్, పాంక్రియాస్ కేన్సర్లపై ఈ రెండు మందులు ప్రభావం చూపుతున్నట్లు ప్రస్తుతా నికి ఉన్న సమాచారం. మరిన్ని కేన్సర్లపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.ఒకప్పుడు గుర్రాల్లో పురుగులను తొలగించేందుకు వాడిన ఐవర్ మెక్టిన్లో కేన్సర్ కణాలను మట్టుబెట్టగల కనీసం 15 మూలకాలు ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. డా‘‘ బాగ్లీ, డా‘‘ మార్టినెజ్ వంటి వారు సంప్రదాయవాదుల మాటలకే కట్టుబడి ఈ ప్రయోగం చేసి ఉండకపోతే... కేన్సర్ చికిత్సకు ఇతర మార్గాలూ ఉన్నాయన్న విషయం ఎప్పటికీ తెలిసి ఉండేది కాదేమో.చివరగా... ఒక్క విషయం: కేన్సర్ చికిత్సకు ఐవర్ మెక్టిన్, ఫెన్బెండజోల్ల వాడకానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అనుమతులూ లేవు. కాబట్టి.. పరిశోధన ఫలితాలను రూఢి చేసుకోవడంతోపాటు మరిన్ని చేప ట్టడం కూడా అవసరం. అంత వరకూ మనం కేన్సర్ మహ మ్మారికి అణిగిమణిగి ఉండా లన్నది నిష్ఠుర సత్యం!– గిళియారు గోపాలకృష్ణ మయ్యాసీనియర్ జర్నలిస్ట్ -
అద్భుత ఫలితాలంటూ ప్రకటించడం నేరం
న్యూఢిల్లీ: వివిధ వ్యాధుల నివారణలో ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయంటూ ప్రకటించడం చట్ట వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎటువంటి ధ్రువీకరణలు లేని ఇలాంటి ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతోపాటు వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని హెచ్చరించింది. ఇటువంటి ప్రకటనలపై నిషేధం విధించామని, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలిపింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది.తాము ఏవిధమైన ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోప తి(ఏఎస్యూహెచ్) మందులకు ధ్రువీకరణలను ఇవ్వలేదని కూడా తెలిపింది. అదేవిధంగా, ఆయా వైద్య విధానాలకు సంబంధించిన ఔషధాల తయారీ, విక్రయాలకు కూడా ఏ ఉత్పత్తిదారు లేదా కంపెనీకి అనుమతులు మంజూరు చేయలేదని ఆయుష్ శాఖ స్పష్టం చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం–1940ని అనుసరించి ఏఎస్యూహెచ్ ఔషధాల తయారీ, విక్రయాలకు అనుమతులను సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలే జారీ చేస్తాయని కూడా వివరించింది. ఏఎస్యూహెచ్ ఔషధాలను సంబంధిత వైద్యులు/ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలని కూడా తెలిపింది. అభ్యంతరకర, తప్పుడు ప్రకటనలు, నకిలీ మందులపై రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీకి లేదా ఆయుష్ శాఖకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆయుష్ శాఖ సూచించింది. -
వినాయక పూజాపత్రిలో ఆయుర్వేద విశేషాలు..
ప్రకృతిలో ఎన్నో రకాల వృక్ష జాతులు ఉండగా, వాటిలో కొన్నింటిని మాత్రమే వినాయక పూజలో పత్రిగా ఉపయోగించడంలోని ఆంతర్యమేమిటో,ఆయుర్వేద శాస్త్ర రీత్యా ఈ పండుగ ప్రాధాన్యమేమిటో తెలుసు కుందాం.వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షాల వలన నిండిన నదులు, కాలువలలో నీరు దిగువ ప్రాతాలలోని చెరువులు, కుంటలు, దిగుడు బావులలోకి ప్రవహించే మార్గంలో అనేక మలినాలతో కూడిన చెత్తను కూడా మోసుకు వస్తుంది. ఆ నీటిని అలాగే తాగిన ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ముందుచూపు కలిగిన మన మహర్షులు ప్రతి సంప్రదాయంలోనూ ప్రజలకు హితవు కలిగించే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను సూచించారు. వాటిలో భాగంగా వినాయక చవితి పర్వదినం రోజున పూజలో ఉపయోగించడానికి కొన్ని ప్రత్యేకమైన ఔషధ జాతులకు సంబంధించిన మొక్కలు, వృక్షాల ఆకులను పూజాపత్రిగా సూచించారు. ఈ పూజాపత్రిని నిమజ్జన సమయంలో ఆయా చెరువులు, కుంటలలో వెయ్యడం వల్ల వాటిలోని నీరు శుభ్రంగా మారుతుంది. తద్వారా క్రిమివ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జ్వరాలు, శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధులు, చర్మవ్యాధులు వంటి సమస్యలకు విరుగుడుగా పనిచేసే ఆకులను మన పూర్వీకులు పూజాపత్రిలో భాగంగా చేశారు. పూజాపత్రి ఔషధ గుణాలను చెప్పుకోవాలంటే, ఉదాహరణకు మాచీపత్రం (దవనం ఆకు) రసాన్ని తీసుకోవడం ద్వారా దగ్గు, ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది. బృహతీపత్రం (వాకుడు ఆకు) వాపులను తగ్గిస్తుంది. బిల్వపత్రం (మారేడు ఆకు) చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దుర్వాయుగ్మం (గరిక) శరీరానికి బలం చేకూరుస్తుంది. ఇలాగే, వినాయక పూజలో ఉపయోగించే ప్రతి పత్రికి విశేష ఔషధ లక్షణాలు ఉన్నాయి. అందుకే, వీటిని మన మహర్షులు, ఆయుర్వేద పండితులు సంప్రదాయంలో భాగంగా చేశారు. – ఆచార్య రాఘవేంద్ర వాస్తు జ్యోతిష సంఖ్యా శాస్త్ర నిపుణులు, ఒంగోలు -
బ్రిటీష్ కాలేజ్‌లో.. భారతీయ ఆయుర్వేదం
సనాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదం నేర్చుకునేందుకు ఇటు ఆధునిక భారతీయులు మాత్రమే కాదు, పాశ్చాత్యులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో యూకేలోని అతి పురాతన కళాశాలతో మన దేశానికి చెందిన ఆయుర్వేద ఆధునిక సమ్మిళిత వైద్యాన్ని ప్రోత్సహించే పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద (పీఎస్ఏ) చేతులు కలిపింది.సాంప్రదాయ ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో యూకేలోని బ్రిటిష్ కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద (బీఎస్ఏ)లో మెజారిటీ వాటాను స్వంతం చేసుకునేందుకు వీలుగా అవగాహన ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకం చేశారు.ఇందులో భాగంగా.. డాక్టర్ పోలిశెట్టి సాయి గంగా పనాకియా ప్రైవేట్ లిమిటెడ్ విభాగం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలీసైంటిఫిక్ ఆయుర్వేద (ఐపీఎస్ఎ)లు.. యూకేలోని పురాతన ఆయుర్వేద కళాశాలలో పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంలో వినూత్న కోర్సులను పరిచయం చేయనుంది. లేటెస్ట్ టెక్నాలజీ, ఆధునిక ఔషధాలను పురాతన భారతీయ ఆయుర్వేద జ్ఞానంతో అనుసంధానించే జీవనశైలి వేరియబుల్ పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదం. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలలో ఇదీ ఒకటి.ఈ కొత్త భాగస్వామ్యం యూకే, భారత్‌ల ప్రముఖ ఆయుర్వేద నిపుణులను ఏకతాటిపైకి తెస్తుంది. తద్వారా దాని విస్త్రుతి పెరుగుతుందని డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయుర్వేదం, అల్లోపతి సమ్మేళనం మెరుగైన చికిత్స అవకాశాలు అందిస్తుందని అన్నారు. ముఖ్యంగా చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది బాగా తోడ్పడుతుందన్నారు.మా భాగస్వామ్యం ఆయుర్వేద విద్యా కార్యక్రమాలను బలోపేతం చేస్తుంది. ఆధునిక, ప్రత్యామ్నాయ వైద్య అభ్యాసకులకు విస్త్రుత నైపుణ్యాలను అందిస్తుంది. చివరి దశ వ్యాధులకు మరింత ప్రభావవంతంగా చికిత్స చేసే వైద్యులను తయారు చేస్తుందని డాక్టర్ పోలిసెట్టి వెల్లడించారు.యూకే పార్లమెంట్‌లోని ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఫర్ ట్రెడిషనల్ సైన్సెస్ సెక్రటేరియట్ అమర్జిత్ భమ్రా సమక్షంలో డాక్టర్ పోలిశెట్టి, డాక్టర్ మౌరూఫ్ అథిక్, డాక్టర్ శాంత గొడగామా ఎమ్ఒయూపై సంతకం చేశారు. -
రణపాలతో ఆరోగ్య ప్రయోజనాలు : పేరులోనే ఉంది అంతా!
ప్రకృతిలో వెదికి పట్టుకోవాలనే గానీ ఎన్నో ఔషధ మొక్కల నిలయం. సౌందర్య పోషణ దగ్గర్నించి, దీర్ఘకాల రోగా వలరు ఉన్నో ఔషధ గుణాలున్న మొక్కలు మన చుట్టూనే ఉన్నాయి. అలాంటి వాటిలో రణపాల ఒకటి. వాస్తవానికి రణపాల అలంకరణ మొక్కగా భావిస్తాం. కానీ ఆరోగ్య ప్రయోజనాలు కూడాచాలానే ఉన్నా యంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 వ్యాధులను నయం చేయగల శక్తి రణపాల మొక్కకి ఉంది. రణపాల శాస్త్రీయ నామం Bryophyllum pinnatum. దీని ఆకులు కాస్త మందంగా ఉంటాయి. రుచి కొద్దిగా వగరు, పులుపు సమ్మిళితంగా ఉంటుంది. ఆకు నాటడం ద్వారానే మరో మొక్కను అభివృద్ది చేసుకోవచ్చు. అంటే ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోవచ్చన్నమాట. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ గుణాలు రణపాలలో అధికంగా ఉన్నాయి రణపాల ప్రయోజనాలు ♦ ఆకు తినడం ద్వారా గానీ, కషాయం తయారు చేసి తీసుకోవడం ద్వారా, ఆకు పేస్ట్‌ను కట్టు కట్టడం ద్వారా గానీ చాల ఉపయోగాలను పొందవచ్చు. ♦ అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ♦ డయాబెటిస్ ని క్రమబద్దీకరిస్తుంది. ♦ కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవల్స్ తగ్గుతాయి. ♦ జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను తగ్గించుకోవచ్చు ♦ ఆకులని వేడిచేసి గాయాలపై పెడితే గాయాలు త్వరగా మానుతాయి ♦ ఆకులని నూరి దాన్ని తలపై పట్టులా వేస్తే తల నొప్పి తగ్గుతుంది. ♦ రోజు ఈ ఆకుల్ని తినడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుందట ♦ ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలు జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేస్తాయి. ♦ మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు తీసుకుంటే మంచిది. ♦ రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గుతాయి. ♦ కామెర్లతో బాధపడేవారు రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. నోట్: ఈ చిట్కాలను పాటించేటపుడు, రెగ్యులర్‌గా సంప్రదించే డాక్టర్, ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
బూడిద గుమ్మడితో ఇన్ని లాభాలా? కానీ వీళ్లు మాత్రం జాగ్రత్త!
ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నపేరు బూడిద గుమ్మడికాయ. వడియాలకోసమో, లేక గుమ్మానికి దిష్టికోసమో, స్వీట్‌కోసమే వినియోగించే గుమ్మడికాయ అనుకుంటే పొరబాటే. శరీరంలోని వ్యర్ధాలను తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. పరగడుపున దీని జ్యూస్ తాగితే.. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. దీన్నే వింటర్‌మిలన్ అనీ, సంస్కృతంలో కుష్మాండ , బృహత్ఫల, ఘృణావాస, గ్రామ్యకర్కటి, కర్కారు అని కూడా అంటారు. ఇది ఆరిజన్ ఎక్కడ అనేదానిపై స్పష్టత లేనప్పటికీ జపాన్, ఇండోనేషియా, చైనా లేదా ఇండో-మలేషియాలో పుట్టిందని ఊహిస్తున్నారు. అపారమైన ఔషధ గుణాలకు గుమ్మడికాయ ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద పానీయంగా భావించే గుమ్మడికాయ జ్యూస్‌తో ప్రస్తుతం, పొట్ట సమస్యలు, కాలేయ సమస్యలు , చర్మ సమస్యల చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. చాలా మందికి రుచి నచ్చకపోవచ్చు, కానీ సప్లిమెంట్లు ఇతర ఆహార పదార్థాలలో లేని ఔషధ విలువలు ఇందులో చాలా ఉన్నాయి. గుమ్మడికాయ జ్యూస్ రూపంలో తీసుకుంటే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. చాలా సహజంగా శక్తినిచ్చే ఆహారాలలో ఒకటి ఇందులోని బయో యాక్టీవ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం ఇస్తుందని నమ్మకం. బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీరు ఉంటుంది. 4 శాతంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ , కాపర్, నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్ విటమిన్ బి1, బి 2, బి3, బి5, బి6, విటమిన్ సీ ఉంటాయి. బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.జీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది బూడిద గుమ్మడికాయ రసంలో యాంజియోలైటిక్ లక్షణాలున్నాయి. ఇది నాడీ వ్యవస్థకుమంచిది. డిప్రెషన్, ఆందోళనతో బాధపడేవారికి చాలా మంచిది. మూర్ఛవ్యాధితో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ బూడిద గుమ్మడికాయ జ్యూస్. కేలరీలు , కార్బోహైడ్రేట్లు తక్కువ, జీరో ఫాట్ లక్షణాలు పైగా ఫైబర్ ఎక్కువ. మధుమేహం ఉన్న వారికి మంచిది. ఉబకాయాన్ని నిరోధిస్తుంది కాబట్టి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.గుమ్మడికాయలో విటమిన్ B3 అధికం. శక్తినిస్తుంది. రక్తంలో గ్లూకోజ్లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి , సౌందర్యానికి మేలు చేస్తుంది. యాంటి ఏజింగ్‌గా పనిచేస్తుంది. ఫ్లవనాయిడ్స్ ఉన్నందున యాంటీ కేన్సర్‌గా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి పెంపొందిస్తుంది. ఎవరు తాగకూడదు ఈ ప్రపంచంలో ప్రతిదానికీ లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. దీర్ఘంకాలం తీసుకుంటే లోహ మూలకాలు పేరుకు పోతాయి. జ్వరంతో బాధపడుతున్నవారు, చలువ గుణం కలిగి ఉన్నందున జలుబుతో బాధపడుతున్న వారు తినకూడదు. బ్రోన్కైటిస్ ,ఆస్తమా పేషంట్లు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు వైద్యుల సలహా మేరకే దీన్ని తీసుకోవాలి. మితంగా తీసుకున్నంతవరకే ఏ ఆహారమైనా ఔషధంగా పనిచేస్తుంది. ‘అతి సర్వత్రా వర్జయేత్’ దీన్ని మర్చిపోకూడదు. -
ఆహారపు అలవాట్లను నియంత్రించకపోతే..ఆ సమస్యలు తప్పవు!
మనం తీసుకునే ఆహారం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ నిర్ణయిస్తుంది. ఆహరం అనేది రుచి కోసమో బలం కోసమో మాత్రమే కాదు, సరైన సంపూర్ణ ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవటం ఎంతో అవసరం. ఆహారం తక్కువగా తింటే పోషకాహార లోపాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఎక్కువగా తింటే అది ఊబకాయం వంటి ఎన్నో సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అందుకని ఆహారాన్ని ఎప్పుడు కంట్రోల్‌గానే తినాలి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. ఒక డైలీ డైట్ అనేది నిర్ణయించుకొని సరైన ఆహారాన్నే తినాలి. ఒక వేళ ఆహారాన్ని నియంత్రించకపోతే సమస్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు నవీన్ నడిమింటి. ఇంతకీ ఎలాంటి సమస్యలు వస్తాయి? తక్కువగా తినాంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి తదితరాలు నవీన్ నడిమింటిగారి మాటల్లో చూద్దాం. ఎలాంటి సమస్యలు వస్తాయంటే..? ఊబకాయం: ఊబకాయం అనేది అధిక బరువు లేదా అధిక కొవ్వు కలిగి ఉండటం. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, వీటిలో గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం మరియు క్యాన్సర్ ఉన్నాయి. గుండె జబ్బులు: గుండె జబ్బులు అనేవి గుండెను ప్రభావితం చేసే అనేక రకాల పరిస్థితులను సూచిస్తాయి. అవి అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు మరియు ఊబకాయం వంటి ఆహారపు అలవాట్ల ద్వారా ప్రభావితమవుతాయి. మధుమేహం: మధుమేహం అనేది శరీరం రక్తంలో చక్కెరను సరిగ్గా నియంత్రించలేకపోవడం. ఇది అధిక కొవ్వు, అధిక చక్కెర మరియు తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు తినడం వల్ల ప్రభావితమవుతుంది. క్యాన్సర్: క్యాన్సర్ అనేది కణాలు అసాధారణంగా పెరిగే పరిస్థితి. కొన్ని రకాల క్యాన్సర్లు ఆహారపు అలవాట్ల కారణంగానే వస్తాయి. వీటిలో కడుపు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ ఉన్నాయి. పాటించాల్సి టిప్స్: తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండి. గోధుమ, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తినండి తక్కువ కొవ్వు, తక్కువ చక్కెర, ఉప్పు ఉన్న ఆహారాలను ఎంచుకోండి. ఆహారాన్ని మితంగా తినండి. ఇలాంటి ఆహారపు అలవాట్లు ఆరోగ్యంగా ఉండటానికి తప్పక సహాయపడతాయి. -- నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు (చదవండి: డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి?..పొరపాటున అలా తింటే..) -
అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..
కొన్ని చెట్లకి ఆశ్చర్యకరంగా మన పురాణాల్లోని వ్యక్తుల పేర్లు ఉంటాయి. చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఐతే ఇప్పుడు మీరు వింట్ను చెట్లు పేరు కూడా మహాభారతంలో శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన వాడు అయిన అర్జునుడు పేరుతో పిలుస్తారు ఆ చెట్టుని. ఆ చెట్టు బెరడునను ఆయుర్వేదంలో తప్పనసరిగా ఉపయోగిస్తారు. ఈ చెట్లులో ఉండే ఔషధ గుణాలు చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్నీ కావు. అర్జున చెట్టు బెరడు వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సిరలు, ధమనుల్లో రక్తం ప్రవాహం సాపీగా జరిగేలా చూస్తుంది. గుండె లయబద్ధంగా కొట్టుకునేలా చేస్తుంది. రక్తపోటుని నియంత్రింస్తుంది. ఒత్తిడి, దుఃఖం వల్ల కలిగే శారీరక ఒత్తడిని నియంత్రిస్తుంది పోగాకు, దూమపానం వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ 'ఈ' సమృద్ధిగా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షస్తుంది కూడా. ఫ్యాటీ లివర్ వ్యాధికి చక్కటి దివ్యౌషధం. కాలేయ వ్యాధి ముఖ్య లక్షణమైన స్టీటోసిస్ను ఎదుర్కొవడంలో అర్జునోలిక్ యాసిడ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనంలో తేలింది. అధిక కొలస్ట్రాల్ స్థాయిలకు గట్టి ప్రత్యర్థి అర్జున బెరుడు. హైపోకొలెస్టెరోలేమిక్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. లిపోప్రోటీన్, ట్రైగ్లిజరైడ్స్ ఉనికిని తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తరుచుగా గుండెల్లో మంటగా అనిపించే ఫీలింగ్‌కు చెక్ పెడుతుంది. మంచి డైజిస్టివ్ టానిక్‌గా ఉపయోగపడుతుంది. శక్తిమంతమైన యాంటీ బాక్టీరియల్ సామర్థ్యాలను కలిగి ఉంది. కణుతుల పెరుగుదలను నియంత్రిస్తుంది. గమనిక: అయితే అర్జున బెరడుని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటే ముందుగా ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించి వారి సలహాలు సూచనలు మేరకు ఉపయోగించడం మంచిది. (చదవండి: పిల్లల్లో టాన్సిల్స్ సమస్య ఎందుకు వస్తుంది? నిజానికి ట్రాన్సిల్స్ మంచివే ఎందుకంటే..) -
శ్వాసకోశ సమస్యలకు.. శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమా?
చాలామంది ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలను ఫేస్ చేస్తుంటారు. ఊపిరి పీల్చుకోలేక నరకయాతన పడుతుంటారు. పొరపాటున స్పీడ్‌గా నడిచినా లేక ఏదైనా ఆహారం తింటున్నప్పుడూ పొలమారి ఎగ ఊపిరి దిగ ఊపిరి అన్నట్లుగా ఉంటుంది. ఓ పట్టాన తగ్గదు. కొందరికి నిరంతరం ఓ సమస్యలా ఉంటుంది. చాలా ఇబ్బందులు పడుతుంటారు కూడా. దీనికి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమేమో అని చాలామంది భావిస్తారు. కానీ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి దీనికి ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉనాయని చెబుతున్నారు. వాటిని వాడితే సులభంగా బయటపడొచ్చని చెబుతున్నారు. అవేంటో చూద్దాం. వేప నూనెతో ఈజీగా బయటపడొచ్చు.. వేప నూనె రోజు రెండు చుక్కలు ముక్కు రంధ్రాల్లో వేయండి.వేసిన తర్వాత గట్టిగా పైకి లాగితే అది నోటి ద్వారా బయటికి వచ్చేస్తుంది దాంతోపాటు లోపల ఉన్న కఫం కూడా కొట్టుకు వచ్చేస్తుంది ఇది చాలామందిలో చక్కని ఫలితం ఇచ్చిన ఆయుర్వేద సలహా అని అంటున్నారు నిపుణులు నవీన్ నడిమింటి . ఇలా చేస్తే ఆపరేషన్ కడా అవసరం ఉండదు. అలా రెండు మూడు వారాలు చేయండి ఒక వారంలోనే మీకు చాలా రిలీఫ్ కనిపిస్తుంది తర్వాత చెక్ చేసుకోండి మొత్తం కండకరిగిపోతుంది. ఇతర ఔషధాలు.. 👉స్వర్ణభ్రాకాసిందుర: ఇది ఉబ్బసం, దగ్గు, ఛాతీ వణుకు చికిత్సకు సహాయపడుతుంది. అలాగే టీబీ రోగికి కూడా వినియోగించొచ్చు. మోతాదు : 1 గ్రా మోతాదు వసారిస్టాతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 👉వసరిష్ట (మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే): ఇది శ్వాసనాళ సమస్యలు, సైనసైటీస్ , గుండె ప్రభావాలలో ఉత్పత్తి చేసే దగ్గు, రక్త పిత్తానికి నమ్మకమైన నివారణ. మోతాదు: ఆహారం తర్వాత రోజూ రెండుసార్లు - 4 చెంచాల సిరప్ సమానమైన నీటితో కరిగించి ఆహారం తర్వాత తీసుకోవాలి. 👉చ్యవన్ ప్రాష్ (మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే): గొప్ప నరాల టానిక్. ఊపిరితిత్తులను ఉత్తేజపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది, యవ్వనంగా ఉంచుతుంది. మోతాదు: 1.5 టీస్పూన్ బ్రోన్ఫ్రీ తర్వాత రోజుకు రెండుసార్లు వాడాలి. 👉మహాలక్ష్మివిలసరస: ఉబ్బసం కోసం ఎక్కువగా సిఫార్సు చేస్తారు. మోతాదు : 1 గ్రా . రోజుకు రెండుసార్లు (ఉదయం మరియు సాయంత్రం) తేనెతో వాడాలి. త్వరగా కోలుకోవటానికి చ్యవన్ ప్రాష్ని, వసరిష్టలతో పాటు లేదా వైద్యుడు నిర్దేశించిన విధంగా నిర్వహించాలని సలహా. 👉లోహాసవ: మోతాదు: భోజనం తర్వాత 10ఎంఎల్ మోతాదులో నీటి సమాన పరిమాణంతో తీసుకోవాలి. 👉హేమమృతరాస: మోతాదు: వైద్యుడు దర్శకత్వం వహించినట్లు రోజుకు రెండుసార్లు చ్యవనప్రసాతో లేదా పరిక్షారిస్తాతో ద్రక్షారిస్తా / వసరిష్టతో కలిపి వాడాలి. సీతోపలాది 👉చూర్ణ: మోతాదు: 2 గ్రా నుంచి 3 గ్రా. రోజుకు రెండుసార్లు కండ చెక్కెరతో వాడాలి. బ్రాన్ఫ్రీ: శ్వాసనాళ రుగ్మతలపై పనిచేస్తుంది. మోతాదు: ఒక టాబ్లెట్ రోజుకు రెండుసార్లు నీటితో తీసుకోవాలి. పై మందులను మూడు నెలల కాల పరిమితితో తీసుకున్నచో గొప్ప ఫలితాలు లభించును. శరీర తత్వాన్ని బట్టి కొంతమందిలో త్వరగా మరికొంతమందిలో కొంత ఆలస్యంగా ఫలితాలు రావొచ్చు.. అలాంటి వారికి మరికొంత సమయం మందులు వాడవలసి ఉంటుంది.. తాము చెప్పే నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా.. చెప్పిన కాలపరిమితి వరకు ఈమందులను వాడితే మీరు ఆశించిన దానికంటే ఇంకా గొప్ప ఫలితాలని మీరే స్వయంగా చూస్తారని చెబుతున్నారు నవీన్ నడిమింటి -ఆయుర్వేద వైద్యుడు నవీన్ నడిమింటి (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!) -
ఆహారంలోని ఔషధాన్నే వెలికి తీసి వాడితే... ఎలా ఉంటుంది?
ఆహారాన్ని ఔషధంలా తీసుకోవాలి...లేకపోతే... ఔషధాలనే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ సూక్తిలో గొప్ప ఆరోగ్య హెచ్చరిక దాగి ఉంది. ఆహారంతోనే ఆరోగ్యం... అంటుంది వైద్యరంగం. ఆహారంలోని ఔషధాన్ని వెలికి తీసి వాడితే... ఎలా ఉంటుంది? త్రిపుర చేస్తున్న ప్రయత్నమూ అదే. ‘ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగిన వారి కోసం ఒక సమూహాన్ని సంఘటితం చేస్తున్నాను’ అంటున్నారు లక్కీ 4 యూ న్యూట్రాస్యుటికల్స్ ప్రతినిధి త్రిపుర. ‘ఆహారం అంటే కంటికి ఇంపుగా కనిపించినది, నాలుకకు రుచిగా అనిపించినది తినడం కాదు. దేహానికి ఏమి కావాలో, ఏది వద్దో తెలుసుకుని తినడం. ఈ విషయంలో నాకు స్పష్టత వచ్చేటప్పటికే నా జీవితం భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. పీసీఓడీ, ఒబేసిటీ వల్ల పిల్లలు పుట్టడం ఆలస్యమైంది. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు వేసుకుని జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. మా వారికి రక్తం మరీ చిక్కబడడం, బ్లడ్ థిన్నర్స్ వాడినా ఫలితం కనిపించక బ్రెయిన్ స్ట్రోక్ ఆయనను తీసుకెళ్లి పోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. జీవితం అగమ్యగోచరమైంది. ఆ షాక్‌లో ఉన్న నాకు ఒక వ్యాపకం ఉండాలని మా అన్నయ్య చేసిన ప్రయత్నమే ఇది’ అంటూ తాను పరిశ్రమ నిర్వహకురాలిగా మారిన వైనాన్ని సాక్షితో పంచుకున్నారు త్రిపుర సుందరి. ఇంటర్నెట్ నేర్పించింది! ‘‘నేను పుట్టింది, పెరిగింది విజయవాడలో. సిద్ధార్థ మహిళా కళాశాలలో బీఏ చేశాను. భర్త, ఇద్దరు పిల్లలతో గృహిణిగా సౌకర్యవంతంగా ఉన్న సమయంలో జీవితం పరీక్ష పెట్టింది. నన్ను మామూలు మనిషిని చేయడానికి మా అన్నయ్య తిరుపతికి తీసుకెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాలో కెమికల్ ఇంజనీరింగ్ చేసి తిరుపతిలో న్యూట్రాస్యూటికల్స్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఫార్మారంగంలో పనిచేయమని ప్రోత్సహించాడు. నేను చదివింది ఆర్ట్స్ గ్రూపు. ఫార్మా పట్ల ఆసక్తి లేదనడం కంటే అసలేమీ తెలియదనే చెప్పాలి. కలినరీ సైన్స్ (పాకశాస్త్రం) ఇష్టమని చెప్పాను. ఆ సమయంలో నా మాటల్లో తరచూ మన ఆరోగ్యం మీద ఆహారం ఎంతటి ప్రభావం చూపిస్తుందోననే విషయం వస్తుండేది. మేము ఎదుర్కొన్న అనారోగ్యాలన్నీ ఆహారం పట్ల గమనింపు లేకపోవడంతో వచ్చినవే కావడంతో నా మెదడులో అవే తిరుగుతుండేవి. నాకు అప్పటికి ప్రోటీన్ ఏంటి, విటమిన్ ఏంటనేది కూడా తెలియదు. కానీ ఈ రంగంలో పని చేయాలనుకున్నాను. బ్రాండ్ రిజిస్ట్రేషన్ నుంచి పరిశ్రమ స్థాపనకు అవసరమైన ఏర్పాట్లన్నీ అన్నయ్య చేసి పెట్టాడు. ఈ రంగం గురించిన వ్యాసాలనిచ్చి చదవడమనేవాడు. ఆ తర్వాత నేను ఇంటర్నెట్ను కాచి వడపోశాననే చెప్పాలి. ఇప్పుడు సీవోటూ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్ నుంచి కాంబినేషన్ల వరకు క్షుణ్నంగా తెలుసుకున్నాను. నాకు సబ్జెక్టు తెలిసినప్పటికీ సర్టిఫైడ్ పర్సన్ తప్పని సరి కాబట్టి క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, ముగ్గురు ఫుడ్ ఎక్స్‌పర్ట్‌లను తీసుకున్నాను. తేనెతోపాటు ఇంకా... ఫలానా ఆరోగ్య సమస్యకు ఉదయాన్నే తేనెలో అల్లం రసం కలిపి తినాలి, తేనెతో లవంగం లేదా దాల్చినచెక్క పొడి తీసుకోవాలి. మొలకెత్తిన గింజలను ఉదయం ఆహారంగా తినాలి... ఇవన్నీ ఆరోగ్యకరం అని తెలిసినప్పటికీ ఈ రోజుల్లో వాటిని రోజూ చేసుకునే టైమ్ లేని వాళ్లే ఎక్కువ. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ అంతలా డీలా పడిపోవడానికి కారణం దేహంలో పోషకాల నిల్వలు ఉండాల్సిన స్థాయిలో లేకపోవడమే. అందుకే ఇన్ఫ్యూజ్డ్ హనీ తయారు చేశాం. అలాగే స్ప్రౌట్స్ తినే వారికి ఉద్యోగరీత్యా క్యాంప్లకెళ్లినప్పుడు కుదరదు కాబట్టి డీ హైడ్రేటెడ్ స్ప్రౌట్స్ తీసుకువచ్చాను. ఇలా ప్రతి ఉత్పత్తినీ ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు మోతాదులు పాటిస్తూ నేను చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. ముంబయిలో ఈ నెల 16 నుంచి నాలుగు రోజులపాటు జరిగే ‘ఎఫ్ ఐ ఇండియా’ సదస్సులో నా అనుభవాలను పంచుకుంటూ ప్రసంగించనున్నాను. దుబాయ్‌లో జరిగే ఎగ్జిబిషన్లో కూడా అన్ని దేశాల వాళ్లు స్టాల్ పెడుతుంటారు. గత ఏడాది తెలుసుకోవడం కోసమే వెళ్లాను. నా యూనిట్‌ని ఇంకా ఎలా విస్తరించవచ్చనే స్పష్టత వచ్చింది. ఈ ఏడాది చివరలో దుబాయ్ ఎగ్జిబిషన్ ద్వారా అంతర్జాతీయ వేదిక మీదకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాను’’ అని వివరించారు త్రిపుర. ఇష్టంగా పనిచేశాను! నా యూనిట్‌ని మా అన్నయ్య యూనిట్‌కు అనుబంధంగా నిర్మించాం, కాబట్టి ప్రతిదీ తొలి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ప్లాంట్ నిర్మాణం నుంచి ప్రతి విషయాన్నీ దగ్గరుండి చూసుకోమని చెప్పడంతో రోజుకు పదమూడు గంటలు పని చేశాను. ఇప్పుడు మూడు షిఫ్టుల్లో పని జరుగుతోంది. యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఒకవిధమైన ఆందోళన వాతావరణమే ఉండేది. ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా అనే సందేహం నాతోపాటు అందరిలోనూ ఉండింది. మా అన్నయ్య మాత్రం ‘ఏదయితే అదవుతుంది, నువ్వు ముందుకెళ్లు’ అనేవాడు. నేను చేస్తున్న పని మీద ఇష్టం పెరగడంతో అదే నా లోకం అన్నట్లు పని చేశాను. మా ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ, జీఎమ్‌పీ, ఐఎస్ఓ వంటి దేశీయ విదేశీ సర్టిఫికేట్లు వచ్చాయి. కానీ నేను మా ఉత్పత్తుల అవసరం ఉన్న అసలైన వాళ్లకు పరిచయమైంది మాత్రం ఈ నెల మొదటి వారంలో జరిగిన ‘రాయలసీమ ఆర్గానిక్ మేళా’తోనే. – ఎం. త్రిపుర, ఆపరేషనల్ మేనేజర్, లక్కీ 4 యూ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!) -
దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా..?
దెబ్బ తగిలిందని టీటీ ఇంజెక్షన్ తీసుకుకున్నాను. అయినా నొప్పి తగ్గట్లేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా చీము పట్టింది. ఇనుప రేకు గీసుకుపోయింది..టీటీ ఇంజెక్షన్ ఇవ్వండి". దెబ్బ తగిలింది ఇనుముతో కాదు కదా.. టీటీ ఇంజెక్షన్ ఎందుకు? దెబ్బ తగిలింది.. టీటీ ఇంజెక్షన్ తీసుకొని ఆరు నెలలకు పైనే అయింది. మరో ఇంజెక్షన్ ఇవ్వండి. ప్రజలు నంచి సాధారణంగా వినే మాటలే ఇవీ.. దీన్నిబట్టి చూస్తే.. టీటీ ఇంజెక్షన్ గురించి సామాన్య ప్రజలకు చాలా అపోహలే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అపోహాలకు చెక్‌పెట్టి..అసలుఎప్పుడెప్పుడూ తీసుకోవాలి? అలసెందుకు తీసుకోవాలో చూద్దా!. ధనుర్వాతం.. టెటనస్.. లాక్ జా.. టెటనస్ అనేది మనుషులకు కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్స్లో ఒకటి. దీని గురించిన మొదటి ప్రస్తావన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే హిప్పోక్రేట్స్ (Hippocrates) రచనల్లో కనిపిస్తుంది. ఇది ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ రోజుకీ ధనుర్వాతం అంటే టెటనస్ బారిన పడిన వారిలో 70 నుంచి 80% మరణాలు నమోదు అవుతున్నాయి. కాబట్టి, చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఇచ్చే టీకాలలో ఇది కూడా ఉంటుంది. గర్భిణులకు కూడా టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. కాన్పు సమయంలో తల్లికి, బిడ్డకు ఇది రక్షణ ఇస్తుంది. ఈ ఇన్ఫెక్షన్కు కారణం క్లస్ట్రీడియమ్ టెటానీ(Clostridium Tetani) అనే ఒక సూక్ష్మ జీవి (బ్యాక్టీరియా). ఇవి మట్టిలో, నేలలో, దుమ్ములో, ఇలా ప్రతి చోటా ఉంటాయి. అవి శరీరంలోకి చేరుకున్నప్పుడు వ్యాధికి కారణం అవుతాయి. అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదు. టీటీ ఇంజెక్షన్ కేవలం టెటనస్ వ్యాధి నుంచి రక్షణను ఇస్తుంది. అది కూడా దెబ్బ తగిలిన ఒక్క రోజు లోపు దీన్ని తీసుకోవాలి. ఇది శరీరంలోకి ఎలా చేరతుందంటే? శరీరానికి అయిన పుండ్లు, లేక తగిలిన దెబ్బల ద్వారా ఇవి శరీరంలోకి చేరగలవు. మొల, లేక ఏదైనా పదునైన వస్తువులు గుచ్చుకోడం వల్ల, శరీరానికి గాయం అయినప్పుడు చేరవచ్చు. కాలిన గాయాల నుంచి జరగొచ్చు. కాన్పు సమయంలో తల్లికి లేక పుట్టిన శిశువుకి బొడ్డు కోయడానికి వాడిన పరికరం సరిగ్గా లేకపోతే ఆ శిశువుకి ధనుర్వాతం కలిగే అవకాశం ఉంది. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు, తగిలిన గాయాల ద్వారా వ్యాధి కారకాలు శరీరంలోకి చేరగలవు. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు, లేక ఏదైనా పట్టీ కట్టినప్పుడు లేదా మార్చినప్పుడు చేరే అవకాశం ఉంటుంది. కుక్క లేక ఇతర జంతువులు కరిచినప్పుడు ఆ గాయాల ద్వారా సంభవించవచ్చు. ఎముకలు విరగడం, లేక దీర్ఘ కాలిక పుండ్లు, గాయాలు ఉన్న వారికి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు.. ►వ్యాప్తి ఎలా జరిగింది అనే దాన్ని బట్టి, ఎన్ని రోజులకు లక్షణాలు కనిపిస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. ►ఎక్కువ శాతం రెండు వారాలలోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన గాయాలలో, లక్షణాలు కొన్ని గంటల నుంచి, ఒకటి రెండు రోజుల్లోనే కనిపిస్తాయి. చిన్న గాయాలతో కొన్ని నెలల తరవాత కూడా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ►ఎక్కువ శాతం కేసుల్లో మొదట నోటి కండరాలు పట్టేస్తుంటాయి. తర్వాత ఒకొక్కటిగా అన్ని కండరాలు బిగుసుకుపోవడంతో, నొప్పి ఎక్కువవుతుంది. క్రమేణా, అన్ని కండరాలు బిగించినట్టు పట్టేస్తాయి. ఆహారం మింగడం కష్టంగా మారుతుంది. ►తీవ్రమైన తలనొప్పి, అదుపు లేకుండా జ్వరం, చెమటలు కూడా కనిపిస్తాయి. అదుపు లేకుండా శరీర భాగాలలో కదలికలతో మూర్ఛ, ఫిట్స్ తరవాత దశలో కనిపిస్తాయి. ►గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్త పోటు పెరిగి క్రమేణా ప్రాణాపాయ స్థితి వస్తుంది. చికిత్స విధానం: ⇒ఈ వ్యాధిని తొలి దశల్లో కచ్చితంగా నిర్ధారించడం కష్టం. లక్షణాల ఆధారంగా, ఎక్కువ శాతం దీనిని గుర్తిస్తారు. ⇒వ్యాధి లక్షణాలు కనిపించిన తరవాత చికిత్స చాలా వేగంగా అందించాలి. వెంటనే పెద్ద ఆసుపత్రిలో చేరి, గాయం అయిన చోటును పూర్తిగా శుభ్రపరిచి, యాంటీబయోటిక్ ⇒ఇంజెక్షన్లు, కండరాల నొప్పులకు, పట్టేయడాన్ని తగ్గించే (muscle relaxant) మందులు వాడుతూ, ఒంట్లో నీరు తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ⇒ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి రావొచ్చు. అవసరాన్ని బట్టి, కృత్రిమ శ్వాస అందిస్తూ, మందుల ప్రభావం కోసం ఎదురు చూడాలి. నివారణ: ధనుర్వాతాన్ని నివారించే సులువైన, ఏకైక మార్గం టీకా తీసుకోవడం. అందుకే చిన్న పిల్లలకు ప్రభుత్వం అందించే టీకాలల్లో డిఫ్తీరియా( కంఠవాతము), కోరింత దగ్గు టీకాలతో పాటు ధనుర్వాతం టీకా కూడా ఉంటుంది. అలాగే అయిదు సంవత్సరాలు, పది సంవత్సరాల వయసులో బూస్టర్ డోస్ ఇస్తారు. ఆ తరవాత పెద్ద వాళ్ళల్లో, ప్రతి పది సంవత్సరాలకు ఒక డోస్ టీకా తీసుకోవాలి. కాన్పు సమయంలో బిడ్డకు వ్యాధి సోకకుండా, గర్భిణులు తప్పకుండా టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఏదైన దెబ్బ తగిలినా, కాలిన గాయాలు, లేక పుండ్లు ఉన్నా, వాటిని శుభ్రం ఉంచుకోవాలి. అవి మానేవరకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. టీటీ ఇంజెక్షన్‌పై కొన్ని అపోహలు/ నిజాలు ఇవే... దెబ్బ వల్ల కలిగే నొప్పిని టీటీ ఇంజెక్షన్ తగ్గించలేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా ఇతర క్రిముల వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. పుండు తగ్గే వరకు జాగ్రత్తగా ఇతర మందులు వాడాలి. ఆ ఇన్ఫెక్షన్ కేవలం తుప్పు పట్టిన వాటి నుంచే కాదు.. ఏ గాయం వల్ల అయినా కలగవచ్చు. ఒకసారి టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే పది సంవత్సరాల వరకు అది ధనుర్వాతం రాకుండా రక్షణ ఇస్తుంది. ప్రతి ఆరు నెలలకు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాణాంతక వ్యాధి అయిన టెటనస్ రాకుండా ఉండడానికి టీటీ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ నవీన్ రోయ్, ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు (చదవండి: చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందట!) -
రాహుల్ గాంధీకి కేరళలో ఆయుర్వేద వైద్యం..
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. మళప్పురం జిల్లాలోని కొట్టక్కల్‌లోని ఆర్య వైద్యశాలలో శుక్రవారం చికిత్స ప్రారంబించినట్లు తెలుస్తోంది. జులై 29 వరకు మరో వారం రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆయనకు తోడుగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రస్టీ మేనేజింగ్ డైరెక్టర్ మాదవన్ కుట్టీ వారియార్ సమక్షంలో చికిత్స కొనసాగనుంది. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ ఛాందీ అంత్యక్రియలకు హాజరైన రాహుల్ గాంధీ.. ఆలస్యం కారణంగా తన కార్యక్రమాలను వాయిదా వేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా తనకు మోకాళ్ల నొప్పులు వచ్చాయని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. రాహుల్ దేనికి చికిత్స తీసుకుంటున్నారనే విషయం పూర్తిగా తెలియదు. 116 ఏళ్ల చరిత్ర కలిగిన కొట్టక్కల్ ఆర్య వైద్యశాల ఆయుర్వేద చికిత్సలో దేశానికి సేవ చేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన రోగులకు సైతం వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇదీ చదవండి: వామ్మో..! అల్లుళ్లకు కట్నంగా 21 పాములు.. -
ఆయుర్వేద వైద్యంతో క్యాన్సర్ నయం చేస్తానంటూ రూ.15 లక్షలు టోకరా!
