
రక్తపోటు.. బ్లడ్‌ప్రెజర్.. దీనిని వాడుక బాషలో బీపీగా వ్యవహరిస్తుంటారు. దేశంలో ప్రతి నాల్గవ వ్యక్తి రక్తపోటుతో బాధపడుతున్నాడని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. అటు హైబీపీ, ఇటు లోబీపీ.. రెండూ ప్రమారకమైనవేనని వైద్యులు చెబుతుంటారు. రక్తపోటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అది పక్షవాతానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తుంటారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల జాతీయ ఆయుర్వేద సంస్థాన్ రక్తపోటుపోటుపై పరిశోధనలు నిర్వహించింది.
జాతీయ ఆయుర్వేద సంస్థాన్(National Institute of Ayurveda) పదేళ్ల పరిశోధనల అనంతరం రక్తపోటు నియంత్రణకు ఔషధాన్ని తయారు చేసింది. దీనికి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించింది. ఈ ఔషధం ఎటువంటి దుష్ప్రభావాలను కలుగజేయదని ట్రయల్స్‌లో తేలిందని సంస్థాన్ పరిశోధనకులు తెలిపారు. ఈ ఔషధాన్ని తొమ్మిది రకాల వనమూలికలను కలిపి తయారు చేశారు. ఈ ఔషధం క్లినికల్ ట్రయల్ పూర్తయిందని, పేటెంట్ పొందిన తరువాత అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థాన్ హెచ్‌ఓడీ డాక్టర్ సుదీప్త రథ్ మాట్లాడుతూ తమ వైద్యుల బృందం రక్తపోటును అదుపులో ఉంచేందుకు ఆయుర్వేద గుళికలను రూపొందించిందని తెలిపారు. ఈ గుళికలు క్లినికల్ ట్రయల్స్ సమయంలో ప్రభావవంతంగా పనిచేశాయని, ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కనిపించలేదన్నారు. ఈ ఔషధానికి పేటెంట్(Patent) పొందిన వెంటనే, దానిలో ఉపయోగించిన మూలికలను బహిర్గతం చేస్తామన్నారు. కాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశ జనాభాలో అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు 22.6 శాతంగా ఉన్నారు. పురుషులలో ఈ రేటు మహిళల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలలో రక్తపోటు(blood pressure) ప్రభావం అధికంగా ఉంది. అధిక రక్తపోటు కారణంగా, ఛాతీ నొప్పి, తీవ్రమైన అనారోగ్యం, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Anti Valentine week : నేటి నుంచి భగ్న ప్రేమికులు చేసే పనిదే..
Comments
Please login to add a commentAdd a comment