ఆదునిక టెక్నాలజీతో కూడిన వైద్యం వచ్చాక ఆయుర్వేదం వైద్యం వైపుకి జనం వెళ్లటం చాలా వరకు తగ్గిపోయారు. ఐతే ఇంకా అక్కడక్కడ కొంతమంది ఆయుర్వేద వైద్యాన్నే నమ్ముతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకునే కొందరు దుండగలు అమాయక ప్రజలను పెద్ద మొత్తంలో మోసం చేస్తున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..థానే రైల్వే సిబ్బంది ఒక ఆయుర్వేద సెంటర్‌పై కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఆయుర్వేద వైద్యంతో తగ్గిస్తానంటూ ఇద్దరు వ్యక్తులు సుమారు రూ. 15 లక్షలు తీసుకున్నారని పోలీసులుకు ఫిర్యాదు చేశాడు రైల్వే పెయింటర్. గత ఏడాది ఫిబ్రవరి నుంచి తన భార్యకు ఆ ఆయుర్వేద సెంటర్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు. అయితే తన భార్య పరిస్థితిలో మార్పురాలేదని వాపోయాడు. దీంతో ఆ ఆయుర్వేద సెంటర్లోని ఇద్దరు వ్యక్తులు ముఖం చాటేస్తూ..తప్పించుకుని తిరుగుతన్నారని పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు సదరు ఆయుర్వేద సెంటర్లోని ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేయలేదని, ఆరోపణలపై దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: రాహుల్ గాంధీ అనర్హత వేటుకి నిరసనగా..సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్!) -
ఈ కాఫ్ సిరప్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
కొంతమందికి వర్షాకాలం వస్తే చాలు... జలుబు, దగ్గు, కఫం. ఇంకొందరికి చలికాలంలో ఈ బాధలు వస్తాయి. అయితే ఈ కాలం ఆ కాలం అని కాకుండా కొందరు ఎప్పుడూ ఖంగ్ ఖంగ్... హాచ్ ∙హాచ్ ... అని అంటూ ఉంటారు. నానా విధాలైన దగ్గు మందులు, రకరకాలైన టాబ్లెట్లు వాడినా కొద్ది రోజులకే సమస్య షరామామూలే! అయితే, ఛాతీలో పట్టిన కఫం పోయి, దానివల్ల వచ్చే దగ్గు తగ్గడానికి ఆయుర్వేదం మంచి చిట్కాను చెబుతోంది. దీన్నిపాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. పైగా ఇందులో అన్ని సహజమైనవే వాడతాం కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లోనే ఈ ఆయుర్వేద మందును తయారు చేసుకోవచ్చు. ఏం చేయాలంటే ... ఈ మందును తయారు చేయడానికి ఇంట్లో ఉండే పదార్థాలే అంటే వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, పుదీనా, తులసి వంటివి సరిపోతాయి. ఇంతకూ కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. ఆ నీళ్లు వేడెక్కుతున్నప్పుడే రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి వేయాలి. అలాగే పది మిరియాలు, పది లవంగాలు, చిన్న అల్లం ముక్కను కూడా బాగా దంచి అందులో కలిపి మరిగించాలి. చివర్లో ఆరు తులసి ఆకులు, గుప్పెడు పుదీనా ఆకులు, చిటికడు పసుపు వేసి మరిగించాలి. ఇవన్నీ బాగా మరిగాక కషాయంలా తయారవుతాయి. స్టవ్ మీదినుంచి దించి గోరువెచ్చగా మారాక వడకట్టుకోవాలి. ఈ కషాయాన్ని కాఫీ తాగుతున్నట్టు సిప్ చేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల ఛాతీలోని కఫం వదులుతుంది. కఫంతో బాధపడుతున్నప్పుడు మూడు రోజులుపాటు ఈ కషాయాన్ని రోజూ తాగాలి. ఈ కషాయంలో వాడిన పదార్థాలన్నీ ఉత్తమమైనవే. వాటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కఫం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి త్వరగా తగ్గిపోతాయి. ఈ కషాయం రోగనిరోధక శక్తిని పెంచి ఇలాంటి వ్యాధులు ఏవి రాకుండా కా΄ాడుతుంది. దీని రుచి కూడా అంత ఇబ్బందిగా ఉండదు. కాబట్టి పిల్లలకు కూడా తాగించవచ్చు. దీనివల్ల దుష్ప్రభావాలు ఉండవు. ఈ కషాయాన్ని ఫ్రిజ్‌లో దాచుకొని మళ్ళీ వేడి చేసుకొని రెండు, మూడు రోజులపాటు తాగకూడదు. అలా చేయడంవల్ల అది ప్రభావవంతంగా పనిచేయదు. -
అడవిలో అగ్నిశిఖ
పెద్దదోర్నాల (ప్రకాశం): ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని వివిధ ప్రాంతాల్లో కనువిందు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని పులిచెరువు, తుమ్మలబైలు తదితర ప్రాంతాల్లో ఈ తీగజాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. అందమైన పుష్పాలతో ఆకట్టుకునే అగ్నిశిఖ మొక్కలు అత్యంత విషపూరితమైనవి. ఇందులో విషపూరితమైన కోల్చీసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని ఇంగ్లిష్‌లో ఫ్లేమ్ లిల్లీ, ఫైర్ లిల్లీ, గ్లోరియసా లిల్లీ అని.. వాడుకలో నాగేటిగడ్డ, నీరుపిప్పిలి అని పిలుస్తుంటారు. ఇవి పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. వీటి పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు రంగు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి. ఆయుర్వేదంలో దివ్యౌషధం ఆయుర్వేదంలో దీనిని దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలు అన్నీ విషపూరితమైనవే. పాముకాటు, తేలు కాటుకు విరుగుడుగా, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలు, గాయాలకు మందులుగా వాడతారు. ఉదర క్రిములను బయటకు పంపించే మందుగాను, దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టువల్ల కలిగే గాయాలు, మొలలు, పొత్తి కడుపు నొప్పి నివారణకు వినియోగిస్తారు. శరీరానికి బలవర్ధకమే కాక వీర్యవృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. ఆత్మన్యూనత లాంటి మానసిక రోగాలతో పాటు, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక రోగ నివారణకు దీనిని వినియోగిస్తారు. సుఖవ్యాధుల చికిత్సలోనూ అడవినాభి ఉపయోగపడుతుంది. గర్భధారణ అవకాశాలను పెంచటంలో ఇది బాగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అడవినాభి అద్భుతమైన ఔషధి నల్లమల అభయారణ్యంలోని కొన్ని ప్రాంతాల్లో లభించే అడవినాభి అరుదైన ఔషధ గుణాలు ఉన్న మొక్క. దీన్ని పలు పేర్లతో పిలుస్తుంటారు. పాముకాటు, తేలుకాటు, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలకు సంబంధించిన మందుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. – ఎం.రమేష్, సైంటిస్ట్, బయోడైవర్సిటీ, శ్రీశైలం ప్రాజెక్టు -
Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
కొందరు ఉప్పును తగ్గించి తింటారు.. కొందరైతే అసలు ఉప్పే వాడరు. ఏ కొంచెం తిన్నా ఎక్కడ బీపీ పెరిగి పోతుందేమో అన్న భయంతో తినరు. ఉప్పులేని చప్పిడి తిండి తింటారు అయినా కూడ బీపీ కంట్రోల్ కాదు. సహజంగా బీపీ పెరగడానికి ప్రధాన కారణం జీవన శైలి. వేళకు తినకపోవడం, ప్రతీ చిన్న విషయానికి అతిగా రియాక్ట్ కావడం, సరిగా నిద్రపోకపోవడం, అధిక భావోద్వేగాలు బీపీని పెంచుతాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి బీపీకి దారితీస్తుంది. అలాగే అస్తవ్యస్థ తిండి అలవాట్లు, సిగరెట్లు, మద్యం కూడా ఒక కారణం. ఇలా చేయండి ► ప్రస్తుత పరిస్థితుల్లో 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ బీపీని ప్రతీ 3 నెలలకు ఒక సారి చెక్ చేయించుకోవాలి. ►130/90 కంటే రక్తపోటు అధికంగా ఉంటే డాక్టర్ సహాయం తీసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. ►ఒక వేళ బీపీ ఉందని తేలితే జీవన శైలిలో తగిన మార్పులు కచ్చితంగా చేసుకోవాల్సిందే. ►కచ్చితంగా నడక లేదా వ్యాయామం చేయాలి. ►మానసిక ఆందోళనలకు దూరంగా ఉండాలి. ►ధ్యానం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ►ఎప్పటికప్పుడు బీపీ ని చెక్ చేసుకుని, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి. ఇవి తగ్గించండి ►అధిక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. ►చక్కెర వినియోగాన్ని కూడా తగ్గిస్తే మంచిది. ► సిగరెట్ అలవాటు ఉంటే మానేస్తే మంచిది. ►మద్యపానం అలవాటు ఉంటే మితంగా తీసుకోవాలి. ఇవి తినండి.. ఇలా చేయండి ఒంట్లో బాలేదంటే దానర్థం శరీరంలో ఎక్కడో తేడా ఉందని అర్థం. మన శరీరానికి ఈ కిందికి కచ్చితంగా అవసరం ఉందని గుర్తించాలి. ► పండ్లు, పచ్చి కూరగాయలు, సలాడ్స్, గింజలు, గింజ ధాన్యాలు ►తేనె, గోరువెచ్చని నీళ్ళు ►రోజు వారీ వాకింగ్ చేయాలి ►కుటుంబ సభ్యులతో ప్రేమ, అనుబంధాలు ►మిత్రులతో స్నేహం ►సూర్యరశ్మి, చెట్లు, మంచి గాలి, ప్రక్రృతి ►మంచి పుస్తకాలు ఈ జాగ్రత్తలు తీసుకుని బీపీ నార్మల్ స్థాయిలో ఉంచుకోలగలిగితే బీపీ పెద్ద ప్రమాదంగా మారకుండా ఉంటుంది. ఉప్పు గురించి అతిగా ఆలోచించవద్దు... ఒకవైపు భయం, మరో వైపు తిండి రుచించక పోవడం ఎక్కడ టపా కట్టేస్తామో అనే టెన్షన్. అసలూ మన శరీరమే ఉప్పుతో ఉంది మనం తాగే నీటిలో ఉప్పే ఉంది ఉప్పు లేని పదార్థాలు ఎక్కడున్నాయి? అసలు ఈ భూమే నీటిలో ఉంది. సముద్రం అంటే ఉప్పేగా. ఆ సముద్రాలు సూర్యుని వేడికి ఆవిరై పైకి వెళ్ళి మేఘాలుగా తయారై కింద వర్షిస్తాయి. వాటిని ఫిల్టర్ చేసుకుని మనం తాగుతున్నాము. కానీ భూమి కింద ఉన్న నీరంతా ఉప్పునీరే. బోరుబావుల్లో కూడ ఉప్పు ఉంది. గాలిలో ఉప్పు ఉంది పళ్ళలో కూడా ఉప్పే ఉంది. ఉప్పు లేనిదేదీ లేదు, మనకు చెమట పట్టినప్పుడు అది నోటిని తాకితే ఉప్పగా ఉంటుంది. ఎందుకూ మనం ఉప్పు తిన్నా, తినకున్నా శరీరంలో ఉప్పు ఉంది. అన్నీంటా ఉంది ఉప్పు. మనం చేయాల్సింది నీటిని బాగా మరిగించి చల్లార్చి ఫిల్టర్ చేసుకొని తాగితే కొంతలో కొంతైనా శరీరంలో ఉప్పు ఇనుము కొంచెం తగ్గుతుంది. బీపీ వెనక్కు తగ్గుముఖం పడుతుంది. కానీ కొంతమంది ఈ కరోనా భయంతో వేడినీళ్ళే తాగుతారు. అది తప్పు. వేడినీళ్లు తాగటం వలన లోపల సన్నటి నరాలు దెబ్బతింటాయి. మెదడు నరాలు, కంటి నరాలు కూడా దెబ్బతింటాయి. అంతే కాదు శరీరలో మాంసం ఉడికి పోతుంది. ఫిట్టుగా ఉన్న బాడీ లూజ్ అయిపోతుంది బలం తగ్గుతుంది కాబట్టి వేడిని చల్లార్చి తినాలి తాగాలి. చాలామంది టీని కూడా వేడి వేడిగా తాగేస్తారు. అలా తాగకూడదు. కాస్త చల్లబడినాక తాగాలి. మరిగించిన దానిలో ఉప్పు తగ్గుతుంది అవిరియై బయటకు వెళ్ళిపోతుంది. కొంతమంది పచ్చి కూరలు కాయలు తింటుంటారు. కొందరు సగమే ఉడికించి తింటారు. అలా తింటే డైరెక్ట్‌గా ఉప్పునే తిన్నట్టు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. ►ఉదయాన్నే వాకింగ్ చేయాలి, ఎందుకంటే చెట్ల నుండి ఔషధాలు విడుదల అవుతాయి. చెట్లు రాత్రి వేళ చెడుగాలిని పీల్చుకొని ఉదయం నాలుగు గంటలనుండీ అమృతానికి సంబం ధించిన ఔషధాలను విడుదల చేస్తాయి అవీ ఉదయం 4 నుండి 630 వరకు ఉంటుంది. ఆ చెట్లనుండి వచ్చే రసాయన గాలిని పీల్చుకొవాలి కానీ మనవాళ్ళు పొద్దున్నే వ్యాపారాలకని డుగ్ డుగ్ డుగ్ అనీ బయల్దేరుతారు. అప్పుడు పొల్యూషన్ పామై అమృత గడియల్లో విడుదలైన ఆ ఔషదాలు చెట్లరసాల గాలీ చెడిపోతాయి. ►ఇక దానికేమి చెయ్యలేము కానీ కనీసం ఇంటిముందర అయినా వాకింగ్ చేస్తే చెమట రూపంలో శరీరం నుండి ఉప్పు బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత శుభ్రంగా స్నానం చేస్తే ఒళ్ళు తేలికగా ఉంటుంది. ►ఉప్పు తగ్గడం వలన మళ్లీ గాలితో మన శరీరంలోకి ఉప్పు స్టోరేజ్ అవుతుంది అందుకనీ ప్రాణాయామం చెయ్యాలి. దానివలన ఎంతో మేలు జరుగుతుంది ఉడికినవే తాగాలి తినాలి, వేడివి కాదు సుమా చల్లార్చుకొని తినాలి. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
ఆన్లైన్లో ఆయుర్వేద మందుల్ని కొనుగోలు చేస్తున్నారా!
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఆయుర్వేద ఔషధాల విక్రయాలను నిర్వహించే కంపెనీలకు సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ఎంపిక చేసిన ఆయుర్వేద, సిద్ధ, యునానీ ఔషధాలను, చెల్లుబాటు అయ్యే వైద్యుడి ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేసిన తర్వాతే, నిర్ధారించుకుని విక్రయించాలని పేర్కొంది. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ నిబంధనలు 1945 చట్టంలోని షెడ్యూల్ ఈ (1)లో పేర్కొన్న ఔషధాలకు ఈ నిబంధనలు అమలవుతాయని తెలిపింది. ఆయుర్వేద, సిద్ధ, యునానీకి సంబంధించి విషపూరితమైన పదార్థాలతో తయారు చేసిన ఔషధాల జాబితా షెడ్యూల్ ఈ(1)లో ఉంది. ఈ ఔషధాలను వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలని చట్టం చెబుతోంది. -
ఆయుర్వేదాన్ని అనుసరిస్తే...కరోనా నివారణ సులభమే...
సంప్రదాయ వైద్య విధానాలు, అవి సూచించే జీవనశైలిని సరిగా అనుసరించగలిగితే కరోనా వంటి వైరస్‌లను ఎప్పుడైనా సరే ఎదుర్కోవడం సులభమేనని ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణురాలు డా.విశాఖ మహేంద్రూ చెప్పారు. కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చ్యువల్ సమావేశంలో భాగంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా సంభాషించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు... కోవిడ్ మహమ్మారిని నయం చేయడంలో ఆయుర్వేదం పాత్ర? కోవిడ్‌ను నివారించడంలో ఆయుర్వేదానికి కీలక పాత్ర ఉంది, అయితే అది నేను వైరస్‌కి చికిత్స అని చెప్పను. గత కొంత కాలంగా కోవిడ్ లక్షణాలను బట్టి ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచే అనేక రకాల మూలికలను పంపిణీ చేశాం. వాటి ద్వారా ఎందరో మంచి ఫలితాలు అందుకున్నారు. వ్యక్తిని బట్టి వైద్యం చేయడం ఆయుర్వేద లక్షణం. కాబట్టి దేనికైనా సరే ముందుగా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించి, ఏమి తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి. కరోనాతో పోరాడటానికి ఆయుర్వేదంలో ఏదైనా ప్రత్యేకమైన ఔషధం ఉందా? కరోనా చికిత్సకు మేము ఆయుర్వేదంలో ప్రత్యేకమైన మందులేవీ ఇవ్వలేదు. కానీ కోవిడ్ వ్యాధిని నిరోధించడంలో భాగంగా మేం గిలోయ్, అశ్వగంధ వంటి మూలికలు చాలా సూచించాం. ఆయుర్వేదంలో, మేము నిర్దిష్ట వ్యాధితో కాకుండా వ్యక్తి లక్షణాల ప్రకారం మందులను సిఫార్సు చేస్తాం. కోవిడ్ లాంటి వైరస్‌లతో పోరాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? సరైన సమయంలో, సరైన సమయంలో తినడంతో సహా అన్ని అంశాలలో ఆరోగ్యంగా ఉండాలని ఆయుర్వేదం సూచిస్తుంది. మనకు తగినంత జీర్ణశక్తి ఉండాలి. ఆయుర్వేదంలో దానిని ’అగ్ని’ అని పేర్కొంటాం. ఇది శరీరంలో ఉండడం వల్ల ఎలాంటి వ్యాధితోనైనా పోరాడగలం. సరిగ్గా తినకపోతే, సరిగ్గా నిద్రపోకపోతే, పౌష్టికాహారం లేకుంటే ఏ ఔషధం పాత్రయినా పరిమితమే. అల్లోపతిలో కోవిడ్ కోసం టీకాలు ఉన్నాయి.. మరి ఆయుర్వేదంలో? ఏ రకమైన అంటువ్యాధి లేదా మహమ్మారి నైనా ముందే రాకుండా పనిచేసే ఔషధం ఉందని నేను అనుకోను. వ్యాక్సిన్ ఏదైనా వ్యాధి లేదా మహమ్మారికి ఖచ్చితమైన మందు కాదు. కోవిడ్, ఓమిక్రాన్ లేదా డెల్టా లేదా ఏదైనా రకమైన వేరియంట్ కారణంగా టీకాలు వేసిన వ్యక్తులు కూడా మళ్లీ వ్యాధి బారిన పడుతున్నారు కదా. కాబట్టి రోగనిరోధక శక్తి బాగా ఉండడం ముఖ్యం. సరిగ్గా ఆయుర్వేదం ఇచ్చేది అదే. సులువైన మార్గాల్లో రోగనిరోధక శక్తిని పొందడానికి కొన్ని చిట్కాలు... రోగనిరోధక శక్తి అనేది ఒక రోజులో వచ్చేది కాదు. మనం చాలా కాలం నుండి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటేనే ఆకస్మికంగా వచ్చిపడే వ్యాధులపై పోరాడగలం. ముఖ్యంగా మనం ఏమి తింటామో అదే మనం. కాబట్టి సరిగ్గా తినడం, సమయానికి తినడం, సరైన పరిమాణంలో తినడం వంటివి తప్పక పాటించాలి. మనకు అందుబాటులో ఉన్నవే మనం తరుచుగా నిర్లక్షచచేస్తాం. ఉదాహరణకు బాదం. మన రోజువారీ అభ్యాసంలో భాగంగా కొన్ని బాదంపప్పులను తినడం మేలు చేస్తుంది. బాదంపప్పులో విటమిన్ ఇ, కాపర్, జింక్ మరియు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నందున మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. అలాగే ప్యాక్ చేసిన ఆహారాలు తినవద్దు, ఆహారం నిల్వ ఉంచడానికి అవసరమైన దినుసులు వాడి ఉండకూడదు తాజా పద్ధతిలో భోజనాన్ని ఉడికించాలి. పదేపదే ఆహారాన్ని మైక్రోవేవ్ లో వేడి చేయవద్దు. శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలి. -
ప్రతి జిల్లాలో పీజీ వైద్య కళాశాల
జైపూర్: పోస్టు–గ్రాడ్యుయేట్(పీజీ) వైద్య విద్య కోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల లేదా విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వైద్య విద్య, ఆరోగ్య సేవలను అందించడం మధ్య అంతరం తగ్గుతోందని తెలిపారు. ఆయుర్వేదం, యోగాను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. దేశంలో గత ఆరేళ్లలో 170కిపైగా మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని, కొత్తగా మరో 100 కాలేజీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గురువారం రాజస్తాన్‌లో నాలుగు నూతన వైద్య కళాశాలల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీ’ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైద్య వ్యవస్థను సమూలంగా మార్చడానికే ఎంసీఐ స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను తీసుకొచి్చనట్లు ఉద్ఘాటించారు. ఈ కమిషన్‌తో ఇప్పటికే సానుకూల ఫలితాలు వస్తున్నాయని వివరించారు. దేశంలో సంప్రదాయ, ఆధునిక వైద్యం నడుమ అంతరం ఉందని, దీన్ని తొలగించాలి్సన అవసరం ఉందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే కొత్తగా నేషనల్ హెల్త్ పాలసీని తీసుకొచ్చినట్లు వివరించారు. ఎయిమ్స్ లేదా మెడికల్ కాలేజీలు.. వాటి నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అన్ని మూలలకూ విస్తరింపజేయాలని సూచించారు. దేశంలో గతంలో కేవలం 6 ఎయిమ్స్‌లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 22కుపైగానే ఉన్నాయని పేర్కొన్నారు. 2014లో కేవలం 82,000 అండర్–గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.40 కోట్లకు చేరిందని వెల్లడించారు. చాలా మంది విద్యార్థులకు ఆంగ్ల భాష పెద్ద అవరోధంగా మారిందని, నూతన విద్యా విధానంలో భాగంగా భారతీయ భాషల్లోనూ వైద్య విద్యను అభ్యసించే వెలుసుబాటు లభిస్తోందని తెలిపారు. -
బ్లాక్ పెప్పర్ వాటర్ ప్రతి ఉదయం తాగారంటే.. నెలరోజుల్లోనే..
మాటిమాటికీ ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటే మీ ఇమ్యునిటీ సిస్టం బలహీణంగా ఉన్నట్టే! దీనికి పరిష్కారం మీ వంటగదిలోనే ఉంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి రోజూ తాగితే చాలు! ఈ పెప్పర్ వాటర్‌ని కనీసం ఒక నెలపాటు తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. పూజా కోహ్లీ చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా. రోగనిరోధకతను పెంచుతుంది సులభ మార్గంలో రోగనిరోధకతను పెంచడంలో బ్లాక్ పెప్పర్ వాటర్ బెస్ట్. ఇది శరీర కణాలను పోషించి, వాటి నష్టాన్ని నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది కూడా. సహజ మార్గాల్లో హానికారక వ్యర్థాలను బయటికి పంపేందుకు.. గట్ (పేగుల) హెల్త్ పైనే మన పూర్తి శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మిరియాలు కలిపిన వేడి నీరు శరీరంలోని వ్యర్థాలను, రసాయనాలను పూర్తిగా బయటకు పంపివేస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, కడుపులోని పేగు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. బరువు తగ్గేందుకు.. దీనివల్ల వనకూరే మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. బరువును అదుపులో ఉంచుతుంది. మన పూర్వికుల కాలం నుంచి నేటివరకు కూడా ఉదయం పొరకడుపున చిటికెడు నల్లమిరియాల పొడి కలిపిన నీరు తాగే అలవాటు ఆచారంగా పాటిస్తున్నారు. దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు బోలెడున్నాయి కాబట్టే. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అధిక క్యాలరీలు ఖర్చు అయ్యేలా ప్రేరేపిస్తుంది. తరచుగా ఈ నీళ్లు తాగడం వల్ల కేవలం ఒక నెలరోజుల్లోనే మీ శరీర బరువులో వచ్చే మార్పును స్పష్టంగా తెలియజేస్తుంది. తేమగా ఉంచుతుంది వేడి నీరు, నల్ల మిరియాల పొడి మిశ్రమం గట్ హెల్త్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మ కణాల పోషణకు తోడ్పడటం ద్వారా ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండటానికి సహాయపడుతుంది. చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేయడమేకాకుండా, రోజు మొత్తం యాక్టివ్ గా ఉండేందుకు ఉపకరిస్తుంది. మలబద్ధకం నివారణకు దివ్యేషధమే దీర్ఘకాలికంగా మలబద్దకంతో బాధపడేవారు ఈ నీటిని ప్రతిరోజూ తప్పనిసరిగా తాగాలి. ఇది మీ ప్రేగు కదలికలను మెరుగుపరచి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు దారితీసేలా చేస్తుంది. క్రమంగా మీ సమస్య తగ్గుముఖం పట్టి, శరీరం నుండి వ్యర్థాలను తొలగించి, కడుపును తేలిక పరుస్తుంది. శక్తి నిస్తుంది మీరు పెప్పర్ వాటర్ ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీవక్రియ బలం పుంజుకుని మీ శక్తి రెంట్టింపయ్యేటట్లు చేస్తుంది. అంతేకాకుండా మీ శరీరాన్ని డిటాక్సిఫై చేసి, చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. చదవండి: అలొవెరా జ్యూస్‌తో డల్ స్కిన్‌కు చికిత్స..!! -
ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది.. మాంచి ‘టీ’ స్టోరీ!
కరోనా కాలాన్ని కాటేసింది. లాక్డౌన్ జీవితాల మెడ మీద కత్తి పెట్టింది. ఉద్యోగాలు సంక్షోభంలో పడ్డాయి. ఉపాధి మార్గాలన్నీ తలకిందులయ్యాయి. అలాంటి సమయంలో తనకంటూ సొంతంగా ఒక ఉపాధిని కల్పించుకుంది చెన్నై మహిళ హీనా యోగేశ్ భేదా. అలవాటే... ఆరోగ్యంగా! రోజూ ఠంచన్‌గా సూర్యోదయం అవుతుంది. నిద్రలేచి దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టి తీరాల్సిందే. బద్దకం వదిలి పనిలో పడాలంటే కడుపులో ఏదో ఒకటి పడాలి. ఆ పడేది నూటికి తొంబై ఇళ్లలో కాఫీ లేదా టీ అయి ఉంటుంది. వార్తాపత్రికల నుంచి ప్రసారమాధ్యమాలన్నీ కాఫీ, టీ వలన కలిగే హాని గురించే మాట్లాడుతుంటాయి. ‘రేపటి నుంచి మానేద్దాం’ అనుకుంటూనే రోజూ చాయ్ కప్పు అందుకునే వాళ్ల నాడి పట్టుకుంది హీనా. ఉదయాన్నే వేడి వేడి టీ తాగవచ్చు, ఆ టీతోనే ఆరోగ్యాన్ని పొందవచ్చు. దేహంలో ఉత్సాహంతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంచే టీల రకాలను తయారు చేసింది. అసలే కరోనా సమయం. వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక, వైరస్ బారి నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన పడుతున్న వాళ్లందరికీ హీనా పరిచయం చేసిన హాని లేని టీలు, ఆరోగ్యాన్ని పెంచే టీలు ఓ మంచి ఆలంబనగా మారాయి. అంతే గత ఏడాది ఆగస్టులో రెండు లక్షల పెట్టుబడితో మొదలైన ఆమె యువ సోల్ స్టార్టప్ ఇప్పుడు నెలకు రెండు లక్షలకు పైగా అమ్మకాలు సాగిస్తోంది. కేవలం నలుగురు మహిళలు మాత్రమే ఆమె ఉద్యోగులు. మార్కెటింగ్ వ్యవహారాలన్నీ హీనా స్వయంగా చూసుకుంటుంది. ఇప్పుడామె ఉత్పత్తులకు మూడు వేల ఐదు వందల మంది రెగ్యులర్ కొనుగోలుదారులున్నారు. వాళ్ల నెలవారీ సరుకుల జాబితాలో హీనా టీ ఉంటోంది. అది ఏమి ‘టీ’! ఒత్తిడితో కూడిన జీవనశైలిలో నిద్రలేమి, ఆకలి లేకపోవడం, ఆకలి ఉన్నా తినాలనిపించకపోవడం, ఎప్పుడూ నీరసం, త్వరగా అలసి పోవడం మామూలైపోయాయి. నూటికి తొంబై మంది వీటిలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వాస్తవాన్ని గమనించారామె. వీటన్నింటికీ ప్రకృతిలోనే సమాధానాలున్నాయి. వాటిని మందుల రూపంలో ఇస్తోంది సంప్రదాయ ఆయుర్వేద వైద్యం. అదే ఔషధాలను హీనా మార్నింగ్ టీ రూపంలో పరిచయం చేసింది. ఒక ఆలోచన జీవితాలను మార్చేసింది. వేలాదిమందిని ఆరోగ్యవంతులను చేస్తోంది. -
వ్యాక్సిన్లపై రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురు రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. తాను టీకా తీసుకోలేదని, సుదీర్ఘం కాలంగా సాధన చేస్తున్న యోగా, ఆయుర్వేదమే తనకు రక్ష అని పేర్కొన్నారు. ఈ సందర్భంగావ్యాక్సిన్‌ల సమర్థత, అల్లోపతి ప్రభావంపై తన దాడిని మరింత తీవ్రం చేశారు. తద్వారా అల్లోపతి, ఆయుర్వేదం మధ్య రగిలిన వివాదానికి మరింత ఆజ్యం పోశారు. పురాతన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందని ఆయన ఆరోపించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెయ్యికోట్ల రూపాయల పరువు నష్టం దావా హెచ్చరిక అనంతరం రాందేవ్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదం అభ్యసిస్తున్నాను, కాబట్టి తనకు టీకా అవసరం లేదని రాందేవ్ వాదించారు. భారతదేశంతో పాటు విదేశాలలో 100 కోట్లకు పైగా ప్రజలు ఈ పురాతన చికిత్స ద్వారా లబ్ది పొందుతున్నారనీ, రానున్న కాలంలో ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించనుందని ఆయన పేర్కొన్నారు. కాగా వ్యాక్సినేషన్ ఉత్తరాఖండ్ డివిజన్ ఐఎంఏ పరువు నష్టం నోటీసును పంపించిన సంగతి తెలిసిందే. "స్టుపిడ్ సైన్స్" అల్లోపతి మందుల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పక పోతే, రూ.1,000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. వ్యాక్సినేషన్ విషయంలో ఆయన చేస్తున్న తప్పుడు వ్యాఖ్యాలను నిలువరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా దోశద్రోహ చట్టం ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 10 వేల మంది డాక్టర్లు చనిపోగా, లక్షల మంది ప్రజలు అల్లోపతి వైద్యం వల్ల మరణించారన్న రాందేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అలాగే ఈ విషయంలో రాందేవ్ వాదనలకు సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధమని ఉత్తరాఖండ్ ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజయ్ ఖన్నా ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్! కరోనా: మరో గుడ్ న్యూస్ చెప్పిన డా.రెడ్డీస్ -
పతాంజలి సునీల్ మృతి.. మా మందులు వాడలేదు!
న్యూఢిల్లీ: అల్లోపతి ఓ పిచ్చిసైన్స్ అనే కామెంట్ల వీడియోతో దుమారం రేపిన రాందేవ్ బాబా.. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ నోటీసులతో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆయన ఐఎంఏకు ఇరవై ఐదు ప్రశ్నలు సంధించి గట్టి కౌంటరే ఇచ్చారు. ఇక పతాంజలి డెయిరీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ బన్సాల్ కరోనాతో చనిపోవడంతో తమ వైద్యవిధానంపై విమర్శలు రాకముందే ముందస్తు జాగ్రత్తగా పతాంజలి స్పందించింది. సునీల్‌కి జరిగిన కొవిడ్-19 ట్రీట్మెంట్లో పతాంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. యాభై ఏడేళ్ల వయసున్న సునీల్ బన్సాల్ మే 19న కరోనాతో కన్నుమూశారు. జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సునీల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన భార్య రాజస్థాన్ ఆరోగ్య విభాగంలో సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. ఆమే ఆయన ట్రీట్మెంట్ను దగ్గరుండి చూసుకున్నారు. ఆయనకు జరిగిన అల్లోపతిక్ ట్రీట్మెంట్లో పతాంజలి పాత్ర లేదు. కానీ, ఆయన బాగోగుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశాం’’ అని స్టేట్మెంట్ రిలీజ్ చేసింది రాజస్థాన్ పతాంజలి విభాగం. అయితే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ద్వారా పతాంజలి మరోసారి అల్లోపతి వైధ్యవిధానంపై సెటైర్ వేసినట్లయ్యింది. లక్ష కరోనిల్ బాబా రాందేవ్-ఐఎంఏ మధ్య కాంట్రవర్సీ నడుస్తున్నవేళ.. హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా ట్రీట్మెంట్ కోసం లక్ష పతాంజలి కరోనిల్ కిట్లను కొనుగోలు చేసింది. ఈమేరకు పతాంజలి ఆయుర్వేద నుంచి కిట్లను కరోనా పేషెంట్లకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ ప్రకటించాడు. ఇందుకోసం సగం ఖర్చును పతాంజలి సంస్థ భరిస్తుందని, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి చెప్పారు. हरियाणा में कोविड मरीजों के बीच एक लाख पतंजलि की कोरोनिल किट मुफ्त बांटी जाएंगी । कोरोनिल का आधा खर्च पतंजलि ने और आधा हरियाणा सरकार के कोविड राहत कोष ने वहन किया है। — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) May 24, 2021 -
‘కృష్ణపట్నం’ తగాదా తేలిగ్గా తేలేదా?!
చాలా కాలంగా సాగుతున్న ‘ఆయుర్వేదం’ ‘అలోపతి’ వైద్య విధానాల మధ్య వివాదానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కేంద్రం కావడం విశేషం. ప్రస్తుతం కోవిడ్–19 వల్ల ప్రజాబాహుళ్యంలో ఏర్పడిన భయాందోళనలను సంబాళించే ధైర్యసై్థ్యర్యాలను కలిగించడం కోసం పక్కవాటుగా ఆ మాత్రం పాత్రను పోషించడంలో ‘‘ఆయుర్ వేదం’’ తోడ్పడితే సంతోషించాల్సిందే! నిజానికి ఆయుర్వేదం పేరుకే గానీ, ప్రకృతి ప్రసాదించిన సొంఠి, పసుపు, మిరప, బెల్లం, జొన్న వగైరా పంట లన్నీ శరీర కల్మషాలకు విరుగుళ్లే సుమా! శ్వాస ఉండే వరకూ మనిషిలో ఆశ చావదు. ఆ ఆశను బతికి బట్టకట్టనివ్వాలన్న ఆశ వొడిగట్టిపోకుండా ఉంచే లక్షణం ఆయుర్వేదాన్ని నమ్ముకున్న వారిలో సహితం ఉండటం సర్వసాధారణం! ‘‘కోవిడ్–19 (కరోనా) పెను వైరస్ వ్యాధి వ్యాప్తి వల్ల భారత్‌లో ప్రజల మరణాల సంఖ్య పెరిగిపోతున్నందున వారికి ప్రజారోగ్య సిబ్బంది నెలల తరబడిగా సేవలందిస్తూ ఆసుపత్రుల్లో లెక్కలేనన్ని గంటలు గడుపుతున్నారు. పైగా వైద్య సేవలందించడానికి సరిపడా వనరులు లేనందున రోగులతో పాటు సిబ్బందికి కూడా కోవిడ్ అంటువ్యాధి సోకిపోతోంది. ఈ దుస్థితిలో వైద్యసేవలందించే దేశ ఆరోగ్య రక్షణ సిబ్బంది మానసికమైన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనవలసిన దుస్థితి ఏర్పడింది’’ ‘‘ది హిందూ’’ (23–5–21) ఈ అత్యంత ప్రమాదకర దుస్థితిలో గొడ్డు వాడు గొడ్డు కోసం ఏడిస్తే, దాని తోలు కోసం మరొకరు ఏడ్చినట్టుగా నేటి దేశ వైద్య వృత్తిలో వింత తగాదాలు మరోసారి తలెత్తాయి. చాలా కాలంగా దేశ వ్యాప్తంగా సాగుతున్న ‘ఆయుర్వేదం’ ‘అలోపతి’ వైద్య విధానాల మధ్య వివాదానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కేంద్రం కావడం విశేషం. పైగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ జిల్లా నాయకుడైనందున ‘‘ఆయుష్మాన్ భారత’’ సంస్థకు కేంద్రప్రభుత్వం నాయకత్వం వహిస్తున్నందున ఆ సంస్థ పాలసీని అమలు జరిపే భారం లేదా బాధ్యతను కేంద్ర ‘ఆయుష్’ శాఖామంత్రి కిరణ్ రిజ్జూ మీద పెట్టారు. దీనితో పాటు కేంద్రం ఆధీనంలో పనిచేయాల్సిన భారత వైద్య పరిశోధనా మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) పైన పడింది. బీజేíపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత అత్యాధునిక వైద్యశాస్త్ర పరిశోధనలపై ఆధారపడి ప్రశంసార్హమైన శాస్త్ర, పరిశోధనా పలితాల్ని ప్రపంచానికి అందించి, కోట్లాదిమంది ప్రజలకు జయప్రదంగా సేవలందించిన అలోపతి వైద్యానికి పోటీగా కేంద్రస్థాయిలో ఆయుర్వేద వైద్యాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించింది. ఈ పథకాన్ని అమలు జరపడానికి రెండేళ్ల క్రితమే పెద్ద ప్రయత్నం జరగగా వివాదం మధ్యలో ‘ఆయుష్మాన్ భారత్’ సంస్థలో పనిచేస్తున్న నిపుణులొకరు సంస్థ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోయారన్న వార్తలు అప్పట్లో వెలువడ్డాయి! ఆ తరువాత ‘ఆయుష్మాన్ భారత్’ ముందుకు సాగలేదు. కారణం, రోగాలకు ‘అంటురోగ మహమ్మారులకు, వందల సంత్సరాలుగా వైద్యశాలల్లో, పరిశోధనాగారాల్లో శాస్త్రీయ ప్రాతిపదికపై జరిపిన వేల ప్రయోగాల ఆధారంగా మందులు మాకులు ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. ఆ మాటకొస్తే అరుదుగా లభించే వనమూలి కలు ఆధారంగా రోగాలకు ‘చిట్కా’ వైద్యాలు కూడా ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. అవి శాస్త్రీయ పరిశోధనలకు కొన్ని మాత్రమే తప్ప మిగతావి నిలబడలేదన్నది అలోపతి వైద్య శాస్త్రవేత్తలే కాదు ‘కొందరు ఆయుర్వేద’ వైద్యులు కూడా ఒప్పుకుంటారు. దీనికి కారణాన్ని– ఆయుర్వేద వైద్యశాస్త్రంలో నిపుణుడిగా తెలుగునాట ప్రసిద్ధికెక్కిన బాలరాజు మహర్షి పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్య మూలికల సేకరణ వాటి లభ్యత సాధ్యాసాధ్యాలపైన ఆధారపడింది కాబట్టి వాటి సేకరణ ఇతర ముడిపదార్థాల సేకరణపై కూడా ఆధార పడి ఉంది కాబట్టి ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదని బాలరాజు మహర్షి అభిప్రాయం. ఈ ప్రాతిపదిక మీద ఆయన దాన్ని తాత్కాలిక ‘చిట్కా వైద్యం’ గా మాత్రమే పరిగణిస్తూ వచ్చారు! ఆమాటకొస్తే ‘‘కోవిడ్–19’’ వైరస్‌పైన కేంద్రీకరించి తాజా పరిశోధనలు నిర్వహించిన ప్రసిద్ధ అమెరికన్ జీవ, గణిత శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రెడ్ ఆడ్లర్ ఇకపై మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గణనీయమైన మార్పులు ఏమేమి రాబోతున్నాయనే అంశంపై ఒక ఆశాజనకమైన విశ్వాసాన్ని ప్రకటించాడు! ఈ విశిష్ట ప్రకటనకు సంబంధించిన తన పరిశోధనా ఫలితాన్ని ‘‘వైరసెస్’’ అన్న పరిశోధనా పత్రికలో వెల్లడించారు! ఇక మీదట కోవిడ్–19 లాంటి హానికరమైన వైరస్‌కు కారణమైన ప్రమాదకరమైన కరోనా విషక్రిమి రానున్న పదేళ్లలోగానే జలుబు, దగ్గు లాంటి సాధారణ రుగ్మతలకు మించి దరిచేరబోవని అడ్లర్ భరోసా! ఈ పరిణామ క్రమంలో సామూహికంగా జనాభాలో రోగనిరోధక శక్తి పెరిగే కొలది కోవిడ్–19 క్రమంగా తోక ముడుస్తుందని చెప్పాడు! వైరస్‌లో వచ్చే మార్పుల కన్నా మన శరీరం రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పులకు సర్దుబాటై పోతుందన్నాడు! పరిణామ క్రమంలో స్వల్పంగా సోకే ఇన్ఫెక్షన్లు– రాబోయే తీవ్రమైన అంటురోగాలను కూడా ఎదుర్కొనగల శక్తిని మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు తరిఫీదు ఇస్తాయన్నాడు ప్రొఫెసర్ అలెగ్జాండర్ బీమ్స్ (ఉటా యూనివర్శిటీ– అమెరికా)! అయితే ఇంతకూ ఆయుర్వేద వైద్యులు ఒక కీలకమైన ప్రశ్నకు తడబడకుండా విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంతవరకూ ప్రపంచదేశాలను పలకరించి ఎంతో వినాశాన్ని మిగిల్చిన సుమారు 300 వైరస్ వ్యాధులలో ‘‘ఆయుర్వేద వైద్యం’’ ఎన్నింటిని పరిష్కరించగల్గిందో వివరించగల్గాలి! అన్నీ వేదాల్లోనే ఉన్నాయి. అని సర్దుకుంటే చాలదు. ఎందుకంటే అసలు సృష్టి రహ స్యాన్నే రుగ్వేదం (నాసదీయ సూక్తం 129 పదవ మండలం) హేతు వాదనతో ప్రశ్నించి విడమర్చింది! ఈ సృష్టి ఎలా జరిగింది’’ అని, అందుకు భగవంతుడు సృష్టి కారకుడా? అనీ, (2) కనీసం భగవంతు డికి ఈ సృష్టి ఎలా జరిగిందో తెలుసా, అని! అందుకు ‘‘నా సదీయ సూక్తం’’ చెప్పిన సమాధానం సృష్టి జరిగిన తరువాత వచ్చిన వాడు భగవంతుడు కాబట్టి, సృష్టికర్త కాజాలడు. అంచేత ఈ సృష్టి ఎలా జరిగిందో కూడా భగవంతుడికి తెలియదు’’ అని చెబుతుంది! కాబట్టి సృష్టికీ, భగవంతుడికీ ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది రుగ్వేదం! అంటే రుగ్వేద కాలం నాటికే భారతదేశంలో భౌతిక వాదం,హేతువాదం ఆవిర్భవించాయనుకోవాలా?! కాబట్టి మాన వుడి ‘‘ఆయుష్షు’’కి వేదానికీ సంబంధం లేకపోయినా ‘‘దైవాధీనం మోటారు సర్వీసు’’ అన్నట్టుగా వేదం నుంచి ఆయుర్వేదాన్ని లాగ సాగారు.! నిజానికి చైనాలో కూడా ‘‘ఆక్యుపంక్చర్’’ లాంటి నిరూపితమైన కేవలం కొన్ని ప్రాచీన వైద్య పద్ధతుల పునరుద్ధరణను అనుమతిం చారు గాని, శాస్త్రీయ పద్ధతులకు, ఆచరణలో నిరూపణలకు సరిపో లిన వాటినే అనుమతించారని మరవరాదు. మనకు చిన్నతనంలో ప్రకృతి సిద్ధమైన పిడుగులు వినిపిస్తే ‘‘అర్జునా! ఫల్గుణా అని వల్లిస్తుంటే పిడుగులు పోతాయని అంటూండేవారు. అంటే భయాన్ని తొలగించి మనస్సును కుదుట పరచడంలో అలా అనేవాళ్లు. ప్రస్తుతం కోవిడ్–19 వల్ల ప్రజాబాహుళ్యంలో ఏర్పడిన భయాందోళనలను సంబాళించే ధైర్యసై్థ్యర్యాలను కలిగించడం కోసం పక్కవాటుగా ఆ మాత్రం పాత్రను పోషించడంలో ‘‘ఆయుర్ వేదం’’ తోడ్పడితే సంతోషించాల్సిందే! ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో వడపోతల మధ్య కాశీనాథుని ‘‘అమృతాంజనం’’ ఆధునీకరణ తర్వాతనే కమర్షియల్ ప్రాజెక్టుగా బయటకొచ్చింది! నిజానికి ఆయుర్వేదం పేరుకే గానీ, ప్రకృతి ప్రసాదించిన సొంఠి, పసుపు, మిరప, బెల్లం, జొన్న వగైరా పంట లన్నీ శరీర కల్మషాలకు విరుగుళ్లే సుమా! పొట్టకిచ్చినా, బట్టకిచ్చినా నేలతల్లే గాని వేదాలు, ఆయుర్వేదాలు కావు! శొంఠి సోధిస్తేనే కడుపు శుభ్రమవుతుంది! దీన్ని ఆయుర్వేదం కూడా కాదనలేదు అందుకే శ్వాస ఉండే వరకూ మనిషిలో ఆశ చావదు. ఆ ఆశను బతికి బట్టకట్టనివ్వాలన్న ఆశ వొడిగట్టిపోకుండా ఉంచే లక్షణం ఆయుర్వే దాన్ని నమ్ముకున్న వారిలో సహితం ఉండటం సర్వ సాధారణం! మృత్యువు పంచాంగం చూసి పనిచేయదు! మందులు కూడా శరీర పరిస్థితులకు అతీతం గావు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
Mitra Satheesh: పద నాన్నా... దేశం చూద్దాం
ఇలా బహుశా ఏ తల్లీ చేయలేదేమో. కొచ్చికి చెందిన ఆయుర్వేద వైద్యురాలు మిత్రా సతీష్ తన పదేళ్ల కొడుకు నారాయణ్‌ను తీసుకుని సొంత కారులో సొంత డ్రైవింగ్‌లో దేశం చూడటానికి బయలుదేరింది. ‘ఒరు దేశీ డ్రైవ్’ అని దానికి పేరు పెట్టిందికాని దూరం మాత్రం దాదాపు 20 వేల కిలోమీటర్లు. ఆ తల్లీ ఆ కొడుకు మార్చిలో బయలుదేరి మే 6 వరకూ సాహసోపేత దారుల్లో తిరిగి మళ్లీ కొచ్చి చేరుకున్నారు. ‘దేశం అంతా ఊళ్లల్లో ఉంది. ఆ ఊళ్లను చూశాం మేము’ అంటున్న మిత్రా ఈ కరోనా తగ్గగానే దేశాన్ని చుట్టేయమని చెబుతోంది. తోడుగా ఉన్నది ఒక మారుతి ఎస్–క్రాస్ మోడల్ కారు. 11 ఏళ్ల కొడుకు. దాదాపు 10 ఏళ్ల నుంచి కారు నడుపుతున్న ధైర్యం. అంతే. కొచ్చి (కేరళ)కు చెందిన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు మిత్రా సతీష్ మార్చి 17, 2021న దేశం చూడ్డానికి బయలుదేరింది. ‘నా కొడుక్కి నా దేశం చూపించాలి. ప్రజలు ఎలా జీవిస్తారో వాడికి తెలియాలి. స్త్రీలు ఒంటరిగా ప్రయాణించవచ్చని తెలియచేయాలి. పిల్లలు పుట్టాక ఇల్లు కదలలేరు అనే దానికి విరుగుడుగా పిల్లలనే తోడు తీసుకొని తిరగొచ్చు అని స్త్రీలకు చెప్పగలగాలి. అంతే కాదు... నేనొక ప్రయాణ ప్రేమికురాలిని. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ట్రావెల్ ఇండస్ట్రీ దెబ్బ తింది. గ్రామీణ భారతంలోనే అంతా సౌందర్యం ఉంది అని చెప్పడానికి కూడా నేను ప్రయాణించాలి అని అనుకున్నాను’ అని ఈ సాహసోపేతమైన ప్రయాణం వెనుక తన లక్ష్యాలను వివరించింది మిత్రా సతీష్. 100 రోజులు 20 వేల కిలోమీటర్లు ‘ముందుగా నా భర్తకు కృతజ్ఞతలు. ఆయన మా అబ్బాయితో కలిసి ఈ యాత్ర చేయడానికి ప్రోత్సహించారు. మా అమ్మకు కూడా’ అంటుంది మిత్రా. మార్చి 17న బయలుదేరి 100 రోజుల పాటు దేశమంతా తిరిగి రావాలని మిత్రా ప్లాన్. అందుకు తగ్గట్టు తన యాత్రకు ‘ఒరు దేశీ డ్రైవ్’ అని పేరు పెట్టుకుంది. భారత టూరిజం శాఖ ఇందుకు కొంత స్పాన్సరర్‌గా నిలిచింది. ఇక ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫాలోయెర్స్ అందరూ ఎంకరేజ్ చేశారు. ఆమె యాత్ర మొదలెట్టింది. ‘2019లో ఒంటరిగా భూటాన్ వెళ్లాను కారులో. అప్పుడు కాని అర్థం కాలేదు నాకు యాత్ర చేయడం అంటే గమ్యాన్ని చేరుకోవడం కాదు దారిలో తెలుసుకోవడం. కస్టమ్స్ కాస్ట్యూమ్స్ రెండు తెలియాలి జనానివి. ఆ తర్వాత ఢిల్లీ, పంజాబ్ ఇవన్నీ ఒంటరిగా కారులో తిరిగాను. ఇప్పుడు నా కొడుక్కు దేశం చూపించాలనిపించింది. బయలుదేరాను’ అంది మిత్రా. అయితే ఆమె బయలుదేరిన సమయానికి కరోనా ఉధృతంగా లేదు. ఆమె యాత్ర సగంలో ఉండగా కేసులు, లాక్డౌన్లు మొదలయ్యాయి. అదీగాక డ్యూటీకి హాజరుకమ్మని ఆమెకు పిలుపు వచ్చింది. అయినప్పటికీ 51 రోజుల్లో దాదాపు 16 వేల కిలోమీటర్లు తిరిగి ఆమె విజయవంతంగా స్వస్థలానికి చేరుకుంది. ఆత్రేయపురం పూతరేకులు కేరళ నుంచి బయలుదేరిన మిత్ర తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం, వరంగల్ జిల్లా చేర్యాల వంటి ఊళ్ల గుండా తన ప్రయాణం సాగించింది. ‘ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఆత్రేయపురం పూతరేకులు అద్భుతం. అలాగే చేర్యాల హస్తకళలు కూడా’ అని ఆమె చెప్పింది. తల్లీ కొడుకులు ప్రతిరోజూ ఉదయం 5 గంలకు ప్రయాణం మొదలెట్టి సాయంత్రానికి నిర్దేశిత ఊరికి చేరుకునేవారు. ‘మేము గ్రామాల్లో ఎవరినో ఒకరిని అడిగి వారి ఇళ్లల్లో ఉండేవాళ్లం. గ్రామీణులు ఎంతో అదరంగా మమ్మల్ని చూసేవారు’ అని ఆమె అంది. ఆదివాసీలతో ఈ ప్రయాణంలో తన కుమారుడికి ఆదివాసీ ల జీవనం చూపడం గురించి మిత్ర ఎంతో సంతృప్తి వ్యక్తం చేసింది. ‘కోరాపుట్ (ఒడిసా) బోండా ఆదివాసీలతో, కంగ్రపోడ్ (దక్షిణ ఒడిసా) లో గదబలతో, జగదల్పూర్ (చత్తీస్‌ఘర్)లో ధృవ తెగతో, అంజర్ (మధ్యప్రదేశ్)లో మడియా గిరిజనులతో మేము గడపడం వారి గూడేల్లో ఉండి వారు పెట్టింది తినడం మర్చిపోలేము’ అని మిత్ర అంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో స్త్రీలు ఎంతో ఆదరంతో పలకరించి ఎక్కడకు వెళ్లినా గౌరవ వస్త్రంతో స్వాగతం పలకడాన్ని ఆమె కృతజ్ఞతతో చెబుతుంది. ప్రమాదకరం ‘మేము వైష్ణోదేవి ఆలయం చూడాలనుకున్నాం. కాని దారి మూసేశారు. దాంతో హెలికాప్టర్లో వెళ్లాం. నాకు మా అబ్బాయికి కూడా హెలికాప్టర్ ఎక్కడం అదే ప్రథమం. అయితే తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ ట్రిప్ కేన్సిల్ అయ్యింది. దాంతో 14 కిలోమీటర్లు మేము ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సగం దూరం గుర్రాల మీద వచ్చాం. ఆ సమయంలో మాత్రం చాలా భయం వేసింది’ అని మిత్ర అంది. ఈ మొత్తం ప్రయాణంలో కొడుకు ముందు నుంచి ఎదురు చూసింది జమ్ము, కశ్మీర్‌లను చూడటం గురించే. ‘వాడు మొదటిసారి మంచుమైదానాలను చూసి వెర్రెత్తి పోయాడు’ అని ఆమె పెద్దగా నవ్వింది. మామూలుగా మన దేశం పూర్తిగా చూడటానికి ఒక జన్మ చాలదని అంటారు. అన్ని విశేషాలు, జీవనాలు ఉంటాయి. మనలో చాలామందికి కార్లుంటాయి. కాస్త తిరగగలిగే వీలు కూడా ఉంటుంది. కాని ‘ఆరంభించరు అతి బీరువులు, బద్దకస్తులు’ అన్నట్టు భయం కొద్దీ, బద్ధకం కొద్దీ ఎక్కడికీ కదలం. ‘తెలిసిన ఊళ్లో ఉన్నవాడు ఏమీ తెలియనట్టే ఉండిపోతాడు. తిరిగినవాడు లోకం తెలిసి బాగుపడతాడు’ అని పెద్దలు అన్నారు. మనం, మన తర్వాతి తరం లోకాన్ని చూడకపోతే ఎలా? ముఖ్యంగా స్త్రీలు ఇంత అందమైన దేశాన్ని తిరిగి చూస్తే ఇల్లు విజ్ఞానవంతం అవదూ? పిల్లలకు ఎన్ని పాఠాలు చెప్పొచ్చు. ఇంకో నాలుగైదు నెలల్లో ఈ కరోనా గిరోనా అంతా పోతుందని ఆశిద్దాం. ఆ తర్వాత ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే. ఏమంటారు? – సాక్షి ఫ్యామిలీ -
Senna Tea: సెన్నా టీ సిప్ చేశారా?
చాయ్ అంటే చటుక్కున తాగని వాళ్లుంటారా? చాయ్ మహత్యం ఏంటోకానీ, ఒక్కసారి కూడా టీ తాగనివాళ్లుకానీ, తాగిన తర్వాత అలవాటు కాని వాళ్లు కానీ అరుదు. సాదా చాయ్ అందరూ తాగుతారు, కానీ ఇటీవల కాలంలో పలురకాల ఫ్లేవర్ల టీలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ కోవలోకి చెందినదే సెన్నా టీ! ఈ టీతో పలు ఆరోగ్య సంబంధ ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వృద్ధుల్లో తరచూ కనిపించే అనారోగ్య సమస్య మలబద్ధకం. అలాగే యువత, పిల్లల్లోనూ ఈ సమస్య అప్పుడప్పుడూ తొంగిచూస్తూ ఉంటుంది. దీని నివారణకు రకరకాల ఔషధాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆయుర్వేద పద్ధతిలో మలబద్ధకాన్ని అరికట్టేందుకు ఉపయోగపడేదే సెన్నా టీ. సెన్నా అంటే తంగేడు చెట్టు. దీని ఆకులతో తయారుచేసేదే సెన్నా టీ. అలాగే తంగేడు పూలు, కాయలతోనూ దీనిని తయారుచేయొచ్చు. ఈ తంగేడు ఆకులు, పూలు, కాయలను మలబద్ధకం నివారణకు ఉపయోగించే మాత్రల్లో ఎక్కువగా వాడతారు. అలాగే బరువు తగ్గడానికి, శరీరంలోని విష కణాలను తొలగించడానికి సెన్నా ఉండే మాత్రలు పనిచేస్తాయని మార్కెట్లో ప్రచారం ఉన్నప్పటికీ శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. మలబద్ధకాన్ని ఎలా తగ్గిస్తుందంటే? తంగేడాకుల్లో ఎక్కువగా గ్లైకోసైడ్స్, సెన్నోసైడ్స్ ఉంటాయి. ఈ సెన్నోసైడ్స్ మనం తీసుకున్న టీ ద్వారా కడుపులోకి చేరి అక్కడ మలబద్ధకానికి కారణమవుతున్న బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేస్తాయి. ఫలితంగా పేగులోపల కదలికలు ఏర్పడి సులభంగా విరేచనం అయ్యేందుకు తోడ్పడుతుంది. ఈ టీ తాగిన ఆరు నుంచి 12 గంటల్లోపు అది పనిచేస్తుంది. మార్కెట్లో లభించే మలబద్ధకం మాత్రల్లో అతి ముఖ్యమైన మూలకం సెన్నానే. అలాగే పురీషనాళంలో రక్తస్రావం, నొప్పి, దురదలు వంటి వాటికీ సెన్నా టీ విరుగుడు పనిచేస్తుందనే వాదన ఉన్నప్పటికీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. బరువు తగ్గిస్తుందా? బరువు తగ్గేందుకు సెన్నా టీ ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తుంటారు. సెన్నా టీ, లేదా సెన్నా మూలకం ఉన్న మాత్రలు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగై తద్వారా సులభంగా బరువు తగ్గొచ్చనే ప్రచారం తప్పని వైద్య నిపుణులు అంటున్నారు. ఇలా సెన్నా టీ, సెన్నా మూలకాలున్న మాత్రలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గినట్లు శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు. అంతేకాదు, ఇలా బరువు తగ్గాలని చేసే ప్రయత్నం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కాగా, బరువు తగ్గడం కోసం ఇలా ’సెన్నా’ను ఉపయోగిస్తున్న 10వేల మంది మహిళలపై జరిపిన ఓ సర్వే సైతం ఇదే విషయం చెబుతోంది. ఇంకా చెప్పాలంటే వారిలో ఆకలి పెరిగి, ఇంకా ఎక్కువ తింటున్నట్లు గుర్తించింది. ఎవరికి సురక్షితం? సెన్నా టీ 12 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తాగొచ్చు. అయితే, వీరిలోనూ కొందరికి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కనిపించొచ్చు. అందులో ముఖ్యమైనవి కడుపులో తిమ్మిరి, వికారం, అతిసారం. అయితే, ఈ లక్షణాలు ఎక్కువ సేపు ఉండవు. మరికొంతమందికి అలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్లు సెన్నాకు దూరంగా ఉండడం మంచిది. అన్నింటి కంటే ముఖ్యమైనది సెన్నా టీని మలబద్ధకానికి విరుగుడుగా తీసుకునే తాత్కాలిక ఔషధంగా గుర్తుపెట్టుకోవడమే. ఈ టీని వరుసగా వారం కంటే ఎక్కువ రోజులు తాగకూడదు. ఎక్కువ రోజులు తీసుకుంటే కాలేయం దెబ్బతినడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల ప్రత్యేకించి హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ సమస్యలు ఉన్నవాళ్లు సెన్నా టీనే కాదు, సెన్నా మూలకం ఉన్న ఏ ఉత్పత్తులనైనా వాడాలంటే వైద్యుని సలహాలు తీసుకోవడం ఉత్తమం. అలాగే గర్భిణులు, బాలింతలు ఎట్టి పరిస్థితుల్లోనూ సెన్నా మూలకం ఉన్న ఉత్పత్తులు, టీని తీసుకోకూడదు. (చదవండి: అమెరికా అంటే.. ఐదు కావాల్సిందే!) -
ఇక వారు కూడా ఆపరేషన్లు చేయొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయు ఆయుర్వేద వైద్య విధానం ప్రోత్సాహానికి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన కేంద్రం తాజాగా ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లు వివిధ రకాల సాధారణ శస్త్రచికిత్సలు చేసేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద విద్య) 2016 నిబంధనలను సవరించింది. షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (ఈఎన్టీ, హెడ్, డెంటల్ స్పెషలైజేషన్) కోర్సులను పీజీలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వారికి ప్రత్యేక శిక్షణను ప్రవేశపెట్టింది. శిక్షణ అనంతరం ఈఎన్టీ, దంత వైద్యంతోపాటు, కంటి శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా అనుమతి లభిస్తుంది. ప్రభుత్వనిర్ణయం ప్రకారం ఇకపై ఆయుర్వేద వైద్యులు స్కిన్ గ్రాఫ్టింగ్, కంటిశుక్లం శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ వంటి సాధారణ ఆపరేష్లన్లను చట్టబద్ధంగా నిర్వహించవచ్చు. నవంబర్ 19న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పాఠ్యాంశాల్లో భాగంగా షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (చెవి, ముక్కు, గొంతు వ్యాధులు) విధానాలలో అధికారికంగా శిక్షణనిస్తుంది. తద్వారా వారు స్వతంత్రగా సర్జరీలను నిర్వహించే సామర్ధ్యాన్ని సొంతం చేసుకుంటారు. ఎంఎస్ (ఆయుర్వేద) శాల్య తంత్రం డీబ్రిడ్ మెంట్ / ఫాసియోటోమీ / క్యూరెట్టేజ్ పెరియానల్ చీము, రొమ్ము గడ్డ, ఆక్సిలరీ చీము, సెల్యులైటిస్ అన్ని రకాల స్కిన్ గ్రాఫ్టింగ్, ఇయర్ లోబ్ రిపైర్ లింఫోపోమా, ఫైబ్రోమా, స్క్వాన్నోమా మొదలైన కణతుల తొలగింపు గ్యాంగ్రేన్ ఎక్సిషన్ / విచ్ఛేదనం తీవ్ర గాయాలనిర్వహణ, అన్ని రకాల సూటరింగ్, హేమోస్టాటిక్ లిగెచర్స్, బిగుసుకుపోయిన కండరాల చికిత్స లాపరోటమీ హేమోరాయిడెక్టమీ, రబ్బర్ బ్యాండ్ లిగేషన్, స్క్లెరోథెరపీ, ఐఆర్పీ, రేడియో ఫ్రీక్వెన్సీ / లేజర్ అబ్లేషన్ మొదలైన వివిధ పద్ధతులు. యానల్ డైలేటేషన్, స్పింక్టెరోటోమీ అనోప్లాస్టీ ఫిస్టులెక్టమీ, ఫిస్టులోటోమీ, పైలోనిడల్ సైనస్ ఎక్సిషన్, వివిధ రెక్టోపెక్సీలు యురేత్రల్ డైలేటేషన్, మీటోమి, సున్తీ పుట్టుకతో వచ్చే హెర్నియోటమీ, హెర్నియోరాఫీ, హెర్నియోప్లాస్టీ హైడ్రోసెల్ ఎవర్షన్, థొరాసిక్ గాయానికి ఇంటర్‌కోస్టల్ డ్రెయిన్ మొదలైనవి ఉన్నాయి కన్ను కనుపాపలను సరిచేసే సర్జరీ, క్యూరెట్టేజ్ ట్యూమర్ తొలగింపు సర్జరీ పాటరీజియం ఐరిస్ ప్రోలాప్స్-ఎక్సిషన్ సర్జరీ గ్లాకోమా-ట్రాబెక్యూలెక్టమీ కంటికి గాయం: - కనుబొమ్మ, మూత, కండ్లకలక, స్క్లెరా కార్నియా గాయాలకుమరమ్మత్తు శస్త్రచికిత్స స్క్వింట్ సర్జరీ - ఎసోట్రోపియా, ఎక్సోట్రోపియా డాక్రియోసిస్టిటిస్- డిసిటి / డాక్రియోసిస్టోరినోస్టోమీ [డిసిఆర్] కంటిశుక్లం శస్త్రచికిత్స ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సతో కంటిశుక్లం వెలికితీత మొదలైనవి ముక్కు: సెప్టోప్లాస్టీ, పాలీపెక్టమీ, రినోప్లాస్టీ చెవి : లోబులోప్లాస్టీ. అక్యూట్ సపరేటివ్ ఓటిటిస్, మాస్టోయిడెక్టమీ గొంతు వ్యాధులు : టాన్సిలెక్టమీతో పాటు ఇతర చికిత్సలు దంత : వదులు దంతాల బిగింపు, రూట్ కెనాల్,ఇతర చికిత్స -
భారత్‌లో ప్రపంచ ఆయుర్వేద కేంద్రం
న్యూఢిల్లీ: భారతీయ సంప్రదాయ వైద్య విధానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భారత్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. శుక్రవారం ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటీఆర్ఏ), రాజస్తాన్‌లోని జైపూర్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ఐఏ)లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో సందేశాన్ని పంపిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేసియస్ భారత్‌లో సంప్రదాయ వైద్యం కోసం ప్రపంచ స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. ‘‘సంప్రదాయ వైద్యాన్ని పటిష్టం చేయడానికి, దానిపై విస్తృతంగా పరిశోధనలు నిర్వహించి అందరిలోనూ అవగాహన కల్పించడానికి భారత్‌లో గ్లోబల్ సెంటర్‌ను నెలకొల్పబోతున్నాం’’అని ఆ సందేశంలో పేర్కొన్నారు. సురక్షిత, ఆరోగ్య ప్రపంచం కోసం డబ్ల్యూహెచ్‌వో పూర్తి సహకారం అందిస్తున్నారు. అన్ని దేశాల్లోనూ సంప్రదాయ వైద్య విధానాలకు మహర్దశ తీసుకురావడంలో భాగంగానే ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు టెడ్రోస్ చెప్పారు. ఈ కేంద్రం అంతర్జాతీయ వెల్నెస్ సెంటర్‌గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన మోదీ టెడ్రోస్‌కు ధన్యవాదాలు తెలిపారు. సంప్రదాయ ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని ప్రధాని చెప్పారు. వీర సైనికులకి దీపాల సెల్యూట్: ప్రధాని పిలుపు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలంతా దీపాలు వెలిగించి దేశాన్ని కాపాడుతున్న సైనిక వీరులకు వందనం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతల్లో ఉన్న సైనిక కుటుంబాలకు కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలని ప్రధాని శుక్రవారం ట్వీట్ చేశారు. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో దివ్వెలు వెలిగించి సైనికులకి గౌరవ వందనం చేయాలంటూ తాను ఇచ్చిన సందేశం ఆడియో క్లిప్‌ని పోస్టు చేశారు. -
మీ బాధ్యత మరింత పెరిగింది: ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ : ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జామ్ నగర్‌లోని ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ (ఐటీఆర్ఏ), జైపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ఐఏ)లను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆయుర్వేదం వైద్యప్రపంచంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అల్లోపతి, ఆయుర్వేద పద్ధతులు మన ప్రాచీన భారతదేశం యొక్క 21వ శతాబ్దపు శాస్త్రంతో కలిసిపోతాయి. ఇప్పుడు మీరందరూ దేశం యొక్క అగ్రశ్రేణి ఆయుర్వేద కేంద్రంలో భాగం కావడంతో మీ బాధ్యత మరింత పెరిగింది. మీరు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సిలబస్‌తో ముందుకు రావాలి' అని పీఎం మోదీ ఆయుర్వేద సంస్థలను ప్రారంభించిన సందర్బంగా పేర్కొన్నారు. (సిద్ధాంతం కన్నా దేశం మిన్న) రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, ఆయర్వేద ఉత్పత్తులకు భారతదేశం నుంచి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని ప్రధాని చెప్పారు. మనదేశంలో జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ కరోనా పరిస్థితి అదుపులో ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటిలో పసుపు పాలు, అశ్వగంధ హెర్బ్, కాధా వంటి రోగనిరోధక శక్తి బూస్టర్లు వినియోగిస్తున్నారు. మహమ్మారి సమయంలో ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది' అని ఆయన చెప్పారు. కార్యక్రమంలో రాజస్థానముఖ్యమంత్రి అశోక్ గెహ్లూట్, గుజరాత్ సీఎ విజయ్ రూపానీ పాల్గొన్నారు. -
అభిమానులకు అనుష్క ఆయుర్వేద చిట్కా..
ముంబై: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మెరుగైన ఆరోగ్యం కోసం బాలీవుడ్ సెలబ్రెటీలు అనేక చిట్కాలను అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ అద్భుత ఆయుర్వేద చిట్కాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయిల్ పూలింగ్ ద్వరా దంత సమస్యలను నివారించడంతో పాటు నోటిలో ప్రవేశించే చెడు బ్యాక్టేరియా, వైరస్లు రాకుండా అడ్డుకుంటుందని తెలిపారు. కాగా దంత సమస్యలు, టాక్సిన్స్‌లను నివారించేందుకు ఆయిల్ పూలంగ్ ఎంతో ఉపయోగపడుతుందని అనుష్క పేర్కొన్నారు. తాను ఆయిల్ పూలంగ్ చిట్కాను పాటిస్తానని, మెరుగైన ఆరోగ్యం కోసం అభిమానులు పాటించాలని సూచించారు. ప్రతి మనిషి నోటిలో 700 రకాల బ్యాక్టేరియాలు జీవిస్తాయి. అందులో ఎప్పటికీ 350 యాక్టివ్‌గా ఉంటాయని ఇటీవల ఓ అధ్యయనం తెలిపింది. ఆయిల్ పూలింగ్ ఉపయోగాలు కొబ్బరి నూనె ఉపయోగాలు మనందరికి తెలిసిందే. కాగా ఆయిల్ పూలింగ్ ప్రక్రియలో కొబ్బరి నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కొబ్బరి నూనెను నోట్లో 20 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి. నోట్లో విడుదలయ్యే టాక్సిన్స్‌ను (విషపదార్థాలను) ఎదుర్కొనేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం టాక్సిన్స్ మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థలో యాసిడ్ సమస్యను నివారించేందుకు ఆయిల్ పూలింగ్ ఉపయోగపడుతుంది. మరోవైపు వ్యాధికారకాలను ఎదుర్కోవడంలో కొబ్బరి నూనె సమర్థవంతంగా పనిచేస్తుందని, గుండె, మెదడు పనితీరును మెరుగుపర్చే గుణం కొబ్బరి నూనెలో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సంపూర్ణ ఆరోగ్యానికి ఆయిల్ పూలింగ్, ప్రాచీన వైద్య విధానం ఎంతో ఉపయోగమని, దీర్ఘకాల తలనొప్పి, ఆస్తమా, మధుమేహం(డయాబెటిస్) లాంటి వ్యాధులను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు -
కరోనా గురించి ఆయుర్వేదం ఏం చెబుతోందంటే...
కరోనా వైరస్ అని నిర్దిష్టంగా ఓ వైరస్ గురించి ఆయుర్వేదం చెప్పకపోయినా... ఒకేసారి అకస్మాత్తుగా పాకిపోయే సూక్ష్మజీవుల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల గురించి ఆయుర్వేదం వర్ణించింది. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి అవుట్స్బ్రేక్ గురించి ఆయుర్వేదం ఏం చెబుతోందో చూద్దాం. ఆయుర్వేదం చెప్పిన విషయాలను ఇతర వైద్యవిధానాలతో సరిపోల్చుకుని, తమ విజ్ఞతను బట్టి మరీ ఎవరికి వారే ఈ వైద్యవిధానాన్ని అనుసరించవచ్చో లేదో నిర్ణయించుకోవచ్చు. వ్యాధులను వర్గీకరిస్తోంది ఇలా... తల్లిదండ్రుల బీజదోషాల వల్ల, ఆహారవిహారాల తేడాల వల్ల వచ్చేవాటిని ఆయుర్వేదం ‘నిజ’రోగాలుగా చెబుతుంది. ఇక వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాల వల్ల వచ్చే వ్యాధులను ‘ఆగంతుజ’రోగాలుగా అభివర్ణించింది. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అంటువ్యాధుల్ని ‘సాంక్రామిక’ రోగాలుగా ఉటంకించింది. ఇవి సంక్రమించే మార్గాలేమిటో సుశ్రుతాచార్యులు ఇలా చెప్పారు. ప్రసంగాత్, గాత్రసంస్పర్శాత్, నిశ్వాసాత్, సహభోజనాత్, సహ శయ్యా ఆసనాత్ చాపి వస్త్రమాల్యానులేపాత్... ... .... ఔపసర్గిక రోగాశ్చ సంక్రామంతి నరాన్నరాన్. మరీ దగ్గర దగ్గరగా కూర్చుని మాట్లాడటం, శరీరాలు తాకేటంత సన్నిహితంగా ఉండటం, ఒకరు వదిలిన ఊపిరిని మరొకరు పీల్చడం, రోగగ్రస్తమైన వారితో కూర్చుని భోజనం చేయడం, ఒకే మంచంపై కలిసి పడుకోవడం, ఒకరి వస్తువులు మరొకరు వాడటం వల్ల ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. శుచి, శుద్ధి (పరిశుభ్రత) లేనిచోట, లేనివారికి గ్రహరోగాలు సోకుతాయని కశ్యపుడు, చరకాచార్యుడు స్పష్టీకరించారు. అయితే ఇక్కడ గ్రహాలంటే ‘పటì æ్టపీడించేవి’ అనే అర్థంలో వాడిన శబ్ద విశేషం. పట్టి పీడిస్తాయి కాబట్టి ఆ పదాలకు ‘వైరస్, బ్యాక్టీరియా’ అనే సూక్ష్మాంగ క్రిములని అర్థం. (సవిషక్రిమి పిశాచాదయః ; గృహ్ణతిగ్రసతీతి గ్రహః). మళ్లీ ఈ క్రిములను ఉపకారులు, అపకారులు అని రెండుగా విభజించారు. అంటే... ఇంగ్లిష్ వైద్యవిధానం (అల్లోపతి)లోని బ్యాక్టీరియాలో మేలు చేసేవి. కీడు చేసేవిగా చెప్పిన విధంగానే ఇక్కడా వర్ణించారు. ఉదాహరణకు మనిషి పేగుల్లో అభివృద్ధి చెంది దేహపోషణకు పనిచేకొచ్చేవి ఉపకారులు. వ్యాధిని కలిగించేవి అపకారులు. గ్రహాలు (సూక్ష్మజీవులు) మామూలుగా కంటికి (నేకెడ్ ఐకి) కనిపించవని చెప్పారు. ఇవే మనం చెప్పుకునే వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్షా్మంగ కృములు / క్రిములు. ఈ క్రిముల వల్ల ప్రాణవహ స్రోతస్సుకు (ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు) సంబంధించిన లక్షణాలు : తుమ్ములు, ముక్కుకారడం, గొంతునొప్పి, దగ్గు, ఆయాసం, జ్వరం మొదలైనవి). నివారణ / చికిత్స: వైరస్ (ఇక్కడ ఆయుర్వేదంలో చెప్పినట్టు గ్రహం అనే మాట కూడా వాడుకోవచ్చు) పేరేదైనా వ్యాధి లక్షణాలను బట్టే చికిత్స ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ తరహా వైరస్ సమస్యలకు తాత్కాలిక ఉపశమనం (శమన చికిత్స), పూర్తిగా పోగొట్టడం (శోధన చికిత్స/పంచకర్మలు) వంటి పద్ధతులలో వైద్య నడుస్తుంది. ⇔ నిదాన పరివర్జనం (అంటే కారణాన్ని దూరం చేయడం లేదా కారణానికి మనం దూరంగా ఉండటం) అన్నది ఒక ప్రధాన చికిత్సాసూత్రం. ⇔ వ్యాధి క్షమత్వకశక్తి (ఓజస్సు)... (మామూలుగా ఇప్పుడు వాడే భాషలో చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తి) పటిష్టపరచడం మరో ముఖ్యసూత్రం. ఇది రసాయన, వాజీకరణ ప్రక్రియల ద్వారా సాధ్యపడుతుంది. ⇔ పంచమహాభూతాలు (భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం) కాలుష్యానికి గురై వందల, వేల సంఖ్యలో ఒక్కసారిగా మనుషులు మృత్యువు పాలయ్యే పరిస్థితిని ‘‘జనపదో ధ్వంశాలు’’ అని చరకాచర్యుడు వివరించాడు. వీటినే ఇంగ్లిష్‌లో ఎపిడెమిక్/ప్యాండమిక్ వ్యాధులుగా చెబుతారు. ప్రకృత్యాభిః భావైః మనుష్యాణాం యే అన్యే భావా సామాన్యాః తత్ వైగుణ్యాత్ సమాన కాలాః ... ... జనపదముధ్వంసయంతి ... ... జనపదేషు భవంతి ... ... వాయుః, ఉదకం. దేశః కాల ఇతి). శోకం, భయం, చింత మొదలైన ఉద్వేగాల వల్ల వ్యాధినిరోధకశక్తి /క్షమత్వం తగ్గిపోతుందని శాస్త్రకారులు స్పష్టీకరించారు. పాటించాల్సిన నివారణ చర్యలేమిటి: ⇔ శుచి, శుభ్రతకు సంబంధించి వ్యక్తిగతంగా శ్రద ్ధవహించాలి. ఇంటికి, పరిసరాలకు సాంబ్రాణి ధూపం వేయడం మంచిది. వేపకొమ్మలు, మామిడి తోరణాలు ద్వారాలకు కడితే ఆ ఆకులు సూక్ష్మక్రిముల్ని పీల్చేసుకుంటాయి. ⇔ అల్లం, వెల్లుల్లి కషాయంతో రెండు చిటికెలు పసుపు, ఆరు చిటికెలు దాల్చిన చెక్క చూర్ణం కలిపి 30 మి.లీ. (ఆరు చెంచాలు) రోజూ తాగితే నివారణకు ఉపకరిస్తుంది. (ఇది కరోనా వైరస్‌కు మాత్రమే గాక... ఎలాంటి సాంక్రమిక రోగాలైనా నివారించేందుకు ఉపకరించే సాధారణ మిశ్రమం). చిన్నపిల్లలకైతే రోజూ ఒకటి నుంచి రెండు చెంచాలు తేనెతో ఇవ్వవచ్చు. ⇔ ఉసిరికాయ (ఆమలకీ దేశీయ) అత్యుత్తమమైన ఔషధం. కాయను నమిలి తిన్నా, రసం (ఒక చెంచా) తేనెతో లేదా ఎండించిన చూర్ణం (మూడు గ్రాములు) తేనెతో సేవించిన నివారణకూ / చికిత్సకూ పనికి వస్తుంది. (ఉసిరిలోని విటమిన్–సి వ్యాధి నిరోధకతకు దోహదపడుతుందన్నది ఇంగ్లిష్ / అల్లోపతిక్ వైద్య విధానం చెప్పే మాటే కదా). ⇔ గొంతు గరగర తగ్గడానికి వ్యోషాదివటి మాత్రలు చప్పరించాలి. ప్రధాన చికిత్స కోసం... ⇔ త్రిభువనకీర్తి రస మాత్ర: ఉదయం 1 ⇔ మహాలక్ష్మీవిలాసరస మాత్ర: రాత్రి 1 ఇవి అత్యుత్తమ రసాయన ఔషధాలు. తులసి ఆకుల రసం: ఒక చెంచా తేనెతో రెండుపూటలా సేవించాలి. చికిత్స తప్పనిసరిగా వైద్యుని పర్యవేక్షణలో జరగాలని గుర్తుంచుకోండి. గమనిక: బయటి ఆహారం / తినుబండారాల జోలికి పోవద్దు. ఇంట్లో వండుకున్న తేలికైన ఆహారాన్ని వేడిగా ఉండగానే తినాలి.– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
సంగీతంతో ఎక్కువ పాలు ఇస్తున్న ఆవులు
సాక్షి, జగిత్యాల: పురాణాల్లో సంగీతాన్ని భగవంతుడిగా భావించడం జరిగింది. పెద్దవ్యాధులు కూడా సంగీతం వల్ల నయమవుతాయన్న విషయాన్ని ఆయుర్వేదం చెప్పింది. పశువులు కూడా సంగీతపు ఆనందాన్ని ఆస్వాదిస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. పాలు పితికే సమయంలో మధుర సంగీతాన్ని ఆలపిస్తే..పాల దిగుబడి పెరుగుతుంది. ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి వంటి కొన్ని దేవాలయాల గోశాలలో, కొన్ని డైరి ఫారాలలో ఈ పద్ధతి ఆచరిస్తున్నారు. మహారాష్ట్రలోని పూనే వద్ద కల పరాగ్ మిల్క్ ఫుడ్స్‌లో పాలు పితికే సమయాల్లో గాయకులు కిశోర్‌కుమార్, మహ్మాద్ రఫీల పాటల సీడీలు వేస్తున్నారు. దీంతో ఆవుల చెవులకు ఇంపైన సంగీతం వినిపిస్తే పాల దిగుబడి 3 శాతం పెరిగిందని పరాగ్ పుడ్స్ సీఎంఓ మహేష్ ఇస్రాని తెలిపారు. బారామతిలోని ఫ్రైబర్ డైనామిక్స్ డెయిరీ ఫాంలో కూడా ఆవులకు సితార్, తబలా సంగీతం వినిపిస్తున్నారు. -
మోదకం ముదావహం
అనాదిగా వస్తున్న ఆయుర్వేదం ఆరోగ్య పరిరక్షణకు పెట్టింది పేరు. దీనికి ఆహారవిహారాలు అత్యంత ప్రాముఖ్యం వహిస్తాయి. ఔషధానికి మూడవ స్థానం మాత్రమే. ఆహార విభాగపు షడ్రసాలలోనూ ‘మధుర’ (తీపి) రసానిదే అగ్రతాంబూలం. ప్రకృతిదత్త, సహజసిద్ధ మధురపదార్థాలు ఒక కోణమైతే, మనం ఇళ్లల్లో తయారుచేసుకునే తియ్యటి పిండివంటలు మరొక పాత్ర వహిస్తాయి. పూర్తిగా తయారైన తరవాత, గుండ్రని ఆకారం సంతరించుకుంటే వాటిని ‘లడ్డూలు’ అంటాం. అంటే వృత్తాకారపు మధుర భక్ష్యాలన్నమాట. వీటి భూమికలో ప్రధానంగా ఉండేవి... వరి, గోధుమ, పప్పులలో ‘మినప, సెనగ, పెసర, కంది’ వంటివి చాలా ముఖ్యమైనవి. అనంతరం నువ్వులు కూడా శ్రేష్ఠమే. తీపి కోసం బెల్లం, శర్కర వాడతారు. కమ్మదనం కోసం నెయ్యి ప్రధానమైనది. సుగంధ ద్రవ్యాలలో... ఏలకులు, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు మొదలైనవి శ్రేష్ఠం. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఖర్జూరాలు అతిథి ద్రవ్యాలు. ఇలాంటి లడ్డూలన్నిటినీ ‘మోదకః’ అని, పెసర పిండిని వాడినప్పుడు, ‘ముక్తా మోదకాః’ అని, సెనగ పిండి వాడినప్పుడు ‘వేపన మోదకాః’ (మోతీచూర్ లడ్డు) అనీ వివరించారు. ఒకవేళ ఆకారం మారితే, చిన్న ముక్కలుగా ఉన్నవాటిని ‘మంఠకం’ అని, అప్పడాల వలె ఉంటే ‘సంపావః’ అని, నిమ్కీలలా ఉంటే ‘నాలికా’ అని, మరీ పొడవుగా ఉంటే ‘ఫేనికా’ అని, పూరీలలా చేస్తే ‘శష్కులీ’ అని పేర్కొన్నారు. వాటి పోషక విలువలు, ఆరోగ్యకర విశిష్టత కూడా విపులీకరించారు. పెసర పిండి మోదకాలు: తేలికగా జీర్ణమై చలవ చేస్తాయి. బలకరం. కంటి ఆరోగ్యానికి మంచిది. జ్వరహరం. తృప్తికరం. (... తేన మోదకాన్ లఘుః గ్రాహీ త్రిదోషఘ్న స్వాదుః శీతో రుచిప్రదః చక్షుష్యో జ్వరహర, హృద్య, తర్పణో ముద్గమోదకః) మోతీచూర్ లడ్డు: బలకరం, తేలికగా జీర్ణమై శరీరాన్ని తేలికపరుస్తుంది. చలవ చేస్తుంది. జ్వరాలను, రక్త స్రావాలను అరికడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. మలబంధం కలిగిస్తుంది. (... వేపనమోదకాః... బల్యాః జ్వరఘ్నాశ్చ.... విష్టంభినో, కించిత్ వాతకఫాపహా) పెసలు (ముద్గ): నలుపు, ఆకుపచ్చనివి శ్రేష్ఠం. తేలికగా జీర్ణమై నీళ్ల విరేచనాలను తగ్గిస్తుంది (గ్రాహి). కొంచెం వాతాన్ని పెంచి, కఫపిత్తాలను తగ్గిస్తుంది. చలవ చేస్తుంది. (ముద్గో... రూక్షో లఘుఃగ్రాహీ కఫపిత్తహరో హిమః) మాష (మినుములు): రుచికరం, వాతహరం మలమూత్రాలను సాఫీ చేస్తుంది. బలకరమై ధాతుపుష్టిని చేస్తుంది. శుక్రకరం. మూలవ్యాధిని (పైల్స్), కడుపులో వ్రణాలను పోగొడుతుంది. ముఖానికి వచ్చే పక్షవాతాన్ని (అర్దితవాతాన్ని) తగ్గిస్తుంది. స్తన్యకరం. (మాషో... తర్పణో బల్యః శుక్రలో బృంహణః పరః...) కందులు: (ఆఢకీ, తువరీ) (మసూరః: ఎర్ర కందులు/సార పప్పు): వాతకరం, చలవ చేస్తుంది. విరేచనాలను, పిత్త కఫరక్త దోషాలను తగ్గిస్తుంది. ఆంత్రకృతములను (కడుపులోని నులి పురుగులు) నశింపచేస్తుంది. (మసూరో సంగ్రాహీ శీతలో లఘుః; ఆÉý కీ వాతజననీ; తువరీ గ్రాహిణీ ప్రోక్తా... కోష్ఠకృమి జిత్) చణకః: (సెనగలు): రుచిగా ఉంటాయి. కడుపులో వాయువును కలుగచేసి, శుక్రమును క్షీణింపచేస్తుంది. మలబంధకరం. బెల్లం (గుడ): పాతబెల్లం శ్రేష్ఠం, పుష్టికరం, శుక్రకరం. అగ్ని దీపకం (పురాణగుడో... లఘుః, మధురో, వృష్యో, అసృక్ ప్రసాదనః, పిత్తఘ్నో...) సితా (మిశ్రీ పటికబెల్లం): లఘువు, శీతలం, రక్తస్రావాన్ని అరికడుతుంది. వాతపిత్తహరం. మధుఖండ: (తేనె నుండి తయారుచేసిన శర్కర): (మధురా శర్కరా రూక్షా గురుః; ఛర్ది అతిసార, తృట్, దాహ హరాః....) వాంతులు, విరేచనాలు, దప్పిక, మంటలను తగ్గిస్తుంది. ఏలా (ఏలకులు): జఠరాగ్నిని పెంచి, ఉష్ణకరమై కఫరోగాలను తగ్గిస్తుంది. దప్పిక, వాంతులను కూడా తగ్గిస్తుంది. కామోత్తేజకం. చిన్న ఏలకుల్ని గుజరాతీ ఏలకులు అంటారు. పచ్చకర్పూరం: శీతలం, వీర్యవర్థకం, స్థౌల్యహరం, నోటి అరుచిని, దుర్గంధాన్ని తగ్గిస్తుంది. చర్మరోగాలను పోగొడుతుంది. కుంకుమం (కుంకుమ పువ్వు): త్రిదోషహరం, రక్త దోషాలను పోగొట్టి చర్మకాంతిని పెంచుతుంది. శిరశ్శూల, వ్రణాలను తగ్గిస్తుంది. కృమిఘ్నం. కాశ్మీర ప్రాంతపు ద్రవ్యం. సూక్ష్మ కేసరాలను కలిగి ఉండి, ఎర్రగా ఉంటుంది. తామరపువ్వు వాసన కలిగి ఉంటుంది. ఇది ఉత్తమం. గుర్తుంచుకోవలసిన సారాంశం... మాంసకృత్తులు అధికమ్ము మాషమందు శ్రేష్ఠమౌను శాకాహార శిష్టులకును పప్పులేవైన మన దేహవర్థకంబె లడ్డులన్నియు సమకూర్చు దొడ్డ బలము ఘృతము కర్పూర కుంకుమ ఏలకాది ద్రవ్యములకును బెల్లము తగను కల్పి మోదకములను చేయంగ ముదముగాదె అవధిమీరక తినదగున్ హర్షగతుల - డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు -
సెనగల సౌభాగ్యం
అనాదిగా వస్తున్న ఆహారపు దినుసులలో ఎన్నో పంటలకు కాణాచి మన భారతదేశం. వాటిలో ఒకటి సెనగలు. వీటిని సంస్కృతంలో ‘చణకః’ అంటారు. దీని విశిష్టతను, ప్రయోజనాలను ఆయుర్వేదం కూలంకషంగా వివరించింది. దీనికున్న మరి కొన్ని ముఖ్య పర్యాయ పదాలు: ‘‘హరిమంథ, సకలప్రియ, జీవన, కంచుకీ, బాల భోజ్య’’ మొదలైనవి. హిందీలో చెన్నా, ఛోలే అంటారు. దీనికి బెంగాల్ గ్రామ్, చిక్ పీజ్ అనేవి వ్యవహారిక ఆంగ్లపదాలు. వృక్షశాస్త్రంలో సీసెర్ యెరిటీనమ్ అంటారు. ఇవి చిన్నవిగాను, పెద్దవిగాను రెండు పరిమాణాల్లో కనిపిస్తుంటాయి. పెద్దవి కొద్దిగా తెల్ల రంగులో ఉంటాయి. వీటినే కాబూలీ సెనగలు అంటారు. చిన్నవాటిని దేశీ సెనగలు అంటారు. ఇవి నలుపు, ఎరుపు, పసుపు పచ్చ, ఆకు పచ్చ, మట్టి రంగులలో ఉంటాయి. ఈ పంటకు తేమ లేని శీతల వాతావరణం పెట్టింది పేరు. పూర్తిగా పక్వం కాకుండానే వేళ్లతో బాటు మొక్కల్ని పీకి బజారులో అమ్మడం, కాయల నుండి పచ్చి సెనగల్ని వేరు చేసి తినటం మనం చూస్తూనే ఉంటాం. గుణధర్మాలు (భావప్రకాశ సంహితా): ‘‘చణకః శీతలో రూక్షః పిత్త రక్త కఫాపహః‘ లఘుః కషాయో విష్టంభీ వాతలో జ్వర నాశనః‘‘ ఆర్ద్రో అతికోమలో రుచ్యః పిత్త శుక్ర హరోః‘ హిమః కషాయో వాతలో గ్రాహా కఫపిత్తహరో లఘుః‘‘ ఎండబెట్టబడి, శుష్కంగా ఉన్నవి రూక్ష (గట్టిగా) గుణం కలిగి, కొంచెం వగరుగా ఉంటాయి. నానబెట్టిన అనంతరం మృదువుగా రుచికరంగా ఉంటాయి. సునాయాసంగా జీర్ణమై చలవ చేస్తాయి (లఘు, శీతలం). వాతాన్ని పెంచుతాయి. పిత్తకఫాలను హరిస్తాయి. కనుక పొట్టలో వాయువు చేరి ఉబ్బరించినట్లుండి, మలబంధం కలుగ చేస్తుంది. శరీరానికి చలవ చేసి రక్తస్రావాలను అరికడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఎక్కువగా విరేచనాలైతే అవి అరికట్టబడతాయి (గ్రాహి). శుక్రహరం. నానబెట్టిన పిదప సాతాళించిన (వేడి చేసిన) సెనగలు బలకరం. ఔషధ ప్రయోజనాలు: సెనగలతో చేసిన సూప్ (యూషం) తీవ్ర జ్వరాన్ని, శరీరంలో మంటనీ తగ్గిస్తుంది. సెనగ పిండికి చేదు పొట్ల (పటోల) ఆకులను చేర్చి చేసిన సూప్ కడుపు నొప్పి, కడుపులోని పుళ్లు (అల్సర్లు), మంటను తగ్గిస్తుంది. ధనియాలు, వట్టి వేళ్లు, సెనగలతో చేసిన సూప్ వాంతులను తగ్గిస్తుంది. శరీర దాహాన్ని (మంటను) అరికడుతుంది. స్నుïß æక్షీరం (బ్రహ్మ జెముడు జాతికి చెందిన స్నుహీ అనబడే మొక్క యొక్క పాలు) లో నానబెట్టిన సెనగల్ని వేడి చేసి తింటే తీక్ష›్ణవిరేచనంగా పనిచేసి కోష్ఠ (కడుపు లోపలి భాగం) శుద్ధి చేస్తుంది. ఆధునిక జీవ రసాయన శాస్త్రం రీత్యా: సెనగలలో 55 శాతం పిండిపదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు, 5 శాతం కొవ్వులు ఉంటాయి. ఆహారపు పీచు అధికంగా ఉంటుంది. క్యాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. ఐరన్ కూడా అధికం. సోడియం, పొటాషియం... ఈ రెండూ శూన్యం. ఇందులో ‘ఎ’ విటమిను ఉండదు. ‘సి’ కొంచెం ఉంటుంది. ‘కె’ మరియు ‘ఫొలేట్సు’ బాగానే ఉంటాయి. సెలీనియం, కోలిన్ ఉంటాయి. నిద్రాజనకమే కాకుండా, బుద్ధి వికాసం, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణం, నొప్పులు, వాపులు తగ్గించే గుణం కూడా ఉన్నాయి. ఎముకల పుష్టికి పెట్టింది పేరు. లివరు జబ్బులు, క్యాన్సర్లలో కూడా గుణకారి. మధుమేహం, రక్తపోటు వ్యాధిగ్రస్థులు కూడా తినొచ్చు. సెనగలు ఆ వ్యాధుల్ని పెంచవు. గుర్తు ఉంచుకోవలసిన సారాంశం నానబెట్టిన సెనగలు నాణ్యమోయి మెదడుకు ఎముక పుష్టికి మేలు చేయు చలువ చేయుచు దేహమున్ శాంతపరచు సూపు తీరున సేవింప సులభమౌను మలము బంధించు నిదియని మరువకోయి శుంఠి కలుపంగ కోష్ఠమ్ము శుద్ధియౌను వీర్యహరమంచు మదిలోన బెంగయేలపాలు బాదము ఖర్జూర పాయసమ్ము పట్టు పట్టంగ పరువమ్ము పరుగులెత్తు. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
సకల సంపత్కరం శ్వేతార్కం
జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలో తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాధిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట. శ్వేతార్క మూలాన్ని వెలికి తీసి, మట్టిని కడిగివేసి, నీళ్లలో నానబెట్టి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆ వేళ్ల మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క ఇంటిలో ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయని, ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్పభ్రావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి. అయితే, ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అంటారు. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్య్రం అంటే ఏమిటో తెలీదని శాస్త్రం చెబుతోంది. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. శ్వేతార్క మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలోగాని, వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం గాని, శ్వేతార్క వేరుని తాయిత్తులలో ధరించటంగాని చేస్తే శుభప్రదం. ఎవరైతే శ్వేతార్క గణపతిని సాక్షాత్తూ గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష సుఖశాంతులు లభిస్తాయి. జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, సూర్యుడు నీచలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు పండితుల్ని, పురోహితుల్ని సంప్రదించి, వారి సలహా మేరకు శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. కుదరని పక్షంలో వినాయక చవితి çరోజున ఈ శ్వేతార్క గణపతిని ప్రతిష్టించి పూజ చేసుకోవాలి. -
పదేళ్లలో కేన్సర్‌ను జయిస్తాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కేన్సర్‌పై విజయం సాధించే రోజు ఎంతో దూరం లేదని, ప్రస్తుత పరిశోధనలు పరిశీలిస్తే పదేళ్లలోనే ఇది సాధ్యమవుతుందని ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ పరిశోధకుడు ప్రేమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం కేన్సర్ సోకితే మరణమే అనుకునే వారని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని, ఒకట్రెండు రకాలు మినహా ఇతర కేన్సర్ల విషయంలో రోగులు 15–20 ఏళ్లు జీవిస్తున్నారని వివరించారు. కేన్సర్‌కు ఒకట్రెండు జన్యుమార్పులే కారణమని ఒకప్పుడు అనుకునేవారని, తాజా పరిస్థితులు గమనిస్తే వందకుపైగా మ్యూటేషన్స్ వ్యాధిని ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ సెల్ బయాలజీ–2018లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రేమ్‌కుమార్.. ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వైద్య రంగంలో ఇమ్యూనోథెరపీ ఓ అద్భుతమైన ఆవిష్కరణ అని.. మందులు, ఇమ్యూనోథెరపీ కలిపి వాడితే వ్యాధిని జయించవచ్చని పేర్కొన్నారు. క్రిస్పర్, జన్యు చికిత్స విధానాలతో పెద్దగా ప్రయోజనం ఉండదని.. కేన్సర్ సోకిందని గుర్తించే సమయానికే శరీరంలో 10 కోట్లకుపైగా కేన్సర్ కణాలు ఉంటాయని, అన్ని కణాల్లోని జన్యువులను మార్చ డం దాదాపు అసాధ్యమని చెప్పారు. పైగా జన్యు మార్పు లున్న కణాలు గుర్తించడమూ పెద్ద సమస్య అవుతుందని వివరించారు. అయితే కొన్ని రకాల వ్యాధులు.. ముఖ్యంగా జన్యువుల్లో వచ్చే మార్పులను సరి చేసేందుకు ఈ చికిత్స ఉపయోగపడొచ్చని పేర్కొన్నారు. కేన్సర్ చికిత్సకు సంబంధించి పురాతనమైన పద్ధతులపై ప్రయోగాలు చేయాల్సిన అవసరముందని ప్రేమ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. పౌష్టికాహారంతో నివారణ.. పౌష్టికాహారం కేన్సర్‌ను నయం చేయకపోవచ్చుగానీ.. నివారణకు మాత్రం మెరుగ్గా ఉపయోగపడుతుందని ప్రేమ్‌కుమార్ చెప్పారు. కేన్సర్ చికిత్సకు అందించే ట్యాక్సాల్ ఔషధం శరీరంలో వేగంగా విభజితమవుతున్న కణాలను చంపేస్తుందని, ఈ ప్రక్రియలో కొన్ని ఆరోగ్యకర కణాలూ నాశనమవుతూంటాయని పేర్కొన్నారు. ఈ చికిత్స ఫలితంగా వెంట్రుకలు ఊడిపోతాయని.. కడుపు, పేగుల గోడలపై ఉండే పొర కణాలూ దెబ్బతింటాయని, తెల్ల రక్త కణాలు కూడా తగ్గిపోవడంతో రోగులు బలహీన పడతారని వివరించారు. కడుపు, పేగుల్లోని కొన్ని రకాల బ్యాక్టీరియా కేన్సర్‌పై ప్రభావం చూపుతాయని.. అందుకే బ్యాక్టీరియా, కేన్సర్ల మధ్య సంబంధం తెలుసుకోడానికి ఫార్మా కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయన్నారు. హోమియోపతితో పోలిస్తే ఆయుర్వేదం విస్తృతంగా అర్థం చేసుకున్న విధానమన్నారు. కొన్ని వ్యాధుల విషయంలో హోమియో పనిచేస్తుందని నమ్ముతానని చెప్పారు. ఈ రెండు విధానాలనూ అర్థం చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో కపివ క్లినిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆయుర్వేద ఔషధాల తయారీ సంస్థ బైద్యనాథ్ గ్రూప్ కంపెనీ ‘కపివ’ త్వరలో హైదరాబాద్‌లో క్లినిక్స్‌ను ప్రారంభించనుంది. ప్రస్తుతం ముంబైలో నాలుగు కేంద్రాలను కపివ నిర్వహిస్తోంది. అలాగే బైద్యనాథ్ కో–బ్రాండెడ్‌లో కోల్‌కతాలో నాలుగు క్లినిక్స్ నడుస్తున్నాయి. 2018 డిసెంబరుకల్లా 20 సెంటర్లు అందుబాటులోకి వస్తాయని కపివ ఫౌండర్ శ్రే బధాని సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. వీటిలో మూడు కేంద్రాలు మార్చికల్లా హైదరాబాద్‌లో మొదలవుతాయన్నారు. నిపుణులైన వైద్యులతో పాటు ఫార్మసీ ఉంటుందని వివరించారు. ప్రముఖ వైద్యులతో చేతులు కలిపి కపివ కో–బ్రాండెడ్‌లో క్లినిక్స్‌ను ప్రమోట్ చేస్తామన్నారు ‘ప్రస్తుతం కపివ బ్రాండ్‌లో 180 ఔషధాలు ఉన్నాయి. ఆన్లైన్లో దేశవ్యాప్తంగా వీటిని విక్రయిస్తున్నాం. ఆఫ్‌లైన్‌లో ప్రస్తుతం ముంబై, కోల్‌కతాకు పరిమితమయ్యాం. ఆన్లైన్ అమ్మకాల్లో 45 శాతం హైదరాబాద్ నుంచి సమకూరుతోంది. అందుకే భాగ్యనగరితోపాటు బెంగళూరులోని ఆయుర్వేద మందుల షాపుల్లో మా ఉత్పత్తులు పరిచయం చేయనున్నాం. విభిన్న ఫార్ములేషన్స్‌తో ఔషధాలను తయారు చేస్తున్నాం. ఒక్కో ఉత్పాదన తయారీకి పరిశోధనకు 18 నెలల దాకా సమయం పడుతోంది. 50 మంది నిపుణులైన వైద్యులు ఆర్అండ్డీలో నిమగ్నమయ్యారు’ అని తెలిపారు. -
ఆయుర్వేదంతో వైద్య విప్లవం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి జిల్లాలో ఆయుర్వేద ఆస్పత్రిని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. సంప్రదాయ వైద్య విధానంతో దేశంలో వైద్య విప్లవం తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. గత ముప్పై ఏళ్లుగా మనం ఐటీ విప్లవం చూశామని, ఇప్పుడు సంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదతో వైద్య విప్లవానికి సమయం వచ్చిందని, అందువల్ల ఆయుర్వేదను పటిష్టపరచడమే కాక, పునరుద్ధరించేలా మనందరం ప్రతిజ్ఞ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. దేశంలోని పేదలకు అతితక్కువ ధరకే.. అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆయుర్వేదను విస్తరించడం తప్పనిసరని, సకల సదుపాయాలతో దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఆయూష్ మంత్రిత్వ శాఖ చురుకుగా పనిచేస్తోందన్నారు. మూడేళ్ల కాలంలో దేశంలో 65కు పైగా ఆయుష్ ఆస్పత్రులను అభివృద్ధి చేశామని తెలిపారు. భారత సామర్థ్యం.. ఆయుర్వేద.. ఆయుర్వేద అనేది భారతదేశ సామర్థ్యమని, ఈ రంగంలో సేవలందిస్తున్న వారు ఆయుర్వేదను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. అల్లోపతి మాదిరిగానే ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులను ఈ రంగంలోని నిఫుణులు రూపొందించాలని సూచించారు. మంచి ఆరోగ్యం కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదురుచూస్తున్నారని, దీనిని ఆయుర్వేద వినియోగించుకోవాలని చెప్పారు. ఆయుర్వేద ఔషధాలను ఆధునిక పద్ధతుల్లో ప్యాక్ చేసి అందించాలన్నారు. ప్రైవేటు కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులతో ఆయుర్వేదను పటిష్టం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఆయుర్వేద సిలబస్‌ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చాలని, ఆయుర్వేదకు సంబంధించి ప్రతి లెవల్‌ను దాటిన తర్వాత సర్టిఫికెట్లు అందజేయాలని పేర్కొన్నారు. సంప్రదాయ విధానాలను నిర్లక్ష్యం చేసిన దేశాలు తమ అస్థిత్వాన్ని కోల్పోయాయని చెప్పారు. ఔషధ మొక్కలను పెంచేలా ఆయుష్ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ శాఖ రైతుల్లో చైతన్యం తీసుకురావాలని, దీని వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. -
దూసుకెళ్తున్న పతంజలి మార్కెట్ షేరు
ముంబై : పతంజలి దంత్ కాంతి మార్కెట్ షేరు శరవేగంగా దూసుకెళ్తోంది. ఎప్పటినుంచో మార్కెట్లో పాతుకుపోయిన హిందూస్తాన్ యూనీలివర్ పెప్సోడెంట్, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ వంటి వాటికి చెక్ పెడుతూ.. పతంజలి మార్కెట్ షేరు ఒక్క ఏడాదిలోనే మూడింతలు పెంచుకుంది. బాంబా రాందేవ్‌కు చెందిన ఈ బ్రాండు జూన్ క్వార్టర్ ముగిసేసరికి 6.2 మార్కెట్ షేరును సొంతం చేసుకుంది. దీంతో దేశంలోనే నాలుగో అతిపెద్ద టూపేస్ట్ కంపెనీగా అవతరించింది. గతేడాది దీనికి 2.2 శాతం మాత్రమే మార్కెట్ షేరు ఉంది. అయితే పతంజలి మార్కెట్లో దూసుకెళ్తున్నప్పటికీ, కోల్గేట్ మాత్రం తన ఆధిపత్య స్థానాన్ని కోల్పోలేదు. ఇప్పటికే సగం మార్కెట్‌ను అంటే 52.7 శాతాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. కానీ 120 బేసిస్ పాయింట్లను మాత్రం కోల్గేట్ కోల్పోయింది. ఇదే క్రమంలో హిందూస్తాన్ యూనీలివర్ షేరు 240 బేసిస్ పాయింట్లు క్షీణించి 17.6 శాతానికి పడిపోయింది. పతంజలితో పాటు హెర్బల్ ఉత్పత్తుల బ్రాండు డాబర్ కూడా మార్కెట్లో మంచి స్థానాన్నే సంపాదించుకుంది. ఈ బ్రాండు మార్కెట్ షేరు కూడా 20 బేసిస్ పాయింట్లు పెరిగి 12.1 శాతంగా నమోదైంది. ఆయుర్వేద ఉత్పత్తులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతుండటంతో చాలా కంపెనీలు హెర్బల్ వేరియంట్లలో టూత్‌పేస్ట్‌లను అందించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏ ఉత్పత్తులైతే, సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతున్నాయో అవి ప్రస్తుతం మొత్తం టూత్‌పేస్ట్ మార్కెట్లో ఐదవంతు మార్కెట్ షేరును ఆక్రమించుకున్నాయి. దంత్ కాంతి బ్రాండులోనే కొత్త వేరియంట్లను తీసుకొచ్చేందుకు తాము ప్లాన్ చేస్తున్నామని పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అధికారిక ప్రతినిధి ఎస్కే టిజారవాలా చెప్పారు. అలోవీరా, ఫ్రెష్ యాక్టివ్ జెల్, రెడ్ టూత్‌పేస్ట్‌లలో కూడా కొత్త వేరియంట్లను తీసుకొచ్చి, తమకున్న మార్కెట్ షేరును మరింత పెంచుకోనున్నామని తెలిపారు. తమ కొత్త ఉత్పత్తులన్నింటికీ ఆయుర్వేద పద్ధతులు వాడుతామని, కానీ దాని వెనుకాల ఉన్న సైన్సును అర్థం చేసుకోకుండా.. బహుళ జాతీయ కంపెనీలు వాటిని కాపీ కొడుతున్నాయని చెప్పారు. దంత్ కాంతికి కౌంటర్‌గా కోల్గేట్ కూడా ఏడాది క్రితమే తన తొలి ఆయుర్వేద బ్రాండును తీసుకొచ్చింది. హెచ్‌యూఎల్ కూడా ఆయుర్వేద పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌లను లాంచ్ చేస్తోంది. కానీ వాటికంటే శరవేగంగా పతంజలి ఉత్పత్తులే మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. -
దగా వైద్యం
జిల్లాలో నకిలీ ఆయుర్వేద వైద్యులు - దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తామని ప్రచారం - అర్హత లేకపోయినా ప్రకటనలతో బురిడీ - అనువంశిక, గిరిజన వైద్యం పేరిట మోసం - నిలువు దోపిడీకి లోనవుతున్న రోగులు ఆయుర్వేదం అక్రమార్కులకు వరంగా మారింది. ఈ వైద్యం పేరిట అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి అల్లోపతి మందులను ఆయుర్వేదం మందుల్లో కలిపి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో ప్రాణాలను హరిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని నియంత్రించే వ్యవస్థ బలంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. - కర్నూలు శివారులోని వీకర్ సెక్షన్కాలనీలో గతంలో ఓ వ్యక్తి అల్లోపతి మందులైన పెయిన్ కిల్లర్లను, స్టెరాయిడ్స్‌ను ఆయుర్వేద మందుల్లో కలిపి పలురకాల వ్యాధులు తగ్గిస్తామని జనానికి అంటగట్టారు. ఈ వ్యక్తిపై రెండేళ్ల క్రితం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. - ఇటీవల నంద్యాల రోడ్డులోని శిల్పా సింగపూర్ టౌన్షిప్ సమీపంలోనూ శ్రీనివాసులు అనే వ్యక్తి మందులు తయారు చేస్తుండగా అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని బనగానపల్లిలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఉంది. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 40 పైగా ఆయుర్వేద డిస్పెన్సరీలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వమే ఆయుర్వేద మందులను సరఫరా చేస్తోంది. కానీ ఈ ఆసుపత్రుల కంటే నకిలీ వైద్యులకే డిమాండ్ అధికంగా ఉంటోంది. దీర్ఘకాలిక వ్యాధులను, అల్లోపతి వైద్యానికి లొంగని వ్యాధులను మటుమాయం చేస్తామని నమ్మబలుకుతూ వీరిచ్చే ప్రకటనలను అమాయక ప్రజలు నమ్మి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ఆయుర్వేదానికి సంబంధించి ఎలాంటి కోర్సులు చేయకపోయినా నిపుణులైన వైద్యులను తలదన్నేలా దర్జా కనబరుస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, బనగానపల్లి, ఆత్మకూరు, శ్రీశైలం, మహానంది, కోడుమూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, మంత్రాలయం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో నకిలీ ఆయుర్వేద వైద్యులు తిష్టవేసి తెలిసీ తెలియని వైద్యం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పర్యవేక్షణ లేదు.. శిక్షలూ పడవు ఆయుర్వేద వైద్యం చేయాలంటే బీఏఎంఎస్ కోర్సు తప్పనిసరి. కానీ కొంత మంది దూరవిద్య ద్వారా డిప్లమా సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. మరికొందరు అనువంశిక వైద్యమని, గిరిజన వైద్యమని చెబుతూ జనాన్ని మభ్యపెడుతున్నారు. ఏ మాత్రం అక్షరజ్ఞానం లేని వారు సైతం వైద్యులుగా చెలామణి అవుతున్నారు. చివరికి రహదారి పక్కన మూలికలు నూరిపోసి జనానికి ఇస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. ఆయుర్వేద మందులను విక్రయించాలన్నా, వాటిని తయారు చేయాలన్నా ఆయుష్ విభాగం నుంచి అనుమతి పొందాలి. వీరు ఏ మందులు విక్రయిస్తున్నారు, ఎలాంటి మందులు తయారు చేస్తున్నారో అధికారులు పర్యవేక్షించాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మందులను తనిఖీ చేసేందుకు కేవలం ఇద్దరు మాత్రమే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. దీంతో వీరు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించవు. విజిలెన్స్ అధికారులు అడపాదడపా దాడులు చేసి పట్టుకుని, పోలీసులకు అప్పగించినా పెద్దగా శిక్షలు పడవు. నకిలీ మందులు వాడి కొన్ని వేల మంది ఇప్పటికే కిడ్నీ, కాలేయం వ్యాధులతో బాధపడుతున్నారు. మరికొందరు అనారోగ్యంతో కన్నుమూశారు. కానీ అక్రమార్కులకు ఎలాంటి కఠిన శిక్షలూ పడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయుర్వేద మందులు విక్రయించే వారిపై పర్యవేక్షణ చేసే అధికారం ఇటు ఆయుష్ విభాగ అధికారులకు గానీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు, ఔషధ నియంత్రణ శాఖకు ఉండటం లేదు. దీంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు. తనిఖీలు చేసే అధికారం మాకు లేదు జిల్లాలో అనేక మంది నకిలీ ఆయుర్వేద వైద్యులున్నట్లు మా దృష్టికి కూడా వస్తోంది. కానీ అలాంటి వారిపై తనిఖీలు చేసి, శిక్షించే అధికారం మాకు లేదు. నకిలీ వైద్యులు విక్రయించే మందుల వల్ల అనేక మంది అనారోగ్యానికి లోనవుతున్నారు. కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటున్న వారు కొన్ని వేల మంది ఉన్నారు. ఆయుర్వేదం ఒక అద్భుత వైద్యం. ప్రజలు నిపుణులైన వైద్యుల వద్ద మాత్రమే చికిత్స చేయించుకోవాలి. – డాక్టర్ పి.వి.నాగరాజరావు, సీనియర్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ -
ఆయుష్మాన్ భవ!
- వేద కాలం నుంచే ఆయుర్వేద వైద్యం - దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే అవకాశం - నేడు ఆయుర్వేద దినోత్సవం బండిఆత్మకూరు: కాలుష్యం, కల్తీ ఆహారం, ఒత్తిడితో గతి తప్పిన జీవన శైలి. అన్నింటితో అనారోగ్య సమస్యలు. ఆరోగ్యంతో నిండు నూరేళ్లు హాయిగా జీవించాలంటే ఆయుర్వేదం తప్పనిసరి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వేద భూమి అయిన భారత దేశంలో ఆయుర్వేదంను అధర్వణ వేదమునకు ఉపవేదంగా పేర్కొనబడింది. మానవుని ఆవిర్భావం నుంచి ఆరోగ్యానికి ఉన్న ప్రాముఖ్యతను విఫులంగా ఇందులో వివరించబడింది. ఆయుస్సును గురించి తెలిపే జ్ఞానమును ఆయుర్వేదం అంటారు. పురాణ ఇతియాసముల ప్రకారం క్షీరసాగర మధనము జరిగినప్పుడు లక్ష్మీదేవి, చంద్రుడు, ఇంద్రుడు, వాయు దేవుడితో పాటు భగవాన్ ధన్వంతరి కూడా ఆశ్వయిజ బహుళ త్రయోదశి నాడుఆవిర్భంవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజునే «ధన్వంతరి జయంతిని అనాదిగా జరుపుకుంటున్నారు. దీంతో ఈ రోజునే ప్రభుత్వం జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయుర్వేద చికిత్స విధానం గురించి ప్రత్యేక కథనం. వేదకాలంలోనే ప్రస్తుత వైద్య విధానం భారత దేశంలో అతి పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న వైద్యం.. ఆయుర్వేదం. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంచెం వెనుకబడినా ప్రస్తుత కాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంటోంది. ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలి వ్యాధులఽను సైత్యం నయం చేయవచ్చునని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్న అన్ని రకాల జబ్బులకు వేద కాలంలోనే చికిత్సలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. ప్రస్తుత వైద్య విధానాన్ని ఎనిమిది విభాగాలు విభజించారు. ఇందులో కాయచికిత్స(జనరల్ మెడిసిన్), బాలచికిత్స(ప్రసూతి, స్త్రీరోగ, బాలరోగ)లకు సంబంధించింది. గ్రహ చికిత్స(వైరాలజీ–యాంటిబాయటిక్స్), ఉర్ద్వా చికిత్స(తల, మెడ), సెల్యచికిత్స(సర్జరీ), దంష్ట్ర(పాము, తేలు, పురుగులకు), జర చికిత్స(ముసలితనంలో వచ్చే రోగాలకు), రసాయన చికిత్స(ఇమ్యూనాలజీ). పంచకర్మ ప్రసిద్ధి ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స విధానం ఓ విశిష్ట చికిత్స పద్ధతి అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మందులకు లొంగని మొండి వ్యాధులను పంచకర్మ ఒక అద్భుత చికిత్స. వ్యాధిని మూలము నుంచి తీసి వేయడానికి ఈ చికిత్స విధానం తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఐదు పద్థతులు ఇవే. స్నేహనము, స్వేదనము, వయనము, విరేచనము, వస్తి ఇందులో స్నేహనము, స్వేదనములను పూర్వ కర్మలు అంటారు. శరీరంలో ఉన్న మలినాలన్నింటిని దారిలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగతా మూడు నోటి ద్వారా, విరేచనం ద్వారా జబ్బులను తొలగించడానికి వేస్తారు. అయితే జిల్లాలో ఒక పంచ కర్మ యూనిట్ కూడా లేకపోవడం విచారకరమని రోగులు చెబుతున్నారు. అయితే నంద్యాల పట్టణంలో ఇటీవల సుమారు 58 లక్షల నిధులతో పంచకర్మ యూనిట్‌కు నిధులు మంజూరైనా ఇంకా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. బ్రిటీషుల రాకతో తగ్గిన ఆదరణ బ్రిటీషులు రాకతో భారతదేశంలో హల్లోపతి మందుల వాడకం పెరిగింది. ఆంగ్లీయుల సైనికులకు గాయాలైనప్పుడు వారికి త్వరగా నయమయ్యేందుకు ఇంగ్లీష్ మందులను ఉపయోగించారు. దీంతో మన దేశంలో ప్రజలు కూడా వారిలాగే త్వరగా నయం కావాలని రోజువారి జబ్బులైన తలనొప్పి, జలుబు, జ్వరం తదితర వాటికి ఇంగ్లీష్ మందులను వినియోగిస్తున్నారు. ఈ విధంగా ఆంగ్లీయుల రాకతో ఆయుర్వేద వైద్యాన్ని భారతీయులకు అంటగట్టి బలవంతులను బలహీనులుగా మార్చారని పూర్వీకుల వాదన. అయితే హల్లోపతి మందులతో దుష్పపరిణామాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెలుగులోకి తేవడంతో ప్రజలు మళ్లీ ఆయుర్వేద వైద్యంపై ఆసక్తి చూపుతున్నారు. అన్ని రోగాలకు రకాలకు మందులు . ఆయుర్వేదంలో అన్ని రోగాలకు రకాలకు మందులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సంతాన సాఫల్యత, ఆడ, మగ హార్మోన్ అసమానతలు, కడుపు నొప్పి, రొమ్ములో గడ్డలుమెనోపాజ్ తదితర స్త్రీల వ్యాధులకు, బీపీ, షుగర్, కిడ్నీలో రాళ్లు, ఆసిడిటీ, గ్యాస్ట్రబుల్, అజీర్ణం, మలబద్ధత, ఫైల్స్, ఫిషర్స్, సయాటికా, నడుము నొప్పి, కీళ్ల వాతం, చిన్న పిల్లలకు, గర్భిణీలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులు ఉన్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే నేషనల్ ఆయుర్వేద మిషన్(నాం) వద్ద కోట్లాది రూపాయల నిధులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలకు అవసరమైన మందులను సరఫరా చేయడం లేదు. 50 సంవత్సరాలు దాటిన పురుషులు, స్త్రీలకు ఎక్కువగా కీళ్లనొప్పులతో అవస్థలు పడుతున్నారు. ఇందుకు అవసరమైన వైద్యం అందించడానికి తైలం ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. వంటకాల్లో ఎన్నో మూలికలు: యశోధర, ఎండీ, ఆయుర్వేద, బండిఆత్మకూరు ప్రస్తుతం మనము ఉపయోగించే వంటకాల్లో ఎన్నో మూలికలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆవాలు, జీలకర, మిరియాలు, ధనియాలు, ఇంగువా, సొంటిలో ఎన్నో ఔషధ మూలికలు ఉన్నట్లు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించి ఒక్కో జబ్బుకు ఒక్కో రకం మూలికను ఉపయోగించి మందులను తయారు చేస్తున్నారు. రోగులు జబ్బు వచ్చిన తర్వాత మొదటి సారిగా ఆయుర్వేద వైద్యులను కలిస్తే ఉపయోగంగా ఉంటుంది. అయితే హలో్లపతి, హోమియోపతి ద్వారా చికిత్స చేయించుకున్న తగ్గనప్పుడే ఆయుర్వేదానికి వస్తున్నారు. -
‘పంచకర్మ’తో కొవ్వుల నియంత్రణ నిజమే
ఆయుర్వేద చికిత్స ప్రక్రియతో రక్తంలోని మెటబొలైట్స్లో మార్పులు వస్తున్నాయని తద్వారా కొలెస్ట్రాల్ నియంత్రణతోపాటు వాపు, గుండెజబ్బుల ప్రమాదం తగ్గడం వంటి సత్ఫలితాలు ఉంటాయని శాస్త్రీయ ప్రయోగమొకటి స్పష్టం చేసింది. ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఆయుర్వేద చికిత్స విధానాల్లో ‘పంచకర్మ’ ఒకటన్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా రోగులకు శాఖాహారం మాత్రమే అందిస్తూ... రోజూ యోగా, ధ్యానం చేయిస్తూ, అప్పుడప్పుడు శరీరానికి మర్దన చేయిస్తారు. ఈ ప్రక్రియ సామర్థ్యాన్ని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు కాలిఫోర్నియా యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన దీపక్ చోప్రా ఇటీవల ఒక ప్రయోగం చేపట్టారు. ఇందులో భాగంగా 30-80 ఏళ్ల 119 మందిని ఎంపిక చేసి వారిలో సగం మందికి ఆరు రోజులపాటు పంచకర్మ క్రియను అందించారు. చికిత్సకు ముందు, తరువాత రక్తం తాలూకూ ప్లాస్మాను క్షుణ్ణంగా విశ్లేషించారు. పంచకర్మ చికిత్స అందుకున్న వారి రక్తంలో దాదాపు 12 ఫాస్పోలిపిడ్స్ గణనీయంగా తగ్గాయని, ఈ మార్పులు వారి కొలెస్ట్రాల్ మోతాదులకు విలోమానుపాతంలో ఉన్నట్లు గుర్తించామని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్టీన్ తారా పీటర్సన్ తెలిపారు. ఈ ఫాస్పోలిపిడ్స్ కొలెస్ట్రాల్, వాపు నియంత్రణను ప్రభావితం చేస్తాయని, వీటిల్లో ఒక ఫాస్పోలిపిడ్ అధికమోతాదులో ఉండటం గుండెజబ్బులకు దారితీస్తుందని ఇప్పటికే గుర్తించారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ప్రక్రియ ప్రభావశీలతకు కారణాలను విశ్లేషిస్తామని క్రిస్టీన్ వివరించారు. -
యోగాతో మానసిక పరివర్తన
జిల్లా జైలులో ముగిసిన శిక్షణ శిబిరం సంగారెడ్డి టౌన్:యోగాతో మానసిక పరివర్తన వస్తుందని పతాంజలి ఆయుర్వేద లిమిటెడ్ సంస్థకు చెందిన యోగా శిక్షకులు మోహన్‌రెడ్డి అన్నారు. స్థానిక కందిలోని జిల్లా జైలులో గత నెల 18 నుంచి ఖైదీలకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిహేను రోజులుగా ఖైదీలకు, జైలు సిబ్బందికి ఆసనాలు, ప్రాణాయామంలో శిక్షణ ఇచ్చామన్నారు. నిత్యం యోగా చేస్తే మానసిక రుగ్మతలు, వ్యాధులకు దూరంగా ఉండొచ్చన్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రశాంతత నెలకొందని ఖైదీలు తెలిపారు. కార్యక్రమంలో జైలు పర్యవేక్షకులు సంతోష్ కుమార్‌రామ్, జైలర్ చిరంజీవి, డిప్యూటీ జైలర్లు ప్రభాకర్, చంద్రశేఖర్, సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు. -
మళ్లీ నకిలీ ఆయుర్వేదం
చికిత్స చేస్తున్న అనుమతి లేని వైద్యులు పట్టించుకోని అధికారులు! ఖానాపురం : మండల కేంద్రంలో అనుమతి లేని ఆయుర్వేదం మళ్లీ జోరందుకుంటుంది. నెల రోజుల క్రితం ‘అనుమతి లేని ఆయుర్వేదం’ శీర్షికన సాక్షిలో వరుస కథనాలు రావడంతో జిల్లా ఆయూష్ అధికారులు స్పందిం చారు. మండల కేంద్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఆయుర్వే వైద్యాన్ని పరిశీలించారు. ఆయూష్ అధికారుల పరిశీలనలో ఒక్కరూ అర్హులు కారనే విషయాన్ని గుర్తించి షాపులను మూసివేయాలని హెచ్చరించి, వివరాలు సేకరించారు. ఆ తర్వాత కొన్ని రోజులు వైద్యాన్ని నిలిపివేశారు. తిరిగి కొద్ది రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ వైద్యాన్ని ప్రారంభించారు. బుధవారం కరీంగనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి వృద్ధులు అధిక సంఖ్యలో వచ్చారు. అనుమతి లేకున్నా విచ్చలవిడిగా వైద్యాన్ని నడిపిస్తుండటంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయూష్ అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మందులు వాడినా దద్దుర్లు తగ్గడం లేదు!
ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 29 ఏళ్లు. గత నాలుగు నెలల నుంచి ఒళ్లంతా దద్దుర్లు, దురద ఇబ్బంది పెడుతున్నాయి. డాక్టర్లు ‘అర్టికేరియా’ అని చెప్పి ఇచ్చిన మందులు వాడినా, తాత్కాలిక ఉపశమనమేగానీ పూర్తిగా తగ్గడం లేదు. ఇది పూర్తిగా నయమవడానికి ఆయుర్వేద చికిత్స సూచించండి. - శాంభవి, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలున్న అవస్థను ఆయుర్వేదంలో ‘శీత పిత్త, ఉదర్ద ఉత్కాఠ’ అనే పేర్లతో వివరించారు. దీనికి ప్రధాన కారణం ‘అసాత్మ్యజ’ (అలర్జిక్) పదార్థాల ప్రభావం దీనివల్ల శరీరంలో ‘పిత్తం’ ప్రకోపిస్తుంది. దీనికి తోడుగా అతిశీతల వాతావరణం చర్మం మీద ప్రభావం చూపడం జరిగితే వాత, కఫాలు కూడా వికృతి చెంది ‘దురదతో కూడిన దద్దుర్లు’ వ్యక్తమవుతాయి. కందిరీగలు కుట్టినట్లుగా నొప్పి, మంట ఉండవచ్చు. అప్పుడప్పుడు జ్వరం, వాంతి కూడా ఉంటాయి. ఆ దద్దుర్లు బండి చక్రాల్లాగ గుండ్రంగా ఉండి మధ్యలో పల్లంగా ఉండవచ్చు. చికిత్స సూత్రాలు: జఠరాగ్ని సక్రమంగా పనిచేసేట్టు చూసుకోవాలి. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే ‘జావల’ వంటి ఆహారం తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగాలి. అలర్జీని కలిగించే ఆహార పదార్థాలను, ఇతర ద్రవ్యాలను శీఘ్రంగా పసిగట్టడం కష్టం కాబట్టి ఆ సమయంలో మజ్జిగ అన్నం కానీ, బార్లీ, గోధుమ జావలుగానీ రెండు రోజుల పాటు సేవిస్తే మంచిది పొట్టలో క్రిములు లేదా అమీబియాసిస్ (ప్రవాహికా) వంటి వికారాలు ఉంటే వాటికి వెంటనే చికిత్స చేయాలి ఆహారపదార్థాల్లో వాడే రంగులు, నూనెలు, నిల్వ కోసం వాడే రసాయనాలు, గరం మసాలాల వంటివి ఎన్నో ద్రవ్యాలు అలర్జీలకు కారణమవుతాయని గుర్తుంచుకోండి. వాటికి దూరంగా ఉండండి అతిశీతల వాతావరణానికి గురికావద్దు దుమ్ము ధూళి రసాయనాలు వంటి వాటికి దూరంగా ఉండండి అలాగే ఎక్కువ సేపు ఎండకి కూడా గురికావద్దు. ఔషధాలు : క్రిమికుఠారరస (మాత్రలు) : ఉదయం 1 మధ్యాహ్నం 1 రాత్రి 1 (ఐదు రోజుల పాటు వాడాలి) లఘుసూతశేఖర రస (మాత్రలు) : ఉదయం 2, రాత్రి 2 (రెండు వారాలు వాడాలి). రసపీపరీరస (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 (మూడు వారాలు వాడాలి)యష్టిమధు (మాత్రలు) : ఉదయం 2 రాత్రి 2 ( మూడు వారాలు వాడాలి). ఖదిరారిష్ట (ద్రావకం): నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి రోజూ మూడుపూటలా తాగాలి (సమస్య తగ్గేవరకు)పైపూతకు: ‘మహామరిచాదితైలం మూడు పూటలా పూయవచ్చు. గృహవైద్యం: పసుపు 500 మి.గ్రా + వేపాకు ముద్ద 3 గ్రాములు + బెల్లం 5 గ్రాములు కలిపి ఒక మోతాదుగా వేడినీటితో ఉదయం పరగడుపున సేవించాలి. వ్యాధి తీవ్రతను బట్టి రోజూ రెండు, మూడు సార్లు కూడా తీసుకోవచ్చు. ఆవనూనెను దద్దుర్లపై పూసుకోవచ్చు. గమనిక : పై చికిత్సలకు లొంగకపోతే, వైద్యనిపుణుడి పర్యవేక్షణలో అవసరమైన పంచకర్మలు చేయించుకోవాలి (విరేచన, వమన, అభ్యంగ, స్వేద వంటి ప్రక్రియలు). కొన్ని ప్రత్యేక కషాయాలు కూడా వైద్యుడు తయారుచేసి ఇవ్వాల్సి ఉంటుంది.ట ఉదా : గుడూచీ, మంజిష్ఠా, శారిబా మొదలైన ద్రవ్యాలతో వాటిని తయారు చేస్తారు. నొప్పి ఎక్కువై నడవడం కష్టమౌతోంది ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 68 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. తగిన సలహా ఇవ్వండి. - రత్నమ్మ, కాకినాడ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియోఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తాం. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ) చేయాల్సి రావచ్చు. ఆర్నెల్ల క్రితం నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది (ట్విస్ట్ అయ్యింది). అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది. - నీరజ, గుంటూరు మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నా వయసు 55 ఏళ్లు. నాకు రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తోంది. దాదాపుగా ఏడాది నుంచి ఈ నొప్పి ఉంది. కుడి మోకాలి నొప్పి కాస్త భరించగలిగేట్లు ఉన్నా ఎడమ మోకాలిలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నొప్పి పెరుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎడమ మోకాలిలో తీవ్రమైన ఆర్థరైటిస్ ఉందనీ, కుడి మోకాలిలో దాని తీవ్రత ఒకింత తక్కువగా ఉందని అంటున్నారు. ఈ మోకాళ్లలోకి ల్యూబ్రికెంట్ పనిచేసే అత్యంత ఆధునికమైన ఇంజెక్షన్లు ఇస్తామని అంటున్నారు. దాంతో ఆర్థరైటిస్ నొప్పులూ, మోకాళ్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ చాలా ఖరీదైనవి అంటున్నారు. అంత ఖరీదైన ఇంజెక్షన్స్‌ను భరించే స్తోమత నాకు లేదు. అందుకే నాకు తగిన సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి. - దుర్గాప్రసాద్, విజయవాడ మీరు చెప్పినట్లుగా ల్యూబ్రెకెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి మరీ ఆధునికమైనవేమీ కాదు. గత 20 ఏళ్లుగా డాక్టర్లు వాటిని వాడుతూనే ఉన్నారు. అవి కేవలం చాలా తక్కువ నుంచి ఒక మోస్తరు ఆర్థరైటిస్ ఉన్నవారికి మాత్రమే ఉపకరిస్తాయి. పైగా అవి లక్షణాల తీవ్రతను తగ్గించడం మాత్రమే చేస్తాయి. అంతేకాదు... ఆర్థరైటిస్ పెరగడాన్ని కాస్త తగ్గించి, కార్టిలేజ్‌ను బలం చేకూరుస్తాయి. అంతేగానీ వాటివల్ల శాశ్వత పరిష్కారం రాదు. పైగా తీవ్రమైన ఆర్థరైటిస్ ఉన్నవారికి వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి అప్పటికే కార్టిలేజ్ దెబ్బతిని ఉంటుంది కాబట్టి వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మీ విషయానికి వస్తే అది కుడి కాలికి కొంత ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎడమకాలికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే దానివల్లనే అంతా చక్కబడుతుందని అనుకోవద్దు. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన వైద్య చికిత్స పొందండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘పాములపర్తి’
వరంగల్ : ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డాక్టర్ పాములపర్తి రామారావుకు స్థానం కల్పించారు. సంస్థ ఇండియా ప్రెసిడెంట్ నీలం.. గత 23 ఏళ్లుగా ఆయుర్వేదంలో ఉచిత వైద్య సేవలందిస్తున్న రామారావును గుర్తించారు. అలాగే మెడ, నడుము ప్రాంతా ల్లో ‘డిస్క్‌లు’ జారడం వల్ల వచ్చే నొప్పుల నివారణకు రామారావు స్వయంగా కనుగొన్న ‘మసాజ్ థెరఫీ’కి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల విషయాలను గుర్తించారు. ఈ మేరకు 2016 సంవత్సరానికి రామారావుకు ‘వండర్ బుక్స్ రికార్డ్స్’లో చోటు కల్పించిన ట్లు ఆయనకు సమాచారం అందించారు. ఇందులో భాగంగా ప్రశంసాపత్రం, మెమోంటో, గోల్డ్‌మెడల్‌ను ఆయనకు పంపించారు. కాగా, ఈ బహుమతులను సోమవారం కలెక్టర్ వాకాటి కరుణ రామారావుకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు రామా రావుకు అంతర్జాతీయస్థాయి అవార్డు రావడం అభినందనీయమన్నారు. డాక్డర్ రామారావు మాట్లాడుతూ అవార్డుతో తనపై బాధ్యత పెరిగిందన్నారు. ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందనున్నానని, తర్వాత పూర్తి సమయాన్ని రోగులకు కేటాయిస్తానని పేర్కొన్నారు. -
మితంగా వాడితే హితమే
ఆవకాయ - ఆయుర్వేదం ప్రకృతిలో నేరుగా లభించే ఆహార పదార్థాల పోషక విలువల గురించి, ఇతర గుణధర్మాల గురించి కూలంకషంగా వివరించింది ఆయుర్వేదం. వివిధ ద్రవ్యాల సమ్మేళనంతో మనం వండుకు తినే ఆహార పదార్థాలను ‘కృతాన్నములు’గా విశదీకరించింది. కాని, ఎక్కడా ఆవకాయ (ఊరగాయ) గురించిన ప్రస్తావన కనబడదు. కాబట్టి ఆవకాయలో ఉండే వివిధ ద్రవ్యాల గుణధర్మాలను గుర్తెరిగి మనం అన్వయించుకుని, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆవకాయలోని పదార్థాలు ముదిరిన పుల్లటి మామిడికాయ, ఆవపొడి (ఆవాలు), ఉప్పు, కారంపొడి (ఎండు మిరప), నువ్వులనూనె. కొంత తక్కువ పరిమాణంలో ఇంగువ, పసుపు, మెంతులు, కొన్ని ప్రాంతాల్లో వెల్లుల్లి కూడా కలుపుతారు. ఇంకొన్ని ప్రాంతాల్లో బెల్లం కూడా కలుపుతారు. ఉత్తరాది వారు ఆవకాయలో సోంపు కూడా వాడుతారు. స్థూలంగా పరిశీలిస్తే ఆవకాయలో షడ్రసాలు (మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ) కనిపిస్తాయి. మామిడికాయ: అమ్లరస ప్రధానం (పులుపు). కాబట్టి రుచి, ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి. లఘువు (సులువుగా జీర్ణమై, శరీరాన్ని తేలికపరుస్తుంది). ఉష్ణవీర్యం (వేడి చేస్తుంది). మేదస్సు (కొవ్వు) కరిగిస్తుంది. ధాతు పోషకం. కఫ, పిత్త, రక్త వర్ధకం. ఆవాలు: ఇవి పసుపు, ఎరుపు, నలుపు రంగుల్లో మూడు రకాలుగా ఉంటాయి. రుచికి చేదుగా, కారంగా కూడా ఉంటాయి. తీక్ష్ణ, ఉష్ణ గుణాలు ఉంటాయి. కృమిహరము (కడుపులో క్రిములను నాశనం చేస్తాయి). అగ్నిదీప్తికరం (జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి). కారం (కటురసం): సనాతన ఆయుర్వేద గ్రంథాల్లో కారానికి సంబంధించి మిరియాలు మాత్రమే కనిపిస్తాయి. మిరపకాయ క్రీస్తుశకం 17వ శతాబ్దంలో విదేశాల నుంచి మనకు సంక్రమించిన పదార్థం. కటురసం. దీపన పాచనాలు చేస్తుంది. వాపులను తగ్గిస్తుంది. తీక్ష్ణ, ఉష్ణ గుణాలను కలిగి ఉంటుంది. ఉప్పు (లవణరసం): తీక్ష్ణమై చెమటను కలిగిస్తుంది. రుచికరమై జీర్ణక్రియకు దోహదపడుతుంది. శరీరంలోని కొవ్వు కంతులను కరిగించి, జడత్వాన్ని పోగొడుతుంది. అయితే, షడ్రసాలలో అతి తక్కువగా తినవలసింది లవణరసం. దీనిని ఎక్కువగా సేవించవద్దని చరక మహర్షి హెచ్చరించాడు. నిజానికి ఇది ‘హిత శత్రువు’ చక్కని రుచి కలిగించి, తృప్తినిచ్చే మిత్రునిలా ఉంటూనే వెనుక ఎన్నో రోగాలను కలిగించే శత్రువన్న మాట. ఎక్కువగా వాడితే బట్టతల, శిరోజాలు రాలిపోవడం, తలనెరపు, శరీరంపై ముడుతలు వంటి లక్షణాలు యుక్తవయస్సులోనే కలుగుతాయి. ఎముకలు, కీళ్లు బలహీనమవుతాయి. కంటిచూపు మందగిస్తుంది. నువ్వులనూనె: త్రిదోషహరం. మేధావర్ధకం, దీపనం (జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది), శూలహరం (నొప్పులను తగ్గిస్తుంది). ఇంగువ, పసుపు, మెంతులు, వెల్లుల్లి: ఇవన్నీ కోష్ఠశుద్ధికి (కడుపును శుభ్రపరచడానికి) పనికొస్తాయి. తీక్ష్ణ, ఉష్ణగుణాలు కలిగి ఉంటాయి. క్రిములను నాశనం చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. విడివిడిగా ఇలాంటి గుణధర్మాలను కలిగిన ద్రవ్యాలన్నింటినీ సమ్మేళనం చేసి, నిల్వ ఉంచితే తయారయ్యే ఊరగాయే ‘ఆవకాయ’. ఆవకాయ ప్రభావం ఇందులోని ఏ ద్రవ్యమైనా అతిగా సేవిస్తే అన్నీ అనర్థాలేనని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల ఆవకాయను తక్కువ పరిమాణంలో అప్పుడప్పుడు తింటే ఫర్వాలేదు. మితంగా తింటే అలసత్వం పోయి చురుకుదనం కలుగుతుంది. నోటికి రుచికరంగా ఉంటుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎలా తినాలి? ⇒ కొందరు నెయ్యి కలిపిన పప్పన్నంతో తప్ప ఆవకాయను తినరు. ఇది చాలా మంచి పద్ధతి. ఇలా తింటే, జీర్ణకోశానికి రక్షణ కలిగి, అల్సర్లు రాకుండా ఉంటాయి. ⇒ కొందరు వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని, పైన వెన్నపూస వేసి తింటారు. వెన్నపూసలోని స్నిగ్ధత్వం ఆవకాయలోని తీక్ష్ణత్వాన్ని అణచివేస్తుంది. ఫలితంగా మనలో పుట్టే వేడి తగ్గుతుంది. ⇒ కొన్ని ప్రాంతాల్లో ఆవకాయ అన్నంలో నెయ్యి కలుపుకుంటారు. కొందరు నువ్వులనూనె లేదా వేరుశనగ నూనె కలుపుకుంటారు. ఇది కూడా ఆవకాయ అహం‘కారాన్ని’ అణచివేయడానికే. ⇒ కొందరికి పెరుగు లేదా మజ్జిగ సేవించే అలవాటు ఉండదు. అలాంటప్పుడు ఆవకాయ మన శరీరంపై తప్పక విపరీత ప్రభావం చూపుతుంది. కళ్లు మంట, మూత్రంలో మంట, మలవిసర్జన సమయంలో మంట, మలబద్ధకం, కాళ్లుపీకటం, జ్వరం, నీరసం, కడుపులో మంట వంటి లక్షణాలు కలుగుతాయి. వ్యావహారిక భాషలో దీనినే ‘వేడిచేసింది’ అంటాం. ⇒ పెరుగు, మజ్జిగతో పాటు నీళ్లు కూడా ఎక్కువగా తాగితే ఆవకాయ ఘాటు శరీరంపై తక్కువగా ప్రభావం చూపుతుంది. ⇒ శరీరానికి షడ్రసాలను అలవాటు చేయడం వల్ల బలం కలుగుతుందని, ఏకరస ప్రధానంగా ఆహారం తీసుకుంటే తగిన పోషకాలు లభించవని చరకాచార్యులు చెప్పారు. కనుక ఆవకాయను అప్పుడప్పుడు మితంగా తింటే మంచిదే. ⇒ కాని, ఈ హితశత్రువు పట్ల అప్రమత్తంగా లేకుంటే మాత్రం హైబీపీ, కీళ్లవ్యాధులు, స్థూలకాయం, కిడ్నీ సమస్యలు, మధుమేహం, పక్షవాతం, గుండెపోటు వంటివి సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా ఆవకాయలో ఎక్కువ పరిమాణంలో ఉండే ఉప్పే అసలు ముప్పు. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమయూన్‌నగర్, హైదరాబాద్ -
ఆవు మూత్రంపైనా పన్ను
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 5% విధింపు సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గోమూత్రంపై 5 శాతం పన్ను విధించింది. ఏపీ వ్యాట్‌చట్టం-2005లోని ఐదో షెడ్యూల్ ప్రకారం గోమూత్రంపై పన్ను విధించే అధికారం ఉందంటూ వాణిజ్య పన్నుల విభాగం రాష్ట్రంలోని వివిధ సంస్థలకు సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం-1940 కింద లెసైన్స్ పొంది తయారు చేసే ఆయుర్వేద, హోమియోపతి మందులపై పన్ను వేస్తున్నట్టే గోమూత్రాన్నీ ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధిస్తున్నట్టు పేర్కొంది. ఈమేరకు నోటీసులు అందుకున్న గోఉత్పత్తుల తయారీ సంస్థలు, గోసంరక్షణ శాలల నిర్వాహకులు ప్రభుత్వ తీరును నిరసిస్తున్నాయి. వాణిజ్య పన్నులశాఖ నోటీసుల్లో ఏముందంటే.. ఆయుర్వేద, హోమియోపతి మందుల మాదిరే గోమూత్రాన్నీ ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధించవచ్చని వాణిజ్య పన్నులశాఖ ఇటీవల గుంటూరు సహా వివిధ జిల్లాల్లోని గోఉత్పత్తుల తయారీ సంస్థలకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. గోమూత్రాన్ని కాచి వడపోసి ప్యాక్ చేసి అమ్ముతున్నందున పన్ను పరిధిలోకి వస్తుందని తెలిపింది. ఆవు మూత్రాన్ని వేదకాలం నుంచే ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నప్పటికీ పన్ను నుంచి మినహాయించమని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. గోమూత్రాన్ని ఏయే రుగ్మతలకు వాడతారో కూడా పేర్కొంది. అధిక బరువు, ఉదర సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, చక్కెర వ్యాధి, కాలేయ వ్యాధులు, ఉబ్బసం, పేగు సంబంధిత రుగ్మతలు, కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు తదితరాలకు వినియోగిస్తుంటారని వివరించింది. అందువల్ల గోమూత్రంపై ఏపీ వ్యాట్‌యాక్ట్ ప్రకారం 5 శాతం పన్ను విధించవచ్చంటూ సమర్థించుకుంది. గోమూత్రాన్ని కీటక నియంత్రణిగానూ ఉపయోగిస్తున్నందున క్రిమి సంహారక మందుల చట్టం కింద అమ్మకపు పన్ను కూడా విధించవచ్చునని తెలిపింది. పది వేల లీటర్ల వ్యాపారం..: రాష్ట్రంలోని గోశాలలు, రైతుల నుంచి గోఉత్పత్తుల తయారీ సంస్థలు నిత్యం వేలాది లీటర్ల మూత్రాన్ని సేకరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దేశీ ఆవులకు, గోమూత్రానికి గిరాకీ పెరిగింది. దేశీ ఆవుల నుంచి తీసిన మూత్రాన్ని వైద్యంతోపాటు సేద్యానికీ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పది వేల లీటర్లకు పైగా గోమూత్రాన్ని అమ్ముతున్నారు. శుద్ధి చేసిన మూత్రాన్ని లీటర్‌కు రూ.50, సేద్యానికి వినియోగించే మూత్రాన్ని లీటర్‌ను రూ.25 నుంచి రూ.30 మధ్య విక్రయిస్తున్నారు. రైతులు లేదా గోశాలల నుంచి సేకరించే మూత్రానికి, తాగడానికైతే లీటర్‌కు రూ.25, 30 మధ్య, సేద్యానికైతే లీటర్‌కు రూ.20 వరకు చెల్లిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేదు.. గోమూత్రాన్నీ, పేడను షాంపూలు, సబ్బులు, పెనాయిల్, అగర్ బత్తీలు, దూప్ బత్తీలు, దోమల నివారణ కాయిల్స్ తదితర ఉత్పత్తుల తయారీకి వినియోగిస్తారు. మనుషులు తాగేందుకు వీలుగా గోమూత్రాన్ని శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. దీనిపై ఇప్పటి వరకు ఎక్కడా పన్ను వేయలేదు. రాష్ట్రంలో మాత్రమే ఈ ఏడాది నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే జరిగితే గోశాలలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గోశాలలు విక్రయించే మూత్రంతో వచ్చే డబ్బును ప్రస్తుతం వాటి నిర్వహణకు వినియోగిస్తున్నారు. వ్యాట్‌ను ఎత్తివేయాలని, గోవుల ప్రేమతోనైనా కొత్త మార్కెట్ సృష్టించాలని గోశాలల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలంటే దేశీ ఆవులు అవసరమని, వాటి మూత్రంపై పన్ను ఏమిటని ప్రకృతిసాగు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆయుర్ ( ఆయుర్వేదం) కూల్...
సమ్మర్ స్పెషల్ ఆయుర్వేదం అన్నిరకాల ఆహార పదార్థాల గుణగణాల్ని, ప్రయోజనాల్ని... అవి మనపై చూపే ప్రభావాల్ని నిశితంగా పరిశీలించి వివరించింది. జీవనాధారమైన నీళ్లలోనే వర్షపునీరు, బావినీరు, తటాకజలం, నదీజలం, సముద్రజలం వంటివాటి మధ్య తేడాలు చెప్పింది. చెరకురసం, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, దోస, రకరకాల ఫలాలు, వాటి రసాల ప్రయోజనాలను పేర్కొంది. వరి, గోధుమ, బార్లీలతో ద్రవాహారం ఎలా చేసుకోవాలో పేర్కొంది. పండ్లకు తోడుగా ఆహార దినుసులు, మూలికలూ, చక్కెర, పటికబెల్లం (మిశ్రీ), బెల్లం, నీరు మొదలైన వాటితో వివిధ పానీయాలు, పానకాలు (షర్బత్తులు) ఎలా చేసుకోవాలో చెప్పి, వేసవి తాపాన్ని ఎలా అధిగమించవచ్చో తెలియజేస్తుంది ఆయుర్వేదం. వాటిని చేసుకుందాం. వేసవి వేడిమిని జయిద్దాం. ఫల రస పానీయాలు ఈ కింద పేర్కొన్న పండ్లరసాలకు చక్కెర, ఏలకులు, శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క వంటి ద్రవ్యాలను చేర్చుతారు. ఇలా వాటితో పాటు నిమ్మవంటి పానీయాలకు అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకుంటారు. (బత్తాయి వంటి వాటికి నీళ్లు కలపరు). ఇలా పలచగా, రుచికరంగా చేసుకునే ద్రవాహారాలను పానీయాలు అంటారు. ఇవన్నీ ఆకలిని కలిగించి, జీర్ణశక్తిని పెంచి, నీరసాన్ని తగ్గిస్తాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అవి... ద్రాక్ష: ఇది తాజాఫలాలన్నింట్లోనూ అత్యుత్తమమైంది. కించిత్ వగరుతో మధురంగా ఉండే ఫలమిది. శీతలం కలిగిస్తుంది. కళ్లకు మంచిది. మలమూత్రాలను సాఫీగా వచ్చేలా చేస్తుంది. నోటి చెడును తగ్గిస్తుంది. రక్తస్రావాలను అరికడుతుంది. సురాపానపు మత్తు (మదాత్యయము)ను/హ్యాంగోవర్‌ను తగ్గిస్తుంది. జ్వరం, దప్పిక, దగ్గు, ఆయాసం, గొంతునొప్పి, ఛాతీనొప్పి, నీరసాలను తగ్గిస్తుంది. దానిమ్మ (దాడిమ): ఇది తియ్యని రుచితో ఉన్నప్పుడు త్రిదోషశ్యామకమై, చలువ చేస్తుంది. పుల్లటి రుచితో ఉంటే వాతకఫాలను హరిస్తుంది. ఈ రెండూ కూడా రక్తవర్ధకాలే. రుచిని కలిగిస్తాయి. ఆకలి పుట్టిస్తాయి. కదళీ (అరటి / మోచ ): ఇది బరువైన ఆహారం. చలువ చేసి పోషకవిలువలందించి బలాన్ని, పుష్టిని కలిగిస్తుంది. నీరసాన్ని పోగొడుతుంది. శుక్రవృద్ధిని కలగజేస్తుంది. ఉదరవాయువును, కొంచెం మలబంధాన్ని కలగజేస్తుంది. దప్పికను పోగొడుతుంది. మామిడి (ఆమ్ర): పచ్చి మామిడి: పచ్చిగా ఉన్నప్పుడు వగరు, పులుపు రుచులు కలిగి ఉంటుంది. వాతపిత్తశ్యామకం. ముదిరిన కాయ మిక్కిలి పుల్లగా ఉండి రక్తదోషాలను హరిస్తుంది. త్రిదోషాలనూ నివారిస్తుంది. పండు మామిడి: ఇది మధుర రసాన్ని కలిగి ఉంటుంది. చెట్టుకు పండినది కాస్త పులుపుతో ఉంటుంది. ముగ్గవేసింది చాలా తియ్యగా ఉండి చలవ చేసి, త్వరగా జీర్ణమవుతుంది. శుక్రవృద్ధికి తోడ్పడుతుంది. అగ్నిదీప్తికరం (ఆకలి పుడుతుంది). గమనిక: పుల్ల మామిళ్లు ఎక్కువగా తింటే అగ్నిమాంద్యం, విషమజ్వరాలు, రక్తవికారాలు, మలబంధం కలగజేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిమ్మరసం (జంబీర): పులుపు రుచితో ఉండి వాతకఫాలను దూరం చేస్తుంది. మలబంధాన్ని పోగొడుతుంది. అరుచి, అజీర్తి, దప్పిక, వాంతి, ఉదరశూలలను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. తయారు చేసే పద్ధతి: గ్లాసెడు నీళ్లలో (300 మి.లీ.) చెంచాడు అల్లం రసం, ఒక చెంచా నిమ్మ రసం, నాలుగు చెంచాల చక్కెర, చిటికెడు ఉప్పు కలిపి తాగాలి. తియ్య నిమ్మ, బత్తాయి (మిష్టనింబు): మధురంగా ఉంటుంది. విషహరం. సహజ, కృత్రిమ విషాలకు విరుగుడు. నీరసాన్ని తగ్గిస్తుంది. అరుచి, దప్పిక, వాంతులను దూరం చేస్తుంది. బలకరం. పుచ్చకాయ (కాలింద): దప్పిక తీరుస్తుంది. కఫవాతహరం. ఖర్బూజ (ఖర్జూజ దోస): మధురం. మల, మూత్రాలు సాఫీగా అయ్యేలా చేస్తుంది. చలువ చేస్తుంది. బలకరం. జీర్ణకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. నేరేడు (జంబు): ఈ పండు చలవ చేస్తుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. కఫ, పిత్త హరం. వాతకరం. కంఠానికి మంచిది కాదు. మాదీఫలం: దీని తొక్క చేదు, కారంగా ఉంటుంది. స్నిగ్ధం, వాతహరం. పండులోని గుజ్జు మధురంగా పోషకవిలువలతో ఉంటుంది. వాతకఫశ్యామకం. వీటి కేసరాలు నోరు పొడిబారడం, అరుచి, తేన్పులు, వాంతులు, దగ్గు, ఆయాసం, ఉదర రోగాలు, కడుపు నొప్పి, ఆకలిలేకుండటం, అజీర్తిని తగ్గిస్తాయి. రేగు (బదరీ): పెద్ద సైజు కాయను ‘సౌవీరం’ అంటారు. ఇది చలువ చేస్తుంది. విరేచనకారి, శుక్రకరం, శక్తివర్ధకం. చిన్నరేగు పండును ‘కోలము’ అంటారు. ఈ పండ్లు ఆకలిని కలిగించి, దప్పికను తగ్గించి, నీరసాన్ని పోగొడతాయి. లవలీ (రాచ ఉసిరిక): పండు మూత్రాశయంలోని రాళ్లను పోగొడుతుంది. అర్శమొలలు తగ్గిస్తుంది. రుచికరం. సహజ పానీయాలు నీళ్లు (అంబు / తోయ / ఉదకం / జలం) శరీరానికి తృప్తిని ఇచ్చే ప్రాణాధారం నీరు. దప్పికను తగ్గించి, అంతర్గత మాలిన్యాలన తొలగిస్తుంది. నీళ్లు తెలివితేటలను పెంచుతాయి, దేహాన్ని చల్లబరుస్తాయి. ‘‘జీవనం తర్పణం హృద్యం హ్లాది బుద్ధిప్రబోధనం, తను అవ్యక్తరసం మృష్టం శీతం లఘు అమృతోపమ్, గంగాంబు నాభసో... ’’ నీళ్లను రాత్రిపూట రాగి పాత్రలో పోసి మరుసటి దినం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా రాత్రి వెన్నెట్లో పెట్టిన నీరు కూడా తాగితే మంచిది. చల్లటి నీళ్ల ఉపయోగం: ఇవి తాగితే గ్లాని, శ్రమ, మూర్ఛ, వమనం, భ్రమ, శరీరంలో మంట తగ్గుతాయి. విషాలను హరిస్తుంది. రక్తస్రావం తగ్గుతుంది. ఉష్ణోదకం: వేణ్ణీళ్లు ఆకలిపుట్టించి, జీర్ణక్రియకు ఉపకరిస్తాయి. కడుపులో వాయువులు తగ్గి ఉదరం తేలిక అవుతుంది. తేనె (మధు) శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. దప్పిక, తేన్పులను పోగొడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కఫహరం. రక్తస్రావం, ప్రేమేహం, అతిసారం, శ్వాస-కాస (దగ్గు)-చర్మరోగాలను పోగొడుతుంది. వ్రణరోపణాలు (గాయాలు) త్వరగా మానిపోయేలా చేస్తుంది. కొబ్బరి నీళ్లు (నారికేళోదకం) కొంచెం జిడ్డుగా, తియ్యగా ఉండి శరీరాన్ని తేలిక పరచి చలువచేస్తాయి. ఆకలిని తగ్గిస్తాయి. దప్పికను పోగొడతాయి. మగవారిలో శుక్రకణాలను వృద్ధిచేస్తాయి. మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తాయి. ‘‘నారికేళోదకం స్నిగ్ధం స్వాదు వృష్యం హిమం లఘు,తృష్ణా పిత్తానిలహరం దీపనం వస్తిశోధకం’’కొబ్బరినీళ్లలో పొటాషియం లవణాలు ఎక్కువ. కొబ్బరి నీరు హై బీపీని నియంత్రిస్తుంది. అందువల్ల ఇది గుండె జబ్బుల వారికి మేలు చేస్తుంది. పాలు జిడ్డుగా తియ్యగా ఉండి సప్తధాతు వర్థకమైన ద్రవాహారం పాలు. శీతలకరం. ఆవుపాలు శ్రేష్ఠమైనవి. ‘‘ప్రాయః పయో అత్ర గవ్యంతు జీవనీయం రసాయనం, క్షతక్షీణహితం మేధ్యం బల్యం స్తన్యకరం సరం. శ్రమ భ్రమ మద అలక్ష్మీ శ్వాసకాస అతితృట్ క్షుధః జీర్ణ జ్వరం మూత్ర కృచ్ఛ్రం రక్తపిత్తంచ నాశయేత్’’ ప్రాణప్రదం, బలవర్ధకం ఓజోవర్ధకం, మేధావర్ధకం, దౌర్బల్యాన్ని పోగొడుతుంది. బాలింతలకు పాలుపడతాయి. అలసట, తలతిరుగుడు, ఆయాసం, దగ్గు, దప్పిక, ఆకలి, చిరకాల జ్వరాలను పోగొడుతాయి పాలు. రక్తస్రావాన్ని అరికడతాయి. మూత్రవిసర్జనలో ఇబ్బందులు, అవరోధాలను పోగొట్టి సాఫీగా అయ్యేలా చేస్తాయి. మజ్జిగ (తక్రం) ‘‘తక్రం లఘు కషాయామ్లం దీపనం కఫవాతజిత్, శోఫ, ఉదర, అర్మ, గ్రహణీ దోష, మూత్రగ్రహ, అరుచీఃగుల్మ ప్లీహ ఘృతవ్యాపత్ గరపాండు - ఆమయాన్జయేత్ తత్ వమనస్తు సరం, స్రోతః శోధి విష్టంభజిత్ లఘు’’ మజ్జిగ కొంచెం వగరుగా, తియ్యగా ఉండి... రుచినీ, ఆకలినీ కలిగిస్తుంది. పొట్ట ఉబ్బరం, శరీరంలోని వాపులు, మూలశంకలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం వంటపట్టనప్పుడు, మూత్రం సాఫీగా రానప్పుడు ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. వాంతులు, రక్తహీనత, ప్లీహరోగాల్ని పోగొడుతుంది. రసాల: పెరుగును చిలికి మజ్జిగ చేసే సమయంలో అందులో చక్కెర, మిరియాల పొడి వంటివి కలిపితే దాన్ని ‘రసాల’ అంటారు. ఇది బలకరం, వీర్యవృద్ధి కలిగిస్తుంది. చేసుకునే పద్ధతి : పులుపు లేని మజ్జిగను పలుచగా చేసి, కొద్దిగా నిమ్మరసం, అల్లం, ఉప్పు, కరివేపాకు, పుదీనా కలిపి వడగట్టి రోజూ రెండు మూడు సార్లు తాగాలి. చెరకు రసం (ఇక్షురసం): ఇది కొంచెం జిడ్డుగానూ, తియ్యగానూ ఉంటుంది. శరీరానికి చలవు చేస్తుంది. దేహశక్తిని పెంచి నీరసాన్ని తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది. వృష్యం, కామోద్దీపనం. చెరుకుగడను బాగా నమలడం వల్ల వచ్చే రసాన్ని సేవించడం ఉత్తమం. అప్పుడు చెరకురసం సహజగుణాలు మారవు. యంత్రాలతో తీసిన రసం అంత శ్రేష్ఠం కాదు. ఇది కొన్ని మలినాలతో ఉంటుంది. యంత్రాలతో తీసిన చెరకురసంతో అరుగుదల కష్టమై, కడుపులో మంట కూడా కలగవచ్చు. మలబంధం కూడా కలిగే అవకాశం ఉంది. ‘‘మూలాగ్రజ జంతుజఘ్నాది పీడతాత్ మలసంకరాత్, కించిత్ కాలవిఘృత్యా చ వికృతిం యాతి యాంత్రికః...’’ ధాన్య పానీయాలు బార్లీ (యవలు): నీటితో వీటిని కలిపి, మరిగించి జావ కాసుకొని తాగవచ్చు. ఇవి బలకరం. చలువచేస్తాయి. ఉదరంలో వాయువును పోగొట్టి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తాయి. వృష్యమై కామోద్దీపన కలిగిస్తాయి. మూత్ర వికారాల్ని, ధాతు పరిణామ వికారాలల్లీ తగ్గిస్తాయి. దగ్గు, జలుబు, ఆయాసం, కంఠ, చర్మరోగాల్ని తగ్గిస్తాయి. త్రిదోషశ్యామకం. మూత్రం సాఫీగా వచ్చేలా చేస్తాయి. ఒంట్లో వాపులు తగ్గిస్తాయి. వరి అన్నంతో చేసిన గంజి, ఇతర జావలు: బియ్యాన్ని శుభ్రం చేసి బాగా మెత్తగా ఉడికించి, పిసికి, జావలాగా తయారు చేయాలి. ఇది అతిచిక్కగా ఉంటే, దాన్ని కాంజికము (గంజి) అంటారు. దీన్ని చిక్కదనం తగ్గిస్తూ పల్చగా తయారుచేసుకుంటే దాన్ని ‘మండ, పేయ, వివేపి, యవాగు’ అనే పేర్లతో వ్యవహరిస్తారు. ఇది ఆకలి పుట్టిస్తుంది. బలం కలిగిస్తుంది. పొట్టలోని వాయువును, దప్పికను తగ్గిస్తుంది. గోధుమ జావ: గోధుమరవ్వను (దలియా) జావగా కాసుకొని తాగవచ్చు. ఇది జిడ్డుగా, తియ్యగా ఉండి శరీరానికి చలవ చేస్తుంది. ధాతువర్ధకమై, బలస్థైర్యాలను పెంచుతుంది. జీవనీయం. వృష్యం (వీర్యవృద్ధిని కలిగిస్తుంది). లాజ (పేలాల పానీయం): ‘భృష్టానాం తండులాః లాజాః’ పేలాలను నీటిలో నానబెట్టి మెత్తగా పలుచగా చేసి తాగాలి. ఇది తేలికగా జీర్ణమై శరీరానికి చలువచేస్తుంది. దగ్గు, కఫం, దప్పిక, అతిసారం, మధుమేహాలను తగ్గిస్తుంది. ధాన్యాది హిమ ( ధనియాలతో చేసే పానీయం): ధనియాల పొడిని వేడినీళ్లలో కలిపి, రాత్రిపూట చంద్రకిరణాలు సోకేట్లుగా ఉంచి, మరుసటి దినం బాగా కలిపి వడగట్టాలి. ఈ పానీయం దప్పికనూ, మంటను తగ్గిస్తుంది. ఇతర పానీయాలు బాదం (వాతామ): స్నిగ్ధకరం, ఉష్ణకరం, వాతహరం. మృదురేచకం (మలవిసర్జన మృదువుగా అయ్యేలా చేస్తుంది). వీర్యవృద్ధికరం, కామోద్దీపకరం. దప్పికనూ, వికారాన్ని, దగ్గును తగ్గిస్తుంది. పుష్టికరం. బిల్వ (మారేడు) : ఇది బాగా పండినదైతే పొట్టలో వాయువుకు కారణమవుతుంది. కానీ కాయ ఆకలిని పుట్టిస్తుంది. అరుగుదలకు మంచిది. ఈ రెండూ కూడా విరేచనాలను తగ్గించి, మలబంధాన్ని కలగజేస్తాయి. ముళ్లదోస (త్రపుస): లేత కాయ అయితే దప్పిక, మంట, నీరసాలను పోగొడుతుంది. మధురరసం. చలువ చేస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. ఇక గింజలు చలువ చేస్తాయి. మూత్రం సాఫీగా అయ్యేలా చూడటమేగాక, మూత్రసమయంలో వచ్చే మంటను తగ్గిస్తాయి. రక్తస్రావాన్ని అరికడతాయి. షడంగ పానీయం: చందనం (మంచి గంధం), ముస్తా (తుంగముస్తలు), ఉశీరం (వట్టివేళ్లు), ఉదీచ్య (కురువేరు), నాగర (శొంఠి), పర్పాటక... వీటన్నింటినీ దంచి కషాయంలా కాచుకోవాలి. ఈ కషాయాన్ని 30 మి.లీ. తీసుకొని అందులో కొంచెం పటికబెల్లం (మిశ్రీ) కలిపి రోజూ తాగాలి. సాధారణ జాగ్రత్తలు పిల్లలు వేసవి తీవ్రతను కూడా లెక్క చేయకుండా ఆరు బయట ఆడుకుంటుంటారు. అందుకే వాళ్ల ఒంట్లోంచి లవణాలు బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వాళ్లకు వేసవిలో కూల్‌డ్రింక్స్‌కు బదులు సహజ పానీయాలు ఇస్తుండాలి. బయట అమ్మే చెరకు రసం, సోడాలు, శీతల పానీయాలు, ఐస్‌క్రీముల జోలికిపోవద్దు పండ్లు కొనేటప్పుడు వాటి మీద క్రిమిసంహార మందుల ఉన్నాయేమో పరిశీలించాలి. ఉదాహరణకు ద్రాక్షపండ్ల మీద మనకు తెల్లగా పొరలా కనిపిస్తుంటే అది సహజత్వానికి భిన్నం. అలాంటి పండ్లను ఉప్పు కలిపిన నీళ్లలో రెండుమూడుసార్లు నానబెట్టి శుభ్రపరచుకోవాలి. పండ్లరసాలు తాగగానే వెంటనే వాటి దోషాలను నివారణగా (ముఖ్యంగా గొంతులో గరగర వంటివి) కొన్ని వేడినీళ్లు తాగాలి. అందులో చిటికెడు మిరియాల పొడి, శొంఠి పొడి కలిపితే ఇంకా మంచిది. పానీయ పరిమళాలు పానీయాలకు, ద్రవాహారాలకు రుచినీ, సువాసనలనూ (ఫ్లేవర్స్) సమకూర్చడానికి ఉపకరించడంతో పాటు... ఔషధగుణాలు సైతం కలిగి ఉన్న పదార్థాలివి... తులసీ (సురసా / గౌరీ) ‘‘తులసీ కటుకా తిక్త హృద్య ఉష్ణా దాహ పిత్త కృత్ దీపనీ కుష్ట కృచ్ఛ్రాస్ర పార్శ్వరుక్ కఫవాత జిత్ శుక్లా కృష్ణాచ తులసీ గుణైః తుల్యా ప్రకీర్తితా’’ తులసిలో ‘తెల్ల తులసి, నల్ల తులసి’ అని ప్రధానంగా రెండు రకాలుంటాయి. తులసి ఆకులు కలిపాక పానీయాలకు కాస్త చేదు, కారం రుచి వస్తుంది. ఆకలి పుట్టించే గుణం తులసికి ఉంటుంది. రక్తప్రసరణ సాఫీగా అయ్యేలా చేస్తుంది తులసి. మూత్రవిసర్జన సాఫీగా అయ్యేలా చూడటంతో పాటు చర్మరోగాలు, విషరోగాలను హరిస్తుంది. ఇది మధుమేహహరం (డయాబెటిస్‌ను అదుపు చేస్తుంది). కరివేప (సురభినింబ): ఆకలిని పుట్టించి, జీర్ణశక్తిని పెంచుతుంది. తేన్పులు, కడుపు ఉబ్బరం,కడుపునొప్పి (ఉదరశూల), నీళ్లవిరేచనాలను తగ్గిస్తుంది. పచ్చకామెర్లు, రేచీకటి, శరీరం వాపులను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను నివారిస్తుంది. పుదీన (పూతిహా): అజీర్తినీ, కడుపు ఉబ్బరాన్నీ తగ్గిస్తుంది. గొంతునొప్పి, జలుబు, ఎక్కిళ్లు తగ్గుతాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల నొప్పులు తగ్గుతాయి. రుతుశూలను తగ్గిస్తుంది. అల్లం: ఇది ఘాటుగా ఉంటుంది. ఆకలిని పుట్టించి, అజీర్తిని తగ్గిస్తుంది. రక్తప్రసరణాన్ని పెంచుతుంది. గొంతునొప్పిని తగ్గిస్తుంది.శుంఠి (శొంఠి): అజీర్ణాన్ని తొలగించి, కడుపునొప్పి, ఉదరవాయువులను పోగొడుతుంది. దగ్గు ఆయాసం, వాంతి వికారాలు, కీళ్లనొప్పులు, అర్శమొలలను పోగొడుతుంది. సోంఫ్ / సోంపు ( మిసిః / సదాప): ఆకలిని పుట్టించి, జీర్ణక్రియను పెంచి, విరేచనాలన్ని సాఫీగా అయ్యేలా చేస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. కంటిచూపును పెంచుతుంది. మిరియాలు (మరిచ): కఫవాత హరం. శరీరంలోని కొవ్వులను తగ్గిస్తాయి. దగ్గు, ఆయాసం, కడుపునొప్పులను తగ్గించి, ఆకలిని పుట్టిస్తాయి. జీర్ణక్రియను పెంచుతాయి.జీలకర్ర (జీరక): అరుచిని పోగొట్టి, ఆకలి పుట్టించి, జీర్ణప్రక్రియను పెంచుతుంది. ఉదరవాయువులను తొలగిస్తుంది. అతిసారహరం. జీలకర్రతో పొట్టలోని క్రిములు తొలగిపోతాయి.దనియాలు (ధాన్యకః): అరుచిని పోగొట్టి, ఆకలిని పుట్టిస్తాయి. జీర్ణక్రియను వృద్ధి చేస్తాయి. దప్పిక, మంట, వాంతులను తగ్గిస్తాయి. దగ్గు ఆయాసాలను తొలగిస్తాయి. కడుపునొప్పి, నీళ్లవిరేచనాలను తగ్గిస్తాయి. బాగా నిద్రపట్టేలా చేస్తాయి. హైబీపీని తగ్గిస్తాయి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
మరోసారి రాందేవ్ పతంజలి మాయ!
న్యూఢిల్లీ: మరోసారి యోగా గురువు రాందేవ్ బాబా వివాదాస్పద చర్చలోకి వచ్చారు. నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్న ఆయనకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ ఈసారి పెద్ద చర్చకే తెరతీసింది. ఏడు నెలల తర్వాత విడుదల చేయాల్సిన ఒక కేజీ పరిమాణంలో తయారు చేసిన పతంజలి 'అలా మురబ్బా' మెడిసిన్ ప్యాకెట్లను ముందుగానే విడుదల చేసి అందరినీ అనుమానంలో పడేసింది. దీనికి ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్ డీఏ) ఎలా అనుమతిచ్చిందో కూడా అర్థంకానీ పరిస్థితి తయారైంది. ఉత్తరాఖండ్‌లో కేజీ పరిమాణంలో అలా మురబ్బా మెడిసిన్ ప్యాకెట్లను పతంజలి సంస్థ విడుదల చేసింది. అయితే, ఆ ప్యాకెట్లపై తయారీ తేదీ 20 అక్టోబర్ 2016గా పేర్కొనగా.. కాలపరిమితి అక్టోబర్ 19, 2017గా ముద్రించారు. ప్రస్తుతం మార్చిలోనే ఉండగా ఇంకా ఏడు నెలల సమయం తర్వాత విడుదల చేయాల్సిన ప్యాకెట్లను ఇప్పుడెలా విడుదల చేశారనేది ప్రశ్నగా కనిపిస్తోంది. అసలు దానిని నాణ్యతప్రమాణాలపై కూడా పలు అనుమానాలు కలుగుతున్నాయి. సాధారణంగా.. ఒక వస్తువు మార్కెట్లోకి రావడానికంటే ముందు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్ డీఏ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా అనుమతిచ్చే ఎఫ్ఎస్ డీఏ ఈ అంశాన్ని గుర్తించకపోవడం మరోసారి విమర్శలకు తావిస్తోంది. అయితే, అసలు తాము ఆ ప్రొడక్ట్ కు అనుమతివ్వలేదని, క్వాలిటీ పరీక్షల్లో కూడా విఫలమైందని ఎఫ్ఎస్డీఏ చెప్తోంది. అంతేకాకుండా ఈ ప్రొడక్ట్‌ను క్వాలిటీ పరీక్షలు నిర్వహించగా ఇందులో సోనా పాపిడి, ఆవు పాలతో చేసిన నెయ్యి, పసుపు లవణాలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. ఈ విషయం తెలిసి ఉత్తరాఖండ్ ఆయుర్వేదిక్ శాఖ కూడా వాటిన బ్యాన్ చేసి పరీక్షలకోసం ల్యాబ్ లకు పంపించింది. -
జెనెటిక్స్‌తో సరిపోలిన ఆయుర్వేదం
సాక్షి, హైదరాబాద్: భారత సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం ప్రకారం వ్యాధులను వాత, పిత్త, కఫ ప్రకారం గుర్తిస్తారు. ఈ మూడింటి సమాహారమే ప్రాకృతి. ఈ మూడింటి విభజన జెనిటిక్స్‌తో సరిపోలినట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) సీనియర్ శాస్త్రవేత్త కె.తంగరాజ్ కనుగొన్నారు. ప్రాకృతి ప్రకారం ఆయన 3,416 మందిని స్క్రీనింగ్ చేసి 262 మందిని పరిశోధనకు తీసుకున్నారు. వారిని జినోమ్ వైడ్ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్పిజం (ఎన్‌ఎన్‌పీ) ద్వారా విశ్లేషణ చేశారు. దీని ప్రకారం ఆయుర్వేదంలోని వాత, పిత్త, కఫాలు జన్యువుల ఆధారంగానే విభజన జరిగినట్లు నిర్ధారిం చారు. వందల ఏళ్ల క్రితం జెనెటిక్ సైన్స్ లేకున్నా ఆయుర్వేదం ఆ ప్రకారమే ఉండటం భారతీయుల గొప్పతనమని తేలింది. ఉస్మానియా వర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ ఆధ్వర్యంలో ‘న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ డయాగ్నసిస్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్’ అంశంపై జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా తంగరాజ్ తన పరిశోధన వివరాలు వెల్లడించారు. ఆయుర్వేదానికి జెనిటిక్ ఆధారం ఉందా? లేదా? అన్న అంశంపై పరిశోధన చేశానన్నారు. తాను విశ్లేషణకు తీసుకున్నవారి డీఎన్ఏల ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. ఎన్జీఎస్తో ముందే గుర్తించవచ్చు... నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్స్ (ఎన్జీఎస్) ద్వారా ముందే వ్యాధి నిర్థారణకు రావచ్చని జెనిటిక్ శాఖ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మాదిరెడ్డి సుజాత చెప్పారు. క్యాన్సర్, షుగర్, ఇతర వ్యాధులను ఎన్జీఎస్ ద్వారా రెండు మూడేళ్లు ముందే గుర్తించవచ్చన్నారు. కొందరికి అబార్షన్స్ అవుతుంటాయి. దానికి జన్యుపరమైన కారణాలేంటో ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ప్రొఫెసర్లు ఎ.జ్యోతి, జి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పసుపుతో విష పదార్థాలకు చెక్... బియ్యం, పప్పులు, నూనె గింజలు, కూరగాయలను నిల్వ చేస్తే వాటిపై ఏస్పర్జిల్లస్ అనే ఫంగస్ ఏర్పడుతుంది. ఆ ఫంగస్ అల్ఫాటాక్సిన్-బి1 అనే విషపదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాంటి విషపదార్థం పరిమితికి మించి సోకిన ఆహారధాన్యాలను తింటే మనిషి డీఎన్ఏలో మార్పులు వచ్చి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదాలు అధికంగా ఉంటాయని బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ బి.శశిధర్రావు వెల్లడించారు. భారత్‌లో ఆహార ధాన్యాలను వండేప్పుడు పసుపు వాడటం వల్ల అల్ఫాటాక్సిన్-బి1కు చెక్ పెట్టవచ్చని తన పరిశోధనలో తేలిందన్నారు. ఎలుకల మీద చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడిందన్నారు. ఇదిలావుండగా రైతులు పురుగుమందులను నేరుగా స్ప్రే చేయడం వల్ల వారి జన్యువులపై ప్రభావం చూపి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని డాక్టర్ పద్మజ తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. -
కిడ్నీ చిన్నదయింది... ప్రమాదమా?
ఆయుర్వేదం కౌన్సెలింగ్ మా పాప వయసు ఏడేళ్లు. ఇంకా రాత్రిపూట పక్క తడుపుతూనే ఉంది. ఎంత చెప్పినా వినడం లేదు. దయచేసి మా పాప సమస్యకు ఆయుర్వేదంలో మందులను సూచించండి. - లక్ష్మీపద్మజ, హైదరాబాద్ ఈ సమస్యను ఆయుర్వేదంలో ‘శయ్యామూత్రం’గా వర్ణించారు. ఇంగ్లిష్‌లో బెడ్‌వెట్టింగ్ అంటారు.ఇది చాలామందిలో తారసపడే సాధారణ సమస్య. ఇది ఒక్కొక్కప్పుడు 12-13 ఏళ్లవరకూ కొనసాగూతే ఉంటుంది. మూత్రాశయానికి సంబంధించి, రచనాపరమైన లోపాలు ఏమీ లేనప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. అప్పుడే పుట్టిన శిశువులు మొదలుకొని, పెరిగే వయసులోనూ రకరకాల కారణాల వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వారిలో అంతర్లీనంగా ఆందోళన, భయం, అభద్రతాభావం వంటి ఉద్వేగాలు చోటు చేసుకుంటాయి. పాలు తాగలేదనో, అన్నం తినలేదనో ఇంకేదైనా కారణం వల్లనో బూచాడికిచ్చేస్తామనో, పోలీసుల్ని పిలుస్తామనో చెప్పి ... తల్లిదండ్రులు పిల్లల్ని భయపెడుతుంటారు. క్రమశిక్షణ పేరు మీద అతిగా తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. అదేవిధంగా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు కూడా హోమ్‌వర్క్ చేయలేదనో, అల్లరి చేశారనో కఠినంగా శిక్షిస్తుంటారు. అందరిలోనూ క్లాసులో అవమానపరస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో పిల్లలు ఆత్మన్యూనతకు గురి అవుతుంటారు. పిల్లలకు పక్క తడుపుతుంటే ఇలా అనేక కారణాలను పరిశీలించాల్సి ఉంటుంది. చికిత్స: ప్రధానంగా పైన పేర్కొన్న కారణాలను సమీక్షించి, వాటిని దూరం చేయాలి. - ఇంత వయసొచ్చినా సిగ్గులేకుండా పక్కమీదే మూత్రం పోస్తావా అని తల్లిదండ్రులు అంటుంటారు. ఆ పని చేయకూడదు. ఎందుకంటే అది కావాలని చేసిన పని కాదు. అలా చేసినందుకు పిల్లలు కూడా లోలోపల బాధపడుతూనే ఉంటారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పడం తల్లిదండ్రుల విధి. ‘నువ్వేం కంగారుపడకు. ఇలా చాలామంది పిల్లలు చేస్తుంటారు. అది తగ్గిపోతుందిలే’ అని వారిని సముదాయించాలి. - రాత్రి 7-8 గంటలకే, కొంచెం వేగంగానే భోజనం పెట్టండి. అనంతరం వాళ్లకు తాగే పానీయాలేవీ ఇవ్వవద్దు. వారు నిద్రపోయిన ఒక గంటకే, వారిని నిద్రలేపి, బాత్రూమ్ తీసుకెళ్లి మూత్రవిసర్జన చేయించండి. అవసరమైతే మరో 40 నిమిషాలలో మళ్లీ ఆ పని చేయించండి. ఔషధం: చంద్రప్రభావటి (మాత్రలు) ఉదయం ఒకటి - రాత్రి ఒకటి. అరవిందాసవం (ద్రావకం) ఉదయం 1 చెంచా - రాత్రి 1 చెంచా, నీళ్లతో తాగించండి. మీరు సేకరించగలిగితే శాస్త్రో్తక్తమైన ఔషధం మరొకటి ఉంది. దొండపాదు వేరును శుభ్రం చేసి, దంచి స్వరసం (పసరు) తీసి, ఒక చెంచా ఉదయం, ఒక చెంచా రాత్రి, తేనెతో నాకించండి. ఇలా రెండు వారాలు చేయవచ్చు. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. ఈమధ్యనే బీపీ వచ్చిమంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్టు చూసి ఒక కిడ్నీ చిన్నదిగా ఉందని చెప్పారు. సీరమ్ క్రియాటినిన్ 0.8 ఎంజీ/డీఎల్ ఉంది. యూరియా 30 ఎంజీ/డీఎల్ ఉంది. ఇలా ఒక కిడ్నీ చిన్నదిగా ఎందుకు ఉంది? ఇంకో కిడ్నీ కూడా చిన్నది అయ్యే అవకాశం ఉందా? - శ్రీనాథశర్మ, నిడదవోలు కొంతమందిలో పుట్టుకతోనే కిడ్నీ చిన్నదిగా ఉంటుంది. కొంతమందిలో పుట్టకలో నార్మల్‌గానే ఉండి, ఆ తర్వాత చిన్నగా అవుతుంది. ఇలా చిన్నదిగా మారడానికి కిడ్నీకి రక్తసరఫరా తగ్గడం, ఇన్ఫెక్షన్ రావడం వంటి ఏదైనా కారణం ఉండవచ్చు. దీనికి కారణం తెలుసుకోడానికి కిడ్నీ డాప్లర్ పరీక్ష, టీబీ ఉందా, లేదా అన్న పరీక్ష చేయించుకోవాలి. ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఆ రెండో కిడ్నీ దెబ్బతినకుండా మందులు వాడాలి. బీపీని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. బీపీ కంట్రోల్లో లేకుండా కిడ్నీ దెబ్బతినే అవకాశం ఎక్కువ. మీరు ఒకసారి నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 32 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారీ రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - శ్రీనివాసరావు, టెక్కలి మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీక్ష కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. డర్మటాలజీ కౌన్సెలింగ్ నాకు కుడి చేతి మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా ఉంటే అక్కడ చాలాసేపు గీరాను. దాంతో అక్కడ నల్లటి మచ్చలు (డార్క్ మార్క్స్) ఏర్పడ్డాయి. అవి వచ్చి నాలుగు నెలలైనా ఇంకా తగ్గలేదు. నేను ఫెయిర్‌గా ఉంటాను. అందుకే అవి ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సయీదా, హైదరాబాద్ మీరు చెబుతున్న కండిషన్‌ను పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది తగ్గడానికి ఈ కింది సూచనలు పాటించండి. సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిష్చరైజర్ను డార్క్ మార్క్స్ ఉన్నచోట బాగా రాయండి ఆ ప్రాంతంలో ఎస్పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యానం రాయండి కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లెటైనింగ్ క్రీములు అప్లై చేయండి ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను ప్రతిరోజూ తీసుకోండి. ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు తీసుకోవడం కోసం మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. మీరు మీ అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు కూడా వాడాల్సి ఉంటుంది. నాకు క్రీములు వాడే అలవాటు లేదు. సౌందర్యసాధనాలు వాడటం కూడా ఇష్టం లేదు. అందుకే ఆహారం ద్వారానే చర్మం మెరిసేలా చేసుకోవడం ఎలాగో చెప్పండి. - సౌమ్య, కందుకూరు ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి మేలు చేస్తాయి. ఇవి ఎక్కుగా ఉండే ఆహారాలైన చర్మానికి తాజా చేపలు, అవిశెలు, బాదం... వంటివి తీసుకోవడం ద్వారా చర్మం మెరిసేలా చూసుకోవచ్చు. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్‌లో ఫైబర్ (పీచు పదార్థాలు) ఎక్కువ. ఇవి శరీరంలోని విషాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. వైటమిన్-బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్, అవకాడో వల్ల హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను నివారించవచ్చు. అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్ అనే విషాలను తొలగించి మేనిని మెరిసేలా చేస్తుంది. -
‘బైపాస్’ తర్వాత జాగ్రత్తలు...
ఆయుర్వేదం కౌన్సెలింగ్ మా పాపకు ఏడేళ్లు. నాలుగు నెలల నుండి పొడి దగ్గుతో బాధపడుతోంది. అప్పుడప్పుడు కొంచెం కళ్లె పడుతోంది. డాక్టర్లు ఎక్స్‌రే, రక్తపరీక్షలు చేసి ‘బ్రాంకైటిస్’ అని చెప్పారు. ఇది పూర్తిగా నయమవడానికి ఆయుర్వేద మందులు సూచించండి. - వరలక్ష్మి, రాజమండ్రి ఆయుర్వేద వైద్య పరిభాషలో దగ్గుని ‘కాస’ అంటారు. ఈ వయసు పిల్లల్లో ఇది తరచుగా కన్పిస్తుంది. మీరు రాసిన లక్షణాలను బట్టి దీన్ని పిత్త ప్రధానమైన, కఫానుబంధ కాసగా పరిగణించవచ్చు. ఈ కింద వివరించిన సూచనలు పాటించి మందులు వాడండి. ఒక నెలలో పూర్తిగా తగ్గిపోతుంది. ఆహారం: బయటి ఆహారం ఏ రూపంలోనూ సేవించకూడదు. ముఖ్యంగా చాక్లేట్లు, బిళ్లలు, లాలీపాప్‌లు, ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలను దూరంగా ఉంచాలి. వాటి తయారీలో వాడే రంగులు, తీపి కల్గించే పదార్థాలు, నిల్వ చేయడం కోసం వాడే ద్రవ్యాలు చాలా హానికరం. అలర్జీలు కల్గించే అవకాశం హెచ్చు. ఇక కల్తీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటికి తోడు రోగ నిరోధక శక్తిని తగ్గించడం, ఇన్ఫెక్షన్లకు గురికావడం సర్వసాధారణం. ఈ విషయాలను సమగ్రంగా అవగాహన చేసుకొని తల్లిదండ్రులు జాగ్రత్త వహించక పోతే, మందుల ప్రయోజనం నామమాత్రమే అవుతుంది. దగ్గు మాటిమాటికీ తిరగబెడుతూనే ఉంటుంది. క్షయ వ్యాధులు కలగటానికి కూడా అవకాశం ఉంటుంది. మనం నివసించే ప్రాంతంలోని వాతావరణ కాలుష్యం కూడా ఇలాంటి దగ్గులను కల్గించగలదు. కాబట్టి ఇక్కడ మందులతో బాటు ‘నిదానపరివర్జనం’ కూడా చాలా ముఖ్యమైన అంశం. అంటే వ్యాధి కారణాన్ని దూరం చేయటం, లేదా, ఆకారణాలకు మనం దూరమవటం. పాలు, పండ్లు, పెరుగు, పప్పులు, ఆకుకూరలు, ఇతర కూరగాయలు, ఎండు ఫలాలు, ఇతర మాంసకృత్తులు మిన్నగా లభించే ఆహారాన్ని, సమతుల్యంగా సేవించవలసి ఉంటుంది. ఆవు నెయ్యి, ఆవుపాలు, ఆవు పెరుగు పుష్టికరమని గుర్తుంచుకోండి. ఉప్పు, పులుపు, మసాలాలను ఎంత తక్కువ తింటే అంత మంచిది. విహారం: వయసుని బట్టి తగు రీతిలో శారీరక శ్రమ, అంటే ఆటల రూపంలో వ్యాయామం చాలా అవసరం. ప్రాణాయామం చేస్తే, ఊపిరితిత్తుల శక్తి పెరుగుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది మానసిక ఒత్తిడి. కేవలం దగ్గే కాదు; కడుపునొప్పి; మలబద్దకం, విరేచనాలు, తలనొప్పి వంటి రుగ్మతలు కూడా ఆ ‘ఒత్తిడి’ వల్ల సంభవిస్తాయి. మందులు: 1) అభ్రకభస్మ 100 మి.గ్రా. + ప్రవాళపిష్ఠి 100 మి.గ్రా. కలిపి తేనెతో రోజూ రెండు పూటలా నాకించాలి. 2) వాసా కంట కారీ లేహ్యం: ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా చప్పరించాలి. 3) వ్యోషాదివటి మాత్రలు: ఉదయం 1, రాత్రి 1 ఈ మందులు ఒక నెల రోజులు వాడి పరిస్థితిని సమీక్షించుకోవలసి ఉంటుంది. కార్డియాలజీ కౌన్సెలింగ్ మా అమ్మకు బైపాస్ సర్జరీ అయ్యింది. ఆమె విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - రవికుమార్, శ్రీకాకుళం అన్ని కండరాలకు అందినట్టే గుండెకండరానికి కూడా రక్తం ద్వారా పోషకాలు, ఆక్సిజన్ అందాలి. కానీ గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడిన వాళ్ల గుండె కండరానికి తగినంత రక్తం అందదు. దాంతో క్రమంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది. గుండెకు తగినంత రక్తం అందేలా చేయడం కోసం చేసే ఈ శస్త్రచికిత్సలో కాలినుంచి రక్తనాళాన్ని తీసుకుని, దాని ద్వారా గుండెకండరానికి రక్తం అందేలా బైపాస్ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఈ సర్జరీ వాళ్లు మొదటి ఆరు వారాల్లో పాటించాల్సిన జాగ్రత్తలివి. డాక్టర్లు సూచించిన ఆరోగ్యకరమైన వ్యాయామాలను రోజుకు రెండుసార్లు... పదినిమిషాల పాటు చేయాలి ఏమాత్రం భారం పడకుండా పది పదిహేను నిమిషాల పాటు రోజుకు రెండుసార్లు నడక (వాకింగ్)కు ఉపక్రమించాలి అకస్మాత్తుగా ముందుకు, వెనక్కు, పక్కలకు ఒంగడం వంటివి చేయకూడదు మూడు కిలోలకు మించిన బరువు కనీసం నెలరోజుల పాటు ఎత్తవద్దు నేల మీద కూర్చోవడం, కాలుమీద కాలేసుకోవడం వంటివి చేయకండి శస్త్రచికిత్స కోసం శరీరంపై గాటు పెట్టిన చోట ఎలాంటి ఒత్తిడీ పడకుండా చూసుకోండి భారమైన పనులు చేయకండి డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా చేయండి. శస్త్రచికిత్స అయిన ఆరు వారాల తర్వాత : దీర్ఘకాలంలో గుండెపై కలిగే దుష్ర్పభాలను నివారించడానికి ఈ జాగ్రత్తలు తోడ్పడతాయి. అవి... కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుకోండి. అందుకు తగినట్లుగా డాక్టర్ల సూచన మేరకు ఆహార, వ్యాయామ నియమాలను పాటించండి రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ఇందుకోసం డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే... రిలాక్సేషన్ ప్రక్రియలైన ధ్యానం, యోగా వంటివి చేయండి. రక్తంలో చక్కెర పాళ్లను తెలుసుకునే పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ, మీ డాక్టర్‌కు తెలియజేస్తూ ఉండండి. అందులో వచ్చిన మార్పులను బట్టి వైద్యులు మీ మందులను మార్చడం వంటివి చేస్తారు సిగరెట్ పొగకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్స్పోజ్ కావద్దు. అది రక్తనాళాల మృదుత్వాన్ని దెబ్బతీయడంతో పాటు అవి రక్తనాళాలు సన్నబారేలా చేయవచ్చు. పైగా ఆ పొగ గుండె వేగాన్ని పెంచుతుంది. కాబట్టి పొగాకు ఏరూపంలోనైనా తగదు మద్యంకూడా గుండెకు హానిచేసేదే ఒత్తిడికి గురికావడం రక్తపోటును పెంచి, గుండెపోటుకు దారితీసేలా చేసే అంశం. కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోండి ఒకే చోట కూర్చొని ఉండకండి. చురుగ్గా ఉండే జీవనశైలి మార్పుతోనూ గుండెజబ్బును నివారించుకోండి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. ఆఫీసులో కంప్యూటర్‌పై ఎక్కువగా పనిచేస్తుంటాను. నా కుడిభుజంలో గత మూడు నెలలుగా నొప్పి వస్తోంది. ఇది చాలా ఇబ్బంది కలిగించేలా డల్ పెయిన్ మాదిరి వచ్చినా ఒక్కోసారి తీవ్రంగా లోపల గుచ్చుతున్నట్లుగా నొప్పి (షార్ప్ పెయిన్)గా మారిపోతోంది. ముఖ్యంగా నా చేతిని తల కంటే పైకి ఎత్తినప్పుడు ఈ నొప్పి వస్తోంది. మధ్యమధ్యన నొప్పి తెలియడం లేదు. కానీ ఇది తరచూ తిరగబెడుతోంది. నేను బాడ్మింటన్ ఎక్కువగా ఆడుతుంటాను. దీని వల్ల నొప్పి పెరుగుతోందా అన్న విషయం నాకు తెలియడం లేదు. నేను వ్యాయామం చేస్తే నొప్పి తగ్గుతుందని అంటున్నారు. కానీ నిజానికి నా నొప్పి వ్యాయామం తర్వాత మరింత పెరుగుతోంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పగలరు. - చంద్రశేఖర్, రాజేంద్రనగర్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీకు భుజంలోని రొటేటర్ కఫ్ అని పేరుండే కొన్ని కండరాల సమూహంలో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. ఇవి ఏదైనా ఎత్తడానికి ఉపయోగపడతాయి. భుజానికి సంబంధించిన రెండు ఎముకల మధ్యలోంచి వెళ్తాయి. ఆ కండరాలకు ఏదైనా సమస్య వస్తే వాటిలో వాపు వస్తుంది. అప్పుడు మనం భుజం ఎత్తడానికి ప్రయత్నిస్తుంటే ఈ కండరాలు రెండు ఎముకల మధ్య నలిగిపోతుంటాయి. ఒక్కోసారి ఈ కండరాలు కొద్దిగా చిట్లిపోవచ్చు కూడా. ఇది అక్కడ గాయం అయ్యేలా చేస్తుంది. మీరు భుజంతో చేసే పనుల వల్ల ఈ గాయం మరింత రేగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ఇది తగ్గడం కోసమే ఉద్దేశించిన ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. ఇలా రొటేటర్ కఫ్ సమస్య వచ్చినప్పుడు క్రికెట్, బాడ్మింటన్ వంటి ఆటలు ఆడటం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. మీరు ఒకసారి మీ భుజం ఎక్స్‌రే, ఎమ్మారై స్కాన్ వంటివి పరీక్షలు చేయించుకొని, ఆర్థోపెడిక్ సర్జన్‌ను చూడాలి. -
మందులతో ఎత్తు పెరగవచ్చా?
ఆయుర్వేద కౌన్సెలింగ్ ఆలోస్ అనే మొక్క నుంచి తయారు చేసిన ఎన్నో రకాల మందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి కలబంద మొక్కకు సంబంధించినవేనా? ఆయుర్వేదంలో దీని వివరాలు ఉన్నాయా? - పేరి విజయలక్ష్మి, విశాఖపట్నం ఇంగ్లిష్‌లో ‘అలోవెరా’ అనే జాతికి చెందిన ఈ కలబంద మొక్కకు సంబంధించిన ఎన్నో ఔషధగుణాలను, ప్రయోగాలను ఆయుర్వేదం వివరించింది. దీనికి సంస్కృతంలో అనేక పర్యాయ పదాలున్నాయి. ఉదా: కుమారి, గృహకన్యా, దీర్ఘపత్రికా, తరుణీ, అమరా, అజరా మొదలైనవి. కలబంద గురించి భావిమిశ్రుడు చెప్పిన శ్లోకం ‘‘... కుమారీ భేదనీ శీతా తిక్తానేత్య్రా రసాయనీ, మధురా బృంహాణీ... గుల్మప్లీహ యకృత్వృద్ధి, కఫజ్వరా హరీ హరేత్... బల్యా వృష్యావాత విషహరీ...’’ కలబందకు దళసరిగా ఉండే పొడవైన మట్టలుంటాయి. వీటి చుట్టూ ముళ్లుంటాయి. ఆకు లోపల నెయ్యిలాంటి జిగురు పదార్థముంటుంది. ఈ రసంతోనే ముసాంబరాన్ని తయారు చేస్తారు. దీని గుజ్జు తిక్తమధురరసయుక్తంగా (చేదు, తీపి సమ్మేళనంగా) ఉంటుంది. ఔషధ గుణాలు : దీని రసాన్ని చర్మంపై పూస్తే చాలా రకాల చర్మరోగాలు తగ్గిపోతాయి. కొంచెం వెన్నతో కలిపిరాస్తే, ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. చర్మకాంతి పెంపొంది ముఖసౌందర్యం శోభిస్తుంది. ఆ ఆకులను వేడిచేసి, రసం తీసి కాలిన వ్రణాలపై లేపనం చేస్తే నొప్పి తగ్గి, త్వరగా మానిపోతాయి. దెబ్బలు తగిలిన ప్రదేశంలో ఈ గుజ్జును ఉడికించి కడితే సెగ్గడ్డలు తగ్గుతాయి. ఈ గుజ్జును లేదా కలబంద వేరును నూరి పసుపుతో కలిపి పూస్తే మహిళల్లో రొమ్మువాపు తగ్గుతుంది. పన్నునొప్పితో పాటు దంతరోగాలూ తగ్గుతాయి. ఈ రసాన్ని గోరువెచ్చగా చేసి ఒకటి, రెండు చుక్కలు వేస్తే చెవిపోటు తగ్గుతుంది. కడుపులోకి సేవిస్తే (మోతాదు పెద్దలకు నాలుగు చెంచాలు అంటే 20 మిల్లీలీటర్లు) కడుపుబ్బరం, మలబద్దకం, లివరు, స్ప్లీన్ వ్యాధులు, అర్శవ్యాధులు (పైల్స్), నులిపురుగులు తగ్గుతాయి. ఈ రసాన్ని చక్కెర, పాలతో కలిపి సేవిస్తే ధాతుపుష్టి, బలం కలిగి, ఆరోగ్యం బాగుపడుతుంది. శొంఠిపొడితో కలిపి సేవిస్తే ఎక్కిళ్లు, మిరియాలపొడి, తేనెతో కలిపి సేవిస్తే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. అధికబరువు, కీళ్లనొప్పులు, రుతుశూల (ముట్టునొప్పి), వడదెబ్బ వంటి వికారాలలో చక్కని గుణం కనిపిస్తుంది. కలబంద గుజ్జులో ఉప్పు వేసి ముద్దగా నూరి కట్టుకడితే కుక్కకాటుకు విరుగుడుగా పనికొస్తుంది. ఇది శరీరానికి చలవ చేస్తుంది. చాలారకాల జ్వరాలను తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. దీని గుజ్జులో మెంతులపొడి కలిపి శిరోజాలకు పట్టించి, రాత్రంతా ఉంచి, మర్నాడు తలస్నానం చేస్తే... చుండ్రు, పేలు పోవడమే కాకుండా, శిరోజాలు దృఢంగా ఉండి, మృదువుగా నిగనిగలాడతాయి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 21 ఏళ్లు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నాను. నా ఎత్తు ఐదడుగుల మూడు అంగుళాలు మాత్రమే. నేను ఎత్తు పెరగడం లేదు. ఫ్రెండ్స్ మధ్యన పొట్టిగా కనిపిస్తున్నాను. దాంతో ఎంతో ఆత్మన్యూనతకు గురవుతున్నాను. నేను ఎలాగైనా పొడువు పెరగాలని అనుకుంటున్నాను. ఎత్తు పెంచే అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాను. ఆ ప్రకటనల్లో చూపించే మందులు వాడటం వల్ల ఎత్తు పెరుగుతానా? నాకు దయచేసి తగిన సలహా ఇవ్వండి. - హుసేన్, కరీంనగర్ మీ వయసులో ఉన్న వారి ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. ఐదడుగుల మూడు అంగుళాలంటే మీరు తగినంత ఎత్తు పెరిగినట్లే లెక్క. మీకంటే చాలమంది పొట్టిగా ఉంటారు. తల్లిదండ్రుల నుంచి పొడవునకు సంబంధించిన జన్యువులు వస్తాయి. అయినప్పటికీ ఇందుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎందుకంటే ఒక్కోసారి తల్లిదండ్రుల ఎత్తు కాకుండా తాతముత్తాతల ఎత్తు కూడా పిల్లలకు రావచ్చు. అప్పుడు తల్లిదండ్రులు మామూలు ఎత్తులో ఉన్నా తాతముత్తాతల పొట్టిదనమూ పిల్లలకు రావచ్చు. ఇక దాంతోపాటు తినే ఆహారంలోని పోషకాలూ పిల్లల ఎత్తు పెరగడానికి దోహదం చేసే విషయం వాస్తవమే. అయితే ఎముకల చివర్లలో ఉండే గ్రోత్ ప్లేట్లలో పొడుగు పెరిగే అంశం వాళ్ల పదహారేళ్ల నుంచి పద్ధెనిమిదేళ్ల వయసులో ఆగిపోతుంది. మీరు ఇప్పటికే పద్ధెనిమిదేళ్లు దాటిపోయారు కాబట్టి దీని గురించి ఆలోచించకండి. అయితే కాళ్ల పొడువు పెంచే సర్జికల్ టెక్నిక్ అందుబాటులో ఉంది. దాన్ని ‘డిస్ట్రాక్షన్ ఆస్టియోజెనెసిస్’ అంటారు. ఇందులో ‘ఇలిజరోవ్ ఫిక్సేటర్స్’ అనే కొన్ని కృత్రిమ ఉపకరణాలను కాలిలో అమర్చుతారు. కానీ అలా పెంచే పొడవుతో కీళ్లనొప్పులూ, కండరం పటిష్టంగా లేకపోవడం, నరాలు దెబ్బతినడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పైగా ఇలా శస్త్రచికిత్సతో ఎత్తుపెంచడం అన్నది ఒక కాలి కంటే మరో కాలు పొట్టిగా ఉన్నప్పుడు ఆ రెండింటినీ సమంగా చేయడం కోసం మాత్రమే చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎత్తు గురించి ఆందోళన పడకండి. ప్రకటనల్లో వచ్చేవన్నీ వాణిజ్యపరమైన ఉత్పాదనలే. వాటితో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎత్తూ పెరగదు. ప్రకృతిపరంగా మీరు ఇప్పుడున్న ఎత్తు భారతీయ ప్రమాణాల ప్రకారం మంచి హైటే. ఇప్పుడు మీరు మంచి కెరియర్ గురించి ఆలోచించండి. వాణిజ్య ప్రకటనలు చూసి మోసపోకండి. న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నాకు పది రోజుల క్రితం నడుము మీద ఒక పక్క కురుపులు వచ్చాయి. తీవ్రమైన నొప్పి వచ్చింది. పది రోజుల తర్వాత అవి మాడిపోయాయి. అయితే ఇప్పుడు లోపలి నుంచి భరించలేనింత నొప్పి వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - మనోహర్‌రావు, ఆదిలాబాద్ మీరు పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే సమస్యతో బాధపడుతున్నారు. ఇది వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలోనూ, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ఇది రావచ్చు. అప్పుడు కొన్ని యాంటీవైరల్ మందులు వాడటం వల్ల కురుపులు తగ్గిపోతాయి. అయితే మందు వాడని వారిలో కురుపులు మానిపోయాక ఇలా భరించలేని నొప్పులు వస్తాయి. అయితే ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. రెండు, మూడు రకాల మందులతో నొప్పిని నియంత్రించవచ్చు. మీరు వెంటనే డాక్టర్‌కు చూపించుకొని, మీ వయసును బట్టి, బరువును బట్టి తగిన మోతాదులో మందులు వాడటం వల్ల మీ నొప్పి తగ్గుతుంది. నా వయసు 30. నాకు ఐదేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో తలకు దెబ్బతగిలింది. అప్పుడు మెదడు స్కానింగ్ చేయిస్తే, ఎముక ప్రాక్చర్ అయినట్లుగా తెలిసింది. మెదడులో రక్తస్రావం కూడా అయింది. అప్పట్నుంచి ఏడాదికొకసారి ఫిట్స్ వస్తున్నాయి. నా సమస్య తగ్గే మార్గం చెప్పండి. - కిశోర్, ఇల్లందు మెదడుకు దెబ్బతగిలిన వారిలో, రక్తస్రావం వల్ల, ఎముక ఫ్రాక్చర్ కావడం వల్ల మెదడులోని కణాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. దాంతో ఆ కణాల నుంచి అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కావడంతో ఫిట్స్ వస్తాయి. ఇలాంటి పరిణామం చోటు చేసుకున్నప్పుడు చాలా సందర్భాలలో వారికి జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి దెబ్బతగిలినప్పుడు, స్కానింగ్ చేయించినా ఆ రిపోర్టు నార్మల్‌గా ఉంటుంది. అలాంటివాళ్లలో కొన్ని నెలల పాటు మందులు వాడితే సరిపోతుంది. మీరు న్యూరాలజిస్ట్‌కు చూపించుకొని, తగిన స్కానింగ్ చేయించుకోండి. ఆ రిపోర్టును బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. -
తల్లిపాలు లేనప్పుడు ఏ పాలు పట్టాలి?
ఆయుర్వేద కౌన్సెలింగ్ తల్లిపాలు తాగే వయసులోని శిశువులకు, ఆ పాలు తక్కువైనప్పుడు గాని, లభించనప్పుడు గాని ఏ పాలు పడితే మంచిది? ఆయుర్వేదంలో గాడిద పాల గురించి ఏమైనా చెప్పారా? వివరించ ప్రార్థన. - విశాల నేమాని, హైదరాబాద్ ఏ కారణం చేతనైనా తల్లిపాలు లభించనప్పుడు గాని లేదా స్తనాగ్రాలు చిట్లి, పాలివ్వడానికి ఇబ్బంది ఉన్నప్పుడుగాని, తల్లి వ్యాధిగ్రస్థురాలయినప్పుడుగాని, శిశువునకు ఆవుపాలు లేదా మేకపాలు శ్రేష్ఠమని ఆయుర్వేదం వక్కాణించింది. ఆవుపాలగుణాలు: మధురం, శీతం, మృదు, స్నిగ్ధం (జిగురు) గుణాలు కలిగి ఉండి, శిశువునకు ప్రసన్నత కలిగించి, ప్రాణప్రదంగానూ, ఓజోవర్థకంగానూ ఉంటుంది. రక్తస్రావాన్ని అరికట్టే గుణం కూడా ఉంది. (చరక, శుశ్రుత సంహితలు) మేకపాల గుణాలు: మధుర కషాయ రసాలు, శీతం, లఘువు, ఆకలిని పుట్టించి, విరేచనాలను ఎక్కువగా రానివ్వకుండా ఉపకరిస్తుంది. జ్వరం, దగ్గు, ఆయాసాలను రాకుండా నివారిస్తుంది. (సుశ్రుత సంహిత) గాడిదపాల గుణాలు: భావమిశ్రుడు చెప్పిన శ్లోకం: ‘‘శ్వాస వాతహరం సామ్లం లవణం రుచి దీప్తికృత్, కఫకాసహరం బాల రోగఘ్నం గార్ధభీపయః’’ లవణం, అమ్ల రసాలు కలిగి ఉండి, నాలుకకు రుచిని, అగ్ని దీప్తిని కలిగిస్తుంది. కఫాన్ని, దగ్గుని, ఆయాసాన్ని నివారించే, పోగొట్టే గుణం కూడా ఉంది. అందుకే దీనిని బాల రోగహరంగా ప్రస్తావించారు. శిశువునకు నిత్యం పట్టే పాలగా కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచే ప్రక్రియ కోసం వాడటం మంచిది. మోతాదు: పుట్టిన వారం రోజుల తర్వాత ఐదుచుక్కలు తాగించాలి. అనంతరం నెలకొకసారి అదే మోతాదులో ఆరునెలలపాటు వాడుకుంటే చాలా రోగాలకు నివారకంగా ఉపకరిస్తుంది. పైన చెప్పిన వ్యాధులలో కూడా పెద్దలు కూడా వాడుకోవచ్చు. మోతాదు: 50 నుండి 100 మిల్లీలీటర్లు- పెద్దలకు, పిల్లలకు వయసును బట్టి మోతాదు మారుతుంది. పాలను మరిగించి చల్లార్చి వాడుకోవాలి. గమనిక: ఆవుపాలను, మేకపాలను మరిగించినప్పుడు లఘు పంచ మూలాలను కలిపి మరిగిస్తే, పాలు దోష రహితమై, శిశువులకు ఆరోగ్యకరమని ఉటంకించారు. వాటిలో మనకు విరివిగా లభించేవి.. నేల వాకుడు (కంటకారి), పల్లేరు (గోక్షుర). పాలల్లో నీళ్లు కలపనవసరం లేదు. శర్కర (చక్కెర)కు బదులుగా పటిక బెల్లం (మిశ్రీ) కొద్దిమోతాదులో కలిపి పిల్లలకు పడితే చాలా మంచిది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
ఆయుర్వేద కౌన్సెలింగ్
వళ్లంతా పులిపిర్లు... తగ్గేదెలా? నా వయసు 47. శరీరంలో చాలా చోట్ల పులిపిర్లు మొలిచాయి. ఇవి తగ్గటానికి ఆయుర్వేద మందులు తెలియజేయగలరు. - యాదయ్య, నల్గొండ ఆయుర్వేద పరిభాషలో వీటిని ‘చర్మకీల’ అంటారు. కలబంద ఆకుని కావలసిన పరిమాణంలో ముక్కలుగా కోసి పులిపిరులపై ఉంచి కట్టుకట్టాలి లేదా చింతాకు రసం, కొంచెం సైంధవ లవణం కలిపి ముద్దగా నూరి లేపనంగా వాడుకోవచ్చు. ఇలా చేస్తే 5 రోజులలో అవి రాలిపోయి నున్నటి చర్మం వస్తుందని శాస్త్రోక్తం. శారిబాద్యాసవ ద్రావకం 4 చెంచాలు తీసుకుని సమానంగా నీళ్లు కలిపి రోజూ రెండుపూటలా ఒక నెలరోజులు తాగాలి. నా వయసు 22. గత ఆరు నెలలుగా నా శిరోజాలు రాలిపోతున్నాయి. అందువల్ల జుత్తు పల్చబడిపోతోంది. మంచి మందులు, సలహాలు సూచించ ప్రార్థన. - అర్చన, హైదరాబాద్ తలమీద వచ్చే చుండ్రువంటి స్థానిక వికారాలు, అన్ని రకాలైన విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజధాతువులతో కూడిన పోషకాహార లోపాలు, మానసిక ఒత్తిడి, తగినంత నిద్ర, విశ్రాంతి లేకపోవడం మొదలైనవి జుత్తు రాలిపోవటానికి ముఖ్య కారణాలు. కారణాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు నెలలపాటు ఈ దిగువన వివరించిన సలహాలు పాటించండి. ఫలితం కనపడుతుంది. ఆహారంలో ఆకు కూరలు, మునగకాడలు, క్యారట్, బీట్రూట్ సమృద్ధిగా తీసుకోవాలి. ముడిబియ్యం చాలా మంచిది. చేపలు, మాంసరసం, కోడిగుడ్లు ప్రయోజనకరం. బొప్పాయి, అరటి, సీతాఫలాల వంటి తాజా పళ్లు, జీడిపప్పు, బాదం వంటి శుష్కఫలాలు తగు ప్రమాణంలో సేవించాలి. ఆరేడుగంటలపాటు రాత్రి నిద్రపోవాలి. రోజూ కనీసం ఐదులీటర్ల నీరు తాగాలి. వ్యాయామం, ప్రాణాయామం తప్పనిసరిగా ఆచరించండి. రోజూ ఒక లీటరు ఆవుపాలు తాగండి. కొంతకాలం పాటు షాంపూలు వాడటం మానేసి కుంకుడుకాయ, షీకాకాయ పొడులతోటే స్నానం చేయండి. మీకు ఎలర్జీ కలిగించే మందులను వాడవద్దు. నీలిభృంగాది తైలాన్ని రోజూ తలనూనెగా వాడండి. కొంతకాలం తర్వాత స్వచ్ఛమైన కొబ్బరినూనెను వాడుకోవచ్చు. పునర్నవాది మండూర మాత్రలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. భృంగరాజాసవ ద్రావకం నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రెండుపూటలా తాగాలి. గురివింద గింజల చూర్ణాన్ని నీళ్లతో ముద్దగా చేసి తలపై రాసుకుని, ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే జుత్తు రాలటం చాలా త్వరగా తగ్గుతుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
ఆయుర్వేద కౌన్సెలింగ్
మెడనొప్పికి పంచకర్మ నా వయస్సు 36 సంవత్సరాలు. నాకు తరచూ మెడనొప్పిగా ఉంటోంది. ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు చెయ్యి లాగడం మొదలవుతోంది. మందులు వాడినప్పుడు నొప్పి తగ్గుతోంది. మందులు మానగానే మళ్లీ వస్తోంది. దీనికి ఆయుర్వేదంలో సరైన వైద్యం ఉందా? - రవి వర్మ, విశాఖపట్నం మీరు కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేసే వృత్తిలో ఉన్నవాళ్లలో ప్రతి 100 మందిలో 70 మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. దీనికి అనే కారణాలున్నాయి. ఈ వృత్తిలో వున్న చాలామందిలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. ఆహార అలవాట్లలో విపరీతమైన మార్పు వచ్చింది. నిద్రా సమయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం మన శరీర, మానసిక వ్యవస్థలపై పనిచేసి, చాలా దుష్ర్పభావాలు చూపిస్తున్నాయి. అందులో ఒకటి ఈ మెడనొప్పి. ఈ మెడనొప్పిని ఆయుర్వేదంలో మన్యస్తంభము అనీ, అపబాహుకము అని, అల్లోపతి వైద్యశాస్త్రంలో సర్వికల్ స్పాండిలోసిస్ అని అంటారు. ఎక్కువగా మానసిక ఆందోళనకు గురికావడం, నిద్ర సరిగా లేకపోవడం, అన్నం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా కొంతమందిలో మెడనొప్పి వస్తూ ఉంటుంది. కారణాలు: 1) మెడ భాగంలో ఉన్న ఎముకల మధ్య ఉన్న ఖాళీభాగం తగ్గడం వల్ల, ఎముకల మధ్యలో వాపు రావడం వల్ల, ఎముకలు అరిగిపోవడం వల్ల కూడా పై లక్షణాలు కనిపిస్తుంటాయి. 2) కొంతమందిలో తల తిరగడం, పైకి లేస్తే కింద పడిపోతున్నట్లుగా ఉండడం వల్ల తలనొప్పి; మెడ నరాలు నొక్కుకుని పోయినట్లుగా, వాచినట్లుగా ఉండి, రక్తప్రసరణ తక్కువగా ఉండడం వల్ల కూడా మెడనొప్పి వస్తూ ఉంటుంది. 3) కొంతమందిలో మెడనొప్పి తక్కువగా ఉండి, మెడ దగ్గర నుండి అరచేయి వరకు లాగడం, నొప్పిగా ఉండడం, తిమ్మిరిగా, మొద్దుబారినట్టు ఉండడం వంటి లక్షణాలు ఉండచ్చు. మెడభాగంలోని ఎముకల మధ్య ఉన్న డిస్క్ భాగంలో వాపు రావడం వల్ల కానీ, అది పక్కకు జరగడం వల్ల కానీ ఇలా జరుగుతుంది. పై లక్షణాలు తెలుసుకోవడానికి ఎక్స్‌రే కానీ, ఎంఆర్ఐ కానీ తీయవచ్చు. ఆయుర్వేద వైద్యుడికి మాత్రం ఇవేవీ అవసరం లేదు. మీ లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. చికిత్సా క్రమంలో... 1) వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ఎక్కువ సమయం పడుకోవడం మంచిది. తలభాగంలో తక్కువ పరిమాణంలో ఉన్న దిండును వాడడం మంచిది. 2) కొద్దిరోజుల వరకు బరువైన వస్తువులను మోయరాదు. 3) శతపాక క్షీరబలా తైలాన్ని ఉదయం, రాత్రి వ్యాధి తీవ్రతను బట్టి తీసుకోవలసి ఉంటుంది. 4) మానసిక ఆందోళన, రక్తపోటు, తలతిరగడం ఉన్నట్లయితే ‘మానసమిత్రవటకం’ను వాడడం మంచిది. 5) ఎముకలమధ్య వాపు ఉన్నట్లయితే వాపు తగ్గడానికి ‘త్రయోదశాంగ గుగ్గులు’ వాడడం మంచిది. తిమ్మిరి, చెయ్యి మొద్దుబారినట్లు ఉండటం వంటి వాటికి వాతగజాంకుశరస్, లశూనాదివటి ని కలిపి తీసుకోవడం మంచిది. పంచకర్మ పద్ధతిలో శిరోధార, నస్యకర్మ, గ్రీవవస్తి, మనల్కిడీ లాంటి పంచకర్మ చికిత్సలను తీసుకున్నట్లయితే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత, మెడనొప్పికి సంబంధించిన ఆసనాలు, మానసిక ప్రశాంతతకు ప్రాణాయామం, ధ్యానం మొదలైన వాటిని అలవాటు చేసుకోవడం మంచిది. -
వెన్నునొప్పి ముదిరితే మిగిలేది వైకల్యమే
వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయక పోవచ్చు కానీ, శరీరాన్ని నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్‌రెస్ట్,ఫిజియోథెరపీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సలతో వెన్ను నొప్పిఉన్న మూల కారణాలను శాశ్వతంగా నిర్మూలించవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ పి.కృష్ణప్రసాద్. వెన్నెముక వర్సెస్ పవర్‌హౌస్ వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్ హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడి నట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం తలెత్తవచ్చు. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్‌లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా తలెత్తవచ్చు. సర్జరీతో ఒరిగేది శూన్యం... వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్ట మొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం వల్ల తలనొప్పి, కడుపుబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. కేరళ పంచకర్మతో... అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరో ధాన్ని నివారించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరా లను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవ స్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరో సారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు ఇన్‌పేషంట్ సౌకర్యం కలదు. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు: డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail:krishnaprasad.gmail.com -
గౌట్ సమస్యకి పంచకర్మ చికిత్స
‘గౌట్’ అనేది ఒక రకమైన ఆర్థరైటీస్, దీన్నే ఆయుర్వేదంలో ‘వాత రక్తం’ అంటారు. మగవారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఆడవారిలో మోనోపాజ్ దశ తర్వాత కనిపిస్తుంది. ఈ గౌట్ ఆర్థరైటీస్ను ఆయుర్వేదంలోని శమన, శోధనతోపాటు పంచకర్మ చికిత్సలతో నివారించవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి.శరీరంలో జరిగే జీవనక్రియల సమతుల్యతలోపం వల్ల ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ రక్తంలో అధిక మోతాదులో చేరటం వల్ల కణజాలం వాపు ఏర్పడుతుంది. వ్యాధి లక్షణాలు: సాధారణంగా కాలి బొటనవేలు గోట్కి గురవుతుంది. దీనివల్ల జాయింట్లు, కణజాలం దెబ్బ తింటాయి. రాత్రి సమయంలో ఆకస్మికంగా తీవ్రమైన నొప్పి, వాపు, మంట, వేడి, ఎరుపుదనంతో కాలి బొటనవేలు బాధిస్తుంది. మోకాళ్ళు, చీలమండలు, పాదాలు కూడా బాధిస్తాయి. ముట్టుకుంటే భరించలేనంత నొప్పి, వేడిగా ఉండటం, వాపు లక్షణాలు ఉంటాయి. ఇది చేతివేళ్ళు, మణికట్టుకు కూడా వ్యాపిస్తుంది. అలసట, జ్వరం లక్షణాలుగా ఉంటాయి. ఈ వ్యాధి ముదిరితే కీళ్ల దగ్గర చిన్న చిన్న స్ఫటికాలుగా కనిపిస్తుంది. కారణాలు: ఇది కొన్నిసార్లు అనువంశికంగా రావచ్చు. కుటుంబంలో ఒకరికి ఉన్నట్లయితే భావితరాలకు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల ఔషధాలు వాడటం వల్ల, మాంసాహారం అధికంగా తినడం వల్ల, అధిక బరువు, ఆల్కహాలు ఎక్కువగా తాగడం వల్ల, క్షయ నివారణ మందుల వల్ల, కేన్సర్ వ్యాధుల వల్ల యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఆయుర్వేదానుసారం వాతరక్తం, ఆద్యవాతం అంటే.. గౌట్ వ్యాధి, వాతదోషం, పిత్తదోషం, రక్తధాతువు మోతాదులో లవణం, ఆమ్లం, క్షార, ఉష్ణపదార్థాలు తీసుకోవటం వల్ల, నిల్వ పదార్థాలు తినడం వల్ల, పుల్లని పెరుగు, మజ్జిగ వాడటం, నిల్వచేసిన చేపలు, మాంసం తినడం వల్ల, ఉలవలు, అనుములు తీసుకోవటం వల్ల వస్తుంది. రకాలు: వాతరక్తం రెండు రకాలు. ‘ఉత్ధాన వాతరక్తం’ అనే వ్యాధి... చర్మం, మాంసధాతువులో వ్యాపిస్తుంది. ‘గంభీర వాతరక్తం’ అనే వ్యాధి... ధాతువుల లోపల ఎక్కువ మోతాదులో వ్యాపిస్తుంది. బుడిపెల మాదిరిగా ఉంటుంది. ఈ వ్యాధిని తేలికగా తీసుకోరాదు. ఔషధాలు తీసుకోకపోతే బి.పి., మధుమేహం, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, కీళ్ళవాపు, వంకర్లు పోవటం, మూత్రపిండాల పని మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి తీవ్రత చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. పంచకర్మ చికిత్సలు: స్వేహపానం, విరేచనం, అభ్యంగనం, స్వేదం, ఎలకిజి, పిబిజిల్, వస్తి, నవరరిజి... చక్కని ఫలితాలను ఇచ్చి వ్యాధిని తగ్గిస్తాయి. ‘రక్తమోక్షణం’ చక్కని ఫలితాలను ఇస్తుంది. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయుర్వేద చికిత్స తీసుకున్నట్లయితే వాతరక్తం వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. -
వికలాంగ అభ్యర్థులకు న్యాయం జరిగేనా..?
జిల్లాలోని వివిధ శాఖల్లో వికలాంగుల కోసం రిజర్వు చేసిన ఉద్యోగ నియామకాల్లో జాప్యం జరుగుతోంది. వీటి భర్తీకి జనవరి 19న కలెక్టర్ కార్యాలయం (వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ) నుంచి ప్రకటనను విడుదల చేశారు. వికలాంగుల బ్యాక్ లాగ్ గ్రూపు 4, గ్రూపు 4 కాని ఉద్యోగాల పరిమిత నియామకాల కోసం ఫిబ్రవరి 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 52 పోస్టులు కాగా గ్రూపు 4 ఉద్యోగాలుగా టైపిస్ట్ పోస్ట్‌లు 8, జూనియర్ అసిస్టెంట్ 3, బిల్ కలెక్టర్ 1, కాంపౌండర్ (ఆయుర్వేదం)1, కాంపౌండర్ (హోమియో) 1, ఎంపీహెచ్ఏ (పురుష) 9, ల్యాబ్ టెక్నిషియన్ (గ్రేడ్)1 పోస్ట్‌ను కేటాయించారు. వీటి భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతగా ప్రకటించారు. అలాగే గ్రూప్ 4 కాని ఉద్యోగులుగా అటెండర్, ఆఫీస్ సబార్డునేట్ 8, పీహెచ్ వర్కర్ 2, కామాటి 5, కుక్ 5, వాచ్మెన్ 6, వాటర్ బాయ్ 1, ల్యాబ్ అటెండర్ 1 పోస్ట్‌ను ప్రకటించారు. వీటికి విద్యార్హత ఐదో తరగతి నుంచి ఐటీఐ వరకు ప్రకటించారు. వీటిని వివిధ వైకల్యాలతో ఉన్న వారి కోసం గ్రూపు 4 సర్వీసులతో ఆయా పోస్టులకు ఉద్దేశించి నిర్దిష్ట విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టులను ఇంకా పెంచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఉద్యోగాల కోసం సదరమ్ క్యాంపు లేదా మెడికల్ బోర్డు నుంచి 40 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం, విద్యార్హత పత్రాలతో అర్హులైన అంధులు, బదిరులు, శారీరక వికలాంగులు వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం జరిగి పది నెలలు గడుస్తున్నా అధికార యంత్రాంగంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో వికలాంగుల సమాఖ్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ పోస్టుల భర్తీకి మోక్షం కలిగేలా చూడాలని కోరుతున్నారు. -
ఆయుర్వేదం... అద్భుత విషయాలు!
వైద్యుడిగా పరిణతి సాధించాలని అనుకునేవాడు ఏదో ఒక విభాగానికి మాత్రమే పరిమితం కాకూడదు. అప్పుడతడు పాక్షిక వైద్యుడవుతాడు. పాక్షిక వైద్యుడు చికిత్స చేయడానికి పనికిరాడు. అందుకే నిష్పాక్షికంగా అతడు అన్ని విభాగాల్లోనూ నైపుణ్యం సాధించి పరిపూర్ణజ్ఞానాన్ని పొందాలంటుంది ఆయుర్వేదం. ఇదీ నాడీ ప్రవీణ, డెరైక్టర్ ఆఫ్ మహర్షి ఆయుర్వేద, డాక్టర్ జె.ఆర్. రాజు ఉద్బోధించే విషయాలు. ఈరోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లడం కంటే... ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ కోసం వారు సూచించే పరీక్షలే రోగిని ఎక్కువగా భయపెడుతుంటాయి. కానీ వైద్యాచార్య డాక్టర్ రాజు ఇలాంటి రక్తపరీక్షలూ, మూత్రపరీక్షలూ, ఈసీజీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలను చేయించరు. కేవలం నాడిని చూడటం ద్వారానే వ్యాధినిర్ధారణ చేస్తారు. తద్వారా రోగుల ఖర్చులు ఆదా అవుతాయి. ఇక ఆయన ఎన్నెన్నో దేశాల్లో అల్లోపతి వైద్యులకూ ఆయుర్వేదం గొప్పదనాన్ని వివరించి, ఆ విధానంలో నయంకాని (క్యూర్ లేదనే) వ్యాధులకు ఆయుర్వేద విధానంలో నయం చేసే విధానాలను బోధిస్తుంటారు. ఆయుర్వేదాన్ని ఆచరిస్తూ వస్తున్న ఆయన మన రోజువారీ దినచర్యల్లో అత్యంత సులభంగానూ, సూక్ష్మంగానూ, పైసా ఖర్చులేకుండా ఆరోగ్యాన్ని పొందే అనేక విషయాలను విపులంగా వివరిస్తున్నారు. దైనందిన జీవనశైలిలోనే ఆయుర్వేదం... ఆయుర్వేద జ్ఞానం చాలా విస్తృతం. దానిని ఔపోసన పట్టడం కంటే అభ్యాసం చేయడం మేలని ఎంచారు మన పూర్వికులు. అందుకే ఆయుర్వేదాన్ని మన నిత్యజీవన శైలిగా మార్చారు. స్నానం, పానం, ఆహారం, విహారం... ఇలా ప్రతి అంశంలోనూ మనకు తెలియకుండానే మనం ఆయుర్వేదాన్ని ఆచరిస్తుంటాం. ఇంగ్లిష్ మందులు, ఇతర ఔషధాలకు కొన్ని దుష్ర్పభావాలు ఉంటాయి. వాటినే సైడ్ ఎఫెక్ట్స్ అని అందరూ వ్యవహరిస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో ఉపయోగించే పదార్థాలన్నీ స్వాభావికాలు. ప్రకృతి సహజాలు. ఉదాహరణకు మన వంటగదిలో ఉపయోగించే వాము, జీలకర్ర, దాల్చినచెక్క వంటివన్నీ ఆయుర్వేదంలో ఔషధాలే. అలాక్కాకుండా వంటింటి దినుసులుగా ఉపయోగిస్తే అప్పుడవి రోజువారీగా ఉపయోగించే పదార్థాలే. అందుకే ఆయుర్వేదం వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. అన్నీ సైడ్ బెనిఫిట్సే. కాబట్టే ఆయుర్వేదం మన నిత్యజీవితంలో భాగం అయ్యేలా చూశారు మన పూర్వికులు, ఆచార్యులు. అందుకే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పైసా ఖర్చులేకుండా పొందగలిగే ఆరోగ్యాన్ని స్నానం నుంచి ప్రారంభిద్దాం. రోజులో తొలి కార్యక్రమం...వ్యాయామం వ్యాయామం అతిగా చేయకూడదు. నుదుట చెమట రావడం మొదలు కాగానే లేదా అధికశ్రమతో శ్వాస తీసుకోవడం మొదలుకాగానే వ్యాయామాన్ని ఆపేయాలి. ఇలా చేయడాన్నే శరీర అర్ధబలమంటారు. బాగా శరీర పరిశ్రమ (కఠిన వ్యాయామం) లేదా రన్నింగ్ లేదా వాకింగ్ చేసి వచ్చాక... వెంటనే నీరు తాగకూడదు. శరీరం, శ్వాస నెమ్మదించాక మాత్రమే నీరు తాగాలి. వ్యాయామ, విహారాలకు అనువైనది ప్రాతఃకాలమే. ఆహారం తీసుకున్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాయామం చేయకూడదు. స్నానం...ప్రాధాన్యం..! స్నానానంతరం మనకు కలిగే ఆహ్లాదం అంతా ఇంతా కాదు. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరచడం మాత్రమే చేయదు. అనేక సమస్యలనుంచి సాంత్వన కలిగిస్తుందీ స్నానం. అయితే స్నానం ఆరోగ్యకరం కావాలంటే కొన్ని సూచనలు గుర్తుపెట్టుకోండి. అవి... తలపై మరీ ఎక్కువ వేన్నీళ్లతో స్నానం వద్దు. స్టీమ్ బాత్, సౌనా బాత్ వంటివి ఆరోగ్యకరం కాదు. స్టీమ్‌బాత్, సౌనాబాత్‌లో తలకు ఆవిరి పెడతారు. అది చాలా ప్రమాదకరం. ఏదైనా తిన్నవెంటనే స్నానం చేయకూడదు. స్నానం తర్వాతే ఆహారం తీసుకోవాలి. కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు. రెండు, మూడు గంటల తర్వాతే స్నానం చేయండి. బలహీనంగా ఉన్నవాళ్లు, వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో స్నానంగాని వద్దు. చన్నీళ్ల స్నానం ఆరోగ్యకరమనే అపోహ వద్దు. గోరువెచ్చని నీళ్లే మంచివి. తప్పనిసరి పరిస్థితుల్లో చన్నీళ్లతో స్నానం చేస్తే... దానికి ముందర చన్నీళ్లు తాగవద్దు. చన్నీళ్ల స్నానంలో నీరు ఎంత చల్లటివైతే... స్నానం వ్యవధిని అంతగా తగ్గించడం మంచిది. గోరువెచ్చని నీళ్లతో స్నానం ముందర కాస్తంత వ్యాయామం మంచిది. ఏ నీళ్లతో (చన్నీళ్లు లేదా వేణ్ణీళ్లు) అయినా స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే అది మీ ఆరోగ్యానికి అంతగా సరిపడదని గుర్తుంచుకోండి. నీరూ... ఆరోగ్యప్రదాయనే! నీటిని మనం ఆహారంతో పాటు స్వీకరిస్తుంటాం. నీరూ ఒక ఓషధే. సరైన పాళ్లలో సరైన విధంగా తీసుకుంటే దాంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఉదాహరణకు... స్థూలకాయం ఉన్నవారు తమ బరువు తగ్గించుకోడానికి ఆచరించదగిన నీటి చికిత్స (వాటర్ థెరపీ) ఏమిటంటే... ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో మూడో వంతు ఆవిరయ్యేలా చేసి, మిగతా నాల్గో వంతు భాగాన్ని చల్లార్చి తాగితే ఊబకాయం తగ్గుతుంది. అలాగే లావెక్కాలని భావించే అతిసన్నటి శరీరం ఉన్నవారు... ఒక పాత్రలో నీటిని తీసుకుని కేవలం నాలుగోవంతు మాత్రమే ఆవిరయ్యేలా చేసి, మిగతా నీటిని చల్లార్చి తాగితే క్రమంగా ఒళ్లు చేస్తారు. ఇలా ఒకే నీరు... దాన్ని ఉపయోగించే అతి సాధారణ, అతి సులభ పద్ధతుల్లో రెండు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రతి అరగంటకొకసారి వేడి నీళ్లను టీ తాగినట్లుగా రోజూ సిప్ చేస్తూ తాగుతుంటే దీర్ఘకాలంలో చాలా వ్యాధులు నయమవుతాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి... కాచిన పాలనూ, కాచిన నీళ్లను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. అన్నపానాదులను సంస్కరించాకే ఉపయోగించాలి. ఇలాంటి సంస్కరణకు ప్రధానంగా ఉపయోగపడేది నీరే. నీళ్లు లేకుండా ఘన పదార్థాల సంస్కారం వీలు కాదు. చాలా రోగాలకు ముఖ్యకారణం కూడా నీరే. తమ ఆవాసంగా నీటిలో ఉండే జంతుజాలం ప్రసవించే సమయంలో వెలువడే విషపదార్థాలు నీళ్లలో కరిగి రోగకారకాలు కావచ్చు. అందుకే నీటి స్వచ్ఛపరిచాకే ఉపయోగించాలి. నీటిని స్వచ్ఛపరచడం అంటే... తొలుత మంచి పరిశుభ్రమైన నిర్మల వస్త్రంతో వడగట్టడం, ఆ తర్వాత నీటిని బాగా కాచి చల్లార్చి తాగడం. ఇలా నీటిని స్వచ్ఛపరిచాకే తాగాలి. భోజనానికి ముందు నీరు తాగితే అది మందాగ్ని రూపంలో శరీరాన్ని కృశింపజేస్తుంది. మధ్యమధ్యన నీరు తాగకుండా భోజనం తర్వాతే నీరు తాగితే అది శరీర స్థౌల్యం (ఊబకాయం) కలిగిస్తుంది. ఛాతీ, కంఠం, శిరస్సుల్లో కఫాన్ని వృద్ధి చేస్తుంది. అందుకే భోజనం మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉంటే మధ్యమ స్థితి (అంటే కృశ - స్థౌల్య... ఈ రెంటినీ కలిగించేదిగా) సంభవిస్తుంది. ఇలా మధ్య మధ్యన నీరుతాగడం రస, రక్తాధి ధాతువులను సమస్థితిలో ఉంచుతుంది. ఇలా తాగిన నీరు సులభంగా, సుఖంగా జీర్ణమవుతుంది. చల్లని నీళ్లు జీర్ణం కవడానికి 45 నిమిషాలు, వేడి నీరు జీర్ణం కావడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. దురలవాట్లనుదూరం చేసుకోండిలా... భోజనం గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. భోజనం ‘ఆత్మ’కు ఇంపుగా ఉండాలి. మంచి కవిత్వం రాయడం ఎప్పుడు సాధ్యమన్న విషయాన్ని అల్లసాని పెద్దన సరదాగా చెప్పినా ఆ మాటల్లోని వాస్తవం గమనించారా? ‘ఆత్మకింపైన భోజనం...’ తినాలంటారాయన. అలాగే అన్నం తిన్న తర్వాత కలిగే తృప్తిని వర్ణించడానికి చెప్పే మాట... ‘ఆత్మారాముడు శాంతించాడు’ అనే. అంటే ఇక్కడ తాను అనే అర్థంలో ఆత్మ అనే మాటను వాడినా... విస్తృతార్థంలోనూ ఆత్మకింపైన, ఆత్మకు మేలు చేకూర్చే భోజనమే తీసుకోవాలన్నది వాస్తవం. ఇందులో భాగంగా శరీరానికీ, నాలుకకూ రుచిగా ఉన్నప్పటికీ అది ఆరోగ్యానికి అంతగా మేలు చేసేది కానప్పుడు దాన్ని వర్జించాలి. ఇలా వర్జించే సమయంలోనూ దాన్ని అకస్మాత్తుగా వర్జించకూడదు. దురలవాటునూ, దుర్వ్యసనాన్ని దూరం చేసుకోనే సమయంలో దాని పరిమాణాన్ని రోజూ శోడశ పాద భాగాన్ని విడవాలి. అంటే ప్రతిరోజూ ఒకటిలో పదహారోవంతును తగ్గించుకుంటూ... ఇలా క్రమంగా మేలు చేయని ఆహారాన్ని వర్జించాలన్నమాట. భోజనం తర్వాత మొక్కజొన్న కండె, మొక్కజొన్న అటుకులు తినకూడదు. వండటానికి పనికొచ్చే కూరలను వండే తినండి... ఇటీవల చాలా మంది పచ్చి కూరలు తినడం వల్లనే ఆరోగ్యం ఇనుమడిస్తుందంటూ చెబుతుంటారు. ఇది కేవలం పాక్షిక సత్యం మాత్రమే. వండి తినడం (పచనం చేయడం) నాగరక పరిణామక్రమంలో వచ్చిన అభివృద్ధి. అందువల్ల దాన్ని అభివృద్ధి సూచకంగానే పరిగణించాలి. క్యారెట్, బీట్రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం తురుము, ధనియాలు, పుదీన లాంటి వాటిని పచ్చిగా తిన్నా పర్వాలేదు. ఎందుకంటే అవి అందుకు ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి. కానీ సొర, బీర, కాకర వంటి కూరగాయలను వండి మాత్రమే తినండి. వండటానికి మాత్రమే వాటిని ఉపయుక్తంగా తయారు చేసింది ప్రకృతి. ఉదాహరణకు కూరగాయలుగా మనం వాడేవాటిలో కాకరనే తీసుకుందాం. దానికి చికిత్సాపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నది వాస్తవం. దాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది, డయాబెటిస్ లాంటి దీర్ఘవ్యాధులను తగ్గిస్తుందన్నది కూడా పరమ సత్యం. అయితే అలాగని దాన్ని పచ్చిగా తినడం చాలా హానికరం. అందులో ఔషధగుణాలతో పాటు కొన్ని ఆల్కలాయిడ్స్ కూడా ఉంటాయి. అవి మోతాదుకు మించినప్పుడు శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి దాన్ని పచ్చిగా తినడమో లేదా అదేపనిగా రోజూ కాకర రసం తీసుకుని తాగడమో చేస్తే దీర్ఘకాలంలో దాని దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే కూరగాయలను, ఆకుకూరలను వండే తినండి. సలాడ్స్‌గా తీసుకోదగ్గ క్యారెట్, బీట్రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం వంటివాటికి మిగతా కూరలను జత చేయకండి. పొన్నగంటికూర కళ్లకు చాలా మంచిది. భోజనం తీసుకోండిలా... అన్నం పరబ్రహ్మస్వరూపం. అందుకే దాన్ని గౌరవిస్తూ వీలైతే తూర్పునకు ముఖం చేసి తినండి. ఆహారాన్ని దూషిస్తూ, అశాంతితో తినకూడదు. భోజనంలో మొదట తీపి తీసుకోండి. ఆ తర్వాత భోజనంలో హెవీఫుడ్‌గా మీరు భావించేదాన్ని తినాలి. అలా క్రమంగా భోజనం సాగుతున్న కొద్దీ హెవీ నుంచి లైట్‌కు వస్తూ ఉండాలి. మొదట హెవీ అనే క్రమంలో నెయ్యిని తీసుకోండి. ఎందుకంటే నేతికి రెండు రకాల గుణాలుంటాయి. అది అగ్నిని ప్రజ్వలిస్తుంది. (అగ్నికి ఆజ్యం తోడైనట్లు అనేది అందుకే). అంటే మొదట అగ్నిగుణాన్ని కలిగించడం వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. అగ్నిగుణం కలిగిన ఆ నెయ్యే... కారాలతో నాలుక భగభగలాడేప్పుడూ... ఆహారంలో కారం మంట అధికంగా ఉన్నప్పుడూ దాన్ని శాంతింపజేయడానికి తోడ్పడుతుంది. అందుకే అన్నంలో నేతికి తొలి వరస. ఈ క్రమంలో అన్నింటికన్నా తేలికైన మజ్జిగది తుది వరస. అన్నం తినేప్పుడు కొందరు మంచినీళ్లు అస్సలు తాగరు. కానీ మధ్యలో నీళ్లు తాగడమే మంచిది. లేకపోతే మనం తీసుకునే అన్నంలోని ఘనపదార్థాలు మధ్యలో చిక్కుకుపోయి (స్తంభించి), జీర్ణక్రియకు అవరోధం కలిగిస్తాయి. అందుకే గొంతులో/ కడుపులో ఏదైనా అడ్డంపడ్డట్లు ఉన్నప్పుడు నీళ్లు తాగడమే మంచిది. అన్నాన్ని కళ్లతో చూడగానే నోట్లో నీళ్లూరతాయి. జ్ఞానేంద్రియాలలో కలిగే స్పందనల్లో ఇదొకటి. మంచి శ్రేష్ఠమైన ఆహారం రుచులను వినగానే వాటిని రుచిచూడాలనిపిస్తుంది. ఇది మరో జ్ఞానేంద్రియం చేసే పని. ఇక ఎలాగూ నాల్క రుచిచూస్తుంది. అలాగే అన్నాన్ని స్పర్శిస్తూ తినడం వల్ల కూడా కొన్ని స్పందనలు కలుగుతాయి. అందుకే అన్నాన్ని స్పూన్లూ, ఫోర్కులూ, నైఫ్‌ల వంటి ఉపకరణాలతో తినే బదులు చేతి ఐదువేళ్లతో స్పర్శిస్తూ తినండి. ఈ స్పర్శజ్ఞానమూ మెదడులో కొన్ని స్పందనలు కలిగించి అన్నం పట్ల హితవును కలిగిస్తుంది. అయితే ఈ జ్ఞానం కలగడానికి మిగతా జ్ఞానేంద్రియాలతో పోలిస్తే కాస్త ఎక్కువ వ్యవధి పడుతుంది. భోజనం చివరన చల్ల (మజ్జిగ) వాడటం చాలా మంచిది. దీనికి కొద్దిగా శుంఠి, సైంధవ లవణం కలుపుకుని తింటే మరింత శ్రేష్ఠం. ఇక అన్నం తిన్న తర్వాత చేయి కడిగి... ఆ చేయి తుడుచుకున్న తర్వాత ఉండే కాస్తంత తడితో కళ్లుమూసుకుని, కన్రెప్పలను తుడుచుకుంటే కొన్ని దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇది కళ్లకు చాలా మంచిది. భోజనం చేయండిలా... భోజనం చేసే సమయంలో మీ కడుపును నాలుగు భాగాలుగా ఊహించుకోండి. అందులోని రెండు భాగాలను ఘనపదార్థాలకూ, ఒక భాగం ద్రవపదార్థాలకూ, మిగతా మరో భాగాన్ని వాయువుకు విడవండి. ఈ నిష్పత్తిలో భోజనం చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. కేవలం పెరుగును మాత్రమే తినకూడదు. పెరుగు తినదలచినవారు అందులో కొద్దిగా తేనెనుగాని లేదా ఉసిరిక లేదా ముద్గయూషం (పెసరకట్టు) కలుపుకుని లేదా చిలికి తినాలి. పెరుగును యథాతథంగా రాత్రిపూట తినడం నిషిద్ధం. పెరుగు తన గురుగుణం వల్ల శోఫ (వాపు)ను, కఫాన్ని పెంచుతుంది. అదే మజ్జిగ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఫలాలు...ఫలితాలు కొన్ని పండ్లు భోజనానికి ముందే తినడం మంచిది. మామిడి, కొబ్బరి, అరటి వంటి పండ్లను భోజనానికి ముందే తినాలి. (అరటి శ్రేష్టమైన పండే అయినప్పటికీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది బరువైన పండు, బరువైన ఆహారాలు ముందే తినాలి కాబట్టి దీన్ని భోజనానికి ముందే తీసుకోవడం మంచిది. లేదా మధ్యాహ్నభోజనం అయ్యాక... చాలాసేపటి తర్వాత ఈవినింగ్ శ్నాక్స్ టైమ్‌లో (ఉజ్జాయింపుగా సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో) తినాలి. బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినాలి. అప్పుడది కడుపులోని మలినాలను తీసేస్తుంది. కడుపునిండా భోజనం చేశాక బొప్పాయి తినకూడదు. పండ్లలో లీఛీ పండు అంత మంచిది కాదు. ఆహారం భాగమైన పండ్ల విషయంలోనూ దేశ, కాలాత్మాది విజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని ప్రాంతాల్లో పండేవి అక్కడి వారికి తేలిగ్గా జీర్ణమవుతాయి. అవి వారికి మంచిది. ఇక కొన్ని పండ్లూ, ఆహారాలు కొన్ని ప్రాంతాలవారికి పరాయివి. దేశకాలాలను బట్టి మనకు ఏది అనువైనదో వాటినే తీసుకోవాలి. రోజులో చివరి కార్యకలాపం నిద్ర గురించి... నియమానుసారంగా నిద్రపోవాలి. తద్వారా ఆరోగ్యం, పుష్టి, బలం కలుగుతాయి. అకాల నిద్ర లేదా అతినిద్ర లేదా బొత్తిగా నిద్రమానినా అది ఆయువును హరించివేస్తుంది. నిద్ర వేళలు / నిద్ర అలవాట్లు సరిగా లేకపోతే అది రోగాన్ని, కృశింపజేసే తత్వాన్ని, బలహీనతను, అజ్ఞానాన్ని, మరణాన్ని కలగజేస్తుంది. నిద్రలేమి అనేది రోగాన్ని కలగజేస్తుంది. జ్ఞాపకశక్తిని హరిస్తుంది. సరైన నిద్ర లేకుండటం అన్నది దీర్ఘకాలంలో మనిషిని క్రమంగా కుంగదీస్తుంది. నిద్ర వేళలన్నవి వారి వారి సౌకర్యాన్ని బట్టి మరీ ఎక్కువగానూ, మరీ తక్కువగానూ ఉండకుండా చూసుకోవాలి. అతినిద్ర, నిద్రలేమి ఈ రెండూ ప్రమాదకరమే అని గ్రహించండి. అవీ ఇవీ... సత్తుపిండి (సున్ని ఉండలను) రాత్రి తినకూడదు. సత్తుపిండిని నీళ్లతో కలిపి తినకూడదు. నువ్వుల నూనెకు సత్వరం వ్యాపించే గుణం ఉంది. అందుకే అభ్యంగం (మసాజ్)లో దీన్ని వాడటం వల్ల అనేక రోగాలు తగ్గడానికి దోహదం చేస్తుంది. బక్కచిక్కిన వాళ్లు దీనితో మసాజ్ చేసుకుంటే బరువు పెరుగుతారు. అదే స్థూలకాయులైతే బరువు తగ్గుతారు. బియ్యం లాంటి ఆహారధాన్యాలు ఒక సంవత్సరం కిందటివి అంటే పాతవి శ్రేష్ఠం. కొత్తపంటలు ప్రమేహానికి (డయాబెటిస్)కు కారకాలు. ధాన్యాలు, ఘృతం (నెయ్యి), తేనె, బెల్లం, పిప్పలి ఇవి తప్ప... ఇతర ద్రవ్యాలు ఒక ఏడాదిపైబడినవే శ్రేష్ఠం. పెసలు మంచి ప్రోటీన్. మినుములు మాంసంతో సమానమైన శాకాహారం. పుట్టగొడుగులు మిగుల దోషకారి. కాలేయంలోని విషాలను పెంచుతాయి. లేతముల్లంగి శ్రేష్ఠం. ముదురు ముల్లంగి రోగకారకం. లేత వంకాయ శ్రేష్ఠం, ముదురు వంకాయ రోగకారకం. ముదురు బూడిద గుమ్మడికాయ శ్రేష్ఠం. లేత బూడిద గుమ్మడికాయ రోగకారకం. బియ్యం తేలికైనవి. కానీ వాటితోనే రూపొందే అటుకులు ఆలస్యంగా జీర్ణమవుతాయి. పైన పేర్కొన్నవన్నీ ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి, రాత్రి నిద్రించే వరకు ఒక క్రమపద్ధతిలో చేయడానికి వీలుగా ఆయుర్వేదం ఈ అలవాట్లన్నింటినీ మనందరి దైనందిన జీవితంలో ప్రవేశపెట్టింది. కొందరు ఏమీ తెలియకుండానే వీటన్నింటినీ ఆచరిస్తుండవచ్చు. మరికొందరు తెలియక కొన్నింటిని ఆచరించక, రుగ్మతలకు లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయుర్వేద సదాచారాలను అర్థం చేసుకుని ఆరోగ్యంగా జీవించండి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి ‘తేనె’లొలికే ఆరోగ్య సూచనలు ఉదయం వేళ ఆరోగ్యదాయని అంటూ చాలామంది తేనెను స్వీకరిస్తుంటారు. వేన్నీళ్లలో కాస్తంత తేనెనూ, నిమ్మరసాన్ని వేసి తాగుతారు. ఇలా తీసుకోవడం చాలా ప్రమాదకరం. తేనెను ఆరోగ్యప్రదాయనిగా స్వీకరించదలచినవారు వేన్నీళ్లలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వేయకూడదు. చన్నీళ్లతోనే స్వీకరించాలి. మీ శరీరం ఎంత తేనెను స్వీకరించడానికి సిద్ధంగా ఉందో ఆ మోతాదునే ఎప్పుడూ కొనసాగించాలి. అంతేగానీ తేనె మధురంగా ఉంటుందని అతిగా తీసుకోవడం సరికాదు. తేనె, నెయ్యి... ఈ రెండింటినీ సమానపాళ్లలో కలిసి తీసుకోకూడదు. ఏదో ఒకదాని మోతాదు ఎక్కువో, తక్కువో ఉండాలి. ఆ రెండూ సమానంగా ఉంటే అది విషంతో సమానం. తేనె ‘యోగవాహి’. అంటే తేనెను దేనితోనైనా కలిపి తీసుకుంటే, అది చేరిన పదార్థం గుణాలను అధికం చేస్తుంది. కానీ తన స్వీయ గుణాల వల్ల ఉద్దేశిత కార్యానికి విరుద్ధంగా పనిచేయదు. ఉదాహరణకు కరక్కాయతో కలిసిన తేనె విరేచనాన్ని కలిగిస్తుంది. కానీ తన స్వభావమైన విరేచన కార్యాన్ని ఆపదు. పాల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే... చాలామంది ఉదయం వేళ పాలు, అరటిపండు తీసుకుంటుంటారు. పాలతోగాని, పెరుగుతోగాని, పాలపొడితోగాని అరటిపండు తీసుకోవడం సరికాదు. అది స్లోపాయిజన్ వంటిది. చాలామంది భోజనం అనంతరం అరటిపండును తీసుకుంటారు. ఇది కూడా సరికాదు. అరటిపండును తినాలనుకునేవారు భోజనానికి ముందే తీసుకోవాలి. లేదా మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో కడుపు కాస్త ఖాళీ అయ్యాక తీసుకోవడం మంచిది. రోజూ పాలు తాగేవారు దానితో తీపి పదార్థాలు తప్ప మరే రుచినీ కలపకూడదు. కాబట్టి టీ, కాఫీలు తాగేవారు కేవలం వాటిని కషాయంగా (పాలు కలపకుండా) తాగడమే ఆరోగ్యానికి మంచిది. ఇక ముఖ్యంగా పాలతో ఉప్పు కలపడం ఆరోగ్యానికి అనర్థం. అందుకే పాలతో కలిపి సాల్ట్ బిస్కెట్లు తీసుకోవడం మంచిదికాదని గుర్తుంచుకోండి. కొందరు కొన్ని రకాల కూరల్లో పాలు కలిపి వండుతుంటారు. పాలలో ఉప్పు కలిపి వేడిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి... ఇలా చేయడం దీర్ఘకాలంలో హానికరం. పాలు, పనసపండు కలిపి తినకూడదు. పాలు, చేపలు కలిపి తినకూడదు. చేపలు తిన్న తర్వాత మజ్జిగ గాని, పెరుగుగాని తింటే దీర్ఘకాలంలో ఆరోగ్యభంగం అయ్యే అవకాశం ఉంది. పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు. -
బండి నడుపుతుంటే కళ్లు తిరుగుతున్నాయి!
డాక్టర్ సలహా నా వయసు 44. డ్రైవర్ని. నాకు అప్పుడప్పుడూ సడన్‌గా కళ్లు తిరుగుతున్నాయి. ఆ తర్వాత చూపు మసకగా కనిపిస్తోంది. అందుకు ఇంగ్లిష్ మందులు వాడుతున్నాను. వాటిని వేసుకున్న మరుసటి రోజు బాగానే ఉంటోంది. వేసుకోని మరుసటి రోజు కళ్లు తిరగడం, మసక వస్తోంది. నాకు తగిన వైద్యాన్ని సూచించగలరు. - రామకృష్ణ, ఏలూరు మీ వయసు, ఉద్యోగంలో ఒత్తిడి దృష్టిలో ఉంచుకుని మీరు చెప్తున్న లక్షణాలను పరిశీలించినట్లయితే... ముందుగా మీరు రక్తపోటు (బి.పి) పరీక్ష చేయించుకోవాల్సి ఉంది. అలాగే మధుమేహం పరీక్షలు కూడా చేయించాలి. మీరు చెప్తున్న లక్షణాలకు మధుమేహంతో నేరుగా సంబంధాలు లేకపోయినప్పటికీ మధుమేహం అనుబంధంగా మరికొన్ని రుగ్మతలు తోడయినప్పుడు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. ఉన్నట్లుండి కళ్లు తిరగడాన్ని ఆయుర్వేదంలో అపస్మారకం (ఎపిలెప్సీ)గా పరిగణిస్తారు. బ్రెయిన్ స్కాన్ చేసి ఆ సంబంధిత రుగ్మతలు ఉన్నాయేమోనని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోపుగా మీరు పై లక్షణాలకు ఆయుర్వేదం సూచించిన ప్రాథమిక ఔషథాలను తీసుకోండి. ఔషధం: లఘుసూతశేఖరరసం (మాత్రలు) ఉదయం రెండు రాత్రి రెండు, స్ట్రెస్వీన్ క్యాప్సూల్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి, అర్జునారిష్ఠ (ద్రావకం) నాలుగు చెంచాలు ఉదయం నాలుగు చెంచాలు రాత్రి సమానంగా నీటిని కలిపి తీసుకోవాలి. ఆహారం: ఈ మందులు వాడుతూ బలవర్ధకమెన ఆహారం తీసుకుంటూ ఉప్పు, నూనెలు తగ్గించాలి. ఖర్జూరం, నువ్వుపప్పు, తాజాపండ్లు తీసుకోవాలి. విహారం: రాత్రివేళ కనీసం ఆరేడు గంటలు నిద్రపోవాలి. ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో ఐదు నిమిషాల సేపు ప్రాణాయామం చేయాలి. - డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి, ఆయుర్వేద నిపుణులు, హైదరాబాద్ -
‘ఆయుష్’ తీరనుందా..?
- ఉద్యోగుల తొలగింపునకు ప్రయత్నాలు - కలెక్టర్ తొలగించమన్నారంటూ ఆయుష్ ఆర్డీడీకి ఇన్చార్జి డీఎంహెచ్‌వో లేఖ - ఆందోళనలో 81 మంది ఉద్యోగులు భీమవరం క్రైం : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆయుర్వేద, హోమియో, యునాని, ప్రకృతి వైద్య సేవలందించే ఆయుష్ ఎన్ఆర్హెచ్ఎం ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 44 డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న 81 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయుష్ శాఖలో 44 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం 5 గురు మాత్రమే ఉండటంతో సిబ్బంది ఉన్నా ఎటువంటి ప్రయోజనం లేదనే ఉద్దేశ్యంతో వారిని తొలగించేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. జులై 1వ తేదీ నుంచి ఉద్యోగులను తొలగించాలని జిల్లా కలెక్టర్ తనకు లేఖ రాశారని ఇన్చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ కె.శంకరరావు ఆయుష్ శాఖ రీజినల్ డెప్యూటీ డెరైక్టర్(ఆర్డీడీ)కి లేఖ రాశారు. ఈ విషయం తెలిసిన ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. 2008 నుంచి తాము సేవలందిస్తున్నామని, ప్రస్తుతం ఏ జిల్లాలోనూ లేనివిధంగా తమను తొలగించాలను కోవడం దారుణమని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఖాళీలను భర్తీచేసి ఆయుష్‌ను బలోపేతం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎంపీ సీతారామలక్ష్మికి వినతి పత్రం ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తమను ఇప్పుడు తొలగించడం దారుణమని, తమను కొనసాగిం చేలా చూడాలని ఆయుష్ ఉద్యోగులు రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు జీఎన్బీ ప్రసాద్(పాలకోడేరు), సుజన(లంకలకోడేరు), కాంపౌండర్లు బి.రమేష్ వర్మ(పాలకోడేరు), ఎన్.ఆంజనేయులు(మంచిలి), సత్యనారాయణ(లంకలకోడేరు), స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ వి.హైమావతి(మంచిలి), చంద్రశేఖర్ ఉన్నారు. ఆయుష్ కమిషనర్ నుంచి ఆదేశాలు వస్తేనే తొలగిస్తాం ఆయుష్ ఉద్యోగులను తొలగించమని ఇన్చార్జి డీఎంహెచ్‌వో నుంచి లేఖ రావడం వాస్తవమేనని ఆయుష్ ఆర్డీడీ వి.వీరభద్రరావు వివరణ ఇచ్చారు. అయితే ఆయుష్ కమిషనర్ గాని, ఎన్ఆర్హెచ్ఎం డెరైక్టర్ గాని ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తమ శాఖలో 44 డిస్పెన్సరీలకు గానూ 5గురు మాత్రమే వైద్యులు ఉన్నారని, 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన జరిగినందున త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తామని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ఆయుష్ ఉద్యోగుల తొలగింపు విషయమై ఇన్చార్జి డీఎంహెచ్‌వోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. -
బాలీవుడ్ నటిని రెండు గంటలపాటు ...
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి రిచా చద్దాను ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతాధికారులు, ఆధికారులు నిలిపివేసి ప్రశ్నించారు. రిచా చద్దా బ్యాగ్ లో ఉన్న వస్తువుపై అనుమానం తలెత్తడంతో అధికారులు సోదా చేశారు. రిచా చద్దా చర్మ సౌందర్యానికి ఉపయోగించే వస్తువులలో ఓ పౌడర్ పై అధికారులకు అనుమానం కలిగింది. చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు గత ఆరు నెలలుగా సాంప్రదాయ పద్దతిలో ఆయుర్వేద పౌడర్ ఉపయోగిస్తున్నట్టు రిచా చద్దా అధికారులకు వెల్లడించారు. ఆయుర్వేద పౌడర్ చెప్పినా అధికారులకు నమ్మకం కలగపోవడంతో తనను రెండు గంటలపాటు ప్రశ్నించారని రిచా చద్దా మీడియాకు వెల్లడించారు. ఆయుర్వేద వస్తువులపై నాకు నమ్మకం చాలా ఎక్కవ. ముంబైకి ఆయుర్వేద వస్తువులు తీసుకెళ్లడం అలవాటు. ఈసారి మాత్రమే సమస్యగా మారింది అని రిచా చద్దా అన్నారు. తన వెంట ఉన్న ఆయుర్వేద వస్తువులను ఓపెన్ చేసి భద్రతాధికారులు తనిఖీ చేయడం ఇష్టం లేదని.. వాటిని నిలువ చేయడం చాలా కష్టపనైనందున తాను తొలుత నిరాకరించానని.. రెండు గంటలపాటు అధికారులను ఒప్పించడానికి శ్రమించినా.. ఉపయోగం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తనిఖీలకు అంగీకరించానని రిచా చద్దా అన్నారు. 'గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్', 'ఓయే లక్కి! లక్కి ఓయే' అనే చిత్రాల్లో రిచా చద్దా నటించింది. -
ఆయుర్వేదంతో రోగాలు నయం
కురబలకోట: ఆయుర్వేదం అపర సంజీవని లాంటిదని, ఎలాంటి మొండి రోగాల్నయినా బాగు చేయవచ్చని అంతర్జాతీయ ఆయుర్వేద డాక్టర్, శ్రీమహర్శి మహేష్ యోగి ఆయుర్వేద న్యూఢిల్లీ ఆస్పత్రి డెరైక్టర్ రాజు అన్నారు. కురబలకోట మండలం అంగళ్లు దగ్గరున్న మల్లయ్య కొండను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఆయుర్వేదంపై ప్రపంచ దేశాల్లో తిరిగానన్నారు. ఆయుర్వేదంతో ఎలాంటి జబ్బునయినా నయం చేయవచ్చన్నారు. క్యాన్సర్, ఎయిడ్స్ నియంత్రణ, చర్మవ్యాధులు, అధిక బరువు, షుగర్, పోలియో, కీళ్ల నొప్పులు, గుండెజబ్బులు, మూత్ర పిండాలు, సంతానలేమి, కంటి జబ్బులు తదితర వ్యాధులకు వైద్యం చేయవచ్చన్నారు. ఆయుర్వేదానికి మదనపల్లె వాతావరణం అనువుగా ఉందని ఆయన తెలిపారు. దీనిని ఆంగ్లేయులు గుర్తించి ఆరోగ్యవరాన్ని (శానిటోరియం) ఏర్పాటు చేశారన్నారు. త్వరలో మదనపల్లెలోని శ్రీమహర్శి మహేష్ యోగి ధ్యాన మం దిరంలో ఆయుర్వేద వైద్య సేవలు అందుబాటులోకి తేనున్నామన్నారు. మందులను కూడా అందజేస్తామన్నారు. అంగళ్లు మల్లయ్యకొండపై ఆయుర్వేద ఔషధవనాన్ని ఏర్పాటు చే స్తున్నామన్నారు. అలాగే మదనపల్లెలో ఆయుర్వేద కళాశాలను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఆయన వెంట హైదరాబాదు ఆయర్వేద హాస్పిటల్ నిపుణులు రాజు, దేవరబురుజు రమణరెడ్డి, కరక్కాయల రంగన్న, మల్లయ్య కొండ చైర్మన్ కాకర్ల కృష్ణమూర్తి, రియల్టర్ రంగనాథం తదితరులు పాల్గొన్నారు. -
మఠాల జోలికొస్తే మటాష్
మైసూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో మఠాల జొలికొచ్చే ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు ఇంటికి పంపిస్తారని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ హెచ్చరించారు. ఇక్కడి జేఎస్ఎస్ ఆయుర్వేద ఆస్పత్రి, జేఎస్ఎస్ ఆస్పత్రి ప్రసూతి కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉంటాయని, వాటిని వదిలి మఠాలకు జోలికి రావడం సరికాదని హితవు పలికారు. విద్య, వైద్య రంగాల్లో మఠాలు అందిస్తున్న సేవలు ప్రభుత్వాలకు మార్గదర్శకం కావాలన్నారు. పురాతన వైద్య విధానాల్లో ఒకటైన ఆయుర్వేదం అంతర్థానమవుతుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలోపతి వల్ల దేహమంతా రసాయనాలతో నిండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంస్కృతిని కాపాడడానికి మఠాలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. జాతరకు జనమే జనం సుత్తూరు మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతరకు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. యువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. జాతర అంటే కేవలం పూజా పురస్కారాలు మాత్రమే కాదని, ఆట పాటలు కూడానని ఈ సందర్భంగా పలువురు స్వామీజీలు పేర్కొన్నారు. ఆరు రోజుల పాటు జరిగే జాతర జయప్రదం కావాలంటే, దాని వెనుక ఎంతటి శ్రమ ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ జాతర మహోత్సవం అంతర్జాతీయ స్థాయిలో మన సంస్కృతిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. కాగా జాతరలో ఓ ఏనుగు కాసేపు అలజడి సృష్టించింది. మావటీ నియంత్రణ నుంచి తప్పించుకుని అటు ఇటు తిరుగుతూ ఆందోళనను కలిగించింది. అయితే ఎవరి పైకి దాడికి దిగకుండా తనదైన శైలిలో కలకలం రేపింది. -
ఆయు..ష్
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్ : జిల్లాలోని ఆయుష్ వైద్యశాలల పరిస్థితి దయనీయంగా మారుతోంది. భారతీయ పురాతన వైద్యమైన ఆయుర్వేదం, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయనే నమ్మకం ఉన్న హోమియో, యునాని, ప్రకృతిసిద్ధంగా చికిత్సనందించే నేచురోపతి కేంద్రాలకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వైద్యులు, సిబ్బంది తగినంతమంది లేకపోవడం.. మందుల కొరత వేధిస్తుండడంతో ప్రజలకు సరైన సేవలు అందడం లేదు. అన్ని రకాల వైద్యసేవలనూ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో 2007లో ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా జిల్లాలో ప్రస్తుతం 44 ఆయుర్వేద, 17 యునాని, 25 హోమియో, 3 నేచురోపతి(ప్రకృతివైద్యం) కలిపి మొత్తం 89 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రధానంగా ఆయుర్వేద డిస్పెన్సరీల్లో 22 రెగ్యులర్, 22 ఎన్ఆర్హెచ్ఎం కింద పనిచేస్తున్నాయి. ప్రతి డిస్పెన్సరికీ ఓ మెడికల్ ఆఫీసర్, కాంపౌండ్, స్వీపర్/స్కావెంజర్ పోస్టులు మంజూరు చేశారు. ప్రస్తుతం రామదుర్గం డిస్పెన్సరీలో ఎవ్వరూ లేకపోవడంతో మూతపడింది. జలదుర్గం, బదినేహాలు, హాలహర్వి(రెగ్యులర్), కోడుమూరు, మద్దూర్, ఓర్వకల్లు, పెద్దకడబూరు, యాళ్లూరు, ఆళ్లగడ్డ, హర్దగేరి, దైవందిన్నె, గోస్పాడు, కలుదేవకుంట్ల, పగిడిరాయి, డబ్ల్యు. కొత్తపల్లి, గోకవరం, కొత్తబురుజు, పత్తికొండ(ఎన్ఆర్హెచ్ఎం)లలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని చోట్ల అల్లోపతి వైద్యులకు ఆయుష్ వైద్యులు అసిస్టెంట్లుగా పనిచేయాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల ఆయుష్ విభాగం వైద్యులే సేవలందిస్తున్నారు. వేధిస్తున్న మందుల కొరత ప్రతి డిస్పెన్సరికీ ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేల విలువజేసే మందులను సరఫరా చేస్తోంది. ఈ మందులు కొన్నిచోట్ల మిగిలిపోగా, కర్నూలు, నం ద్యాల, ఆదోని తదితర ప్రాంతాల్లో చాలడం లేదు. పంపిణీ చేసిన చోట కూడా సరిపోయినన్ని ఇవ్వ డం లేదు. దగ్గు, జ్వరం, జలుబు, ఒంటి నొప్పు లు, గ్యాస్టైటీస్, హేమారైడ్స్, పైల్స్, కిడ్నీలో రాళ్లు, చర్మ వ్యాధులు, నుసిపురుగులు తదితర 30 రకాల జబ్బులకుగాను 20 రకాల జబ్బులకు సం బంధించిన మందులే సరఫరా అవుతున్నాయి. ఆయుష్ ఆసుపత్రుల్లో ఇదీ పరిస్థితి ఆదోనిలో ముగ్గురు వైద్యులకు గాను సోమవారం ఇద్దరు గైర్హాజరయ్యారు. జూనియర్ మెడికల్ ఆఫీసర్ షబానా డ్యూటీకి హాజరై సేవలందించారు. ఆదోని యునాని ఆస్పత్రిలో మందుల కొరత వేధిస్తోంది. పది పడకల ఆస్పత్రి అయినప్పటకీ రెండు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగిలిన 8 మంచాలు స్టోర్ రూంలో తుప్పుపట్టి పోతున్నాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్ పో స్టు ఖాళీగా ఉంది. కాంపౌడర్, స్వీఫర్ ఉన్నారు. అహోబిలంలో ఉన్న ఆయుర్వేద ఆసుపత్రిలో వైద్యుడు లేరు. మందులు నిలువ ఉంచడానికి గదికూడా లేదు. రుద్రవరం మండలంలోని ఆలమూరు వైద్యురాలు సెలవుపై వెళ్లడంతో ముత్యాలపాడు డాక్టర్‌ను ఇన్చార్జ్గా నియమించారు. వారంలో ఒక్క రోజు మాత్రమే చుట్టపుచూపుగా వచ్చి పోతుంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముత్యాలపాడులో డాక్టర్, మందులు ఉన్నా ఆసుపత్రిని గదుల కొరత వేధిస్తోంది. హాలహర్వి మండల పీహెచ్ కేంద్రంలో పనిచేస్తున్న వైద్యుడు రామకృష్ణారావు విరమణ పొంది మూడేళ్లు పూరైయింది. అప్పుడు వేసిన తాళం ఇప్పటి వరకు తెరవలేదు. అర్ధగేరి గ్రామంలో ఉన్న కేంద్రంలో కాంట్రాక్టు కింద పనిచేస్తున్న అటెండర్ గణేష్, జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి వచ్చిన రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. దేవనకొండలో డాక్టర్ రమణారెడ్డి వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో ప్రజలు ఎవ్వరూ వెళ్లడం లేదు. ఆస్పరిలో యునాని ఆసుపత్రికి వేసిన తాళాలు ఎప్పుడూ తీయడం లేదు. కొంతకాలం వేచి చూసిన ప్రజలు చివరికి అటువైపు వెళ్లడమే మానేశారు. ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు ఆయుర్వేద వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. బనగానపల్లెలోని 10 పడకల ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి కూలేందుకు సిద్ధంగా ఉంది. గోస్పాడు పీహెచ్సీలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద డిస్పెన్సరీలో రెండేళ్లుగా వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉంది. కోడుమూరు ఆరోగ్య కేంద్రంలో ఆయుర్వేద ఆసుపత్రిని చిన్న గదిలో ఏర్పాటు చేశారు. ఏడాది కాలంగా వైద్యుడు లేక పోవడంతో కాంపౌండరే రోగులకు మందులను పంపిణీ చేస్తున్నాడు. సి.బెళగల్ మండలంలోని సి.బెళగల్, పొలకల్లు గ్రామాల్లో ఆయుర్వేద ఆసుపత్రులున్నాయి. .బెళగల్, పోలకల్ వైద్యాధికారులు వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. మందులు లేక పోవడం వల్ల రోగుల సంఖ్య తగ్గి పోయింది. మద్దికెర ప్రభుత్వ వైద్యశాలలోనే యునాని ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో 90 రకాల మందులు అందజేయాల్సి ఉంది. అయితే రెండు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తుగ్గలి మండలంలోని పగిడిరాయి కేంద్రంలో వైద్యులు లేనందుకు కేంద్రం మూతపడింది. ఉన్న అటెండర్ ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. పత్తికొండ పట్టణంలో ఆయుర్వేద కేంద్రం ఏర్పాటు చేసినా వైద్యున్ని నియమించడం మరిచారు. ఇక్కడ కాంపౌండర్‌గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణమ్మనే వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు. ఓర్వకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యురాలు డాక్టర్ సుభద్రమ్మ ఏడాదిన్నర క్రితం సంజామల పీహెచ్‌సీకి బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఆ పోస్టును భర్తీ చేయలేదు. దీంతో కాంపౌండరే వైద్యురాలిగా సేవలు అందించాల్సి వస్తోంది. -
వయసు పైబడినవారు ఆరోగ్యం కాపాడుకోవాలంటే...
నా వయసు 40. ప్రస్తుతం నాకేమీ ఆరోగ్య సమస్యలు లేవు. సాధారణంగా వయసు పైబడినవారికి... అంటే 50 ఏళ్లు దాటిన వారికి ముడుకుల నొప్పులు, ఇతర కీళ్లనొప్పులు వస్తుంటాయి కదా. వాటికి నివారణ మార్గాలున్నాయా? దయచేసి ఆయుర్వేద సూత్రాలు తెలియజేయండి. - వి. అవధాని, విశాఖపట్నం మీ ప్రశ్నను బట్టి మీకు ఆరోగ్యరక్షణకు సంబంధించి అవగాహన, సమస్యల నివారణ పట్ల ఆసక్తి, శ్రద్ధ, ముందుజాగ్రత్త ఉన్నాయని అర్థమవుతోంది. ఇలాంటి స్పృహ సమాజంలో అందరు పౌరులకు ఉంటే ఎంతో బాగుంటుంది. వయసురీత్యా ‘శైశవ, కౌమార, యౌవన, వార్థక్య’ దశలను ఆయుర్వేదం విపులీకరించింది. ‘జారా’ అంటే ముసలితనం అని అర్థం. వార్థక్యం ఒక రోగం కాదనీ, ఇది కేవలం ధాతు శైథిల్యం కలిగే ఒక అవస్థ మాత్రమేననీ, అప్పటి ఆరోగ్యం కాపాడుకోవటానికి ఆహార, విహార, రసాయన ఔషధాలను వివరిస్తూ ‘జరాచికిత్స’ను ప్రత్యేక విభాగంగా పేర్కొంది. మీరు ప్రస్తావించిన కీళ్లనొప్పులను ‘సంధివాతం’గా అభివర్ణించింది ఆయుర్వేదం. రస, రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జా, శుక్రాలు సప్తధాతువులు. వీటిలో ఏది క్షీణించినా వాతప్రకోపం జరుగుతుంది. కీళ్లనొప్పులు ‘అస్థి’ (ఎముకలు) ధాతు క్షయానికి సంబంధించింది. వాస్తవానికి వార్థక్యంలో ఆరోగ్యం బాగుండాలంటే చిన్ననాటి నుంచి కూడా ఆహార, విహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమశిక్షణను ఏ వయసులో ప్రారంభించినప్పటికీ ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. వయస్థాపకం, ఆయుఃవృద్ధి సిద్ధిస్తాయి. ఓజస్సు, క్షమత్వం పెరుగుతాయి. చక్కటి స్వరం, మేధాశక్తి సమకూరుతాయి. పంచజ్ఞానేంద్రియాలూ సమర్థంగా పనిచేస్తాయి. మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఆహారం ‘మితాహారం’ ఆయుర్వేద సూత్రాలలో అగ్రస్థానం వహిస్తుంది. దీనికి ప్రత్యేక పరిమాణాలుండవు. వయసునుబట్టి, జీర్ణశక్తిని బట్టి, రుతువును బట్టి, వృత్తిని బట్టి ఈ ప్రమాణం వ్యక్తి వ్యక్తికీ మారుతుంటుంది. తగురీతిలో వ్యాయామం చేయటమనేది, మితాహారంతో చెప్పిన మరో సమాంతర సూత్రం. షడ్రసాలలోనూ ‘లవణం’ (ఉప్పు) చాలా తక్కువగా వాడాలని ఆయుర్వేదం ప్రస్తావించింది. మొలకలు, తృణధాన్యాలు తింటే ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ముడిబియ్యం, గోధుమ శరీరానికి బలం కలిగించే పౌష్ఠికాహారం. శాకాహారం, సాత్వికాహారం ఆయుఃవర్థకం. నువ్వులపప్పులో లభించే కాల్షియం, అంతర్లీనంగా ఉండే తిలతైలం అమూల్యమైనవని గ్రహించాలి. శుష్కఫలాలు తక్కువ పరిమాణంలో తినటం ఉత్తమం. అరటిదూట, బూడిదగుమ్మడి, తియ్యగుమ్మడి శాకాలు మంచివి. తాజాఫలాలలో జామ, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి శ్రేష్ఠం. తగినంత ద్రవాహారం సేవించాలి. ఆవుపాలు, ఆవుమజ్జిగ ఉత్తమం. పులుపు, కారం తగ్గించి, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. విహారం: ప్రతినిత్యం నియమితవేళల్లో వ్యాయామం చేయాలి. రాత్రిపూట కనీసం ఆరుగంటల నిద్ర (విశ్రాంతి) అవసరం. రెండుపూటలా ప్రాణాయామం, ధ్యానం చేస్తే మానసిక ఆరోగ్యం బాగా వృద్ధి చెంది ఒత్తిడి, ఆందోళన దరిచేరవు. మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లను దూరంగా ఉంచాలి. ఆశావహ దృక్పథం, ఆత్మస్థైర్యం అలవరచుకోవాలి. ఉదయం పూట పదినిమిషాలు ఎండలో నిలబడండి. జరాచికిత్సలో ఉత్తమ రసాయనాలు: త్రిఫలాచూర్ణం : రోజూ రాత్రి ఒక చెంచా చూర్ణాన్ని నీళ్లతో సేవించాలి. ఇది మృదు విరేచనకారి. కంటికి, గుండెకు, ఊపిరితిత్తులకు క్రియాసామర్థ్యాన్ని పెంచుతుంది. సప్తధాతువులకు హితకారి, సర్వరోగ నివారకం. అశ్వగంధారిష్ట: నాలుగు చెంచాలు (నీళ్లతో) రెండుపూటలా; నరాల బలహీనత పోగొట్టి, మానసిక ఒత్తిడిని జయిస్తుంది. కీళ్లనొప్పులను దూరం చేస్తుంది. దీనితో బాటు ‘సారస్వతారిష్ట’ కూడా కలిపితే చక్కటి నిద్రాజనకంగా పనిచేస్తుంది. అగస్త్యహరీతకీ రసాయనం (లేహ్యం): ఒక్కొక్క చెంచా, రెండుపూటలా; ధాతుపుష్టికరమే కాకుండా, ప్రత్యేకించి ఊపిరితిత్తుల వ్యాధులకు దివ్యౌషధం. చంద్రప్రభావటి (మాత్రలు): ఉదయం - 2, రాత్రి - 2; మూత్రవహ సంస్థాన సంబంధిత రోగాలన్నింటినీ జయిస్తుంది. ‘బలాతైలం’తో శరీర మర్దన, కీళ్లకు మర్దన చేసుకుంటే శరీర సౌష్ఠవం పెరుగుతుంది. గమనిక: ప్రస్తుతం విస్తరిస్తున్న అవ్యవస్థ జీవనశైలి; పప్పులు, నూనెలు, పండ్లు, పాలవంటి ఆహార పదార్థాలలో జరుగుతున్న కల్తీ, వాతావరణ కాలుష్యం అందరి ఆరోగ్యానికి విచ్ఛిన్నకారకమని గుర్తుంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంతావశ్యకం. నా వయసు 76. మలబద్దకానికి ‘త్రిఫల చూర్ణం’ వాడవచ్చా? దయచేసి తెలపండి. - అంజయ్య, మెదక్ కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను కలిసి ‘త్రిఫలాలు’ అంటారు. వాటిని ఎండబెట్టి, విడివిడిగా పొడిచేసి, సమానంగా కలుపుకుంటే చక్కటి ‘త్రిఫలచూర్ణం’ తయారవుతుంది. ప్రతిరోజూ రాత్రి ఒక చెంచాచూర్ణాన్ని నీటితో తాగండి. కేవలం మలబద్దకానికే కాదు... గుండెకు, కంటికి, చర్మానికి, మెదడుకు, మూత్రపిండాలకు... ఇలా అన్ని భాగాలకూ చక్కటి రసాయనంగా పనిచేసి, పుష్టినిస్తుంది. ఈ చూర్ణాన్ని ఎంతకాలమైనా వాడుకోవచ్చు. నా వయసు 30. నాకు హైడ్రోసిల్ ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఆయుర్వేద మందులు వాడితే ఇది తగ్గిపోతుందా? తెలియజేయగలరు. ఆర్. జానకిరామ్, హైదరాబాద్ ఇది పరిమాణంలో పెద్దగా అయిన పక్షంలో మందులు పనిచేయవు. సుశ్రుతాచార్యులు కూడా ఇలాంటి సందర్భాల్లో శస్త్రకర్మ (సర్జరీ)నే సూచించారు. అయితే నాటు వెద్యుల మాటలకు మోసపోవద్దు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమాయూన్ నగర్, హైదరాబాద్ -
గుండెపోటు వంశపారంపర్యమా...?
నా వయసు 44 ఏళ్లు. మా నాన్నగారు తన 58వ ఏట హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. ఇది వంశపారంపర్యంగా వస్తుందా? రాకుండా నివారించాలంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం జాగ్రత్తలేమిటి? - ఎమ్. కేశవరావు, విశాఖపట్నం గుండె ఒక ప్రత్యేక కండరంతో తయారైన అవయవం. దీని పని నిరంతరం సంకోచిస్తుండటం, వ్యాకోచిస్తుండటం. సంకోచించినప్పుడు మొత్తం శరీరానికి రక్తం సరఫరా అవుతుంది. వ్యాకోచించినప్పుడు మొత్తం శరీరం నుంచి రక్తం గుండెకు చేరుతుంది. స్థూలంగా ఇదీ దీని పని. శరీరంలో ప్రతి చిన్న కణానికీ, ప్రతి కండరానికీ, ప్రతి అవయవానికీ రక్తం సరఫరా అయినప్పుడే అవి జీవిస్తాయి. వాటివాటి పనులను సక్రమంగా నిర్వహిస్తాయి. ఈ సూత్రం గుండెకండరానికి కూడా వర్తిస్తుంది. రక్తసరఫరా నిమిత్తం గుండె నుంచి ఒక పెద్ద సైజు ధమని బయటకు వస్తుంది. దీనికున్న మొట్టమొదటి శాఖలే కొరొనరీ ధమనులు అనే రక్తనాళాలు. వీటి ద్వారా గుండె కండరానికి రక్తం అందుతుంది. ఇక్కడ విశేషమేమిటంటే... గుండె గదుల్లో ఉన్న శుద్ధ రక్తం ఫిల్టరేషన్ (మెల్లగా పీల్చుకోవడం) ప్రక్రియ ద్వారా గుండె కండరానికి అందే పద్ధతి లేదు. ఇదే సృష్టి విచిత్రం. అలాగకానీ ఉంటే మానవాళికి హార్ట్ ఎటాక్‌లు వచ్చేవే కాదు. పైన వివరించిన కొరొనరీ ధమనుల్లో రక్తప్రసరణకు అవరోధం కలిగినప్పుడు, గుండెకండరాలకి అందే రక్తం తగ్గిపోవడం జరుగుతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల ఈ అవరోధం ఏర్పడుతుంది. ఈ రక్తపు గడ్డల పరిమాణాన్ని బట్టి ఎటాక్ తీవ్రత ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు ఈ కొరొనరీ ధమనుల్లో గల సూక్ష్మాతిసూక్ష్మ శాఖల ద్వారా ‘బైపాస్’ ప్రసరణ చేసుకోగల శక్తి కొంతవరకు శరీరానికి ఉంటుంది. ఇదీ సృష్టి ప్రసాదించిన సహజ ప్రక్రియే. సర్జన్లు బైపాస్ సర్జరీ చేసినప్పుడు సత్ఫలితం కనిపిస్తుంది. కానీ ఇది సంపూర్ణంగా విజయవంతమవ్వాలంటే, శరీరానికి ఉన్న స్వతస్సిద్ధమైన బైపాస్ ప్రసరణ సమర్థతను బట్టే ఆధారపడి ఉంటుందని కొన్ని సిద్ధాంతాలు శాస్త్రీయ ఆధారాలు చూపిస్తున్నాయి. రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఆహారంలో అతిగా కొవ్వుపదార్థాలు తింటే, అవి సంపూర్ణంగా ధాతు పరిణామం కాకపోవడం వల్ల రక్తనాళాలలో పేరుకుపోయి అవరోధం కలిగిస్తాయి. రక్తం గడ్డ కట్టడానికి దారితీస్తాయి. అనూహ్యంగా భయభ్రాంతులకు గురికావడం; ఒక్కసారిగా కానీ క్రమక్రమంగా గాని మానసిక ఒత్తిడులకు గురికావడం; ధూమపాన, మద్యపానాల వంటి మత్తుపదార్థాల దుష్ర్పభావాలు; స్థూలకాయం; మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులలో ఉపద్రవంగా కూడా గుండెపోటు సంభవించవచ్చు. అయితే చాలా తక్కువ శాతంలో మాత్రమే వారసత్వంగా గుండెపోటు కనిపిస్తుంది. కాబట్టి మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నివారణ: పైన చెప్పిన కారణాలను దూరం చేసుకోవడం ప్రధానాంశం. ఆహారం: ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి. నూనెలు, వేపుళ్లు, వెన్న, నెయ్యి, ఇతర మధురపదార్థాలు, ఐస్‌క్రీమ్‌లు, శీతలపానీయాలు, జంక్ఫుడ్స్ పూర్తిగా వదిలేయాలి. ఆయుర్వేద సిద్ధాంతాలరీత్యా తగు ప్రమాణాల్లో నువ్వులనూనె, ఆవునెయ్యి వాడటం వల్ల శరీరానికి కొంతమేలు జరుగుతుందే తప్ప హాని ఉండదు. పీచు పదార్థాలున్న ఆహారం, మొలకలు, గ్రీన్ సలాడ్సు బాగా తీసుకోవాలి. శుష్కంగా ఉండే ఫలాలు మితంగా తినాలి. శాకాహారం, సాత్వికాహారం మంచి ప్రభావం చూపిస్తాయి. విహారం: ఎవరి తత్వాన్ని బట్టి వారికి తగినంత ‘వ్యాయామం’ చేయటం అత్యావశ్యకం. నడక, ఆటలు, యోగాసనాలు మొదలైనవన్నీ వ్యాయామంలో అంతర్భాగాలే. రాత్రిపూట నిద్ర కనీసం ఆరుగంటలపాటు అవసరం. రెండుపూటలా పదేసి నిమిషాలపాటు ప్రాణాయామం చేయాలి. ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా, నవ్వుతూ, ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో, సానుకూల దృక్పథంతో ఉండటం అలవరచుకోవాలి. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడి, ఒత్తిడులను దూరం చేస్తుంది. ఔషధం: రోజూ ఉదయం పరగడుపున ‘అల్లం మరియు వెల్లుల్లి’ కషాయం ఆరు చెంచాల మోతాదులో తాగాలి. వారానికి మూడుసార్లు, సాయంత్రం పూట ‘తిప్పతీగె’ (గుడూచి) కషాయం కూడా తాగితే మంచిది. ప్రతిరోజూ రాత్రి పడుకునేటప్పుడు ఒక చెంచా త్రిఫలచూర్ణం (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ) నీళ్లతో సేవించాలి. గమనిక: ఈ సూచనలు పాటిస్తే హార్ట్ఎటాక్ మాత్రమే కాకుండా పక్షవాతం (బ్రెయిన్‌స్ట్రోక్) కూడా నివారితమవుతుంది. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అప్పుడప్పుడూ మీకు నచ్చిన కొవ్వుపదార్థాలు, మధురపదార్థాలు తిన్నా పర్వాలేదు. కానీ దానికి విరుగుడుగా మూడు కిలోమీటర్లు నడవండి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమాయూన్ నగర్, హైదరాబాద్ -
మడమ నొప్పి తగ్గాలంటే...?
నా వయసు 63. గత నాలుగు నెలలుగా ఎడమకాలు మడమ దగ్గర బాగా నొప్పిగా ఉంది. పడుకుని లేచేటప్పుడు పాదం నేల మీద మోపాలంటే భయం. విపరీతమైన నొప్పిగా ఉంటోంది. ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు. దీనికి సరైన పరిష్కారం చెప్పగలరు. - హనుమాయమ్మ, కర్నూలు ఈ సమస్యను ఆయుర్వేదంలో ‘పార్ష్ణిశూల’గా వివరించారు. ఇది వాతరోగాలలో ఒకటి. నాడీమండలానికి సంబంధించి, శరీరంలోని చివరి భాగాలకు చేరే నరాల అంతిమ శాఖల బలహీనత వల్ల ఈ నొప్పి వస్తుంది. అక్కడి నరాలు కొంచెం వాచడం కూడా సంభవించవచ్చు. దీనికి తోడు మీకు రక్తహీనత కూడా ఉంటే ముందు రక్తవృద్ధికి బలకరమైన ఆహారం తీసుకోండి. ఆకుకూరలు, బొప్పాయి, దానిమ్మ వంటి తాజాఫలాలు, ఖర్జూరం బాగా తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది. మధమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు గాని ఉంటే వాటిని కూడా అదుపులోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ కింద వివరించిన సూచనలు పాటిస్తే ఒక నెలలో మీ ‘మడమ శూల’ నయమవుతుంది. ఆహారం: తాజాఫలాలు, శుష్కఫలాలు, ఆకుకూరలు మంచి ఆహారం. ముడిబియ్యంతో వండిన అన్నం చాలా ప్రయోజనకరం. రెండుపూటలా మూడేసి చెంచాల ‘నువ్వుల పప్పు’ నమిలి తినండి. అదేవిధంగా మినపపప్పుతో చేసిన ఇడ్లీ వంటి అల్పాహారాలు కూడా నరాల శక్తికి బాగా ఉపకరిస్తాయి. వంటకాలలో కేవలం నువ్వుల నూనెనే వాడండి. ఆవుపాలు, ఆవుమజ్జిగ ఉత్తమం. బయటి ఆహారాల జోలికిపోవద్దు. మాంసరసం, కోడిగుడ్లు కూడా మంచిది. విహారం: నొప్పి తగ్గేంతవరకూ ఆ మడమకు ఎంతో కొంత విశ్రాంతి అవసరం. మోటగించి నడవటం, వ్యాయామాలు చేయడం మంచిది కాదు. రెండుపూటలా ప్రాణాయామం చేయండి. మందులు: బృహత్వాత చింతామణిరస (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 (ఒక పదిరోజులు మాత్రమే). మహాయోగరాజ గుగ్గులు (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 అశ్వగాంధారిష్ట (ద్రావకం): మూడుపూటలా - నాలుగేసి చెంచాలు - నీటితో స్థానిక బాహ్యచికిత్స: మహానారాయణ తైలం, పిండతైలాలను రెండేసి చెంచాలు ఒక పాత్రలో కలుపుకొని, స్వల్పంగా వేడి చేసి మడమచుట్టూ మృదువుగా మర్దన చేయాలి. అనంతరం వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. దీనికోసం మరిగిస్తున్న నీళ్లలో ‘వావిలి ఆకులు’ వేస్తే, ఫలితం ఇంకా శీఘ్రతరమవుతుంది. ఇది రోజూ రెండుపూటలా చేస్తే మంచిది. నా వయసు 44. గత రెండు నెలల నుంచి పాదాల వేళ్ల మధ్య దురద, నీరు కారడం, మంట, నొప్పి ఉంటున్నాయి. ఇవి తగ్గడానికి మంచి మందులు చెప్పండి. - శ్రీదేవి, వరంగల్ వీలున్నంత వరకు పాదాలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచవద్దు. అనివార్యమైతే ఎప్పటికప్పుడు పొడిగా, శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి. కల్తీ లేని పసుపుపొడిని వేళ్ల మధ్య అద్దుతుండాలి. మహామరిచాదితైలం: రాత్రిపూట వేళ్ల మధ్యభాగాల్ని పొడిగా శుభ్రం చేసి, ఈ తైలాన్ని పూయాలి. (ఇది పైపూతకు మాత్రమే). గంధక రసాయన (మాత్రలు): ఉదయం 2, రాత్రి 2 పరగడుపున పాలతో సేవించాలి. ఇలా ఒక నెల వాడితే బాధ నయమవుతుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
పక్షవాతాన్ని ఎలా తగ్గించవచ్చు?
మా నాన్నగారి వయసు 73 ఏళ్లు. గత ఆరునెలలుగా పక్షవాతంతో (కుడివైపున) బాధపడుతున్నారు. మాట కూడా అస్పష్టంగానే ఉంది. డాక్టర్లు ఫిజియోథెరపీ చేయమని సలహా ఇచ్చారు. దీనికి ఆయుర్వేద చికిత్స తెలియజేయగలరు. నా వయసు 51 సంవత్సరాలు. ఇది వారసత్వంగా వస్తుందా? నివారణ మార్గాలను కూడా తెలియజేయండి. - ఐ. కిశోర్‌కుమార్, బెంగళూరు అందరూ పక్షవాతంగా వ్యవహరించే ఈ వ్యాధిని ఆయుర్వేదంలో ‘పక్షాఘాతం’ లేదా ‘పక్షవధ’ అనే పేర్లతో వర్ణించారు. ఆయుర్వేద సూత్రాలైన వాత, పిత్త, కఫాలలో... ఇది వాత ప్రధానమైన వ్యాధి కనుకనే వ్యావహారికంగా పక్షవాతం అంటారు. మొత్తం శరీర భాగాల్ని కుడి, ఎడమలుగా మనం విభజిస్తుంటాం. అవే వామపక్షం, దక్షిణపక్షం. ‘ఘాత, ఆఘాత, వధ’ శబ్దాలకు దారుణంగా కొట్టటం, చచ్చుబడటం లనే అర్థాలున్నాయి. సాధారణంగా ఈ వ్యాధి శరీరంలో ఒక పక్షానికి వస్తుంది కాబట్టి పక్షాఘాతం లేదా పక్షవధం అనే జబ్బుగా గుర్తించారు. ఇదే ఒక్క అంగానికి (కాలు లేక చెయ్యి) వస్తే ఏకాంగవాతమని, మొత్తం శరీరానికి వస్తే సర్వాంగవాతమనీ పేర్లు మారుతుంటాయి. వాతప్రకోపకర అంశాలను కట్టడి చేయకపోతే ఈ వ్యాధి కలుగుతుంది. అధికరక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు, శక్తికి మించిన శ్రమ, ప్రమాదవశాత్తు దెబ్బలు తగలటం, క్షమత్వం తగ్గి శరీరం శుష్కించిపోవటం, మితిమీరిన ఉపవాసాలు, స్థౌల్యరోగం, ధూమపాన, మద్యపానాల వంటి మాదకద్రవ్యసేవన, అధిక మానసిక ఒత్తిడి మొదలగునవన్నీ వాత ప్రకోపకారకాలు. కాబట్టి, వాటిపై నియంత్రణ కావాలని గుర్తుంచుకోండి. అప్పుడప్పుడు వారసత్వం కూడా కారణంగా కన్పించినా, పైన చెప్పిన కారణాలు; ఆహారవిహారాలపై అవగాహన పెంచుకొని, క్రమశిక్షణ పాటిస్తే ఈ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు. అంటే మెదడుకు సంబంధించి రక్తనాళాలు, నాడీకణాలకు సంబంధించిన రుగ్మతలు, ప్రమాదాలు రాకుండా ఉంటాయి. ఆహారం: తీపి, ఉప్పు, పులుపు తగినంత ప్రమాణంలోనే సేవించాలి. ప్రత్యేకమైన నూనె వంటకాలు, ఊరగాయలు, అధికంగా ఉప్పు సేవించడం వంటివి పూర్తిగా మానేయాలి. ద్రవాహారం బాగా తీసుకోవాలి. పోషక విలువలుండే సహజంగా లభించే ఆహార సేవనం ఆరోగ్యకరం. సమీకృత, మితాహారం అలవాటు చేసుకోవాలి. ఆవుపాలు, ఆవునెయ్యి, నువ్వుల నూనె తగు ప్రమాణాలలో సేవిస్తే ఈ వ్యాధి దూరమవుతుంది. విహారం: వయసుకు, వృత్తికి అనుగుణంగా పరిమితమైన వ్యాయామం (నడక, ఆటలు, యోగాసనాలు మొదలగునవి) చిన్నప్పట్నుంచి పాటిస్తూ జీవితాంతం సాధన చేయడం మంచిది. ప్రాణాయామం అత్యంత ప్రయోజనకరం. ఔషధాలు : బృహత్వాత చింతామణిరస (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 చొప్పున పదిహేను రోజులు మాత్రమే వాడాలి. మహావాతవిధ్వంసినీరస, వాతరాక్షస, వాతగజాంకుశ, వాతకులాంతకరస (మాత్రలు) వంటి మందులలో ఏది ఎంత మోతాదులో ఎంతకాలం అవసరమో ఆయుర్వేద నిపుణులు నిర్ణయిస్తారు. మహారాస్నాది, దశమూల కషాయాలు ఉపయోగకరం. అశ్వగంధ, బలా, శతావరీ చూర్ణాలు కూడా లాభదాయకం. బాహ్యచికిత్స తైలమర్దనం: ‘బలా, ధన్వంతరి, మహామాష, క్షీరబలాతైల’ వంటి వాటిలో దేనితోనైనా ఈ మసాజ్ చేస్తారు. స్వేదకర్మ: వ్యాధిగ్రస్తమైన భాగాలకు మసాజ్ చేసిన పిదప, ప్రత్యేక ఔషధ పదార్థాలను వేడిచేసి, వాటితో స్వేదకర్మ (చెమట పట్టించే ప్రక్రియ) చేస్తారు. వ్యాయామం: కొంత విరామం తర్వాత, ప్రత్యేకమైన ఫిజియోథెరపీలు చేయిస్తారు. పంచకర్మలు వస్తికర్మ: కొన్ని తైలాలను లేదా కషాయాలను మలమార్గం ద్వారా లోనికి ప్రవేశపెట్టే ప్రత్యేక సాంకేతిక ప్రక్రియే ఈ ‘వస్తికర్మ’. వ్యాధి స్వభావాన్ని బట్టి శిరస్సుపై చేస్తే దానిని శిరోవస్తి అంటారు. అలాగే ధారాచికిత్స, సస్యకర్మలను కూడా ఆయుర్వేదంలో వివరించారు. గమనిక: ఈ ప్రక్రియలన్నీ... వ్యాధి చికిత్సకు గాను ఒక పద్ధతిలోనూ, రోగాన్ని నివారించి ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఇంకొక తీరులోనూ ఔషధాలను మారుస్తూ చెయ్యవలసి ఉంటుంది. కేవలం నిపుణుల పర్యవేక్షణలోనే ఇవి జరగాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దగ్గరలోని నిపుణుని సంప్రదించండి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
అల్జైమర్స్‌కు ఆయుర్వేద పరిష్కారాలు..?
మా నాన్నగారి వయసు 68. గత ఆరునెలలుగా మతిమరపు ఎక్కువవుతోంది. డాక్టర్లు పరీక్ష చేసి అల్జైమర్స్ వ్యాధిగా అనుమానిస్తున్నారు. దీనికి ఆయుర్వేదంలో మంచి మందులు, ప్రక్రియలు సూచించ ప్రార్థన. - నరసింహ, మెదక్ శిరస్సు ఎముకల సముదాయాన్ని పుర్రె అంటారు. దాని లోపలి పదార్థాన్ని మెదడు అంటారు. దీనినే ఆయుర్వేద పరిభాషలో కపాలం, మస్తిష్కం అనే పేర్లతో వ్యవహరిస్తారు. మెదడు క్రియలు లేదా కర్మలు అనేకం. అందులో మనోవ్యాపారాలు కూడా ఒకటి. మనసు నిర్వర్తించే ప్రధాన కర్మలు మూడు. అవి ‘ధీ, ధృతి, స్మృతి’. వాస్తవానికి మూడు శక్తులు. మేధాశక్తి, విషయ విజ్ఞానాలను పదిలపరచి భద్రంగా దాచుకునే శక్తి. దాగిన విషయాలను గుర్తుకు తెచ్చుకునే శక్తి. స్మృతి భ్రంశ లేదా స్మృతి నాశ అవస్థల్ని అల్జైమర్స్ వికారంగా సరిపోల్చుకోవచ్చు. మస్తిష్కంలోని కొన్ని కణాల క్రియా శైథిల్యమే ఈ వ్యాధికి సంప్రాప్తి. అనేక శారీరక, మానసిక వ్యాధులతోపాటు, వార్థక్యాన్ని కూడా దీనికి కారణం గా గమనించారు. రసాయనచికిత్సని ఆయుర్వేదం అభివర్ణించింది. రసాయన ద్రవ్యాలు అనేకరకాలు. ఇక్కడ వాడవలసినవి మస్తులుంగ పుష్టికర ఔషధాలు. వీటిన మేధ్య రసాయనాలంటారు. వీటిని వ్యాధిగ్రస్థులేగాక, ఆరోగ్యవంతులు, చిన్నపిల్లలు కూడా అనువైన మోతాదులో అనునిత్యం వాడుకోవచ్చు. దీనివల్ల మనస్సు తేజోవంతంగా, సునిశితంగా పనిచేస్తుంది. ఈ కింది సూచనల్ని, మందుల్ని ఆరునెలలపాటు క్రమం తప్పకండా వాడి ఫలితాన్ని సమీక్షించుకోండి. ఆహారం: శాకాహారం, సాత్వికాహారం, ఆవుపాలు, ఆవునెయ్యి, ఉప్పు, కారం, మసాలాలు మానెయ్యాలి. బాదం, పిస్తా, ద్రాక్ష, దానిమ్మ మంచివి. విహారం: తగినంత విశ్రాంతి, శ్రావ్య సంగీత వాయిద్యాలు, మధురమైన పాటలు ఉపయోగకరం. వీలును బట్టి ప్రాణాయామం మంచిది. మేధ్య రసాయన ద్రవ్యాలు: గోధుమ, ఆవుపాలు, ఆవువెన్న, ఆవునెయ్యి, ఓషధులలో బ్రాహ్మీ (సంబరేణు), మండూకపర్ణి (సరస్వతి), శంఖపుష్పి, అపరాజిత (దిరిశెన) ప్రశస్తమైనవి. మందులు: మహా పంచగవ్య ఘృతం: ఒక చెంచా మందుని నాలుగు చెంచాల ఆవుపాలలో కలిపి, రెండుపూటలా ఏదైనా తినటానికి ముందుగా తాగాలి స్మృతి సాగర రసమాత్రలు ఉదయం 1, రాత్రి 1 తిన్న తర్వాత వాడాలి. సారస్వతారిష్ట ద్రావకం-నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రెండుపూటలా తాగాలి. స్వర్ణబ్రాహ్మి మాత్రలు రోజుకి-1. గమనిక: మేధ్య రసాయన ఓషధులలో ఏవైనా ఒక దాని ఆకుల్ని శుభ్రం చేసి, దంచి, స్వరసం తీసి, మూడు చెంచాల మోతాదుని తేనెతో రెండుపూటలా సేవించాలి. దీనికి ఒక చెంచా ఆమలకీ (ఉసిరికాయ) స్వరసం కలిపితే ఇంకా మంచిది. వసకొమ్ముని నీళ్లతో నూరి, ఆ ముద్దని రెండు చిటికెల (300 మి.గ్రా) తేనెతో వారానికి రెండుసార్లు నాకిస్తే మంచి మేధ్య రసాయనంగా పనిచేస్తుంది. (ఎక్కువైతే అది వాంతికరం) ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ‘ధారాచికిత్స’, మూత్రావస్తి అవసరాన్ని బట్టి అమలుపరిస్తే ఫలితం గణనీయంగా ఉంటుంది. ఇతర వ్యాధుల్ని గమనిస్తే, వాటికి కూడా సరియైన చికిత్స అవసరం. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
ముక్కుపొడుం అలవాటు మానడం ఎలా?
నా వయసు 51. నాకు చిన్నప్పటి నుంచి ‘ముక్కుపొడుం’ పీల్చే అలవాటు ఉంది. రోజూ చాలాసార్లు పీలుస్తుంటాను. ఒక్కరోజు మానేస్తేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల దుష్ఫలితాలుంటాయని మిత్రులు చెబుతున్నారు. ఇది ప్రమాదకరమా? పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉందా? దీని దుష్ర్పభావాల నుంచి కాపాడుకోవడానికి ఆయుర్వేదంలో మందులు సూచింపగలరు. - పేరి జగన్నాథరావు, విశాఖపట్నం ముక్కుపొడుం పొగాకు నుంచి తయారుచేస్తారు. చుట్ట, బీడీ, సిగరెట్, కైనీ మొదలైనవి కూడా పొగాకు నుంచే తయారుచేస్తారు. ఇవన్నీ ‘మాదకద్రవ్యాలే’. వీటన్నిటి ద్వారా లభించేది ‘తాత్కాలిక ఉత్తేజం’ మాత్రమే. ముందు అలవాటుగా మొదలై, క్రమంగా బానిసత్వానికి దారితీస్తాయి. వీటిపై అమితంగా ఆధారపడేట్టు చేస్తాయి. దీన్నే వ్యసనం అంటారు. ఒక్కసారిగా మానేస్తే... నీరసం, వణుకు, నిరుత్సాహం, ఆందోళన, మానసిక బలహీనత వంటి బాధలు వెంటాడతాయి. మాదకద్రవ్యం సేవించే మార్గాన్ని బట్టి ఆయా భాగాలు స్థానికంగా దెబ్బతింటాయి. వాటి క్రియాసామర్థ్యం నశించి, రోగనిరోధకశక్తి దెబ్బతిని, రకరకాల వ్యాధులు జనిస్తాయి. మీలాగ ‘నస్యం’ పీల్చేవారికి... ముక్కుదిబ్బడ, తరచు జలుబు, గొంతునొప్పితో మొదలై మీ శరీరతత్వాన్ని బట్టి క్యాన్సరు కూడా సంభవించే అవకాశాలుంటాయి. ఏ వ్యసనాన్నైనా త్యజించాలంటే అమోఘమైన ‘సంకల్పసిద్ధి’ కావాలి. రోజూ రెండుమూడుసార్లు ‘నేనింత బలహీనుణ్ణా? ఇది మానుకోలేనంత అశక్తుణ్ణా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఆ వ్యసన తీవ్రతను క్రమక్రమంగా తగ్గిస్తూ రావాలి. ఒక కాలపరిమితిని మీరే నిర్ధారణ చేసుకుని, ఇక ఆనాటి నుంచి సంపూర్ణంగా మానేయాలి. మీ పిల్లల్ని, కొంతమంది శ్రేయోభిలాషులను, మిత్రుల్ని మీపై పర్యవేక్షకులుగా మీరే నియమించుకుని వారి మాటను శిరసావహించాలి. క్రమశిక్షణ అనేది కేవలం ఇంటిదగ్గర, డాక్టరుగారి ముందు మాత్రమే కాకుండా మిగతా వాతావరణంలోనూ స్వచ్ఛందంగా పాటించడమే గొప్పదనం. ఇలాంటి దురలవాట్లు మానేసే ప్రక్రియలో అదే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇది అలవరచుకుంటూ ఈ కింది సూచనలు పాటిస్తే మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. క్షమత్వం పెరిగి, మానసిక శక్తి కూడా పరిపుష్టమౌతుంది. ఆహారం: ఉప్పు, నూనెలు గణనీయంగా తగ్గించండి. ఇంటి తిండికి మాత్రమే పరిమితమవ్వండి. పీచుపదార్థాలు, పోషకవిలువలు ఉన్న శాకపాకాలు, తాజా ఫలాలు, శుష్కఫలాలు( డ్రై ఫ్రూట్స్) తీసుకోవాలి. ద్రవాహారం బాగా సేవించాలి. ఆవుపాలు తాగితే మంచిది. విహారం: ఆహారం, నిద్ర, విశ్రాంతి తగినంత ఉండాలి. వ్యాయామం, ప్రాణాయామం నిత్యం ఆచరించాలి. ఔషధం: అణుతైలం: దీన్ని ఒక్కొక్క ముక్కు రంధ్రంలో ఒక్కొక్క చుక్క చొప్పున రెండుపూటలా వేసుకోవాలి. యష్టిమధు (మాత్రలు) : ఉదయం ఒకటి, రాత్రి ఒకటి అశ్వగంధ (లేహ్యం): ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి పాలు తాగాలి. గమనిక: వయసుని బట్టి వచ్చే మధుమేహం, అధికరక్తపోటు లేదా మరి ఏ ఇతర వ్యాధులేమైనా ఉన్నాయో లేదో చూసుకుని, ఒకవేళ ఉంటే వాటిని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
కీళ్లనొప్పులు - ఆయుర్వేద పరిష్కారాలు
ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు. ‘కీళ్లనొప్పులు’ ప్రస్తుత కాలంలో అతిచిన్న (30-40) వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే దినచర్యలో సరైన వ్యాయామం, సరియైన సమయంలో నిద్రపోకపోవడం, (స్వప్న విపర్యం అనగా పగలు నిద్రించుట, రాత్రి ఎక్కువగా మేల్కొనుట వంటివి) కూడా సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మానసికంగా ఎక్కువగా ఆలోచించటం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ కీళ్ల నొప్పులకు సామాన్య కారణాలుగా పరిగణించవచ్చు. ఈ కీళ్ల నొప్పులను ఆయుర్వేదశాస్త్రంలో మూడు విధాలుగా వర్ణించారు. 1. సంధివాతం - Oesteo arthrities 2. ఆమవాతం - Rheumatoid arthritis 3. వాతరక్తం - Gout సంధి వాతం (Oesteo arthrities) సంధివాతాన్ని ఆస్టియో ఆర్ధరైటిస్‌గా ఆయుర్వేదం పరిగణిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా త్రిదోషపరంగా చూసినట్లయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్లనుండి శబ్దాలు (Crepites) ఉంటాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియర్ ఫ్లూయిడ్) శ్లేషక కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వలన నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి ఉంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమస్య 50-60 సంవత్సరాల మధ్య వయసు వారికి వస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈవ్యాధి ఎక్కువగా వస్తూంటుంది. ఈ సమస్యకు ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సోరియాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆహారంలో పోషకవిలువల లోపం వలన కూడా (విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్) ఈ వ్యాధి వస్తుంది. జీవన విధానంలో కొన్ని రకాలైన మార్పుల వలన ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, అధిక బరువులు తలపైన లేదా వీపుమీద మోయటం ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చోవటం... ఇలాంటివి కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి. ఆమ వాతం (Rheumatoid arthritis) రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ముఖ్యంగా ఆమం, వాతం అనే రెండు దోషాల ప్రభావం వలన ఈ సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం వలన, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన, వ్యాయామం లేకపోవటం వలన, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవటం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు (Swelling), తీవ్ర వేదన (Pain), మంద జ్వరం (Mild Temp) కీళ్లు బిగుసుకుపోవటం (Stiffness), ఆకలి మందగించటం, మలబద్దకం (Constipation) లాంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలో వస్తుంది (Including small joints) వాత రక్తం (Gout) Goutను వాతరక్తంగా పరిగణిస్తాం. ఇది మధ్యవయసు వారిలో ఎక్కువగా వస్తూంటుంది. కారణాలు: ఎక్కువగా మద్యపానం, అధిక మాంస సేవనం (హై ప్రొటీనిక్ ఆహారం) ఎక్కువగా పులుపు, ఉప్పు, మసాలాలు ఆహారపదార్థ సేవన, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉండే ఆహారపదార్థాలు తినటం వలన అలాగే వీటితోపాటు శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వీటన్నిటివలన వాతం, రక్తం ఈ రెండు దుష్టి చెంది వాత రక్తంగా సమస్య ఏర్పడుతుంది. క్లినికల్‌గా చూసినట్లయితే ఈ సమస్యలో యూరిక్ ఆసిడ్ లెవెల్స్ రక్తంలో పెరుగుతాయి. లక్షణాలు: ఎరుపు, వాపు, నొప్పితో కూడిన కాలిబొటన వేలు నుండి ప్రారంభమై, తర్వాత మిగిలినటువంటి కీళ్లకు వ్యాపిస్తుంది. దీనిలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది. డాక్టర్ డి.హనుమంతరావు ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 99599 114 66 / 99089 111 99 www.starayurveda.com ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు ఆయుర్వేద శాస్త్రంలో... 1. నిదాన పరివర్జనం 2. ఔషధ సేవన 3. ఆహార విహార నియమాలు ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ వ్యాధులకు పూర్తిగా చికిత్స చేయవచ్చు. 1.నిదాన పరివర్జనం: వ్యాధి కారణాలను తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం. ఉదాహరణకు పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొనటం వంటి కారణాలను విడిచిపెట్టటం. 2. ఆహార విహార నియమాలు: ఆహారం సరైన టైమ్‌కి తినటం, వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, తగు వ్యాయామం, సరైన టైమ్‌కి విశ్రాంతి లాంటి నియమాలు పాటించడం. 3.ఔషధ సేవన: ఔషధ సేవన విషయానికి వస్తే, ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఎ) శమనం బి) శోధన ం ఎ) శమనం: అనగా వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం. బి) శోధనం: అంటే పంచకర్మ. పంచకర్మలలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు) తరువాత వమన, విరేచన, వస్తి (ప్రధాన కర్మలు) తరువాత పశ్చాత్ కర్మలు చేయించవలసిన అవసరం ఉంటుంది. ఇవికాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, బానువస్తి, పత్రపోటలీ, వాలుకాస్వేదం మొదలగు బాహ్యచికిత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. -
ఆయుర్వేదం,హోమియోపతికి పెరుగుతున్న ఆదరణ
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: దేశంలో ప్రస్తుతం ఆయుర్వేద, హోమియోపతి వైద్యానికి ఎంతో ఆదరణ లభిస్తోందని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సికింద్రాబాద్ ఎస్డీరోడ్ భువన టవర్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ ఆయుర్వేద,హోమియోపతి ఇంటిగ్రేటెడ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో పాటు కీళ్లనొప్పులు, థైరాయిడ్, ఆస్తమా లాంటి వ్యాధులకు ఇందులో చక్కని పరిష్కారం లభిస్తుందన్నారు. ఆయుర్వేద వైద్యం ఇప్పట్నుంచే కాదని..దేశంలో ఐదువేల ఏళ్ల కింద నుంచి వస్తున్న సంప్రదాయ వైద్యమన్నారు. ఆస్పత్రి సీఎండీ మురళి అంకిరెడ్డి, డెరైక్టర్లు డాక్టర్ శ్రీనివాస్‌గుప్త, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రవీందర్‌రెడ్డిలు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ సేవలను అడ్వాన్స్డ్ ఆయుర్వేద,హోమియోపతి మందుల ద్వారా దీర్ఘకాలిక,మొండి వ్యాధులను నయం చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో కొత్తపేట, కూకట్పల్లి, సికింద్రాబాద్‌లతోపాటు విజయవాడ,విశాఖపట్టణం, తిరుపతి,రాజమండ్రి, బెంగళూరు, మల్లేశ్వరం, ఇతర రాష్ట్రాల్లో తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తుందని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని బ్రాంచీల్లో ఉచిత కన్సల్టెన్సీతోపాటు మందులపై 30శాతం తగ్గింపు ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, టీజేఏసీ నాయకులు విఠల్ పాల్గొన్నారు. -
చిన్నబాబుకు తరచూ కడుపునొప్పి, వికారం
నా మనవడి వయసు ఐదేళ్లు. తరచూ కడుపునొప్పి వస్తోంది. అప్పుడప్పుడూ ఏదైనా తినే ముందు వాంతి కాబోతున్నట్లుగా ఉందంటాడు. పొట్టకు స్కానింగ్, రక్త, మలమూత్ర పరీక్షలు చేసి, అన్నీ నార్మల్‌గానే ఉన్నాయన్నారు. బరువు 22 కిలోలున్నాడు. అతడి సమస్యకు ఆయుర్వేదంలో పరిష్కారం తెలియజేయ ప్రార్థన. - చంద్రశేఖర్‌రావు, హైదరాబాద్ సాధారణంగా ఈ వయసున్న పిల్లలకు పొట్టలో నులిపురుగులుండటం వల్ల ఈ లక్షణాలు కలగవచ్చు. అమీబియాసిస్, ఇతరత్రా డిసెంటరీ వికారాలుంటే మలంలో బంక, చీము, నెత్తురు వస్తుంటాయి. ఇన్వెస్టిగేషన్ ఫలితాలన్నీ సక్రమంగానే ఉన్నాయంటే, పొట్టలోని అవయవాల రచన, క్రియావిశేషాలన్నీ సక్రమంగా ఉన్నాయని అర్థమవుతోంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే ఈ వయసులోనూ పిల్లల్లో మానసిక ఒత్తిడి సాధారణమైపోయింది. ఇల్లు, స్కూలు, ఇతర వాతావరణాలలో పిల్లలు కలిసిమెలిసే సమయాలలో ఎంతో కొంత ఆందోళన సహజం. ఇటీవలి కాలంలో వీడియోగేమ్స్, హారర్ ఆటల వల్ల కూడా వ్యతిరేక ప్రేరణాప్రభావం పడుతోంది. ఇలాంటి సమయాల్లో తల్లిదండ్రుల లేదా ఇతర సంరక్షకుల మనసును, ప్రేమను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా పిల్లల్లో యాంత్రికంగా కొన్ని లక్షణాలు ఉత్పన్నమవుతాయి. కడుపునొప్పి, వాంతి భ్రాంతి వంటివి అందులో భాగమే. ఇది పిల్లలు కృత్రిమంగా చేస్తున్న ‘నటన’ అనుకుంటే పొరపాటు. ఈ లక్షణాలను పిల్లలు నిజంగానే ‘ఫీల్’ అవుతుంటారు. కారణాన్ని తొలగించడం చికిత్సలోని ప్రధానాంశం. బాబు బరువు, వయసును బట్టి చూస్తే బరువు సక్రమంగానే ఉంది. కాబట్టి పోషక విలువల లోపమేమీ లేదన్నమాట. అయినప్పటికీ ఈ కింది సూచనలను పాటించండి. రెండుమూడు నెలల్లో చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఆహారం: బయటి ఆహారం నుంచి అంటే చాకొలేట్లు, ఐస్‌క్రీములు, శీతలపానీయాల నుంచి దూరంగా ఉంచండి. కాలానుగుణంగా పండ్లు, పండ్లరసాలు, ఖర్జూరం, జీడిపప్పు వంటి పోషకాహారం తినేటట్లు చూడండి. పాలు, పెరుగు, మజ్జిగ, పాయసాలు తగు ప్రమాణంలో ఇవ్వండి. మనం అనుకున్న సమయాల్లో మనం ఊహించిన పరిమాణాలలో పిల్లలు ఆహారాన్ని సేవించరు. అంటే వారు ఆహారం లేక నీరసపడిపోతున్నారనుకోవడం పొరపాటు. వారి శారీరక, మానసిక వికాసాలకు అనుగుణంగా చేష్టలు, బరువు, పొడవు సరిగా ఉంటే పోషకాహార లోపం లేదని భావించాలి. వంటలలో శాకపాకాల్ని రోజురోజూ మారుస్తుంటే అన్నిరకాల పోషకవిలువలూ అవే అందుతాయి. పిల్లలకు కూడా అన్నిరకాలు తినాలనే భావన అలవడుతుంది. బలవంతంగా ఏదీ తినిపించవద్దు. వారికి ఏం చెప్పినా ఆప్యాయతతో వివరించి నచ్చజెప్పాలి. మన సంభాషణలన్నీ పిల్లల చెవిన పడతాయని మరచిపోవద్దు. కాబట్టి నీతిబద్ధమైన, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అంశాలనే వారి దగ్గర సంభాషించుకోవడం మంచిది. విహారం: విశ్రాంతి, నిద్ర, ఆహారసేవన, వీటితోపాటు సమయపాలన చాలా ముఖ్యం. ఇతర సమవయస్కులతో కలిసి బయట ఆటలు ఆడుకునే అవకాశముంటే దానికి కూడా ప్రాధాన్యతనివ్వాలి. యోగాసనాలు అలవాటు చేయిస్తే, ఇది భవిష్యత్తులో ఆరోగ్యానికి చక్కటి పునాది అవుతుంది. మందులు : ఊ విడంగారిష్ట మరియు అరవిందాసవ ద్రావకాల్ని ఒక్కొక్క చెంచా ఒక గ్లాసులో పోసి, సమానంగా నీరు కలిపి రెండుపూటలా తాగించండి. ఊ మెంటాట్ (సిరప్) : ఉదయం 1 చెంచా, రాత్రి1 చెంచా. ఊ గృహవైద్యం: వాము, సోంపు (పచ్చివి) సమానంగా తీసుకొని, పొడిచేసి పెట్టుకోండి. పావుచెంచా (సుమారు రెండు గ్రాముల) పొడిని తేనెతో రోజుకొకసారి తినిపించండి. ఆకలి, అరుగుదల, శోషణ క్రియలు చక్కబడతాయి. ఇది ఎంతకాలమైనా వాడుకోవచ్చు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
బక్కగా ఉంటాను... బరువు పెరగడం ఎలా?
నా వయసు 24. నేను సన్నగా ఉంటాను. డాక్టర్గారిని అడిగితే, నా ఎత్తుని బట్టి నేనింకా 8-9 కిలోలు బరువు పెరగాలన్నారు. ఆయుర్వేద పద్ధతుల ద్వారా బరువు పెరగడానికి, చక్కటి ఆరోగ్యాన్ని పదిలపరచుకోడానికి మంచి సలహా ఇవ్వండి. - స్వాతి, హైదరాబాద్ ‘ప్రకృతి, సార, సత్వ’... అవి మనిషి మనిషికీ మారుతుంటాయి. సన్నగా ఉండటం, లావుగా ఉండటం, బరువు, పొడవు వంటి అంశాలు వీటి మీదే ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ మనం పాటించాల్సిన ఆహార విహార నియమాలు, పద్ధతులు సక్రమంగా లేకపోతే అతి సన్నగా ఉండటం, అతిగా స్థూలంగా ఉండటం వంటివి సంభవిస్తుంటాయి. శరీరంలో కార్టిజోన్ల స్థాయి తగ్గడం, పిట్యూటరీ హార్మోను స్థాయి ఎక్కువ అవడం, చిరకాలంగా బాధిస్తున్న ఇన్ఫెక్షన్లు, టీబీ, టైఫాయిడ్‌ల వంటి ఇతర వ్యాధులు, భయం, ఆందోళన మొదలగు సందర్భాల్లో కూడా సన్నగా ఉండటం జరుగుతుంది. కొంతమంది కొన్ని అపోహలతో ఆహారం తక్కువ తింటారు. దానివల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, ఖనిజలవణాల వంటి పోషకాలు లోపిస్తాయి. ఇది కూడా ఒక కారణమే. మీరు ఈ కింది ఆహార విహారాలను పాటిస్తూ, సూచించిన ఆయుర్వేద మందులు వాడండి. పైన చెప్పిన కారణాలను గమనిస్తూ ప్రతినెలా బరువు తూచుకుంటే, మీరు మూడోనెలలోనే అనుకున్న ఫలితానికి చేరువ కావడానికి అవకాశం ఉంది. ఆహారం: ఉదయం, సాయంత్రం అల్పాహారం, రెండుపూటలా మిత భోజనం అమలుపరచండి. రోజూ కనీసం ఐదు లీటర్ల నీళ్లు తాగండి. వంటకాలలో, నువ్వులనూనెకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇడ్లీ, దోశ, మినపరొట్టి వంటి భక్ష్యాలు బరువు పెరగడానికే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి. ముడిబియ్యంతో అన్నం వండుకోండి. అరటిపండ్లు, సపోటా, బొప్పాయి, సీతాఫలం, దానిమ్మ వంటి తాజాఫలాలు తీసుకోండి. శుష్కఫలాలలో ఖర్జూరం, జీడిపప్పు, బాదం చాలా మంచివి. నువ్వులు, బెల్లం కలిపి చేసిన ‘చిమ్మిలి’ తినండి. ఇంట్లో నెయ్యి వేసి చేసిన పాయసాలు చాలా హితకరం. బూడిద గుమ్మడికాయతో చేసిన వడియాలు, కేరట్హల్వా ఉపయోగకరం. ఉప్పు, కారం చాలా మితంగా సేవించాలి. ఆవునెయ్యి శ్రేష్ఠం. అల్లం, వెల్లుల్లి ఆకలికి, అరుగుదలకు చాలా మంచివి. విహారం: తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. రాత్రి 10 గంటలకు పడుకొని, ఉదయం 5 గంటలకు నిద్రలేవండి. మితమైన వ్యాయామం, రెండుపూటలా ప్రాణాయామం అవసరం. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలను అధిగమించవచ్చు. వీలుంటే ఉదయంపూట సూర్యరశ్మిలో ఐదునిమిషాలు నిల్చోండి. మందులు అశ్వగంధాది లేహ్యం: ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి, పాలు తాగండి. ఆరోగ్యవర్థని (మాత్రలు): ఉదయం ఒకటి, రాత్రి ఒకటి ద్రాక్షారిష్ట (ద్రావకం): నాలుగు చెంచాల మోతాదున రెండు పూటలా తాగండి. గమనిక: బరువు పెరగడం అవసరమే అయినా కొవ్వు పెరగడం అనర్థదాయకమని గుర్తుంచుకోండి. ఈ ఆశయసిద్ధికి పై సూచనలు బాగా ఉపకరిస్తాయి. తగినంత బరువు ప్రాప్తించిన తర్వాత, ఇకపై మరింత బరువు పెరగకుండా తగు జాగ్రత్తలతో ఆహారంలో మార్పులు చేసుకోవాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
జుత్తు రాలుతోంది... చుండ్రు కూడా ఉంది...
నా వయసు 44. గత ఎనిమిది నెలల నుండి నాకు జుత్తు విపరీతంగా రాలిపోతోంది. అప్పుడప్పుడు చుండ్రు కూడా కనపడుతోంది. ఎన్నో మందులు, షాంపూలు వాడినా ప్రయోజనం కనపడలేదు. ఇదే సమస్య మా అమ్మాయి (18సం)కి కూడా ఉంది. ఆయుర్వేదంలో దీనికి పరిష్కారం తెలియజేయ ప్రార్థన. -సీతాదేవి, వరంగల్ శిరోజాల స్వరూపం, స్వభావం, దళసరి మొదలగు అంశాలు వారి వారి ప్రకృతిని బట్టి మారుతుంటాయి. వాటి పోషణ, ఆరోగ్యాలు మన చేతుల్లో ఉంటాయి. అవి సక్రమంగా స్వాభావికంగా పెరగడానికి దోహదపడే ఆహార విహారాలు ఒక వంతైతే, వాటికి హాని కలిగించే ప్రక్రియలకు దూరంగా ఉంచడం మరొక ముఖ్యాంశం. దోహదపడే అంశాలు ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ఎ, డి, బి కాంప్లెక్స్ తగినంతరీతిలో ప్రతిదినం సేవించాలి. మొలకలు, ఖర్జూరం, నువ్వులు, బెల్లం, తాజాఫలాలు, బాదం, జీడిపప్పు వంటి ఎండు ఫలాలు, మునగకాడలు, ఆకుకూరలు, గుడ్లు, మాంసాహారాల్లో చక్కటి పోషక విలువలు ఉంటాయి. రోజూ కనీసం నాలుగైదు లీటర్ల నీళ్లు తాగితే మంచిది. ప్రతిరోజూ స్వచ్ఛమైన కొబ్బరినూనెతో తల మీద ఉన్న చర్మానికి మర్దన చేస్తూ, శిరోజాలకు కూడా రాసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చాలా మంచిది. తగినంత వ్యాయామం చెయ్యడం ద్వారా తలపై స్వేదం జనించి రోమకూపాలు ఉత్తేజితమవుతాయి. కల్తీ లేని కుంకుడుకాయ, షీకాకాయలతో మాత్రమే తల రుద్దుకోవాలి. ప్రతికూలాంశాలు ఎక్కువగా డైయింగ్ చేయటం, కృత్రిమంగా డ్రైయింగ్ చేయటం: కొన్ని రకాల నీళ్లు (అతిగా ఉప్పు ఉండటం, పోషకాలు లేకపోవడం మొదలైనవి) కూడా జుత్తు రాలిపోవటానికి కారణమే. వాటితో తలస్నానం చేసినా, తాగినా హానికారకమే. కొంతమందికి కొన్నిరకాల షాంపూలు పడవు. అదేవిధంగా కొన్ని వ్యాధుల కోసం వాడే మందుల తాలూకు దుష్ర్పభావాలు కూడా జుత్తు రాలడానికి కారణమే. ఇతరత్రా కారణాలు: తలపైనున్న చర్మానికి కలిగే చుండ్రు, ఇతర ఫంగల్.. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు. స్త్రీలలో మెనోపాజ్ వయసులో సంభవించే హార్మోనుల అసమతుల్యతలు. వార్థక్యం సమీపిస్తున్నప్పుడు వివిధ ధాతువుల యొక్క శైథిల్యం సహజమని గుర్తించాలి. అప్పుడు జుత్తు పలచబడటం సామాన్యమే కాని, వ్యాధి కాదు. కాబట్టి ప్రతికూలాంశాలను పరిశీలిస్తూ చికిత్స కొనసాగించాలి. సానుకూల ప్రక్రియలను అనునిత్యం పాటిస్తుండాలి. సాధారణ కేశవర్థక ఔషధాలు మహాభృంగరాజ తైలం/నీలిభృంగాది తైలం/కేశోవిన్ మొదలైన కేశతైలాలు నిత్యం వాడుకోవాలి. ఆరోగ్యవర్థని మాత్రలు ఉదయం 1, రాత్రి 1, అశ్వగంధారిష్ట, సారస్వతారిష్ట ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో కలుపుకుని సమానంగా నీళ్లు కలిపి రెండుపూట లా తాగాలి. గృహవైద్యం: వేపనూనెను తల మీది చర్మానికి క్రమం తప్పకుండా పూస్తూ ఉంటే చుండ్రు తగ్గుముఖం పడుతుంది. పెరుగులో నానబెట్టిన మెంతులను ముద్దగా చేసి తల మీద రాసుకుంటే కేశాలకు బలవర్థకం. అదేవిధంగా ఉసిరికాయ ముద్ద కలబంద గుజ్జు కూడా కేశవర్థకం. గత పది నెలలుగా నాకు మలబద్దకం ఉంది. నేను నిర్లక్ష్యం చేయడంతో దానివల్ల ఆర్శమొలలు ఏర్పడ్డాయి. ఇంగ్లిషు మందులు వాడినా పెద్ద ప్రయోజనం లేదు. దీనికి ఆయుర్వేదంలో మంచి మందులుంటాయని నా మిత్రుడు చెప్పాడు. దయచేసి తగిన మందులు సూచించ గలరు. - డి. కామేష్, మెదక్ జిల్లా మీరు మీ వయసు ప్రస్తావించలేదు. కాని పెద్దవారన్న దృష్టితో రాస్తున్నాను. ప్రధానంగా మీరు మలబద్దకాన్ని తొలగించుకోవాలి. దానికి ఈ కింది సూత్రాలను పాటించండి. మలబద్దకం, ఆర్శమొలలు కూడా తగ్గుతాయి. పరగడుపున రెండులీటర్ల నీళ్లు తాగండి. రోజు మొత్తం మీద నాలుగు నుంచి ఆరు లీటర్లు తాగాలి ఆగకుండా కనీసం ఓ అరగంట సేపు నడవాలి శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పచ్చిసలాడ్లు, పీచు పదార్థాలు, తాజాఫలాలు తినాలి. డ్రైఫ్రూట్స్ కూడా తినాలి. పలుచని మజ్జిగ ఎక్కువగా తాగాలి. ఆహారంలో స్వచ్ఛమైన నువ్వులనూనెను ఉపయోగించాలి. ఔషధాలు ఆరోగ్యవర్ధినీవటి (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 కాంకాయన వటి (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 అభయారిష్ట (ద్రావకం) నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రాత్రి పడుకునేటప్పుడు రోజూ తాగాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్